Friday, July 24, 2026

 ఆ పుస్తకాలు చూస్తూంటే బాల్యం గుర్తు వచ్చింది 
చదవాలి అనిపించాయి 
చదివాను...

కంప్యూటర్స్ స్మార్ట్ ఫోన్స్, ఆడియో బుక్స్ ,సౌండ్ సిస్టమ్స్,వీడియో గేమ్స్,
ఒటిటి..ల మధ్య 
"పుస్తకం,చదవటం.."అనేది తెలియని విషయం అయిపోతున్న రోజుల్లో, 
పిల్లల ని ,పరీక్షలు-ర్యాంకులు-మీదగా బరువు భాద్యత సంపాదన లోకి తీసుకు పోతున్న కాలం లో-
అమాయకమైన రోజులు,అమ్మ చెప్పే కథలు చెరిగిపోతున్న వేళలో-
ఈ పుస్తకాలు పిల్లలు చదివితే బాగుంటుంది అనిపిస్తుంది..!
ఒకవేళ పిల్లలు చదవక పొయినా  చదివించటం పెద్దల భాద్యత ..(కోరిక ,తీరిక, ఓపికా లేకపోయినా చేసుకోవాలి పిల్లల కోసం )

రాయటం తెలిసిన గొప్ప రచయత మనసు పెడితే ఏది అయినా -ఎవరి కోసమైనా బాగానే రాయచ్చు...
కనుక వీరేంద్రనాధ్ బాగా రాసాడని ప్రత్యేకం గా చెప్పను -కానీ 
పిల్లల కోసం రాయాలి అనకున్నందుకు వాళ్ళ ముందు జీవితానికి ఉపయోగ పడే కథలు రాసినందుకు హర్షిస్తాను ...అభినందిస్తాను 

సృష్టి లో చదువు కునే అదృష్టం ,అవకాశం 
"మనిషి "అనే యానిమల్ కే వుంది అనుకుంటా ....!!!
అది ఉపయోగించుకోకపోతే అంత దురదృష్టం వేరే లేదని కూడా అనుకుంటా!

No comments:

Post a Comment