బానిసత్వమనే విషాన్ని నైతిక విలువల పేరుతో మనలోకెలా ఎక్కిస్తున్నారో నీకసలు తెలుసా? || PRATIKULA VEDAM
Author Name:PRATIKULA VEDAM
Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FZm_vq9rOMA
Transcript:
(00:00) ఒక సమాజం దేనికి ఎక్కువ భయపడుతుందో తెలుసా తీవ్రవాదులకి కాదు ఆర్థిక మాంధ్యానికి కాదు ఒక ఆలోచించే మనిషికి మీ పిల్లలకు స్కూల్లో నైతిక విలువలు నేర్పిస్తున్నారు అనగానే మీరు చాలా సంబరపడిపోతున్నారా ఆగండి. రీసెంట్ గా ప్రవచనాలు చెప్పే వాళ్ళకి ఏకంగా క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి మరి స్కూల్స్ కి ఎందుకు పంపిస్తున్నారో తెలుసా? వాళ్ళకి ఏమైనా మీ పిల్లలు గౌతమ బుద్ధుడిలా మారిపోవడం ఉందా? లేదు పొలిటికల్ సిస్టం కి ఎప్పుడూ ప్రశ్నించే పౌరులు వద్దు తల దించుకొని ఫాలో అయ్యే గొర్రెలు కావాలి.
(00:29) ఇక్కడ నైతికత అంటే అర్థం ఏంటో తెలుసా వాళ్ళు గీసిన గీతని దాటకపోవడం అది మొరాలిటీ కాదు పాలిష్ చేసిన స్లేవరీ విపక్షను కుల అహంకారాన్ని నర నరాన జీర్ణించుకున్న ఆ చాదస్తపు మనుషులని తీసుకొచ్చి సెక్యులర్ స్కూల్స్ లో మోరల్ క్లాసులు చెప్పమంటే ఎలా ఉంటుందో తెలుసా ఒక తోడల దగ్గరికి వెళ్లి గొర్రె పిల్లలకి శాఖహారం గురించి క్లాసులు తీసుకోమన్నట్టు ఉంటది.
(00:48) ఎడ్యుకేషన్ పేరుతో జరుగుతున్న ఈ సైకలాజికల్ గేమ్ ఏంటి? మీ పిల్లల మెదళలోకి ఎక్కిస్తున్న ఆ సాఫ్ట్ పాయిజన్ ఏంటి? మనం గొర్రెలను పెంచి పెద్ద చేసి అవి సింహాల్లా బ్రతకాలనుకుంటే ఎలా అసలు నైతిక ముసుగులో జరుగుతున్న ఈ సోషల్ ఇంజనీరింగ్ వెనక ఉన్న బ్లాక్ అండ్ వైట్ నిజాలు ఈ పాడ్కాస్ట్లో ఒక సమాజం దేనికి ఎక్కువగా భయపడుతుందో తెలుసా ఒక ఆలోచించే మనిషికి ప్రశ్నలు అడిగే మెదడికి ఎందుకంటే ఒక మనిషి ఆలోచించడం మొదలుపెడితే ఈ సమాజం పునాదులుగా కట్టుకున్న చాలా అబద్ధాలు పేక మెడల కూలిపోతాయి అందుకే ప్రతి సమాజం ప్రతి ప్రభుత్వం ప్రతి మతం పిల్లలకి చిన్నప్పటి నుంచే ఒక వ్యాక్సిన్ వేయాలని చూస్తాయి. ఆ
(01:31) వ్యాక్సిన్ పేరే నైతిక విలువలు మోరల్ వాల్యూస్ రీసెంట్ గా మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రవచనాలు చెప్పేవాళ్ళకి మత గ్రంథాలు వళ్లించే వాళ్ళకి ఏకంగా క్యాబినెట్ హోదాలు ఇచ్చి స్కూల్ పిల్లలకి నైతిక పాఠాలు చెప్పమంటున్నారు. కానీ అసలు దీని వెనుక జరుగుతున్న సైకిలాజికల్ గేమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
(01:52) అసలు ప్రభుత్వాలకు పిల్లల నైతికత మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొస్తుంది వాళ్ళక ఏమైనా మన పిల్లలు గౌతమ బుద్ధుడు అంతా ఉత్తముల్లా మారిపోవాలని ఉందా లేదు పాలిటిక్స్ అండ్ పవర్ ఎప్పుడూ కూడా ఒకే ఫార్ములా మీద నడుస్తాయి. దాని పేరే ఒబీడియన్స్ అంటే విధేయత. ఒక వ్యవస్థ సజావుగా నడవాలంటే ప్రశ్నించే పౌరులు కాదు తలదించుకొని ఫాలో అయ్యే గొర్రెలు కావాలి.
(02:18) ఈ గొర్రెల మందను తయారు చేసే ఫ్యాక్టరీలే మన ఎడ్యుకేషన్ సిస్టం ఇక్కడ నైతికత అంటే అర్థం ఏంటో తెలుసా వాళ్ళు గీసిన గీతని దాటకపోవడం సిస్టం ని అథారిటీని క్వశ్చన్ చేయకపోవడం ఒక పిల్లాడు క్లాస్ లో సైలెంట్ గా కూర్చొని టీచర్ చెప్పిందల్లా గుడ్డి గా రాసుకుంటూ ఉంటే వాడు గుడ్ బాయ్ అదే పిల్లాడు ఇది ఎందుకు ఇలాగే ఉండాలి లాజికల్ గా ఆలోచిస్తే ఇది తప్పు కదా అని నిలదీస్తే వాడు ఆరోగెంట్ మనం నిజంగా మొరాలిటీనే నేర్పిస్తున్నామా లేక బానిస సత్వాన్ని పాలిష్ చేసి దానికి తెలివిగా నైతికత అని పేరు పెడుతున్నామా ఇలాంటి బానిసత్వాన్ని నేర్పించడానికి ప్రభుత్వాలకి మత పెద్దలు
(02:55) ప్రవచనకారుల అవసరం చాలా ఉంటది. ఎందుకంటే ప్రజలు ఒక పొలిటీషియన్ మాట వినకపోవచ్చు కానీ దేవుడి పేరు చెబితే ధర్మం పేరు చెబితే కళ్ళు మూసుకొని గుడ్డిగా ఫాలో అయిపోతారు. సో ఇది పిల్లల భవిష్యత్తు కోసం వేసిన అడుగు కాదు రేపటి ఓటు బ్యాంక్ కోసం ఒక ఒబీడియంట్ సొసైటీని తయారు చేసుకోవడానికి చేసిన అద్భుతమైన పొలిటికల్ స్ట్రాటజీ ఇక అసలు విషయానికి వద్దాం.
(03:20) ఈ మోరల్ గైడెన్స్ ఇవ్వడానికి మనం ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటున్నాం కొన్ని వందల ఏళ్ల క్రితం రాసిన మనుధర్మం లాంటి పాత పుస్తకాలని వాటిలో ఉన్న వివక్షని డిస్క్రిమినేషన్ ని ఇప్పటికీ మోస్తూ ఉన్న చాదస్తపు మనుషుల్ని ఒక మనిషి కేవలం ఒక కులంలో పుట్టినంత మాత్రాన వాడు జీవితాంతం సమాజం దృష్టిలో ఒక అసహ్యకరమైన బానిసలా బ్రతకాలని డిజైన్ చేసిన ఈ గ్రంథాలలో ఏముందని నైతికత అదొక పచ్చి అహంకారం అదొక సోషల్ ఇంజనీరింగ్ ఇలాంటి ఐడియాలజీని నర నరాన జీర్ణించుకొని దాన్ని గ్లోరిఫై చేసే వ్యక్తులని తీసుకొచ్చి సెక్యులర్ స్కూల్స్ లో కూర్చోబెట్టి మా పిల్లలకి మంచి
(03:54) నేర్పించండి అని అడగడం ఒక తోడేల దగ్గరికి వెళ్లి గొర్రె పిల్లలకి శాఖహారం గురించి క్లాసులు తీసుకోమన్నంత హాస్యాస్పదంగా ఉంటుంది. వీళ్ళు స్కూల్స్ కి వెళ్లి డైరెక్ట్ గా నువ్వు తక్కువ వాడివి నువ్వు ఎక్కువ వాడివి అని చెప్పరు అది పాత స్ట్రాటజీ మరి కొత్త స్ట్రాటజీ ఏంటి పుక్కిటి పురాణాలను మెతక మెతక మాటల్ని కలిపి పిల్లల బ్రెయిన్స్ లోకి ఒక సాఫ్ట్ పాయిజన్ లా ఎక్కిస్తారు.
(04:16) వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నో లేదా సుపీరియారిటీ కాంప్లెక్స్ నో ఇన్స్టాల్ చేస్తారు. సరే ప్రవచనకారులని పక్కన పెడదాం. నైతికత అనేది స్కూల్లో టీచర్లు నేర్పించాలి కదా అని కొంతమంది వాదిస్తుంటారు. ఇదొక పెద్ద ఇల్యూషన్ టీచర్ అంటే వాళ్ళు ఏమైనా ఆకాశం నుండి ఊడిపడినోళ్ళా వాళ్ళు కూడా ఈ కుళ్లిపోయిన కండిషన్ అయిపోయిన సమాజం నుంచి వచ్చిన వాళ్లేగా తమ సొంత ఫ్రస్ట్రేషన్స్ లో భయాలతో కులమత పిచ్చి ఉన్న ఒక సాధారణ మనిషి ఒక పిల్లడికి స్వచ్ఛమైన నైతికత ఎలా నేర్పిస్తాడు? చాలా స్కూల్స్ లో పిల్లలకి భయపెట్టి బెత్తంతో కొట్టి మరి డిసిప్లిన్
(04:50) నేర్పిస్తుంటారు. దీన్ని సాక్రటీస్ లాంటి ఫిలాసఫర్స్ దృష్టిలో చూస్తే భయం నుంచి పుట్టేది నైతికత కాదు అది ఒక ముసుగు మాత్రమే కొడితేనే మాట వింటున్నాడు అంటే వాడు మంచివాడయ్యాడని కాదు నువ్వు కొట్టే దెబ్బకు భయపడి తన ఒరిజినల్ క్యారెక్టర్ ని దాస్తున్నాడు అని అర్థం. భయంతో బ్రతికేవాడు అవకాశం దొరికిన మొట్టమొదటి క్షణంలోనే క్రూరుడిగా మారతాడు.
(05:15) నిజమైన నైతికత ఒక సిలబస్ లాగా బయట నుంచి ఎవరో ఇంజెక్ట్ చేస్తే వచ్చేది కాదు అది మనిషి లోపల నుంచి అవేర్నెస్ నుంచి పుట్టాలి. మంచి ఏదో చెడు ఏదో ఎవరో చెబితేనే ఫాలో అవ్వడం బానిసత్వం ఏది మంచో ఏది చెడో తనంతట తానుగా లాజికల్ గా ఆలోచించి తెలుసుకొని స్వేచ్ఛను ఇవ్వడమే నిజమైన విద్య. మనుషులు ఎప్పుడు తమ బుర్రని వాడటానికి బద్దకిస్తారు.
(05:41) అందుకే తమ కోసం ఆలోచించే ఒక గురువు కోసమో బాబా కోసమో ఒక సిస్టం కోసమో వెతుకుతుంటారు. నీకుగా నువ్వు ఏమి ఆలోచించక్కర్లేదు జస్ట్ నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపో అని ఎవరైనా చెబితే జనాలు గొర్రెల్లా తలుపుతారు. ఈ సైకలాజికల్ వీక్నెస్ ని ప్రభుత్వాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ మొత్తం ప్రాసెస్ లో మనం కోల్పోతున్నది ఏంటో తెలుసా రేపటి తరం యొక్క క్రిటికల్ థింకింగ్ పిల్లలకి మనం హౌ టు థింక్ అంటే ఎలా ఆలోచించాలి అనేది నేర్పించాల్సింది పోయి వాట్ టు థింక్ అంటే ఏం ఆలోచించాలి అని మనకు నచ్చిన చెత్తనంతా వాళ్ళ మెదడలో కుక్కుతున్నాం.
(06:18) ఒక పక్షి పుట్టుకుతోనే పంజరంలో పుడితే ఎగరడం అనేది ఒక జబ్బు అనుకుంటదట. ఇప్పుడు మనం మన పిల్లల చుట్టూ మనకున్న చాదస్తపు కబుర్లతో పనికిమాలిన రూల్స్ తో ఒక పంజరాన్ని అల్లుతున్నాం. ఆ పంజరాన్ని డెకరేట్ చేయడానికే ప్రవచనకర్తలకు ఇస్తున్న ఈ క్యాబినెట్ ర్యాంకులు ఈ ప్రవచనాల అపాయింట్మెంట్లు సమాజానికి ఇప్పుడు కావాల్సింది కొత్త రూల్స్ రాసే అథారిటీలు కాదు అసలు ఆ రూల్స్ ని ఆ పునాదుల్ని ప్రశ్నించే ఇంటలెక్చువల్ ఇండిపెండెన్సీ కావాలి.
(06:48) మనం గొర్రెల్ని పెంచి పెద్ద చేసి అవి రేపు సింహాల్లా బ్రతకాలని ఆశిస్తున్నాం. అది అసాధ్యం మార్పు రావల్సిందే పిల్లల సిలబస్ లో కాదు వాళ్ళు పెంచుతున్న మన మెథడ్లో అవునా కాదా ఆలోచించండి
No comments:
Post a Comment