*ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ కర్మలు ఎవరి దోషం, భగవంతుడు ఇస్తున్నారా, లేక మనమే కొని తెచ్చుకుంటున్నామా??*
🎵మానవులు వేసుకొందురు మీరు విషమిత్తు ఫలములు,
ఆశింతురు నేడు అతి రుచ్య ఫలములు!
కాచిన కడుచేదు కాయలు తినలేక, దోషము భగవంతుని పైన దోషి వాదింతురు!...🎵🎵
వేసుకున్నటువంటివి విషమిత్తులు, ఆశించేది తీయని ఫలములు, చేదు ఫలములు భుజించలేక, దోషము భగవంతునిపైన వేస్తున్నారు.
ఇదియే ఈనాటి అజ్ఞానము, ఇలాంటి మానవత్వములోపల ఎంత పవిత్రమై ఉండవలసినటువంటి పై స్థితి.
కనుక మొట్టమొదట మనము సద్గుణములను, సదాచారములను లోపల ప్రవేశింపచేసుకోవాలి.
ఇలాంటి భావనలు ఒక్క దైవ చింతన చేతనే లభ్యమౌతుంది!
దైవ చింతన మరిచి, సుఖాలకు, మాయా లోకంలో విహరిస్తూ, భగవంతుని మరిచిన వానికి, భగవంతుడు ఎప్పుడూ దూరంగానే ఉంటారు...
*_🌺శుభమస్తు🌺_*
No comments:
Post a Comment