*కర్మ అనేది మనం చేసిన ప్రతి పనికి తిరిగి* *వచ్చే ప్రతిఫలం.*
*నీ కర్మ కీ నీవే బాధ్యుడివి.*
*శరీరము శాశ్వతము కాదు ఆత్మ మాత్రమే శాశ్వతము.*
*మన శరీరము ఒక వస్త్రము వంటిది. వస్త్రము చినిగిపోయిన తరువాత కొత్త వస్త్రము ధరించినట్లు, ఆత్మ ఒక శరీరాన్ని వదలి మరొక్క కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది.*
*కర్మను అనుసరించేదే బుద్ధి. మనిషి తన జీవిత కాలంలో కర్మలను అనుభవించాలి.*
కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యము అవుతుంది.
కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది.
జరిగినది, జరుగుతున్నది.., జరగబోయేది.. అంతా మన మంచికే అని నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది.
మనము కేవలం నిమిత్త మాత్రులము అంతా భగవంతుని చేతుల్లో వున్నది.
మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది.
కాలం అనేది కర్మలో అంతర్భాగం, ఎందుకంటే గతంలో జరిగినది ఇప్పుడు జరుగుతున్న దానిపై ప్రభావం చూపుతుంది.
మరియు ఇప్పుడు జరుగుతున్నది భవిష్యత్తులో జరిగే దానిపై ప్రభావం చూపుతుంది! ఇదే కర్మ సిద్ధాంతం.
విశ్వం ఒక న్యాయాధికారి లాగా కాకుండా, ఒక అద్దం లాగా పనిచేస్తుంది.
మనం చేసే ప్రతి ఆలోచన, మాట మరియు పని ఒక శక్తి రూపంలో విశ్వంలోకి వెళుతుంది.
ఆ కర్మ శక్తి తిరిగి మనకే ఫలితంగా, అప్పుడు చేసిన కర్మ ఫలంగా ఇప్పుడు వస్తుంది. ఇది ఒక కారణం- కార్య సంబంధం.!! *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment