Wednesday, July 15, 2026

 శ్రీ విద్యుశేఖర భారతి మహాస్వామి గారు సూచించిన *సరళ సాధనా విధానం*

ఈ రోజుల్లో బిజీ జీవితం మధ్యలో కూడా సాధనను కొనసాగించడానికి శ్రీ విద్యుశేఖర భారతి మహాస్వామి గారు ఒక అద్భుతమైన, ప్రాయోగికమైన మార్గాన్ని చెప్పారు.

లలితా సహస్రనామం / సౌందర్యలహరి వంటి స్తోత్రాలలో రోజుకు ఒక్క శ్లోకం మాత్రమే తీసుకోండి.

మీ శక్తి, సమయం, ఏకాగ్రతను బట్టి ఆ ఒక్క శ్లోకాన్ని 9 సార్లు లేదా 32 సార్లు లేదా 108 సార్లు జపించండి.

అలా ప్రతిరోజూ ఒక్క శ్లోకం చొప్పున కొనసాగిస్తే, ఉదాహరణకు 100 రోజుల్లో సహస్రనామం పూర్తయితే, మళ్లీ అదే విధంగా కొత్త చక్రం ప్రారంభించండి.

మహాస్వామి గారు ప్రత్యేకంగా చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే –

*ఎన్ని సార్లు జపించామన్నది కాదు, ఎంత ఏకాగ్రతతో చేశామన్నదే ముఖ్యము.*

*పూర్తి మనస్సుతో చేసిన 10 నిమిషాల జపం కూడా ఒక గొప్ప మైలురాయి లాంటిదే.*

ఈ విధానం ద్వారా ఒత్తిడి లేకుండా సాధన సాగుతుంది నిరంతరత్వం అలవాటవుతుంది *'మనస్సు సహజంగా భక్తిలో స్థిరపడుతుంది సాధన అంటే భారంగా అనిపించకూడదు. సాధన అంటే జీవితం మధ్యలో సహజంగా ప్రవహించాలి. ఈ సరళమైన మార్గం అదే నేర్పిస్తుంది శ్రీమాత్రేనమః.                                   *శ్రీ లలితా సహస్రనామం నుండి రోజుకు ఒక శ్లోకం పోస్ట్ చేయబడుతుంది. శ్లోకం ,శ్లోకం యొక్క అర్థం, సరళ భావార్థం, తాత్విక భావన. సాధనకు ఎలా జపించాలి అనే వివరాలతో.... 17-7-26 (శుక్రవారం) నుండి ప్రారంభం కావున సభ్యులు క్రింద ఇచ్చిన లింకులో జాయిన్ అయ్యి ప్రతిరోజు ఫాలో కాగలరు*.                                                           *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment