అష్టావక్ర గీత | The LEGEND OF ASHTAVAKRA | Telugu Geeks
Author Name:Telugu Geeks
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=84R3UVLaZDk
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోతో కలుస్తున్నాను మిమ్మల్ని అండ్ ఈ వీడియో చాలా బాగుండాలి అలాగే కొంచెం కొత్తగా కూడా ఉండాలి అని చెప్పేసి అష్టావక్రుని గీతలో నుంచి కొన్ని శ్లోకాలను తీసుకొని అలాగే అష్టావక్రుడి యొక్క స్టోరీని కూడా ఈ వీడియోలో మనం కవర్ చేస్తూ ఆ శ్లోకాలను కూడా ఇందులో చెప్తూ ఒక కంప్లీట్ అష్టావక్రుడి జర్నీ ఎలా జరిగింది ఆయన గ్రేట్నెస్ ఏంటి ఆయన లెజెండ్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం.
(00:35) అష్టావక్రుడు ఇంకా తల్లి గర్భంలోనే ఉన్నాడు. బయట తన తండ్రి కహోలుడు వేద మంత్రాలను చదువుతున్నాడు. కానీ ఆయన ఉచ్చారణలో కొన్ని తప్పులు వచ్చాయి. గర్భం నుండే ఆ శిశువు అష్టావక్రుడు ఎనిమిది సార్లు కదిలి ఆ తప్పులను సరిచేశాడు. అహంకారం దెబ్బతిన్న తన తండ్రి నన్నే సరిదిద్దుతావా నువ్వు ఎనిమిది వంకరులతో పుట్టు అని శపించాడు.
(00:57) అష్టావక్రుడు పుట్టినప్పుడు అతని శరీరం వికృతంగా ఉంది కానీ ఆ నొప్పిని ఆ శాపాన్ని ఆయన ఎలా స్వీకరించాడు అంటే ఆయన తన శరీరాన్ని చూసి నేను వంకరగా ఉన్నాను అని అనుకోలేదు దానికి బదులుగా నా శరీరం వంకరగా ఉంది దాన్ని నేను గమనిస్తున్నాను నేను మాత్రం సరిగ్గానే ఉన్నాను అని ఆయన అనుకోవడం మొదలు పెట్టాడు. శాపం తగిలింది శరీరానికి కానీ లోపల ఉన్న సాక్షికి నా ఆత్మకి కాదు అని ఆయనక అప్పుడే అర్థమయింది.
(01:24) నువ్వు నిన్ను ముక్తుడివి అని భావిస్తే [గొంతు సవరించుకోవడం] నువ్వు ముక్తుడివి ముక్తుడివి అంటే ఫ్రీడమ ఉన్న మనిషివి అలాగే నువ్వు బద్ధుడివి అని భావిస్తే నువ్వు బద్ధుడివి బద్ధుడు అంటే స్లేవ్ అని అర్థం. నీ ఆలోచన ఎలా ఉంటుందో నీ గతి కూడా అలాగే ఉంటుంది. మనల్ని మనం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా తక్కువ చేసుకుంటున్నాం. నేను ఫెయిల్యూర్ ని నేను అందంగా లేను నేను డిప్రెషన్ లో ఉన్నాను అని అనుకుంటున్నావ్.
(01:47) కానీ అష్టావక్రుడు ఏమంటున్నాడంటే నువ్వు దేన్నైతే నీ ఐడెంటిటీగా మార్చుకుంటావో నువ్వు అదే అవుతావ్. ఆఫీస్ లో బాస్ తిట్టినా లేదా బిజినెస్ లో లాస్ వచ్చినా నాకు లాస్ వచ్చింది అని అనకండి నా బిజినెస్ లో లాస్ వచ్చింది దాన్ని నేను గమనిస్తున్నాను నాకేమీ కాలేదు అని అనుకోవడం ప్రాక్టీస్ చేయండి. సమస్య మీ చుట్టూతా ఉండొచ్చు.
(02:08) కానీ అది మీ లోపల ఉండకూడదు అనేది అష్టావక్రుడి మాట. నువ్వు ఒక సాక్షిలా ఒక విట్నెస్ లా నీ సమస్యలని గమనించడం మొదలు పెట్టిన రోజే నీ సగం స్ట్రెస్ మాయమైపోతుంది. అష్టావక్రుడు పుట్టిన కొద్ది రోజులకే వాళ్ళ ఇంట్లో పేదరికం వచ్చేసింది. కహోలుడు తన పాండిత్యం మీద ఉన్న అతి నమ్మకంతో నేను వెళ్తాను. నా మేదస్సుతో జనక మహారాజుని సభలో అందరినీ ఓడించి అపారమైన ధనాన్ని సంపాదించి ఈ కుటుంబాన్ని కాపాడుకుంటాను అనే బలమైన అహంకారంతో బయలుదేరాడు.
(02:40) ఆయన సభకు వెళ్ళాడు కానీ అక్కడ బంది అనే ఒక మహా పండితుడితో వాదనకు దిగి ఓడిపోయాడు. నేనే గెలుస్తాను అని అనుకున్న అహంకారం అక్కడ దెబ్బతి అండ్ ఫలితంగా ఆయన సముద్రపు అడుగున బందీగా మారిపోయాడు. అష్టావక్రుడు పదేళ్ల పాటు తండ్రి లేని లోటుని అనుభవించాడు. తన తండ్రి ఆ నేనే చేస్తున్నాను అనే భ్రమలో చిక్కుకుపోవడం వల్లే బంది అయ్యాడని అష్టావక్రుడు తెలుసుకున్నాడు.
(03:04) అంతా నేనే చేయగలను అన్ని నేనే చేస్తాను నేనే కర్తను అనే అహంకారం ఒక నల్లని పాముకాటు లాంటిది అది నిన్ను విషంతో నింపుతుంది. నేను కర్తను కాదు ఈ ప్రపంచమే నాతో ఈ పనులు చేపిస్తుంది. ఆ విశ్వాసం అనే అమృతాన్ని తాగి సుఖంగా ఉండు. చాలామంది నేను లేకపోతే నా ఫ్యామిలీ ఏమైపోతుందో నేను లేకపోతే ఆఫీస్ లో ఆ ప్రాజెక్ట్ అవ్వదు అని విపరీతమైన భారాన్ని నెత్తి మీద వేసుకుంటారు.
(03:32) ఈ నేనే అనే భావనే మనకి స్ట్రెస్ బీపి టెన్షన్ ఇలాంటివన్నీ కలిగిస్తుంది. అష్టావక్రుడు ఏమంటాడంటే పని నీ ద్వారా జరుగుతుంది. కానీ దాన్ని నువ్వు చేయట్లేదు. ఈ ప్రకృతి నీతో చేయిస్తుంది. మీరు ఆఫీస్ లో పని చేస్తున్నప్పుడు ప్రకృతి నా ద్వారా ఈ పని చేయిస్తుంది నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ ని మాత్రమే అని అనుకుంటే మీరు చేసే ఏ పనిలోనైనా సరే క్వాలిటీ పెరుగుతుంది.
(03:54) అలాగే ఒత్తిడి ఉండదు. పని మనమే చేస్తున్నాం అని అనుకున్నప్పుడు అది ఫెయిల్ అయితే మనం కృంగిపోతాం. అదే నేను కేవలం ఒక పాత్రని అని అనుకుంటే ఫలితం ఏదైనా అంటే ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మనం ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటాం. [సంగీతం] బ్యాక్ టు ద స్టోరీ అష్టావక్రుడికి 12 ఏళ్ళ వచ్చేసాయి తన తండ్రి బందీగా ఉన్నాడని తెలుసుకని ఆయన్ని విడిపించడానికి జనక మహారాజుని సభకి చేరుకుంటాడు.
(04:20) ఎనిమిది వంకర్ల శరీరంతో తడబడుతూ నడుస్తున్న ఆ పిల్లాడిని చూసి సభలోని పండితులంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుతారు. ఆ నవ్వులతో ఆ సభంతా కూడా మారిమోగుపోతూ ఉంటుంది. కానీ అందరిని ఆశ్చర్యపరుస్తూ అష్టావక్రుడు కూడా వాళ్ళకంటే గట్టిగా నవ్వుతాడు. అక్కడున్న రాజు జనకుడు ఆశ్చర్యపోయి అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు మరి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు.
(04:41) అప్పుడు అష్టావక్రుడు అన్న మాట ఏంటంటే రాజా నేను ఇక్కడికి చాలా మంది అపారమైన జ్ఞానం ఉన్న వాళ్ళు ఈ సభలో ఉంటారని వచ్చాను కానీ ఇక్కడ అందరూ కూడా తోలు వస్తువులు అంటే జంతు శరీరం మీద చర్మంతో వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నా ఆత్మ కనిపించడం లేదు. కేవలం నా చర్మం నా రూపం మాత్రమే కనిపిస్తుంది. ఒక చెరుకు కూడా వంకరగా ఉన్నంత మాత్రాన లోపల రసం వంకరగా ఉండదు కదా అని అనగానే మాటతో సబంతా కూడా సైలెంట్ అయిపోయింది.
(05:11) ఆయన శరీరం ఎలా ఉన్నా కూడా ఆయన లోపల ఉన్న చైతన్యం మాత్రం ఆకాశం లాంటిదని ఆయన ఆ రోజే నిరూపించాడు. నువ్వు భూమివి కాదు నీటివి కాదు నిప్పువి కాదు గాలివి కాదు ఆకాశానివి కూడా కాదు వీటన్నిటిని గమనిస్తున్న చైతన్య స్వరూపానివి సాక్షివి అని నువ్వు తెలుసుకో ఈ జ్ఞానమే నీకు విముక్తిని ఇస్తుంది. మనంఇస్గ లో ఫిల్టర్స్ లుక్స్ బ్రాండెడ్ బట్టల మీద పడి మన అసలైన విలువని మనం మర్చిపోతున్నాం.
(05:37) ఎవరైనా మనల్ని చూసి నవ్వినా లేదా తక్కువగా చూసినా కృంగిపోతున్నాం. అష్టావక్రుడు ఏమంటాడంటే ప్యాకేజింగ్ ముఖ్యం కాదు లోపల ఉన్న కంటెంట్ ముఖ్యం. మనం కూడా పక్కవాడిని చూసి వాడి సంపాదనో వాడి రూపాన్నో చూసి జడ్జ్ చేస్తాం. కానీ అష్టావక్రుడి దృష్టిలో మనందరం కూడా ఒకే ఆత్మ స్వరూపులం. ఈ జ్ఞానం ఉంటే మనుషుల మధ్య ఎలాంటి ద్వేషం ఉండదు. నీకు ఏదైనా శారీరక లోపం ఉన్నా లేదా నువ్వు అందంగా లేవని నువ్వు ఫీల్ అయినా ఒకటి గుర్తుంచుకో ఆ లోపం శరీరానికే తప్ప లోపల ఉన్న నీకు కాదు అష్టావక్రుల ఆత్మ విశ్వాసంతో మనం ఉండటం నేర్చుకోవాలి.
(06:13) సభలో అష్టవక్రుడు తన తండ్రిని బంది చేసిన ఆ బంది అనే మహా పండితుడిని సవాలు చేస్తాడు. అక్కడ సంఖ్యా శాస్త్రం మీద చర్చ మొదలవుతుంది. ఆ మహా పండితుడైన బంది ఒక్కో సంఖ్య గురించి వివరిస్తుంటే అష్టావక్రుడు అంతకంటే లోతైన అర్థాలని చెప్తూ ఉంటాడు. ఆ చర్చ జరుగుతున్నప్పుడు సభలో కొంతమంది అష్టావక్రుడిని పొగుడుతున్నారు చాలా బాగా మాట్లాడుతున్నాడు ఈ పిల్లాడు అని అలాగే చాలామంది ఈ పిల్లాడు ఓడిపోతే ఇతన్ని కూడా సముద్రంలో ముంచేస్తారు అని ఎగతాలు చేస్తున్నారు.
(06:42) కానీ అష్టావక్రుడు దేనికి చలించడం లేదు అటు పొగడ్తలకి పొంగిపోవట్లేదు ఇక్కడ ఓడిపోతే నా పరిస్థితి ఏంటనే భయానికి కూడా లోన అవ్వడం లేదు. ఆయన దృష్ట అంతా కూడా సత్యం మీద మాత్రమే ఉంది. ఆయన మనసు ఆయన కంట్రోల్ లో ఉంది. చివరికి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ బంది ఆ మహా పండితుడు ఓడిపోతాడు. గెలిచినప్పుడు కూడా అష్టావక్రుడు అహంకారంతో విర్రవేయగలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు గెలుపు ఓటమే అనేవి కేవలం మనసుకు సంబంధించినవి.
(07:09) తన ఆత్మకి ఏమీ అవ్వట్లేదని ఆయనకు తెలుసు. నీకు నిజమైన స్వేచ్ఛ కావాలంటే ఈ ఇంద్రియ సుఖాలను అంటే బయట దొరికే తాత్కాలిక సంతోషాలని విషంలా వదిలే ఓర్పు సరళత దయ పవిత్రత అలాగే సత్యాన్ని అమృతంలా స్వీకరించు ఒక పోస్ట్ కి లైక్ వస్తే పొంగిపోవడం ఎవరో నెగిటివ్ కామెంట్ పెడితే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం కామన్ అయిపోయింది ఈ రోజుల్లో అష్టావక్రుడు చెప్పింది ఏంటంటే పక్కవాడి అభిప్రాయం నీ రియాలిటీ కాకూడదు.
(07:36) లైక్స్ వచ్చినా రాకపోయినా నువ్వు మారకూడదు. ఆఫీస్ లో ప్రమోషన్ వస్తే పండగ చేసుకోవడం ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే కెరియర్ నాశనం అయిపోయింది అని బాధపడటం మనం మానేయాలి. ఆ గెలిపోవడంలు అనేవి నీ పనికి సంబంధించినవి తప్ప నీ ఐడెంటిటీకి సంబంధించినవి కాదు. జీవితం అంటేనే ఎత్తు పల్లాలు ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు అది శాశ్వతం కాదు అని గుర్తుంచుకో దుఃఖం వచ్చినప్పుడు అది కూడా వెళ్ళిపోతుందని బలంగా నమ్ము.
(07:59) ఈ రెండిటికి మధ్య న్యూట్రల్ గా ఉండటమే అష్టావక్రుడు చెప్పిన అసలైన మీనింగ్. ఈ కథలో ముందుకు వెళ్ళే ముందు మీకు తెలుగు గీక్స్ అకాడమీలో ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ కోర్స్ గురించి చెప్పాలి. నేను చదివిన బెస్ట్ కమ్యూనికేషన్ బుక్స్ అన్నిటిలో నుంచి మంచి మంచి ఐడియాస్ తీసుకుని ఈ కోర్స్ ని నేను తయారు చేశాను. ఇది చాలా మందికి బాగా నచ్చిన కోర్స్ కూడా అండ్ ఈ కోర్స్ 2499ది.
(08:20) ప్రస్తుతం 1299 కి ఇస్తున్నాను. కానీ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ కింద ఈ సండే నైట్ వరకు అంటే ఈ వీకెండ్ సండే నైట్ వరకు ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ కోర్స్ ని నేను 999 కే మీకు అందిస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా కోర్స్ తీసుకొని వాళ్ళు ఇది బెస్టే తప్పకుండా చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే పెండ్ కామెంట్ లో ఉంది బ్యాక్ టు ద స్టోరీ బంది తన ఓటమిని ఒప్పుకొని సముద్రపు అడుగున బందీగా ఉన్న అష్టావక్రుడి తండ్రి కహోలుడిని అలాగే మిగిలిన పండితుల్ని బయటకి పంపించేస్తాడు.
(08:55) కహోలుడు బయటికి రాగానే తన కొడుకుని చూస్తాడు. 12 ఏళ్ల వయసులో ఎనిమిది వంకర్ల శరీరంతో తన కొడుకు తనని బంది చేసిన పండితుడినే ఓడించాడని తెలిసి కహోలుడు గర్వంతో ఆనందంతో కల్లమ్మడ నీళ్లు పెట్టుకుంటాడు. కానీ అష్టావక్రుడు మాత్రం చాలా మామూలుగా ఉంటాడు. తండ్రిని చూసినప్పుడు ఆయనకి ప్రేమ ఉంది గౌరవం ఉంది కానీ నేను నా తండ్రిని కాపాడాను అనే గర్వం లేదు.
(09:19) నేను గెలిచాను అనే అహంకారం కూడా లేదు. సముద్రం లోపల ఎన్ని నదులు కలిసినా అది ఎలా ప్రశాంతంగా ఉంటుందో అష్టావక్రుడు కూడా అలాగే ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన దృష్టిలో తన తండ్రిని విడిపించడం అనేది ఆయన బాధ్యత మాత్రమే అది ఏమి పెద్ద విజయం కాదు ఆయనకి తెలుసు తన తండ్రి ఆత్మ తన ఆత్మ ఒకటేనని ఈ లోతైన నిశబ్దమే ఆయనకు దక్కిన అసలైన విజయం అని ఆయన నమ్మాడు.
