Why Karma Never Fails? The Truth Explained by Machiraju Kiran Kumar | Sudheer Talks
Author Name:Sudheer Talks
Youtube Channel Url:https://www.youtube.com/@AadhanTalkies
Youtube Video URL:https://www.youtube.com/watch?v=A7423NxUVbM
Transcript:
(00:00) అసలు ఆనందం ఎక్కడ దొరుకుతుంది నేను ఎవరిని ఈ సందేహం ప్రతి మందిలో లైఫ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో కచ్చితంగా వచ్చి తీరుతుంది. ఒక రాయి తీసుకొని ఆ రాయిని శిల్పం లాగా మారుస్తాడు ఎలా మారుస్తాడు రాయి కాని దాన్ని తీసేస్తే అద్భుతమైన దేవుడి విగ్రహం వస్తుంది. నేను ఎవరిని అని తెలియాలంటే నేను కానిది ఏంటో ముందు తెలుసుకోవాలి కాలేజీ రోజుల్లో ఎవరైనా సరే ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను అంటారు.
(00:27) ఆ అబ్బాయి లేకపోతే నేను చచ్చిపోతాను అంటారు అంత తీవ్రమైన ఆకర్షణలోకి వెళ్ళిపోతారు కానీ వివాహం అయిన తర్వాత అంత ఆకర్షణ ఉంటుంది అది నాలుగుైదు సంవత్సరాల తర్వాత ఏమేమి ఉండదు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ప్రపంచంలో అసలు ఈ సృష్టిలోనే ఎప్పటికీ ఆనందాన్ని ఇచ్చే వస్తువు గాని వ్యక్తి గాని పదార్థం గాని ఏదీ లేదు. ప్రతిదానికి షార్ట్ కట్స్ వెతుక్కుంటారు కదా ఈ హూ యమ్ ఐ తెలుసుకోవడానికి ఏదనా షార్ట్ కట్ ఉందా అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య ఈ ఓవర్ థింకింగ్ సరే ఆ ఎడారిలో నడుస్తూ అన్ని రకాలుగా బాధలు పడుతూ అబ్బా నేను బాగా అలసిపోయాను స్నానం చేయాలి ఇక్కడ నీళ్లు ఉంటే బాగుండు
(01:03) నేను స్నానం చేయడానికి అనుకున్నాడు. వెంటనే అక్కడ కల్పవృక్షం కదా కల్ప వృక్షం కొమ్మ కదా నీళ్లు కనిపించినాయి ఆశ్చర్యపోయాడు నాకు ఇప్పుడు తినటానికి ఏమైనా ఉంటే బాగుండు అది కూడా బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం ఉంటే బాగుండు అనుకుంటాడు వెంటనే అక్కడ బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం వచ్చేస్తుంది అయినా కూడా ఇంకొక్కసారి చివరిగా పరీక్ష పెడదాం అని చెప్పేసి నా భార్య కూడా ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ ఉంటే బాగుండు అనుకుంటాడు అనుకోంగానే క్షణాల్లో భార్య అక్కడ ఉంటుంది ఆశ్చర్యపోతాడు కొంపతీసి ఈవిడ నా భార్య లేకపోతే ఏవైనా బ్రహ్మ రాక్షసా అనుకుంటాడు
(01:34) కానీ ఆ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి ఏది కోరుకుంటే అది జరుగు కదా భార్య బ్రహ్మరాక్షసిగా మారిపోతుంది కొంపతీసి బ్రహ్మరాక్షసి భూతం ఇప్పుడు నన్ను మింగదు కదా అనుకుంటాడు వెంటనే ఆ వర్తకుడిని మింగేసి ఆ బ్రహ్మరాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి మీరు చూడండి రమణ మహర్షి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది ఆయన శరీరం మీద రాచ కురుపు వచ్చింది మీకు తెలిసే ఉంటుంది కదా పెద్ద పుండు వస్తే చీమ పోసి అందులో పురుగు వచ్చేసి ఆయన్ని తొలిచేస్తూ ఉంటే శిష్యులు భక్తులు అందరూ కూడా స్వామి వైద్యం చేయించుకోండి అంటే ఎవరికి వైద్యం చేయించుకోమంటారు అని
(02:06) అడిగాడు ఎవరికి ఏంటి స్వామి మీ శరీరానికి అంటే దానికి జయించుకోమంటారా నాకు జయించుకోమంటారా అన్నారు దానికి అంటే ఏంటి అది శరీరం ఆత్మ వేరు ఆత్మ వేరు కదా ఆయన కాబట్టి దీనికి పుండు వచ్చింది అన్నారు మనం అనలేముగా ఊరికే కూర్చొని నేను శరీరం కాదు నేను ఇంద్రియాలు కాదు నేను మనసు కాదు నేను బుద్ధి కాదు నేను ఆత్మని నేను ఆత్మని అనుకుంటే ఉపయోగం లేదు ఆ ఆత్మన అన్న భావాన్ని ఒక సద్గురువుని ఆశ్రయించి పొందగలగాలి మనం ఏ తప్పు చేసినా ఎవరికీ తెలియనప్పటికీ మనకు తెలుస్తుంది మనం తప్పు చేసామని లోపల అంతరాత్మ చెప్తుంది కదా ఈ అంతరాత్మతో కనెక్షన్ ఏంటి ఇది ఏం చెప్తుంటుంది
(02:40) యాక్చువల్ గా ఇక్కడ లోపల నువ్వు తప్పు చేస్తున్నావ్ అని చెప్పేది అంతరాత్మ అని అందరు అంటారు కానీ కత్తి తీసుకొని మనం ఎదుటి వ్యక్తిని పొడిచాం అనుకోండి ఏం చేస్తారు చనిపోతారు మనల్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు అదే ఒక డాక్టర్ కత్తి తీసుకొని పొడిచాడు అనుకోండి ఏం చేస్తారు నథింగ్ ఆపరేషన్ ఆపరేషన్ అంటారు డాక్టర్కి సన్మానం చేస్తారు పెద్ద పేరు వస్తుంది డబ్బు వస్తుంది కత్తి అదేగా అవును పొడవటం అదేగా కర్మ ఎప్పుడ కూడా ఫలితాన్ని ఇవ్వదు కర్మ వెనక ఉన్న ఉద్దేశం బట్టే ఫలితం వస్తుంది.
(03:10) శరీరం నేను కాదు, తీసెయ్, మనసు నేను కాదు, తీసెయ్, బుద్ధి నేను కాదు, తీసెయ్, నా ఆలోచనలు నేను కాదు, తీసెయ్, వీటన్నిటికి అతీతంగా లోపల ఉండి ఒక శక్తి నన్ను నడిపిస్తుందో అదే నేను. నమస్కారం స్వామి. నమస్తే అండి. శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మాత్రే నమః ఎలా ఉన్నారు స్వామి. చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు? అంత బాగున్నాను స్వామి.
(03:36) స్వామి ప్రతి ఒక్క మనిషికి కూడా ఏంటంటే పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా జీవిత ప్రయాణం ఎన్నో రకాలుగా కనిపిస్తుంది. ఒకరు సంతోషంగా ఉంటారు ఒకరోజు బాధగా ఉంటారు ఒకరోజు ఇరిటేషన్ లో కనిపిస్తారు. సో రకరకాల ఎమోషన్స్ ఒక మనిషితో ఉంటాయి. సో నాకు ఈ పాడ్కాస్ట్ లో హూ యామ్ ఐ అనే క్వశ్చన్స్ కి మీ నుంచి చాలా ఆన్సర్స్ కావాలి. ఒక ఆస్ట్రాలజర్ గా చెప్తారో ఒక అసోసియేట్ ప్రొఫెసర్ గా చెప్తారో కానీ కానీ మా ఆడియన్స్ కి మాత్రం మీరు చెప్పే ప్రతి ఒక్క మాట అర్థం అవ్వాలి.
(03:59) ఓకే తప్పకుండా అండి. సో ఫస్ట్ క్వశ్చన్ స్వామి స్వామి మన చుట్టూ కోట్లాది మంది మనుషులు ఉన్నారు. అందరి జీవితాలు ఒకేలాగా కనిపించవు కానీ ఏ ఇద్దరి ఆలోచనలు ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ కూడా అస్సలు మ్యాచ్ అవ్వవు ఇంత పెద్ద ప్రపంచంలో నాకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఈ ప్రకృతి ఎందుకు ఇచ్చింది అంటారు ముందుగా సుధీర్ గారు ఇంత అద్భుతమైన సబ్జెక్టు తీసుకున్నందుకు మీకు కంగ్రాాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ మనిషికి కూడా శాశ్వతమైన పరిపూర్ణమైన ఆనందం అనేది ఉండదు.
(04:26) అసలు ఆనందం ఎక్కడ దొరుకుతుంది నేను ఎవరిని ఆ ఈ సందేహం ప్రతి మందిలో లైఫ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అయితే వీటన్నిటికీ సమాధానం రావాలంటే మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్న తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. ఓకే ఒక శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ వ్యక్తికి ఎందుకు ఆ ఐడెంటిటీ వచ్చింది అనేది మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే అసలు తల్లి గర్భంలో ముందు శిశువు ఎలా ఉంటుంది ముందు నురగగా ఉంటుంది అవును తర్వాత బుడగగా ఉంటుంది అవును ఆ తర్వాత పిండం లాగా మారుతుంది.
(05:00) విత్తనం నుంచి మొలకలు వచ్చినట్లుగా కాళ్ళు చేతులు అన్ని వస్తాయి. తల్లి గర్భంలో చాలా చీకటిగా ఉంటుంది. మ్ విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. తల్లి గర్భంలో శిశువు తట్టుకోలేడు. ఒక్కొక్కసారి తల్లి తీసుకునే ఆహారం సరిగ్గా పడక ఇబ్బంది పడిపోతూ ఆ గర్భస్థ శిశువు ఉంటుంది. అప్పుడు తల్లి కడుపులో ఉన్నటువంటి శిశువు పరమేశ్వరుని ప్రార్థిస్తుందని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు శివ అపరాధ స్తోత్రం చేస్తూ చెప్పారు.
(05:28) ఓకే అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పరమేశ్వర నేను పూర్వజన్మలో ఎన్నో తప్పులు చేశాను ఎన్నో పాపాలు చేశాను నిన్ను పూజించలేకపోయాను పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల మళ్ళీ నాకు జన్మ వచ్చింది నేను తల్లి గర్భంలోకి వచ్చానని తల్లి గర్భంలో ఉన్న శిశువు పరమేశ్వరుని పూర్వజన్మలో చేసిన తప్పులు క్షమించమని ప్రార్థిస్తుందని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు.
(05:53) ఓకే మరి తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు కూడా చాలా బాధలు ఉంటాయి. మీరు చూడండి చిన్న పిల్లలు చీమ కుడితే చెప్పుకోలేరు అవును దోమ కుడితే చెప్పుకోలేరు అవును ఏ సమస్య వచ్చినా సరే ఏడవటం తప్ప ఏం చేయలేరు కరెక్ట్ ప్రతిదానికి బాధపడుతూ ఉంటారు అంటే చిన్న వయసులో బాధలు ఉంటాయి ఆ తర్వాత యవ్వనం వచ్చేసరికి కన్ను ఏదో చూడాలనుకుంటుంది చెవులు ఏవేవో వినాలనుకుంటాయి అలా ఇంద్రియాల వల్ల అనేక రకాలైన బాధలు ఎదుర్కొంటూ ఉంటారు.
(06:23) ఇక చివరికి వృద్ధాప్యం వచ్చేసరికి వృద్ధాప్యంలో చాలా మందికి అనేక రకాలైన బాధలు ఉంటాయి. శారీరక బాధలు ఉంటాయి మానసిక బాధలు ఉంటాయి శారీరక బాధలేమో అనారోగ్య సమస్యలు మానసిక బాధలేమో ఎవరు చెప్పిన మాట వినరు ఎవరికి వాళ్ళు వృద్ధాప్యంలో తప్పించుకొని వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటారు అంటే ఒక్కసారి మీరు జాగ్రత్తగా మనిషి జీవితాన్ని అబ్సర్వ్ చేస్తే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి శిశువు జన్మించి బయటికి వచ్చినప్పుడు తర్వాత పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధ అనేది వెంటాడుతూనే ఉంటుంది అవును అయితే మీరు అన్నట్లు ఈ బాధలు ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటాయి ఇందాక
(06:59) మీరు అడిగిన ప్రశ్న ప్రకారం కొంతమందికి ఒకలా బాధలు ఉంటాయి ఇంకొంతమందికి ఇంకొకలా ఉంటాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది కొంతమందికి సుఖాలు ఎక్కువ ఉంటాయి కొంతమందికి దుఃఖాలు ఎక్కువ ఉంటాయి ఇలా అనేకమందికి ఇలా సుఖాలు దుఃఖాలు అన్ని వేరు వేరుగా ఎందుకు ఉంటాయి అంటే దానికి కారణం కర్మ ఫలితం ఓకే ఎవ్వరైనా సరే ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నారు అంటే దానికి కారణం కర్మ ఫలితం ఈ కర్మలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి ఆగామి సంచిత ప్రారబ్ధ ఓకే ప్రారబ్ధ కర్మలు అంటే ఎప్పుడో మనం పూర్వ జన్మల్లో చేసుకున్నటువంటి కర్మల వల్ల వచ్చే ఫలితాలు సంచిత కర్మలు అంటే మనం ఇప్పుడు ఈ జన్మలో
(07:38) పనులు చేస్తుంటాంగా కర్మలు చేస్తుంటాంగా వాటి వల్ల వచ్చే ఫలితాలు ఆగామి అంటే తర్వాతి జన్మల్లో కూడా మనం కొన్ని పనులు చేస్తాంగా వాటి వల్ల కర్మల వల్ల కొన్ని ఫలితాలు వస్తాయిగా వాటిని ఆగామి అంటారు ఇలా కర్మ ఫలితాలను బట్టే జన్మ అనేది ఉంటుంది మనం పుట్టినప్పుడు పుణ్యం చేసామ అనుకోండి శరీరం విడిచి పెట్టిన తర్వాత స్వర్గానికి వెళ్తాం పాపం చేసామ అనుకోండి శరీరం విడిచిపెట్టిన తర్వాత నరకానికి వెళ్తాం పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం పాపం చేస్తే నరకానికి వెళ్తాం కానీ పుణ్యం గాని పాపం గాని కరిగిపోగానే ఏమవుతుంది మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి పునరపి జననం
(08:17) పునరపి మరణం పునరపి జననే జటరే సైనం మళ్ళీ తల్లి కడుపులోకి రావాల్సిందే జన్మ ఎత్తాల్సిందే ఇది సైకిల్ అన్నమాట అంటే ప్రతి జన్మలో కూడా మనం పుణ్యమో పాపమో చేయకుండా ఉండలేము కదా ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి ఆ పుణ్యాన్ని బట్టి గాని పాపాన్ని బట్టి గాని ఆ కర్మను బట్టి గాని మళ్ళీ మనకు జన్మ వస్తూ ఉంటుంది ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది.
(08:38) ఓకే అందువల్ల ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పుణ్యాన్ని బట్టి గాని పాపాన్ని బట్టి గాని జన్మలు అనేటటువంటివి ఎత్తుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మనకి ఈ జన్మ అయిపోయిన తర్వాత తర్వాత జన్మ వస్తుంది కదా అవును ఆ జన్మ ఎలా వస్తుంది అనేది ప్రధానంగా దేని మీద డిపెండ్ అయి ఉంటుందో తెలుసా మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు చివరి క్షణంలో దేన్నైతే స్మరించుకుంటూ ఉంటామో రాబోయే జన్మ మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుంది.
(09:05) ఓకే అందుకే ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు నోట్లో తులసి తీర్థం పోయండి అంటారు నారాయణ నామం చెప్పుకోమంటారు ఎందుకు భగవన్ నామం చెప్పుకుంటే తర్వాతి జన్మ ఆ చివరి క్షణంలో చేసేటటువంటి పుణ్యం వల్ల మంచిది వస్తుంది అని చెప్తారన్నమాట కానీ జన్మలకు కారణం మాత్రం ఆశ కోరిక ఆశ కోరిక కోరిక వల్లే జన్మలు వస్తూ ఉంటాయి మీకు ఒక చిన్న కథ చెప్తాను చాలా అద్భుతమైన కథ ఒక అద్భుతమైన బ్రాహ్మణుడు వేద వేదాంగాలు చదివాడు మ్ అన్ని శాస్త్రాలు తెలుసుకున్నాడు హమ్ ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఓకే రాజుగారి దగ్గరికి వెళ్లి తన విద్యను ప్రదర్శించాడు. ఆ విద్య పాండిత్యం చూసి
(09:41) రాజుగారి ఆనందంతో నీకేం కావాలని అడుగుతాడు పాపం ఆ బ్రాహ్మణుడికి ఉండటానికి ఇల్లు ఉండదు అందుకని భూమి ఏదైనా దొరికితే ఇల్లు కట్టుకొని ఉందామని రాజుగారు నాకు కొంత భూమి ఇప్పించండి అని అడుగుతాడు అయితే ఈ బ్రాహ్మణుడి అద్భుతమైన పాండిత్యానికి మెచ్చి రాజుగారు నీకు కొంత భూమి ఇవ్వటం కాదు నీవు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒకరోజు ఎంత దూరం అయితే పరిగెత్తుతావో అన్ని గజాల భూమిని నీకు ఇచ్చేస్తాను ఆ భూమిని నువ్వు ఏవైనా చేసుకో నీ పాండిత్యానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను అని రాజుగారు చెప్తారు సరే ఆ బ్రాహ్మణుడు అన్ని వేదాలు చదివాడు
(10:17) ఉపనిషత్తులు చదివాడు శాస్త్రాలు చదివాడు కానీ ఆశను జయించలేకపోయాడు ఒక మంచి రోజు చూసుకొని సూర్యోదయం నుంచి మొదలుపెట్టి పరిగెత్తడం ప్రారంభించాడు ఒక్క క్షణం కూడా ఆగట్లేదు పరిగెత్తుతూనే ఉన్నాడు ఎందుకు ఆగితే కొన్ని గజాల భూమి తగ్గిపోతుంది రాజుగారు ఇచ్చే భూమి తగ్గిపోతుంది పరిగెత్తుతూనే ఉన్నాడు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది ఎండ ఆకలేస్తుంది ఆకలేసి భోజనం తిందామని ఆకితే అమ్మో కొంత భూమి నేను నష్టపోతానేమో వద్దు ఒక్కరోజు భోజనం చేయకపోతే ఏమైందని మళ్ళీ పరిగెత్తుతూనే ఉన్నాడు సాయంకాలం సూర్యాస్తమయం వరకు అలసట వస్తున్న ఆకలి వేస్తున్న కళ్ళు తిరుగుతున్న అలానే
(10:55) పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి సూర్యాస్తమయమయం అయిపోయేసరికి ఒకచోట కూలబడతాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజపటులు వచ్చి అయ్యా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీరు చాలా గజాల భూమి భూమి పరిగెత్తారు ఈ భూమింతా కూడా మీకు రాసిస్తాం అంటే అప్పుడు ఆ పండితుడు ఏం చెప్తాడు అంటే నేను ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా ఎన్ని వేదాలు చదివినా కూడా ఆశను జయించలేకపోయాను ఇంతసేపు పరిగెత్తటం వల్ల నా ప్రాణం పోయేలాగా ఉంది నేను మాయను ఆశను జయించలేకపోయాను దయచేసి రాజుగారికి చెప్పండి నాకు ఒక ఆరు అడుగుల భూమి ఉంటే చాలు నన్ను అక్కడ పాతి పెట్టండి అని చెప్పి అక్కడికక్కడే ప్రాణాలు
(11:32) విడిచిపెట్టేసాడు అంటే అంతసేపు పరిగెత్తడం వల్ల మృత్యువు వచ్చేసింది అవును కాబట్టి ఆశ అనేది మనిషిని ఎలాంటి స్థితికి తీసుకొస్తుంది అంటే మృత్యువు దాకా తీసుకొస్తుంది. మనిషికి కోరిక అనేది నియంత్రణలో ఉండాలి. ఈ కోరికలను బట్టే మళ్ళీ జన్మ ఉంటుంది. కాబట్టి కోరికలు అదుపులో ఉంచుకోవాలి కర్మలను బట్టి కోరికలను బట్టి ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా వాళ్ళ వాళ్ళ పుణ్యాలు పాపాలు బట్టి జన్మలు అనేవి వస్తూ ఉంటాయి.
(11:57) బట్ ప్రతి ఒక్క జీవుడు కూడా అంటే పుట్టిన వాళ్ళకి కొన్ని రూల్స్ పెడతారు నువ్వు బాగా చదువుకోవాలి బాగా వెదగాలి నువ్వు పెళ్లి చేసుకోవాలి నువ్వు సంసారంలో ఇలా సెటిల్ అవ్వాలి ఇలా అంటే లైఫ్ లో ఇది సాధించు చాలు అంటుంటారు బట్ దాన్ని మీరు చెప్పిన ప్రకారం కోరిక ఇంకా పెంచి పెంచి మనిషిని ఒక స్టేజ్ కి తీసుకొస్తారు. అంటే మనం పరిగెడుతున్న డెస్టినేషన్ తప్ప లేక మనం వెతుకుతున్న సంతోషం ఇక్కడ లేదా చాలా అద్భుతమైన ప్రశ్న వేసారు.
(12:18) మీరు చూడండి అందరూ టార్గెట్స్ పెట్టుకుంటారు. నేను ఈ జాబ్ కొట్టాలి దానికోసం అహోరాత్రాలు కష్టపడి చదువుతారు. ఆ జాబ్ వస్తుంది. కొన్ని సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత ఆ జాబ్లో మొదటి రోజు ఉన్న ఆనందం ఉంటుందా ఉండదు ఉండదు అలాగే కొంతమందికి సొంత ఇంటి కల ఉంటుంది ఎలాగైనా సరే నేను బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటారు అహర్నిసలు కష్టపడి ధనం కూడబెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకుంటారు.
(12:42) ఆ బిల్డింగ్ కట్టుకొని గృహ ప్రవేశం చేసిన మొదటి రోజు ఉన్న ఆనందము ఐదు సంవత్సరాల తర్వాత ఉంటుందా 10 సంవత్సరాల తర్వాత ఉంటుందా అంటే జీవితంలో ఏదైనా సరే మీరు అడిగినట్లు టార్గెట్స్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేసిన తర్వాత ఆ ఆనందం అనేది శాశ్వతంగా ఉండదు దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తాను ఒకసారి ఒక ఊరిలో బ్రహ్మాండమైనటువంటి ధనవంతుడు ఒక పెద్ద విందు భోజనం ఏర్పాటు చేశాడు ఊళలో వాళ్ళందరూ వచ్చారు పంచభక్ష పరమాణాలతో బ్రహ్మాండమైన విందు భోజనం పెట్టాడు హ్మ్ షటసోపేతమైన విందు భోజనం పెట్టాడు ఓకే అదే సమయానికి ఒక సన్యాసి కూడా అక్కడికి వస్తాడు.
(13:16) మ్ సన్యాసి ఆ భోజనం దగ్గరికి రాకుండా వెళ్ళిపోతూ ఉంటే ఈ ధనవంతుడు వెళ్లి పిలిచి మరి ఆ సన్యాసిని స్వామి మీరు ఎంత సర్వసంఘ పరిత్యాగులైనా సరే నేను ఈరోజు ఏర్పాటు చేసిన భోజనంలో పాయసం ఉంటుంది స్వామి పరమాద్భుతంగా ఉంటుంది అసలు చాలా నాణ్యమైనటువంటి పాలతో యాలకులు జీడిపప్పులు అన్ని వేయించి తయారు చేయించాను మీరు భోజనం మొత్తం స్వీకరించకపోయినా ఆ పాయసం ఒక్కటి తాగి వెళ్ళండి స్వామి మీరు జీవితంలో ఆ పాయసం రుచి మర్చిపోలేరుఅని చెప్తాడు ఓకే ఇంకా ఆ సాధువు చిరునవ్వుతో సరే పదా అని చెప్పి అక్కడికి వచ్చి ఆ పాయసం తాగుతాడు.
(13:53) అయితే గౌరవం కోసం ఆ సాధువు పక్కనే ఈ ధనవంతుడు కూడా కూర్చుంటాడు. ఆయన కూడా పాయసం తాగుతాడు ఇప్పుడు సాధువు ఏం చెప్తాడంటే చాలా అద్భుతమైనటువంటి పాయసం తయారు చేయించావు కదా ఒక పుస్తకం తీసుకొని రా అంటాడు సరే ఆ పుస్తకం తీసుకొని వస్తాడు ఒక పెన్ను తీసుకోమంటాడు. ఈ పాయసం ఎలా ఉందో ఆ పుస్తకంలో రాయమని చెప్తాడు ఇంకేంటి ధనవంతుడు నేను తయారు చేయించిన పాయసం ఇంత అద్భుతంగా ఉంది అందరూ మెచ్చుకుంటున్నారని పరమాద్భుతంగా బ్రహ్మాండంగా ఉందని పుస్తకంలో రాస్తాడు తర్వాత ఇంకో గ్లాస్ పాయసం తెప్పించమని చెప్తాడు.
(14:25) ఆ గ్లాస్ తీసుకొచ్చిన తర్వాత అది కూడా తాగుతాడు. తాగిన తర్వాత ఇప్పుడు పాయసం ఎలా ఉందో పుస్తకంలో రాయమంటే ఇంతకుముందు రాసినంత ఉదృతంగా రాయకుండా నేను తయారు చేయించిన పాయసం బ్రహ్మాండంగా ఉందని రాస్తాడు. తర్వాత ఇంకో గ్లాస్ తెప్పించి తాగమంటాడు. ఈసారి ఏం రాస్తాడుఅంటే పాయసం చాలా బాగుంది అని రాసి వదిలేస్తాడు. ఆ తర్వాత నాలుగో గ్లాసు ఐదో గ్లాసు ఆరో గ్లాసు తాగేసరికి ఇప్పుడు పాయసం ఎలా ఉందో రాయమంటే పాయసం చేదుగా ఉంది ఇది తాగలేకపోతున్నాను అని చెప్పి రాస్తాడు.
(14:53) అప్పుడు సాధువు అంటాడు. ఎవ్వరూ తయారు చేయనంత గొప్పగా పాయసం తయారు చేయించావు అంటున్నావు మరి నువ్వు ఏడోసారి తాగేసరికి మొదటిసారి తీయగా ఉన్నటువంటి పాయసం ఏడోసారి ఎనిమిదోసారి వచ్చేసరికి చేదుగా ఎందుకు మారిపోయింది అంటే ఈ సృష్టిలో ఏ వస్తువైనా సరే ఏ పదార్థం అయినా సరే కొన్ని సంవత్సరాలు గడిచేసరికి దాని మీద ఉన్న ఆసక్తి మొత్తం పోతుంది.
(15:17) దాని మీద ఉన్న కోరిక తగ్గిపోతుంది అందుకే టార్గెట్స్ పెట్టుకొని ఏవైనా అచీవ్ చేయండి. వాటిలో టెంపరరీ హ్యాపీనెస్ ఉంటుంది పర్మనెంట్ హ్యాపీనెస్ ఉండదు ఈ సృష్టిలో ఏ వస్తువైనా ఉందా ఎప్పటికీ తరిగిపోని ఆనందం ఇచ్చే వస్తువు ఉందా ఏది లేదు ఏ మనిషి అయినా ఉన్నాడా కొంతమంది అంటారు ఈ మనిషి లేకపోతే నేను బతకలేను అంటారు కానీ ఆ మనిషి లేకపోయినా కొన్ని సంవత్సరాలకు అలవాటై బ్రతుకుతారు గా మనుషులు చనిపోయిన తర్వాత జీవిస్తారు గా అంటే ఈ ప్రపంచంలో అసలు ఈ సృష్టిలోనే ఎప్పటికీ ఆనందాన్ని ఇచ్చే వస్తువు గాని వ్యక్తి గాని పదార్ధం గాని ఏదీ లేదు అన్నీ టెంపరరీ హ్యాపీనెస్ ఇస్తే కాబట్టి
(15:52) టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు తప్పకుండా వాటిని అచీవ్ చేయాలి కానీ అందులోనే శాశ్వతమైన ఆనందం అనేది ఎవరు పొందలేరు కదా ట్రూ ట్రూ ఈ కథ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు బట్ అంటే రోజువారి జీవితంలో కూడా మనం చూస్తుంటాము కొంతమంది మనల్ని ఒక మాట అంటే సరే ఆ మాటను మనం తీసుకోలేము అండ్ ఈజీగా మనక అక్కడే కనిపిస్తుంది మన మైండ్ ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారా వాళ్ళు అనే మాటలేకి మనం ఫీల్ అవుతున్నామ అనేది కనిపిస్తది అసలు ఆలోచనల మీద మనక ఎందుకు కంట్రోల్ ఉండదు అంటారు అసలు ఈ సృష్టిలో ఎవ్వరికీ ఆలోచనల మీద కంట్రోల్ ఉండదు ఎందుకంటే అంటే మనసును జయించడం అంటే ఏంటి
(16:23) సాక్షాత్తు మనమే భగవంతుడిగా మారిపోవటం అసలు రామాయణంలో వశిష్ట మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చెప్తాడు లాలయేత్ చిత్త బాలకం అని చెప్తాడు అంటే మనసుకట చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పాలట మనసు మాట వినదట స్వయంగా వశిష్ట మహర్షి శ్రీరామచంద్రమూర్తితో చెప్పాడు. అందుకే కదా ఆ మనసు అనేది చంచలంగా ఉంటుంది కాబట్టే ఎవరైనా ఒక మాట అనంగానే మనకు విపరీతమైన కోపం వస్తుంది.
(16:50) భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడుగా క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశత్ బుద్ధినాశో బుద్ధినాశో ప్రణస్యతి కోపం నుంచి అన్ని కష్టాలు అన్ని సమస్యలు వస్తాయి ఈ కోపం అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మనకి పురాణాల్లో ఒక చిన్న కథ కూడా ఉంది. ఒకసారి శ్రీకృష్ణుడు బలరాముడు సాత్యకి వీళ్ళ ముగ్గురు కూడా అరణ్యాలకు వెళ్తారు బాగా దట్టమైన అరణ్యం లోపలికి వెళ్ళిపోతారు.
(17:17) సరే రాత్రి సమయం కదా క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి కదా కాబట్టి అందరూ కూడా వంతులు వేసుకొని కాపలా కాయాలి అనుకుంటారు. ముందు సాత్యకి కాపలా కాస్తూ ఉంటాడు. సాత్యకి కాపలా కాస్తుంటే కృష్ణుడు బలరాముడు ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ఒక రాక్షసుడు అటువైపు వస్తాడు. ఆ రాక్షసుడు వచ్చి సాత్యకితో యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు.
(17:39) సాత్యకి ఎంత యుద్ధం చేస్తున్న ఆ రాక్షసుడిని గెలవలేకపోతాడు. దాంతో సాత్యకి ఇంకా విపరీతమైన కోపం వస్తుంది నేను ఇంత గొప్ప బలవంతుడిని ఈ రాక్షసుడిని జయించలేనా అని ఎంత ప్రయత్నించినా ఆ రాక్షసుడి బలం అంతకంతకు రెట్టింపు అయిపోయి చివరికి సాత్యకిని దూరంగా విసిరేసి వెళ్ళిపోతాడు. సాత్యకి బాధపడుతూ కాసేపటి తర్వాత నిద్ర లేచినటువంటి బలరాముడితో నువ్వు ఇప్పుడు కాపలా ఉండు నేను నిద్రపోతాను అని చెప్పి నిద్రపోతాడు.
(18:03) ఇక బలరాముడు కొద్దిసేపు కాపలా కాస్తూ ఉంటాడు మళ్ళీ ఆ రాక్షసుడు వస్తాడు ఆ రాక్షసుడితో బలరాముడు యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు రాక్షసుడి బలం చూసి బలరాముడికి అసలు విపరీతంగా కోపం కట్టలు తెంచుకుంటుంది నేను శ్రీకృష్ణుడి సోదరుని సాక్షాత్తు ఆదిశేషుడి అంశ స్వరూపం కదా ఆదిశేషుడి అంశ అంటే కోపం ఎక్కువ కదా బలరాముడికి ఇంకా కోపం వస్తుంది సాత్య కన్నా ఈ రాక్షసుడిని నేను గెలవలేకపోవడం ఏంటి అని చెప్పి ఇంకా తీవ్రంగా తన శక్తి అంతా ఉపయోగించి యుద్ధం చేస్తాడు బలరాముడు ఎంత శక్తిని ఉపయోగిస్తుంటే ఆ రాక్షసుడికి శక్తి రెట్టింపు అవుతుంది చివరికి బలరాముని కూడా యుద్ధంలో ఓడించి
(18:36) బలరాముని దూరంగా విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బలరాముడు చాలా అవమానంగా అనుకుంటాడు ఆ తర్వాత కొద్దిసేపటికి శ్రీకృష్ణుడు నిద్రలేస్తే ఇప్పుడు నీవంతు కృష్ణ నువ్వు కొంచెం సేపు కాపలా కాయ అని చెప్పి బలరాముడు పడుకుంటాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కాపలా కాస్తున్నప్పుడు కూడా ఆ రాక్షసుడు మళ్ళీ వస్తాడు ఆ రాక్షసుడు కృష్ణుడితో యుద్ధం చేయాలని ప్రయత్నిస్తుంటే కృష్ణుడు మాత్రం కోపం తెచ్చుకోలేదు నవ్వుతున్నాడు ఓకే ఓకే ఎంత ప్రయత్నించినా కృష్ణుడు నవ్వుతూనే ఉన్నాడు.
(19:07) క్రమక్రమంగా రాక్షసుడి బలం మొత్తం తగ్గిపోయి ఒక చిన్న సూక్ష్మ రూపంలోకి మారిపోయాడు. ఆ సూక్ష్మ రూపంలోకి మారిపోయిన ఆ రాక్షసుడిని కృష్ణుడు తన వస్త్రానికి ముడేసి కట్టుకొని ప్రశాంతంగా కాపలా కాసి తర్వాత నిద్రపోతాడు. ఉదయం నిద్ర లేచిన తర్వాత వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నప్పుడు సాధ్యకి బలరాముడు వీళ్ళద్దరు చెప్తారు ఏం చెప్తారంటే రాత్రి ఒక రాక్షసుడు వచ్చాడు ఎంత బలవంతుడు మనల్ని సైతం జయించాడు అంటే కృష్ణుడు అప్పుడు ఇదిగో ఈ రాక్షసుడి గురించేనా అని వస్త్రానికి కట్టుకున్న సూక్ష్మ రూపంలో ఉన్న రాక్షసుడిని తీసి చూపిస్తే వాళ్ళద్దరు ఆశ్చర్యపోతారు.
(19:38) ఈ రాక్షసుడే ఇంత సూక్ష్మ రూపంలోకి ఎలా మారిపోయాడు అంటే ఈ రాక్షసుడు క్రోధాసురుడు క్రోధానికి సంకేతం క్రోధాసురుడికి ఉన్న లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళలో క్రోధం పెరిగిపోతూ ఉంటే అదే వాడికి బలంగా పనిచేస్తుంది ఆహారం లాగా పనిచేస్తుంది వాడు అంతకంతకు బలవంతుడు అయిపోతాడు ఎదుటి వ్యక్తి ఎప్పుడైతే చిరునవ్వుతో ఉంటాడో వాడి బలం మొత్తం కూడా తగ్గిపోతుంది వాడి శక్తి మొత్తం తగ్గిపోతాడు వాడు యుద్ధం చేయాలని ప్రయత్నిస్తుంటే నేను నవ్వుతుంటే వాడి బలం మొత్తం తగ్గిపోయింది అని చెప్పి బలరాముడు సాత్యకి చెప్పాడని పురాణాల్లో ఒక కథ ఉంటుంది.
(20:11) అంటే ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకోవాలి ఎవరైనా మనల్ని ఒక మాట అనగానే మనం కూడా రివర్స్ లో ఇంకో మాట అన్నామ అనుకోండి మాటకు మాట పెరిగిపోతుంది కోపం పెరిగిపోతుంది ఆ కోపాలు ఎక్కడిదాక వెళ్తాయో చెప్పలేము యుద్ధాలుగా మారిపోతాయి ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనం నవ్వామ అనుకోండి వాళ్ళు రెండో మాట అన్నా కూడా మనం నవ్వామ అనుకోండి వాళ్ళు మూడో మాట మాట్లాడలేదు.
(20:34) ఆ తర్వాత విషయం ఏంటో తెలుసా మనకి ఏ బాధ ఉండదు ఒకవేళ బాధ ఉన్నా తక్కువ ఉంటుంది కానీ మనల్ని మాట అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ ఎక్కువగా ఉంటుంది మీరు కావాలంటే గమనించుకోండి మన తప్పు లేకుండా గాని ఏదైనా కారణంతో మనల్ని మాట అన్నారనుకోండి మనం ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా చిరునవ్వుతో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే అరే వీడు నన్ను ఏమ అనలేదే కానీ వీడిని అన్నాను అని చెప్పి రోజు వాడికి గుర్తొస్తూ ఉంటుంది.
(20:56) ముల్లులా గుచ్చినట్టు ఉంటుంది కాబట్టి మాట పడ్డవాడి కంటే ఏ తప్పు లేకుండా మాట అన్నవాడికే ఎక్కువ బాధ ఉంటుంది అది ఇంకా పెద్ద శిక్ష కాబట్టి కోపానికి మంచి మంది ఏందంటే చిరునవ్వు ఆధునిక కాలంలో అందరూ కూడా ఆ ఎమోషనల్ బాలెన్స్ పోతుంది కానీ ఆ ఎమోషనల్ బాలెన్స్ తెచ్చుకోవాలి ప్రాక్టీస్ ద్వారా కోపం కంట్రోల్ చేసుకొని చిరునవ్వుతో మాట్లాడి చూడండి బాధ అవతల వాడికి ఉంటుంది.
(21:18) వాడే మళ్ళీ వచ్చి తప్పు ఒప్పుకొని మనతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు అది కోపం వల్ల అన్ని అనర్థాలు ఉంటాయి. ఒక్క కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే అన్నిటిని కంట్రోల్ చేసుకో అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఓకే ఇది అంటే సందర్భాన్ని బట్టి మనం అప్స్ అండ్ డౌన్ అయితుంటాం బట్ ఇంకొక సైడ్ చూస్తే ఓవర్ థింకింగ్ ఉంటుంది అంటే ఈ ఆలోచనలు కూడా ఏందంటే ఎప్పుడు ఇంకా మనసు లోపల ఒక యుద్ధం జరుగుతుంటుంది వాడు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు నేను ఇలా అయ్యాను నాకు మంచి పేరు వచ్చిందో నాకు చెడ్డ పేరు వచ్చిందో ఇవి మనిషిని చాలా డైల్యూట్ చేస్తుంటాయి.
(21:46) ఏ ఆలోచన కూడా లేకుండా ఒక మనిషి ఐదు నిమిషాలన ఉండగలుగుతాడా అంటే కష్టమే అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితి నేను చేయాలి చాలా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య ఈ ఓవర్ థింకింగ్ చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఓవర్ థింకింగ్ ఎలా కంట్రోల్ చేయాలంటే మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే మనసుకి ఈ ఓవర్ థింకింగ్ కి వాయువుకి కనెక్షన్ ఉందని శాస్త్రాల్లో చెప్పారు మనసు ఓవర్ ఓవర్ థింకింగ్ వాయువు గాలికి కనెక్షన్ ఉంటుంది ఎవరైనా సరే మనం తీసుకునే ఉచ్వాస నిశ్వాసాలు గనుక కంట్రోల్ చేసుకోగలిగితే కచ్చితంగా ఓవర్ థింకింగ్ ని కంట్రోల్
(22:25) చేయొచ్చు అందుకే ప్రాణాయామం చేస్తారు అది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఉపనిషత్తులు ఏం చెప్త అంటే ఇంద్రియ అధిష్టాన దేవతలను చెప్పినాయి అంటే ఈ ఆలోచనలు ఈ ఓవర్ థింకింగ్ వీటన్నిటికీ అధిష్టాన దైవం ఎవరంటే వాయుదేవుడు ఓకే కాబట్టి వాయుదేవుడి అనుగ్రహం కలిగితే ఓవర్ థింకింగ్ తగ్గిపోతుంది. అందుకే ప్రతిరోజు ప్రాణాయామం చేయాలి.
(22:49) ఉచ్వాస నిశ్వాసాలు అనేటటువంటివి కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మనకి రమణ మహర్షి కూడా చెప్తారు వాయురోధనాత్మ మనః అంటారు రమణ మహర్షి అంటే ఎవరైతే వాయువుని అధీనంలో ఉంచుకుంటారో వాళ్ళు మనసుని అధీనంలో ఉంచుకుంటారు మనసు అధీనంలో ఉంటే ఆలోచనలు అధీనంలో ఉంటాయి కాబట్టి మాక్సిమం అందరూ కూడా ఈ వాయువును అధీనంలో ఉంచుకోవాలి అంటే ప్రాణాయామం చేస్తూ ఉండాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఓవర్ థింకింగ్ వల్ల భగవంతుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి జీవితాన్ని కూడా మనం మనం పూర్తిగా ఎంజాయ్ చేయలేం ఎందుకంటే జీవితం ఎంత అద్భుతం అంటే మనం జాగ్రత్తగా గమనించండి మనకి ఏ ఖర్చు లేకుండా భగవంతుడు ఈ ప్రకృతిని చూసే
(23:25) అద్భుతమైన అవకాశం కళ్ళతో చూసేలాగా ఇచ్చాడు అవును అంతేనా అసలు ఖర్చు లేకుండా గాలి పీల్చుకునే అవకాశం ముక్కుతో ఇచ్చాడు అవును మధురమైన ధ్వనులు వినటానికి చెవులు ఇచ్చాడు అలాగే అన్ని రకాలైన సుఖానుభూతులు పొందటానికి శరీరం ఇచ్చాడు భగవంతుడు ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని శరీరాన్ని ఇచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలకు ఓవర్ థింకింగ్ చేస్తే ఏమవుతుంది ఈ జీవితంలో ఉన్న ఆనందాన్ని మనం మిస్ అవుతాం కదా అందుకే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒకసారి ఒక వర్తకుడు కాశీ వెళ్దాం అని బయలుదేరాడు సరే కాశీ వెళ్దామని బయలుదేరుతూ ఉంటే ప్రాచీన కాలంలో కాశీ వెళ్ళటం అంటే మాటలు
(24:00) కాదు కదా చాలా ఊళ్ళన్నీ దాటుకుంటూ వెళ్ళాలి అతను కాశీ వెళ్తున్నప్పుడు మధ్యలో ఒకచోట ఎడారి ప్రాంతం కూడా వచ్చింది. అక్కడ నీళ్లు లేవు విపరీతంగా దాహం అవుతోంది ఆకలి అవుతోంది. ఆ ఎడారి ప్రాంతంలో నడుస్తూ వెళ్తూ ఉంటే అక్కడ అనుకోకుండా ఆ వర్తకుడికి ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు ఏంటంటే దేవలోకంలో కల్పవృక్షం ఉంటుంది కదా ఆ కల్ప వృక్షానికి సంబంధించిన ఒక కొమ్మ వచ్చి భూలోకంలో పట్టం వల్ల అక్కడ ఇంకొక కల్ప వృక్షంగా అది రూపాంతరం చెందింది.
(24:30) దాని ప్రత్యేకత ఏంటంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఈ వర్తకుడికి ఆ విషయం తెలియదు. ఆ సరే ఆ ఎడారిలో నడుస్తూ అన్ని రకాలుగా బాధలు పడుతూ ఆకలి తర్వాత విపరీతమైన దాహము శారీరక శ్రమ ఇవన్నీ పడుతూ అనుకోకుండా ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఇక్కడఏదో చెట్టు కనిపించిందే ఎడారిలో చెట్టు ఉండటం ఏంటి అని ఆశ్చర్యపోతూనే చెట్టు దగ్గరికి వెళ్లి అబ్బా నేను బాగా అలసిపోయాను స్నానం చేయాలి ఇక్కడ నీళ్లు ఉంటే బాగుండు నేను స్నానం చేయడానికి అనుకున్నాడు.
(25:01) వెంటనే అక్కడ కల్పవృక్షం కదా కల్పవృక్షం కొమ్మ కదా నీళ్లు కనిపించినాయి ఆశ్చర్యపోయాడు సరే తర్వాత సంగతి అని చెప్పి ముందు అక్కడ నీళ్ళతో స్నానం చేసేస్తాడు స్నానం చేసేసరికి విపరీతంగా ఆకలి వేస్తూ ఉంటుంది నాకు ఇప్పుడు తినటానికి ఏమైనా ఉంటే బాగుండు అది కూడా బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం ఉంటే బాగుండు అనుకుంటాడు వెంటనే అక్కడ బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం వచ్చేస్తుంది ఆ భోజనం మొత్తం తిన్న తర్వాత సేద తీరుతూ ఉంటాడు ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి ఎడారి ప్రాంతం నేను నీళ్ళ అనుకోగానే నీళ్ళు వచ్చినయి భోజనం అనుకోగానే భోజనం వచ్చింది అయినా కూడా
(25:32) ఎక్కువ ఆలోచించలేదు ఎందుకంటే అప్పుడు శరీరం అలసిపోయింది అయినా కూడా ఇంకొక్కసారి చివరగా పరీక్ష పెడదాం అని చెప్పేసి నా భార్య కూడా ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ ఉంటే బాగుండు అనుకుంటాడు అనుకోంగానే క్షణాల్లో భార్య అక్కడ ఉంటుంది ఆశ్చర్యపోతాడు ఇదేంటి కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న నా భార్య అనుకోకుండానే ఇక్కడికి వచ్చేసింది ఈ చెట్టు ఏమన్నా మాయా వృక్షమా ఏంటి కొంపతీసి ఈవిడ నా భార్య లేకపోతే ఏమైనా బ్రహ్మ రాక్షసా అనుకుంటాడు ఆ కానీ ఆ చెట్టుకు ఉన్న ప్రత్యేకత ఏంటి ఏది కోరుకుంటే అది జరుగుతుంది కదా భార్య బ్రహ్మరాక్షసిగా మారిపోతుంది. అంతే కదా ఆ
(26:06) చెట్టు మంచైనా చెడైనా కోరుకున్నది ఇచ్చే చెట్టు కల్పవృక్షం అంటారు కదా కల్పవృక్షం కొమ్మ వల్ల వచ్చింది కదా ఒక్కసారిగా వాళ్ళ భార్య బ్రహ్మరాక్షసిగా మారిపోయేసరికి అమ్మో ఇది నిజంగా మాయే ఇది బ్రహ్మరాక్షసి మాయ కొంపతీసి బ్రహ్మరాక్షసి భూతం ఇప్పుడు నన్ను మింగదు కదా అనుకుంటాడు వెంటనే ఆ వర్తకుడిని మింగేసి ఆ బ్రహ్మరాక్షసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి భగవంతుడు అదృష్టాన్ని ఇచ్చాడు చక్కగా అవసరమైనవన్నీ ఇచ్చాడు ఇచ్చినప్పుడు ప్పుడు ఆ ఇచ్చిన వాటిని స్వీకరించి ఆ ఆనందంలో ఉండకుండా ఏం చేశడు నెక్స్ట్ లెవెల్ ఆలోచించాడు
(26:41) ఓవర్ థింకింగ్ చేశడు ఆ ఓవర్ థింకింగ్ ఎలా మారింది నెగిటివ్ థింకింగ్ గా మారింది నెగిటివ్ థింకింగ్ గా మారేసరికి మొదటికే మోసం వచ్చి ఆ వర్త కూడా అంతమయపోయాడు కాబట్టి ఎప్పుడు కూడా ఓవర్ థింకింగ్ అనేది ప్రారంభం అవుతున్నప్పుడే దాన్ని పాజిటివ్ థింకింగ్ గా మార్చుకోవాలి. అలాగే ఒక రాజు ఉన్నాడు ఈ ఓవర్ థింకింగ్ ని పాజిటివ్ గా మార్చుకున్న రాజు కథ చెప్తాను ఓకే ఒకానొక రాజ్యంలో ఒక నియమం ఉండేది ఆ నియమం ఏంటంటే ఆ రాజ్యాన్ని ఏ రాజు పరిపాలించినా సరే ఐదు సంవత్సరాలు పూర్తి కాగానే ఆ రాజుని తీసుకెళ్లి రాజ్యానికి దూరంగా ఉన్న అడవిలో క్రూర మృగాల మధ్యలో వేస్తారు.
(27:15) అది ఆ రాజ్యానికి ఉన్న నియమం వాళ్ళు పెట్టుకున్నారు. ఏ రాజు వచ్చినా సరే ఐదు సంవత్సరాలు అన్ని భోగాలు పొందుతూ ఉంటాడు. ఐదు సంవత్సరాలు పూర్తి కాగానే రాజు ఎంత వద్దని చెప్పినా సరే రాజ్యంలో ప్రజలందరూ కలిసి అరణ్యంలోకి వేస్తారు క్రూర మృగాలు ఆ రాజుని తినేసారు ఈ సమయంలో ఒక యువకుడు రాజు అవుతాడు రాజయనప్పటి నుంచి బాధపడుతున్నాడు ప్రతిరోజు డీప్ థింకింగ్ రోజు రాజ ప్రసాదం పైకెక్కడం ఈ సుఖాలు ఈ భోగాలన్నీ ఐదు సంవత్సరాలే కదా తర్వాత నన్ను కూడా తీసుకెళ్లి అరణ్యంలో క్రూర మృగాల దగ్గర వేస్తారు కదా ఏంటి అని బాధపడుతుంటే ఒక తత్వవేత్త వస్తాడు మ్
(27:50) వచ్చి రాజుగారికి ఒక అద్భుతమైన విషయం చెప్తారు అదేంటంటే ఐదు సంవత్సరాల తర్వాత రాబోయే మృత్యువు గురించి నువ్వు ఇప్పుడే ఎక్కువగా ఆలోచిస్తున్నావు కానీ ఐదు సంవత్సరాల లోపు మృత్యువు రాదని ఏమైనా గ్యారెంటీ ఉందా లేదు లేదుగా ఎప్పుడు మృత్యువు ఏ క్షణంలో అయినా రావచ్చు అంతే కదా కాబట్టి ఈ ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా వచ్చే మృత్యువు గురించి ఐదు సంవత్సరాల తర్వాత రాబోయే మృత్యువు గురించి నువ్వు ఆలోచించడం ఎందుకు యధావిధిగా ప్రశాంతంగా జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగించు అని చెప్తాడు మ్ ఆ తత్వవేత్త చెప్పిన బోధలు బాగా రాజుకు అర్థం అవుతాయి ఇంకా అప్పటి నుంచి
(28:26) సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ దైవ నామ స్మరణ చేస్తూ ఆ భోగాలకు అతీతంగా ఉండటం ప్రారంభిస్తాడు ఆ తర్వాత తత్వవేత్త దగ్గరికి వెళ్లి ఒకసారి కలుస్తాడు స్వామి మీరు చెప్పిన మాటలు నా మనసుకి శాంతాన్ని కలిగింపజేసినాయి అంటే అప్పుడు ఆ తత్వవేత్త ఏం చెప్తాడంటే ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత నిన్ను పక్కన తీసుకువెళ్లి అరణ్యంలో క్రూర మృగాలకు వేస్తారు కదా ఈ ఐదు సంవత్సరాలు నువ్వే రాజుగ కదా ఆ అరణ్యాన్ని సుందర వనంగా తీర్చిదిద్దు అక్కడ భవనాలు నిర్మించు అక్కడ ప్రజలందరికీ ఉచితంగా వసతి సౌకర్యాలు కల్పించు అప్పుడు ప్రజలందరూ అక్కడికి వెళ్తూ ఉంటే అక్కడ
(29:02) ఉన్న క్రూర మృగాలు వాటంతట అవే వెళ్ళిపోతాయి కదా అని చెప్తే రాజు ఇదేదో బాగుందని చెప్పి అక్కడ భవనాలు నిర్మించడం అరణ్యాన్నే సుందరమైనటువంటి రాజ ప్రసాదంగా మార్చడం ఇవన్నీ చేస్తూ ఉంటే అక్కడ చాలామంది ఉచితంగా సౌకర్యాలు ఉన్నాయని ప్రజలందరూ అక్కడికి వెళ్ళిపోవడం ప్రారంభిస్తారు. ప్రజలు పెరిగే కొద్ది జంతువులు తగ్గిపోతున్నాయి క్రూర మృగాలు ఏవైనా వస్తే అప్పుడు వాళ్ళే తరిమి కొట్టడం ప్రారంభించారు.
(29:26) ఐదు సంవత్సరాల తర్వాత రాజుని తీసుకువెళ్లి అక్కడ వేసినా సరే రాజుకి ఏ ప్రమాదం జరగలేదు ఎందుకంటే అప్పటికి అది అద్భుతమైన నగరంగా మారిపోయింది అంటే ఈ ఓవర్ థింకింగ్ ని రాజు పాజిటివ్ థింకింగ్ గా మార్చుకున్నాడు. ఇక్కడ ఒక వేదాంత రహస్యం ఉంది దాన్ని మనం పట్టుకోవాలి కథలో ఉన్న రహస్యం ఏంటంటే ఇక్కడ అరణ్యము అంటే శరీరము అని అర్థం చేసుకోవాలి. ఓకే క్రూర మృగాలు అంటే ఇంద్రియాలు అని అర్థం చేసుకోవాలి అంటే శరీరంలో ఇంద్రియాలనే క్రూర మృగాలు విజృంభిస్తూ ఉంటాయి.
(29:53) ఎప్పటికైనా మృత్యువును కలిగింపజేస్తాయి కానీ భగవత్చింతన అనే ఆలోచనతో అరణ్యాన్ని సుందర వనంగా మార్చినట్టు ఈ శరీరాన్ని భగవత్ సంబంధమైన శరీరంగా మార్చుకోవాలి. అప్పుడు మృత్యువు కూడా నిన్ను ఏం చేయలేదు అని అద్భుతమైన అంతరార్థం ఈ కథ ద్వారా మనకు చెప్తున్నారు. చూసారా ఈ రెండు కథల్లో తేడా ఏంటి వర్తకుడేమో నెగిటివ్ థింకింగ్ తో పూర్తిగా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు రాజేమో తత్వవేత్త చెప్పినటువంటి పాజిటివ్ థింకింగ్ వల్ల తన ప్రాణాలు కాపాడుకున్నాడు అందుకే ఎప్పుడైనా ఒక గురువు అనేవాడు కచ్చితంగా మనకు కావాలి.
(30:29) ఎందుకంటే గురువు అనేవాడు ఏం చేస్తాడంటే మనకి వేదాంత శాస్త్రంలో రజ్జు సర్ప భ్రాంతి అని ఉంటుంది. ఓకే ఈ రజ్జు సర్ప భ్రాంతిని గురువు పోగొడతాడు. రజ్జు సర్ప భ్రాంతి అంటే ఏంటంటే మనం చీకటిలో ఉన్నాం సుధీర్ గారు పూర్తిగా చీకటిగా ఉంది అస్సలుఏమి కనిపించట్లేదు మనం నడుస్తూ ఉన్నాం మన కాలికి ఏదో తగిలింది పొడుగ్గా ఏమనుకుంటాం వామ్మో పాము అనుకుంటాం కదా కానీ భయంతో పరిగెత్తి ఒక్కసారిగా లైట్ వేస్తాం లైట్ వేసి చూస్తే అది పాము కాదు తాడు అని తెలుస్తుంది అంటే దీన్నే రజ్జు సర్ప భ్రాంతి అంటారు దీనిలో ఉన్న వేదాంత రహస్యం ఏంటంటే మనం శరీరాన్నే వాస్తవం అనుకుంటాం లోపల ఉన్న
(31:08) ఆత్మ గురించి తెలుసుకోలేం అదే మనం తాడును పాముగా భావించటం ఎప్పుడైతే లైట్ వేసామో అది పాము కాదు తాడు అని తెలుస్తుంది. ఆ లైటే గురువు ఓకే అంటే ఒక సద్గురువు మనకు పరిచయం అయితే మనకు వెలుగు చూపిస్తాడు అప్పుడు సంసారాన్ని కూడా మనం పాములా భావించక్కర్ల తాడులా భావించొచ్చు ఈ సంసారంలోనే మన జీవిత పరమార్థం తెలుసుకోవచ్చు అందుకే వేదాంత శాస్త్రంలో ఈ రజ్జు సర్ప భ్రాంతి గురించి చెప్తారు దీని నుంచి బయట పడాలి.
(31:37) తులసీదాస్ గారి గురించి కూడా చెప్పారండి తులసీదాస్ గారు రామచరితమానస రాయకముందు ఆయన అసలు మహా రామభక్తుడు కదా ఆయన ఎంత గొప్ప రామభక్తుడు అంటే ఆయన అందరూ రాంబోలా రాంబోలా అని పిలిచేవాళ్ళు అలాంటి తులసీదాస్ గారు కూడా వివాహం అయిన తర్వాత భార్యను విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడు ఒకసారి ఏదో అనుకోకుండా భార్య పుట్టింటికి వెళ్ళాల్సి వచ్చింది.
(31:59) వాళ్ళ నాన్నగారికి బాగుండకపోవడం వల్ల పుట్టింటికి వెళ్ళిపోయి ఆరోజు తులసీదాసు గారి దగ్గరికి రాలేకపోతుంది రాత్రి భయంకరమైన వర్షం ఉరుములు మెరుపులతో హోరున వర్షం కురుస్తూ ఉంటే తులసీదాసు గారు వివాహం అయిపోయిన తర్వాత రామనామం మర్చిపోయి భామనామం జపించడం ప్రారంభించాడు ఎంతసేపు నా భార్య నా భార్య ఒక్కరోజు రాత్రి అయిపోయింది పుట్టింటికి వెళ్ళింది ఇంకా రాలేదు నా భార్యను చూడకుండా నేను ఉండలేను అని చెప్పి అంత పెద్ద వర్షంలో ఉరుములు మెరుపులు ఇవన్నీ ఉంటే భార్య ఇంటికి వెళ్ళిపోతాడు మామగారి ఇంటికి వెళ్ళిపోతాడు అందరూ తలుపులు వేసుకొని పడుకున్నారు అర్ధరాత్రి కదా అందరు తలుపులు వేసుకొని
(32:33) పడుకున్నారు. తలుపులు కొడితే బాగుండదేమో భార్య గది తెలుసు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఆ మేడకి ఒక పెద్ద తాడు కనిపిస్తుంది. ఓకే ఇదేదో బాగుందని చెప్పి ఆ తాడు పట్టుకొని పైకి ఎక్కుతూ తులసీదాసు గారు పైకి ఎక్కి భార్య గతి తలుపులు కొడితే తలుపులు తీసి భార్య ఆశ్చర్యపోతుంది. ఏంటండీ అర్ధరాత్రి ఎలా వచ్చారు అంటే నిన్ను ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేకపోయాను అందుకే నేను ఇలా వర్షంలో వచ్చి నాకు ఒక తాడు కనిపిస్తే దాన్ని పట్టుకొని పైకి వచ్చి నీ తలుపు కొట్టాను అని చెప్తే తాడా ఇక్కడ మాకేం తాడేం లేదే అని వెళ్లి భార్య చూస్తే అక్కడ
(33:09) పాము ఉంది. ఓ పెద్ద కొండ చిలువ ఉంటే ఆయన కొండ చిలువ అన్న విషయం కూడా మర్చిపోయి భార్య మీద వ్యామోహంతో ఆ కొండ చిలువను పట్టుకొని వచ్చి భార్య తలుపు కొట్టాడు అప్పుడు భార్య అంటుంది నా మీద చూపించిన ఈ ప్రేమాభిమానాల్లో సగం శ్రీరాముడి మీద చూపించినా కూడా ఈ పాటికి మీరు శ్రీరామచంద్రమూర్తి దర్శనం పొందేవాళ్ళు కదా అన్నది ఆ ఒక్క మాటకి బాధపడిపోయి అంత అర్ధరాత్రి ఉరుములు మెరుపులు ఉన్న వర్షంలో ఆయన కాశీ క్షేత్రానికి వెళ్ళిపోయి అక్కడ ఘాటు దగ్గర కూర్చొని రామనామ జపం చేస్తూ ఆ తర్వాత అద్భుతమైన రామచరిత మానస రచించారు.
(33:44) తులసీదాసు గారికి భార్య అద్భుతమైన గురువుగా వ్యవహరించింది. అయితే ఈ కథలో మనం పట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది తులసీదాసు గారు పెద్ద కొండ చిలువను పట్టుకున్నారు అని చెప్పాం కదా అది కొండ చిలువ అంటే అది రచ్చు సర్ప భ్రాంతి ఇప్పుడు నేను చెప్పిన విషయమే అంటే ఏంటంటే ఆయన ఆ భార్య అనే వ్యామోహంలో ఉన్నప్పుడు దాన్ని అలా పట్టుకొని వెళ్ళిపోయాడు అవును పామును పట్టుకొని వెళ్ళిపోయాడు కానీ భార్య వ్యామోహం నుంచి బయటికి వస్తే అది తాడి ట్రూ అంటే గురువు కావాలి గురువు టార్చిలైట్ లాంటి వాడున్నమాట బట్ మీరు మొదట్లో రమణ మహర్షి గారి గురించి చెప్పారు ఆయన ఆయన కూడా ఎక్కువగా ప్రతి
(34:19) ఒక్కరికి జీవితంలో మీరందరూ ఆలోచించాల్సింది ఒక్కటే హూ యామ్ ఐ అనేది ఆలోచించండి దాన్ని బట్టి మీ జీవితం ఏంటో మీకే తెలుస్తుంది అంటారు. అసలు ఈ హూ యామ్ ఐ అంటే ఏంటి ఇది అద్భుతమైన ప్రశ్న హూ యామ్ ఐ అంటే నేను ఎవరిని అని అర్థం నేను ఎవరిని అని తెలియాలంటే నేను కానిది ఏంటో ముందు తెలుసుకోవాలి. ఓకే అంతేగా అంతే మనం ఎవరని తెలియాలంటే మనం ఏం కామో తెలుసుకోవాలి మనం కాని దాన్ని తీసేస్తే మనవై ఉన్నది ఏదో తెలుస్తుంది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనకి దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టలు చేస్తారు అవునా ఆ విగ్రహాన్ని ఎలా ప్రతిష్టిస్తారు ముందు ఒక రాయి తీసుకుంటారు ఒక శిల్పి
(34:55) అద్భుతమైనటువంటి విగ్రహంగా దేవాలయంలో ఆ విగ్రహాన్ని చెక్కుతాడు. అంటే ఒక రాయి తీసుకొని ఆ రాయిని శిల్పం లాగా మారుస్తాడు విగ్రహంగా మారుస్తాడు ఎలా మారుస్తాడు రాయి కాని దాన్ని తీసేసుకుంటూ విగ్రహంగా మారుస్తాడు అంతేగా రాయిని చెక్కితే విగ్రహం వస్తుంది అంటే రాయిలో రాయి కాని దాన్ని తీసేస్తే అద్భుతమైన దేవుడి విగ్రహం వస్తుంది.
(35:23) మనం కూడా అంటే మనలో మనం కాకుండా ఉన్నదాన్ని తీసేస్తే మనమై ఉన్నది ఏదో తెలుస్తుంది. మనం కాకుండా ఉన్నది అంటే ఏంటి అసలు నేను ఎవరిని నేను అంటే శరీరం కాదు కన్ను కాదు ముక్కు కాదు చెవులు నాలుక చర్మము ఈ ఇంద్రియాలు ఏవి కావు మనకు మనసు ఉంటుంది గా ఆ మనసు కూడా కాదు బుద్ధి ఉంటుంది గా ఆ బుద్ధి కూడా కాదు మనకు నిరంతరం ఆలోచనలు వస్తాయిగా ఇందాక డీప్ థింకింగ్ అనుకున్నాం ఆ ఆలోచనలు కూడా కాదు వీటన్నిటికీ అతీతంగా లోపల ఆత్మ ఉంటుంది ఆ ఆత్మనే నేను అన్నస సత్యాన్ని గురువు ద్వారా తెలుసుకోవాలి అంటే శరీర భావంతో ఉంటే నేను ఎవరనే సత్యాన్ని తెలుసుకోలేం ఆత్మ భావంతో ఉంటేనే తెలుసుకోగలం మరి ఈ
(36:06) ఆత్మనే నేను అని మనం తెలుసుకోవచ్చా అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటున్నాం దీన్ని ఏమంటారంటే జాగ్రత్త అవస్థ అంటారు అంటే మేలుకొన్న అవస్థ మనఇద్దరం మేలుకొని ఉన్నాం కదా మనఇద్దరం మాట్లాడుకుంటున్నాం కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మము అన్ని ఉండి మనం మాట్లాడుకుంటున్నాం మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి పని చేస్తున్నాయి అంటే లోపల ఒక శక్తి ఉండటం వల్లేగా ఇవన్నీ పని చేస్తున్నాయి నా నోరు మాట్లాడుతుంది మీ నోరు మాట్లాడుతుంది అంటే లోపల ఒక శక్తి ఉంది కదా అందుకనే మనం ఇలా చేస్తున్నాం ఇది జాగ్రత్త అవస్థ అంటారు అంటే మనం
(36:36) మేలుకొన్న అవస్థ తర్వాత రాత్రి ఇంటికి వెళ్లి మనం నిద్రపోతూ ఉంటాం గా నిద్రపోతూ ఉన్న ప్రాణం ఉంటుంది గా నిద్రపోతున్నప్పుడు కూడా మన ఇంద్రియాలన్నీ మామూలుగానే ఉంటాయి గా అప్పుడు కూడా వాటిని ఎవరు సూపర్విజన్ చేస్తున్నారు లోపల ఒక పవర్ ఉంది కదా అవును ఆ తర్వాత మూడోది ఉంటుంది దాని పేరు సుషుప్తి అంటారు శుషుప్తి శుషుప్తి అంటే గాఢ నిద్ర డీప్ స్లీప్ మీరు ఎప్పుడైనా గమనించారా బాగా డీప్ స్లీప్ లోకి వెళ్లి కొన్ని గంటలు పడుకొని లేచిన తర్వాత వచ్చి ఏం చెప్తారు అబ్బా నేను అన్నీ మర్చిపోయి నిద్రపోయాను హాయిగా నిద్రపోయాను అని చెప్తారు గా అంటే ఈ రోజుల్లో చాలా మందికి నిద్ర
(37:13) సరిగ్గా పట్టట్లేదు కానీ టెన్షన్స్ వల్ల గాఢ నిద్ర పడితే అంటే డీప్ స్లీప్ లోకి వెళ్ళామ అనుకోండి అన్ని మర్చిపోయి నిద్రపోతాం గా అన్ని మర్చిపోయి మనం నిద్రపోతున్న ప్రాణం పోవట్లేదు ఏదో ఏదో శక్తి ఉంది గా అంటే మనం మేలుకొని ఉన్నప్పుడు నిద్రపోయేటప్పుడు గాఢ నిద్ర డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మనల్ని ఏదో ఒక పవర్ అనేది నడిపిస్తుంది కదా ఒక ఎనర్జీ నడిపిస్తుంది కదా అదే ఆత్మ ఆ ఆత్మనే నేను అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఆ ఆత్మతో రిలేట్ అవ్వాలి అప్పుడు మనకు పర్మనెంట్ హ్యాపీనెస్ వస్తుంది ఇందాక మనం అనుకున్నాం కదా ఏంటి స్వామి జాబ్లో హ్యాపీనెస్ ఉండదు ఇల్లులో
(37:50) హ్యాపీనెస్ ఉండదు అసలు లైఫ్ లో ఏ వస్తువులోనూ ఏ వ్యక్తిలోన వేటిలోన మనకి హ్యాపీనెస్ ఉండదు కదా స్వామి పర్మనెంట్ హ్యాపీనెస్ ఉండదు టెంపరరీ కదా అని అనుకున్నాంగా మరి ఆ పర్మనెంట్ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఇదిగో ఈ సోల్ తో రిలేట్ అయినప్పుడు వస్తుంది. వీటన్నిటిని దాటి సోల్ తో రిలేట్ అవ్వాలి. దానికి ప్రత్యేకమైన ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ లో గురువుని ఆశ్రయించి ఆ సోల్ తో రిలేట్ అయి నేను ఆత్మ అని తెలుసుకోవాలి అదే రమణ మహర్షి చెప్పారు.
(38:16) మీరు చూడండి రమణ మహర్షి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. ఆయన శరీరం మీద రాచ కురుపు వచ్చింది మీకు తెలిసే ఉంటుంది కదా పెద్ద పుండు వస్తే చీమ పోసి అందులో పురుగు వచ్చేసి ఆయన్ని తొలిచేస్తూ ఉంటే శిష్యులు భక్తులు అందరూ కూడా స్వామి వైద్యం చేయించుకోండి అంటే ఎవరికి వైద్యం చేయించుకోమంటారు అని అడిగాడు ఎవరికి ఏంటి స్వామి మీ శరీరానికి అంటే దానికి వైద్యం ఎందుకు నాకైతే వైద్యం అక్కర్లేదు అన్నాడు దానికి చేయించుకోమంటారా నాకు చేయించుకోమంటారా అన్నారు దానికంటే ఏంటి అది శరీరం శరీరం ఆత్మ వేరు ఆత్మ వేరు కదా అంటే అప్పుడు ఆయన వైద్యం చేయించుకోవాల అప్పుడు ఒకసారి శిష్యులు ఏం
(38:52) ఏం చేశారంటే ఆయన నిద్రపోతూ ఉంటే ఆయన బాధ చూడలేక ఒక అరిసెను తెచ్చి ఆ పుండు మీద పెట్టారు. ఇది రమణ మహర్షి చరిత్రలో కూడా కనిపిస్తుంది. లోపల ఒక పురుగు ఉంటుంది కదా అరిస తీయదరానికి పురుగు బయటికి వచ్చింది. పురుగు బయటికి వచ్చేసరికి భక్తులు తీసి కింద పడేశారు. కింద పడేసేసరికి ఆ పురుగుకి ఎటు వెళ్ళాలో తెలియలేదు.
(39:12) అటు ఇటు భయం భయంగా కదులుతూ ఉంటే రమణ మహర్షి వారు ఇంతలో నిద్ర నుంచి లేచి అదేంటి ఆ పురుగు స్వస్థానం వదిలి అక్కడ ఎక్కడికో వెళ్లి కంగారు పడుతుంది కదా అని మళ్ళీ ఆ పురుగుని తీసి ఆయన కుండు మీద వేసుకున్నారట ఈ కథ మనకు ఆయన జీవిత గాధల్లో చెప్తారు అంటే నాకు ఏ బాధ లేదు ఎందుకంటే నేను ఆత్మ స్వరూపం కదా దీనికి బాధ కలుగుతోంది. ఈ శరీరానికి బాధ కలుగుతుంది అన్నారు.
(39:33) అందుకే ఎప్పుడైనా సరే అసలు శరీరం అంటే ఏంటి సీర్యమాన స్వభావం కలిగింది. అంటే రోజు రోజుకి క్షీణించిపోతుంది గా అది అందుకే దాన్ని శరీరం అంటారు. దేహం అంటే దహన యోగ్యమైనది అందుకే దాన్ని దేహం అంటారు ఎప్పటికైనా ఇది నశించిపోతుంది ఆత్మ ఉంటుంది కదా అన్న సత్యం రమణ మహర్షి వారికి తెలుసు అందుకే ఆయన ఎప్పుడైనా సరే శరీరంతో కాదు ఆత్మతో రిలేట్ అవ్వండి ఇది నాది కాదు ఇది నాది కాదు ఇది నాది కాదు దీన్నే నేతి నేతి అంటారు వేదాంత శాస్త్రంలో ఓకే ఓకే నేతి నేతి చాలా అద్భుతమైన వాక్యం మీరు ఏ గొప్ప గొప్ప స్వామీజీలు పీఠాధిపతులు దగ్గరికి వెళ్ళిన నేతి నేతి అని చెప్తారు
(40:11) నేతి నేతి అంటే ఏంటి నా ఇతి ఇది నేను కాదు ఓకే శరీరం నేను కాదు తీసేయ్ మనసు నేను కాదు తీసేయ్ బుద్ధి నేను కాదు తీసేయ్ నా ఆలోచనలు నేను కాదు తీసేయ్ వీటన్నిటికీ అతీతంగా లోపల ఉండి ఒక శక్తి నన్ను నడిపిస్తుందే అదే నేను నేను ఆత్మని నా ఇతి నేతి నేతి ఇది నేను కాదనని ఒక్కొక్కటి తీసేసుకుంటూ మీరు ఆత్మతో ఉండండి అని రమణ మహర్షి వారు చెప్పారు.
(40:37) ఆయన కాబట్టి దీనికి పుండు వచ్చింది అన్నారు మనం అనలేము కదా దానికి ఎంతో సాధన కావాలి మార్గాలు ఉంటాయి అంతేగాని మనం ఊరికే కూర్చొని నేను శరీరం కాదు నేను ఇంద్రియాలు కాదు నేను మనసు కాదు నేను బుద్ధి కాదు నేను ఆత్మని నేను ఆత్మని అనుకుంటే ఉపయోగం లేదు ఆ ఆత్మనన్న భావాన్ని ఒక సద్గురువుని ఆశ్రయించి పొందగలగాలి దానికి ప్రత్యేకమైన మార్గాలు ఉంటాయి అభ్యాసాలు ఉంటాయి కానీ రమణ మహర్షి చెప్పింది మాత్రం ఇదే ఆత్మతో సంయోగం చెందమని చెప్పాడన్నమాట బట్ అంటే మీరు ఈ మాట అంటున్నారు కానీ కానీ సాధారణంగా ప్రతి మనిషి ఈ రోజులలో నేను ఇది నేను అది ఈ ఆలోచనలు ఎక్కువ అయిపోతున్నాయి
(41:09) కానీ నేను కచ్చితంగా ఇదే అనిని డిసైడ్ చేసుకోవట్లేదు. సో నాది నీది ఇట్లాంటి మాటలు ఈ థాట్స్ ఇవన్నీ డైల్యూట్ చేస్తుంటాయి కదా అండ్ అదర్ ఎండ్ లో ఈగో గానిీ అటాచ్మెంట్స్ కానీ ఇవి కూడా మనిషిని ఒక లెవెల్ లో పడేస్తున్నాయి. అవును సో ఇవన్నీ ఏంటి అసలు అన్నిటికీ మూలం రెండేనండి నేను నాది అంతేనా అవును మనం ఉదయం నిద్ర లేవగానే మనకి మెలుకువ రాగానే నేను నేను చేస్తున్నాను నేనే చేయగలను వాళ్ళు ఏం చేయగలరు ఇది నాది ఇది నీది ఇది వాడిది అంటే నేను నాది ఆ నేను అంటే అహంకారం నాది అంటే మమకారం అంటే అసలు మనిషి అనేవాడు ఒక మాయలో ఉం ఉండిపోయాడు నేను నాది అహంకారం మమకారం అనే
(41:54) మాయలో ఉండిపోయాడు. కానీ ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను కొన్ని కథలు మనకి పరమార్థ కథలు అని ఉపనిషత్తుల్లో చెప్తారు చెప్పండి ఈ అహంకారము మమకారం ఎంత ప్రమాదం అనేవి రెండు కథలతో మీకు చెప్తాను ఒక ఊళలో ఒక పెద్ద శిల్పు ఉండేవాడు బ్రహ్మాండమైన శిల్పి అసలు ఏ శిల్పాన్నైనా అద్భుతంగా చెక్కగలడు.
(42:16) అయితే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్లి తనకు మృత్యువు ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. ఉమ్ సరిగ్గా జ్యోతిష్కులు లెక్కగట్టి ఈ సమయంలో మృత్యువు వస్తుందని ఆ శిల్పికి చెప్పారు. అంటే ప్రాచీన కాలంలో అలా చెప్పేవాళ్ళు అంటే ఇప్పుడు చెప్పటం లేదు అలా మృత్యువు చెప్తే భయపడతారు కాబట్టి నిజానికి జ్యోతిష్య శాస్త్రంలో అలా మృత్యు గడియలు కూడా చెప్పొచ్చు.
(42:33) ఓకే సరే జ్యోతిష్కులని కలిసి తన మృత్యు గడియలు తెలుసుకున్నాడు. కానీ తనకు మృత్యువు సమీపించిన మృత్యు గడియల్లో ఎట్టి పరిస్థితుల్లో మరణించకూడదని నిర్ణయం తీసుకుంటాడు. అందుకని ఏం చేస్తాడంటే సరిగ్గా తనలాగే ఉన్నటువంటి అనేక శిల్పాలను చెప్పుతాడు. చూడటానికి ఆ శిల్పి ఎలా ఉంటాడో అచ్చు గుద్దినట్లు అలాగే ఉండేటటువంటి శిల్పాలు అనేకం తయారు చేసి వాటన్నిటిని కూడా ఒక గదిలో ఉంచుతాడు.
(43:00) ఓకే అయితే జ్యోతిష్కులు చెప్పినటువంటి ఆ మృత్యు గడియలు వచ్చే రోజు చక్కగా భోజనం చేసి శిల్పాలకు ఏ రంగు ఉంటుందో ఆ రంగు మొత్తం కూడా రాసుకొని ఆ శిల్పాల మధ్యలో వెళ్లి నిలబడతాడు ఎందుకు అలా చేసాడు యమధర్మరాజు యమపాశం వేయటానికి వస్తే ఆ శిల్పాల్లో గుర్తుపట్టకుండా ఉండాలి ఈయన గొప్ప శిల్పి కదా యమధర్మరాజు గుర్తుపట్టలేడు కదా అలా చేద్దాం అని చెప్పి శిల్పం లాగే రంగు రాసుకొని శిల్పాలు నుంచున్నట్టే నుంచుంటాడు ముందు పరీక్షించాలి అనుకుంటా మృత్యు గడియలు రాకముందే నుంచుంటాడు భార్య వస్తుంది చుట్టూ చూస్తుంది ఈయన ఎక్కడికి వెళ్ళాడో ఇన్ని శిల్పాలను ఇక్కడ
(43:36) వదిలిపెట్టి నా భర్త ఎక్కడికి వెళ్ళాడని శిల్పాలు చూసి వెళ్ళిపోతుంది గుర్తుపట్టలేదు తర్వాత కొడుకులు కూతుళ్ళు అందరూ వస్తారు ఎవ్వరు గుర్తుపట్టలేరు. ఈ శిల్పికి విపరీతంగా అహంకారం వస్తుంది నా అంత గొప్పవాడు లేడు నేను మృత్యువును కూడా జయించగలను ఇంతలో యమధర్మరాజు యమపాశం పట్టుకొని వస్తాడు. మృత్యు గడియల్లో ఆ గదిలోకి రాగానే నిజంగానే శిల్పి చాలా గొప్పవాడు.
(43:56) యమధర్మరాజు కూడా గుర్తుపట్టలేకపోతాడు సామధాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించి ఎలాగైనా సరే శిల్పి బయట పడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ శిల్పి మాత్రం ఎంత భయం ఉన్నా సరే ఎదురుగా యమధర్మరాజు కనిపించినా సరే కదలకుండా శిల్పం లాగా అలాగే ఉండిపోయాడు. అప్పుడు యమధర్మరాజుకి ఒక ఉపాయం వచ్చింది ఏ ఉపాయం వచ్చిందంటే ఈ శిల్పాలన్నీ ఎవరు చెక్కారో గానీ చతుర్ముఖ బ్రహ్మ కంటే కూడా చాలా గొప్పవాడు అంత అద్భుతంగా చెక్కాడు కానీ ఈ శిల్పాల్లో ఒక చిన్న లోపం ఉంది ఆ లోపం లేకపోతే మాత్రం ఈ శిల్పి బ్రహ్మ కంటే గొప్పవాడని యమధర్మరాజు పలుకుతాడు వెంటనే తను మృత్యువు దగ్గర ఉన్నాను అన్న
(44:38) విషయం కూడా మర్చిపోయి ఈ శిల్పికి ఈగో వచ్చేస్తుంది అహంకారం వచ్చేస్తుంది వెంటనే నేను చెక్కిన వాటిల్లో లోపం ఉందా ఎక్కడ ఉంది ఏ లోపం ఉంది చూపించు లోపమే లేదు అని బయటికి రాగానే ఇదే నీ లోపము నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అహంకారాన్ని వదిలిపెట్టలేకపోయావని యమధర్మరాజు తన యమపాశాన్ని విడిచిపెట్టాడు చూసారా అంత గొప్ప శిల్ప అయ ఉండి కూడా ఆ అహంకారం ఆ ఇగో నాకంటే గొప్పవాడు లేడు అన్న భావన వల్ల ప్రాణానికి ముప్పు వచ్చింది.
(45:06) అలాగే మీరు అన్నారు మమకారం నేను నాది ఒకటి చెప్పాం నేనంటే అహంకారం నాది అంటే మమకారం అవును ఈ మమకారం అనేది కూడా చాలా డేంజరస్ అండి ఎందుకంటే మనకి ప్రతి వస్తువు మీద ఇంట్రెస్ట్ ఇష్టం అనేది ఉంటుంది ఎవరికైనా ఉంటుంది గా ఇష్టం ఉండొచ్చు కోరిక ఉండొచ్చు కానీ అది తృష్ణగా మారకూడదు. కోరికకి తృష్ణకి తేడా ఉంది. కోరిక అంటే దాని మీద ఇష్టమే తృష్ణ అంటే విపరీతమైన ఇష్టం పీక్ ఇష్టం అన్నమాట అంటే ఇంకా అది లేకుండా ఉండలేకపోవటం దాన్ని తృష్ణ అంటారు అంతేగా ఏ వస్తువు మీదైనా మనకి అటాచ్మెంట్ ఎంత ఉండాలి ఎంత ఉండాలో అంత ఉండాలి పీక్లు అన్లిమిటెడ్ గా ఉంటే ఏమవుతుంది పిచ్చిపడుతుంది అంత ఇంట్రెస్ట్ ఉండకూడదు
(45:48) గా తృష్ణ అంటారు. ఆ విపరీతమైన మమకారం ఉండకూడదు అసలు ఆ మమకారం వల్ల కూడా మళ్ళీ కర్మ ఫలితం వచ్చి తర్వాత జన్మలకు లింక్ అవుతుంది. మీరు మొట్టమొదటి ప్రశ్న అడిగారు కదా ఎందుకండీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది కొంతమంది ఇలా ఉంటారు కొంతమంది అలా ఉంటారు అని మొదటి క్వశ్చనే చాలా అద్భుతమైన క్వశ్చన్ తో స్టార్ట్ చేశారు కదా అది ఎందుకు ఉంటారంటే వీళ్ళ కర్మ ఫలితం ఆ విధంగా చేస్తుంది వీళ్ళ మమకారం ఆ విధంగా చేస్తుంది ఆ మమకారాన్ని వదలలేక చివరి క్షణంలో కూడా దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారో దానికి సంబంధించినట్లుగా తర్వాత జన్మ ఉంటుంది.
(46:18) ఆ తర్వాత జన్మలో కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు చూడండి అందుకే చాలామంది కోట్లు సంపాదిస్తారు. సాటిస్ఫాక్షన్ ఉండదు వంద కోట్లు సంపాదిస్తే వెయి కోట్లు చేయాలనుకుంటారువెయ కోట్లు సంపాదిస్తే లక్ష కోట్లు చేయాలనుకుంటారు తృష్ణ అంటారు అంటే ధన సంపాదనకి ఎండు ఉందా లేదుగా తృప్తి ఉండాలి తృప్తిం జందని మనుజుడు సప్తద్వీపములనైనను జయింపజాలడు అని చెప్పి ఉంది కాబట్టి మీకు ఒక చిన్న అద్భుతమైన కథ ఒకటి చెప్తాను ఈ మమకారం అనేది ఎలా వెంటాడుతూ ఉంటుంది అనేది చెప్తాను ఒక ఊళలో ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి ఉన్నాడు వర్తకుడు బ్రహ్మాండంగా ా వ్యాపారం చేశాడు కోట్లు
(46:56) సంపాదించాడు పరమ పీనాసి పిల్లికి బిచ్చం పెట్టాడు దాచిందంతా రోజు చూసుకుంటూ ఉండేవాడు వయస్సు పెరిగిపోయింది కోటాను కోట్ల ఆస్తి వచ్చింది. ఎవ్వరికీ దానధర్మాలు చేయలేదు శరీరం నిండా రోగాలు మంచం మీద పడ్డాడు అప్పుడు ఈ వర్తకుడి కుమారులకు మాత్రం కాస్త దైవభక్తి ఉంది. దానాలు చేయాలనుకుంటారు. పుణ్యకార్యాలు చేయాలనుకుంటారు అందుకని ఈయన పేరు మీద పూజలు చేయించడం ప్రారంభిస్తారు.
(47:22) ఈయనేమో మంచం మీద నుంచే పూజల కోసం డబ్బులు వేస్ట్ చేయవాకండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉండేవాడు తర్వాత ఎన్నో వ్రతాలు పూజలు ఈయన కోసం బాగుపడాలని లేచి నడవాలని చేస్తుంటే అవన్నీ వ్యర్థం చేయవాకండి అని చెప్పి ఈయన మంచం మీద నుంచి అరుస్తూ ఉండేవాడు ఓకే అలాగే ప్రత్యేకమైన వైద్యులని పెడితే వైద్యం చేయించవాకండి వైద్యం చేయిస్తే డబ్బు ఖర్చుఅవుతుంది వైద్యం కూడా వద్దనేవాడు అంత పిసినారి అయితే అంత పిసినారి ఇంకా శరీరం విడిచిపెట్టే చివరి క్షణాలు వస్తూ ఉంటే అంటే రోజు నారా నారా నారా నారా నారా అంటూ ఉండేవాడు ఇది చూస్తున్నారు కొడుకులు మా నాన్నగారికి
(48:01) జీవితం చివరి దశ వచ్చేసరికి జ్ఞానోదయం కలిగినట్టు ఉంది నారాయణ నామం చెబదాం అనుకుంటున్నాడు నారాయణ నారాయణ నారాయణ అందాం అనుకుంటున్నాడు కానీ శరీరం సహకరించట్లేదు మాట పడిపోయింది జీవిత చరమాంకానికి చివరి దశక వచ్చేసరికి మాట పడిపోయింది ఆయనకి ఎలాగైనా సరే మాట తెప్పియాలి ఆయన శరీరం విడిచిపెట్టేలోపు ఆ నారాయణ నామం ఆయన నోట్లో నుంచి చెప్పించాలి ఎందుకంటే చెప్పించి శరీరం విడిచిపెడితే తర్వాత మంచి జన్మ వస్తుంది కదా తండ్రి రుణం తీర్చుకోవాలి కదా అందుకని డాక్టర్లని అడిగితే డాక్టర్లు ఏం చెప్పారంటే చాలా ఖరీదైన ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది లక్షల రూపాయల్లో ఉంటుంది ఆ
(48:36) ఇంజెక్షన్ తెచ్చి చేయిస్తే మాత్రం కొద్దిగా మాట వస్తుంది అని చెప్తారు. అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ ఇంజెక్షన్ తెప్పించి ఆ ఇంజెక్షన్ తండ్రి గారి కొడుకులు చేయిస్తారు. మ్ ఆ ఇంజెక్షన్ చేయించగానే ఆయనకి మాట వస్తుంది. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా నారపీచు దూడ మేస్తోందిరా తరమండి అన్నాడు అంటే నారపీచని తోవుకొనేది ఉంటుంది అది కూడా దూడ తినకూడదట దాన్ని కూడా దాచిపెట్టుకోవాలట చూసారా కర్మానుగుణంగా వాసనలు ఎలా ఉంటాయి అని చెప్తూనే ప్రాణాన్ని విడిచిపెట్టాడు ఓకే తర్వాత జన్మ ఏమవుతుంది మళ్ళీ ఈ ధన వ్యామోహంతో ఏ బీరువాలోనో ఆ ధనం మధ్యలో ఉండేటటువంటి పురుగ్గా జన్మ వస్తుంది
(49:14) ఓకే అందుకే ధనం ఉండాలి ధన మూలం ఇదం జగత్తు ఎందుకంటే ధనం లేకపోతే ఏది నడవదు కదా మనిషి జీవన పోషణకు అవసరమైనంతవరకు ధనం కావాలి. ఆ ధనాన్ని సాధ్యమైనంత వరకు ధర్మ మార్గంలో వేద ప్రమాణంగా సంపాదిస్తూ ఉండాలి. ఆ ధన సంపాదన ఒక స్థాయికి వచ్చిన తర్వాత తోచినంత నలుగురికి సహాయం చేయాలి. ధనం మీద ఆశ ఉండొచ్చు తృష్ణ ఉండకూడదు. ఉమ్ లక్షలు సంపాదిస్తే కోట్లు కోట్లు సంపాదిస్తే ఇంకా సంపాదించాలనే తృష్ణ ఉన్నప్పుడు ఏమవుతుంది అది తర్వాతి జన్మకు కనెక్ట్ అవుతుంది.
(49:47) ఎగజక్ట్లీ ఆశ అత్యాశకు ఆశ అత్యాశకు వెళితే ఇదే ప్రమాదం చూసారా రెండు కథలు చూడండి అహంకారము మమకారము అహంకారం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నాడు మమకారం వల్ల తర్వాతి జన్మలో మళ్ళీ ఈ ధనం మీద ఇలా ఉండే విధంగా ఒక పురుగుగా జన్మించాడు అందుకే అన్ని అవసరమే కానీ అన్ని ఎంత ఉండాలో అంత ఉండాలి ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు అనుకోండి నేను అనే అహంకారం ఉండొచ్చు ఎందుకు ఎంతవరకు ఉండొచ్చు ఒక ర్యాంక్ కొట్టాలనుకోండి ఆ ర్యాంక్ కొట్టడానికి నేను చేయగలను అన్న ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవసరం మమకారం ఉండాలి నేను దాన్ని సాధించుకోవాలి అది నాకు కావాలనే మమకారం ఉండొచ్చు కానీ దానికి ఒక లెవెల్ ఉంటుంది సర్టైన్ లెవెల్
(50:23) ఉంటుంది. అంతే కదా ఆ లెవెల్ దాటి ఉండకూడదు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట అంటే నేను చేయగలను అనుకునే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు నేను మాత్రమే చేయగలను నాకంటే గొప్పవాడు లేడు నేను గొప్పవాడిని అనే అహంకారం పనికిరాదు. మ్ అంటే ప్రతి మనిషికి కూడా ఎప్పుడు రకరకాల ఎమోషన్స్ ఉంటాయి ఆనందంగా బాధగా ఇలా అన్ని కనిపిస్తుంటారు.
(50:44) కానీ వీటి గురించి కూడా చూస్తున్నప్పుడు పంచకోశాలు అని ఒక కాన్సెప్ట్ ఉందని విన్నాను. ఈ పంచకోశాలు అంటే ఏంటి స్వామి చాలా అద్భుతమైన ప్రశ్న వేశరు ఇప్పుడు అసలు ఇందాక మనం రమణ తత్వం గురించి మాట్లాడుకున్నాం కదా రమణ మహర్షి చెప్పిన నేను ఎవరు హూ యామై అని మనం ఒక క్వశ్చన్ అనుకున్నాం కదా నేను ఎవరో తెలుసుకోవాలంటే ఈ పంచకోశాలు దాటాలి. ఓకే ఎందుకంటే ప్రతి మనిషిలో ఇద్దరు నేనులు ఉంటారు.
(51:09) ప్రతి మనిషిలో ఇద్దరు నేను ఉంటారు. అంటే మనకి ఇప్పుడు 100 కోట్ల లాటరీ తగిలింది అనుకోండి మన ఆనందం ఎలా ఉంటుంది అబ్బా నాకు 100 కోట్లు లాటరీ తగిలింది నా అంత ధనవంతుడు లేడు నేను కోటీశ్వరుని అని ఒక నేను ఇలా ఆనందంతో ఉంటే మనిషిలో ఇంకో నేను ఇలా చూస్తూ ఉంటుంది. ఏ చలనము ఉండదు. మనకు బాగా అత్యంత ఆప్తులైన వాళ్ళు మన హార్ట్ కు బాగా దగ్గరైన వాళ్ళు చనిపోయారు అనుకోండి నాకు కావాల్సిన వాడు ఇతను లేకపోతే నేను అసలు తట్టుకోలేదు నా జీవితం ఎలా గడపాల అని మనం పడే బాధ ఉంటుందే అది మొదటి నేను మ్ ఇంకొక నేను ఇలా చూస్తూ ఉంటుంది లోపల ఒక్కొక్కసారి మనం సంభ్రమాశ్చర్యాలకు
(51:48) లోనైపోతాం నిజంగానా అలా జరిగిందా అలా అనుకునేది మొదటి నేను ఓకే రెండో నేను మాత్రం ఇలా చూస్తూ ఉంటాం అంటే మనం సుఖం వస్తే ఆనందపడిపోతాం అవును దుఃఖం వస్తే బాధపడిపోతాం ఆశ్చర్యం అన్నీ కూడా మనలో ఉన్న మొదటి నేను పొందుతుంది. ఆ మొదటి నేనే శరీరం ఓకే రెండో నేను ఎవరంటే వీటన్నిటికీ అతీతంగా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఆశ్చర్యం వచ్చినా ఏ భావోద్వేగం వచ్చినా ఏమాత్రం చెలించకుండా స్థిత ప్రజ్ఞతతో అలా ఉంటుంది అది రెండో నేను అదే ఆత్మ ఓకే కాబట్టి మొదటి నేను ఎవరు శరీరం రెండో నేను ఎవరు ఆత్మ మనమందరం ఏం చేస్తాం మొదటి నేనుతో రిలేట్ అయిపోతాం అందుకే
(52:31) సుఖానికి దుఃఖానికి అన్ని ఎమోషన్లు ఫీల్ అయిపోతూ ఉంటాం లోపల ఆత్మ ఉంటుంది రెండో నేను ఏం ఫీల్ కాదు ఆ రెండో నేనుతో మనం లింక్ అయ్యామ అనుకోండి అప్పుడు మనకు జీవితంలో పర్మనెంట్ హ్యాపీనెస్ వస్తుంది అంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉండగలం యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంఘవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అని చెప్పి భజగోవిందంలో శంకరుల వారు చెప్తారు అంటే ఆ రెండో నేనుతో ఎవరైతే రిలేట్ అవుతారో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండొచ్చు ఈ రెండో నేనుతో ఎలా రిలేట్ అవ్వాలని చెప్పేవే పంచకోశాలు ఓకే అంటే మనిషి శరీరంలో పంచకోశాలు అని ఉంటాయన్నమాట అవి ఎలా ఉంటాయి అంటే ఉల్లిపాయ
(53:10) పొరల్లా ఉంటాయి. మీరు ఉల్లిపాయ చూడండి ఉల్లిపాయ ఒక్కొక్క పొర తీస్తాం కదా అవును అలాగా ఐదు కోశాలు ఉంటాయి అన్నమయ కోసము మనోమయ కోశము ప్రాణమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము అని ఉంటాయి. మ్ అన్నమయ కోశం అంటే ఏంటంటే బయటికి కనిపించేటటువంటి ఈ శరీరం ఓకే స్థూల శరీరం అంటారు. దీనికి చేంజెస్ ఉంటాయి. దీనికి ఆరు రకాలైనటువంటి చేంజెస్ ఉంటాయి ఏంటంటే అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినస్యతి మీరు జాగ్రత్తగా గమనించండి అస్తి అంటే ఉండటం జాయతే అంటే పుట్టటం వర్ధతే అంటే పెరగటం విపరిణమతే అంటే మార్పులు చెందటం మ్
(53:53) ఆ తర్వాత వినస్యతి అంటే నశించిపోవటం అంతేగా ఓకే పొడతాం పెరుగుతాం మార్పులు చెందుతూ ఉంటాం వచ్చేవరకే నశించిపోతాం ఎవరు నశించిపోతారు శరీరం నశించిపోతుంది ఆత్మ నశించిపోతుంది స్థూల శరీరం నశించిపోతుంది దాన్ని అన్నమయ కోసము అంటారు. ఓకే ఆ తర్వాత ప్రాణమయ కోసం అని ఉంటుంది. ప్రాణమయ కోసం అంటే ఈ కాళ్ళు చేతులు తర్వాత విసర్జన అవయవాలు దీనికి సంబంధించిన దాన్ని ప్రాణమయ కోసము అంటారన్నమాట.
(54:23) ఉమ్ ఈ ప్రాణమయ కోసం ఏం చేస్తుందంటే ఈ విసర్జన పనులు తర్వాత చేతులు కాళ్ళు వీటితో చేసే పనులు ఇవన్నీ కూడా చేస్తుంది. ఆ తర్వాత మనోమయ కోసం అని ఉంటుంది. ఈ మనోమయ కోసం అంటే సూక్ష్మ శరీరం కన్ను ముక్కు చెవి నాలుక చర్మము ఇవి ఏం పనులు చేస్తాయి కళ్ళు చూస్తాయి కదా అవును ముక్కు వాసన పీలుస్తుంది చెవులు వింటాయి ఇదంతా కూడా ఈ మనోమయ కోసము అంటే మనసుతో చేసే ఆలోచన ఆ తర్వాత విజ్ఞానమయ కోసం అంటే ఏంటంటే కన్ను ఏదన్నా చూసిందనుకోండి అబ్బా బాగుంటే భలే ఉందనుకుంటుంది.
(54:58) లేదా ఏదనా చూస్తున్నప్పుడు బాలేదు అనుకోండి చిచ్చి ఏం బాలేదు అనుకుంటుంది కదా ఆ నాలెడ్జ్ నాలెడ్జ్ ని ఇచ్చేది విజ్ఞానమై కోసం మీరు బ్రహ్మాండమైన మ్యూజిక్ వింటున్నారు అనుకోండి చెవులకి ఏమనిపిస్తుంది హ్యాపీగా ఉంటుందిగా పెద్ద పెద్ద సౌండ్స్ ఉన్నాయి అనుకోండి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఏంటి సౌండ్స్ అనుకుంటాం గా అంటే ఇవి కొంత నాలెడ్జ్ ని కలిగి ఉంటాయి గా అది బాగుందా బాలేదా అని అది విజ్ఞానమయ కోసం వీటన్నిటిని దాటి ఇంకొకటి ఉంటుంది లాస్ట్ ది ఆనందమయ కోసము అని ఈ ఆనందమయ కోసము ఏముంటుంది ఇక్కడ అంటే అంటే ఇందాక మనం ఒక మాట అనుకున్నాం గాఢ నిద్ర గాఢ నిద్ర అనుకున్నాం డీప్ స్లీప్ డీప్
(55:32) స్లీప్ లో ఏముంటుంది ఏమ ఉండదు మనం అన్నీ మర్చిపోయి నిద్రపోతూ ఉంటాం అప్పుడు ఆత్మే ఉంటుంది అంతేగా ఆత్మే అన్ని చూసుకుంటుంది అది ఆనందమై కోస ఓకే దీన్ని కూడా దాటి వెళ్ళగలిగితే అప్పుడు మనం ఆత్మతో రిలేట్ అవుతాం. అందుకే వీటిని పంచకోశాలు అని వేదాంత శాస్త్రంలో చెప్తారు. అంటే పంచకోశాలు దాటడం అంటే ఏంటి శరీరాన్ని దాటాలి.
(55:54) అంతేగా కన్ను, ముక్కు చెవి, నాలుక చర్మం దాటాలి. వీటి ఫీలింగ్స్ దాటాలి వీటి ఎమోషన్స్ దాటాలి దాటడం అంటే ఏంటి నే కన్ను కాదు నే ముక్కు కాదు నే చెవి కాదు నే నాలుగు కాదు నే చర్మం కాదు అనుకోవడం కాదు కన్నుతో ఏం చూసినా ఒకే ఫీలింగ్ ముక్కుతో ఏ వాసన వచ్చినా ఒకే ఫీలింగ్ నోటితో ఏం తిన్నా ఒకే ఫీలింగ్ చెవులతో ఏ విన్నా ఒకే ఫీలింగ్ అది ఏ ఫీలింగ్ నో ఫీలింగ్ అసలు ఏ ఫీలింగ్ ఉండకూడదు ఏదైనా ఏ సిచువేషన్ లోనైనా ఒకే రకంగా ఉండాలి చాలా టఫ్ కదా సో రమణ మహర్ష ఆ రమణ మహర్షి గారి ఎగ్జాంపుల్ చెప్పడానికి బాగుంటుంది ఊరికే కూర్చుని అనుకుంటే అవ్వదు ప్రాక్టీస్
(56:31) కావాలి అభ్యాసం కావాలి. మనకి కృష్ణుడు కూడా చెప్తాడు కదా గీతలో అర్జున ఎవరికైనా సరే మనసును కంట్రోల్ చేసుకోవడం కష్టం అభ్యాస వైరాగ్యాలతోనే పాసిబుల్ అవుతుందని కాబట్టి నేను చెప్పినట్టు నో ఫీలింగ్ రావాలంటే గురువు ఉండాలి. ఒక ప్రాపర్ వే ఉండాలి ఆ మార్గంలో ముందుకు వెళ్ళాలి. ఈ కోశాలు దాటితే అప్పుడు సోల్ తో రిలేట్ అవ్వచ్చు అన్నమాట.
(56:52) బట్ అంటే అంటే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీకు గాఢ నిద్రలో అన్నీ మర్చిపోయి నిద్రపోతూ ఉంటారు కదా అప్పుడు మీకు ఎలా ఉంటుంది ఏమి తెలియదుగా మీరు మెలకువగా ఉన్నప్పుడు కూడా అలానే ఉంటుంది అది అసలు పాయింట్ ఓకే గాట్ ఇట్ అంటే మీరు డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుంది దాన్ని సుషుప్తి అంటారు గాఢ నిద్ర డీప్ స్లీప్ అన్ని మర్చిపోయాం హాయిగా పడుకొని ఒక్కసారి లేచి ఎవరైనా అడిగితే ఏం చెప్తా అప్ప అన్ని మర్చిపోయానండి హాయిగా నిద్రపోయానండి ఇంత హ్యాపీగా ఇంత రిలాక్స్డ్ గా ఉంటుంది అది మేలుకొన్నప్పుడు కూడా ఉంటుంది మనం సోల్ తో రిలేట్ తే అది పట్టుకోవాలి గురువు ద్వారా
(57:24) అదే నేను అదే ఆత్మ బట్ అంటే గురు ద్వారా ఇది చేయొచ్చు బట్ ఎటర్నల్ హ్యాపీనెస్ పొందాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు బట్ కొంతమంది అంటారు కదా మైండ్ సోల్ రెండు కనెక్ట్ అవ్వాలి అని సో మనసుని మైండ్ కి ఎట్లా కనెక్ట్ చేయగలుగుతారు మనసుని మైండ్ ని కనెక్ట్ చేయాలంటే ఇందాక నేను చెప్పినట్టు ముందుగా వాయురోధనాత్ లీయతే మనః ఓకే అంటే వాయువును కంట్రోల్ చేస్తే మనసు కంట్రోల్ అవుతుంది అంటే మనం ఉచ్వాస నిశ్వాసాలు చేస్తాం కదా మనకు ప్రాణాయామం చేస్తాం దానిలో పూరకము కుంభకము రేచకము అని ఉంటాయి.
(57:56) పూరకం అంటే శ్వాస పీల్చడం కుంభకం అంటే శ్వాస హోల్డ్ చేయడం రేచకం అంటే శ్వాస వదిలిపెట్టడం అంటే శ్వాస పీల్చి హోల్డ్ చేసి శ్వాస వదిలిపెడతాం ఇదేగా ప్రాణాయామం త్రీ స్టెప్స్ పూరకం కుంభకం రేచకం కుంభకం అంటే హోల్డ్ చేస్తాం శ్వాస హోల్డ్ చేస్తే ఏమవుతుంది వాయువుని హోల్డ్ చేసామ అంటే వాయువు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మనసు వాయువు హోల్డ్ అయితే మనసు హోల్డ్ అవుతుంది మనసు హోల్డ్ అయితే థాట్ హోల్డ్ అవుతుంది అంతా బాగనే ఉంది ఇక్కడ మీకు డౌట్ వస్తుంది మళ్ళీ వదిలేస్తాం కదా అవును మళ్ళీ మామూలు అవును అంతే కదా అదే అదే అభ్యాసం అదే ప్రాక్టీస్ చేయాలి అంటే ఏం చేయాలంటే రెగ్యులర్ గా ఈ
(58:35) వాయువును కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలా కంట్రోల్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ఈ వాయువును హోల్డ్ చేసినప్పుడు కుంభకంలో వాయువును హోల్డ్ చేసినప్పుడు మన ఫోకస్ అంతా ముందు ఒక రూపం మీద పెట్టుకోవాలి ఏదో రూపం రాముడు కృష్ణుడు ఆ రూపం గురించి ఆలోచిస్తూ ఆ మంత్రాన్ని స్మరించుకుంటూ క్రమక్రమంగా ప్రాక్టీస్ చేస్తూ మనం మళ్ళీ రిలీజ్ చేసిన తర్వాత కూడా అదే స్టేట్ ఉండేలాగా రావాలన్నమాట.
(59:01) సో ప్రాణాయామం ద్వారానే అది పాసిబుల్ అవుతుంది. మామూలుగా కష్టం. అయితే అభ్యాసం బాగా ప్రాణాయామం స్టేజ్ పెంచుకుంటూ ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటూ ఒక మంత్రం మీద గాని ఒక రూపం మీద గాని దృష్టి కేంద్రీకరత్నం చేసి ముందుకు వెళ్ళాలి. ఉమ్ దాన్ని అలా వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఉంటే ఫైనల్ గా ఏమవుతుందంటే మీరు ఎప్పుడు కూర్చున్నా కూడా మీకు ఆ రూపమే కనిపిస్తుంది.
(59:21) ఆ మంత్రమే కనిపిస్తుంది. దాన్ని ఏమంటారంటే సవికల్ప సమాధి స్థితి అంటారు. ఓకే అంటే ఒక రూపం పెట్టుకొని ఒక మంత్రం పెట్టుకొని దాని మీదే ఫోకస్ పెట్టుకొని మనం మనసు కంట్రోల్ చేసుకోవడం. ఇంకొకటి ఉంది గొప్ప గొప్ప వాళ్ళు రమణ మహర్షి లాంటి వాళ్ళు చేసింది నిర్వికల్ప సమాధి స్థితి అంటే ఆయనకి ఏ రూపం అక్కర్లే ఏ మంత్రం అక్కర్లే ఆయన ఎప్పుడూ ఇలానే ఉంటారు.
(59:43) అంతే కదా అవును శ్వాస పీల్చినా హోల్డ్ చేసినా వదిలేసిన రమణ మహర్షి ఎప్పుడు ఒకేలా ఉండగా మనం మాత్రం ఆ హోల్డింగ్లో ఆ రూపం మీద ఫోకస్ పెట్టుకుంటూ గ్రాడ్యువల్ గా ఆ రూపము మంత్రము కూడా లేకపోయినా ఎప్పుడు ఒకేలా ఉండే స్టేజ్ అటైన్ అవ్వాలి అంటే గురువు లేకపోయినా ప్రాణాయామం ద్వారా అలా చేయొచ్చు ఓకే బట్ అంటే మనం అంటే నేను చిన్నప్పటి నుంచి ఒక శ్లోకం వినేవాడిని అంటే కర్మణ్య వాదికరస్తే అంటే పని చేయి ఫలితం ఆశించకు అని చెప్తుంటారు అండ్ జీవితానికి కర్మ కూడా ఇంటర్ లింక్ ఉందని మీరు ముందు కూడా చెప్పారు సో మరి దీనికి ఏమంటారు చాలా మంచి ప్రశ్న వేశరు
(1:00:15) అసలు కర్మలు చేయకుండా ఎవ్వరు ఉండలేరు ఆ అంతే కదా అవును మనం ఊరికే కూర్చుని పార్కులో గడ్డి పీక్కుంటున్న దాన్ని కర్మ అంటారు కాయిక కర్మ అంటారు. అసలు కర్మలు చేయకుండా ఉండలేము భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు నహికస్చిత్ క్షణమపి జాతుతిష్ట్యతు కర్మ భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు కర్మలు చేయాల్సింది అయితే కర్మలు ఎలా చేయాలో తెలుసుకొని చేయాలి అంతేలే ప్రాపర్ మెథడ్ తెలుసుకొని చేయాలి కొంతమంది ఏంటంటే నాకేంటి నాకేమ వస్తుంది ఇలా ఆలోచిస్తారు రైట్ రైట్ ఇప్పుడు మీరు ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు నాకేంటి నేను ఈ పని
(1:00:50) చేస్తే నాకేంటి నేను ఈ పని చేస్తే నాకు బెనిఫిట్ ఉందా కానీ కర్మలే ఎప్పుడు కూడా అలా చేయకూడదు ఎందుకంటే రమణుల వారు ఏం చెప్పారంటే ఈశ్వరార్పితం నిచ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అని చెప్పారు అంటే కర్మలు నేను చేస్తున్నాను అన్న భావనతో చేయకూడదు ఈశ్వరార్పణ భావనతో చేయాలి దానికి కారణం ఏంటి మీకు మొదట్లో చెప్పాను మనం పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది అవును పాపం చేస్తే నరకం వస్తుంది ఏదీ రాకుండా మోక్షం రావాలంటే ఏం చేయాలి మనం ఏ పని చేసిన కృష్ణార్పణం అనుకోవాలి ఈశ్వరార్పణం అనుకోవాలి అప్పుడు ఎవరి అకౌంట్ లో పడుతుంది దేవుడి అకౌంట్ లో పడుతుంది మనకు
(1:01:30) పుణ్యము ఉండదు పాపము ఉండదు అప్పుడు మళ్ళీ జన్మ రాదుగా సైకిల్ రిపీట్ అవ్వదు గా సో సోల్ తో రిలేట్ అవ్వచ్చు మోక్షం వస్తుంది అందుకని కర్మలు ఎలా చేయమన్నాడు అంటే కర్తృత్వ భావన లేకుండా చేయమన్నాడు అంటే నాకు ఏంటి బెనిఫిట్ అని కాకుండా ఈశ్వరుడు చేయమన్నాడు కృష్ణుడు చేయమన్నాడు నేను చేస్తున్నాను అన్న భావనలో చేయాలి అయితే కర్మలు చేసేటప్పుడు కూడా మనం ఒక పని చేస్తాం అంతేగా ఈ పని చేసి నాకు ఫలితం రాలేదు ఇవన్నీ చెప్తూఉంటాం అసలు కర్మ ఫలితాన్ని మనం ఎవరం నిర్దేశించ పనిచే ఫలితం ఆశించకు ఆశించకు ఎందుకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక కత్తి ఉందండి కత్తి తీసుకొని
(1:02:05) మనం ఎదుటి వ్యక్తిని పొడిచామ అనుకోండి ఏం చేస్తారు చనిపోతారు మనల్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు అదే ఒక డాక్టర్ కత్తి తీసుకొని పొడిచాడు అనుకోండి ఏం చేస్తారు నథింగ్ ఆపరేషన్ ఆపరేషన్ అంటారు డాక్టర్ కి సన్మానం చేస్తారు పెద్ద పేరు వస్తుంది డబ్బు వస్తుంది కత్తి అదేగా అవును పొడవటం అదేగా కానీ ఇక్కడ ఏం వచ్చింది అక్కడ ఏం వచ్చింది అంటే ఏంటి కర్మ ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వదు కర్మ వెనక ఉన్న ఉద్దేశం బట్టే ఫలితం వస్తుంది.
(1:02:32) ఒకే కత్తి కూరగాయలు కోయటానికి ఉపయోగించచ్చు ఒకే కొత్తి ఆపరేషన్ చేయడానికి ఉపయోగించచ్చు అదే కత్తి మనిషిని కోయటానికి ఉపయోగించచ్చు కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అంటే కర్మ వెనుక ఉన్న ఉద్దేశం బట్టి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది యజ్ఞాలు చేస్తారు హోమాలు చేస్తారు దశరధుడు చేసాడుగా ఉత్తరకామేష్టి యాగం శ్రీరామచంద్రమూర్తి అవతార పురుషుడు వచ్చాడుగా దక్షుడు కూడా చేశాడు ఏమైంది శివుడు వీరభద్రుడిని పంపిస్తే తలకాయ తీసేసాడు దక్షయజ్ఞం ధ్వంసం అయిపోయింది గా దక్షుడు యజ్ఞం చేశాడు అవును దశరథ మహారాజు యజ్ఞం చేశాడు దశరథ మహారాజు మంచి కోసం చేశాడు అందువల్లే
(1:03:06) శ్రీరామచంద్రుడు వచ్చాడు దక్షుడు శివుడి మీద కోపంతో చేశడు తలకాయ పోగొట్టుకున్నాడు కాబట్టి ఒకే కర్మ చేసిన కర్మల వెనుక ఉన్న ఉద్దేశాన్ని బట్టి ఫలితం ఉంటుంది. మళ్లా ఫలితం కూడా ఎవరు ఇస్తారు ఈశ్వరుడు ఇస్తాడు. ఓకే ఇప్పుడు కంబైన్డ్ స్టడీస్ చేస్తాం గా ఎగ్జామ్స్ కి మీరు నేను అందరం కంబైన్ స్టడీస్ చేసాం.
(1:03:25) అందరం కూర్చుంటాం గా కూర్చున్న అందరం కూడా ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని చెప్పి అందరం అవే క్వశ్చన్స్ చదువుతాం ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ బేసిక్ థింగ్ వెళ్లి ఎగ్జామ్ రాస్తాం మరి అందరికీ ఒకే మార్కులు వస్తున్నాయా రావట్లేదుగా ఒక్కోసారి బాగా టాలెంట్ ఉన్నవాడికి కూడా అనుకోకుండా ఇదేంటి నేను బాగా రాస్తే తక్కువ వచ్చినాయి అనుకుంటారు ఒక్కోసారి సరిగ్గా టాలెంట్ లేకపోయినా ఆ టైంలో మనతో పాటు కంబైన్డ్ స్టడీస్ చేస్తూన్న వాడికి ఎక్కువ మార్కులు రావచ్చు మీరు గమనించి ఉంటారుగా నేనైతే గమనించాను చాలాసార్లు అంటే ఏంటి ఒకే కర్మ నలుగురు విద్యార్థులు పరీక్షలు రాయడం అనేది చేస్తే
(1:03:52) వాళ్ళక వచ్చే ఫలిత ఫలితాన్ని ఈశ్వరుడు నిర్ణయించాడు అందుకే చెప్తారు కర్మలు ఏం చేసినా సరే నువ్వు ఫలితాన్ని ఆశించద్దు అని చెప్పేది అందుకే ఎందుకని కర్మలకు ఫలితం ఇచ్చేవాడు ఎవడు ఈశ్వరుడు అందుకని ఈశ్వరార్పితం న ఇచ్చయాకృతం నువ్వు ఏం చేసినా కృష్ణార్పణం శివార్పణం అనుకుంటూ కర్మ చేయాలి అప్పుడు అది నిష్కామ కర్మ అంటారు ఆ నిష్కామ కర్మ కూడా ఆత్మను చేరడానికి ఒక మెథడ్ అండి మనం ఇందాక అనుకున్నాం కదా హూయామయ అని ఆత్మ దగ్గరికి వెళ్ళాలంటే మనకి నాలుగు మార్గాలు చెప్తారు ఒకటి కర్మ కర్మమార్గం కర్మ మార్గం అంటే ఏంటి చేసే పనిలోనే దేవుని చూడు
(1:04:27) అవును ఆ పని ఫలితం ఆశించకు ఎలాంటి ప్రతిఫలం లేకుండా పని చేయి పనిలో దేవుని చూడు క్రమక్రమంగా నీలో ఆత్మను చేరుకో అది కర్మ మార్గం రెండోది భక్తి మార్గం భక్తి మార్గం అంటే అందరూ పూజలు చేస్తూ ఉంటారు కదా పూజలు చేస్తారు జపాలు చేస్తారు ఇది భక్తి మార్గం ఇలా పూజలు చేసుకుంటూ చివరగా ఆత్మ దగ్గరికి వెళ్ళు పూజలు చేస్తే ఆత్మ దగ్గరికి ఎలా వెళ్తారు ఇప్పుడు పూజ అంటే ఏంటి ఒక విగ్రహం పెట్టుకుంటాం అంతేగా అవును మనం ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటాం గా మీరైనా నేనైనా మీ ఫేవరెట్ గాడు ఎవరు లార్డ్ శివ లార్డ్ శివ వెరీ గుడ్ నా ఫేవరెట్ గాడు కూడా లార్డ్ శివ సో మీరు నేను ఏం చేస్తాం
(1:05:01) ఇంట్లో ఒక శివుడి ఫోటో గాని శివలింగం గాని పెట్టుకుంటాం రోజు శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాం. అయితే రోజు శివుడికి అభిషేకం చేస్తున్నావ అంటే శివుడు ఆ లింగంలోనే ఉన్నాడా లేదు అన్ని చోట్ల ఉన్నాడుగా నమ్మకం ఏం చెప్తుంది చెట్టులో ఉంటాడు పుట్టలో ఉంటాడు కొండలో ఉంటాడు బండలో ఉంటాడు ఈ మైక్లో ఉంటాడు ఈ మైక్లో ఉంటాడు ఈ గ్లాసులో ఉంటాడు సృష్టి అంతా ఉన్న ఈశ్వరుని మనం శివలింగం పెట్టుకొని ఎందుకు పూజ చేస్తున్నాం సృష్టి అంతా ఉన్న ఈశ్వరుని చూసే మెచూరిటీ మనకు రాలేదు అందుకని ముందు ఏం చేస్తాం అంటే ఒక శివలింగం అచ్చా ఆ శివుడు ఇక్కడే ఉన్నాడు ఆ
(1:05:35) శివుడికి అనేక సంవత్సరాలు పాటు పూజ చేస్తాం అనేక సంవత్సరాలు పూజ చేసి అందులోనే శివుడు ఉన్నాడు అన్న భావం పొందుతాం తర్వాత క్రమంగా ఏం ఆలోచన రావాలి అక్కడితో ఆగిపోకూడదు నేను పెట్టుకొని పూజ చేసే శివుడి దగ్గరే శివుడు లేడు సృష్టి అంతా ఉన్నాడని పక్కన మైక్లో శివుడిని చూసే స్థితికి రావాలి మీలో నాలో అందరిలో గ్లాసులో శివుడిని చూసే స్థితికి రావాలి మరి అందరిలో ఉన్న శివుడు నాలో కూడా ఉంటాడుగా అవును నాలోన గలడు శివుడు నీలోన గలడు శివుడు ఆ చివరికి నాలో కూడా శివుడు ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకోవాలి వెంటనే తెలుసుకోలేం ప్రాక్టీస్ మేక్స్ మన్
(1:06:10) పర్ఫెక్ట్ అందుకనే ఏం చెప్తారంటే పూజ చేసేటప్పుడు పుష్పాలు దేవుడికి వేసేటప్పుడు ఇలా వేయమని ఎప్పుడూ చెప్పరు ఇలా వేయమంటారు ఇలా ఎందుకు పుష్పాలు వేయాలి ఎదురుగా ఉన్న శివుడే కాదు నీలో కూడా శివుడు ఉన్నాడు నీలో ఉన్న శివుడికి చూపిస్తూ ఎదురుగా ఉన్న శివుడికి పుష్పం వేయమంటారు అందుకే ఇలా అంటారు త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని రమణ మహర్షి చెప్పారు ఓకే అంటే ఇక్కడ అక్కడ ఇద్దరు శివులు లేరయ్యా ఇక్కడ అక్కడ ఒకడే శివుడు ఉన్నాడు సృష్టి అంతా శివుడు ఉన్నాడు అంతా ఉన్న శివుణని చూసే స్థితికి మనం ఎదగాలంటే ముందు విగ్రహం పెట్టుకో ఫోటో పెట్టుకో
(1:06:46) సంవత్సరాలు సంవత్సరాలు పూజ చెయ్ ఆ తర్వాత అక్కడున్న దేవుని అంతటా చూసే స్థితికి నీలో కూడా ఉన్నాడన్న స్థితికి ఎదుగు అని పూజలు చెప్తాయి అది భక్తి మార్గం ఆ తర్వాత మూడో మార్గం రాజమార్గం రాజమార్గం అంటే ఈ ప్రాణాయామం ఇందాక నేను చెప్పా కదా వాయువు కంట్రోల్ అయితే మనసు కంట్రోల్ అవుతుంది మనసు కంట్రోల్ అయితే బుద్ధి కం కంట్రోల్ అవుతుంది.
(1:07:07) ఈ రెండు సింక్రనైజ్ అయితే సోల్ తో కనెక్ట్ అవుతాం కదా మ్ రాజమార్గం ప్రాణాయామము యోగ ఇలాంటి వాటి ద్వారా ఇక నాలుగో మార్గం మనం ఎవరం చేయలేం ఆదిశంకరాచార్యుల వారు చేశారు ఓకే రమణ మహర్షి చేశారు జ్ఞాన మార్గం అంటే డైరెక్ట్ గా ఇవన్నీ సంబంధం లేదు నేను ఆత్మని అని భావనలోకి వెళ్ళిపోయారు అవును వాళ్ళ ఫిలాసఫీ కూడా వేరు వాళ్ళ ఫిలాసఫీ వేరు కదా వెరీ గుడ్ కరెక్ట్ గా చెప్పారు అంటే ఏంటి మనకైతే ఇన్ని మెథడ్స్ కావాలి కర్మ మార్గంలోకి వెళ్లి పనిలో దేవుని చూసి ఫైనల్ గా ఆత్మను చూడాలి లేదా పూజలు చేసుకుంటూ అంతటా ఉన్న దేవుని మనలో ఉన్న దేవుని ఆత్మను చూడాలి లేదా ప్రాణాయామం చేసుకుంటూ శ్వాస కంట్రోల్
(1:07:43) చేసుకుంటూ మనసు బుద్ధి కంట్రోల్ చేసుకుంటూ చివరగా వెళ్ళాలి అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనమంతా కామన్ పీపుల్ కాబట్టి జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు రమణ మహర్షి ఇలాంటి మహానుభావులు అవతార పురుషులు కదా వాళ్ళకి అలా అక్కర్లేదు వాళ్ళకి వెంటనే నేను ఆత్మను అనే భావం వస్తుంది అన్నమాట కానీ ప్రతి ఒక్క జీవుడు కూడా దేవుణ్ణి మొక్కుతారు లేకుంటే పూజిస్తారు ధ్యానం చేస్తారు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కానీ భక్తి ప్రాణం ఒకసారి మనం గమనిస్తే పూజలు చేస్తారు, జపాలు చేస్తారు, యాగాలు చేస్తారు వీటన్నిటిని చేయడం వల్ల ఒక మనిషి బ్రెయిన్ ని ఆత్మతో కనెక్ట్ చేయగలుగుతారా?
(1:08:14) చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. మ్ ఇవన్నీ కూడా బ్రెయిన్ ని ఆత్మతో కనెక్ట్ చేసే ప్రాసెస్ లో ఉన్న స్టెప్స్ మాత్రమే ఒక్కొక్క స్టెప్ ద్వారా బ్రెయిన్ ని ఆత్మతో కనెక్ట్ చేయాలి. మ్ ఒక్కొక్క స్టెప్ ద్వారా బ్రెయిన్ ని ఆత్మతో కనెక్ట్ చేయడం ఏంటి అంటే అంతఃకరణ శుద్ధి వాటి కోసం చేస్తాం. ఓకే మనకి అంతఃకరణములు అంటారు అంటే ఏంటంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఈ నాలుగింటిని అంతఃకరణాలు అంటారు మనసు అనేది రకరకాలుగా చంచలంగా ఉంటుంది దాన్ని స్టేబుల్ చేయాలి అవును బుద్ధి అనేది ఒకే మార్గంలో ఉండేలాగా అవ్వాలి చిత్తం అంటే ఏంటంటే మనం ఒక పని అనుకున్నప్పుడు దానికి ప్లాన్ చేసుకుంటే
(1:08:54) దాన్ని చిత్తం అంటారు ఆ ప్లాన్ ప్రాపర్ గా ఉండాలి అహంకారం అంటే నేనే చేస్తున్నాను అనే ఫీలింగ్ లేకుండా ఈశ్వరార్పణ భావంతో చేయాలి మనసు మనసు బుద్ధి చిత్తము అహంకారం వీటిని అంతఃకరణాలు అంటారు అందుకే అంతఃకరణ శుద్ధి అంటారు అవునా మీరు వినుంటారు చాలాస అంతఃకరణ శుద్ధి అని అంతఃకరణ శుద్ధి అంటే ఏంటంటే ఆత్మను రీచ్ అయ్యే ప్రాసెస్ అన్నమాట ఓకే ఈ ప్రాసెస్ లోనే పూజలు చేస్తాం ఈ ప్రాసెస్ లోనే జపాలు ప్రాసెస్ లోనే హోమాలు వీటి ద్వారా ఏం చేయాలి అంటే మనసు అనేది స్టేబుల్ గా చేసుకోవాలి.
(1:09:26) బుద్ధి అనేది కరెక్ట్ గా వెళ్ళాలి అహంకారాన్ని తగ్గించుకోవాలి మమకారాన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలి ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ లో కూడా పూజ ఉంటుంది జపం ఉంటుంది ధ్యానం ఉంటుంది అంతేగా కొంతమంది పూజలు చేస్తారు మీరు అన్నట్టు ప్రశ్న అడిగినట్లుగా పూజలు కొంతమంది చేస్తారు కొంతమంది జపాలు చేస్తూ ఉంటారు అంతేగా ఎప్పుడు జపమాల పట్టుకొని ఏదో ఒక మంత్రాన్ని జపించుకుంటూ ఉంటారు కొంతమంది కొంచెం పెద్దగా చదువుతుంటారు కొంతమంది చిన్నగా చదువుతుంటారు కొంతమంది మనసులో చదువుకుంటారు కొంతమంది పెదాలు కదిలిస్తూ చదువుతారు జపం వేరు లేండి వాచిక ఉపాంసు మానసికం అని రకరకాలు
(1:09:58) జపము పూజ ధ్యానము ఈ మూడిటిలో కూడా పూజ కంటే జపం గొప్పది జపం కంటే ధ్యానం గొప్పది దేనికి ఆత్మతో రిలేట్ అవ్వడానికి ఓకే ఎందుకంటే పూజ చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న విగ్రహానికో ఫోటోకో మనం పూజ చేసుకుంటాం అష్టోత్తరం చదువుతాం నైవేద్యం పెడతాం హారతి ఇస్తాం స్వామి నా కోరికలు తీర్చా అంటాం వెళ్ళిపోతాం అంతేగా అవును తర్వాత జపం అంటే ఏంటి ఒకే మంత్రాన్ని ఫోకస్ గా ఏకాగ్రతగా 108 సార్లు చదువుతూ ఉంటాం 1008 సార్లు చదువుతూ ఉంటాం.
(1:10:29) జపం ద్వారా కొంతవరకు ఏకాగ్రత పెరుగుతుంది అంతేగా ఆ మంత్రం మీద ఫోకస్ ఉంటుంది. ధ్యానం అంటే ఏంటంటే వీటన్నిటికీ అతీతంగా ఉన్నదే ధ్యానం ధ్యానం అంటే మనము మనసుని కంట్రోల్ లో పెట్టుకొని ఒకే రూపం మీద గాని లేదా ఒకే వస్తువు మీద గాని ఫోకస్డ్ గా ఆలోచిస్తూ ఉంటే దాన్ని ధ్యానం అంటాం. ఈ ధ్యానం ఎలా ఉండాలి పరీక్షిత్ మహారాజు ఉన్నాడుగా మహాభారతంలో ఆయన వేటకు వెళ్ళినప్పుడు శమీక మహర్షి ఉంటే ఆయన దాహం అవుతుంది నీళ్ళ ఇమ్మని అడిగితే ఎంతసేపటికి ఇవ్వడు దాంతో ఆయనకు కోపం వచ్చి చచ్చిపోయిఉన్న పాముని తీసుకొచ్చి ఆయన మెళలో వేస్తాడు. అప్పుడు కోపం వస్తేనేగా ఆ
(1:11:06) శమీక మహర్షి కుమారుడు నువ్వు ఏడు రోజుల్లో పాము కాటుక బలైపోవాలి అని చెప్పేసి శాపం ఇస్తే పరీక్షిత్ మహారాజు ఒంటి స్తంభం మేడ కట్టుకొని అందులో జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత తక్షకుడు ఒక చిన్న పండు రూపంలోకి వెళ్లి ఆ తర్వాత పండులో నుంచి బయటిక వచ్చేసి పరీక్షిత్ మహారాజుని కాటేసి చంపేస్తాడు. మరి మహర్షి కొడుకు శాపం ఇచ్చాడు కదా దాంతో కోపం వచ్చి పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయ మహారాజు సర్పయాగం చేశడు.
(1:11:31) సర్పయాగంలో వేలాది సర్పాలన్నీ కూడా ఆ సర్పయాగంలో ఆహుత అయిపోతూ ఉంటే అప్పుడు అస్తీక మహర్షి ఈ సర్పయాగాన్ని ఆపమని జనమేజయ మహారాజుకి చెప్పాడు అంటే ఇదంతా ఎక్కడ జరిగింది పరీక్షిత్ మహారాజు వెళ్ళినప్పుడు శమీక మహర్షి ఎంతసేపు దాహానికి నీళ్లు అడిగినా సరే ఇవ్వకుండా ధ్యానంలోనే ఉండిపోయాడు అంటే బయట ప్రపంచం తో సంబంధం లేకుండా ఉండటం సమాధి స్థితి అంటారు.
(1:12:00) ఆ సమాధి స్థితికి వెళ్ళాలంటే ధ్యానం ముఖ్యం అన్నమాట కాబట్టి పూజలు కొంతవరకు జపాలు ఇంకొంచెం హై లెవెల్ ధ్యానం అనేది బాగా హై లెవెల్ ధ్యానం ఎలా ఉండాలంటే మాట్లాడకుండా ధ్యానం చేసుకుంటూ ఉండాలి కానీ ధ్యానం కూడా అంత ఈజీ కాదు ఇప్పుడు మనం ఇంట్లో ధ్యానం చేసుకుందాం అని కూర్చుంటాం. కూర్చోగానే బయట ఏ వెహికల్ సౌండో వినిపిస్తుంది అంతేగా ఆ వెహికల్ సౌండ్ వింటాం అది ఏ వెహికల్ లేటెస్ట్ మోడల్ వెహికల్ ఆ కార్ ఏంటి మనం కొంటే ఎలా ఉంటుంది ఇవన్నీ మొదలవుతాయి ఆ తర్వాత రాజకీయాల దగ్గరికి వెళ్తుంది ఈలోపు పాలవాడు పాలుసాడా ఇవన్నీ ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి అంటే మనం ధ్యానంలో ఉన్నప్పుడు కూడా
(1:12:34) వెంటనే ఆ ఏకాగ్రత అనేది రాదు అంతేగా స్టేబుల్ గా ఉండదు మనసు అనేది ఫ్లక్చుయేట్ అయిపోతూ ఉంటుంది అందుకే ముందు ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలి ప్రాణాయామం తర్వాత ధ్యానంలో జాగ్రత్త చక్కగా ధ్యానం చేసుకుంటూ ఒకే పాయింట్ మీద ఫోకస్ పెట్టుకుంటూ దేవుడి రూపం గాన మంత్రం గాన చేసుకుంటూ ఫైనల్ గా ఏ స్టేజీ లేకుండా కంప్లీట్ గా సోల్ తో రిలేట్ అయ్యేలాగా ఆ మెడిటేషన్ అనేది తీవ్రతరం చేయాలి కాబట్టి ఇవన్నీ స్టెప్స్ అన్నమాట బట్ అంటే ఈ రోజులో మనం చూస్తున్నాం టెక్నాలజీ వెరిగిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రతిదానికి షార్ట్ కట్స్ వెతుక్కుంటారు కదా ఈ హూ యమ్ ఐ అని
(1:13:06) తెలుసుకోవడానికి ఏదనా షార్ట్ కట్ ఉందా హూ యమ్ ఐ అని తెలుసుకోవడానికి షార్ట్ కట్ ఏం లేదు ఎందుకంటే మీకు డాక్టర్ కోర్స్ కష్టమ కష్టమేగా ఇంజనీరింగ్ కష్టమేగా వాటన్నిటికంటే చాలా కష్టమైన కోర్సు ఇది హూ యామై అనే కోర్సు దీన్ని బ్రహ్మవిద్య అంటారు. అందుకే మీరు చూడండి ఎవరైనా ఏదైనా చేయటం బాగా కష్టంగా ఉందంటే ఎందుకు కష్టంగా ఉంది ఇదేమనా బ్రహ్మవిద్య అంటూ ఉంటారు అంటే బ్రహ్మవిద్య ఇస్ నాట్ ఏ జోక్ బ్రహ్మవిద్య అంటే ఆత్మజ్ఞానం ఆత్మ సాక్షాత్కారం సోల్ తో రిలేట్ అవ్వటం దీనికి అసలు షార్ట్ కట్లు ఏమ ఉండవు ఇందాక నేను చెప్పిన నాలుగు మార్గాలు కర్మ మార్గం
(1:13:40) భక్తి మార్గం రాజమార్గం జ్ఞాన మార్గంతో పాటుగా మనకి సాధన చతుష్టయం అని చెప్పారు. ఓకే అంటే ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ మెడిసిన్ వీటన్నిటిని ఎలాగైతే ఒక క్వాలిఫికేషన్ ఉంటుందో అంటే ఆ కోర్సు మనం ఎలాగైతే చేయాలో బ్రహ్మవిద్య ఆత్మజ్ఞానం హూయామయం అని తెలుసుకోవాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అవును ఒక కోర్సే చేయాలి డాక్టర్ కోర్స్ లాగా ఇంజనీర్ కోర్స్ లాగా బ్రహ్మవిద్య ఈ హూయామయ అనేదానికి కూడా ఒక కోర్స్ ఉంటుంది సాధన చతుష్టయము కరెక్ట్ వెరీ గుడ్ సాధనా చతుష్టయము అంటారు ఓకే అంటే ఫోర్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే నిత్యానిత్య వస్తు వివేకము
(1:14:15) సమదమాది షట్సంపత్తి ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము ముముక్షుత్వం అంటారు మీకు సింపుల్ గా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తా ఇవన్నీ ఏదో పెద్ద వర్డ్స్ లాగా ఉన్నాయి కదా మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏంటంటే ఏది టెంపరరీ ఏది పర్మనెంట్ అని తెలుసుకునే మార్గంలో ముందుకు వెళ్ళాలి ఓకే ఏది టెంపరరీ అన్ని టెంపరరీ అదే అదే అంతే కదా జాబ్ టెంపరరీ మ్యారేజ్ లైఫ్ టెంపరరీ అసలు జీవితమే టెంపరరీ మీరు అన్నట్టు ఏది పర్మనెంట్ సోల్ పర్మనెంట్ ముందు ఆ జ్ఞానం రావాలి అది నిత్య అనిత్యం ఓకే పర్మనెంట్ నాట్ పర్మనెంట్ వస్తు వివేకం ఆ క్లారిటీ మనకు రావాలి దాన్నే నిత్యానిత్య
(1:14:52) వస్తు వివేకం రెండోది ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం అంటారు. అంటే ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్ లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న సుఖాలకు ఆశపడకపోవడం బ్రహ్మాండమైన బిల్డింగ్ త్రీ స్టేర్ బిల్డింగ్ కట్టాలండి మొత్తం ఏసీ పెట్టుకోవాలండి అసలు హోమ్ థియేటర్ పెట్టుకోవాలండి బ్రహ్మాండమైన కార్లు రెండు ఉండాలండి ఇట్లా ఈ ఇల్లు వాహనాలు ల్యాండ్లు కొనాలండి గోల్డ్ బిస్కెట్లు కొనాలండి ఈ ఇల్లు వాహనాలు బంగారం ఇలాంటివన్నీ కొనుక్కోవాలన్న ఆశ లేకుండా వాటి మీద ఏ ఆశ లేకుండా ఉంటాం.
(1:15:25) ఓకే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కష్టమే బ్రహ్మవిద్య నాటే జోక్ ఇందాకే చెప్పా కదా అంటే అవి ఉన్నా ఎలా ఉంటామో లేకపోయినా అలాగే ఉండే మెచూరిటీని అడాప్ట్ చేసుకోవాలి దాన్నే ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం అంటారు ఆ తర్వాత శమదమాది షట్సంపత్తి అంటారు అంటే ఒక ఆరు ఉంటాయి అన్నమాట శమము అంటే అంతరింద్రియ నిగ్రహము దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం మీకు సింపుల్ గా చెప్పాలనుకోండి కళ్ళు ఏది పడితే అవి చూడాలనుకుంటే చూడకూడదు అవును అంతేగా చెవులు ఏవి పడితే అవి వినాలను అనుకుంటాయిగా అవి వినకూడదు అంటే బయట కనిపించే ఇంద్రియాలు మన కంట్రోల్ లో ఉండాలి.
(1:16:00) ఉమ్ అంతరింద్రియ నిగ్రహం అంటే పైకేమో మంచిగా ఉన్నట్టుగా బ్రహ్మాండంగా నటిస్తూ లోపల మాత్రం రాంగ్ థాట్స్ పెట్టుకోకూడదు అంతేగా అదిఒక ఇంద్రియ నిగ్రహం ఇప్పుడు చాలా మంది బాహ్యేంద్రియ నిగ్రహం చూపించాలి సమాజం కోసం చూపిస్తుంటారు అది ఓకే కానీ ఈ హూయామైకి అది సరిపోదు అంటే పైకేమో మంచిగా ఉన్నట్టు చక్కగా బొట్టు పెట్టుకొని విభూది పెట్టుకొని అంటే అందరూ అలా ఉండటం మంచిదే ఎందుకంటే బయట సమాజంలో లోపల కూడా ఆ లోపల కూడా ఇంద్రియ నిగ్రహం అసలు బయట లేని వాళ్ళే చాలా మంది ఉన్నారు అనుకోండి అది వేరే విషయం ముందు అసలు బయట ఉండాలి అవును ఒక జీవనం క్రమ శిక్షణతో కూడిన జీవనం
(1:16:35) ఉండాలి బాహ్యేంద్రియ నిగ్రహం బయటికి ఇవ్వబడితే అవి చేయకూడదు. సరిపోదు అంతరింద్రియ నిగ్రహం లోపల కూడా ఆలోచన కరెక్ట్ గా ఉండాలి చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు బయటికే కాదు లోపల కూడా ఒరిజినల్ గా ఉండాలి. ఓకే శమము దమము అంటారు ఆ తర్వాత మూడోది ఉపరతి ఉపరతి అంటే ఏంటంటే మనకి పూజలు గాని ఏవి చెప్పినా సరే ఫలితం ఆశించకుండా వాటిని చేసి వదిలేయటం ఈశ్వరార్పణ భావంతో తర్వాత తితీక్ష తితీక్ష అంటే ఏంటంటే ఇప్పుడు చలికాలం వచ్చిందనుకోండి విపరీతమైన చలి ఉంటుంది గా వామ్మో ఈ చలి తట్టుకోలేమని రగ్గులు కప్పుకుంటాం స్వెటర్లు వేసుకుంటాం అవును ఇవన్నీ చేస్తుంటాం కదా
(1:17:09) కానీ చలి ఎంత ఉన్నా స్టేబుల్ గా ఒకేలా ఉండాలి విపరీతమైన ఎండాకాలం వస్తే ఏసీ వేయండి ఏసీ లేకుండా నేను రాలేనండి అంటాం అవునా అంటే శీత ఉష్ణ పరిస్థితుల్ని సమంగా చూడగలగటం ఎంత ఎండ ఉన్నా ఎంత చలి ఉన్నా ఒకే రకంగా ఉంటాం యోగులకే సాధ్యంగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి అందుకే రోజు చన్నీళ్ళ స్నానం చేయమంటారు మీకు తెలుసా యోగాలో కూడా చాలా మంది చన్నీటి స్నానం చేయమంటారు చలికాలంలో కూడా యోగా చేసేవాళ్ళు చన్నీళ్ళ స్నానం చేస్తారు ఎందుకు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.
(1:17:38) ఏ కాలంలోనైనా చన్నీటి స్నానం అనేది ఇంద్రియ నిగ్రహాన్ని అయ్యప్ప దీక్షల్లో కూడా చన్నీటి స్నానం చేస్తారు కదా అంటే మనం కంట్రోల్ గా ఉండాలి ఎండాకాలమైనా చలికాలమైనా ఎప్పుడూ ఒకే రకంగా ఉండగలగాలి దీన్ని తితీక్ష అంటారు ఆ తర్వాత శ్రద్ధ శ్రద్ధ అంటే ఏంటి ఎవరైనా గురువు మంచి విషయం చెప్పాడు అనుకోండి ఏదో చెప్పాడు బానే ఉంది అని వదిలేయడం కాదు గురువు చెప్పిన మాటను నమ్మాలి గురు వేదాంత వాక్యాదిషు విశ్వాసః ఇతి శ్రద్ధ అంటే ముందు అది నమ్మాలి ఇప్పుడు హూ యామ అని ఒక కాన్సెప్ట్ ఉంది సోల్ తో రిలేట్ అవ్వాలి అని నేను చెప్తున్నాను అనుకోండి మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు అనుకోండి మనం
(1:18:11) చెప్పిన ఈ విషయాన్ని ఆడియన్స్ నమ్మాలి అది అది శ్రద్ధ అన్నమాట నమ్మితే గనుక శ్రద్ధవాన్ లభతే జ్ఞానం ఆ శ్రద్ధ వల్ల నాలెడ్జ్ వస్తుంది జ్ఞానాదేవతు కైవల్యం దానివల్ల మోక్షం వస్తుంది. అంతే కదా అది నమ్మి ఆచరిస్తే వస్తుంది ఆఖరిది సమాధానం ఓకే సమాధానం ఏంటంటే ఇప్పుడు చెప్పిన మెథడ్స్ లో బయట లోపల కంట్రోల్ చేసుకుంటూ సోల్ తో రిలేట్ అయ్యే ప్రాసెస్ లో ముందుకు వెళితే మనకు ఒక సమాధానం వస్తుంది ఆ సమాధానం ఏంటంటే నాలుగు వేదాలు చెప్పిన సమాధానాలు ఫైనల్ గా హూయామయం అని తెలుసుకొని ఎక్కడ ఎండ్ అవ్వాలి నాలుగు వేదాల్లో చెప్పారు నాలుగు వాక్యాలు బ్రహ్మాండమైన వాక్యాలు
(1:18:47) చెప్పారు అక్కడ ఎండ్ అవ్వాలి ఏంటి ఆ వాక్యాలు అహం బ్రహ్మాస్మి అయం ఆత్మ త్మ బ్రహ్మ సోహం తత్వమసి ఒక్కో వేదం ఒక్కో వాక్యం చెప్పింది ఏంటండీ ఈ నాలుగు వాక్యాలకు మీనింగ్ అంటే ఈ నాలుగు వాక్యాలకు మీనింగ్ ఒకటే అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మని బ్రహ్మ అంటే ఆత్మ నేను ఆత్మ స్వరూపాన్ని అయం ఆత్మ బ్రహ్మ అంటే నేను ఆత్మని పరబ్రహ్మ స్వరూపాన్ని మ్ సోహం సోహం అంటే స అహం నేను అదే ఏంటది ఆత్మ సోహం అంతే కదా స అహం నేను అది అదంటే ఆత్మ నేను ఆత్మని తత్వమసి తత్వము అసి అది నువ్వై ఉన్నావు అని అర్థం అది అంటే ఎవరు ఆత్మే
(1:19:32) అర్థమైందా ఈ నాలుగు మాటలకి ఒకటే అర్థం అహం బ్రహ్మాస్మి అన్నా అయం ఆత్మ బ్రహ్మ అన్నా సోహం అన్నా తత్వమసి అన్నా నేను ఆత్మని అని తెలుసుకోవడం ఈ ప్రాసెస్ లో తెలుసుకోవాలన్నమాట అలా తెలుసుకుంటే చివరిగా నాలుగోది ముముక్షుత్వం మోక్షం వైపు వెళ్ళదు ముముక్షుత్వం అంటే మోక్షము మోక్షం రావాలంటే సోల్తో కనెక్ట్ అవ్వాలి స్వామి మనం ఏ తప్పు చేసినా ఎవరికీ తెలియనప్పటికీ మనకు తెలుస్తుంది మనం తప్పు చేసామని కొన్నిసార్లు మనం ఇంటర్నల్ గా మనమే అనుకుంటాం అరే నువ్వు తప్పు చేసావు ఈ విషయంలో అని స్వార్థంతో దాన్ని బయటికి చెప్పలేమ బట్ లోపల అంతరాత్మ చెప్తుంది కదా
(1:20:04) ఈ అంతరాత్మతో కనెక్షన్ ఏంటి ఇది ఏం చెప్తుంటుంది యాక్చువల్ గా ఇక్కడ లోపల నువ్వు తప్పు చేస్తున్నావ్ అని చెప్పేది అంతరాత్మ అని అందరు అంటారు కానీ యాక్చువల్ గా బుద్ధి చెప్తుంది. ఓకే అందుకే ఎప్పుడైనా సరే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నీకు మనసు లేదా అనరు నీకు బుద్ధి లేదా అంటారు అంతే కదా నీకు బుద్ధి లేదా నువ్వు ఈ తప్పు చేసావ అంటారు అంతేకానీ నీకు మనసు లేదా నువ్వు ఈ తప్పు చేసావు అన్నారు అంటే మన అంతరాత్మ చెప్పే విషయం అంటే మన బుద్ధి చెప్పే విషయం బుద్ధి చెప్తూ ఉంటుంది ఇది తప్పు ఇది ఒప్పుని కానీ బయటికి కవర్ చేస్తూ ఉంటాం ఈ బుద్ధి గురించే మనకి కటోపనిషత్తులో ఒక
(1:20:36) అద్భుతమైన విషయం చెప్తారు అదేంటంటే మానవ శరీరాన్ని ఒక రథంతో కటోపనిషత్తులో పోల్చారు. ఒక రథము రథానికి గుర్రాలు ఉంటాయి ఆ రథంలో ఒక సారధి ఉంటాడు సారధి చేతిలో కళ్ళెం ఉంటుంది. ఉమ్ గుర్రాలు ఎటువైపు వెళ్ళాలో ఎవరు నిర్ణయిస్తారు సారధి నిర్ణయిస్తాడు సారధి ఎలా నిర్ణయిస్తాడు కళ్ళెం లాగుతూ నిర్ణయిస్తాడు ఇక్కడ రథం అంటే శరీరం ఆ గుర్రాలు అంటే ఇంద్రియాలు ఆ కళ్ళెం అంటే మనసు కూర్చున్న సారధి బుద్ధి రథంలో ఉన్నవాడు ఆత్మ ఈ విషయం ఘటోపనిషత్తులో చెప్పారు అంటే ఏంటి మనం ఆత్మతో రిలేట్ అవ్వాలి తప్పు చేయకూడదు అంటే బుద్ధి అనే సారధి ఎప్పుడు మనస్సు అనే
(1:21:17) కళ్యాణన్ని కరెక్ట్ గా తీసుకెళ్తూ ఉండాలి అప్పుడు ఇంద్రియాలు అనే గుర్రాలు కరెక్ట్ మార్గంలోకి వెళ్తాయి అంతే కదా లేకపోతే రాంగ్ మార్గంలోకి వెళ్తాయి అవును ఆ కరెక్ట్ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది మనం మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు మన బుద్ధి అనేది కరెక్ట్ గా వెళ్తున్నప్పుడు మనం కచ్చితంగా ఆత్మతో రిలేట్ అవ్వచ్చు కానీ దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు ఒక చిన్న కథ చెప్తాను చెప్పండి కళింగ పక్షి అని ఒక పక్షి ఉంటుంది మ్ ఈ కథని మనకి పౌరాణిక గ్రంథాలు అలా చెప్తారు అయితే ఆ కళింగ పక్షి గుడ్లు
(1:21:52) పెట్టినప్పుడు ఆహారం కోసం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అక్కడ సముద్రం ఒక్కసారిగా వచ్చి కళింగ పక్షి పెట్టిన గుడ్లు మొత్తం కూడా లాక్కొని వెళ్ళిపోతుంది. ఓకే ఆ కళింగ పక్షి వచ్చి చూస్తే గుడ్లు ఉండవు. విపరీతంగా బాధపడుతుంది సముద్రుడి మీద ఉక్రోషం వస్తుంది. ఎలాగైనా సరే ఈ సముద్రంలో ఉన్న నీళ్లు మొత్తం లాగేసి నా గుడ్లు తీసుకోవాలని చెప్పి దృఢ సంకల్పంతో దాని ముక్కుతో సముద్రంలోకి వెళ్లి నీళ్లు కొద్దిగా పీల్చి సముద్రం బయటిక వచ్చి ఒడ్డున నీళ్ళు వదులుతూ ఉంటుంది.
(1:22:23) మళ్ళీ నీళ్లు పీలుస్తుంది. సముద్రం బయటక వచ్చి వడ్డున వదులుతూ ఉంటుంది. సముద్రపు అలలు వస్తూ ఉంటాయిగా అలా వెనక్కి వెళ్తున్నప్పుడు అబ్బా నేను నీళ్లు చాలా బయట వదిలేసాను అందుకే సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటుంది. ఇలా గంటలు రోజులు చేస్తూనే ఉంటే త్రిలోక సంచారి నారద మహర్షి అటువైపు వస్తాడు. చూసి నవ్వుకుంటాడు కళింగ పక్షి దగ్గరికి వెళ్లి నువ్వు ఏం చేస్తున్నావ్ అంటే నా గుడ్లు సముద్రుడు లాకవెళ్ళిపోయాడు ఈ సముద్రంలో ఉన్న నీళ్లు మొత్తం కూడా పీల్ చేసి బయట వదిలేసి నా గుడ్లు తెచ్చుకుంటా అంటుంది.
(1:22:52) సముద్రుడు గొప్పవాడు నువ్వు ఎప్పటికీ పూర్తి చేస్తావ్ అంటే ఎన్ని యుగాలైనా సరే ఎన్ని సూర్యోదయాలు అయినా సరే ఎన్ని చంద్రోదయాలు అయినా సరే ఎన్ని రోజులు సంవత్సరాలు అయినా సరే నా పిల్లల గుడ్లు నేను తెచ్చుకునే వరకు దీన్ని ఆపను అని చెప్పి ఆ కళింగ పక్షి నారదుడితో చెప్పేసరికి నారదుడికి ఆశ్చర్యం వేస్తుంది. ఆత్మజ్ఞానం కలిగినటువంటి ఒక యోగికి ఉండేటటువంటి ఆ సామర్ధ్యము ఆ కాన్ఫిడెన్స్ ఆ పక్షిలో చూసి నారద మహర్షి ఏం చేస్తాడంటే తన తపస్సు శక్తితో ఒక్క క్షణం ఆ సముద్రంలో జలం మొత్తం కూడా లాగేస్తాడు అప్పుడు ఆ కళింగ పక్షి వెళ్లి గుడ్లు తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఆ సముద్రాన్ని నారద మహర్షి విడిచిపెట్టాడని
(1:23:29) మనకి పరమార్థ కథల్లో చెప్తారు అంటే ఎవరైనా సరే బయటికి తప్పు చేసినా సరే దాన్ని కవర్ చేస్తూ ఉంటారు అవును దాన్ని చెప్పడం చాలా కష్టం కానీ లోపల నువ్వు తప్పు చేసావు తప్పు చేసావుని అని చెప్పి ఆ హెచ్చరిక చేసే అంతరాత్మ అంటున్నారే అది మన బుద్ధి అన్నమాట మనసు 100 రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఫైనల్ గా బుద్ధి ఏం చెప్తుంది నువ్వు 99 రకాలు తప్పుగా ఆలోచిస్తున్నావ్ ఇదిగో ఈ 100 రకమే కరెక్ట్ అని బుద్ధి చెప్తుంది అందుకే ఆ బుద్ధి చెప్పిన మార్గంలో నడవాలి.
(1:23:57) ఒకవేళ తప్పు చేసినా కూడా దాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. ఆ స్థిత ప్రజ్ఞతతో ముందడుగు వేయాలి దానికి అభ్యాసం కావాలి. అది ఈ కళంగ పక్షి కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే అలాంటి అభ్యాసాన్ని మనం పొందగలగాలి అప్పుడు ధైర్యంగా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు మొదట్లో చెప్పినప్పుడు కూడా అంటే డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మొత్తం అంతా ఆఫ్ అయిపోతుంది లేసాక మనిషి జీవితం స్టార్ట్ అవుతుంది.
(1:24:20) సో ఇది డైలీ జోరియే ప్రాసెస్ే కొంతమంది ఏందంటే లేసాక ఈరోజు నాదే నాదే అంత అనే అహంకారం కూడా కొంచెం ఎక్కువ యాడ్ అవుతుంటుంది. సో ఈ అహంకారం గాన నేనే నడిపిస్తున్నాను అంతా నాదే సర్వం అని ఫీల్ అవుతుంటారు కదా ఇది ఎంతవరకు దారితీస్తుంది అహంకారం ఎంతవరకు దారితీస్తుంది అంటే ఆ నేను తప్ప ఎవరు చేయలేరు ఏ పని చేయలేరు నేనే అన్నిటికీ కారణం అన్న స్థితికి తీసుకొస్తుంది అసలు ఈ అహంకారం గురించి కూడా మనకి పరమార్థ కథల్లో ఒక అద్భుతమైన కథ చెప్తారు ఓకే అసలు జంతువుల అన్నిటికంటే మనిషి చాలా గొప్పవాడు అవునా జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు జంతువులన్నిటిలోకి నరజన్మ చాలా గొప్ప గొప్పది మానవ జన్మ చాలా గొప్పది
(1:24:57) కానీ ఒకసారిట జంతువులన్నీ కూడా అడవిలో సమావేశం పెట్టుకున్నాయట మ్ మన నక్క జిత్తుల మారిన నక్క తెలివితేటలు ఎక్కువ కదా నక్క లేచి ఏమంటుందంటే మనిషి మనకంటే ఏ విధంగా గొప్పవాడు మనందరికీ ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క శక్తి ఉంది. కానీ మనిషికి మనకంటే తక్కువ శక్తులే ఉన్నాయి. కానీ అందరికంటే మనిషి గొప్పవాడని ఎలా తీర్మానించారు కాబట్టి ఇది తప్పు జంతువులే గొప్ప మనిషి కంటే అని మనం నిరూపించాలని నక్క చెప్తుంది ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు నక్కకు వస్తాయి గా దిత్తులు మారినక అది చెప్పేసరికి సరే జంతువులన్నీ కూడా తీర్మానించుకొని మనిషి కంటే జంతువులు
(1:25:31) గొప్ప నిరూపించాలనుకొని ఇక్కడికి దగ్గరలో ఒక ఆశ్రమం ఉంటుంది ఆశ్రమంలో ఒక సాధువు ఉంటాడు ముందు ఆ సాధువుతో ఒప్పిద్దాము ఆ సాధువు ఒప్పుకుంటే ఒక మనిషి ఒప్పుకున్నట్టేగా ఒక మనిషి ఒప్పుకుంటే మనిషి కంటే మనం గొప్పని తెలిసినట్టే కదా అని చెప్పి ఆ సాధువు దగ్గరికి బయలుదేరి వెళ్తాయి ఓకే ఆ సాధువు దగ్గరికి వెళ్ళిన జంతువులు ఒక్కొక్కటి వాటి గొప్పలు చెప్పడం మొదలు పెడతాయి ఏనుగు ఏమంటుందంటే నా కాలంత ఉండడు మనిషి నాకంటే ఎలా గొప్పవాడు నన్ను చూస్తేనే భయపడిపోతాడు అని ఏనుగ అంటుంది సింహము పులి ఇవేమంటాయి అంటే నన్ను చూడగానే ఒక్కసారి మనుషులు పారిపోతారు నేను ఎక్కడ
(1:26:04) మీద పడతాను అని మరి నాకంటే మనిషి ఎలా గొప్పవాడు అవుతాడు అని సింహం అంటుంది పులి అంటుంది ఆ తర్వాత గాడిదేమో నేను చేసినంత చాకిరి మనిషి చేయగలడా నేను ఎన్ని మూటలు మోస్తాను ఎంత బరువులు మోస్తాను నాకంటే మనిషి గొప్పవాడు కాదు కదా అంటుంది కోతి ఏమంటుందంటే నేను చెట్లు అటు ఇటు అటు ఇటు ఎగురుతూ ఉంటాను మనిషి ఎగరగలడా అని కోతి అంటుంది ఆ తర్వాత నక్కేమో నాకున్న తెలివితేటట్లు మనిషికి లేవు కాబట్టి మనిషి మాకంటే ఎలా గొప్పవాడు మీరు ఒప్పుకోవాలి స్వామి అని ఆ మహర్షితో అంటాయట అప్పుడు ఆ మహర్షి ఏం చెప్తాడంటే నిజమే మనిషి కంటే జంతువులన్నీ కూడా చాలా గొప్పవే
(1:26:37) కానీ ఒక్క విషయంలో మాత్రం మనిషే జంతువుల కంటే గొప్పవాడు అని చెప్తాడు ఏంటి ఆ విషయం అంటే మీరందరూ కూడా మీకు దేవుడు స్వయంగా ఇచ్చినటువంటి బుద్ధిని మార్చుకోలేరు కానీ ఒక్క మనిషి మాత్రమే తాను తలుచుకుంటే సాధన ద్వారా తనకున్న బుద్ధిని మార్చుకోగలడు అందుకే మీకందరికంటే కూడా మనిషి గొప్పవాడని ఆ తపస్సు చేసుకునే సాధువు చెప్తే జంతువులన్నీ నిజమే మేమైతే మా బుద్ధి మార్చుకోలేము మనిషి మార్చుకోగలడు అని ఒప్పుకొని వెళ్ళిపోయినాయట కాబట్టి బుద్ధిని మార్చుకోగలిగిన శక్తి ఒక్క మనిషికే ఉంటుంది.
(1:27:10) అలా బుద్ధిని మార్చుకోగలిగినప్పుడే అహంకారం అనేది తగ్గుతుంది. అహంకారం ఎందుకు పోగొట్టుకోవాలి అసలు ఆత్మ జ్ఞానం సోల్లు తో కనెక్ట్ అవ్వాలంటే ముందు అహంకారం పోవాలి. అహంకారం పోవాలి ఏ ఫీలింగ లేకుండా ఉండాలి అప్పుడే సోల్తో కనెక్ట్ అవుతాం ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు చేతిలో మురళి పట్టుకొని ఉంటాడుగా అవును ఒకసారి రుక్మిణి దేవికి అనుమానం వస్తుంటా ఇదేంటి నా స్వామికి అందరికంటే మురళి అంత ఇష్టమా 24 గంటలు మురళి చేతిలో పట్టుకొని ఉంటాడు ఏంటి దానిలో ఉన్న గొప్పతనం మురళి నాకంటే గొప్పదా అని రుక్మిణి దేవికి అనుమానం వస్తుందట ఓకే ఇది శ్రీకృష్ణుడు గమనిస్తాడు సరే అని
(1:27:45) చెప్పి నిద్రపోతున్నట్టు నటిస్తాడు అప్పుడు రుక్మిణి దేవి ఆ మురళి దగ్గరికి వచ్చి వచ్చి స్వామి చేతిలో ఉన్న మురళి తీసుకొని దానికి ప్రాణ ప్రతిష్ట చేస్తుంది. ప్రాణ ప్రతిష్ట చేయడం అంటే దానికి మాట్లాడే శక్తి రావటం ఇప్పుడు మురళిని అడుగుతుంది నువ్వు ఏ ఏ తీర్థయాత్రలు చేశవ్ ఏ ఏ పుణ్యక్షేత్రాలు సందర్శించావ్ స్వామి నామాన్ని ఎన్ని సార్లు ఎన్ని లక్షల సార్లు చెపించావ్ ఎందుకు స్వామి ఎప్పుడు నిన్ను పట్టుకొని ఉంటాడు అంటే ప్రాణ ప్రతిష్ట జరిగిన మొరలు ఏం చెప్తుందంటే ప్రాణ ప్రతిష్ట అంటే మాటలు వస్తాయి.
(1:28:13) నేను ఏం చేశానో నాకు తెలీదు స్వామి నన్ను ఎందుకు ధరిస్తాడో నాకు తెలియదు నేను ఏ పుణ్యాలు చేయలేదు అంటుంది కాదు నువ్వు చెప్పడం లేదు నువ్వు చెప్పు అని రుక్మిణి దేవి రెండు మూడు సార్లు అడిగితే అప్పుడు ఆ మురళి బాగా ఆలోచించి అమ్మ ఒక్కసారి నన్ను గమనించండి జాగ్రత్తగా నన్ను గమనిస్తే స్వామి నన్ను ఎందుకు ధరించాడో మీకే తెలుస్తుంది అంటుంది. అప్పుడు రుక్మిణి దేవి మురళిని ఒక్కసారి నిశ్చితంగా పరిశీలిస్తుంది స్వామి వారి చేతిలో ఉన్న మురళి ఏముంటుంది దానిలో ఏమి ఉండదు లోపలంతా డొల్ల ఖాళీగా ఉంటుంది అంటే ఏదైతే ఏమి ఉండదో అదే భగవంతుడికి ఇష్టం ఓకే అందుకే మురళ అంటే ఇష్టము ఏమి ఉండకపోవడం
(1:28:49) అంటే అహంకారం ఉండకూడదు మమకారం ఉండకూడదు రాగద్వేషాలు ఉండకూడదు నేను నాది అనే భావం ఉండకూడదు సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం అందరిలో ఉన్న భగవంతుని ఒకేలా లా చూడగలిగే స్థితి వచ్చినప్పుడు అప్పుడు మనిషి దైవానికి దగ్గర అవుతాడు ఆత్మతో రిలేట్ అవుతాడు. అంతేగా త్వమేవాహం త్వమేవాహం ఇప్పుడు మీరు నేను ఒకటే అన్న భావనలో నేను ఉండలేనుగా కానీ ఆ స్థితికి రావాలి అందరూ ఒకటే అందరిలో దేవుడు ఉన్నాడు నాలో ఉన్న దేవుడే ఆత్మ అని తెలుసుకోవాలి అలాంటి వాళ్ళనే దేవుడు తొందరగా అనుగ్రహిస్తాడు ఆ స్థితికి వచ్చినప్పుడు ఆత్మ సాక్షాత్కారం వైపు కూడా
(1:29:23) తొందరగా అడుగులు వేయొచ్చు కాబట్టి ఆ అహంకారాన్ని మనం నియంత్రణ చేసుకోలేదు అనుకోండి అహంకారం నుంచి కోపంగా మారుతుంది ఆ కోపంతో ఏదైనా సాధించాలనే తృష్ణ బయలుదేరుతుంది ఆ తృష్ణ వచ్చిందనుకోండి ఆ కోరిక తీరే వరకు కూడా ఆ తృష్ణ అలానే ఉంటుంది ఒక కోరిక తీరితే ఆగిపోతుందా ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక ఇంకో కోరిక తర్వాత ఇంకో కోరిక కోరికలు ఇన్ఫినిటీ కదా కోరిక తీరకపోతే కోపం వస్తుంది.
(1:29:47) కోరిక తీరకపోతే కోపం కోరిక తీరితే ఇంకో కోరిక తీరలేదని దుఃఖం అవును అంటే తీరినా తీరకపోయినా సమస్యే తీరకపోతే కోపం తీరితే ఇంకో కోరిక తీరలేదని దుఃఖం కాబట్టి కోపము దుఃఖము ఉండకూడదు రాగము ద్వేషము ఉండకూడదు కోరికలు అనేవి అధీనంలో ఉంచుకునే స్థితికి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే అహంకారం కంట్రోల్ లో ఉండాలి బట్ అంటే ఎక్కువమందిలో మనం చూస్తుంటాము అంటే జీవితం చాలా విలువైంది అని చెప్పుకుంటారు సో అందుకే జీవితంలో కష్టపడతారు ఎదుగుతారు ఒక స్టేజ్ కి వస్తారు డబ్బు మిగిలించుకుంటారు కానీ ఎప్పుడైతే ఒక మనిషి జీవితం ఎండ్ అయిందో ఈ కష్టపడి సంపాదించింది ఏది కూడా అతను వెంట
(1:30:22) రాదు కదా మరి ఈ జీవితానికి అసలైన అర్థం ఏంటంటారు జీవితానికి అసలైన అర్థం ఏంటంటే హూ యమ్ ఐ నేను ఎవరిని అని తెలుసుకోవడం అది ఏంటంటే మనం ఒక్కసారి సుధీర్ గారు మీరు జాగ్రత్తగా గమనించండి ఒక పసిపిల్లవాడు ఉన్నాడుఅనుకోండి అమ్మలోనే ఆనందాన్ని వెతుక్కుంటాడు అంతేగా అమ్మ చంకలో పట్టుకుంటే అమ్మ దగ్గర నుంచి తీసుకోగానే కేర్ కేర్ మని ఏడుస్తూ ఉంటాడు అంటే ఒక పసిపిల్లవాడికి ఆనందం ఎక్కడుంది అమ్మలో ఉంది.
(1:30:48) ఇంకొంచెం పసిపిల్లవాడు పెరుగుతాడు పెరిగి పెద్దవాడు అయ్యాక అమ్మ కాదు నాకు బొమ్మ కావాలంటాడు అంతేగా ఒక బొమ్మలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు నాకు బొమ్మలు తెచ్చి పెట్టండి అంటాడు ఆ బొమ్మల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు ఇంకొంచెం పెద్దవాడు అయిన తర్వాత అమ్మ బొమ్మ కాదు అమ్మాయి కావాలంటాడు అంతేగా అంటే సహజంగా చెప్పాలంటే టీనేజ్ వచ్చేసరికి మామూలుగా ఆకర్షణ అనేది లోనవుతాడు ఆకర్షణకు లోనే ఏమైపోతాడు మీరు చూడండి కాలేజీ రోజుల్లో ఎవరైనా సరే ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను అంటారు ఆ అబ్బాయి లేకపోతే నేను చచ్చిపోతాను అంటారు అంత తీవ్రమైన ఆకర్షణలోకి వెళ్ళిపోతారు
(1:31:21) అంతేగా ఇక అందులోనే సర్వస్వం అనుకుంటారు కానీ వివాహం అయిన తర్వాత అంత ఆకర్షణ ఉంటుందా నిజానికి వాళ్ళు వివాహం చేసుకుంటే నాలుగుైదు సంవత్సరాల తర్వాత ఏమేమి ఉండదు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు అందుకే శంకరాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు భజగోవిందంలో నారీ స్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం అని చెప్పారు అంటే స్త్రీ సౌందర్యాన్ని చూస్తే మనకు వ్యామోహం కలుగుతుంది.
(1:31:48) స్త్రీ సౌందర్యం వెనక ఉన్నటువంటి యదార్థాన్ని చూస్తే ఆ వ్యామోహం ఉండదు. కాబట్టి పదార్థాన్ని చూడటం కాదు యదార్థాన్ని చూడాలి. అంటే వాస్తవాన్ని చూడాలి వాస్తవంగా వెనక ఏముంటుంది మాంసం ముద్ద కానీ బయటికి ఆకర్షణలకు లోనవుతాం ఇప్పుడు సుధీర్ గారు ఇప్పుడు ఈ ఉంగరం ఉందండి మామూలుగా ఈ ఉంగరాన్ని మనం చూసామ అనుకోండి గోల్డ్ ఉంగరం పెట్టుకున్నారు బంగారపు ఉంగరం బ్రహ్మాండంగా ఉందనుకుంటాం.
(1:32:11) అంటే ఉంగరం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఈ ఉంగరానికి మూలమైనటువంటి బంగారం ముద్ద చూసామ అనుకోండి దాని మీద పెద్ద ఆకర్షణ ఉండదు ఎప్పుడైతే బంగారం ఉంగరంగా మారిపోయిందో అప్పుడే ఆకర్షణ వస్తుంది అంటే బంగారం రేట్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఆకర్షణ ఉండదు కదా అంటే ఎప్పుడైతే ఒక పదార్థానికి నామము రూపము వస్తున్నాయో పేరు షేపు వస్తున్నాయో అప్పుడు దాని మీద ఆసక్తి అనేది పెరుగుతుంది.
(1:32:38) అందుకే నామరూపాలు తీసేసి చూడాలి అంటారు అంతేగా ఏ వస్తువైనా నామరూపాలు తీసేసి చూస్తే మొత్తం భగవంతుడే ఉన్నాడు అన్న సత్యం తెలుస్తుంది అప్పుడే మనకి ఏ వ్యక్తికైనా సేవ చేస్తాం అందులోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాం సరే ఆ తర్వాత ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చాక ఆనందం ఉంటుందా ఉండదు మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉండదు తర్వాత ఇల్లు కట్టుకుంటాం ఆనందం ఉండదు అంటే ఏది పొందితే మనకి శాశ్వతమైన పరిపూర్ణమైన ఆనందం కలుగుతుంది అంటే ఏది పొందినా కలగదు నామరూపాలతో ఉన్న వస్తువులు గాని గన వ్యక్తులు గాన ఏవి కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు అందుకే ఎలా ఉండాలి భజగోవిందంలో శంకరాచార్యుల వారు చెప్తారు
(1:33:16) నలినీ దళగత జలమతి తరళం తద్వజీవిత మతిసేయ చపలం విద్దివ్యాద్యభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేసారు తామరాకు మీద నీటి బొట్టులా ఉండయ్యా మీకు ఎందులో సాటిస్ఫాక్షన్ ఉండదు అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ డిటాచ్మెంట్ విత్ అటాచ్మెంట్ ఎందుకంటే విద్య వ్యాద్యభిమానగ్రస్తం ఇగో అనారోగ రోగ్యాలు మమకారాలు లోకం శోకహతంచ సమస్తం మొత్తం బాధేనయ్యా ఆనందం ఏం లేదని మన జగద్గురువులు క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు అందుకే నీకు సృష్టిలో కనిపించే ఏ వస్తువులో గాని ఏ వ్యక్తిలో గాని శాశ్వతమైన పరిపూర్ణమైన ఆనందం ఉండదు ఎటర్నల్ హ్యాపీనెస్ ఉండదు ఆ ఎటర్నల్
(1:33:54) హ్యాపీనెస్ రావాలంటే సోల్ తో కనెక్ట్ అవ్వాలి శరీర భావన విడిచిపెట్టాలి ధ్యానం ద్వారా ఆత్మతో రిలేట్ అవ్వాలి అలా రిలేట్ అయినప్పుడు మనక ఏమ వస్తుంది పర్మనెంట్ హ్యాపీనెస్ వస్తుంది ఆ పర్మనెంట్ హ్యాపీనెస్ పేరు ఏంటో తెలుసా సచ్చిదానందం మీరు వినే ఉంటారు కదా చాలా చోట్ల సచ్చిదానందం సచ్చిదానందం సచ్చిదానందం అంటారు ఆ సచ్చిదానందం కోసం ప్రయత్నం చేయండి అంటారు ఓకే ఆనందం సచ్చిదా ఆ ఇప్పుడు బ్రహ్మాండంగా మీరు లైన్ లోకి వచ్చారు సచ్చిదానందం అంటే ఏంటి జాగ్రత్తగా గమనించండి సత్ చిత్ ఆనందం ఈ మూడు కలిపితే వచ్చేదాన్ని సచ్చిదానందము అంటారు. సత్
(1:34:31) అంటే ఏంటి సత్ అంటే ఏంటంటే కాలత్రయే అపితిష్టతి ఇతి సత్ అన్నారు అంటే మూడు కాలాల్లో ఏది ఉంటుందో అది సత్యం ఓకే మూడు కాలాలు అంటే మీరు ఏమనుకుంటున్నారు భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం అనుకుంటున్నారు కానీ వేదాంతంలో అది కాదు ఓకే జాగ్రత్త అవస్థ ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా మనం మేలుకొన్నప్పుడు స్వప్నావస్థ మనం నిద్రించేటప్పుడు ఇంకోటి సుషుప్తి మనం గాఢ నిద్ర డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు అవునా మనం మనం మేలుకొని ఉన్నప్పుడు మాట్లాడుతున్నాం అంటే ఎవరు మాట్లాడిస్తున్నారు ఆత్మ అవును మనం నిద్రపోతున్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్న అన్ని పని చేస్తున్నాయి అంటే
(1:35:08) కారణం ఎవరు ఆత్మ మనం డీప్ స్లీప్ లోకి వెళ్లి అన్ని మర్చిపోయి పడుకున్నప్పుడు కూడా మనల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆత్మ అంటే మేలుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ మూడు కాలాల్లో ఏముంది ఆత్మ అది సత్యము అది ట్రూత్ అందుకే సత్ అన్నారు ఆత్మ సత్ అది ట్రూత్ చిత్ చిత్ అంటే చైతన్యం ఎనర్జీ ఆత్మకు ఎనర్జీ ఉండబట్టేగా ఇవన్నీ చేస్తున్నాం అవును ఆత్మకు ఎనర్జీ ఉంది కాబట్టే కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి నోరు మాట్లాడుతుంది ఇంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము వీటి వెనక ఎవరు ఉంటారు మనస్సు బుద్ధి వీటి వెనక ఎవరు ఉంటారు ఆత్మ ఈ ఆత్మ
(1:35:50) సిగ్నల్ ఇస్తే మనసు బుద్ధి వర్క్ అవుతాయి ఇవి వర్క్ అయితే కన్ను ముక్కు చెవి నాలుక చర్మం వర్క్ అవుతాయి ఇది లూప్ అన్నమాట కాబట్టి ఈ కన్ను ముక్కు ముక్కు చెవి నాలుక చర్మము వెనక మనసు బుద్ధి ఈ వెనకున్న ఆత్మ ఈ ఆత్మకు చైతన్యం ఎనర్జీ ఉంటుందిగా అందుకే ఇవన్నీ పనిచేస్తున్నాయి ఆ ఎనర్జీ చిత్ చైతన్యం సత్తు చిత్ ఆత్మ అనేది ట్రూత్ చిత్ దానికి ఒక ఎనర్జీ ఉంది ఆ విషయం మనం తెలుసుకుంటే ఆనందం చైతన్యం సచ్చిదానందం అంటే నువ్వు ఆత్మ గురించి దాని ఎనర్జీ గురించి తెలుసుకొని దానితో రిలేట్ అయితే నీకు వచ్చే ఆ ఎటర్నల్ పర్మనెంట్ హ్యాపీనెస్ సచ్చిదానందం
(1:36:30) దాన్ని పొందినప్పుడు నువ్వు సోల్ తో రిలేట్ అయినప్పుడే పర్మనెంట్ హ్యాపీనెస్ వస్తుంది. అంతేగాని ఈ సృష్టిలో ఉన్న ఏ వస్తువులో ఏ వ్యక్తిలో నీకు పర్మనెంట్ హ్యాపీనెస్ ఉండనే ఉండదు దాన్ని పొందమని చెప్పారు. దాన్ని పొందటంలో ఆశ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఆశకు సంబంధించిన ఒక అద్భుతమైన కథ చెప్పి ఫైనల్ కంక్లూజన్ చెప్తాను చెప్పండి ఈ ఆశ ఎలా ఉంటుందంటే సాక్షాత్తు దేవుడే దిగివచ్చినా కూడా మనిషి ఆశను విడిచిపెట్టలేట మళ్ళీ ఇంకోసారి అంత భయంకరంగా ఆశ ఉంటుంది ఎందుకంటే ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్తాడు వెళ్ళే ముందు ఒక గ్రామం నుంచి వెళ్తాడు
(1:37:03) ఓకే ఆ గ్రామంలో అందరూ ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి గురించి ధ్యానం చేస్తూ ఉన్నారు 24 గంటలు విష్ణు నామస్మరణ నారద మహర్షికి చాలా ఆనందం వేసింది వైకుంఠానికి వెళ్లి స్వామి భూలోకంలో ఒక గ్రామం చూసాను అబ్బా ఏమి భక్తి స్వామి అందరూ 24 గంటలు ఎల్లవేళల విష్ణు నామ స్మరణ చేస్తున్నారు నువ్వు వాళ్ళకి తప్పకుండా దర్శనం ఇవ్వాలి స్వామి అంటాడు.
(1:37:22) అప్పుడు విష్ణుమూర్తి ఏమంటాడంటే నాయనా నారదా ఎంత భక్తి ఉన్నా వాళ్ళు మనుషులు ఆశకు లోబడి ఉంటారు వాళ్ళకి నిజమైన భక్తి ఉండదు అని చెప్తాడు కానీ విష్ణుమూర్తి ఎంత చెప్పినా సరే నారదుడు నేను చూశను స్వామి నీ యందు అపారమైన భక్తి 24 గంటలు నీ గురించే పూజిస్తున్నారు నువ్వు ఒక్కసారి తప్పకుండా దర్శనం ఇవ్వు అంటే సరే నేను ఇస్తాను అయితే వాళ్ళని ఒక ప్రత్యేకమైనటువంటి ఏకాదశి తిధి రోజు నేను దర్శనం ఇస్తాను అని చెప్పు అని చెప్తాడు.
(1:37:49) అంటే ఆ గ్రామం వాళ్ళు కూడా నారద మహర్షికి ఆదిత్యం ఇచ్చి ఎలాగైనా సరే ఒక్కసారి విష్ణుమూర్తి దర్శనం కల్పించండి అని ప్రాదేయ పడతారు. ఆ గ్రామం నుంచి వెళ్ళేటప్పుడు అందరూ అడుగుతారు సరే విష్ణు భక్తులు 24 గంటలు పూజ చేస్తున్నారు నారద మహర్షిని కూడా ప్రార్థించారు విష్ణు దర్శనం కావాలని సరే అని చెప్పి విష్ణుమూర్తిని ఒప్పిస్తాడు అప్పుడు విష్ణుమూర్తి ఒక కండిషన్ పెడతాడు.
(1:38:08) ఆ కండిషన్ ఏంటంటే ఆ గ్రామానికి 5ు కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపు ఒక కొండ ఉంటుంది. ఓకే ఆ కొండ దగ్గర నేను ఫలానా ఏకాదశి రోజు ఉదయం పూట ఉంటాను గ్రామస్తులందరినీ వచ్చి నన్ను దర్శనం చేసుకోమని చెప్పు నారద అంటాడు. సరే అని చెప్పి నారద మహర్షి ఆనందంతో ఆ గ్రామానికి వెళ్లి ఫలానా ఏకాదశి రోజు ఉదయం పూట విష్ణుమూర్తి దర్శనం మీ ఊరికి 5ు కిలోమీటర్ల దూరంలో తూర్పు వైపు కొండ దగ్గర ఉంటాడు పదండి అంటాడు.
(1:38:35) సరే ఆ రోజు వచ్చింది అందరూ బయలుదేరారు గ్రామంలో వాళ్ళు ఒక కిలోమీటర్ దాటగానే విష్ణుమూర్తి మాయ వల్ల అక్కడ అన్నీ కూడా కొన్ని రాగి నాణాలు చిల్లర నాణాలు పడేసి ఉంటాయి. చిన్న పిల్లలు వృద్ధులు అందరూ కూడా ఇక్కడ ఎవరో రాగి నాణాలు చిల్లర నాణాలు పడేసుకున్నారు అని చెప్పి అవి వేరుకుంటూ ఆగిపోతారు. నారద మహర్షి ఎంత చెప్పినా వినరు.
(1:38:56) ఆ తర్వాత ఇంకో కిలోమీటర్ దాటిన తర్వాత వెండి నాణాలు ఉంటాయి. అప్పుడు మిగిలిన వాళ్ళలో ఉంటారు కదా ఆ మిగిలిన వాళ్ళలో చాలామంది యువకులు ఉంటారు అబ్బో వెండి నాణాలు అంటే ఖరీదు ఎక్కువ కదా మన జీవితం బాగుంటుంది కదా ఇవి ఏరుకుందాం దేవుడు అక్కడే ఉన్నాడుగా తర్వాత వెళ్లచ్చులే అని వెండి నాణాలు ఏరుకుంటూ ఆగిపోతారు నారద మహర్షి చెప్తున్నాడు విష్ణుమూర్తి అక్కడ ఎదురు చూస్తున్నాడు రండిఅని అయినా సరే వాళ్ళు వెండి నాణాలు ఏరుకుంటూ ఉంటారు.
(1:39:19) ఇక మిగిలిన వాళ్ళు వెళ్తూ ఉంటే మూడో కిలోమీటర్ దగ్గర బంగారపు నాణాలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. హమ్ అప్పుడు ఇంకా చాలా మందికి మాయ కమ్మేస్తుంది. విష్ణుమూర్తిని తర్వాత అయినా దర్శించుకోవచ్చు ముందు ఆ బంగార నాణాలు తీసుకుందాం అని ఆ బంగారం తీసుకోవడం మొదలు పెడతారు. చాలా తక్కువ మంది మాత్రమే నిజమైన భక్తులు విష్ణు భక్తులు వాళ్ళు వెళ్తూ ఉంటే నాలుగో కిలోమీటర్ దగ్గర వజ్రాల రాశి కనిపిస్తుంది.
(1:39:42) ఇదంతా విష్ణు మాయ. ఇక వజ్రాలు చూసేసరికి జీవితం అద్భుతంగా మారిపోతుంది కదా ఎంత విష్ణు భక్తు ఉన్నా సరే అదంతా కూడా మరుగున పడిపోతుంది. అందరూ అక్కడ వజ్రాల దగ్గర వజ్రాలు ఏరుకుంటూ ఉండిపోతారు నారద మహర్షి ఎంత చెప్పినా రారు ఒకే ఒక్క భక్తుడు మాత్రం స్వామికి ఆలస్యం అవుతుందేమో పదండి నారదా అని ఐదో కిలోమీటర్ దగ్గర ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి విష్ణుమూర్తిని దర్శించుకుంటే ఆ భక్తుడికి విష్ణుమూర్తి మోక్షం ఇచ్చాడని పరమార్థ కథల్లో చెప్తారు.
(1:40:08) అంటే వీళ్ళందరూ కూడా ఆశ వల్ల ఆగిపోయారు స్టెప్ బై స్టెప్ అంటే ఆశ లెవెల్స్ అన్నమాట కొంతమంది ఏందంటే స్టార్టింగ్ లోనే బలహీన పడిపోయారు. కొంతమంది చాలా గొప్ప భక్తులు కంట్రోల్ చేసుకున్నారు కానీ వజ్రాలు చూసేసరికి కంట్రోల్ తప్పిపోయారు ఒకే ఒక్కడు మాత్రమే ఫైనల్ గా భగవంతుని చేరుకున్నారు ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే హూయామై అని తెలుసుకునే ప్రాసెస్ లో నేను శరీరాన్ని కాదు ఇంద్రియాలు కాదు మనసు కాదు బుద్ధి కాదు నేను ఆత్మని ఆ సోల్తో రిలేట్ అవ్వాలంటే ఇలా సాధన చతుష్టయం కానివ్వండి గురువుని ఆశ్రయించి క్రమ శిక్షణతో వెళ్ళడం కానివ్వండి ఈ బ్రీత్ కంట్రోల్ చేసుకోవడం
(1:40:42) కానివ్వండి ఈ ప్రాసెస్ లో వెళ్తున్నప్పుడు అనేక మీకు అవరోధాలు వస్తాయి మైండ్ డవియేట్ అయిపోతుంది ఫ్లక్చుయేట్ అయిపోతుంది మనసు ఫ్లక్చుయేట్ అయిపోతుంది కానీ వాటన్నిటిని దాటుకుంటూ ఎవరైతే నిజంగా ఆ భావన పొందుతాడో అలాంటి వ్యక్తి మాత్రమే ఆ ఎటర్నల్ హ్యాపీనెస్ పర్మనెంట్ హ్యాపీనెస్ పొందుతాడు అసలు ఆ పాత్లో ట్రావెల్ చేయడం ప్రారంభించిన తర్వాతే అప్పుడప్పుడు మీరు అది టచ్ అవుతున్నప్పుడు కూడా చాలా ఎక్సలెంట్ హ్యాపీనెస్ ఎందుకంటే అది ఇంకా దాన్ని మించిన ఆనందం ఉండదు కదా ఎప్పటికీ తరిగిపోని ఆ శాశ్వతమైన పరిపూర్ణమైన ఆనందం పొందాలంటే ఒక సద్గురువుని ఆశ్రయించి గురువు చెప్పిన
(1:41:17) మార్గంలో వెళ్లొచ్చు సాధనా చతుష్టయాన్ని పాటించొచ్చు ఆ ఇంద్రియ నిగ్రహం రావాలి అన్నిటికంటే ముఖ్యం ఏంటి అహంకారం మమకారం నేను నాది నేను నాది ఉండొచ్చు తప్పులేదు ఇది నాది అని ఉండొచ్చు నేను చేయగలనని ఉండొచ్చు కానీ పూర్తిగా అహంకారం మమకారం నేనే గ్రేట్ ఇది నాది ఇది మొత్తం నాకే కావాలి ఆ ఫీలింగ్ నుంచి బయటికి రావాలి. ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండాలి క్రమంగా సాధనలో ముందుకు వెళ్తూ ఉండాలి అలా వెళితే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆ మార్గాన్ని చేరుకునే దగ్గరకు వెళ్తారు పూర్తిగా చేరుకోకపోయినా ఆ మార్గం వరకు వెళ్తారు మనకి శాస్త్రాలు ఏం చెప్పినాయి
(1:41:56) అంటే ఈ జన్మలో మనం ఎక్కడి వరకైతే మన ధ్యానం గాన మన పూజ గాన మనం చేసేటటువంటి ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం చేసే ప్రయత్నం గాన ఎక్కడి వరకు చేసి ఆగిపోతుందో అంటే మనం చాలా ప్రయత్నం చేస్తాము వయసు అయిపోతుంది శరీరాన్ని విడిచిపెడతాం కదా విడిచిపెడితే మళ్ళీ తర్వాత జన్మలో అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఇది మనకు శాస్త్రాల్లోనే చెప్పారు మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సిన పని లేదు కాబట్టి మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి.
(1:42:23) మీ ఎదురుగా మీ ఇంట్లో ఉన్న శివలింగంలోనే కాకుండా సృష్టి అంతా ఉన్నటువంటి శివుణని మీలో ఉన్న శివుణని దర్శించే స్థితికి ఎదిగే ప్రయత్నం చేయండి. ఆ మార్గంలో ట్రావెల్ అవ్వండి మెడిటేషన్ చేయండి. వాయువుని కంట్రోల్ లో పెట్టండి బ్రీత్ కంట్రోల్ లో పెట్టుకోండి ఇంద్రియాలను నిగ్రహించుకోండి ఆ ప్రాసెస్ లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఎప్పటికైనా శరీరం విడిచిపెడతాంగా విడిచిపెట్టిన తర్వాత పునరపి జననం పునరపి మరణం పునరపి జనననే జటరేసేనం మళ్ళీ నెక్స్ట్ జన్మ వస్తుంది కదా ఆ నెక్స్ట్ జన్మలో చిన్న వయసు నుంచే దీనికి స్టార్టింగ్ మొదలవుతుంది.
(1:42:53) అలా పరిపక్వత వస్తుంది. అలా ఎన్నో జన్మలు చేసిన తర్వాతే కదా ఒక రమణ మహర్షి లేకపోతే ఇంకో గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చింది అంటే వాళ్ళకి అది ఆఖరి జన్మ కాబట్టి మనం ఆ ఆఖరి జన్మ ఎప్పుడు వస్తే అప్పుడు కచ్చితంగా ఆత్మ సాక్షాత్కారం పొందుతాం మోక్షం పొందుతాం తరింపబడతాం అదే మానవ జీవన పరమార్థం ద ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ రిలేటింగ్ విత్ సోల్ ఎక్లీ బట్ థాంక్యూ స్వామి చాలా విషయాలు క్లియర్ గా చెప్పినందుకు సర్వేజనః సుఖినో భవంతు స్వస్తి అహం బ్రహ్మాస్మి అయం ఆత్మ బ్రహ్మ సోహం తత్వమసి సర్వేజనః సుఖినో భవంతు.
No comments:
Post a Comment