*_రామా కనవేమిరా..!_*
*అయోధ్య విరాళాలు..*
*ఆ వెనక గందరగోళాలు..*
ఎన్డీఏ పన్నెండేళ్ళ పాలన
"స్కాం ఫ్రీ"..అంటే వివాదరహితమని బడాయి పోయిన పాలక పెద్దలు
ఖంగు తినేలా పెద్ద అవినీతి బాగోతమే బద్దలైంది అయోధ్యలో..
ఏ రామజన్మభూమి..
ఏ అయోధ్య ఆలయం..
అంటూ గడచిన నలభై ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ రామజపం చేస్తూ..
అధికారంలోకి వచ్చిందో..
ఇప్పటికీ అధికారంలో కొనసాగుతూ ఉందో..
ఆ రాముడి నిధులనే స్వాహా చేసిన అతి ఘోరమైన
కుంభకోణం బట్టబయలైంది.
రాముడంటే భారతీయ ఆత్మ..
హిందూత్వ ప్రతినిధి..
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం.
అందునా అయోధ్యలో..
అంతటి రామయ్య పేరున
సేకరించిన సొమ్ము కోట్లలో
కైంకర్యం అయిందంటే..
ఇదేమీ ఆషామాషీ వ్యవహారం
కాదు..ఎన్డీఏ ప్రభుత్వం..
ముఖ్యంగా ఆ కూటమికి
నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా
పార్టీ ..నిస్సందేహంగా వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు సమాధానం చెప్పవలసి ఉంది..ఇదేదో
సిట్ ను ఏర్పాటు చేశాం..
నివేదిక రాగానే దోషులు
ఎవరైనా..ఎంతటి వారైనా
విడిచిపెట్టేది లేదంటూ
సులభంగా స్టేట్మెంట్ ఇచ్చి
చేతులు దులుపుకునేంత
ఈజీ వ్యవహారమైతే కాదు.
అయోధ్య రామాలయం నిధుల గోల్ మాల్ పై భరతజాతి అట్టుడికిపోతోంది.
ఇది డబ్బు సమస్య కాదు.
గోల్మాల్ ఏడుకోట్ల మేరకే అని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతూ ఉండవచ్చు.
రెండు వందల కోట్లకు పైబడేనని విపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉండవచ్చు..
గతంలో ఇంతకు మించి
ఖరీదైన స్కాములు
జరిగి ఉండొచ్చు..
ఆయా స్కాముల్లో
వందలు వేల కోట్ల రూపాయల మేర నిధులు కైంకర్యం
అయి ఉండవచ్చు గాక..
బోఫోర్స్..ఫెయిర్ ఫాక్స్.. చక్కెర..యూరియా..
టెలికాం..ఇంకా ఇంకా
ఎన్నో ఎన్నో స్కాములని ఈ దేశం చూసింది..
వాటిపై ఎన్నో గందరగోళాలు జరిగాయి కూడా.
ఆయా స్కాములకు
సంబంధించి కొందరు ప్రముఖులైన వ్యక్తులు
ఎన్నో నిందలు మోశారు.
కొన్ని దేశ గతిని..ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం
చేశాయి.
అయినా అవన్నీ వేరు..
అయోధ్య నిధుల గల్లంతు
ఉదంతం ఖచ్చితంగా వేరు.
భారతీయ జనతా
పార్టీ ప్రధాన బలం..అయోధ్య..
రామజన్మభూమిలో బాబ్రీ మసీదు వివాదం..అద్వానీ రథయాత్ర..ఒక రోజున
కరసేవకులు మసీదును కూల్చి వేయడం..
ఆ ఉదంతానికి
నాటి ప్రధాని
పి వి నరసింహరావుని బాధ్యుని చేసి
నానా యాగీ చెయ్యడం..
ఆ వివాదమే మూలాధారంగా
అంతకు ముందు సభలో రెండు స్థానాలు గల బిజెపి
తర్వాత ఎన్నికల్లో అనూహ్యంగా అధికార పీఠాన్ని అధిరోహించడం..
దానాదీనా ఇదే ఎన్డీఏ ప్రభుత్వం అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రామాలయ నిర్మాణం పూర్తి చేసి ఆ కార్యక్రమాన్ని అతిపెద్ద విజయంగా తమ ఖాతాలో జమచేసుకోవడం ఒక పరంపరగా జరిగిపోయాయి.
అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంవత్సరంలో రామాలయ నిధుల గోల్మాల్ వ్యవహారం బయటపడింది. ఇది జనాలకు తెలిసీ తెలియడంతోనే
ఒక విస్ఫోటనంలా పరిణమించింది.
పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ
భారతీయ జనతా పార్టీ,ఆర్ఎస్ఎస్,విశ్వహిందూ పరిషత్ లకు ఈ వ్యవహారం మింగుడు పడడం లేదు.. కొందరు పోలీసులపై
కేసులు నమోదు చెయ్యడం..దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చెయ్యడం.. ఇవన్నీ కంటి తుడుపు చర్యలు గానే జనం భావిస్తున్నారు..రేపు దోషులను పట్టుకుని
కఠిన చర్యలు తీసుకున్నారే
అనుకుందాం..ఏదిఏమైనా
జరగవలసిన దోషం జరిగిపోయింది.దానిని
ఎవ్వరూ మార్చలేరు..
కోట్లాది హిందువుల..
భారతీయుల
మనోభావాలు దెబ్బతిన్న
కఠోర సత్యం కాదన లేనిది.!
*_ఈఎస్కే,జర్నలిస్ట్.._*
No comments:
Post a Comment