పళ్లు వజ్రంలా! వేప శక్తి చూడండి! చిగుళ్లు గట్టిపడతాయి! Herbal Tooth Powder. #healthyteeth
Author Name:FAMILY HEALTH by Dr. Murali Manohar Chirumamilla
Youtube Channel Url:https://www.youtube.com/@familyhealthbydr.muraliman8760
Youtube Video URL:https://www.youtube.com/watch?v=r5aA4oyJGWc
Transcript:
(00:01) [సంగీతం] మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిల మురళి మనోహర్ ఈ వీడియోలో ఒక అద్భుతమైన అంశాన్ని తెలుసుకోబోతున్నాం. దంత సమస్యలకు చెక్ పెట్టేటటువంటి ఆయుర్వేద దంత చూర్ణం దీని తయారీ దీని ప్రత్యేకతలు ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. దంతక్షయం చిగుళ్ల సమస్యలు ఈ రోజులలో ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తున్న అతి పెద్ద ఆరోగ్య సవాల కింద మారాయి.
(00:30) మనం రోజు వాడేటటువంటి కృత్రిమ ఉత్పత్తుల వల్ల తాత్కాలిక రిలీఫ్ దొరికితే దొరకొచ్చు కానీ మూలకారణం అలాగే ఉండిపోతూ ఉంటుంది. ఆయుర్వేద ప్రకారంగా ప్రకృతిలో లభించే మూలికలు ఈ దంతాన్ని దృఢంగా ఉంచేటువంటి అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సహజ దంత చోర్ణం ఈ సమస్యలన్నిటిని కూడా శాశ్వతంగా నివారిస్తుంది.
(00:51) ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ఈ నేపథ్యంలో మీకు నా మిత్రుడైన ఒక డాక్టర్ అనుభవం మీకు చెప్పాలి ఇది ఎంతో మందికి ఉపయోగకరమైన సమాచారం. నా మిత్రుడు ఒక ఎముకల వైద్యనిపుడు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ అతనికి ఎప్పుడూ కూడా ఆ దంతక్షయం అంటే క్యావిటీస్ ఆ చిగుళ్ల నుంచి రక్తం కారటం జింజివైటిస్ పళ్ళు జలదరించడం సున్నితత్వం ఇలాంటి సమస్యలు వేధిస్తూ ఉండేవి.
(01:18) ఎన్ని కొత్త కొత్త టూత్ పేస్ట్లు వాడినప్పటికీ కూడా శాశ్వత ఫలితం దక్కలేదు. అప్పుడు నేను అతనికి పూర్తిగా సహజ సిద్ధమైనటువంటి ఒక దంత చున్నాన్ని తయారు చేసుకునే విధానం చెప్పాను. ఒక నెల రోజుల్లోనే అతని చిగుళ్ళ సమస్యలు తగ్గిపోయాయి. పళ్ళు తిరిగి దృడంగా మారాయి. మీరు కూడా ఇలాంటి బాధలు పడుతూ ఉంటాయి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ ఔషధం గురించి ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాలి.
(01:43) ఈ దంత చూర్ణం దీని తయారీకి కావల్సిన మూలికలు వీటిని ముందు తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చూణంలో వాడే ప్రతి పదార్థం కూడా ఎంతో విశిష్టమైనది. వీటి ప్రయోజనాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. వేప పొడి మొట్టమొదటిది మనం వేప అనేది భారతీయ సాంప్రదాయంలో విశిష్ట స్థానం పొందింది. ఆయుర్వేద ప్రకారంగా వేప లేకుండా దంత సంరక్షణ అనేది అసంపూర్ణమే అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇందులో క్రిముని నాశనం చేసేటువంటి [సంగీతం] గుణం చాలా బలంగా ఉంటుంది చాలా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ చాలా విశిష్టంగా ఉంటుంది.
(02:17) ఇది హానికరమైనటువంటి బ్యాక్టీరియాని చంపి చిగుళని ఆ మర్మత్ చేస్తుంది. చిగుల సమస్యలు ఉంటే బాగు చేస్తుంది. దీనికోసం మీరు ఏం చేయాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వేపాకు పొడిని సిద్ధం చేసుకోవాలి అంటే ఫ్రెష్ వేపాకులు తెచ్చుకొని వాటిని ఆ మీకు బట్టలు ఆరేసుకునే తీగలు ఉంటాయి కదా ఆ తీగలకి ఆ రెమ్మల్ని ఆ వేలాడదీయాలి ఆ గాలి తగిలి ఆ వేపాకులు ఎండిపోతాయి కింద ఒక పేపర్ పరవండి దాని పైన ఈ ఆకులు పడతాయి.
(02:45) ఇప్పుడు ఇలాంటి ఎండిన ఈ వేపాకుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. గ్రైండర్ లో వేసి పొడి చేసుకోవచ్చు లేకపోతే రోలు రోకలో కూడా పొడి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక మెత్తటి బట్టతోటి వస్త్రగాడితం పట్టుకోవాలి అంటే జల్లడ పట్టుకోవాలి ఇలాగ ఈ వేపాకుల పొడి మీరు సిద్ధం చేసుకోవాలి. లవంగం పొడి రెండోది లవంగంలో యోజనాలని ఒక సహజ నొప్పి నివారణ అంశం ఉంటుంది.
(03:08) అందుకే లవంగం పండి నొప్పు అన్నప్పుడు లవంగం నూనె ఎవరికైనా గుర్తుకొస్తుంది. ఇది నోట్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ ని చాలా ఎఫెక్టివ్ గా అడ్డుకుంటుంది. అయితే దీనికోసం మీరు ఒక టేబుల్ స్పూన్ లవంగం పొడిని సిద్ధం చేసుకోవాలి ఫ్రెష్ గా ఉండాలి ఇది అంటే ఎప్పుడో చేసుకుందంటే దానికి ఫ్రెష్నెస్ తగ్గిపోతుంది. పసుపు గురించి మరీ మరీ చెప్పుకోవాలి.
(03:26) పసుపు అనేది మన భారతీయులకి చాలా ముఖ్యమైనటువంటి క్రిమి సంహారిణి ఇది చిగుళ్ల వాపును తగ్గిస్తుంది. అలాగే సహజమైన ఒక మందులాగా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ పసుపుని ఎలాగా మీ ఒకవేళ ఒరిజినల్ పసుపు దుంపలు ఉంటే వాటిని తెచ్చుకొని ముందు మెత్తగా చిన్నగా బరగ్గా దంచి ఆ తర్వాత గ్రైండర్ లో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి.
(03:47) డైరెక్ట్ గా పసుపు కొమ్ముల్ని మీరు గ్రైండర్ లో వేస్తే ఆ బ్లేడ్లు పోతాయి. కాబట్టి ముందు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కావాలనుకుంటే జల్లడ పట్టుకోవచ్చు. ఈ పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోండి. సైందో లవణం రాక్ సాల్ట్ అనేది కూడా దీంట్లో ఒక ముఖ్యమైన ఇంగ్రిడియంట్ ఇది దంతాలకు ఒక అద్భుతమైనటువంటి అంశం కింద పనిచేస్తుంది ఒక సహజ ఔషధం కింద పనిచేస్తుంది.
(04:11) ఇది దంతాల తాలకు ఆ సున్నితత్వం ఉంటుంది కదా దాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. పళ్ళపైన ఉండేటువంటి మరకలని సులభంగా తొలగించేస్తుంది ఉప్పు అనేది. ఇంకా చిగుళ్ళని సహజంగా శుభ్రపరుస్తుంది దృడపరుస్తుంది కూడా ఇన్ఫ్లమేషన్ గుంజేస్తుంది. అందుకే ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఆవకాయ పచ్చడి గాని లేకపోతే ఉప్పు చాపలు గాని ఏది చేయాలన్నా దాంట్లో వాటర్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ తీసేయాలంటే ఏంటి ఉప్పే వాడతాం.
(04:34) ఇక్కడ కూడా ఈ ఉప్పునే వాడుతున్నాం అంటే చిగుళ్ళ వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. [సంగీతం] దీన్ని ఒక టీ స్పూన్ రెడీ చేసుకోండి. వంట సోడా ఇది ఒక అద్భుతమైన పదార్థం. దంతాల ఆ పసుపు దనాన్ని పోగొట్టే ఆ నాచురల్ క్లెన్సర్ అని చెప్పొచ్చు. అద్భుతమైన ఔషధం ఇది దంతాల మీద పేరుకుపోయినటువంటి గారని ఆ ప్లేక్ ని ఇది తొలగిస్తుంది. అందుకే నాన్ టాక్సిక్ క్లీనింగ్ లో ఈ వంట సోడానే మెయిన్ ఇంగ్రిడియంట్ కింద చెప్తూ ఉంటాం.
(04:56) ఇది అందుకంటే మీ నోట్ లోపల ఉండేటువంటి ఆ క్షారా ఆమల్ర సమతులత ఉంటుంది కదా పిహెచ్ బాలెన్స్ సరిగ్గా ఉండేలాగా చూస్తుంది ఇది. కాబట్టి ఇలాంటి ఈ వంట సోడాని ఒక టీ స్పూన్ వంట సోడాని సిద్ధం చేసుకోండి. ఈ ఔషధాన్ని తయారు చేసుకునే సులభ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకున్న ఈ చూణాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవడం అనేది తేలిక.
(05:18) ముందు పూర్తిగా పొడిగా ఉన్నటువంటి ఒక శుభ్రమైన గిన్నెని తీసుకోండి. ఆ గిన్నెలో ఏమాత్రం తడి ఉండకూడదు ఇది చాలా ముఖ్యం తడి ఉందనుకోండి చూర్ణం పాడైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న అన్ని పదార్థాలని కూడా ఈ గిన్నెలో వేసి బాగా కలిపేయండి అంటే రెండు టేబుల్ స్పూన్ల వేపాకు పొడి ఒక టేబుల్ స్పూన్ లవంగం పొడి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ పసుపు అలాగే ఒక టీస్పూన్ సైధవ లోణం ఇది సైంధం లోన తక్కువ ఉండాలి అంటే అవన్నీ టేబుల్ స్పూన్ తీసుకుంటే ఇది టీ స్పూన్ే తీసుకున్నాం.
(05:47) అలాగే ఒక టీస్పూన్ వంట సోడా ఇది కూడా తక్కువే తీసుకోవాలి. ఇలాగ అన్నిటిని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని శీసాలో అంటే ఎయిర్ టైట్ కంటైనర్ లో నిలవ చేసుకోండి. దీన్ని మూడు నెలల పాటు నిలవ ఉంచుకోవచ్చు వాడుకోవచ్చు. ఈ దంత చూర్ణాన్ని వాడే ఖచ్చితమైన విధానం ఏమిటి ఇది తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకునే చూణాన్ని వాడే విధానం చాలా [సంగీతం] ముఖ్యం.
(06:09) ముందు కొద్దిగా చూర్ణాన్ని అరచేతిలోకి తీసుకోండి. మీ టూత్ బ్రష్ ని కొద్దిగా ముందు నీటితోటి తడపండి. ఇప్పుడు ఈ బ్రష్ తోటి అరచేతిలో ఉండే పొడిని ఇలా అద్దండి. ఇప్పుడు మామూలుగా మీరు బ్రష్ చేసుకున్నట్టుగానే రెండు లేదా మూడు నిమిషాల పాటు దంతాన్ని తోముకోండి. దీన్ని ఆ దంతాలతో పాటు చిగుళ్ళ పైన కూడా సున్నితంగా మర్ధన చేయండి రుద్దండి.
(06:28) గమ్ మసాజ్ [సంగీతం] అంటాం. తర్వాత గోరివచ్చ నీళ్లతోటి నోరు పుక్కిలించండి. మీరు రోజువారి పేస్ట్ తోటి బ్రష్ చేసుకున్న తర్వాత ఉదయం సాయంత్రం దీన్ని వాడటం కూడా ఇదొక పద్ధతి ఇలా కూడా అలవాటు చేసుకోవచ్చు డైరెక్ట్ గా దీనితోటే బ్రష్ చేసుకోవచ్చు. ఈ చూర్ణంతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకోవాలి. [సంగీతం] ఈ దంత చూర్ణం వాడటం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
(06:51) ఈ మార్పుల్ని మీరు స్పష్టంగా చూడగలుగుతారు దీన్ని వాడటం స్టార్ట్ చేసిన తర్వాత. ఒకటి దంతక్షయాన్ని నివారిస్తుంది. వేప లవంగం కలిసి క్యావిటీస్ని కలిగించేటటువంటి ఆ బ్యాక్టీరియాని పూర్తిగా నిర్మూలిస్తాయి. ఇక ఆ సెన్సిటివిటీ ఉంటుంది కదా సున్ని తత్వాన్ని తగ్గిస్తుంది ఇది. చల్లటి లేదా వేడి పదార్థాలు తిన్నప్పుడు పళ్ళు జువ్వులు లాగుతూ ఉంటాయే ఈ చూర్ణం ఆ సమస్యను వెంటనే తగ్గిస్తుంది.
(07:13) ఇక అన్నిటికీ మించి దుర్వాసనకి ఇది చెక్ పెడుతుంది. నోటిలో దుర్వాసన కలిగించేటువంటి సూక్ష్మ క్రిములని లవంగం వేప సులభంగా సంహరిస్తాయి. దీనివల్ల శ్వాస ఎప్పుడు కూడా తాజాగా [సంగీతం] ఉంటుంది. అన్నిటికీ మించి ఆ స్పార్క్లింగ్ వైట్ అంటాం చూసారా తెల్లటి దంతాలు అది దీంతో సాధ్యమవుతుంది పళ్ళపైన ఏర్పడినటువంటి పసుపు రంగుని ఇది క్రమంగా తొలగించేసి ఆ దంతాలు సహజ రంగుని పొందేలాగా చేస్తుంది.
(07:40) అయితే దీంతో పాటుగా సమగ్ర జీవనశైలు మార్పులు కూడా చాలా అవసరం. అంటే శారీరక ఆరోగ్య సమస్యలకు కేవలం ఒక మందు మాత్రమే పరిష్కారం కాదు త్రివిధ వ్యవహాలు ఉంటాయి అంటే ఆహార విహార ఔషధహి అని త్రివిధ వ్యవహాలలో ఇప్పుడు మనం ఔషధ వ్యవహ అని చెప్పుకున్నాం కానీ ఆహార వ్యవహారాలు కూడా చాలా ముఖ్యం. పూర్తి స్థాయి ఆరోగ్యానికి సరైన ఆహార నియమాలు పాటించాలి.
(08:02) ఆయుర్వేద మూలికల్ని వాడుతూ ఉండాలి. అలాగే మీ జీవనశైలిలో సానుకూల మార్పులు కూడా చేసుకోవాలి. ఇలాంటి సహజసిద్ధమైన చిట్కాలతోటి పాటుగా మీ మొత్తం ఆరోగ్య స్థితిని విశ్లేషించుకోవాలి. దినకాలపు సమస్యలు ఏమైనా ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకూడదు. నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవాలి. రసాయనాలు లేని ఇలాంటి సహజోత్పత్తులని మీ దినచర్యలో భాగం చేసుకోవాలి.
(08:24) సహజంతవరకు నాన్ టాక్సిక్ లివింగ్ ని అలవాటు చేసుకోవాలి. అవసరమైతే మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే సూచించే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వాటి సహాయం కూడా తీసుకోవాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఈ రసాయన రహిత దంతచోర్ణం మీ దంతాల్ని మీ పళ్ళని దృడంగా ఉంచడమే కాదు నోటి సమస్యలన్నిటిని కూడా శాశ్వతంగా నివారిస్తుంది.
(08:46) ప్రకృతి ప్రసాదించిన ఈ మూలికల్ని మన దైనందన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించొచ్చు. స్వచ్ఛమైన దంతాలతో వెలిగే మీ ఆకర్షణీయమైన చిరునవ్వే మీ అసలైన ఆరోగ్యానికి నిజమైన నిదర్శనం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ [సంగీతం] చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ ని క్లిక్ చేయండి.
(09:06) అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్ [సంగీతం] 100 శరతులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి.
(09:33) స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం [సంగీతం]
No comments:
Post a Comment