ఇంద్రియ నిగ్రహం PART 1 -Indriya Nigraham PART 1 satsang by sri Raghu Guruji (Sri Dattha Foundation)
Author Name:Dhyana
Youtube Channel Url:https://www.youtube.com/@Raghuguruji
Youtube Video URL:https://www.youtube.com/watch?v=N2GwaJ9f8z4
Transcript:
(00:07) జై గురుదేవా ఓం శ్రీ గురుభ్యో నమః ప్రార్థన చేద్దాం వెన్నెమక నిటారుగా ఉంచండి చేతులు రెండు జోడించి ప్రశాంతంగా కండ్ మూసుకోండి క్లోజ్ యువర్ ఐస్ మనసులోనే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రికి జ్ఞానం ఇచ్చినటువంటి గురువులకి దైవానికి నమస్కరించుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గురుభ్యో నమః అజ్ఞానతి తిమిరాందస్య
(00:56) జ్ఞానాంజనశలాకయ చక్షురం తస్మై శ్రీ గురవే నమః హరిహి ఓం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం ఓం జై గురుదేవ ఓకే హౌ ఆర్ యు ఎస్ ఆల్వేస్ గ్రేట్ ఐ నో అందరికీ ఆదివారం జరిగే సత్సంగ జ్ఞాన కార్యక్రమానికి ప్రత్యేకమైన స్వాగతం
(01:42) సుస్వాగతం నిన్నటిదాకా మనం సంకల్ప క్రియా యోగ 101వ బ్యాచ్ కార్యక్రమాలని నిర్వహించుకున్నాం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇవాల్టి మన ఈ కార్యక్రమంలో పాత సభ్యులు ఉన్నారు మరియు కొద్దిమంది కొత్త సభ్యులు ఉన్నారు. సంతోషకరమైన విషయం ఏంటంటే ఎవరైతే సత్సంగాలకు హాజరవుతున్నారో వారు కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటాం. మధ్య మధ్యలో కొత్తవారు అపరిచితులు అంటే ఇప్పటిదాకా ఈ ఆర్గనైజేషన్ కి ఎటువంటి పరిచయం లేనటువంటి వ్యక్తులు అనేకమంది రావడం జరగవచ్చు కానీ ఎవరైతే గత కొద్ది సంవత్సరాలుగా ఫాలో అవుతున్నారో వారు కొనసాగటం అనేటువంటిది చాలా ఆనందకరమైన
(02:25) విషయం మనందరమ కలిసి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఒక సాధన చేస్తూ ఉన్నాం. అది సంకల్ప క్రియా యోగ 10 డేస్ కోర్సులు కానివ్వండి సత్సంగాలు అవ్వచ్చు అడ్వాన్స్డ్ కోర్స్ సంకల్ప సిద్ధి దీక్ష కోర్సెస్ కావనివ్వండి ఏదైనా కానీ ఏదో ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది మన జీవితంలో అవునా కాదా ఇది కాలక్షేపం అయితే కాదు కదా ఆదివారం నిద్రపట్టక ఉదయాన్నే ఈ క్లాస్ కి రావడం లేదు కదా ఏదో ఒక ప్రయత్నం జరుగుతోంది మీ జీవితంలో ఎందుకు దేనికోసం వస్తున్నామ అనేది ఎవరి ఎజెండా వారికి ఉంటుంది ఎవరి లక్ష్యం వారికి ఉంటుంది.
(03:05) కొంతమంది ఆరోగ్యం కోసం రావచ్చు ఈ ఫౌండేషన్ అందించే శిక్షణ తరగతులకి మరి కొద్దిమంది జ్ఞానం కోసం కానివ్వండి మరి కొంతమంది ప్రశాంతత కోసం మరి కొంతమంది తమ సాధనలో ఎదురయ్యేటువంటి అనేక రకాల ఆటంకాలు అవరోధాలను తొలగించుకునేటువంటి విషయ పరిజ్ఞానం కోసం ఎనీ ఎవరు దేనికోసం ఎందువలన హాజరైనప్పటికీ అందరి లక్ష్యం ఒక్కటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుండి ఇంకా మహోన్నతమైన స్థితికి మన జీవిత తం తీసుకెళ్ళడానికి ఈ సెషన్స్ ఉపయోగపడతాయనే భావంతో హాజరవుతున్న సాధకులకి మరియు ఆత్మ స్వరూపుల అందరికీ కూడా ముందుగా నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే విషయము తెలుసుకున్నంత మాత్రాన మనము అడుగు ముందుకి
(03:49) వేయలేము. అందరి దగ్గర ఆయుధాలు ఉండొచ్చు కానీ ఆ ఆయుధం ఎలా ఉపయోగించాలో తెలిస్తేనే ఆ తెలిసిన తర్వాత ఉపయోగిస్తేనే యుద్ధంలో విజయం సాధ్యమవుతుంది. అదేవిధంగా విషయాన్ని తెలుసుకోవటం ఎప్పుడు వాడాలో తెలియటం దాన్ని ఉపయోగించటం ఈ మూడిటిని మనం తెలుసుకోగలిగితే అవగాహన కలిగించుకుంటే సంపూర్ణమవుతుంది. ఓకేనా అండి రైట్ ఈరోజు ఇంకా మన సెషన్ లోకి మనం వెళ్ళిపోదాం.
(04:21) ముఖ్యంగా సండే సత్సంగాలు అనేటప్పటికి ఏదో ఒక అంశాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు నేను కూడా ఏదో ఒక అంశాన్ని అందించాల అనుకుంటూ ఉంటాను వాస్తవానికి ఇది మన కలయక సత్సంగం మీద సద్భావం గల వ్యక్తుల కలయక ఈ కలయకలో కేవలం ఏదో ప్రాణాయామమో ధ్యానమో సాధనో కాకుండా కొన్ని ముఖ్యమైన అంశాలు తెలియజేయాలని ఉద్దేశంతోన ఏదో ఒక అంశాన్ని మనం మాట్లాడుకున్నాం ఈరోజు ఒక చిన్న అంశాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
(04:47) అందరూ సిద్ధమే కదా ఒక్కసారి మీరు గమనించండి ఈ భూమిపైన జీవించే ప్రతి మనిషి కూడా ఒక ముఖ్యమైన ఒక అంశాన్ని కోరుకుంటాడు అదిఏంటంటే సుఖము దేన్ని కోరుకుంటాడు సుఖాన్ని కోరుకుంటాడు. మానవులందరికీ మొట్టమొదట ప్రైమరీగా కావాల్సింది ఏంటంటే ఒక కంఫర్ట్ కావాలి. ఒక కంఫర్ట్ జోన్ ఉండాలి. మీరు కూడా మీకు ఎవరైతే ఎవరితో ఉంటే మీరు ఆనందంగా సౌఖ్యంగా ఉంటారో అటువంటి వ్యక్తులతో ఉండటానికే మీరైనా ఇష్టపడతారు జస్ట్ పర్సన్స్ తోగా ఇంకా జీవిత విషయంకి వచ్చేటప్పటికి ఎవరైనా సరే కష్టాలని కోరుకుంటారా కోరుకుంటారా అమ్మా దుఃఖం కావాలి దేవుడికి ఎప్పుడ
(05:32) నమస్కారం చేశరా నాకు ఇవాళ డే అంతా కూడా ప్రాబ్లమ్స్ తో స్టార్ట్ అవ్వాలి భగవంతుడు నాకు ఉన్నవన్నీ వెళ్ళిపోవాలి ఆ నాకు ఈరోజు మొహంలో నవ్వు అంతా పోయి గొడవలు దుఃఖం కావాలి అనుకోరు కదా లైఫ్ కూడా ఒక కంఫర్ట్ జోన్ లో ఉండాలని కోరుకుంటారు. అందుకనే మనం ఏం చేస్తాం అంటే ఏదైనా కొత్తది ప్రారంభించాలంటే ఓయ సార్లు ఆలోచిస్తాం బుర్ర బద్దలు కొట్టుకొని ఏమో ఇది కూడా పోతే ఉన్నది కూడా వెళ్ళిపోతే కొత్తది ఫెయిల్ అయిపోతే నా పరిస్థితి ఏమిటి ఈ కంఫర్ట్ నుండి బయట పడలేకనే లైఫ్ లో ఛాలెంజెస్ ని స్వీకరించలేరు చాలామంది ఇది ఉన్నది మిస్ అయిపోతుందేమో ఫుడ్ బెడ్
(06:09) ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎక్సెట్రా ఏమైతే ఉందో అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు నిజమైన జీవితం మీ కంఫర్ట్ జోన్ దాటిన తర్వాతనే మొదలవుతుంది మీరు గమనించండి అడ్వాన్స్ కోర్స్ కి రావాలని నేను అనేకమంది రిక్వెస్ట్ చేసిన గురూజీ అక్కడ వేడి నీళ్లుు ఉంటాయా మాకు సపరేట్ రూమ్ ఇస్తారా బెడ్ ఉంటుందా ఫోన్ వాడుకోవచ్చా ఫుడ్ ఏం పెడతారు ఈ క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నమాట విపరీతమైనటువంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి కారణం ఏమిటి అంటే అమ్మో అక్కడికి వెళ్తే నాకు ఈ కంఫర్ట్ ఉండదేమో నేను కింద పడుకోలేను కదా ఇండం టాయిలెట్ యూస్ చేయలేను కదా సన్నీళ్లు స్నానం
(06:52) చేయలేను కదా ఆహారంలో కారం ఉప్పు తక్కువే నేను తినలేను కదా ఇలాగా మానవుడు విపరీతమైనటువంటి సౌకర్యాలని ఎల్లప్పుడూ ఎక్కడికి వెళ్ళినా కోరుకుంటాడు మీరు గమనించండి తీర్థయాత్రలకి వెళ్తూ కూడా మనం ఏం చేస్తాం ముందుగానే ఇక్కడి నుండే ఎకామిడేషన్ ఉందా లేదా ఎంక్వైరీ చేసుకొని వెళ్తాం. మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తే కాదమ్మ అచంచలమైనటువంటి భక్తి మనలో చాలామందికి కలియుగ దైవం ఆయన తిరుమల క్షేత్రంలో వేసినటువంటి మన అవతార పురుషుడు ఆయన మీద ఎంతో విశ్వాసం ఉంది అన్ని ఆయన బాధలు తీరుస్తాడని అక్కడ అట్లాంటి ఆయన వెళ్తే రూమ్ ఇవ్వలేడా
(07:30) ప్లాన్ చేసుకోవడం వేరు దానికోసం వెంపర్లాటం వేరు ప్రణాళిక ఎప్పుడూ ఉండాలి పిల్లలతో కుటుంబంతో వెళ్ళినప్పుడు వాళ్ళ రుడి మీద ఉంచలేం కదా ప్లానింగ్ వేరు దానికోసం సుఖమే లేకపోతే ఎట్లా గాని అవసరమైతే దర్శనాన్ని కూడా క్యాన్సల్ చేసుకోవడం వేరు. ఒక మనిషి అనేవాడు ఒక కంఫర్ట్ దగ్గర ఆగిపోతాడు సుఖము ఫస్ట్ వన్ ఈస్ సుఖమే కొంతమందికైతే తమ సుఖమే ముఖ్యము ఇది ఇంకా ప్రమాదకరమైనది సుఖం కోరుకోవడం వేరు అందరి సుఖం కోరుకోవడం వేరు అందరినీ ఫణంగా పెట్టి తన సుఖమే కోరుకోవడం వేరు దీంట్లో మీరు ఎక్కడున్నారో చూసుకోండి సుఖంలోనే ఉన్నాము సుఖాన్ని కోరుకోవట్లే
(08:05) మాత్రం అబద్ధం చెప్పకండి సుఖంలోనే ఉన్నాము మన ఫ్యామిలీ అందరి సుఖం కోరుకుంటున్నామా మన ఒక్కరు సుఖాన్నే కోరుకొని దానికోసమే పరితపిస్తున్నామ అని తెలుసు సుకునే ప్రయత్నం చేయాలి ఓకేనా అంతేకాదు ఆరోగ్యాన్ని కోరుకుంటాడు మనిషి ఎక్కువగా ఎల్లప్పుడూ ఆరోగ్యం కావాలి. తను నిరంతరం మనందరి మిగిలిన మనిష్యం పక్కన పెడితే మనందరి యొక్క ఈరోజు కలయక లక్ష్యం ఏంటంటే ఆరోగ్యవంతమైన జీవితం ప్రశాంతతను కోరుకుంటాడు ఎప్పుడూ కూడా ప్రశాంతమైన జీవితం ఉండాలి.
(08:38) సుఖం వేరు ప్రశాంతత వేరండి సుఖము ఇంద్రియాలకి శరీరానికి సంబంధించినటువంటిది ప్రశాంతత మనోబుద్ధి [గొంతు సవరించుకోవడం] చిత్త అహంకారానికి సంబంధించినటువంటిది కాబట్టి ప్రశాంతతను కోరుకుంటాడు. విజయాన్ని కోరుకుంటాడు హ్యూమన్ బీయింగ్ లైఫ్ లో ఎప్పుడు సక్సెస్ ని పొందాలనుకుంటాడు. ఆధ్యాత్మిక వికాసాన్ని కోరుకుంటాడు. ఎల్లప్పుడూ కూడా తన ఆధ్యాత్మిక పురోభివృద్ధి వైపు వెళ్ళాలని తాపత్రేయ పడుతూ ఉంటాడు.
(09:05) కానీ ఒక్క విషించండి ఇన్ని పాయింట్లు చెప్పుకున్నాం కదా ఎందుకు అందరూ ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు అందరికీ ఉంది సుఖంగా జీవించాలి ప్రశాంతంగా జీవించాలి ఆరోగ్యంగా జీవించాలి విజయవంతమైన జీవితం గడపాలి ఆధ్యాత్మిక వికాసం కావాలని ప్రపంచాన్ని వదిలేయండి ఈరోజు ఈ సెషన్ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ లక్ష్యం ఉంది.
(09:30) కానీ ఎందుకు అందుకోలేకపోతున్నాం క్వశ్చన్ దానికి సొల్యూషన్ ఇవాళ మన సత్సంగ కార్యక్రమంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరము కూడా ఒక బృహత్తరమైన సంకల్పంతోనే అడుగులు వేస్తున్నాము ఇప్పుడు నేను చెప్పిన ఐదారు అంశాల్లో మీరు సమాజానికి హాని చేయాలనో విపరీతంగా సంపాదించాలనో ఈ లక్ష్యాలుఏమ పెట్టుకోలే పెట్టుకున్నవి కూడా ఒక అద్భుతమైనటువంటి లక్ష్యములే సమాజ హితము కోరేటువంటివే మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి చేరే మోక్ష మార్గానికి మనకి తెలియజేసేటువంటివే ఇన్ని అద్భుతమైన సత్సంకల్పాలని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా దీనికోసం గురువు మార్గదర్శకత్వంలో ఉన్నప్పటికీ
(10:08) సాత్వికమైన ఆహారంలో ఉన్నప్పటికీ సాధన చేస్తూ ఉన్నప్పటికీ భగవంతుడి మార్గంలో అడుగులు వేస్తున్నప్పటికీ ఎందుకు ఈ లక్ష్యములు నెరవేరటం లేదు కారణం ఏమిటి అంటే అది ఇవాళ మనం తెలుసుకోబోతున్న అంశము ఓన్లీ ఒకే ఒకటి తమ ఇంద్రియాల మీద ఆధిపత్యము లేకపోవటం ఇంద్రియ నిగ్రహముని కలిగి ఉండకపోవటం కాబట్టి అసలు ఇంద్రియాలు ఏమిటి వాటి యొక్క పని ఏమిటి వాటి యొక్క నిగ్రహ శక్తి ఏమిటి యోగసాధన ఏం చెప్తూ ఉంటుంది నిజంగా మనం ఇంత బాగా చదువుకున్నటువంటి వ్యక్తులము పెద్ద వయసు వ్యక్తులము అనుభవజ్ఞులము మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఎంతవరకు ఉన్నాయో
(10:53) తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమిటి ఇంద్రియాలు అంటే మనిషి ఈ బాహ్య ప్రపంచంలో అంటే ఈ ఏదైతే మన కంటికి కనపడుతుందో ఆ అనుభవించడానికి కొన్ని డోర్స్ ఉంటాయి చూసేవి వినటానికి స్పర్శక్ కదా ఈ బాహ్య ప్రపంచాన్ని అనుభవించడానికి మీ దేహంలో ఉండే ప్రతి డోర్ని ఇంద్రియం అంటాం ఇవి ఈ బాహ్య ప్రపంచపు బహిర్మార్గాలు బాహి బయటకి తీసుకువెళ్లే మార్గాలు ఈ ప్రపంచంలోనికి ఈ వీటిని కరెక్ట్ గా ఉపయోగిస్తే జ్ఞానం వస్తుంది అదే దాని అపోజిట్ వేలో ఉపయోగిస్తే బంధం వస్తుంది అందుకని
(11:37) వేదాంతంలో ఒక వాక్యం చెప్పబడుతుంది ఒక సత్యం చెప్పబడుతుంది. బంధానికి కారణమైనదే జాగ్రత్తగా అర్థం చేసుకోండి బంధానికి కారణమైనదే విముక్తికి కూడా కారణం అవుతుంది. దీంట్లో చాలా పెద్ద సత్యం ఉంది బంధానికి కారణమైనదే విముక్తికి కూడా కారణం అవుతుంది అది ఏదైనా కానీ ఇంద్రియాల విషయం పక్కన పెట్టండి మీ లైఫ్ లో ఏదైతే ఈరోజు ఏదైతే ఈరోజు జాగ్రత్తగా వినండి మళ్ళీ రాసుకుందరుగా ఏదైతే ఈరోజు మీ జీవితంలో ఒక బాధకి ఒక దుఃఖానికి ఒక బంధానికి ఒక బంధనానికి కారణమై ఉన్న అంశము గాని విషయము గన వ్యక్తి గాని సంఘటన గాని ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా
(12:26) రాసి పెట్టుకోండి అవే భవిష్యత్తులో మీ యొక్క విముక్తికి కారణం అవుతాయి. చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఈ అంశాన్ని ఒక వ్యక్తి గురించి మీరు విపరీతంగా బంధితులు అయపోయి అంటే అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోయి బాగా దుఃఖించారు దుఃఖించి దుఃఖించి దుఃఖించి ఏమవుతుందో తెలుసా ఒక్కసారిగా విముక్తి కలుగుతుంది ఫ్రీడమ వస్తుంది చ జీవితం మాయ కదా దాని సత్యం మనం సినిమాల విషయం చెప్పుకోవద్దు కానీ ఒక సినిమాలో రజనీకాంత్ గారి సినిమాలో రజినీకాంత్ గారు ధూమపానం చేస్తా ఉంటే ఐ థింక్ వాళ్ళ తండ్రి గారా తాతగారా నాకు
(13:10) బాగా గుర్తులేదు. అతన్ని ఒక రూమ్లో ఉంచేసి మాత్రం ఆ ఆ చుట్టలో సంథింగ్ ఆ రోజున ఉన్నవించేసి అన్ని తాగమంటే కొన్ని తాగేటప్పటికి అతనికి విరక్తి కలుగుతుంది. మొదట అతను దేంట్లో ఇరుక్కుపోయినాడు ధూమపానం లేకపోతే ఉండలేనని ఆ వ్యసనంలో ఇరుక్కుపోయినాడు బంధితుడయనాడు. కానీ అది అతిగా తీసుకోవడం ద్వారా ఏమైంది విముక్తి కలిగింది.
(13:37) ఇప్పుడు ఏదైతే మీ జీవితంలో ఒకటి జరుగుతుందో అది త్వరలో మిమ్మల్ని విముక్తికి గురి చేస్తుంది అందుకే వేదాంతం చెబుతుంది ఏది అయితే ఏది అయితే బంధనం అవుతుందో బంధానికి కారణమైందో అదే విముక్తికి కూడా కారణం అవుతుంది. రైట్ ఫర్ ఎగజాంపుల్ ఒక అగ్ని ఉంది అది వంట చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇంటిని కూడా కాల్చివేస్తుంది. నీరు దాహాన్ని తీరుస్తుంది అది వరదగా మారితే విద్వంసం వస్తుంది అలాగే ఇంద్రియాలు కూడా మన జీవితాన్ని సృష్టించగలుగుతాయి లేదా డిస్టర్బ్ చేయగలుగుతాయి డిస్ట్రాయ్ చేయగలుగుతాయి.
(14:17) దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము అనేటువంటిది చెప్పిందే మనకి యోగ సాధన రైట్ కనుక ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఇంద్రియాలని అనిచివేయటం కాదు సప్రెస్ చేయటం కాదు బలవంతంగా నో నో నోనో ఇలా కాదు బతకటం అని చెప్పేసి దాన్ని కంట్రోల్ చేయడం కాదు వాటిని దైవ సాధన వైపుకి ధర్మ జీవనం వైపుకి ఆత్మజ్ఞానానికి సేవ చేసే విధంగా తరిఫీదని ఇవ్వడమే ఇవాళ మనం తెలుసుకోబోయేటువంటి ఈ సెషన్ రైట్ ఇప్పుడు మీకు ఒక ప్రశ్నతో మనం ఈ సెషన్ స్టార్ట్ చేసుకుందాం.
(14:51) కాన్సెప్ట్ అర్థమయఉంటది కదా అబౌట్ అవర్ సెన్స్ ఆర్గాన్స్ మన ఇంద్రియాలు ఏమైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాలు ఎస్పెషల్లీ కర్మేంద్రియాల గురించి సమయం ఉంటే చివర్లో మళ్ళ చూద్దాం. జస్ట్ మీరు ఒక్క ప్రశ్న వేస్తాను జాగ్రత్తగా మీలో మీరు ఆలోచించుకోండి. ఇంద్రియాలలోకి టాపిక్ లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి మనందరికీ తెలుసు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనేది చూడండి సూక్తి ఎన్నో సార్లు విన్నాం మనం కాబట్టి కంటి గురించి ఒక ప్రశ్న వేస్తాను నీ మీద ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి నేను నా కండ్లకి యజమానినా లేక ఆ కండ్లు చూపించే ప్రతిదానికి నేను బానిసనా జస్ట్ విని వెళ్ళిపోవడం రాసుకోవడం
(15:34) కాదు ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ఒక్కసారి ప్రశ్నించుకోండి నేను నా కండ్లకి యజమానినా లేదా అవి చూపించే ప్రతిదానికి నేను బానిసనా సత్యవంతంగా ఆన్సర్ రావాలి ఎవరికి వారికి ఇది సత్సంగం కదా పాజిటివ్ గా ఉండాలని పాజిటివ్ అని సెలెక్ట్ చేసుకోకండి వాట్ ఇస్ ద రియల్ ఆన్సర్ రాసుకోండి అప్పుడు మీరు నిజంగా మీ కండ్లకు యజమానిగా ఉన్నారా ఒక్కసారి మొబైల్ లో పట్టుకొని అది ఏమి చూపిస్తుందో వాటికి మీరు బానిస అయిపోయినారా అయిపోయింది కాన్సెప్ట్ ఒక క్వశ్చన్ తో మీరు ఏమి తెలుసుకోవాలని అనే ఆన్సర్ రావాలి అంతే ఈ ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఎవ్వరము కూడా కంటికి యజమానులుగా లేము
(16:22) ఎవ్వరము కూడా లేము గుర్తించండి అందరము కూడా వాటికి ఏమైపోయినాము బానిసలమైపోయినాం రెండో మాట నా చెవులు ఏ మాట వినాలో నేను నిర్ణయిస్తున్నానా లేదా నా చెవులు ఏమి లోపల పంపిస్తున్నాయో దాన్ని బట్టి నేను నిర్ణయాలు తీసుకుంటున్నానా చాలా బెస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి నా చెవులు ఏమి వినాలో నేను నిర్ణయిస్తున్నానా లేదా నా చెవులు లోపలికి ఏ సమాచారం పంపిస్తున్నాయో దాన్ని బట్టి నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను అదే డిసైడ్ చేస్తుంది హూ ఆర్ యు అనేటువంటిది దానికి కూడా మీరు మార్క్ వేసుకోండి.
(17:10) తెలుసు దీంట్లో కూడా ఆన్సర్ ఏమ వస్తుందో [నవ్వు] మూడవది నా నాలిక ఆరోగ్యాన్ని కాపాడుతోందా లేక నన్ను రుచులకి బానిసగా మారుస్తుందా నా నాలిక ఆరోగ్యాన్ని కాపాడుతుందా లేదా రుచులకి బానిస చేస్తుందా దేనికి ఆన్సర్ ఇది అసలు అడగాల్సిన పనే లేదు బో గుడ్డోడు కూడా వాడికి నాకు నూడిల్స్ పెడితే తింటాను అంటాడు.
(17:48) [నవ్వు] వాడికి అసలు వాడికి మోషన్ అవ్వదు అరుగుదలే లేదు వాడేమో అరగనటువంటి ఆహారమే కోరుకుంటా ఉంటాడు. రైట్ కనుక ఈ నాలిక విషయంలో చాలా డీప్ గా సమయాన్ని బట్టి ముందుకు వెళ్ళినప్పుడు ఈ ఇంద్రియాల అంశాన్ని వివరంగా మాట్లాడినప్పుడు నాలిక రెండు పనులు చేస్తుంది ఒకటి ఆహారము రెండు మాట్లాడటం దాని గురించి మళ్ళీ తెలుసుకుందాం. రైట్ నాలుగవది అంశంలోకి వెళ్దాం. వాసన అండ్ శ్వాస ముక్కు చేసేటువంటి పని శ్వాసన ఆధీనంలో ఉన్నదా శ్వాసన ఆధీనంలో ఉన్నదా లేదా ఆ శ్వాస నాకు అనారోగ్యాన్ని కలిగిస్తున్నదా
(18:34) ఎందుకు శ్వాస సమస్యలు ఎక్కువగా ఉంటే రుగ్మతలు వస్తున్నాయి వాసన గురించి తక్కువ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి నేను దాన్ని శ్వాస గురించి ఉపయోగి ఉపయోగించుకుంటున్నాను ఈరోజు రాసన గ్రహించటం అనేది పెద్ద ప్రాధాన్యత కాదు మానవ జీవితంలో బట్ దట్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ మనిషి చూడటానికి తినటానికి వినటానికి ఇచ్చిన ప్రాధాన్యత ఈ వాసన అనే సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఉండదు డైవర్ట్ అవ్వటం అందువల్ల ముక్కు చేసే పని ఏంటి వాసనతో పాటుగా శ్వాసించటం రైట్ నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న వేసుకుందాం నా చర్మము అన్ని స్థితుల యందు నన్ను ఆనందంగా ఉంచుతుందా లేదా నన్ను సుఖాలకు బానిసం
(19:22) చేస్తుందా చర్మము చాలా ముఖ్యమైనటువంటి లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ దానికన్నా యోగ సాధనలో ఒక వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడిగా మార్చేది చర్మము యొక్క సౌఖ్యమే నా చర్మము నన్ను యోగిగా ఉంచిందా లేదా సుఖాలకు బానిసం చేసిందా రైట్ ఈ ఫైవ్ క్వశ్చన్స్ కి నిజాయితీగా సమాధానం వస్తేనే ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభం అవుతుంది.
(19:52) నిజాయితిగా సమాధానం వస్తే ఇక్కడ ఎవరికీ మనం చెప్పడం లేదు మీరు ఎవరు ఏంటని రైజ్ హ్యాండ్ చేయించట్లే మీకు మార్కులు వేయట్లా ఓహో వీళ్ళకి ఐదు బాగా ఉన్నాయని చప్పట్లు కొట్టి సన్మానం చేయించట్లే ఇంకెందుకు సత్యమునే మనం సెలెక్ట్ చేసుకుందాం. గుంపుగా మనం క్లాసులు చెప్తున్నాం అనుకోండి గ్రూప్ సమావేశాల్లో అప్పుడు అడిగామ అనుకోండి లేకపోయినా ఆన్సర్ ఏదో ఉన్నట్టుగానే చెప్తారు.
(20:15) అక్కడ కవరింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కవరింగ్ వద్దు అంతా అన్ కవరింగే పైన ఉన్న లేయర్ ని తీసేయడమే ఈ సెషన్స్ అన్నీ కూడా అందువల్ల సత్యవంతంగా ఈ ఐదిటిలో మీరు ఎన్నుకున్నటువంటి దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకరోజు ఒక రాజుకి గురువు దగ్గరికి వెళ్ళే ఒక సందేహం కలిగింది. గురుజీ నా రాజ్యంలో నాకు అన్ని ఉన్నాయి సైన్యం ఉంది సంపద ఉంది కీర్తి ఉంది అయినా నాకు ప్రశాంతత లేదు కారణం ఏంటి అడిగాడు గురువుగారు చిరునవ్వుతో రాజుగారిని ఒక సరస్సు దగ్గరికి తీసుకెళ్ళాడు ఎక్కడికండి ఒక సరస్సు చాలా ప్రశాంతంగా ఉంది ఆ నీరు అర్థంలాగా కనబడుతుంది మహారాజా ఒక్కసారి నీటిలోకి
(20:57) చూడు అన్నాడు చూడంగానే రాజు యొక్క ముఖం చాలా స్పష్టంగా కనిపించింది. చాలా స్పష్టత అద్దము కన్నా కూడా స్పష్టమైన ప్రతిబింబం కనపడింది ఆ సరసు నీటిలో ఎంబటి ఆ గురూజీ ఒక చిన్న రాయి తీసి నీటిలో వేశడు. అలా డిస్టర్బెన్స్ వచ్చింది అలల రూపంలో రాజు ముఖం కనిపించట్లే అప్పుడు గురువుగారు అన్నారు నీ ముఖం ఎక్కడికన్నా పోయిందా పోలేదు నీ ముఖం ఉంది ఇక్కడే కానీ నీటి అలలు వచ్చాయి అందువల్ల ముఖము ప్రతిబింబం కనపడటం లేదు అలాగే నీ లోపల ఆనందం ఎక్కడికి పోలేదు కానీ నీ ఐదు ఇంద్రియాలు ఎక్కువ ఈ అలల్లాగా అలజడికి గురవుతున్నాయి.
(21:39) అందుకే అలలు వస్తే ప్రతిబింబము కనపడనట్టుగా నీ ఇంద్రియాలు అలజడికి గురై నా కొలది నీ ఆనందము దూరమవుతుంది మహారాజా అన్ని ఉన్నాయి నీ దగ్గర సంపదలు ఉన్నాయి సైన్యం ఉంది కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ నీ ఇంద్రియాలు విపరీత అలజడికి గురవుతున్నాయి అందుకే నేను పొందిన ప్రశాంతతని నీవు పొందలేకపోతున్నావు అని ఒక మాట చెప్పాడు ఇంద్రియాలు ప్రశాంతమైతే ఆత్మ స్వరూపం స్వయంగా ప్రత్యక్షమవుతుంది ఈ ఒక్క వాక్యానికి రాసి పెట్టుకోండి ఇంద్రియాలు ప్రశాంతతమైతే అంటే ప్రశాంతమైన స్థితిని పొందగలిగితే ఆత్మ స్వరూపం స్వయంగా ప్రత్యక్షమవుతుంది ఆత్మ స్వరూపం అంటే మళ్ళీ ఒక రూపముతో
(22:24) వచ్చేది కాదు మీ రూపం బయట కనపడటం కాదు అంతర్ముఖ ప్రయాణం జరుగుతుంది. సో ఇటువంటి ఇంద్రియాలని మనము మన ఆధీనంలో మన ఆధిపత్యంలోకి తెచ్చుకోవడానికి ఎటువంటి సాధన చేయాలి చూద్దాం ఒక్కసారి రైట్ మీరు గమనించండి జంతువులు కూడా వింటాయి పక్షులు కూడా చూస్తాయి వింటాయి చాపలు కూడా రుచి చూస్తాయి మరి మనిషికి ప్రత్యేకత ఏంటి నువ్వు ఇంత చెప్తున్నావు కదా స్వామి ఇన్ని ఇంద్రియాలు అన్ని జంతువులకి ఉన్నాయి అన్ని పక్షులకి అనేక జీవులకు ఉన్నాయి కదా అవి వింటున్నాయి అవి చూస్తున్నాయి అవి కూడా వాసన గ్రహించగలుగుతున్నాయి అవి స్పర్శిస్తూ ఉన్నాయి కానీ వాటికి
(23:04) ప్రత్యేకత ఏంటి మానవుడికి ఒక స్పెషాలిటీ ఉంది మనిషికి డిస్క్రిమినేషన్ ఉంటుంది ఒక వివేకం ఉంటుంది మనిషికి ఒక శక్తి ఉంటుంది ఏమిటది సంకల్ప శక్తి ఉంటుంది. మనిషికి ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ రియలైజేషన్ ఉంటుంది ఆత్మ పరిశీలన ఉంటుంది. మనిషి తన ఇంద్రియాలని గమనించగలడు అబ్సర్వ్ చేయగలడు వాటిని మార్చుకోగలడు వాటిని ఉన్నత లక్ష్యాలకి డెడికేట్ చేయగలడు అదే మానవ జన్మ యొక్క అదృష్టం జంతువునాం నరజన్మ దుర్లభం కనుక అసలు ఇంద్రియాల అసలు స్వరూపం ఏమిటి మనం దీని గురించి ఎలా తెలుసుకోవాలని ప్రయత్నం చేద్దాం.
(23:48) పెద్దలు ఎప్పుడో చెప్తుంటారు ప్రపంచాన్ని గెలవడానికి ముందు మన ఇంద్రియాలను గెలవాలి. భగవంతుడు గీతలో అర్జునుడికి కూడా యుద్ధం గెలవడం నేర్పించలేదు జాగ్రత్తగా గమనించండి తనను తాను గెలవటం ఎలాగో నేర్పించాడు తనను తాను గెలిచిన అర్జునుడు యుద్ధాన్ని గెలిచాడు. గీతలో కూడా కృష్ణుడు బోధించినటువంటిది అర్జునా నువ్వు వాడి మీద బానిమే వీడి మీద బాని వాడిని చంపి వీడిని చంపే యుద్ధం క్లోజ్ అయిపోతుంది రాజ్యాం నీ దగ్గరికి వస్తుంది నువ్వు చక్రవర్తి నీకు పలాన రోజు నీకు పట్టాభిషేకం చేస్తా అన్నదమ్ములు సుఖంగా ఏలుకోండి అని చెప్పలేదు ఆయన గీతలో చెప్పింది కూడా ఒకటే ఏమి చెప్పాడు అంటే
(24:22) నిన్ను నీవు జయించు తర్వాత ఇద్దరిని జయిస్తావు గీత మొత్తం కూడా ఇద్దంలో గెలిచే మార్గాన్ని చెప్పలేదు మనిషి తనను తాను జయించే మార్గాన్ని చూపించింది. కాబట్టి మనకి భగవద్గీత చెప్పిన ఉపనిషత్తులు చెప్పిన వేదాంతములు చెప్పిన ఒకటి చెప్తే నిన్ను నీవు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే సో నిన్ను నువ్వు గెలవటం అంటే ఏమిటి ఇంద్రియాలను గెలవటం ఇంద్రియాలను అణచివేయటం యోగం కాదు వాటిని మనకు అవసరమైన ఆధ్యాత్మిక దిశలో నడిపించటం యోగం మనసుని బలవంతంగా నిలిపి వేయడం అనేది ఎవరికి సాధ్యం కాదండి ఋషులు ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు కానీ దానికి ఒక గొప్ప
(24:58) లక్ష్యాన్ని కనక చూపించగలిగితే మనసుకి అప్పుడు అది స్వయంగా ప్రశాంతమవుతుంది ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకో మనసు మీకు బాధ దుఃఖం కలిగింది దానిని నువ్వు దుఃఖం వద్దు బాధ వద్దు అని సప్రెస్ చేయలేరు. సప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్ డిప్రెషన్ లీడ్స్ టు డిసీస్ కాబట్టి ఒక వ్యక్తి మనిషి మనసుని బలవంతంగా అనిచి పెట్టలేడు అది ఎవరికీ సాధ్యము కాదు ఇది వద్దు ఇది వద్దు అనుకోండి దాన్ని ఏం చేయాలి సరైన లక్ష్యం వైపు నడిపించగలిగితే అది ప్రశాంతం అవుతుంది.
(25:27) అలాగే నది ఒక సముద్రాన్ని చేరేటప్పటికీ అది ఆ మయా రిలాక్స్ అవుతుందండి. తన పని అయిపోయింది గమ్యం ఏంటంటే సముద్రంలో చేరటమే ఎన్నో కొండలు వంకలు ఆకులు అన్ని ఊర్లు తిరుగుతూ తిరుగుతూ వచ్చి తన లక్ష్యాన్ని చేరినమ్మటే తన ఉనికిని కోల్పోతుందిఅది నది లేదు ఇంకా అక్కడ ఏమైపోయింది సముద్రంగా మారిపోయింది అలాగనే ఇంద్రియాలు కూడా ఆత్మజ్ఞానం అనే లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు అవి ఉండవు ఇంకా దట్ ఈస్ ప్రత్యాహార పాతాంజలి మహర్షి చెప్పినటువంటి ప్రత్యాహార విత్డ్రాల్ ఆఫ్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ విత్్రాల్ అంటే వాటిని బంధించి కూర్చోబెట్టడమా కండ్ల గంతలు కట్టేసి
(26:04) నువ్వేమి చూడకనటమా బలవంతంగా ధ్యానానికి కూర్చోవడమా అరేరే నేను ఇవేమి వినకూడదు అని చెప్పి చెవులన్నీ కూడా క్లాత్ పెట్టి క్లోజ్ చేసుకోవడమా కాదు కదా ప్రత్యాహార మీన్స్ నది సముద్రంలో కలిసినప్పుడు తన ఉనికిని గోలిపై ప్రశాంత స్థితిలోకి ఎలాగైతే వెళ్తుందో సాధకుడు తన ఇంద్రియాలని ఆత్మజ్ఞానం వైపు మరల్చినప్పుడు అవి అలజడిని కోల్పోయి అంతర్ముఖ ప్రయాణం చెందించే సాధనంగా మారుతాయి అదే ప్రత్యాహారం ఆ ప్రత్యేహారంలోకి వెళ్ళబోయే ముందు అసలు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
(26:37) ఏమిటి ఈ ఐదు ఇంద్రియాలని మనము ఒక రకంగా శత్రువులుగా భావిస్తూంటాం చెప్పబడుతూ ఉంటుంది మనకి కొంతమంది బలవంతంగా అయోనే అసలు నా కంట్రోల్ లో ఉండట్లేదే అని వాటిని ఒక శత్రువులాగా ఫీల్ అవుతుంటారు. బట్ ఇంద్రియాలు మానవ జీవితానికి అవి ఎప్పటికీ శత్రువులు కాదు అవి అపారమైన శక్తి కలిగినటువంటి సాధనాలు. ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే బలమైన గుర్రాలు ఉన్నాయి రథానికి కట్టారు వాటి కళ్యాణలు బిగించారు సారధి కూర్చున్నాడు కళ్ళెములు పట్టుకున్నాడు రథము లోపల యజమాని కూర్చున్నాడు ఎవరు కూర్చున్నారు యజమాని కూర్చున్నారు.
(27:19) రథం ఎవరు శరీరము గుర్రములు ఎవరు ఇంద్రియములు మనసు ఎవరు కళ్ళెము సారధి ఎవరు బుద్ధి యజమాని ఎవరు ఆత్మ లోపల కూర్చున్న యజమాని ఎవరు ఆత్మ సరే హైయెస్ట్ మనం ఇంద్రియాలు టాపిక్ మాట్లాడి తర్వాత మిగిలిన తర్వాత చెప్పుకుందాం ఈ ఐదు ఇంద్రియాలు ఎవరు గుర్రములు బలంగా ఉన్నాయి కానీ జాగ్రత్తగా వినండి శిక్షణ ఇవ్వబడిన గుర్రములు అయితే ప్రయాణం ఎలా జరుగుతుంది బలమైన గుర్రములు శిక్షణ లేనివైతే ప్రయాణం ఎలా జరుగుతుంది అయిపోయిందండి కారణం ఏంటంటే ఉపనిషత్తులో ప్రతిదీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ప్రశ్నకి
(28:06) సమాధానాలు అక్కడ చెప్పబడింది ఏమిటంటే ఇంద్రియములు చాలా బలంగా ఉన్నాయి కానీ అవి శిక్షణ పొంది లేవు తరిఫీదు లేనటువంటి గుర్రములో కళ్ళెము బలంగా ఉంది సారధి మంచి తర్ఫీదు పొందినవాడే అండ్ లోపల కూర్చున్న యజమాని ధనవంతుడే కానీ కానీ బోల్తా కొట్టేసి మొక్కలు చేసేసి పడిపోయి వెళ్ళిపోతాయి. అలాగా మీరు తెలివి గలవారు చదువుకున్నవారు ధనవంతులు అధిక విద్యావేత్తలు అన్ని బాగా ఉన్నప్పటికీ గుర్రముల తరిఫీదు లేకపోతే ఎలా బండి మొక్కలు అయిందో ఇంద్రియాలు గనుక సరైన శిక్షణ పొందకపోతే లైఫ్ ఎండ్ అవుతుందనే ఉపనిషత్తు సారాంశం.
(28:44) కనుక వీటిని యోగా ద్వారా ధ్యానము ద్వారా గురు కృప ద్వారా ఆత్మ పరిశీలనతో నడిపిస్తే జ్ఞానానికి ద్వారాలు అవుతాయి. అదే గనుక దానికి వ్యతిరేక మార్గంలో ఉంటే అవే మనకి బంధాలు అవుతాయి ఇందాకే చెప్పుకున్నాం ఏదైతే బంధాన్ని ఇస్తుందో అదే మనకి ముక్తిని విముక్తికి కారణం అవుతుంది. ఈ ఇంద్రియాలను ఏదైతే ఉన్నాయో అవి మీరు మీ ముక్తికి విముక్తికి వాడుకుంటారా లేకపోతే దేనికి వాడతారో అది మీ ఇష్టం.
(29:11) ఇప్పుడు ఒక ఇంకొక ప్రశ్న సమయం తక్కువగా ఉంటుంది డీప్ గా వెళ్లే ప్రయత్నం చేయకుండా పైపైన అందించే ప్రయత్నం చేస్తాం ఈ సారాంశం చక చక మీ కళ్ళు చూస్తున్నాయా మీ మనసు చూస్తున్నదా ఇవాళ చాలా డీప్ గా ఆలోచించండి మీ కళ్ళు చూస్తున్నాయా మీ మనసు చూస్తుందా మీ చెవులు వింటున్నాయా మీ అంతరంగం వింటుందా ఒకే సంఘటనని అనేకమంది వ్యక్తులు చూస్తారండి ఒక ఇద్దరు వ్యక్తులు చూశారు అనుకుందాం ఒకరికి అది ఆనందాన్ని ఇస్తుంది అదే సంఘటన మరొక కోపాన్ని ఇస్తుంది.
(29:52) సంఘటన ఒకటే బట్ ఆ ఫీల్ అనుభవం ఎక్స్పీరియన్స్ ఎందుకు డిఫరెంట్ గా ఉంది ఎందుకంటే కేవలం మనిషి కళ్ళతో చూడటమో చెవులతో వినటమో కాదు ఇంద్రియాలు సమాచారాన్ని సేకరిస్తాయి ఈ ఆ కాన్సెప్ట్ జాగ్రత్తగా అందుకునే ప్రయత్నం చేయండి. ఇంద్రియాలు సమాచారాన్ని సేకరిస్తాయి మనసు దాన్ని విశ్లేషిస్తుంది అర్థాన్ని చెప్తుంది. మనసు దాన్ని వివరిస్తుంది.
(30:19) అతని మీద కోపం రావాలా ద్వేషం రావాలా మరొకటి రావాలా దానికి అర్థాన్ని ఇస్తుంది ఒక దృశ్యానికి బుద్ధి దానికి తీర్పు చెబుతుంది. బుద్ధి అనేటువంటిది ఇది ఏంటి అనేది జడ్జ్ చేస్తుంది. ఈ సమాచారాన్ని చూసింది జడ్జ్ చేసింది తీసుక చిత్తం లోపల స్టోర్ చేస్తుంది. అహంకారం అనేది ఆ సమాచారాన్ని ఇది నాది అని స్వీకరిస్తుంది. ఇది నాదే కదా అని కనుక కేవలం కళ్ళు చూడవు ఈ కండ్ల వెనక మనోబుద్ధి చిత్త అహంకారం అని నాలుగు పనిచేస్తాయి.
(30:50) కేవలం చెవులు వినవు ఈ చెవుల వెనక మనసు బుద్ధి చిత్తి చిత్తం అహంకారం అని నాలుగు పనిచేస్తాయి. ఐద అలా ఆ విధంగా ఈ ఐదు పంచజ్ఞానేంద్రియాల వెనక ఈ నాలుగు అంతఃకరణములు పనిచేస్తాయి. మనసు బుద్ధి చిత్తము అహంకారం అనేదానికి పనిచేస్తాయి. ఓకే సో ఇప్పుడు ఒక విషయం జాగ్రత్తగా మరొక ప్రశ్న వేస్తాను కండ్లఏమిటి అవయవము చెవులు అవయవము ముక్కు అవయవము ఇలా చర్మం అవయవం ఇప్పుడు ఒక విషయం వినండి కానీ ఈ అవయవానికి ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి శక్తులు ఉన్నాయి.
(31:34) చూడు కన్ను అవయవము దాని పవర్ ఏంటి చెప్పండి దాని పవర్ ఏంటి చాలా ఇంత అద్భుతమైన వివరణ యాక్చువల్ గా నేను ఆఫ్లైన్ ఏదన్నా ఒక బారి సెమినార్ లో చెప్దాం అనుకున్న కాన్సెప్ట్ ఇది ఈరోజు మీకు అందించాల్సి వచ్చింది. లైవ్ సెషన్ అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి నాకు ప్రత్యక్షంగా అయితే ఇలా జూమ్ లో కాకుండా YouTube లో కాకుండా కన్ను యొక్క శక్తి ఏమిటి చూడటము చూడటము వెరీ పవర్ఫుల్ అది ఆ దృష్టి లేక కొన్ని కోట్ల మంది దుఃఖితులుగా ఉంటున్నారు చూడటం అనే శక్తి లేక కళ్ళ ఉన్నాయి అందరికీ కానీ చూడగలిగే శక్తి కొంతమందికే ఉంది.
(32:16) ఒక వయసు వచ్చేదాకా బాగా చూడగలిగిన ఒక వయసు దాటిన తర్వాత చూడలేక ఇబ్బంది పడుతున్నారు శక్తిని కోల్పోయి కనుక ఇంద్రియము అనేదానికి అర్థం ఏంటంటే ఇంద్ర అనే సంస్కృతమైన ధాతువు నుండి వచ్చింది శక్తి శక్తి సామర్థ్యము అని అర్థం ఇంద్రియము అంటే కాబట్టి ఇంద్రియం అంటే అవయవం కాదు శక్తిని అందించేటువంటిది ఒక శక్తి సామర్థ్యము కలిగినటువంటిది చూపు అనేది ఒక ఇంద్రియ శక్తి చెవి ఒక అవయవమే కానీ వినటం శ్రవణము అనేటువంటిది ఒక ఇంద్రియ శక్తి ఇది అర్థమైతే మనం ఆ శక్తులని యుక్తిగా వాడుతున్నామా ముక్తి కోసం వాడుతున్నామా లేకపోతే విరక్తి వైపు వాడుతున్నామా తెలుస్తుంది.
(33:03) యుక్తి నుండి ముక్తి వస్తుంది రక్తి నుండి విరక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ ఇంద్రియము అనేటువంటిది అవయవంగా చూసినంతవరకు యోగా ఎవరికీ అర్థం కాదు పాతంజలి చెప్పిన ప్రత్యాహారం ఎవరికీ అర్థం కాదు ఇంద్రియము ఒక శక్తి అనేటువంటిది కాన్సెప్ట్ గనుక స్ట్రైక్ అయితే చూడటం అనే శక్తిని ఎక్కువ వాడాము శక్తి హీనత వస్తుంది దృష్టి లోపం ఏర్పడుతుంది.
(33:32) వినటం అనే దాన్ని ఎక్కువగా అనవసరమైన వాటికి శక్తిని ఉపయోగించాము శక్తి ఖర్చుఅయిపోతుంది అత్యవసర సందర్భంలో ఓపికగా వినాల్సిన చోట జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఓపికగా వినాల్సిన చోట వినికిడి శక్తి కోల్పోవడం ద్వారా శక్తి కోల్పడంటే వినపడకుండా ఉండటం కాదు వినగలిగినటువంటి శక్తిహీనత రావటం ద్వారా ఆ అసలైన విషయాన్ని వినకుండా ముందు విషయాన్ని విని తొందరబడి బంధాలను తెంచేసుకుంటారు.
(33:56) ఎందుకు అసలుది వినగలిగే ఓపిక లేదు క్లాస్ అంతా వింటారు చివర్లో నేను కంక్లూజన్ వెళ్ళిపోతుంటారు మూటాము సద్దుకొని ఎందుకు వినగలిగే శక్తి లేదు ఇంకా అయిపోయింది. వినపడకపోవడం చెవుడైతే వినగలిగే శక్తిని కోల్పోవటం అనేటువంటిది ఇంద్రియం నిగ్రహం కోల్పోవడం అప్పటికి బ్యాటరీ డిస్చార్జ్లు అయిపోతాయి. ఎందుకు అప్పటిదాకా అవసరం లేనదంతా విన్నాడు ఆ రెండు గంటలు మూడు గంటలు గొడవలు పోడి పంచాయతీ పెట్టుకొని వచ్చాడు అలిసిపోయిఉన్నాడు నేను చెప్పిన రెండు మాటలకి ఆ వినికడి శక్తి అయిపోయింది చివరికి వచ్చేటప్పటికి వెళ్ళిపోతాడు అసలు విషయం యజ్ఞం అంతా చేసి యజ్ఞ ప్రసాదాన్ని
(34:32) తీసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళలాగా గొడవ ఎక్కడ అవుతుంది అంటే అసలు విషయాన్ని వినకుండే మొదటి విషయానికి ఎగిరి పడ్డప్పుడే అవుతుంది. ఇట్లాగా ఈ చూడటము వినటము రుచి చూడటము స్పర్శించటము వాసన గ్రహించటము ఇవన్నీ శక్తులు అనే విషయము ఎవరికైతే తెలుస్తుందో వారే ఈ ఇంద్రియాల గురించి సాధన చేయగలుగుతారు. మీరు సిద్ధంగా ఉంటే అందించే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ వెయిట్ ఓకేనా రైట్ ఇక్కడ ఈ ఐదు ఇంద్రియాలు ఏవైతే మనకి చెప్పబడ్డాయో దాని తోడుగా ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి.
(35:11) కాళ్ళు చేతులు నోరు మలనాంగపు జననాంగం మొదటి ఐదు జ్ఞానేంద్రియాలు తర్వాత ఐదు కర్మేంద్రియాలు తర్వాత మరొక ఇంద్రియాన్ని కూడా వేదాంతంలో చెప్పడం జరిగింది అదే మనస్సు మనకి ఆ ఆరు ఇంద్రియాలు కలిగిన మనిషి అంటారు కర్మేంద్రియాలని ఎప్పుడు కూడా అంత హైలైట్ చేసి చెప్పదు వేదాంతంలో గాని ఎక్కడైనా గాని ఎందుకంటే కర్మే చేస్తే గాని జ్ఞానాన్ని ఇవ్వటమో చేయటమో జరగదు ఆరు ఇంద్రియములు ఏమిటి ఐదు ఇంద్రియములు కండ్లు చెవులు ముక్కు నాలుక చర్మం అయితే ఆరవ ఇంద్రియము కలిగినటువంటి జీవి ఒక్క మనిషి మాత్రమే మనసు వేదాంత పరంగా అది ఇంద్రియంగా కూడా మనకి చెప్పబడుతుంది జరుగుతుంది.
(35:47) ఎందుకు దాన్ని కూడా ఇంద్రియం అన్నారు మీరు ఒక మంచి పుస్తకం చదువుతున్నారు అనుకోండి బాగా ఇప్పుడు సత్సంగం వింటున్నారండి లీనమైపోయినారు దీంట్లో మిమ్మల్ని ఎవరన్నా మీ ఇంట్లో వాళ్ళు 10 సార్లు పిలిచారు. మీరు వినలేదు సత్సంగం అయిపోయినా కానీ అన్నిసార్లు పిలిచాను నిన్ను స్వామి ఏమి వినలేదా అంటారు నిజానికి చెవులు శబ్దాన్ని గ్రహించాయి కానీ ఎందుకు మీ లోపలికి చేరలేదు అది అంటే మీ మనసు అక్కడ లేదు అందుకే వినలేదు ఎక్కడఉంది మనసు సత్సంగం మీద ఉంది అందుకే అక్కడ తినపడలేదు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ ఐదు ఇంద్రియాలు బయట ఇరుక్కోవాలా లోపలికి వెళ్ళాల అనేది మీ
(36:24) మనసు ఉండే స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు సత్సంగంతో ఉన్నప్పుడు గురుజీ మాటలే శబ్దాలుగా వినపడ్డాయి మీ ఇంట్లో వాళ్ళు పిలిచిన వినపడదు కానీ మీ చుట్టూ ఎల్లప్పుడూ అన్ని శబ్దాలు ఉంటాయి అన్ని దృశ్యాలు ఉంటాయి అన్ని రుచులు ఉంటాయి అన్ని స్పర్శలు ఉంటాయి కానీ మీ మనసు ఎక్కడికి వెళుతుందో అక్కడికి మీ ఇంద్రియం వెళ్తుంది.
(36:44) రైట్ కాబట్టి ఇప్పుడు ఇంద్రియాలని మనము ఇంద్రియాలని మనము ఆధీనంలో ఉంచుకోవాలంటే దానికి కీలక పాత్ర పోషించేది ఆరో ఇంద్రియమైనటువంటి మన మనసు మీ మనసు ప్రశాంతంగా ఉందనుకోండి మీరు ఒక సన్మార్గంలో ఉంటారు. మనసు అలజడిగా ఉందనుకోండి మందు తాగుదామా మరొకటి చేద్దామా ఇంకొకటి చేద్దామా ఇంకేదనా చేద్దామా అని చూడండి ఎవడనా కదిలించండి ఆల్కహాల్ తాగి ఎందుకు తాగుతున్నావ అంటే నా మనసు బాగాలేదు అంటాడు.
(37:13) నా మనసు బాధపడడం తాగుతున్నా అంటాడు అవునా కాదా ఎవ్వనైనా అడగండి తాగేవాళ్ళని ఎవరనా బలం కోసం తాగుతున్నాడు ఎవడైనా చెప్పాడండి మీకు ఎప్పుడన్నా నేను ఆరోగ్యం కోసం తాగుతున్నా వందేళ్ళు బ్రతకాలని తాగుతున్నా నేను మా ఆవిడిని బాగా చూసుకోవడం కోసం తాగుతున్నా నా పిల్లోడికి మంచి చదువు రావడం కోసం తాగుతున్నా ఎవడైనా చెప్పాడా ఎప్పుడన్నా ఎవ్వరిని అడగండి తాగేవా ఎందుకు తాగుతున్నారు నా మనసు బాలే కారణం ఏమిటి మీ ఇంద్రియము ఎక్కడికి వెళ్ళాలి ఎటు చూడాలి ఏమి చేయాలి అనేటువంటిది ఎవరు నిర్ణయిస్తారు మీ మనసు యొక్క స్థితి నిర్ణయిస్తుంది అందుకే మీ మనసు అనేటువంటిది ఏమి చేయాలి రాజు ఏమి
(37:48) చేయాలో నిర్ణయించేది ఎవరు మంత్రి చెబుతాడు అందుకే మనసు మంత్రి లాంటిది అంటారు. ఒక మినిస్టర్ లాంటిది ఆ మనసుని మనము ఎప్పుడైతే సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా తయారు చేయగలుగుతామో అప్పుడు సాధన పూర్తఅవుతుంది. కనుక ఈ నాలుగు చతుష్టయాలు ఏమైతే అంతఃకరణాలు అంటాం ఒక్కసారి చూద్దాం మనసు ఏమి చేస్తుంది కారణం ఈ ఇంద్రియాలు ఈ నాలుగిటి మీద ఆధారపడి ఉన్నాయి.
