Wednesday, July 15, 2026

 44B2;54B8;18c4;47f5;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀HFN155.

#######################
                 *తెలివైన పక్షి*
                   ➖➖➖✍️```
(పరిష్కారం లేని సమస్య వుండదు)
##########################
```
 *జీవితంలో పరిష్కారం లేని సమస్య ఏదైనా ఉందా?*

```
ఒకప్పుడు ఆకాశంలో ఒక పక్షి ఎగురుతూ ఉంది. దారిలో దానికి ఒక గ్రద్ద కలిసింది. గ్రద్ద ఆ పక్షిని తినడానికి వెంటపడింది. పక్షి తనను వదిలిపెట్టమని, ప్రాణం కోసం గ్రద్దని వేడుకుంది, కానీ గ్రద్ద దయ చూపడానికి సిద్ధపడలేదు.

అప్పుడు పక్షి  గ్రద్దని ఇలా వేడుకుంది, “నాకు చిన్న పిల్లలు ఉన్నారు. వాటిని పెంచడానికి నేను జీవించి ఉండాలి.”

అప్పుడు గ్రద్ద పక్షికి ఒక షరతు పెట్టింది: “నాతో పోటీ పడు, నన్ను నువ్వు ఓడిస్తే, నీ ప్రాణాలను విడిచిపెడతాను, నిన్ను వదిలేస్తాను.”

పందెంలో తనను ఓడించడం పక్షికి అసాధ్యమని గ్రద్దకు తెలుసు అందుకే అంత కష్టమైన షరతు పెట్టింది. ఈ పందానికి ఒప్పుకోవడం తప్ప పక్షికి మరో మార్గం లేదు.

పందెంలో గ్రద్దను ఓడించడం అసాధ్యమని పక్షికి తెలుసు, అయినప్పటికీ పందానికి ఒప్పుకుంది. కానీ పందెం ముగిసే వరకు తనను చంపకూడదని గ్రద్దకు షరతు పెట్టింది. గ్రద్ద దానికి అంగీకరించింది.

పందెం ప్రారంభమైంది. వెంటనే పక్షి, గ్రద్ద తలపైకి ఎక్కి అక్కడ కూర్చుంది.  గ్రద్ద పందెం చివరికి చేరుకున్న వెంటనే, పక్షి గబుక్కున ఎగురుకుంటూ ముగింపు రేఖ దాటి పందెం గెలిచింది.

పక్షి తెలివికి గ్రద్ద ముగ్ధుడై పక్షిని వదిలేసింది. పక్షి వెంటనే తిరిగి దాని గూటికి అది ఎగిరిపోయింది.

ఎదురుగా బలమైన ప్రత్యర్థి ఉన్నా 
ఆ చిన్న పక్షి ప్రయత్నించడం వదిలేయలేదు. పరిస్థితిని చూసి బాధపడుతూ ఉండకుండా ఓర్పుతో, తెలివిగా సమస్యకు పరిష్కారం కనిపెట్టింది.

క్లిష్ట పరిస్థితులకు సరైన పరిష్కారాన్ని కనుగొనడం ఖచ్చితంగా సాధ్యమే. ఉండాల్సిందల్లా మన మీద మనకు నమ్మకం.```

♾️♾♾ ♾♾♾ ♾♾♾

హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం ఉద్దేశ్యం ఏమిటంటే, మనస్సును క్రమబద్ధీకరించడం ద్వారా, జీవితంలోని అత్యంత విపత్కర పరిస్థితుల్లో కూడా, మనం కాసేపు ఆగి, విశ్లేషించి సరైన చర్య తీసుకునే విధంగా స్థిరత్వానికి తీసుకురావడమే. ✍️
                           …. దాజీ.
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺

No comments:

Post a Comment