(09:41) దేని మీద ఆశ లేనివాడు ఆత్మజ్ఞానం పొందినవాడు. ఈ ఆత్మజ్ఞానం పొందిన వాడి కంటే మహాత్ముడు ఎవర లేరు. మనం ఏదైనా చిన్న గోల్ రీచ్ అవ్వగానే గాలిలోకి తేలిపోతాం ఎగిరిపోతాం. ఈ సక్సెస్ ని నెత్తి మీద ఎక్కించుకొని అహంకారంతో పక్కవాడిని తక్కువ చేసి చూస్తాం తక్కువగా మాట్లాడతాం. అష్టావక్రుడు ఏమంటాడంటే సక్సెస్ ని ఎంజాయ్ చెయ్ కానీ అది నీ ప్రశాంతతని చెడగొట్టేంత దానికి అతుక్కుపోకు మన సంతోషం పక్కవాడి మీద ఆధారపడి ఉంటుంది.
(10:08) వాడు నవ్వితే మనం నవ్వుతాం. వాడు ఏడిస్తే మనం కూడా ఏడుస్తాం. అష్టావక్రుడు లాజిక్ ప్రకారం నీ శాంతి నీ లోపల ఉంది. బయట మనుషులు కలిసినా విడిపోయినా నీ ఆనందం మాత్రం మారకూడదు. నేను నా ఫ్యామిలీ కోసం ఇది చేశాను నేను నా కంపెనీ కోసం ఇది చేశాను అనే ఫీలింగ్ ఉన్నంత కాలం నీకు శాంతి ఉండదు నీకు ఈ బాధ్యత ఉందని పని చెయ్ కానీ దానికి క్రెడిట్ మాత్రం ఆశించకు క్రెడిట్ ఆశించని వాడికి ఎప్పటికీ ఓటమే ఉండదు.
(10:36) బంది నుండి విముక్తుడైన కహోలుడు తన కొడుకు జ్ఞానాన్ని చూసి సిగ్గుపడతాడు. తను చిన్నప్పుడు అతనికి ఇచ్చిన శాపాన్ని తలుచుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ఆయన అష్టావక్రుడిని సమంగా నది దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ కహోలుడు తన కొడుకుని ఆ నదిలో స్నానం చేయమంటాడు. అష్టావక్రుడు ఆ నీటిలో మునిగి పైకి లేవగానే ఒక అద్భుతం జరుగుతుంది.
(10:56) ఆయన శరీరానికి ఉన్న ఆ ఎనిమిది వంకర్లు మాయమైపోతాయి. ఆయన మామూలు యువకుడిగా మారిపోతాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే శరీరం వంకరగా ఉన్నప్పుడు అష్టావక్రుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో శరీరం నార్మల్ గా మారిపోయినప్పుడు కూడా ఆయన అంతే ప్రశాంతంగా ఉన్నాడు. శరీరం మారినా ఆయన మారలేదు. తనను శపించిన తండ్రిని ఇప్పుడు విముక్తి కలిగించిన తండ్రిని ఆయన ఒకేలా చూశడు.
(11:21) ఎందుకంటే ఆయన దృష్టిలో శపించింది ఆయనే విముక్తి కలిగించింది కూడా ఆయనే అసలు అంతా తన ఆత్మ స్వరూపమే అని ఆయనకు అర్థమయింది. ఆశ్చర్యంగా ఉంది నాకే నేను నమస్కరించుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రపంచంలో నాది అని చెప్పుకోవడానికి ఏదీ లేదు లేదా కనిపించే ఈ ప్రపంచం అంతా కూడా నాలోనే ఉంది. మనల్ని ఎవరైనా తిడితే లేదా మనకు అన్యాయం చేస్తే మనం వాళ్ళ మీద కోపాన్ని ఏళ్ల తరబడి పెంచేసుకుంటాం.
(11:47) అష్టావక్రుడు ఏమంటాడంటే ఎదుటి వ్యక్తిని క్షమించడం అంటే వాళ్ళకి ఉపకారం చేయడం కాదు నిన్ను నువ్వు ఆ కోపం అనే జైల్ నుంచి బయటకి విడిపించుకోవడం మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలా మనం ప్రవర్తిస్తాం. కానీ అష్టావక్రుల పరిస్థితులు మారినా నీ లోపల ఉన్న క్యారెక్టర్ మారకూడదు. నువ్వు వంకరగా ఉన్న అందంగా ఉన్న నీ విలువలు నీ ఆత్మలోనే ఉండాలి.
(12:12) వాడు వేరు నేను వేరు అని అనుకున్నప్పుడు ద్వేషం పుడుతుంది. అందరిలో ఉన్నది ఒకే చైతన్యం అని నువ్వు గుర్తించినప్పుడు నీకు ఎవరి మీద కోపం రాదు అదే అసలైన స్వేచ్ఛ. ఇంక స్టోరీ చివరికి వచ్చేసింది అష్టావక్రుడు తన తండ్రిని కాపాడాడు తన శరీరాన్ని మామూలుగా చేసుకున్నాడు. జనక మహారాజు లాంటి చక్రవర్తికి గురువయ్యాడు. ఇన్ని సాధించిన అష్టావక్రుడు తన పాత కుటీరానికి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడతాడు.
(12:38) ఆయన వెళ్లే ముందు తన తండ్రి వైపు జనక మహారాజు వైపు ఒకేలా చూస్తాడు. ఆయనక అప్పుడు అర్థమైంది ఏంటంటే తాను గర్భంలో ఉన్నప్పుడు శపించిన తండ్రి తాను విడిపించిన తండ్రి తనని వెక్కరించిన పండితులు తనను పూజించిన జనక మహారాజు వీళ్ళంతా వేరు వేరు వ్యక్తులు కాదు వీరంతా కూడా తన ఆత్మ అనే సముద్రం నుంచి పుట్టిన చిన్న చిన్న అలలు మాత్రమే. అష్టావక్రుడు తన తండ్రిని విడిపించి రక్షించలేదు.
(13:02) తనని తాను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ ప్రయాణం తన తండ్రి కోసం మొదలైనా అది తనని తాను కనుగొనడంతో ముగిసింది. అష్టావక్రుడు [సంగీతం] ఇప్పుడు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక అనుభవం ప్రశాంతమైన మనసు కలవాడు జన సమూహం వైపు పరిగెత్తడు అలాగే అడవి వైపు కూడా పారిపోడు ఎక్కడున్నా ఎలా ఉన్నా అతను ఎప్పుడూ ఒకేలాగా న్యూట్రల్ గా ఉంటాడు. మనం ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి అవ్వాలి అని పరుగులు తీస్తుంటాం.
(13:29) కానీ అష్టావక్రుడు చెప్పే ఆఖరి రహస్యం ఏంటంటే నీ ప్రయాణం ఎక్కడ మొదలైనా అది నీ దగ్గరే ఆగాలి. నువ్వు ఎక్కడికి వెళ్లక్కర్లేదు నువ్వు ఆల్రెడీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నావు. ఒక్కసారి అన్ని పక్కన పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మౌనంగా కూర్చోండి. ఏ ఆలోచన లేకుండా ఏ పని చేయకుండా కేవలం అలాగే ఉండడం నేర్చుకోండి. ఆ నిశశబ్దంలోనే మీకు ప్రపంచంలోని అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి.
(13:53) అష్టావక్రుడు తన బాధ్యతలు అంటే తండ్రిని కాపాడటం నెరవేర్చాడు. కానీ వాటికి బానిస అవ్వలేదు. అలాగే మనం కూడా మనం చేసే ఉద్యోగాలు మనం చేసుకోవాలి. మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి కానీ లోపల మాత్రం అష్టావక్రుడులాగా ఆ నిశ్చలమైన మౌనాన్ని మనం కాపాడుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది అండ్ ఈ స్టోరీతో పాటు ఆయన చెప్పిన ఆ ఫిలాసఫీని కూడా మనం ఇంకా డీటెయిల్ గా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో ద్వారా ప్రయత్నించాం.
(14:19) సో ఇలాంటి స్టోరీలు మీకు ఇంకేమనా తెలిస్తే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి అండ్ అలాంటి స్టోరీస్ మీద ఇంకా వీడియోస్ నేను చేస్తాను. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్
No comments:
Post a Comment