స్వాధిష్టానచక్రం తత్వ విచారణ
*************************
సప్త ఊర్ధ్వ లోకాలలో రెండవదైన భువర్లోకానికి చెందినది..
ఈ స్వాధిష్ఠాన కమలం ఆరు దళాలుగల జలతత్త్వం కలది. అధిదేవత కాకిని.
ఈమె బం, భం, మం, యం, రం, లం అను యోగినులచే సేవించబడుతున్నది
బీజాక్షరం " వం "
"మేధోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా దధ్యాన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ " మేధో దాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి.
అనేకజన్మలనుండి వెంటతెచ్చుకునే పాపపుణ్యాలను అనుభవమునకు తీసుకొచ్చే చక్రమిది.
జీవునకు తల్లి గర్భమునందు స్థానమేర్పడుటకు మూలాధారచక్రం కారణం కాగా, అటు తర్వాత పిండం భౌతిక శరీరంగా ఏర్పడుటకు కావాల్సిన ప్రాణశక్తిని ఈ చక్రమే ఇచ్చుచున్నది.
ఈ ప్రాణశక్తి వలనే శరీరవ్యాపారాదులు నడుచుచున్నవి. శరీరంలోని ఉష్ణోగ్రత ఈ చక్రంనకు సంబంధించినదే..
ప్రాణవాయువు ఊపిరితిత్తులనిండా వ్యాపించటానికి ఈ చక్రం సహాయకారి అవుతుంది. ఈ చక్రమునకు ప్రాణమయకోశంతో సంబంధం..
ఈ చక్రం బలహీనంగా ఉంటే పెరుగన్నంను బలం కలుగుటకు స్వీకరించాలి. కాచిన పాలలో అన్నం వేసి తోడుపెట్టి ఉదయముననే ఆ పెరుగన్నం తినవలెను.వ్యాదులను బట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ, బీజాక్షరం “వం” ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు.
అలాగే ఈ చక్రమునకు అధిపతి శుక్రుడు. ఉల్లాసానికీ, కామప్రకోపానికీ అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు విశేషించి స్త్రీల జబ్బులకు కారణభూతుడు.
స్వాధిష్ఠాన అధిదేవత సరస్వతిని ధ్యానించడం వల్ల అరిషడ్వర్గాలు అంటవు.. గౌరవాన్ని అవమానాన్ని ఒకేలా స్వీకరిస్తారు.. భావాలకు అతీతంగా ఉంటారు..
ఈ చక్ర భేదనమ్ చెందిన సాదకుడిని కొన్ని సిద్దులు ఆశ్రయిస్తాయి..
👉🏻 ఎదుటివారి భావాలను తెలుసుకోగలుగుతారు..
నోరు తెరిచి చెప్పకముందే మన మనసులో మాటను పసిగడతారు..
Mind reading తెలుస్తుంది
Sekarana https://www.youtube.com/@voiceofmaheedhar/community
No comments:
Post a Comment