Maitreya Samadhi Dhyanam Telugu
Author Name:swami maitreya
Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FCUUsm0TkEc
Transcript:
(00:03) కృతజ్ఞతాపూర్వకంగా అంకిత భావంతో ఆత్మ సమర్పణ భావంతో ఆ విశ్వాత్మను ఆ పరమాత్మను ఈ విధంగా ప్రార్థించండి. ఈశ్వరుడు స్వర్గంలో ఉన్న నా తండ్రి అల్లాహ్ బుద్ధ భగవానుడు సచ్చిదానందుడు వారి దీవెనలను నా మీద కురిపింతురు గాక అజ్ఞానము రాగము మరియు ద్వేషముల నుండి నా శరీరము మనసు శుద్ధి చేయబడుగాక నా శరీరము మనసు ఆరోగ్యంతో సంతోషంతో సమతుల్యంతో
(00:47) శాంతితో శక్తితో మరియు సమృద్ధితో వర్ధిల్లుగాక నా కర్మేంద్రియాలు మరియు జ్ఞానేంద్రియాలు దైవత్వంతో సమభావనతో మరియు ప్రశాంతతో నిండుగాక జీవితంలో నేను చేసే ప్రతి పనిలోనూ నేను జాగరూకతతో చైతన్యంతో ఉందును గాక జీవితంలోని ప్రతి క్షణాన్ని ప్రసాదంగా మహా ప్రసాదంగా స్వీకరిస్తాను. ఏమీ ఆశించను నా జీవిత లక్ష్యం నా మనసును సంస్కారములను వాసనలను శుద్ధి చేసుకోవటమే
(01:36) నాలోని మాయ తొలగింపబడి నా అంతరాత్మ పరిశుద్ధమవుగాక నేను స్వేచ్ఛను విముక్తిని నిర్వాణాన్ని మోక్షాన్ని మరియు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుదును గాక నేను విశ్వ చైతన్యం యొక్క చైతన్యంతో పరిపూర్ణత్వంతో ఏకమవుదును గాక మైత్రేయ సమాధి స్థిరంగా సుఖంగా ఏదో ఒక ఆసనంలో కూర్చోండి వెన్నెముక క
(02:24) బిగింపు లేకుండా నిటారుగా ఉంచండి. శరీరాన్ని వదులుగా విశ్రాంతిగా ఉంచండి. మణికట్టు అరచేయి చేతి వేళ్ళు తొడలపై ఉంచండి. మీ చేతుల్ని ఏదో ఒక హస్త ముద్రలో గాని ప్రాణవాయు ముద్రలో కానీ పెట్టండి. కళ్ళని నెమ్మదిగా సుతారంగా మూసుకోండి. కనుపాపలు
(03:12) వదులుగా తేలికగా వదిలేయండి. కళ్ళ గుడ్లని విశ్రాంతిగా గాలిలో తేలుతున్నట్లుగా వదిలేయండి. శరీరం లోపల ఉన్న భాగాలను శరీరం బయట ఉన్న భాగాలను రిలాక్స్ చేయండి. నేను వేరు శరీరం వేరు అన్న భావంతో మీ శరీరాన్ని మీరు ఒక సాక్షి లాగా గమనించండి. శరీరాన్ని చూస్తున్న సాక్షివి నీవే
(04:02) శరీర భాగాలన్నింటిని గమనిస్తున్న గమనిక కూడా నీవే నీ శరీరంలో పంచతన్మాత్రాలు చూస్తున్న ద్రష్టవి కూడా నీవే పూర్తిగా జాగరూకతతో చైతన్యంతో ఉండండి. అసలు ఆ చైతన్యమే నీవు నీవు శరీరం కాదు మనసు కూడా కాదు అజ్ఞానం వల్లనే ఈ శరీరం నేను మనసు నేను అని భ్రమపడుతున్నావు.
(04:53) నీవఒక స్వచ్ఛమైన చేతన ఒక ద్రష్ట మాత్రమే నీ లోపట భూమి తత్వాన్ని మెల్లగా గమనించుతూ ఉండు ఈ చైతన్యం పదార్థంతో కలిసి ఉన్నది కాదు చైతన్యం వేరు పదార్థం వేరు శరీరంలోని అవయవాలు వ్యవస్థలు కండరాలు
(05:40) కణజాలాలు కణాలు వాటన్నింటిని గమనిస్తున్న ద్రష్టల ల వేరుగా ఉండండి. శరీరం వేరు దానికి సాక్షిగా ఉన్న చైతన్యం కూడా వేరు. ఎప్పుడైతే వాటిని గమనించడం మొదలు పెడతావో నీ శరీర భాగాలన్నీ కూడా విశ్రాంతిలోకి జారుకుంటాయి. అదే ప్రాసెస్ ని కంటిన్యూ చేయండి. సంపూర్ణమైన చైతన్యంతో
(06:28) సాక్షిగా ఉండు నీ శరీరంలోని పదార్థాలు మొత్తం విశ్రాంతిలోకి జారుకుంటున్నాయి. భూమి తత్వం ఈ ప్రకృతిలో కలిసి మెలిసి మైత్రి భావనతో ఉంటుంది. ఇప్పుడు మెల్లగా నీలోని ఉదక తత్వాన్ని గమనించు ఒక సాక్షి భావంతో ఉండు నీలోని జలతత్వం ప్రకృతిలోని జలతత్వంతో
(07:14) అనుసంధానమై మైత్రితో ఉండటం మొదలు పెడుతుంది. నీలో ఉన్న అగ్ని తత్వాన్ని గమనించు అదే నీలోని శక్తి ఈ శక్తి వేరు నేను వేరు అన్న భావంతో గమనిస్తూ ఉండండి. ఈ శక్తి ప్రకృతితో సమతుల్యం పొందటాన్ని కూడా మెల్లగా గమనిస్తున్నాం.
(08:01) నీలోని వాయుతత్వాన్ని కూడా ద్రష్టగా ఉండండి. నీలోని పంచ ప్రాణ వాయువులు పంచ ఉపప్రాణాలు సమతుల్యాన్ని మైత్రిని పొందుతున్న అనుభవంకి సాక్షిభూతంగా ఉండండి. ఈ క్షణానికి ఒక సాక్షిగా ఉండండి. వర్తమాన క్షణానికి ఒక ద్రష్టగా ఉండు
(08:50) నీవు ఈ శరీరం కాదు కేవలం ఒక సాక్షి మాత్రమే నీలోని ఆకాశ తత్వానికి సాక్షిగా ఉండు నీ శరీరంలోని శూన్య ప్రదేశాన్ని గమనించు నీ చూపుతో కలిసిపోకుండా గమనించు ప్రతి కణం లోపల ఉన్న శూన్య ప్రదేశాన్ని కణం చుట్టూ ఉన్న శూన్య ప్రదేశాన్ని గమనిస్తూ ఉండు
(09:39) నీవు కేవలం ఒక సాక్షి మాత్రమే నీలోని ఆకాశ తత్వం పూర్తిగా విశ్రాంతి పొందుతుంది. స్వచ్ఛంగా మైత్రితో ప్రకృతిలో లీనమవుతుంది. నీవు శరీరము కాదు పంచతన్మాత్రలు కాదు ఈ శరీరాన్ని గమనిస్తున్న
(10:27) ఒక ద్రష్ట ఒక సాక్షి మాత్రమే ఈ దైవత్వాన్ని ప్రతిబింబించే ఒక స్వచ్ఛమైన అద్దంగా ఉండు నీవు ఒక దివ్య చైతన్యం నిర్వికారంగా ఉన్న ఆ సాక్షే నీవు నీలోని పంచకర్మేంద్రియాలని అనుభవపూర్వకంగా
(11:14) తెలుసుకో నీ కాళ్ళని చేతులని నోటిని మలద్వారాన్ని జనేంద్రియాల్ని గమనిస్తూ పో కర్మేంద్రియాలని సాక్షి భూతంగా ఉండటం వల్ల వాటిలోని జడత్వం మెల్లగా తొలగిపోతుంది.
(12:04) చురుకుతదనం సామర్థ్యం మెల్లగా నిండుతూ పోతాయి. నీవు శరీరం కాదు మనసు కూడా కాదు శరీరానికి మనసుకు అతీతంగా ఉండే ఒక మహాశక్తివి మహా చైతన్యానివి నీలోని పంచజ్ఞానేంద్రియాలని
(12:50) గమనిస్తూ ఉండు చేతనతో ఉండు సాక్షిగా గా ఉండు నీవు కళ్ళు కాదు కంటి చూపు కూడా నీవు కాదు ఆ చూపుని గమనించే చైతన్యమే నీవు కళ్ళు ఎలాంటి దృష్టిని చూస్తున్నా ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ఒక సాక్షిగా మాత్రమే గమనించు
(13:46) చూపు నీవు కాదు చూడబడేది నీవు కాదు చూస్తున్నది నీవు కాదు ఆ చూస్తున్న వాడిని చూసేదే నీవు నీవు ఒక సాక్షి చైతన్యం దేన్ని ఊహించవద్దు దేనికి ఒక రూపం ఇవ్వవద్దు
(14:42) నీ హృదయంతోనే కేవలం ఉండు ఎక్కడా కూడా అనాలసిస్ చేయవద్దు ప్రతి క్షణంలో సంపూర్ణంగా ఉండు నీ శరీరంలోని చెవులు నీవు కాదు నీ చెవులు దేన్ని వింటున్నా కేవలం ఒక గమనికగా ఉండు వినికిడి నీవు కాదు
(15:28) నీవు కేవలం ఒక సాక్షి మాత్రమే ఇది మంచి ఇది చెడు అని నిర్ణయించవద్దు కేవలం ఉన్నది ఉన్నట్లుగా అనుభవపూర్వకంగా తెలుసుకో ప్రతి క్షణంలో నీ హృదయ స్పందనతో ఉండు నీవు శరీరం కాదు ముక్కు కూడా కాదు
(16:18) వాసన నీవు కాదు వాసన చూడబడేది నీవు కాదు వాసన చూసేది నీవు కాదు నీ నిజతత్వం వీటన్నింటికీ అతీతం సంపూర్ణ జాగరూకతతో ఉండు దేన్ని విశ్లేషించవద్దు మీరు నాలుక కాదు నాలుకపై ఉన్న రుచిని
(17:03) ఉన్నది ఉన్నట్లుగా అనుభవించండి రుచికి రుచి చూడబడేదానికి రుచి చూసేవాడికి అతీతంగా ఉన్నదే నీవు వీటి వెనక ఉన్న చైతన్యమే నీవు ఉన్నచోట ఈ క్షణాన్ని
(17:48) సంపూర్ణంగా అనుభవించు నీ హృదయంతో తెలుసుకో ఈ శరీరం నీవు కాదు ఈ చర్మం కూడా నీవు కాదు ఈ చర్మం వెనక ఉన్న సాక్షి మాత్రమే నీవు నీవు వేసుకున్న దుస్తులు స్పర్శను గమనించు నీ శరీరాన్ని తాకుతున్న గాలి యొక్క
(18:37) స్పర్శను గమనించు నీవు కూర్చున్న నేల యొక్క స్పర్శను గమనించు కేవలం ఈ క్షణం పట్ల ఎరుకతోను మాత్రమే ఉండు. ఈ క్షణంలో అనుభవపూర్వకంగా జీవించండి. ఈ క్షణాన్ని క్రిందిటి క్షణం ప్రభావితం చేయకుండా చూసుకోండి. ఈ క్షణాన్ని
(19:24) అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉండండి. హృదయంతో తెలుసుకోవడం అన్నది ఈ క్షణానికి సంబంధించినది. జ్ఞాపకాలు గత క్షణంకి సంబంధించినవి కానీ సత్యం ఈ క్షణం ఈ క్షణంలో ఉన్నదే అనుభవం ఈ క్షణంలో చైతన్యంతో జీవంతో
(20:09) జాగరుకుత తో సమభావనతో ఉండండి జ్ఞానేంద్రియాలన్నింటిని సమైక్యపరిచి నీ కళ్ళు చెవి ముక్కు నాలుక చర్మం వీటన్నింటిని మైత్రితో నింపు జ్ఞానేంద్రియాలన్నీ
(20:56) సమాయిక్యంగా ఉండేటప్పుడు ఆ అనుభూతి ఏ విధంగా ధంగా ఉంది వాటిని కేవలం గమనిస్తూ ఉండు స్వచ్ఛమైన గమనికతో గమనించు ఈ క్షణం యొక్క ఉనికిని అనుభవిస్తూ ప్రతిక్షణంలో ఉంటూ ఉండాలి ఈ క్షణం హృదయ స్పందనతో ఉండు మనసు అనేది
(21:46) ఒక కల్పితం ప్రతి క్షణం నుండి దూరం తీసుకెళ్తూ పోతుంది. ఏ క్షణంలోనూ నిన్ను జీవించనివ్వదు. ప్రతిక్షణంలో ప్రజ్ఞతో ఉండు జాగరూకతతో ఉండు ఇంకా సూక్ష్మ స్థితులలో నీ పంచ ప్రాణవాయువులు ఏం చేస్తున్నాయి వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకో నీ శ్వాస కోస వ్యవస్థలో ప్రాణవయం ఉంది
(22:38) విసర్జక వ్యవస్థలో అపానవాయువు ఉంది జీర్ణ వ్యవస్థలో సమాన వాయువు ఉంది జ్ఞానేంద్రియాల్లో ఉడాన వాయువు ఉంది నాడీ వ్యవస్థలో రక్త ప్రసారణ వ్యవస్థలో సంచరించే వ్యాన వాయువు ఉన్నది. వీటన్నిటికీ గమనించండి నీవు ఈ శరీరం కాదు
(23:24) ఈ శరీరం పట్ల మనసు పట్ల ఎటువంటి రాగద్వేషాలు ఉండనివ్వద్దు స్వచ్ఛమైన సాక్షిగా మాత్రమే ఉండటం నీ క్రియ నీవు కేవలం ఒక గమనిక మాత్రమే నేను అనే భావనను మరింత లోతుగా నిశితంగా గమనించు నీ శ్వాసను గమనించు
(24:14) శ్వాసను చూస్తున్న వాడివే నీవు శ్వాసను విశ్లేషించవద్దు శ్వాస జరుగుతున్నది అన్న ఎరుకు మాత్రమే ఉండాలి. ముక్కు రంద్రాల ద్వారా శ్వాస లోపటికి ఎలా వెళ్తుంది బయటికి ఎలా వస్తున్నది గమనిస్తూ ఉండు ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటూ ఉండు శ్వాస దానంతట అదే జరుగుతుంది.
(25:01) నీ ప్రమేయంతో జరగట్లేదు. ప్రకృతి నీ ద్వారా శ్వాసిస్తుంది. ఈ ప్రకృతి ఉచ్్యాస నిశ్వాస నీ ద్వారా జరిపిస్తుంది. ఈ ప్రకృతి నీ లోపలికి గాలి పిలుస్తుంది నీ ద్వారా గాలిని బయటకి పంపిస్తుంది. నీ ముక్కు లోపలి గోడలను
(25:51) గాలి ఏ విధంగా తాకుతున్నది గమనించు నీ ముక్కు కింద పై పెదవుల పై భాగంలో ఉన్న త్రిభుజాకార ప్రదేశంలో గాలి యొక్క స్పర్శని గమనించు ఉన్న క్షణంలో నీ శ్వాసను గమనిస్తూ ఉండు ఈ క్షణంలో
(26:38) జీవించు తదాగత్ ఈ క్షణలో ఉన్న శ్వాసను ఉన్నది ఉన్నట్లుగా అనుభవపూర్వకంగా తెలుసుకో ఈ క్షణంలో అసలు మనసు అవసరమే లేదు మనసుకు ఎలాంటి స్థానం లేదు ఉన్నచోట ఈ క్షణంలో కేవలం అనుభవతో ఉండు స్వా శ్వాస
(27:29) వేడిగా ఉండొచ్చు చల్లగా ఉండొచ్చు చిన్నగా ఉండొచ్చు దీర్ఘంగా ఉండొచ్చు సుతారంగా ఉండొచ్చు అస్తవ్యస్తంగా ఉండొచ్చు కేవలం ఆ స్పర్శని ప్రాణ స్పర్శని గమనిస్తూ ఉండు. శ్వాస ఎలా ఉండినా దాన్ని మాత్రం విశ్లేషించవద్దు. ఎప్పుడైనా
(28:19) ఆలోచనలు గాని భావద్వేగాలు గాని నిన్ను ఆటంకం కలిగిస్తే మళ్ళీ శ్వాసని గమనించడం మొదలు పెట్టండి. దేన్ని ఊహించవద్దు కేవలం ఈ క్షణం తెలుసుకుంటున్న ఒక సాక్షిగా మాత్రమే ఉండు నీలోని ఆత్మ కేంద్రం నుంచి తెలుసుకో నీవు ఒక స్వచ్ఛమైన సాక్షివి ఇంకా లోపటికి
(29:10) మెల్లగా ప్రయాణించు సూక్ష్మ స్థితులు సంవేదనను కనుక్కోవచ్చు సంవేదనను గమనింపడం మొదలు పెట్టండి. నీ శరీరం పైన శరీరం లోపల ఎన్నో సంవేదనలు జరుగుతూ ఉన్నాయి వాటిని గమనించు నీవు ఒక సాక్షివి మాత్రమే
(29:57) ఈ శరీరంలో లో మనసులో కలిగే స్పందనలు వాటికి సాక్షి భూతంగా గమనించు ఏ సంవేదనని విశ్లేషించొద్దు చల్లగా ఉండినా వేడిగా ఉండిన తేలికగా ఉండిన బరువుగా ఉండిన
(30:44) దడగా ఉన్నా జలదరింపుగా ఉన్నా దురదగా ఉన్నా తూలుతున్నట్టున్న ఎలాంటి కదలికలు జరుగుతున్న సమభావనతో గమనించండి కేవలం సాక్షిగా గమనించటమే మన కర్తవ్యం నీవు ఏ శరీరం కాదు మనసు అంతకన్నా కాదు
(31:34) ఈ సంవేదనలన్నీ శరీరం మనసు కలవటం వల్ల ఏర్పడినవే ఈ రెండు అనుసంధానమయ్యే ప్రదేశమే ఈ సంవేదన ప్రతి సంవేదన తాత్కాలికమైనదే సంవేదనలన్నీ వస్తున్నాయి వెళ్తున్నాయి ఏ సంవేదన కూడా శాశ్వతం కాదు సంవేదనలు
(32:20) ప్రతిక్షణం మారుతూ ఉండటాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకో ఒక సంవేదన ఉన్న క్షణంలో అదే శాశ్వతం అన్న భావన కలుగుతుంది. కానీ ఏ సంవేదన కూడా శాశ్వతంగా మనతో ఉండిపోలేదు. కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉండు. ప్రతి సంవేదన క్షణికమైనదే కాబట్టి ఏ సంవేదనతో కలిసిపోవద్దు. ఆహ్లాదకరమైన సంవేదన
(33:10) వచ్చిందనుకో దానితో సమదృష్టితో ఉండు. అప్పుడు రాగభావం నుండి బయటపడిపోతాం. బాధాకరమైన సంవేదనను సమదృష్టితో గమనిస్తే ద్వేషభావం నుండి బయటపడిపోతాం. తటస్థమైన సంవేదనను లేక సంవేదనలు లేని స్థితిని సమభావంతో గమనించేటప్పుడు అజ్ఞానం నుండి విముక్తి పొందవచ్చు.
(34:01) మన బాధలకు ఆవేశాలకు ప్రతిచర్యలకు కారణం ఈ అశాశ్వతమైన ఈ శరీరం పట్ల మనసు పట్ల మమకారమే మన జాగృతి స్వప్న సుషుప్తి అవస్థలలో ఉన్న సంవేదనల వల్ల అజ్ఞానంతో రాగద్వేషాలతో ఉండటమే మన దుఃఖానికి మూల కారణం నువ్వు ఈ శరీరం కాదు
(34:49) మనసు కాదు కేవలం సాక్షి మాత్రమే స్వచ్ఛమైన చైతన్యం ఆత్మ చైతన్యం ఇంకా సూక్ష్మమైన మరో ప్రపంచానికి మెల్లగా ఇంకా లోపటికి ప్రయాణిద్దాం. ఆలోచనల ప్రవాహం గమనిద్దాం. ఆలోచనల ప్రవాహమే ఈ మనసు ఆలోచనల నుండి వేరుపడి వాటిని ఒక సాక్షిలా
(35:35) గమనిద్దాం. వేరొక వ్యక్తి ఏ విధంగా గమనిస్తూ ఉంటాడో ఆ విధంగా మనలో వచ్చే ఆలోచనని గమనించడం మొదలు పెడదాం. అసలు నీవు ఆలోచన కూడా కాదు నీవు ఈ ఆలోచన మధ్య ఉన్న శూన్యమే నీవు చిదాకాశమే నీవు కేవలం ఈ ఆలోచనలన్నీ
(36:22) ఏ విధంగా మేఘాలు ప్రయాణిస్తున్నాయో అలాంటివి మన చిదాకాశంలో ఈ ఆలోచనలు ఆకాశంలో ప్రయాణించే ఆ మేఘాలు నువ్వు కాదు ఆకాశమే నీవు ఆ శూన్యం నీవు ఆకాశం ఎప్పుడూ మేఘాల వలన మలిన పడలేదు. అలాగే ఆలోచనలు నీకు ఎప్పుడూ హాని చేయలేవు.
(37:10) నీవు అసలు ఆలోచనలు కూడా కాదు నీవు స్వచ్ఛమైన చేతనవి ఒక సాక్షివి ఆలోచన నేను అనుకోవటమే దుఃఖానికి మూల కారణం ఆలోచనలతో కలిసిపోవద్దు ఆలోచనల్ని పొడిగించవద్దు అలాగే ఆలోచనలు ఆపను వద్దు ఈ ప్రవాహాన్ని
(37:58) కేవలం గమనించు నువ్వు వేరు ఆలోచనలు వేరు ఆలోచనలతో కలిసిపోవద్దు వాటికి నీ శక్తిని ఇవ్వవద్దు ఆలోచనలు పరాన్న జీవుల లాగా మన జీవ శక్తిని ఉపయోగించుకుంటాయి. ఈ పద్ధతిని కొనసాగినివ్వద్దు కేవలం ఆలోచనల్ని
(38:44) ఒక సాక్షి మాదిరిగా గమనిస్తూ ఉండు. ఆలోచనల్ని బలవంతంగా ఆపవద్దు అలా ఆపడం వల్ల అవి మన మనసులోని సుశిప్తి అవస్థలో వెళ్లి దాక్కుండే ఆస్కారం ఉంది. వాటిని కేవలం సాక్షి మాదిరిగా గమనిస్తూ ఉండటమే మన పని. ఈ ఆలోచనను చూస్తున్న సాక్షివే నీవు స్వచ్ఛమైన చైతన్యమే
(39:30) నీవు నీవే విశ్వ చైతన్యం నీవే ఆత్మ చైతన్యం నీవే శూన్యం [గురకలు] నీవే నీవే దైవత్వం నీవే సచ్చిదానందం మరింత సూక్ష్మమైన నీ శక్తి కేంద్రాలైన చక్రాలను ఇప్పుడు గమనిద్దాం. అన్ని చక్రాలలో ఉన్న శక్తిని గమనించు చక్రంలోని శక్తి ప్రవాహాన్ని గమనించు
(40:27) జనేంద్రియాలకి మలద్వారానికి మధ్య ఉన్న ప్రదేశం మూలాధార చక్రం ఈ ప్రదేశాన్ని గమనించు మెల్లగా పొత్తి కడుపు మధ్య భాగంలో ఉన్న స్వాదిష్టాన చక్రాన్ని గమనించు అక్కడ కూడా ఏ విధమైన ఎనర్జీ ఫ్లక్స్ ఉన్నదో దాన్ని
(41:11) సాక్షి భావంతో గమనించు బొడ్డు ప్రదేశంలో ఉన్న మణిపుర చక్రాన్ని గమనించు అక్కడ కూడా ఎనర్జీ ఫ్లక్స్ ని సాక్షి భావంతో గమనించు ఛాతి మధ్య భాగంలో ఉన్న అనాహత చక్రాన్ని గమనించు ఎనర్జీ ఫ్లక్స్ ని సాక్షిగా గమనించు గొంతు మధ్య ప్రదేశంలో ఉన్న విశుద్ధ చక్రాన్ని గమనించు ఎనర్జీ ఫ్లక్స్ ని సాక్షిగా గమనించు
(42:05) రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞ చక్రాన్ని గమనించు ఎనర్జీ ఫ్లక్స్ ని గమనించు గమనించు మాడు ప్రదేశంలో ఉన్న సహస్రార చక్రాన్ని గమనించు సంవేదనల్ని ఎనర్జీ ఫ్లక్స్ ని గమనించు ఈ శక్తులన్నింటికీ ఒక సాక్షిగా ఉండు నీవు నీవు పదార్థం కాదు శక్తి కూడా కాదు ఈ క్షణంలో ఉన్న
(42:51) దివ్య చైతన్యమే నీవు ఈ ప్రకృతికి కేంద్రమే నీవు మనసు లేని స్థితే నీవు సంపూర్ణమైన మనసు కూడా నీవే ఆత్మ చైతన్యము నీవే ప్రకృతిలోని ప్రతి సంఘటన దానంతట అదే జరుగుతుంది. ప్రకృతి నియమాలను అనుసరించే జరుగుతుంది.
(43:41) ఈ ప్రకృతి కేవలం ఒక లీల ఒక ఆట ఒక మాయ దీనికి అతీతమైనది నీవు ఆనందం నీ సహజ గుణం స్థిత ప్రజ్ఞను అనుభవించు అనుభవపూర్వక జ్ఞానం ఈ క్షణంలో ఉంటే చాలు అదియే అతి ముఖ్యమైనది
(44:32) ప్రతి క్షణం భిన్నమైనది నూతనత్వంతో నిండినది నీవు పూర్ణ పురుషుడివి సంపూర్ణ వ్యక్తిత్వంతో కూడిన వ్యక్తివి శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత భావ సమతుల్యత ఆధ్యాత్మిక పరిపూర్ణత నీలో మూర్తిభవిస్తున్నాయి. నీ పంచకోశాలన్నీ మైత్రితో
(45:17) నిండిపోయి ఉన్నాయి. నీ అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోషాలన్నీ సమతుల్యతతో నిండిపోయి ఉన్నాయి. నీవు సత్యం నీవు చైతన్యం నీవు ఆనందం
(46:02) నీవు సచ్చితానందం ప్రతి క్షణంలో జాగృకతతో సమభావనతో ఉల్లాసంతో జీవించు ఈ క్షణం ఈ క్షణంలోనే ఉండు ఈ క్షణమే సత్యం జీవితంలోని ప్రతి క్షణం సంపూర్ణంగా జీవించు ప్రేమించు నవ్వు ఆడుకో పని చేయి విశ్రాంతి తీసుకో
(46:48) ఒక వేడుకులాగా జరుపుకుంటూ ఉండు జీవితం అస్థిరత అనిశ్చితి అభద్రత ఉన్నా కూడా చాలా అందమైనవి జీవితాన్ని సంపూర్ణంగా జీవించు ఏ క్షణం కూడా బాధపడ పడవద్దు పశ్చాత్తాప పడవద్దు రాబోయే క్షణం గురించి వృధా చేయవద్దు మనసు నిన్ను ఏ క్షణంలోనూ జీవించనివ్వదు. మనసు ఎప్పుడూ కూడా
(47:39) రాబోయే క్షణం గురించి గాని గత క్షణం నుంచి గాని వెళ్ళిపోతూ ఉంటుంది. వర్తమాన క్షణంలో అసలు జీవించదు అసలు ఈ క్షణంలో అసలు మనసు అనేదే ఉండదు కేవలం నీ ఆత్మ ఉనికి మాత్రమే ఉంటుంది. నీకు ఉన్న తల్లిదండ్రులు భార్య భర్త పిల్లలు ఇరుగు పొరుగువారు నీ పై అధికారాలు నీ సమస్యలు
(48:25) ఇవన్నీ నీకు నీవుగా నీ ఆత్మ కోరుకున్నది కాబట్టి వీటి పట్ల ఏమాత్రం అసంతృప్తి గాని తిరస్కార భావం గాని వద్దు హృదయపూర్వకంగా స్వీకరించు వాటన్నిటిని ఆస్వాదించు చైతన్యమే నీవు శరీరం మనసు
(49:11) ఆత్మ అనుభవపూర్వకంగా ప్రతిక్షణంలో తెలుసుకో ఈ శరీరాన్ని ఈ మనసును శుద్ధి చేసుకో మంచి విషయాలతో ఎప్పుడూ నింపుకుంటూ ఉండు జీవితం శక్తివంతంగా ఉత్సాహంగా జీవించడానికి ఎప్పుడూ సంసిద్ధం చేసుకో శరీరాన్ని మనసును ఆరోగ్యంతో సంతోషంతో
(49:56) మైత్రితో నింపుకో అమితమైన దైవత్వం ఆత్మవిశ్వాసం మైత్రి భావం ధైర్యం ప్రశాంతత ప్రేమ దయ ఆనందం వీటితో నింపుకో నీ శరీర భాగాలన్నీ నీ మెదడు హృదయం ఊపిరి తిత్తులు
(50:40) నీ కాలేయం నీ క్లోమం నీ ప్లీహం నీ ప్రేగులు నీ జీర్ణాశయం నీ జనేంద్రియాలు అన్నింటిని సంపూర్ణ ఆరోగ్యంతో నింపుకో జీర్ణ వ్యవస్థ శ్వాసకోష వ్యవస్థ విసర్జక వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ నాడీ వ్యవస్థ నీ శరీరంలోని అన్ని కణాలు కణాజాలాలు
(51:26) కండరాలు అవయవాలు ఆరోగ్యంగా ఉన్నట్లు భావించు నీ శరీరంలోని పదార్థము శక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు భావించు నీ మనసు స్వచ్ఛంగా సానుకూలంగా సరళంగా సహజంగా సృజనాత్మకంగా ఉన్నతంగా ఉన్నట్లు భావించు నేను విశ్వమంతటితో
(52:10) అనుసంధానమై ఉన్నాను అనే భావనతీ తీసుకురా ఈ సమస్త సృష్టిలోని ఆనందంతో మైత్రితో నేను మైకమై ఉన్నాను అని భావించు ధ్యానం నుండి బయటకి వచ్చాక ఇదే స్వచ్ఛత దైవత్వం చైతన్యం పరిపూర్ణత నిలుపుకుంటాను నిత్య జీవితంలో ఇవే ఏ గుణాలతో జీవిస్తాను అనే ఒక పాజిటివ్ మైండ్సెట్ ని తీసుకురాలి. ఇదే జీవశక్తిని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని
(52:56) ఆహ్లాదాన్ని ఆనందాన్ని జీవితంలో ప్రతి క్షణంలో కొనసాగిస్తాను అనే ఒక మైండ్సెట్ తీసుకురా ఈ సమస్త సృష్టి పట్ల మైత్రి భావాన్ని నిలుపుకుంటాను అనే భావం తెచ్చుకో ఇక మెల్లగా బాహ్య ప్రపంచంలోకి వద్దాం. దూరం నుండి వచ్చే శబ్దాలని వినటానికి ప్రయత్నించండి ఈ గది నుండి వచ్చే శబ్దాలని వినండి నీ జ్ఞానేంద్రియాలన్నింటిని పరిసరాలకి
(53:42) స్పందించేటట్టు చేయి కళ్ళు చెవి ముక్కు నాలుక చర్మం నా మనసు శరీరం ఆరోగ్యంతో ఆనందంతో మైత్రితో ఎన్లైవన్ అవుతున్నాయి. పునరుత్తేజం అవుతున్నాయి అని భావించండి. శరీరాన్ని మెల్లగా కదిలించండి నీ భుజాలను నడుమును కాళ్ళను మెల్లగా కదిలించు
(54:29) పాదాలను చేతులను మణికట్టును చేతి వేళ్ళను మెల్లగా కదిలించు ముఖాన్ని గట్టిగా బిగించి వదిలేయండి. అలాగే దవళని ఒక్కసారి బిగించి వదిలేయండి. రెండు అరచేతుల్ని మర్దన చేయండి. ఆ వెచ్చదనంతో అరచేతుల్ని ముఖం పైన ఉంచి మెల్లగా ఒకసారి కళ్ళు తెరువు
(55:15) మళ్ళీ కళ్ళు మూసుకో మళ్ళీ కళ్ళు తెరిచి చేతి వేళ్ళ మధ్య ఉన్న సందుల్లో నుంచి బయటకి చూడు బయట ఉన్న కాంతికి మెల్లగా అలవాటు పడువు మెల్లగా అరచేతుల్ని తొలగించండి. అన్ని మంచి భావాలతో దైవత్వంతో నీ చుట్టూ ఉన్న పరిసరాలని చూడండి చూసేవాడు దైవత్వమే చూడబడేది దైవత్వమే చూపు కూడా దైవత్వమే ఒకసారి దీర్ఘంగా శ్వాస పీల్చుకో
(56:03) దీర్ఘంగా శ్వాస వదులు మళ్ళీ దీర్ఘంగా గాలి పీల్చు కొని నోటి ద్వారా గాలిన వోదులు సానుకూల దృక్పదంతో ఉండు ఆనందంగా ఉండు ఈ సదాశయాలను మీ శరీరంలోనూ మనసులోనూ జాగ్రత్తగా నాటండి. చాలా జన్మల తర్వాత ఈ మానవ జన్మ పొందటం నా అదృష్టంగా భావిస్తాను. ఇక ముందెప్పుడూ ఈ విలువైన జీవితాన్ని యాంత్రిక జీవనంతో వృధా చేయను.
(56:53) ఈ జన్మలో నేను పొందినవన్నీ నా పూర్వ జన్మలో ఆత్మగా నేను నేనుగా కోరుకున్నవే అందువలనే వాటిని పొందాను. నా ఈ తల్లిదండ్రులు నా ఈ భార్య నా భర్త నా ఈ పిల్లలు నా బంధువులు నా ఈ స్నేహితులు నా పై అధికారులు నా సమస్యలు అన్నీ కూడా నేను కోరుకున్నవే వీటన్నింటిని కృతజ్ఞతా భావంతో స్వీకరిస్తాను. నేను ప్రతిక్షణాన్ని ఆనందంతో నవ్వుతో ఉత్సాహంతో జీవిస్తాను.
(57:40) నేను ఈ క్షణంలో వర్తమానంలో జీవిస్తాను. నేను అత్యున్నతమైన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికే నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచమంతా సృష్టించబడింది. నేను ప్రతిక్షణాన్ని ఒక ప్రసాదంగా స్వీకరిస్తాను. జీవితంలోని అనిశ్చితి అస్థిరత మరియు అభద్రతలు కేవలం నా అభివృద్ధి కోసమే నేను వాటిని సంతోషంతో మహాప్రసాదంగా స్వీకరిస్తాను. ఈరోజే ఈ క్షణమే అందమైనది.
(58:22) ఈ క్షణం ఈ విధంగానే ఉండగలదు. నేను ఈ క్షణం యొక్క అనివార్యతను స్వీకరిస్తాను. ఈ క్షణంలో జాగరుకతతో ఉంటూ నా అన్ని జ్ఞానేంద్రియాలతోనూ మరియు కర్మేంద్రియాలతోనూ సంపూర్ణంగా జీవిస్తాను. నేను ప్రతి క్షణానికి సాయశక్తుల తోడ్పడతాను. ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తాను. ఈ క్షణం నాకు దేవుడు ఇచ్చిన బహుమానం ప్రతి క్షణం దేవుడు సృష్టించినదే సంతోషము నా లోపలే ఉన్నది. జీవితం అంటే
(59:12) ప్రేమ, నవ్వు, ఆనందం, దయ, స్నేహం, ఉల్లాసం నీ గూడంగా ఉన్న దైవత్వాన్ని నేనే నేనే సచ్చిదానంద స్వరూపాన్ని ఓ దేవుడా జీవితంలో నేను చేసే ప్రతి పనిలోనూ జాగరూకతతో ఉండేలా నన్ను దీవించు
No comments:
Post a Comment