(38:14) మనసు ఏం చేస్తుంది? ఏమి చేస్తుంది మనసు అండి మనసు ఏం చేస్తుంది? సంకల్ప క్రియాయోగ అన్నిసార్లు విన్నారు కదా పాజిటివ్ ఆన్సర్ ఒక్కటన్న మీ మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి కదా మనసు ఏం చేస్తుంది సంకల్పం చేస్తుంది. మనసు ఏం చేస్తుంది మీకు ఈ జీవితంలో ఎక్కడికి పోవాలో ఒక సంకల్పం చేస్తుంది అదే మనసు ఏం చేస్తుంది దానికి ఆపోజిట్ అయిన ఇంకొకటి చేస్తుంది వికల్పం చేస్తుంది.
(38:38) సంకల్ప వికల్పాత్మకం మనః మనసు ఏం చేస్తుంది సంకల్పము చేస్తుంది సరిగా ఉన్నప్పుడు సరిగా లేనప్పుడు చచ్చ జీవితం దాన్ని వికల్పం చేస్తుంది అదే మనసు ఏం చేస్తుంది సందేహిస్తుంది ఇది రైట్ ఆ రాంగా అని [గొంతు సవరించుకోవడం] సందేహిస్తుంది అదే మనసు ఏం చేస్తుంది మీకు ఎమోషన్స్ ని అనుభవించే విధంగా భావోద్వేగాలని సృష్టిస్తుంది ఇదే మనసు ఏం చేస్తుంది ఇది చేయాలా వద్దా అని ప్రశ్నిస్తుంది ఇది ఎన్నో పనులు చేస్తుంది మనసు అనేది అటువంటిది సంకల్పాన్ని చేస్తుంది వికల్పాన్ని చేస్తుంది సందేహాన్ని ఇస్తుంది భావద్వేగాన్ని ఇస్తుంది ఇది చేయాల వద్దని ప్రశ్నిస్తుంది.
(39:15) ఇన్ని చేస్తుంది అందుకే నిలకడగా ఉండది. మరి బుద్ధి ఏం చేస్తుంది మనసు సమాచారాన్ని లోపలికి నెడతా ఉంది పర్మిషన్ కోసం అండి ప్రజల దగ్గర నుండి అర్జీలు వస్తాయి ఇందాలు పంపిస్తాయి కింద ఉన్న అధికారులు ఏం చేస్తారు దానికి ఒక రకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పై అధికారికి పంపిస్తారు. ఇవన్నీ కింద అధికారి ఎవరు మనసు ఈ లెటర్లున్నీ తీసుకుంటా ఉంటదండి అందరి దగ్గర ఇది ఎక్కడికి చేరవేయబడితే నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు ఇది సరైందా ఇది ధర్మమైందా దీని ఫలితం ఏమ వస్తుంది అని విచారించి నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు బుద్ధి నిర్ణయాత్మకం బుద్ధిహీన్ అంటే మనసు
(40:00) చెప్పిన వెంటనే కూడా పనులు అవ్వవండి పరిగెత్తిన బుద్ధి బలంగా ఉండాలి బుద్ధి నిర్ణయం తీసుకుంది ఉంటుంది అప్పుడు బుద్ధి బలంగా ఉంటే ఇంద్రియాలు నియంత్రణలో ఉంటాయి. ఈ బుద్ధి ఎవరి ఆధీనంలో పనిచేస్తూ ఉంటుంది చిత్తములో ఉండే మన గత జీవితపు సమాచారాన్ని బట్టి బుద్ధి డెసిషన్ తీసుకుంటుంది. ఒక్కసారి వెనక్కి తవ్వుతుంది గతంలో ఈ పని చేస్తే ఇది జరిగింది ఈ పని చేస్తే ఇది జరిగింది కాబట్టి చేయొచ్చా చేయకూడదా దీని తాలుకు సమాచారం ఎక్కడఉంది చిత్తంలో ఉంది జ్ఞాపకాలు ప్రతి అనుభవం ప్రతి అలవాటు ప్రతి భావోద్వేగం ప్రతి భయం ప్రతి ఆనందం అన్ని నిలవ చేయబడి ఉన్నాయి అక్కడ అవన్నీ
(40:40) మన సంస్కారాలు దాన్ని బట్టి బుద్ధిని నిర్ణయం తీసుకో అందుకనే బుద్ధి నిర్ణయం బాగుండాలంటే ఏమవ్వాలి చిత్తము శుద్ధ అవ్వాలి. నేను నాది అని అహంకారం ఎక్కువగా ఉంటే చిత్తం ఎప్పుడు సిద్ధవ్వదు చిత్తము సిద్ధ అవ్వాలంటే ఏం చేయాలి నిరహంకారంగా [గొంతు సవరించుకోవడం] జీవించాలి. నిరహంకారంగా జీవించాలి. అందుకే భగవద్గీత చెప్తుంది శరీరం కంటే ఇంద్రియాలు శక్తివంతమైనవి మీరు ఏ బాడీని చూసి బాగా మురిసిపోతున్నారో అందంగా ఉన్నాం మజిలు పెంచాం బ్రహ్మాండంగా ఉన్నాం.
(41:12) అందమైన ఇల్లు కట్టారు బూజు పట్టిన కిటికీలు డోర్లు పెట్టారు ఉపయోగం ఏముంది పాలరాతి మేడలు కట్టారు తుప్పు పట్టిన కిటికీలు పెట్టారు ఇంద్రియాలు అంటే డోర్స్ే కదా విండోస్ే కదా కనుక శరీరం కన్నా శక్తివంతమైనవి ఇంద్రియాలు ఇంద్రియాల కంటే గొప్పది మనసు మనసు కంటే ఉన్నతమైనది బుద్ధి బుద్ధి కంటే కూడా అత్యంత పరమ పవిత్రమైనది ఆత్మ కాబట్టి ఈ బుద్ధి చిత్తం అహంకారం ఒకదాని కిందక వేసుకుంటే బుద్ధి కన్నా శక్తివంతమైంది ఆత్మ అందుకనే శాస్త్రం చెప్తూ ఉంటుంది ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటే బుద్ధి స్థిరంలో ఉంటుంది బుద్ధి స్థిరంలో ఉంటే మనసు ప్రశాంతంగా
(41:52) ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే ఇంద్రియాలు నిగ్రహంలో ఉంటాయి ఇంద్రియాలు నిగ్రహంలో ఉంటే దేహం ఆరోగ్యవంతం అవుతుంది అందుకే ఆత్మజ్ఞానమే ఆరోగ్యము అయిపోయింది. ఆత్మజ్ఞానమే ఆరోగ్యం రైట్ అందువల్ల హూ ఇస్ ద లీడర్ అన్నప్పుడు ఆత్మ స్థితి నుండి ఆలోచించేవాడే లీడర్ శరీర స్థితి నుండి ఆలోచించేవాడు ఎప్పుడు బానిసే వాడికి ఎప్పుడు తిండి కావాలి నిద్ర కావాలి తిండి కావాలి నిద్ర కావాలి శరీర స్థితి నుండి నాయకత్వం వహించారు అనుకోండి అంతా కూడా ఫెయిల్యూర్ సిస్టమ్స్ ఉంటాయి మీరు ఎందుకంటే ఈ కోర్సుని డిజైన్ చేసిందే మీకు లీడర్షిప్ క్వాలిటీ కోసం ఇఫ్ యు వాంట్ టు
(42:32) బికమ్ ఏ లీడర్ మీరు మీ శరీర స్థితిని దాటి ఆలోచించాలి ఎంతసేపటికి తిందామా తినిపిద్దామా నిద్రపోదామా ఇంట్లో వాళ్ళని సుఖపెట్టి పడుకోబెడదామా అనే స్థితిలో ఉంటే మీరు ఎప్పటికీ లీడర్ అయ్యే అవకాశం లేదు ఇంద్రియాల స్థితి నుండి ఆలోచించారు అనుకోండి విలాసము వినోదము శృంగారము వీటి గురించి ఈ స్థాయి నుండి డెసిషన్ తీసుకున్నారు అనుకోండి లీడర్ అయ్యే అవకాశం లేదు మనోస్థాయి నుండి చిన్న చిన్న విషయాలకు భాగవద్వేగాలు కంట్రోల్ లేనటువంటి స్థితి నుండి డెసిషన్ ఇవ్వడం చెప్పంగానే మీకు కోపం వచ్చి ఆవేశం వచ్చి పదరా కొట్టేద్దాం పోదాంపా వాడేంటి తెలుసుకుందాం పా అంటే మీరు లీడర్ కారు ఏ
(43:07) వీ మా ఓడు ముందున్నాడు నేను అనుకున్నాను కట్టెలు పట్టుకున్నాం కొడవలు పట్టుకున్నాం వేసేద్దాం అనిపోతే లీడర్ కారు ఎందుకంటే భావద్వేగాలు విపరీతంగా రాంగ్ డిసిషన్ కి కారణం అవుతాయి అది ఆనందమైనా దుఃఖమైనా అందుకే అంటారు ఆనందంలో మాట ఇవ్వద్దు బాధలో నిర్ణయం తీసుకోవద్దు అని భావద్వేగాలు ఎప్పుడూ కూడా స్టెబిలిటీని ఇవ్వవు కామ డౌన్ అయినాక డెసిషన్ తీసేసుకోవాలి కామ డౌన్ అనక మాట ఇవ్వాలి.
(43:31) మీరు భావోద్వేగాల ఇంద్రియ స్థితి నుండి గనుక లీడర్ అయితే ఫెయిల్యూర్ సిస్టం బుద్ధి కూడా పర్మనెంట్ కాదని ఎందుకంటే బుద్ధి చిత్తం మీద ఆధారపడ్డది. చిత్తంలో గతం తాలక ఒకడు పట్ల మీకు వ్యతిరేకత ఉందనుకోండి ఒక సమాచారం రాంగానే అయితే పదవాడి సంగతి తేలుద్దాం అంటారు. బుద్ధి కూడా చిత్త మీద డిపెండ్ అయింది అందువల్ల బుద్ధి కూడా నాయకత్వం వహించకూడదుంట జీవితానికి ఎవరు నాయకత్వం వహించాలఅని చెప్తుంది శాస్త్రము భగవద్గీత ఆత్మ నాయకత్వం వహించాలి అందుకనే తీసుకెళ్లి ఉపనిషత్తులు రథంలో ఎవరిని కూర్చోబెట్టాయి ఆత్మని కూర్చోబెట్టాయి బుద్ధిని కూర్చోబెట్టలా మనసుని కూర్చోబెట్టలా
(44:01) చిత్తాన్ని కూర్చోబెట్ల ఇందాక చెప్పిన ఉదాహరణ గుర్రము మనకి ఇంద్రియాలు అయితే మనసు కళ్ళెం అయితే సారధి బుద్ధి అయితే లోపల రధములో కూర్చున్నవాడు ఎవరు ఆత్మ అని చెప్పింది ఉపనిషత్తు [గొంతు సవరించుకోవడం] కనుక మీరు ఈ జీవితం నడిపించాలంటే ఆత్మ స్థితి నుండి మాత్రమే సాధ్యమవుతుంది. ఇంద్రియ స్థితి నుండి దేహ స్థితి నుండి జరిగే అవకాశం లేదు.
(44:29) న్యూరో సైన్స్ దీని గురించి మళ్ళీ మనం ఎస్ న్యూరో సైన్స్ లో కూడా ఇదే చెప్పబడుతూ ఉంటుందండి. మనిషి మెదడులో రకరకాల స్పందనలు కలుగుతూ ఉంటాయి. ఇమ్మీడియట్ గా ఒక కోరికకి స్పందన వచ్చింది అనుకోండి అది భావోద్వేగ వ్యవస్థ ఎమోషనల్ సిస్టం అది అది ఆలోచించి నిర్ణయించుకోండి దాన్ని ప్రీ ఫ్రెంటల్ కార్డెక్స్ అంటాం ఇది కార్టెక్స్ అది డిఫరెంట్ గా ఉంటుంది దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం అందుకనే ఏమవుతుంది అంటే భగవద్గీతలో ఆత్మకి లేదా ఇంకా తక్కువ కిందకు వస్తే బుద్ధికి ఆధిపత్యం ఇస్తే సరిపోతుంది అని చెప్తుంది కనుక ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్తాను
(45:06) మీకు చాలా మంది తమ జీవితంలో లో ఇంద్రియాల నిందిస్తూ గడుపుతూ ఉంటారు కానీ సమస్య ఇంద్రియాల్లో లేదు కళ్ళు చెవులు ముక్కు నాలక చరమన లేదు. వాటిని దిశని కరెక్ట్ గా నిర్ణయించలేనటువంటి బలహీనమైన బుద్ధి మీద ఆధారపడి ఉంది. బుద్ధిని బలోపేతం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కత్తి ఉందండి వైద్యుడు ఆ కత్తితో సర్జరీ చేసి ప్రాణం పోయగలడు ఒక మూర్ఖుడు ఒక నేరస్తుడు ఆ కత్తితో ప్రాణం తీయగలడు ఇక్కడ ప్రాబ్లంఏ కత్తిది కాదు కత్తిని వాడే వాడి స్థితిని బట్టి ఇంద్రియాలది ప్రాబ్లం కాదు ఇంద్రియాలను ఉపయోగించే బుద్ధిని బట్టి ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. మనం తొలగించవలసింది ఇంద్రియాలను
(45:50) కాదు ఇంద్రియాలను నడిపించేటువంటి బుద్ధిని మార్చగలగాలి అందుకోసం మీరు సాధనలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఇవి బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేసే మార్గాలే తప్ప ఇవి స్టోర్ చేయవు దేన్ని జస్ట్ ఇప్పుడు చూస్తున్నాయి ఇవి చూసినదాన్ని ఇంద్రియాలు స్టోర్ చేయవు అయిపోయింది దాన్ని ఇప్పుడు వింటున్నాయి వినటం వరకే దాని పని ఇంద్రియాలు స్టోర్ చేయవు స్టోర్ చేసేది ఎవరు చిత్తం నిర్ణయిస్తుంది ఎవరు బుద్ధి దాన్ని అమలుపరిచేది ఎవరు కర్మేంద్రియాలు అందువలన ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలని గనుక మనం మార్పు చెందించగలిగితే అప్పుడు అప్పుడు కంప్లీట్ గా క్లీన్ అయిపోతాయి. రైట్
(46:32) ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేస్తే నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం మనం ఆదివారం ఉదయాన్ని ప్రశాంతమైన సమయంలో ఇంద్రియాలు ఎప్పుడు కూడా లోపల వెతుకుతాయా బయట వెతుకుతాయా ఈ ప్రశ్నకి మీరు ప్రతిసారి ఒక ప్రశ్నకి సమాధానం ఆలోచించండి. ఇంద్రియాలు లోపలికి వెతుకుతాయా బయటకి వెతుకుతాయా కళ్ళు లోపలికి చూస్తున్నాయా బయటకి చూస్తున్నాయా చెవులు బయట వింటున్నాయా లోపల వింటున్నాయా కదా లోపల వింటున్నాయా లోపల చెప్పేది వింటున్నాయా అసలు చెవులు బయటవే వింటున్నాయిగా ఈ భగవంతుడు ఇంద్రియాలను బయటకి చూసే విధంగా నిర్మించాడు అందుకే మనిషి ఎప్పుడు ఐదు ఇంద్రియాలతో బయట
(47:16) ప్రపంచాన్నే చూస్తాడు ధనం కోసం బయట వెతుకుతాడు గౌరవం కోసం బయట వెతుకుతాడు ప్రేమ కోసం బయట వెతుకుతాడు ఆనందం కోసం బయట వెతుకుతాడు కానీ లోపల ఉన్న శాంతి మనశశాంతిని మాత్రం వెతికే ప్రయత్నం చేయడు. అందుకే యోగా ఏం చేస్తుంది అంటే బయటకి వెళ్ళటాన్ని తగ్గించి లోపలికి వెళ్ళటాన్ని ప్రారంభిస్తుంది దట్ ఈస్ రియల్ యోగ జాగ్రత్తగా అర్థం చేసుకోండి యోగా ఏం చేస్తుంది అంటే అన్ని బయటికే వెళ్తుంటాయి ఇవి ఎప్పుడూ కూడా ఆ బయటికి వెళ్ళటాన్ని తగ్గించి లోపలికి వెళ్ళటాన్ని ప్రారంభిస్తుంది.
(47:51) అందువల్ల మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దామా ఇప్పటిదాకా పుట్టినప్పటినుండి బయటికే తీసుకెళ్ళాం ఐదు ఇంద్రియాలని బయటే చూపించాం ఎప్పుడు మీరు ఏమనుకుంటారు మీ పిల్లలు ఏమంటారు ఎప్పుడు ఇంట్లో వస్తే అమ్మా ఎప్పుడు ఇంట్లోనే ఉంచుతావా ఎప్పుడైనా బయటే తీసుకెళ్లొచ్చు కదా అమ్మ ఎప్పుడు టీవీలో సినిమానేనా ఎప్పుడైనా పెద్ద స్క్రీన్ మీద సినిమా చూపించొచ్చు కదా ఎప్పుడు ఇక్కడేనా సెలవులు వస్తే ఊరు వెళ్లొచ్చు కదా అంటారు కదా ఎంతసేపు ఇంద్రియాలతో బయటే చూస్తారా బయటే వింటారా అంటే లోపల కూడా చూసే ప్రయత్నం చేద్దామా ఆ లోపలికి వెళ్లే ప్రయాణమే అంతర్ముఖ
(48:24) ప్రయాణం. ఎస్ నిజంగా మనకు కనిపిస్తున్న ప్రపంచం బయట ఉందా కాదు అది మన మన మెదడు నిర్మించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ రైట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పుష్పం ఉందండి ఒక తోటలో ఒక తోటలో పుష్పాలు పూసినయి పువ్వులు ఉన్నాయి ఒక కవి ఆ పుష్పాన్ని చూడంగానే కవిత్వం రాస్తాడు పుష్పం చూడంగానే కవికి దాన్ని తెంచాలి దేవుడి దగ్గర పెట్టాలి లేకతే ఆడవాళ్ళకి తలలో పెట్టుకోవాలి అనిపించదండి ఒక కవి లోపల నుండి పొంగుక వస్తాడు కవిత్వం రాస్తాడు ఒక సైంటిస్ట్ చూసాడు అనుకోండి దాని వెనుకున్నటువంటి సైన్స్ జీవశాస్త్రాన్ని చూస్తాడు ఆ పుష్పము ఏ విధంగా ఏ జాతికి సంబంధించింది ఎక్కడి
(49:06) నుండి వచ్చింది దీని జీవిత కాలం ఎంత దీని తర్వాత ఏమవుతుంది ఇది మళ్ళ ఇంకో పుష్పాలకి అవసరమైన విత్తనాన్ని ఇస్తుందా ఇదంతా సైన్స్ అది ఒక జీవశాస్త్రాన్ని చూస్తాడు. అదే ఒక బిజినెస్ పర్సన్ చూసాడు అనుకోండి ఏం చేస్తాడు ఈ పూలు మార్కెట్ లో ఎంత ఉంటాయి రేట్ ఎంత ఎక్కడ పండుతాయి ఇది వేస్తే పంట ఎంత వస్తుంది ఆలోచిస్తాడు.
(49:28) అదే ఒక భక్తుడు చూసాడు అనుకోండి అబ్బా భగవంతుడు సృష్టి ఎంత గొప్పది అని ఆలోచిస్తాడు. పుష్పం ఒక్కటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి పుష్పం ఒక్కటే ప్రపంచం మారలేదు దాన్ని చూసేటువంటి దృష్టి మారుతూ ఉంటుంది. ప్రపంచం ఎప్పుడూ మారలేదండి కాబట్టి ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను మీకు. మీ చుట్టూ ఉండే వ్యక్తులు మీ జీవితంలో సంఘటనలు మీరు చేస్తున్న ఉద్యోగాలు అనుభవిస్తున్న ఆస్తులు అంతస్తులు మీ జీవితాన్ని మార్చింది ఈ చుట్టూ ఉన్న మీ ప్రపంచమా లేదా మీ జీవితాన్ని మార్చేది ఆ ప్రపంచాన్ని చూసే మీ దృష్టికోణమా ప్రశ్న అర్థమైందా అసలు అర్థం కాలే
(50:14) మీ జీవితాన్ని మార్చేది మీ చుట్టూ ఉండేటువంటి ఇప్పటిదాకా నేను చెప్పిన వ్యక్తులు మీ ఉద్యోగాలు వ్యాపారాలు ఆస్తులు అంతస్తులుఅని అన్నిటి దగ్గర ప్రపంచం అనుకుందాం ఇన్ని పదాలు ఎందుకు గాని మీ జీవితాన్ని మార్చేది ఈ ప్రపంచమా లేదా అలాంటి ఆ అంత పెద్ద ప్రపంచాన్ని చూసే మీ దృష్టికోణమా దీనికి ఆన్సర్ వచ్చిన రోజే మీకు రియల్ సాధన స్టార్ట్ అవుతుంది.
(50:43) ఈ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవ్వరూ మీ జీవితాన్ని మార్చేవారు కాదు ఆ వ్యక్తులని మీరు చూసేటువంటి దృష్టికోణమే మీ జీవితాన్ని మారుస్తుంది. కనుక ఇంద్రియాలు కేవలం బయటకి చూసినప్పుడు వారి పట్ల వాటి పట్ల విభిన్నమైనటువంటి [గొంతు సవరించుకోవడం] మీకు నిర్దిష్టమైనటువంటి కొన్ని భావజాలాలు ఏర్పడతాయి. వీరు మంచివారు వీరు చెడ్డవారు వీరు పనికివచ్చేవారు వీరు పనికి రాని వాళ్ళు వీళ్ళు స్నేహితులు వీరు శత్రువులు వీళ్ళు మోసకారులు వీళ్ళు మంచివాళ్ళు ఇవన్నీ ఏర్పడతాయి ఇప్పుడు ఇంద్రియాలు బయటకి చూసినప్పుడు జీవితం డిఫరెంట్ గా ఉంటుంది అది ఇంద్రియ ఏమఉంది ఏమవుతుంది
(51:27) అవతల పట్ల మీకు అవతల వారి పట్ల అవతల వ్యక్తుల పట్ల ప్రపంచం పట్ల ఏర్పడింది మీ పర్సెప్షన్ మీ లోపల చిత్తంలో సమాచారాన్ని బట్టి మీకు అర్థమైంది అబ్బా ఈ రాష్ట్రంలో అంతా ఇట్లే ఉంటారు. ఇప్పుడు ప్రాంతాల మధ్య గొడవ అవుతుంటే ఒకడు ఇంకొక ప్రాంతాన్ని తిడుతున్నారు కదా చూసుకోండి ఎందుకు వాడు లోపల ఈ ప్రాంతం పట్ల ఏ సమాచారం ఉందో దాన్ని బట్టే బయటకి చూసినాడు అదే కనపడతా ఉంది.
(51:52) అదే ఈ ఐదు ఇంద్రియాలను విత్రాలు చేసి లోపలికి చూడండి. సత్యం కనపడుతుంది. సో సత్యము గోచరం అవ్వాలి అంటే బాహ్యముఖ ప్రయాణం కాదు అంతర్ముఖ ప్రయాణం చాలా మంది అనుకుంటారు ఆధ్యాత్మిక మార్గం అంటే ఇంద్రియాలను అలిచి వేసుకోవడం బలవంతంగా నాలికను చంపేసుకోవడం ఉప్పును మానేయడం కారం మానేయటం అసలు వాటిని ఆపి వేస్తే కళ్లే కనపడకపోతే భగవంతుడు సృష్టిని ఎలా చూస్తాం చెవులే సరిగ్గా వాడకపోతే గురువుల బోధనలు ఎట్లా వింటాం నాలిక సరిగ్గా ఉపయోగించకపోతే మంత్రాలను ఎట్లా జపిస్తాం చేతులని వాడకపోతే కర్మేంద్రియాల్లో సేవలు ఎట్లా చేస్తాం కాళ్ళే సరిగ్గా మనం పూర్తిగా ఉపయోగించి మడత పెట్టి కూర్చుంటే ఎట్లాగా సేవలు
(52:27) చేయడానికి ఎలా ఆ ప్రదేశానికి ఎలా వెళ్తాం అందువల్ల సమస్య ఇంద్రియాల్లో లేదు వాటిని ఉపయోగించుకునేటువంటి బుద్ధి మీద ఆధారపడి ఉంది. వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటారో మీ ఇష్టం ఒక మూడే మూడు స్థితులు చెప్పేసుకొని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లోజ్ చేసుకుందాం చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది మళ్ళీ నెక్స్ట్ 19 వ తేదీ జరిగే సత్సంగంలో కంటిన్యూ చేసుకుందాం.
(52:49) ప్రతి ఇంద్రియము మూడు విధాలుగా పనిచేస్తుంది మీరు ఏ స్థితిలో ఉన్నారో చెక్ చేసుకోండి ప్రస్తుతం అల్టిమేట్ ఇది ఒకటి బానిస స్థితి ఇంద్రియాలు ఎప్పుడు బానిస స్థితిలో ఉండకూడదు బానిస స్థితి అంటే ఏంటి ఇంద్రియ ఏం చెప్తే మనిషి అది చేస్తాడు ఇందాక చెప్పాను యు ఆర్ ద బాస్ రథంలో కూర్చున్నటువంటి యజమాని మీరు మీరు చెప్పాలి ఇంద్రియాలకి అటుపో ఇటుపో అని కానీ అవి ఎటు తీసుకుపోతే అటు పోతున్నాడు రథంలో కూర్చున్నవాడు ఆకలి లేకపోయినా తింటాడు ఎందుకు ఇంద్రియం కోరింది కాబట్టి ఆకలి వేసినప్పుడు మీరు చెబితే నాలక తినాలి దెన్ యు ఆర్ ద బాస్ ఎట్లా పడితే అట్లా పకోడీలు బజ్జీలు
(53:30) పునుగులు పాప్కార్న్లు గొట్టాలు ప్యాకెట్లు ఎగబడి తింటున్నామ అంటే హూ ఇస్ ద బాస్ యువర్ టంగ్ ఇస్ ద బాస్ [నవ్వు] కాబట్టి అవసరం లేకున్నా కొనడం కళ్ళు చాలా పిచ్చివి చూడంగానే అదిగొని ఎదుకొని అంటారు ఇదిగో ఇది సూపర్ మార్కెట్ పోంటే బాస్కెట్ మొత్తం నింపుకొస్తారు పోయింది ఒక్కదాని కోసం అదప్ప అన్ని బుట్టలు వేసుకొస్తారు మీరు వేసుకోవాలి బుట్టలో మిమ్మల్ని వాడేసాడు బుట్టలో ఆ దుకానం వాడు వేసాడు బుట్టలో కారణం ఏంటి అవసరం లేకుండా కొనేటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయినారు ఉపయోగం లేకపోయినా అసలు అవసరమే పని లేకపోయినా మొబైల్ చూస్తూ ఉంటారు పనా సమాచారమా ఏదనా మీరు ఎవరికైనా
(54:06) ఇన్ఫ్లయెన్స్ చేయాలనుకుంటున్నారా కాదు చూస్తున్నారు అవసరం లేక మొబైల్ వాడటం ప్రయోజనం లేదని తెలిసిన గంటలు ధరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం మీ మనస్థితికి తగ్గట్టుగా వీడియోలని ఎతుకోవడం మీకు విషయం తెలుసా అండి మీరు ఒక్కసారి మీ మనోస్థితిని తగ్గట్టుగా ఒక రెండు వీడియోలు చూడండి మీకు వద్దన్నా ప్రపంచంలో ఎంతమంది ఆ మెంటల్ బ్యాచ్ వీడియోలు చేశారో ఆ వీడియోలున్నీ మీకే వస్తాయి దట్ ఇస్ కాల్డ్ అల్గరిథం అరే నాకేం ప్రైవసీ లేదా నా బ్రెయిన్ తెలిసిపోయిందా ఫోన్ మీ బ్రెయిన్ ఎవడికీ తెలియదు అంత టెక్నాలజీ ఇంకా రాలేదు కానీ మీరు ఒకటి రెండు చూసిన తర్వాత మీరు
(54:42) దుఃఖమైనటువంటి విషాదమైన రీల్స్ రెండు చూశరనుకోండి ఈ ప్రపంచ ప్రపంచంలో పనికిరాని పిచ్చి బ్యాచ్ ఎవడైతే విషాద గీతాలు పాడుకుంటూ రిలీజ్ చేశడో అవే వస్తా ఉంటాయి ఆ వీడియోలో మీకు వస్తా ఉంటాయి. మీరు కామెడీకి సంబంధించిన రెండు మూడు చూశారు అనుకోండి ఇక రోజు మొత్తం మీకు అవే వస్తుంటాయి. మీరు షాపింగ్ కి సంబంధించి బట్టలు గిట్టలు చూసారా ఆ బట్టలు అమ్మేవాడు అట్లాంటి మెటీరియల్ ఎవడు అమ్ముతాడో ఆ యాడ్స్ కూడా మొత్తం మీకు వస్తా ఉంటాయి.
(55:05) అన్ని మీకు ఎక్స్పీరియన్స్ే కదా ఒక్కసారి మీరు చూస్తారు తర్వాత మిగిలిందంతా వాడు చూపిస్తాడు బలవంతంగా మీకు ఒక్కసారి మీరు అవసరమే సెర్చ్ చేశారు తర్వాత వాడు మీకు రోజంతా వాడి పైత్యాన్ని మీ బ్రెయిన్ లో కుక్కుతాడు కూరుస్తాడు ఇది జరుగుతోంది ప్రస్తుతం సో మీ లైఫ్ మీ చేతుల్లో లేదు సోషల్ మీడియా చేతుల్లో ఉంది మీ లైఫ్ మీ మొబైల్ చేతుల్లో ఉంది మీరు అనుకుంటారు మీ చేతుల్లో మొబైల్ ఉందని పిచ్చివాళ్ళు మొబైల్ చేతుల్లో మీ లైఫ్ ఉంది.
(55:40) [నవ్వు] మీ చేతిలో మొబైల్ లేదు కాబట్టి ఇంద్రియము బానస స్థితి ఏంటంటే వాటికి పూర్తిగా ఎడిక్ట్ అయిపోవటం దాని నుండి బయట పడలేకపోవటం నిన్న నేను ఈ సత్సంగాన్ని నాకు రాజేష్ ఒక ఫోటో చేసి పంపించాడు ఈ టైం అని పెడదాం అని చెప్పేసి సోషల్ మీడియాలోకి వెళ్ళను చూద్దాం ఫోటోతో సహా పెడదాం ఊరికని పెడితే వెళ్ళంగానే ఒక పిచ్చి పంచాయతీ కనపడింది నాకు సరే దానికి ఆమెకి తెలిసినవాళ్ళు మీకు ఎవరైనా అనుకోవచ్చు కానీ ఏదో పర్సనల్ లైఫ్ పర్సనల్ ఇష్యూ ఫ్యామిలీ ప్రాబ్లం సోషల్ సోషల్ మీడియాలో పంచాయితి సూసైడ్ ఏదో సరే చూద్దాం నాలెడ్జ్ చెప్పడం కలిగింది అని చెప్పి నేను దాన్ని స్క్రోల్ చేస్తే ఎంత
(56:17) పిచ్చి ప్రపంచం అంటే రెండు గ్రూపులు అయిపోయి ఆమెని విమర్శించేవాళ్ళు ఆమెను ప్రోత్సహించేవాళ్ళు రకరకాల స్టేట్మెంట్లు దానికి జడ్జిమెంట్లు ఇంత ఖాళీగా ఉన్నారా అనిపించింది మనుషులు ఇంత ఖాళీగా ఉన్నారా ఇంత పిచ్చి ప్రపంచమా సమయం సరిపోతే 24 గంటలు చచ్చిపోతా ఉంటే ఇక్కడ ఇంత పిచ్చోళ్ళు ఉన్నారా భూమిమీద వ్యక్తిగ వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేసుకొని కక్కేసుకొని సంసారం అంతా రోడ్డు మీదకి పడేసుకొని తర్వాత దానికోసం నాకు తీర్పు చెప్పండి జనాలని అడుక్కొని ఆ తీర్పు సరిగ్గా లేకపోతే రకరకాల వాళ్ళకి వాళ్ళే దేహాన్ని నివసించుకొని
(56:54) దానికోసం మళ్ళీ సపోర్టర్స్ దాన్ని మళ్ళీ వ్యతిరేకించేటువంటి వాళ్ళు అనిపించింది అదృష్టం మనం ఇంకా దానికి బానిసలం కాలేదు. బానిసలం కాలేదు అమ్మలారా మీ ఆనందము మీ దుఃఖము మీకున్న ప్రసిద్ధ పరిస్థితి తాత్కాలికమైన సత్యం తెలుసుకుంటే దాన్ని రుక్కుపోటు నిజంగా క్షణాల్లో బయట పడవలసిన దాన్ని మీ సోషల్ మీడియా ఏం చేస్తుందో తెలుసా మిమ్మల్ని బయటకి రాకుండా అదే వీడియోలు అదే రీల్స్ చూపించి చూపించి చూపించి మిమ్మల్ని ఊబిలోకి లాగుతుంది.
(57:27) అది తెలియక మీరు ఏమనుకుంటున్నారుంటే ఎవడితోనో బాధ కోపం వస్తే కొద్దిసేపు పట్టుకొని పట్టుకోవాలి మీరు పట్టుకోవాలి అది మీ జీవితాన్ని పట్టుకుంది ముసలు పట్టుకున్నట్టుగా అందువల్ల ఇవాళటి బానిస స్థితి నుండి బయట పడండి రెండు నియంత్రిత స్థితి కంట్రోలింగ్ స్టేట్ ఇంద్రియాలని కంట్రోలింగ్ స్టేట్ ఇప్పుడు మనిషి తనకు అవసరమైనప్పుడే ఇంద్రియాలను ఉపయోగిస్తాడు.
(57:49) ఇది బాలెన్స్డ్ లివింగ్ అవసరమైనప్పుడే ఉపయోగిస్తాడు ఇంద్రియాలని అవసరం లేకపోతే లైక్ ఎగ్జాంపుల్ చెప్పగలరా తాబేలు తాబేలు అవసరమైనప్పుడు తల బయటకి పెడుతుంది కాళ్ళు బయటకి పెడుతుంది ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి డెప్పలోకి దూర్చుకొని గమ్మును ఉంటుంది అంతే దానికి ఏదో ఇబ్బందో కష్టం వస్తుంది పనికి రాని సిచువేషన్ ఎదురైతుంది అనంగానే ఆ తాబేలు ఏమైపోతుంది లోపలికి దూరిపోతుంది కాబట్టి మనిషి కూడా అంతే కంట్రోలింగ్ స్టేట్ ఉంటే అదే థర్డ్ వన్ యోగస్థితి ఇది బానిస స్థితి కాదు నియంత్రిత స్థితి కాదు యోగ స్థితి ఈ కళ్ళు ధ్యానానికి ఉపయోగిస్తారు కళ్ళు మూసుకొని
(58:35) ఈ చెవులు సత్సంగానికి ఉపయోగిస్తారు నాలిక మంత్ర జపానికి ఉపయోగిస్తారు చేతుల సేవకు ఉపయోగిస్తారు. మీ మనసని ఆరోగంద్రియాన్ని నిరంతరం ఆధ్యాత్మికమైన మార్గం వైపు ఉపయోగిస్తారు ఇది యోగి యొక్క జీవితం రైట్ కనుక మీరు బానిస స్థితిలో ఉంటారా నియంత్రిత స్థితిలో ఉండి ఏదో వాడుకొని పక్కన పడేస్తారా లేదా యోగ స్థితిలోకి వెళ్తారా అది ఆలోచించుకోండి.
(59:06) ప్రతి ఇంద్రియానికి ఒక బలహీనత ఉంటుంది దాన్ని జయించే ప్రయత్నం చేయండి. ప్రతి ఇంద్రియము కండు రూపానికి ఆకర్షితమ అవుతుంది. చెవులు ప్రశంసలకు బానిస అవుతాయి. నాలిక [గొంతు సవరించుకోవడం] రుచులకు బానిస అవుతుంది ముక్కు సువాసనలకు బానిస అవుతుంది చర్మము సుఖాలకు బానిస అవుతుంది. ప్రతిదానికి ఒక బలహీనత ఉంది ఇంకొక్క పాయింట్ చెప్పుకుందాం సందర్భం వచ్చింది కాబట్టి అయితే ఇంద్రియాలన్నీ ఎట్లా ఇట్లాగా మనకి బలంగా మారిపోతున్నాయి మన కంట్రోల్ అయినట్టుగా ఒకసారి చూస్తాం తర్వాత మళ్ళీ చూడాలనిపిస్తుంది.
(59:40) చూసి చూసి అది అలవాటు అవుతుంది. అలవాటు ఏమవుతుంది కచ్చితంగా చూడాల్సిన అవసరంగా మారుతుంది జస్ట్ దృష్టి గురించి చెప్తున్నా ఇదన్నిటికీ వర్తిస్తుంది ఫస్ట్ ఒకసారి చూస్తాం బాగుంది కదా రెండోసారి చూస్తాం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి చూస్తాం చూడకపోతే ఉండలేని విధంగా అలవాటు అవుతుంది. ఆ అలవాటు కచ్చితంగా చూడాల్సిన అవసరంగా మారుతుంది.
(1:00:04) ఆ అవసరం ఏమవుతుంది వ్యసనంగా మారుతుంది. వ్యసనం ఏమవుతుంది చివరికి బానిసగా చేస్తుంది. అన్నిటికీ వర్తిస్తుంది. ఈ పిచ్చి విషయాలు వినాలనుకుంటారు. ఫస్ట్ అది వినడంతో మొదలవుతుంది. విని విని అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు అవసరం అవుతుంది వినకపోతే పక్కవాడి గురించి ఇవాళ అది లేదు పొగడితే అనుకుందాం పొగడితే ఫస్ట్ మీకు ఇద్దరు పొగడితే హాయిగా అనిపించింది.
(1:00:33) పొగడించుకోవాలనిపించింది. ఇతరులు పొగడతలకు అలవాటు పడ్డాం అవి లేకపోతే ఉండలేని అవసరంగా మారింది. చివరికి డబ్బులు ఇచ్చి పొగడించుకుంటారు చాలా మంది శాలవాలు కప్పించి సన్మానాలు చేయించుకొని ఉగాది పురస్కారాలు కొనుక్కుంటుంటారు. అనేక చోట్ల రకరకాల ఈ ఇంటర్నేషనల్ యోగా డేలో డబ్బులు ఇచ్చి పిలిపించుకొని జరిగిన యోగా సెషన్స్ కూడా చాలా ఎందుకు అది చెవులు ఆ పొగడతలకి అలవాటు పడిపోయినాయి.
(1:00:58) వ్యసనపరులు అవుతారు తర్వాత దానికి బానిస అయిపోతారు రాజుల కాలంలో ఆ బానిసత్వాన్ని ఉపయోగించుకొని అనేకమంది బతికారు రాజాధిరాజ యోగిరాజ ఆ రాజ ఈ రాజ అని పిలిచి పిలిచి పిలిచి చివరికి వాళ్ళకి రాజుగారు ఆ పొగడతలకి మెడలో అయిందంటే తీసివాడు చైన్ తీసి ఉంచుకో ఉంగరం తీసి ఉంచుకో ఇగో వాడికి ఈ చివరన్న ఒక అంద ఎకరాలు వాడికి ఇచ్చేసేయ్ అయిపోయింది అంతే కారణం వాడి చెవులు పొగడతలకి బానిస అయిపోయినాయి కాబట్టి అందుకని ఈ కండ్లకి కి మీరు రూపానికి బానిస అనంతమైనటువంటి ప్రకటనలు ఆకర్షణ దృశ్యాలు వీడియోలు చెవులకి శబ్దంతో ఉండేటువంటి గాసిప్స్ అంటే ఇతరుల గురించి చెప్పే
(1:01:38) పుకార్లు గాని నిరంతరం వచ్చే కింగ్మని నోటిఫికేషన్ సౌండ్ అనంగానే పరిగెడతాడు ఫోన్ దగ్గరికి అదంత అర్థం కా నోటిఫికేషన్ మీకు అవసరమే మీరు చూస్తున్నారా వాడికి అవసరం వాడు పంపించాడా వాడికి అవసరం వాడు పంపించాడు వాడు అవసరానికి మీరు ఎందుకు పాపలాడాలి అర్థమవుతుందా ఆ పాయింట్ అండి వాడు అవసరానికి వాడు టింగ్ అని ఒక నోటిఫికేషన్ పంపించాడు వాడి అవసరానికి మీరు ఎందుకు బట్టలు చించుకో ఏదో వచ్చింది మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చింది ఈ చెవులు నోటిఫికేషన్ కోసం పరుగులు పెడతా ఉన్నాయి రింగ్ సౌండ్ వినపడితే చాలు బుటలో ఉన్న
(1:02:06) పాము నాగస్వరం ఏంటి లేచినట్టుగా లేస్తా ఉంటారు. [నవ్వు] కదా నాలిక అధికమైన టేస్ట్ కి అధిక ఉప్పుకి అధిక చెక్కరకి అధిక కారంకి ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కి బానిస అయిపోయింది. కృత్యమైనటువంటి ఈ వాసనలకి అగరబత్తీలకి సెంటల్కి పర్ఫ్యూమ్లకి ముక్కు బానిస అయిపోయింది. సౌకర్యాలకు అలవాటు పడటం చిన్న కంఫర్ట్ డిస్కంఫర్ట్ వస్తే భరించలేకపోవడం చర్మం బానిస అయిపోయింది.
(1:02:34) కాబట్టి ఇంద్రియాలని ఎప్పటికప్పుడు షైన్ చేసుకునే మార్గాన్ని మనం తెలుసుకుందాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఒక గ్రామంలో ఇద్దరు కట్లు కొట్టేవాళ్ళు ఉన్నారంట ఎవరున్నారు ఇద్దరు కట్లు కొట్టేవాడు ఒకడు రోజంతా చెట్టు నరికేవాడంట మరొకడేమో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆగి ఆ గొడ్డల్ని ఏం చేసేవాడు పదును పెట్టేవాడు ఎవరు ఎక్కువ కట్లు కొట్టేవాళ్ళు సాయంకాలకి ఆపకుండా కొట్టేవాడా రెండు గంటలకు ఒకసారి బ్రేక్ తీసుకొని గొడ్డకి పదును పెట్టేవాడా ఎవరు ఎక్కువ కట్లు కొట్టేవాడు మనం ఏమనుకుంటాం నాన్ స్టాప్ కొట్టేవాడు ఎక్కువ కట్లు కొడతాడు అనుకుంటాం సాయంత్రానికి
(1:03:08) రెండోవాడు ఎక్కువ పని పూర్తి చేసేవాడు ఈ గొడ్డల పందిని పెట్టేవాడు ఫస్ట్ వాడు అడిగేవాడుంట అరే నేను ఒక్క నిమిషం కూడా ఆపలేదురా నువ్వు రెండు గంటలకు ఒకసారి పావు గంట పావు గంట ఆపి దాన్ని ఏదో గీకుతున్నావ్ మళ్ళీ కొడతా ఉన్నావు నీకు ఎక్కువ పని అయిపోయింది అంటే చెప్పాడంట నేను పని మాత్రమే చేయలేదు ఆ పని చేసే సాధనాన్ని నేను కాపాడుకున్నా రక్షించుకున్నా మనం కూడా అంతే ఈ ప్రపంచంలోనే గంటలు గంటలు పని చేస్తున్న అంత పని ఇంత పని చేస్తున్నా కాదు ఆ పనిని చేయటానికి మూలమైన ఇంద్రియాలని సంరక్షించుకోవాలి కాపాడుకోవాలి ఆ కాపాడుకునేటువంటి శిక్షని
(1:03:43) ఇక్కడ మేము ఇచ్చేటువంటిది కాబట్టి ఈ ప్రపంచంలో యుద్ధం బయట లేదు మిత్రులారా మన కండ్లకు కనిపించే దృశ్యానికి దేనికి మధ్య యుద్ధం జరుగుతుంది మొదటిది నేను చెప్పి ఆపానంటే రెండోది మీకు స్ట్రైక్ అవ్వాలి యుద్ధం బయట లేదు మన కళ్ళకు కనిపించే దృశ్యానికి తర్వాతది మన లోపల దాన్ని చూడాలా వద్దా తీసుకోవాలా వద్దా అని చెప్పే వివేకానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది.
(1:04:14) ఇది చూడదగినదా చూడకూడనిదా చూస్తే మరలా చూడదగినదా పొరపాటం చూస్తే రెండోసారి చూడకూడనిదా అనే దాని పట్ల ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. మన చెవులకు వినిపించే మాటలకు మన లోపల అంతరాత్మకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. మన నాలిక కోరుకునే రుచులకు మన ఆరోగ్యానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో గెలిచిన వారే నిజమైనటువంటి యోగులు అవుతారు. కాబట్టి మీ ఇంద్రియాలకి మీ లోపల వివేకానికి అంతరాత్మకి ఆరోగ్యానికి ఆధ్యాత్మిక చింతనకి జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో దాన్ని బట్టే మన జీవితం ఉంది.
(1:04:54) ఇప్పుడు చెప్పండి ఎవరు గెలవాలి? మీరు ఎవరిని గెలిపించాలి? ఎవరిని గెలిపించాలి మీరు ఆ రెండో యుద్ధం చేస్తున్నప్పుడు దాంట్లో మీరు ఏ పాత్ర పోషిస్తారు పాండవులు కౌరవులు యుద్ధం చేయాలనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు ఎవరి పక్షాన ఉండి యుద్ధాన్ని గెలిపించాడు సో మీరు శ్రీకృష్ణ పరమాత్మ లాగా మీ ఇంద్రియాలకి మీ లోపల ఉండే అంతరాత్మకి జరిగే యుద్ధంలో మీరు మీ ఆధ్యాత్మిక సాధన లైక్ శ్రీకృష్ణ పరమాత్మ మీరు గౌరవ ల పక్షాన ఉండి ఇంద్రియాలను గెలిపించారు అనుకోండి జీవితంలో లాస్ అయిపోతాం.
(1:05:37) అదే మనము వివేకాన్ని అంతరాత్మకి ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకి మద్దతి ఇచ్చి గెలిపించామ అనుకోండి ప్రపంచానికి ఒక గొప్ప మార్గాన్ని చూపించిన వాళ్ళు అవుతారు. సో ఈరోజు నుండి అటువంటి సాధన చేయండి. అందువల్ల మీరు వీటి గురించి మరలా మనం కావాలనుకుంటే వివరంగా మాట్లాడుకుందాం ప్రతి ఒక్క ఇంద్రియాని గురించి ఒక కాన్సెప్ట్ ఉంది ఒక ప్రాక్టీస్ ఉంది కన్ను దృష్టి యొక్క శక్తి ఏ విధంగా ఉపయోగించుకోవాలి చెవి గ్రహణ శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి కనుక మీరు ఈ కాన్సెప్ట్ ని మరలా అవకాశం ఉంటే తదుపరి సెషన్ లో మనం కంటిన్యూ చేసుకునే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనకి ఈ భూమ్మీద ప్రతి జీవికి ఇంద్రియాన్ని
(1:06:26) ఇచ్చాడు భగవంతుడు అన్ని జీవులకి ఇంద్రియాలు ఉన్నాయి. కళ్ళు పక్షులకి బాగా కనపడతాయి. కొన్ని వందల మీటర్లు ఎత్తి నుండి కూడా చిన్న కోడి పిల్లను చూసి గద్ద లాక్కెళ్ళిపోతుంది. కుక్కకి చెవులు వాసన రెండు బాగా శబ్దము అండ్ వాసన గ్రహించటం యజమాను వస్తే తోకోపుతుంది దొంగ వస్తే మీద పడుతుంది. దేహంలో విడుదలయ్యే రసాయనాలను బట్టి కూడా వీడు దొంగన యజమాని గుర్తించగలిగే శక్తి ఉంది ఒక చిన్న నేరం జరిగిన చోట ఒక వాసన చూపిస్తే అది కిలోమీటర్ దూరం పరిగెత్తేన ఆ నేరస్తుడిని పట్టుకునేటువంటి వాసన గ్రహించే శక్తి కుక్కలకు ఇచ్చాడు భగవంతుడు చిన్న చిన్న శబ్దాలను కూడా వినగలుగుతుంది
(1:07:06) మనిషికి వినపడినటువంటి శబ్దాలని వినేటువంటి లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వాల్యూమ్స్ ని కూడా వినగలిగే శక్తి భగవంతుడు జంతువులకు ఇచ్చాడు. పాముకి చర్మం బాగా పనిచేస్తుంది. అలాగే ఒక్కొక్క జీవికి ఒక అద్భుతమైన శక్తిని ఇచ్చాడు. అదే అదృష్టమో దురదృష్టమో గానీ మనిషికి మాత్రం ఐదు ఇంద్రియాలని యాక్టివేట్ చేశాడు. ఇందాక చెప్పింది బలాలు చెప్పాను ఒక్కసారి బలహీనతలు చెప్తాను ఒక్కసారి ఈ ఐదు ఇంద్రియాలకి లొంగిపోయి జీవితాన్ని కోల్పోయే జీవులు కూడా ఉన్నాయి.
(1:07:43) మీకు తెలుసా ఏనుగుకు ఏనుగుని ఎలా బంధిస్తారో ఏనుగుకి చర్మ సుఖం ఎక్కువ కోరుకుంటదండి దాని భార్య కాయం కాదు అది దానికి సుఖం ఎక్కువ కోరుకుంటా ఉంటది అది ఎక్కడనా రుద్దుకోవాలనుకుంటా ఉంటది ఏం చేస్తారంటే ఒక బండరాయి లాగా సెట్టింగ్ చేసి కింద గొయ్యి తీసి ఆ గొయ్యి పైన గడ్డిలాగా టెంపరరీగా వేసి ఒక బండరాయిని పెట్టి అది రుద్దుకోవడం కోసం ఏనుగు రావడానికి అన్ని సెట్టింగ్ చేస్తారు రాజమౌలి సినిమా సెట్టింగ్ లాగా అది అది ఏం చేస్తుందంటే శరీర సుఖం కోసం పోయి బండరాయి రుద్దుకోవాలని చూసి ఆ గుంతలు పడిపోతుంది.
(1:08:15) ఇ పైకి లేవాలనంత పద అడుగుల పైన గోయి తవ్వుతారు దానికి పైకి రాలేదు ఆ భార్య కాని ఎక్కలేదు ఏనుగుని బంధిస్తారు. వేటగాడు ఏం చేస్తాడు దానికి కావాల్సిన ఎరేస్తాడు శరీర సుఖాన్ని ఈ చర్మ సుఖము కోరుకునే మానవులందరూ కూడా ఆ మాయలో పడిపోతూ ఉంటారు. అన్ని డ్రాప్ చేసి భారతదేశపు మిలిటరీ రహస్యాలను విదేశస్తులు దొంగలించినట్టుగా కేవలం శరీర సుఖం అది శరీర సుఖము ఎప్పుడైతే చర్మం సుఖాన్ని కోరుకుంటూ ఉంటుందో మానవుడు అనేవాడు వాటిలో పడిపోతూ ఉంటాడు.
(1:08:53) మీరు జింకల్ని గమనించండి ఆ జింకలు అద్భుతమైన సంగీత స్వరములు వినబడితే అవి ఆడుతున్నట్టుగా ఉంటాయి. జింకల్ని వేటాడే వేటగాడు ఒక అద్భుతమైన శబ్ద తరంగాన్ని సృష్టిస్తాడంట. అది ఏమవుతుంది చెవులలో వ్యక్కిన పడేటువంటి శద్ద తరంగాలకు బానిస అయిపోయి వేటగాడి యొక్క వలలో పడిపోతుంది. వేటగాడి వలలో పడిపోతుంది. మీకు తెలుసా మిడతలు మంటకు దగ్గరలోకి వెళ్తాయి రూపానికి ఆకర్షించబడతాయి అవి కంటికి ఆకర్షణ రూప ఆకర్షణకి లొంగిపోతాయి మిడతలు లొంగిపోయి ఏమైపోతాయి మంటల్లోకి పోయి కాడిపోతాయి.
(1:09:28) తెలుసా మిడత లైఫ్ ఏమవుతుందో మిడత మంటలోనే కాలిపోతున్నాడు అది ఎక్కువసేపు ఎందుకు దానికి రూప ఆకర్షణ ఎక్కువ వెలుగుతూ ఉన్నదంటే వెలుగు కనపడదంటే వెళ్ళిపోతుంది చేప నాలిక రుచికి అది చిన్న ఎర పెడితే అది రుచి కోసం వచ్చి ప్రాణాన్ని కోలిపోతుంది. గాలానికి చిన్న ఎర పెట్టి ఒక మాంసం ముక్క పెట్టో ఎర ఏదో ఒకటి పెట్టి వదిలేస్తే ఆ నాలిక రుచి కోసం వచ్చి అది చచ్చిపోతుంది.
(1:09:57) అది చూసుకోండి వాసన సువాసన ఎక్కడఉందో అక్కడికి వెళుతూ ఎవరు తుమ్మెద ఆ వాసన పీలుస్తూ లోపల ఉండి అలా ఉండిపోతే సూర్యాస్తమయకి ఏమవుతుందో తెలుసా పుష్పాలన్నీ మూసుకుపోతాయి అది మూసుకుపోయి ఆ లోపల వాసన కోసం అది పరిసరాలను కూడా పట్టించుకోకుండా అది పీలుస్తూ చచ్చిపోతుంది లోపలికి ఈ విధంగా మనిషి కూడా ఈ ఐదు ఇంద్రియాలకి బానిస అయిపోతే వాడు ఎక్కడో చోట ఇరుక్కొని పోతాడు.
(1:10:30) అందుకనే సాధన ఏం చెప్తుంది అంటే ఒకే ఒక్కటి ఈ ఐదు ఇంద్రియాలని కూడా మీరు ఆధీనంలో పెట్టుకొని సాధన చేయండి. అడ్వాన్స్ కోర్సులో మనం క్లియర్ గా చెప్పుకున్నాం పతంజలి అష్టాంగ యోగాల్లో ఈ సిలబస్ గురించి అందువల్ల కన్ను ఏమిటి ముక్కు ఏమిటి ఇవ మళ్ళీ ఒక్కసారి మన కాన్సెప్ట్ లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
(1:10:56) ఈరోజు సబ్జెక్ట్ మీకు ఎంతవరకు అర్థమైన అనేది మీరు రిసీవ్ చేసుకునేటువంటి దాని స్థితిని బట్టి ఇవాళ మీ లైఫ్ మారిపోతుంది. ఆలోచించుకోండి ఇవి మనకి శత్రువులు కాదు స్నేహితులు సరిగ్గా వాడుకున్నామా డాక్టర్ చేతిలో కత్తి లాంటిది సరిగ్గా వాడలేదా పిచ్చోడి చేతిలో రాయి లాంటిది. దాన్ని సరిగ్గా వాడుకునే మార్గాన్ని చూపించేవాడే గురువు ఆ గురువు చూపించేటువంటి వాడుకునే విధానమే జ్ఞానము కాబట్టి గురు మార్గంలో జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తూ మీ ఐదు ఇంద్రియాలని మీరు యోగ స్థితిలో ఉంచండి బానిస స్థితిలో కాదు నియంత్రత స్థితిలో కాదు యోగ స్థితిలో ఉంచి మీరు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఆ
(1:11:39) నిగ్రహము నుండి అనంతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి శక్తిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఈ సత్సంగం యొక్క ముఖ్య ఉద్దేశము దీన్ని ఏ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని ఏ విధంగా మనము సాధన ద్వారా అనుభూతిని చెందవచ్చు వాటి పనితీరి ఏమిటి వాటికి భగవంతుడు గీతలో ఏమి చెప్పాడు అనేటువంటి మిగిలిన వివరణని అవకాశం ఉంటే తదుపరి సత్సంగంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే నండి.
No comments:
Post a Comment