_*తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం:153*
🕉️🛕🕉️🛕🕉️🛕🕉️🛕🕉️
_****. *వేదములు ఎన్ని ? పంచమ వేదమేది ?*
వేదములు నాలుగు అవి:
1. ఋగ్వేదం
2. యజుర్వేదం
3. సామవేదం
4. అధర్వణ వేదం. వ్యాసరచితమైన మహాభారతం పంచమ వేదంగా ప్రసిద్ధి పొందింది.
_****. *షోడశ మహాదానములు ఏవి ?*
అట్టి
1. గోవు
2. భూమి
3. తిలలు
4. హిరణ్యం
5. రత్నం
6. విద్య
7. కన్య
8. దాసి
9. శయ్య
10. గృహం
11. అగ్రహారం
12. రథం
13. గజం
14. అశ్వం
15. మేక
16. మహిషం.
వీటిదానాలే షోడశమహాదానాలు.
_**** *ఉపదేశము గురువు మాత్రమే చెయ్యాలా? తండ్రి చెయ్యకూడదా?*
గురువు శిష్యునికి ఉపదేశం చేయడం సంప్రదాయసిద్ధం.
శాస్త్ర చికిత్సలో నిపుణుడైన ఒక వైద్యుడు తన కుమారుడికి మరొక వైద్యునిచే చికిత్సచేయించడం కద్దు. అట్లే ఉపదేశ నిపుణుడైన ఒకతండ్రి తన కుమారుడికి మరొక గురు వుచే ఉపదేశం చేయించడం జరుగుతుంది. అంతేకాని తండ్రి కుమారుడికి ఉపదేశం చేయకూడదన్న నిషేధం లేదు. అలా చేసినవారు ఉన్నారు.
_*꧁ॐ┈┉━❀꧁ॐ꧂❀━┅┈ॐ꧂*_
_*సర్వేజనా సుఖినోభవంతు-శుభమస్తు.*_
*ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment