ఎందుకు మనం Happy గా ఉండలేకపోతున్నాం | ఈ 3 సత్యాలు తెలుసుకోండి | Osho Philosophy | Borra Inspires
Author Name:Borra Inspires
Youtube Channel Url:https://www.youtube.com/@BorraInspires
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4KtO_abJCak
Transcript:
(00:00) మనందరం హ్యాపీనెస్ అనేది వస్తువుల రూపంలో లేకపోతే విజయాల రూపంలో వస్తేనే సంతోషంగా ఉంటామని నమ్ముతుంటారు. అలాగే మన నిర్ణయాల మీద కాకుండా ఇతరుల నిర్ణయాల మీద కట్టుబడి ఉండటం వల్ల మనం హ్యాపీనెస్ ని కోల్పోతున్నామని ఒక ఫిలాసఫర్ చెప్తున్నాడు. ఆయన బోధించిన ఫిలాసఫీ మాటలు మీరు కనుక వింటే లైఫ్ అనేది నిజంగా హ్యాపీగా ఉండాలంటే మన నిర్ణయాలు ఎలా ఉండాలి మనం వాటిపైన ఎలా కట్టుబడి ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.
(00:28) అలాంటి మాటలు బోధించిన రజనీష్ చంద్రమోహన్ జైన్ ఓషో చెప్పిన ఈ మూడు మాటలు తప్పకుండా వినాల్సిందే. అందరికీ నమస్కారం నేను మీ రవి మీరు చూస్తున్నారు బొర్ర ఇన్స్పైర్ మనలో ఎంతమంది ఇతరుల కోసం డెసిషన్ తీసుకుంటున్నాం. చిన్నప్పుడు అమ్మ నాన్నలు చెప్పే దారిలో నడుస్తూ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటివి వాళ్లే నిర్ణయించేవారు. ఇప్పుడు నువ్వు పెద్దవాడివ అయ్యావు.
(00:57) నీకు ఏం కావాలి ఏం చేయగలవ్ ఎలా చేస్తే నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉంటావో అనేది నీకు తెలుసు. కానీ నువ్వు దాన్ని చేయకుండా మీ ఫ్యామిలీ కోసం నీ ఆనందాన్ని సాక్రిఫైస్ చేసుకుంటున్నావ అని నీకు తెలుసా? ఇక్కడ నేను మీ ఫ్యామిలీ చెప్పేది తప్పు అనడం లేదు. కానీ నీ జీవితంలో పూర్తిగా వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ కోసం సాక్రిఫైస్ చేస్తున్నావు. అదే సమస్య అంటున్న.
(01:20) ఓషో ఆలోచనల ప్రకారం ఏం చెప్తున్నాడంటే మీ జీవితం మీది. ఇతరులను సంతోష పెట్టడానికి మాత్రమే జీవించకండి. అలాగే ఇతరుల జీవితాన్ని మీ ఇష్ట ప్రకారం నడపాలని ప్రయత్నించకండి. ఈ ఫిలాసఫీ ప్రాక్టికల్ గా మన లైఫ్ లో ఎలా జరుగుతుందో అనేది ఒక ఉదాహరణ చూద్దాం. ఒక యువకుడికి ఇంజనీరింగ్ చదవాలి డాక్టర్ కావాలని ఒక డ్రీమ్ ఉంది. కానీ తన కుటుంబం అది కష్టం సేఫ్ గా ఉండు జాబ్ చేసుకో అని అంటుంది.
(01:47) అతను తన డ్రీమ్ ని ఫాలో చేయకుండా వాళ్ళ మాటల కోసం తను జాబ్ చేయడం ప్రారంభించాడు. కొంత కాలం తర్వాత అతని దగ్గర మనీ ఉండొచ్చు కానీ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండదు. ఇది ఒకరి స్టోరీ మాత్రమే కాదు మనలో చాలా మంది రియాలిటీ కూడా ఇదే. ప్రస్తుతం హైదరాబాద్ బెంగళూరు లాంటి సిటీలో చాలా మంది ఫ్యామిలీ ప్రెజర్ ని తట్టుకోలేక తమ యొక్క ఐడెంటిటీ కోసం బయటకి వచ్చి ఎవరో పెట్టిన కంపెనీలో జాబ్ చేస్తున్నారు.
(02:12) అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు అలాగే మంచి శాలరీ కూడా ఉండొచ్చు కానీ హార్ట్ లో మాత్రం సాటిస్ఫాక్షన్ మాత్రం ఉండదు. నువ్వు నీ జీవితాన్ని ఇతరుల ఎక్స్పెక్టేషన్ కోసం సాక్రిఫైస్ చేస్తున్నావా అయితే ఈ విషయం గుర్తుంచుకో నీ లైఫ్ నీది దాన్ని నీ ఇష్ట ప్రకారం జీవించు పక్క వాళ్ళను సంతోషపరిచే విధంగా కాదు. ఓషో చెప్తున్నాడు పొరలను జీవించడం ద్వారా కాదు వాటిని తొలగించడం ద్వారా మీరు మీ ఉత్తమ రూపంగా మారుతారు.
(02:40) ఇది నీకు అర్థం కాలేదా అయితే ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఊరిలో ఒక పురాతన విగ్రహం ఉండేది. అది చాలా సంవత్సరాలుగా ఒకే దగ్గర ఉంది. ఆ ఊరిలో ఉండేవారు ప్రతిరోజు ఆ విగ్రహాన్ని చూస్తూ ఉండేవారు. అందరికీ ఆ విగ్రహం ఒక సాధారణ కవచంతో తయారు చేయబడిన విగ్రహం లాగా ఉండేది. కానీ ఒకరోజు ఒక పిల్లవాడు క్రికెట్ ఆడుతుండగా బాల్ వచ్చి ఆ విగ్రహానికి తగిలింది.
(03:03) ఆ విగ్రహానికి తగిలిన వెంటనే ఆ విగ్రహం నుంచి ఒక మొక్క కింద పడింది. ఆ మొక్క ఎంతో మెరుస్తూ ఉంది. ఆ పిల్లవాడు దాన్ని చూసిన వెంటనే పక్కనున్న మనుషులకు చూపించాడు. అది చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. అది ఒక సాధారణ మొక్క కాదు అది ఒక బంగారపు మొక్క వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఆ విగ్రహాన్ని దగ్గరగా చూసి ఆశ్చర్యపోయారు. ఆ విగ్రహంపై కవచాన్ని తొలగించగా అది ఒక సాధారణ విగ్రహం కాదు అది ఒక బంగారపు విగ్రహం అని తెలిసింది.
(03:29) అది వాళ్ళ పూర్వీకులు ఆ బంగారాన్ని కాపాడటానికి ఆ విగ్రహాన్ని ఆ ఊరిలో పెట్టారని ఆ ఊరి ప్రజలు నమ్మారు. ఈ కథలో మెసేజ్ అలాగే ఓషో ఫిలాసఫీ చెప్పేది ఏంటంటే మనం కూడా ఆ విగ్రహం లాంటి ఒక మంచి రూపం కలిగిన వాళ్ళమే కానీ మనపై ఉన్న అన్సెసరీ హ్యాబిట్స్, ఈగో, ఫియర్, నెగిటివ్ థాట్స్ ఇవన్నీ ఆ కవచం లాంటివే. ఆ కవచాన్ని తొలగిస్తే మన నిజమైన రూపం బయటపడుతుంది.
(03:54) అంటే ప్రతి విషయానికి భయపడటం, జరగబోయే విషయానికి నెగిటివ్ గా ఆలోచించడం, అహంకారంతో ప్రవర్తించడం ఇవన్నీ ఆ తుప్పు పట్టిన కవచం లాంటివే. వాటిని నువ్వు తొలగిస్తే నువ్వు సంతోషంగా జీవించగలవు. అందుకే నువ్వు ఒక మంచి వ్యక్తిగా మారాలంటే కొత్త విషయాలను జోడించాల్సిన అవసరం లేదు. బదులుగా నీలో ఉన్న అన్ెసెసరీ హ్యాబిట్స్ ఈగో నెగిటివ్ థింగ్స్ వీటన్నిటిని తొలగిస్తే మన అసలు రూపం బయటపడుతుంది.
(04:24) మనలో చాలామంది ఐఫోన్స్ గాడ్జిమెంట్స్ వాడుతుంటారు. ఎందుకు అని అడిగితే ఇది ఉంటేనే హ్యాపీగా ఉంటాము అని అంటుంటారు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు తను రిచ్ గా కనబడాలి తన జీవితంలో లగ్జరీ లైఫ్ ఉండాలి అనే భావంతో తన జీవితంలోకి కొత్త కొత్త వస్తువులు తెచ్చుకునేవాడు. అది ఫోన్ కావచ్చు, లాప్టాప్ కావచ్చు లేకపోతే వేరే ఏదనా వస్తువు కావచ్చు.
(04:48) అలాగే తన సరౌండింగ్ లో తిరిగే మనుషులు కూడా రిచ్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటే వాళ్ళ దగ్గర హ్యాపీనెస్ ఉంటుంది అని ఫీల్ అయ్యేవాడు. కానీ కొంత కాలానికి ఆ వస్తువులన్నీ కూడా తనకి హ్యాపీనెస్ ని తీసుకురావడం లేదు అని అతనికి అర్థమైంది. ఎందుకంటే జీవితంలో కొత్తగా ఏదన్నా వస్తువు వచ్చినప్పుడు మనం దానిని చూసి ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ గా మారిపోతుంది.
(05:09) దీనికి ఓషో ఏం చెప్తున్నాడంటే ఆనందం అనేది బయట నుంచి వచ్చేది కాదు మీ అంతరంగం నుంచి ఉద్భవిస్తుంది. అంటే బయట పరిస్థితులు మారకపోయినా మన మనసు కాముగా ఉంటే మనం సంతోషంగా ఉండగలం. ఒక ఉదాహరణ చూద్దాం నువ్వు ఒక కారు కొన్నా లేకపోతే ఒక ఇల్లు కొన్నా అవి నీకు ఒక వారం లేకపోతే ఒక నెల వరకు నీకు సంతోషాన్ని తెచ్చిపెట్టగలవు. కానీ తరువాత ఆ ఆనందం తగ్గిపోతుంది.
(05:36) అందుకే ఎప్పుడు కొత్త కొత్త వస్తువుల మీద మాత్రమే ఆనందం వెతకవద్దు. నీ లోపల నువ్వు సంతోషపడటం నేర్చుకో. ఎందుకంటే నీలో నువ్వు సంతోషపడటం నేర్చుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉండగలవు. మనసుకి నచ్చని దాన్ని చేస్తూ అందులో హ్యాపీనెస్ ని వెతకడం కన్నా మనసుకు నచ్చిన దానిని చేస్తూ అందులో తృప్తి పడటం మన జీవితాన్ని ఎప్పుడూ చిరునవ్వుతో ముందుకు నడిపిస్తుంది.
(06:00) నేను నమ్ముతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
No comments:
Post a Comment