మీ జీవితాన్ని మార్చేది సంఘటన కాదు...మీ స్పందనే Your Reactions Are Writing Your Future
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=u6j6Y1UkHbA
Transcript:
(00:01) ఇది ఆధ్యాత్మికతకు సంబంధించిన ఓ చిక్కని విషయం అండి మీతో నేను నిజంగా చెప్తున్నాను చాలా ధైర్యం చేస్తున్నానండి ఎందుకంటే ఇది మానవాళకి సంబంధించిన ఆ మాటక వస్తే మానవాళ్ళకి దిశ నిర్దేశం చేసే ఒక అద్భుతమైన విషయంఅండి పొద్దున్న నుంచి నేను చాలా సీరియస్ గా నోట్స్ రాసుకున్నాను ఒకటి 10 సార్లు ఆలోచించాను నాలుగైదు సార్లు చదువుకున్నాను రాసుకున్న తర్వాత ఒక ధైర్యం నల వచ్చిందండి చేయకపోతే ఎలాగా చేసేద్దాం అని చెప్పేసి కాబట్టి
(00:45) మీరందరూ కూడాను చాలా జాగ్రత్తగా నా మీద అభిమానంతో వింటారని చెప్పేసి నేను ఈ వీడియోకి స్వీకారం [నవ్వు] చూడుతున్నానండి. చెప్పాను కదా ఇది ఆధ్యాత్మిక విషయమైనా చాలా సులభంగా అర్థమవుతుందండి మల సరళంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పాను కదా అయితే ఈ విషయాన్ని గనుక పట్టుకుంటే మనసు ప్రశాంతత చెందుతుందండి చిరాగులు పరాకులు ఉండవు ముఖ్యంగా కోపం తగ్గుతుంది.
(01:18) సకారాత్మక ఆలోచనలు వస్తాయి ఏ పనిైనా కూడాను సయమనంతో చేస్తాము తొందరపడి ఆవేశానికి పోకుండా ఒక క్షణం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామండి వెరసి ఏమైతుందంటే వ్యక్తి జీవనం ఉత్సాహంతో మరింత వేగం పొందుకుంటుంది అన్నమాట సో విషయ ప్రస్తావనకు గనుక నేరుగా వచ్చినట్లయితే ఒక మంచి వాక్యం చెప్తానండి సద్గురువు అన్న వాక్యం అన్నమాట అదేంటంటే కాన్షియస్ యక్షన్ డస్ నాట్ ప్రొడ్యూస్ కర్మ ఇట్ ఇస్ ఇన్ రియాక్షన్ దట్ యు ప్రొడ్యూస్ కర్మ మళ్ళీ చదువుతానండి ఎందుకంటే కొంచం
(02:03) మెల్లిగా చెప్పుకోవాల్సిన విషయం ఇదికాన్షయస్ యక్షన్ డస్ నాట్ ప్రొడ్యూస్ కర్మ ఇట్ ఇస్ ఇన్ రియాక్షన్ దట్ యు [గొంతు సవరించుకోవడం] ప్రొడ్యూస్ కర్మ తెలుగులో కూడాను తర్జుమా చేసి చెప్తానండి ఎరుకతో చేసిన పని అంటే స్పృహతో చేసిన పని కర్మ బంధాన్ని సృష్టించదు కానీ అవగాహన లేకుండా చేసే ప్రతిస్పందనే అంటే రియాక్షన్ అండి కర్మను సృష్టిస్తుంది.
(02:34) ఇదండి ఒకసారి పాస్ చేసి లేకపోతే మళ్ళీ మొదటి నుంచి వినండి. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను మంచి పనులే చేస్తున్నాను మరి నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని ఇక్కడ ప్రశ్న పని గురించి కాదండి ఆ పని చేస్తున్నప్పుడు మీలో ఉన్న చైతన్యం ఎలా ఉంది అన్నదే ప్రశ్న అన్నమాట ఇక్కడ యాక్షన్ రియాక్షన్ అనే రెండు పదాలు వాడాను కదా ఈ రెండు పదాల గురించి చెప్తానండి ఎందుకంటే ఇది బేసికల్ గా ఈ రెండు పదాల మీదనే ఈ వీడియో అంతా నడుస్తుంది అన్నమాట యక్షన్ అంటే ఏమిటి? ఆలోచించి పరిస్థితిని అర్థం చేసుకని చేసే పని
(03:19) ఇది నువ్వు చేయొచ్చు ఇతరులు కూడాను చేయొచ్చు నీకు ఓకే [గొంతు సవరించుకోవడం] ఇది రియాక్షన్ అంటే ప్రతిస్పందన కదా అంటే యాక్షన్ కి నువ్వు ప్రతిస్పందించే విధానం అన్నమాట ఉదాహరణకి ఏంటంటే ఎవరో ఏదో అన్నారు కోపం వచ్చేసింది అరిచేసాం అవసరమైతే కొట్టేసాం కూడా కదా అలాగే ఎవరో పొగిడారు పొంగిపోయాయి నేను పొంగిపోయాం కావలి ఇచ్చేసుకున్నాము ఆ మాటక వస్తే ఆనంద భాషపాలు కూడాను రాల్చావండి అలాగే ఎవరో విమర్శించారు బాధపడ్డాడము ఆ రోజంతా నిద్రపోలేదు అన్నం
(04:04) కూడాను సరిగ్గా తినలేదు ఎట్సెట్రా [నవ్వు] ఇవన్నీ నడుస్తుంటాయండి. సో ఇవన్నీ యాక్షన్స్ కాదు ఇవన్నీ రియాక్షన్స్ే ఈ రియాక్షన్స్ే మళ్ళీ కొత్త కర్మలుగా తయారవుతూ ఉంటాయి. అయితే ఇందాక నేను అన్నట్టుగా ఒక క్షణం ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ఒక సద్బుద్ధి మనకు కలుగుతుంది అని నేను ఇందాక ఒక మాట అన్నాను కదా ఇప్పుడు ఆలోచిద్దాంఅండి అతను కోపంలో ఉన్నాడు నేను కూడాను అతన్ని కోపడితే నైతికంగా ఇద్దరం ఓడిపోతాం.
(04:42) కాబట్టి నేను ప్రశాంతంగానే ఉంటాను. అని అతను అనుకొని ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి ఇక్కడ చేస్తున్న కర్మల యొక్క గోసు తెగిపోతుంది ఇక్కడ అలాగే యక్సిడెంట్ అయిందండి కోట్లాడ జరిగింది ఇద్దరు ఒకడనొకడు తిట్టుకున్నారు చివరికి పోలీస్ కేస అయింది ఆ రోజంతా టెన్షన్ే కదా చిన్న సంఘటన పెద్ద కర్మగా మారిపోయింది కదా అయితే ఇక్కడ కాన్షియస్ యక్షన్ ఎలా ఉంటుందో ఆలోచిద్దాం.
(05:23) అంటే ఇదంతా అన్కాన్షియస్ గా తిరిగిపోయింది తెలియకుండా జరిగిపోయింది తర్వాత మనం పశ్చాత్తాప్ పడతాం అది వేరు చేయకుండా ఉండవలసింది అని కానీ కాన్షియస్ గా మనం యాక్ట్ చేయామ అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది కారు దిగుతాం దిగంగానే ప్రశాంతంగా ముందు అసలు ఎవరికైనా గాయాలు అయ్యాయా ఏంటి అనేది చూస్తాం. యక్సిడెంట్ తీవ్రతని గమనిస్తాము ప్రశాంతంగా సమస్యని పరిష్కరించుకుంటామండి కదా అది కాన్షియస్ యాక్షన్ అన్నమాట కోపతాపాలకి పోము ఆవేశాలకి పోము మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
(06:00) అలాగే భార్య ఒక మాట అంది కోపం వచ్చింది రియాక్ట్ అయ్యాము అలాగే పిల్లవాడు పరీక్ష తప్పాడు తండ్రి పరువు పోయిందని వాడిని తిట్టాడు. అంటే వీటన్నిటిలో కూడా ఏం జరిగింది మనం రియాక్ట్ అయ్యామండి ఈ రియాక్టే కర్మను తయారు చేస్తుంది అని ఇందాక చెప్పినట్టుగా సద్గురువు యొక్క మాటఅండి ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పింది కూడాను ఇదేనండి కర్మ చేయకు అని అనలేదు అవగాహనతో కర్మ చెయి అని అన్నాడు ఫలితం పై వ్యామోహం లేకుండా ఎందుకంటే
(06:46) కోపం లేకుండా ద్వేషం లేకుండా అహంకారం లేకుండా చేసిన పనిని మనసు బాధించదు. ఇప్పుడు నేనే చేశాను అనేది అహంకారం అండి నాకఎందుకు ఇలా జరిగింది అనేది బాధ. అసలు వీటన్నిటికీ వాడే కారణం అన్నది ద్వేషం అండి. సో ఇవన్నీ కూడాను కర్మకి ఒక విధంగా విత్తనాలుఅండి విత్తనాలు అంతే సైకాలజీ కూడా ఏం చెప్తుందంటే అంటే ఒకసారి లౌకిక ప్రపంచంలోకి వద్దాంండి సైకాలజీ ఏం చెప్తుందంటే మన మెదడులో మొదలు భావోద్వేగం వస్తుంది.
(07:33) కానీ దానికి వెంటనే స్పందించవలసిన అవసరం లేదు కొన్ని క్షణాలు గనుక ఆగినట్లయితే ఒక ఆలోచన వస్తుంది. ఇంకొన్ని క్షణాలు గనక ఆగినట్లయితే పరిస్థితి అర్థమవుతుంది. ఆ తర్వాత మనల్ని మనం సమాధాన పరుచుకుంటాం. తప్పప్పులని పేరు ఎది వేసుకుంటాం ఇంత చిన్న విషయానికి నేను యుద్ధం చేద్దాం అనుకున్నాను అని మనసుని మనం ఆత్మ విమర్శ చేసుకుంటామండి.
(08:09) రెండు రోజులు గడిచిన తర్వాత ఏమైతుంది అంటే అది ఎంత పనికిమాలిన పని నిజంగా దానికి నేను నిజంగా స్పందిద్దాం అనుకున్నానా కోపదాబాలకి గురైదాం అనుకున్నానా అసలు ప్రశాంతంగా ఉండడమే నేను చేసిన మంచి పని అని చెప్పేసి ఒక విధంగా నవ్వు కూడా వస్తుందండి అప్పుడు కర్మకి నువ్వు బానిసవి కావు యజమానివ అయతావ అన్నమాట ఎందుకంటే పరిస్థితి అంతా నీ చేతిలోనే ఉంది కదా అంటే ఇప్పుడు ఏం లేదండి ఇక్కడ సింపుల్ ఒక క్షణ విరామం దాని తర్వాత అవేర్నెస్ దాని తర్వాత కాన్షియస్ యక్షన్ అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు ఈ
(08:55) కాన్షియస్ యాక్షన్ లో ఏముంటుందంటే మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఇందాక నేను కార్య ఆక్సిడెంట్ ఉదాహరణ చెప్పాను కదా దాంట్లో ప్రశాంతంగా దిగుతారు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతారు ఎవరికి దెబ్బలు తగిలాయి చూస్తారు అసలు ఏం చేయాలో చూస్తారు అవసరమైతే ఇతరులని కన్విన్స్ చేస్తారు. మధ్యలో ఎవరనా దూరి గోల్ చేస్తుంటే ఉండండి బాబు ఉండండి ఈ విషయానికి ఎందుకు అంత కంగారు పడతారు అని చెప్పేసి సంయమనంతో ఇతరులని కన్విన్స్ చేస్తారు.
(09:22) సో ఈ ప్రక్రియలో మీకు స్వేచ్ఛ ఉందా లేదా ఉంది కదా ఇదే యోగం అండి ఇదే కర్మయోగం అంతే ఎప్పుడైతే విజృంబిం చేశవో వాదనకు దిగావో కొట్టే ప్రయత్నం చేశవో క్వశ్చన్ లేదు అన్కాన్షియస్ రియాక్షన్ విల్ క్రియేట్ కర్మ ఫర్ యు అంతే అయితే ఒక్కొక్కసారి జీవితంలో ఎదురయ్యే సంఘటలపై మనక ఎప్పుడు పూర్తి నియంత్రణం ఉండకపోవచ్చుండి కానీ వాటికి ఎలా స్పందించాలో ఎంచుకునే స్వేచ్ఛ మటుకు మన చేతిలోనే ఉంటుంది.
(10:04) అంతేనండి అంతే కదా ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నది కూడా అదే కదండీ ఈ కర్మ అనేది ఈ ప్రపంచం నువ్వు చేసింది కాదండి ప్రపంచానికి మీరు లోపల నుంచి ఇచ్చిన ప్రతిస్పందనే ఇది రియాక్షనే ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] అవగాహనతో జీవించే మనిషి ప్రతి సంఘటనను కూడాను తనని తాను మార్చుకునే ఒక అవకాశంగా చూస్ చూస్తాడండి చూస్తాడు ఈ అవగాహన లేకుండా జీవించే మనిషి అదే సంఘటనను శాపంగా మార్చుకుంటాడండి శాపంగా మార్చుకొని కర్మ బంధంలో కూడాను చిక్కుంటాడు
(10:48) ఇప్పుడు కేవలం సంఘటన అనేది మీ విధిని నిర్ణయించదండోయ్ దానికి మీ ప్రతిస్పందనే మీ విధిని నిర్ణయిస్తుంది అంతేనండి ఇప్పుడు ప్రతిదానికి రియాక్ట్ అయిపోతూ ఉంటాం కదా మనం అంటే రియాక్ట్ అనేది ఒక అలవాటు ఉండి ఈ కాన్షియస్ యాక్షన్ ఉంది చూసారా ఇందాక నేను చెప్పినట్లు అది స్వేచ్ఛకు ప్రతీక స్వేచ్ఛకు ప్రతీక ఇప్పుడు కర్మ చేతులతో మెకానికల్ గా చేసే పని కాదండి మనసు చేసే ప్రతి స్పందనలో నుంచి పుడుతు అన్నమాట కర్మ చెడు కర్మ కావచ్చు మంచి కర్మ
(11:35) కావచ్చు వాటన్నిటికీ ప్రధానం మనసే ఇప్పుడు ఎరుకతో జీవించే వ్యక్తి అంటే కాన్షియస్ గా ఉండే వ్యక్తి ఎప్పుడు పరిస్థితులకి బానిస కాడండి అతను అతని లోపల ఉన్న చైతన్యానికి యజమాని అయతాడు మాస్టర్ అయితాడు ఎందుకంటే [నవ్వు] అతను అతని యొక్క భావాల మీద ఆ పరిషెడ్ వర్గాల మీద ఒక మంచి నియంత్రణ కలిగి ఉంటాడండి ఒక్కటండి మనం మన జీవితాన్ని మార్చుకోవాలంటే ప్రపంచాన్ని మార్చవలసిన అవసరం లేదండి మన యొక్క ప్రతిస్పందనని అంటే రియాక్షన్ని మార్చుకుంటే చాలు.
(12:23) ఇక్కడ మనకఒక డౌట్ వస్తుందండి మనకఒక డౌట్ వస్తుంది రావాలి కూడాను అదేంటంటే అది కదా కిరణ గారు కర్మ [గొంతు సవరించుకోవడం] అంటేనే పని కదా యాక్షన్ రియాక్షన్ కూడాను మరి కర్మే కదా ఒక్క రియాక్షన్ మాత్రమే కర్మ ఎలా అయితుంది అని ఇప్పుడు ఇందాక సద్గురువు ఏమన్నాడు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి కాన్షియస్ యక్షన్ డస్ నాట్ ప్రొడ్యూస్ కర్మ అని అన్నాడు కదా సో ఇక్కడ మరింత లోతుగా వేమని కావాల్సి ఉంటుందండి ఇప్పుడు సంస్కృతంలో కర్మ అంటే చర్య యాక్షన్ అంటాం ఇంగ్లీష్లో కాబట్టి రియాక్షన్ కూడా మనకి కర్మలా అనిపిస్తుంది
(13:10) కదా మరి సద్గురువు ఏమన్నాడు కాన్షియస్ యాక్షన్ డస్ నాట్ ప్రొడ్యూస్ కర్మ అని అన్నాడు కదా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా జా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి అందుకనే నేను కొంచెం స్లోగా చెప్తున్నాను. ఇక్కడ కర్మ అనే పదాన్ని చర్య అనే అర్థంతో కాకుండా కర్మ బంధం అనే కాంటెక్స్ట్ లో మనం అర్థం చేసుకోవాలండి అదే కార్మిక్ బాండేజ్ కార్మిక్ బాండేజ్ [నవ్వు] [ఆశ్చర్యం] అప్పుడు ఇంతకుముందు చెప్పిన వాక్యాన్ని మనం ఇలా చదవాల్సి ఉంటుంది.
(13:48) ఎలాగంటే కాన్షియస్ యక్షన్ డస్ నాట్ ప్రొడ్యూస్ కార్మిక్ బాండేజ్ ఇట్ ఇస్ ద రియాక్షన్ దట్ ప్రొడ్యూసెస్ కార్మిక్ బాండేజ్ ప్రతిస్పందన ఏదైతే ఉంటుందో అదే మనల్ని కర్మ బంధంలో పడేస్తుంది అని ఒకటండి చర్య అంటే శరీరం చేసే పని కర్మ బంధం అంటే ఆ పని మన మనసులో ఒక ముద్రగా సంస్కారంగా మిగిలిపోతుందండి అయి అంతే ఉదాహరణ చెప్తానండి ఎందుకంటే వీటన్నిటికీ ఉదాహరణలే ముఖ్యం ఉదాహరణ గనుక తెలిసిందంటే ప్రిన్సిపల్ కి కనెక్ట్ అయిపోతాం మనం ఇదో
(14:33) 100 మందికి భోజనం పెట్టామండి ఇదొక చర్యగా కానీ భోజనం పెట్టిన తర్వాత నాలాంటి మనిషి ఎవ్వరూ లేరు అని అహంకారం గనుక వస్తే తే ఆ అహంకారమే కర్మ బంధం అండి అయితే అదే పని చేసి ఇది నా కర్తవ్యము మానవాళ్ళ యెడల అని వదిలేస్తే అంటే మనసుకి పట్టించుకోకుండా ఉంటే ఇక్కడ చర్య జరిగింది కానీ బంధం ఏర్పడలేదండి బంధం ఏర్పడలేదు కదా మీతో మాట్లాడుతుంటే ఒక విషయం గుర్తుకొస్తున్నది కొంతమంది ఒక స్థాయికి చెందిన మట్టాధిపతులు
(15:19) పాదపూజ చేయించుకుంటారండి పాదపూజ చేయించుకుంటారు. ఎవరో ఒక సంస్కారి వారిని ఇంటికి పిలిపిస్తాడు. పాదాలకి పూజ చేస్తాడు. పూజ చేసినప్పుడు ఆ మఠాధిపతి అలా ఆసనం మీద కూర్చొని ఆ నా గంగా పాదపూజ జరుగుతున్నది. నేను 20,000 చెప్పాను ఆయన 20,000 ఇస్తాడు కొన్ని లక్ష చెప్పాను లక్ష ఇస్తాడు అని అనుకొని పాదపూజ జరుగుతున్నప్పుడు అల్లా మురిసిపోయాడు అనుకోండి అతను కర్మ బంధంలో చిక్కునట్టే కర్మ బంధంలో చిక్కునట్టే అలా కాకుండా ఏ భావన లేకుండా భక్తుడు పిలిచాడు వెళదాం అని చెప్పేసి ఈ ప్రక్రియకి ఏ
(16:06) ప్రాముఖ్యత లేకుండా అలా వెళ్లి అలా వెళ్ళిపోయాడు అలా వచ్చి అలా అలా వెళ్ళిపోయాడు అనుకోండి కానీ కర్మబంధాలు చిక్కోడు ఎందుకంటే దానికి అంత ప్రతిస్పందనే లేదు రియాక్షన్ లేదు కదండి అయితే కర్ణుడు కూడా కృష్ణుడు కూడాను అర్జునుతో కర్మ చేయొద్దు అని చెప్పలేదండోయ్ కర్మను నిమిత్తమాత్రుడిగా ధర్మం ప్రాతిపదికగా చెయి అని అన్నాడు అంటే పని చెయి కానీ లోపల కోపము అహంకారము భా భయము అసూయ వస్తే రాగద్వేషాలు లేకుండా చెయి నీ పని ఎలా ఉండాలంటే తామరాగు మీద నీటి బిందువులాగా ఉండాలి అని అర్థం అండి
(16:52) అప్పుడు అది బాధించదు కర్మ బంధంలో మనల్ని పడేయదు. ఇప్పుడు వేదాంతం ప్రకారము ప్రతి రియాక్షన్ ఒక కొత్త వాసనని లేకపోతే ఒక సంస్కారాన్ని బలపరుస్తుందండి బలపరుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ మిమ్మల్ని ఒకరు విమర్శించారు కోపం వచ్చింది. రేపు మళ్ళీ ఇంకొకరు విమర్శించారు మళ్ళీ కోపం వస్తుంది. ఇక్కడ ఏం జరిగింది మొదటి కోపం ఒక ముద్రను వేసింది మీలో రెండో కోపం ఆ ముద్రని మరింత గాఢతరం చేసింది.
(17:33) ఇదే కర్మ చక్రం అండి ఇంతకంటే ఏం లేదు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాను ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలకి ఉదాహరణ బాగా పనిచేస్తాడయండి అది నా బలమైన నమ్మకం ఇప్పుడు ఒక విత్తనం ఉందండి అది అలా పడింది అది కేవలం విత్తనమే కదా అది చర్యకి గురి కాలేదు ఎవరో ఒకళ్ళ వచ్చి దాన్ని ఏం చేస్తారంటే అలా నాటుతారు భూమిలో నడిన తర్వాత ఏం జరుగుతుంది ఆ విత్తనం ఏదో ఒక విధంగా తన వాసనా బలంతో ముందు భూమి పైకి వచ్చి చిన్న మొక్కగా మారి తర్వాత చెట్టుగా మారి తర్వాత వృక్షంగా మారి ఫలాన్ని ఇస్తుంది
(18:19) కదండీ అసలు విత్తనమే లేకపోతే పొలం దున్నినా కూడాను మొక్క రాదు కదా మొక్క రాదు కదండీ సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహానుభావులు కర్మ చేసినా కూడాను కర్మ బంధంలో చిక్కుకోరు ఇంతకుమించిన మంచి ఎగజాంపుల్ లేదండి మళ్ళీ ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరికి వద్దాంండి శ్రీకృష్ణుడు జీవితమంతా కార్యశీలే కదా రాముడు కూడా రాజ్యాన్ని పరిపాలించాడు జనక మహారాజు కూడాను రాజుగానే ఉన్నాడు.
(18:59) వాడు పని చేయలేదా అంటే వాళ్ళందరూ పని చేశారండి కానీ వాళ్ళు బంధింపబడలేదు ఎందుకంటే వాళ్ళు కర్తవ్య నిర్వహణ మార్గంలో పని చేశారు కానీ కర్మ బంధంలో చిక్కుకోకుండా కర్మ యోగంలోనే వాళ్ళు రమించారు. ఇందాక మనం అనుకున్నాం కదా అన్కాన్షియస్ కాన్షియస్ యక్షన్ డంట్ ప్రొడ్యూస్ కర్మ అని అనుకున్నాం కదా ఇంకా అర్థం ఏంట చెప్పాలంటే పద్యాన్ని పని చేస్తాడు ఆ పని చేసిన తర్వాత అది నాది అంటాడు నేను చేశను అంటాడు ఆ తర్వాత అది కర్మ బంధంగా మారి అతన్ని మెల్లమెల్లగా నడిపిస్తూ
(19:43) ఉంటుంది జ్ఞాని కూడాను అదే పని చేస్తాడు పని పూర్తి అయిన తర్వాత దాన్ని వదిలేస్తాడు. దాన్ని అలా పట్టించుకోడు మర్చిపోతాడు ఎవరనా గుర్తు చేస్తే ఓహో అలాగా అని అంటాడండి అని అంటాడు ఇక్కడ బాగా అర్థం కావాలంటే రామణ మహర్షి గారి ప్రస్తావన పట్టుకు రావాలండి వారు ప్రతిరోజు కూడాను కొండపైకి వెళ్తూ ఉంటారు ఆశ్రమం వెనక ఉన్న స్కందకి వెళ్తూ ఉంటారు ఒకరోజు అలాగే శిష్యులతో వెళ్ళారు.
(20:14) మిట్ట మధ్యాహ్నం అయిపోయింది ఓ చెట్టుని చూసాడు ఓ తుమ్మ చెట్టుని అనుకుంటాను ఒక కర్రని ఒక పెద్ద కొమ్మని విరిచాడు అది చాలా బలంగా ఉందన్నమాట విరిచి ఏం చేశడంటే దాన్ని మంచిగా చెక్కడం ప్రారంభించాడండి ఒక అరగంట చెక్కిన తర్వాత ఒక అద్భుతమైన ఒక కర్రగా తయారయింది అన్నమాట శిష్యులందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే అక్కడక్కడ ఈ గొర్రెల కాపరలు కనబడుతూ ఉంటారు అందరూ నమస్కారం పెడుతుంటాడు ఈయన కూడా చిన్న నవ్వుతూ ఉంటాడు అయితే ఒక కురవాడు ఆయన్ని చూడకుండా ఆ కర్ర వైపే చూస్తున్నాడా అంటే కుర్రవాడికి నచ్చింది.
(20:54) అంటే వాళ్ళు కరవలు చేతులో పట్టుకొని తిరుగుతుంటారు కదా వెంటనే రమణ మహర్షి గారు ఆ పిల్లవాడిని చూసి ఆ కర్రలు చూపెడుతూ ఇది నీకు కవల అన్నట్లుగా ఒక సంఘ చేశడండి. అతవాడ కావాలన్నాడు వెంటనే ఇచ్చాడు మామూలుగానే కొండ తీపోయాడున్నమాట చూడండి [నవ్వు] ఆయన ఏ భావన లేకుండా చిక్కాడు ఏ భావన లేకుండా ఇచ్చేసాడు కరనాదని నేను అనుకోలేదు ఇప్పుడు కావాలి తీసుకెళ్ళాడు ఓకే అని అనుకున్నాడు మరి ఇంకో ఉదాహరణ కూడా ఇస్తానండి ఒక భక్తుడు ఆశ్రమంలో ఉన్న ఒక స్వామీజీకి ఓ పెద్ద బంగారు కిరీటాన్ని తీసుకొచ్చి ఇచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టి మీరు అనుమతిస్తే నీ తల మీద పెడతానండి అన్నాడు.
(21:39) నేనేం మాట్లాడలేదు చిరునవ్వు నవ్వాడు ఆ చిరునవ్వునే అంగీకారంగా తీసుకొని ఆ కిరీటాన్ని నేను తల మీద పెట్టి ఈయన మురిసిపోయాడుండి ఈ భక్తుడు అదేరోజు రాత్రి ఆ కిరీటాన్ని తీసి పక్కన పెట్టి నా స్వామీజీ నిద్రపోయాడు ఆ నిద్రపోవడాన్ని అదనంగా చూసి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక దొంగ దాన్ని ఎత్తుకుపోయాడండి ఎత్తుకుపోయాడు దొంగతనం జరిగింది అది కనపడలేదు అని తెలుసుకున్న తర్వాత భక్తులందరూ కూడాను ఆహాకారాలు చేశారు ఇది అలా జరిగింది అది అలా జరిగింది అని చెప్పేసి స్వామీజీ మటకు ప్రశాంతంగా ఉన్నారు.
(22:18) ఎవరో వచ్చి అడిగారు స్వామీజీని ఏ స్వామీజీ ఎంత కోట్లు విలువ చేసే ఒ కిరీటము అది పోయిందని మేమందరం కంగారుపడుతున్నాం బాధపడుతున్నాం అనిఅంటే ఈ స్వామిజీ ఏమన్నాడో తెలుసా అండి అతనికి ఇవ్వాలనిపించింది ఇచ్చాడండి ఆ దొంగకి తీసుకెళ్ళాలనిపించింది తీసుకెళ్ళాడు మధ్యలో నాది ఏముందండి అని అన్నాడండి మరి ఇప్పుడు ఈ స్వామిజీ కర్మబంధంలో చిక్కోలేదుగా చిక్క చిక్కలేదు కదండీ అసలు కర్మ మందులో చిక్కున వాళ్ళందరూ భక్తులు అన్నమాట వారి గాని ఈ వస్తువు మీద వాళ్ళకి మమ్మకారం ఏర్పడింది.
(22:56) సో ఈ ఉదాహరణ కాసేపు పక్కన పెడదాంండి ఒక్కటి గమనించాలి మనం అదేంటంటే ప్రతి రియాక్షన్ కూడాను ఒక చర్యే కానీ ప్రతి చర్య రియాక్షన్ కాదండోయి గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ చెప్తాను ప్రతి రియాక్షన్ కూడా చర్యే కానీ ప్రతి చర్య కూడాను రియాక్షన్ కాదు ఆకలి వేసింది అన్నం తింటాం చెట్టు నాటాలనిపించింది తూపి చెట్టు నాడతాం ఓకే అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కొన్ని కొన్ని చర్యలు రియాక్షన్స్ అయితాయి కొన్ని కొన్ని చర్యలు రియాక్షన్స్ కావండి
(23:41) అంతే ఇప్పుడు వివేకంతో చేసిన చర్య ఉంది చూసారా అది విముక్తికి దారితీస్తుంది. అవివేకంతో చేసిన రియాక్షన్ లేకపోతే ప్రతిస్పందన అది బంధానికి దారితీస్తుందండి. అందుకే కర్మ అనే పదాన్ని మనం ఎప్పుడూ కూడా చర్య అనే అర్థంలో కాకుండా కర్మ బంధం అనే ఒక ఆధ్యాత్మిక అర్థంలో చూడాలండి అంతే ఈ డిఫరెన్స్ గనుక మనకు తెలిసింది అనుకోండి కోపతాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాం కదా ఇప్పుడు ఒకటండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి కర్మ అనేది శరీరంలో నుంచి పుట్టదు చేతుల ద్వారా పుట్టదు నోటి ద్వారా పుట్టదు
(24:25) కర్మ మనసులో నుంచి పుడుతుందండి అప్పుడు శరీరం చెయ్యి నోరు ఇవన్నీ కూడాను కేవలం సాధనాలు మాత్రంగానే ఉంటాయండి మళ్ళీ ఇంకో ఉదాహరణ చెప్తాను ఇప్పుడు కత్తితో డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు మరి అదే కత్తితో దొంగ హత్య చేస్తాడు కత్తి ఒకటే చర్య కూడా ఒకటే కానీ ఇక్కడ కర్మ వేరు ఇప్పుడు కర్మని నిర్ణయించేది చేయి కాదు కదా మరి ఏంటి ఆ కర్మ అంటే చెయ్యిని నడిపించే ఒక చైతన్యం అండి అంతే బుద్ధుడు ప్రశక్తి కూడా పట్టుకొచ్చేద్దామండి ఇక్కడ గౌతం బుద్ధుడిని అతను భిక్షాటకి వెళ్ళినప్పుడు ఒకతను
(25:09) తిట్టాడు బుద్ధుడు నవ్వుతూ విన్నాడు కానీ మనసులో అండించుకోలేదు శిష్యులు అండించుకున్నారు. ఎందుకు ఆయన అంత ప్రశాంతంగా ఉన్నాడని శిష్యులు అడిగితే నేను వాటిని స్వీకరించలేదు కదా అని అన్నాడండి అలా గౌతమ బుద్ధుడు కూడా కర్మ బంధంలో ఉండలేదు అంటే బుద్ధుని ఉద్దేశంలో అతను కేవలం ఏమనుకున్నాడఅంటే అవతల వ్యక్తి ఒక శబ్దం చేశడు అంతే అని గోలూరుడు గంగే స్వామి అవధూత కూడానండి ఒక వ్యక్తి తిట్టిన ఏమి అనలేదండి ఆయన ఏమనుకున్నాడంటే అతను కర్మ బంధంలో చిక్కున్నాడు వచ్చే జన్మలో ఏమైపాడు అని జారిపడ్డాడండి కొంచెం [గొంతు సవరించుకోవడం] బాధపడ్డాడు
(25:54) కూడా సో ఇవన్నీ పక్కన పెడితే ఉపనిషత్తు కూడా ఏమంటుందంటేనండి నువ్వు మనసు కాదు ఆలోచనలు కాదు నువ్వు కేవలం వాటిని గమనించే సాక్షివి అని చెప్పేసి అంటే మెడిటేషన్ కాన్సెప్ట్ కూడా ఇదే చెప్తుందండి ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని మర్చిపోతామో అప్పుడు రియాక్షన్ కి మన దగ్గర అయితే ఉం అప్పుడు అది కొత్త కర్మ అయితూ ఉంటుందండి కొత్త కర్మ అయితూ ఉంటుంది.
(26:24) మళ్ళీ ఉదాహరణ ఇప్పుడు నది ప్రవహిస్తుందండి దాంట్లో చిన్న చెక్క ముక్క విషయం అది అలలు అవాటన్ని పడుతుందా లేదా కానీ పడవ నడిపేవాడు ఉన్నాడు. అలా వస్తున్నాయి కానీ చుక్కాని సహాయంతో తన ప్రయాణానికి దిశ నిర్దేశం చేసుకుంటాడు కదా ఇక్కడ నీరు అదే అలలు అవే గాలి కూడాను అదే కానీ ఈ నావికుడికి అంటే పడవ నడిపేవాడికి ఎటు వెళ్ళాలో తెలుసు అంటే గమ్యం ఏంటో తెలుసు ఇదే కాన్షియస్ యాక్షన్ అండి మన అవగాహనే చుక్కని ఎప్పుడు చెప్పే ఉదాహరణ చెప్తానండి వీడియో కొంచెం పెద్దదిగా వస్తుంది రానివ్వండి ఇబ్బంది అనే ఇప్పుడు ఒక నది అలా హుందాగా
(27:10) వెళ్తున్నది దాని పక్కనే చిన్న పిల్లకాలు గులకరాళ్ళ మీద శబ్దం తీసుకుంటూ వెళ్తున్నది. నదిని చూసి ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోయి ఒక మాట అడిగింది. సోదరా అంత హందాగా అంత ప్రశాంతంగా ఎలా ప్రవహించగలుగుతున్నావు అని ఇక్కడ నది ఒక అద్భుతమైన సమాధానం చెప్పిందండి అదేంటంటే ఎక్కడ పుట్టానో తెలుసు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు ఎలా వెళ్ళాలో తెలుసు చివరికి ఎక్కడ విలీనం అయపోతానో కూడాను నాకు తెలుసు కాబట్టి అంత కాన్షియస్ గానే జరుగుతున్నది నాకు కు నా తత్వం అంతా కాన్షియస్ గానే
(27:56) జరుగుతున్నది నా తత్వం అంతా కాన్షియస్ గానే ఉంది. కాబట్టి అందుకే ఆపాదితనం [గొంతు సవరించుకోవడం] తమ్ముడు అని అందండి అది ఎందుకంటే గొప్ప ఉదాహరణ ఏమనా ఉంటుందా చెప్పండి అంటే ఈ కర్మ అనేది దేవుడు రాసిన శిక్ష కాదండోయ్ ప్రతి క్షణం కూడాను అవగాహన లేకుండా జీవించినప్పుడు మనలో మనమే రాసుకుంటున్న ఒక ప్రోగ్రాం అది అంతే అదే మనల్ని నడిపిస్తూ ఉంటుంది.
(28:23) అందుకనే కర్మ అనేది బయట జరిగేది కాదండి లోపల గడ్డ కట్టుకునేది బూరు కట్టుకునేది అన్నమాట అయితే చివరగా జ్ఞాని అజ్ఞాని ఇద్దరు పని చేస్తారండి కానీ అజ్ఞాని తన గతానికి స్పందిస్తాడు జ్ఞాని తన అంతర్గత చైతన్యం నుంచి స్పందిస్తాడు. అలాగే అజ్ఞాని అలవాట్లతో జీవిస్తాడు. ఎప్పుడైతే ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉంటాడో అదఒక అలవాటుగా మారుతుందని అనుకున్నాం కదండీ కాబట్టి అజ్ఞాని అలవాట్లతో జీవిస్తాడు జ్ఞాని అవగాహనతో జీవిస్తాడండి జ్ఞాని యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే ఇది
(29:07) అహంకారం నుంచి ఆత్మకు చేసే ప్రయాణం లాగా ఉంటుందండి ఒక్కటండి ఇది చాలా ముఖ్యమైన విషయం చాలా ముఖ్యమైన విషయం మీరందరూ పట్టుకుంటారు నాకు తెలుసు నేను కూడా చాలా జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు సంఘటన జరిగిన క్షణానికి మీరు స్పందించే క్షణానికి మధ్య ఒక విరామం ఉంటుందిగా ఆ విరామంలోనే మీ స్వేచ్ఛ ఉంటుందండి. ఆ స్వేచ్ఛతో గనుక స్పందించినట్లయితే అదే యోగం అవుతుంది.
(29:45) అలవాటుతో స్పందించామ అనుకోండి అలవాటు మళ్ళీ మూలం ఏంటి రియాక్షన్స్ కదా ప్రతిదానికి మనం ప్రతిస్పందించడం ఇక్కడ సో అలవాటుతో గనుక స్పందిస్తే అది కర్మ బంధం అవుతుంది దాన్ని ఇందాక మనం అనుకున్నాం కదా కార్మిక బాండేది అని ఇక్కడ విక్టర్ ఫ్రాంకల్ అని ఒక తత్వవేత్త ఉన్నాడండి ఆయన కూడా ఇదే అంటాడు స్టిములస్ కి రెస్పాన్స్ కి మధ్య ఒక స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ లో మన ఫ్రీడమ ఉంటుంది.
(30:17) అది మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. ఒక్కటే ఒక మాట అండి ఎవరఏ చెప్పినా మళ్ళీ అది భారతీయ తత్వశాస్త్రమే అంతకంటే ఏమి కాదండి నేను ఒక మాట అన్నాను కదా స్పందించే క్షణానికి అంటే సంఘటన జరిగిన క్షణానికి స్పందించే క్షణానికి ఒక చిన్న గ్యాప్ ఉంటుందని ఇందా కారు ఉదాహరణ దగ్గరికి వెళ్దాంండి ఆక్సిడెంట్ దగ్గరికి వెళ్దాం సంఘటన జరిగింది ఇక ఈయన స్పందించాలి ఆయన ఏం చేశడు కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు.
(30:53) ఇక్కడ కోపాపాలకి పోయి ఉపయోగం [గొంతు సవరించుకోవడం] లేదు అసలు ఏం జరిగిందో చూసుకుందాం మన వల్ల ఏమన్నా అయితుందేమో చూసుకుందాం అని చెప్పేసి ఆయన అందరినీ కన్విన్స్ చేసి చేయవలసింది జరగవలసింది చూసాడా లేదా ప్రశాంతంగా చూశడు అంటే అక్కడ స్వేచ్ఛ ఉందండి కదా ఇప్పుడు మీకు బాగా అర్థమయ ఉంటుంది. కాబట్టి ఆ స్వేచ్ఛను గనుక మనం జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే కర్మ బంధంలో ఇరుక్కోండి కర్మ బంధంలో ఇరుక్కోమ అన్నమాట ఇదే ఒక విధంగా చెప్పాలి అంటే మోక్షానికి దారి అండి అంతకంటే ఏం కాదు సో ఇదండి ఈ వీడియోలోని సంగతి అయితే ఈ వీడియోని ఇలా సింపుల్ గా ఒకసారి వినేస్తే సరిపోదండి ఓ పూట గాని రెండు మూడు గంటలు
(31:32) గాని గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక్కసారి స్లోగా వినండి మీరు ఒక అద్భుతమైన విషయాన్ని పట్టుకునే వాళ్ళు అయతారండి ఇది ఆధ్యాత్మికతలో ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట అందుకనే నేను ధైర్యం చేస్తున్నానని మొట్టమొదటిగా చెప్పాను. సో ఇంకోసారి వినండి వినండి అంతే ఎవ్వరూ తెలుసుకోలేని ఎవరికీ తెలియని విషయం మనకు తెలిసినట్టు అవుతుంది అన్నమాట మనకు తెలిసినట్టు అయతుంది.
(31:58) సో ఇదండి విషయం నా వీడియో గనుక నచ్చితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మందికి షేర్ చేయండి. నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ ఇంటి పేరు పోడూరి YouTube లోకి వెళ్లి ఎంఆర్ యు టిహెచ్ ఐ స్పేస్ హచ్ కఐ ఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓ ఆర్ యు ఆర్ నా పేరు వస్తుందండి. లైక్ బటన్ బెల్ ఐకాన్ మీరు ఎటు నొక్కుతారో నాకు తెలుసు.
(32:24) చిన్న అభ్యర్థన ఏంటంటే మీకు ఎన్ని అనుమానాలైనా రానివ్వండి. మీరు హాయిగా మెసేజ్లో పెట్టండి. లేదు మీ ఇష్టం వచ్చిన రీతిలో తప్ప ఒప్పా అన్నది కూడాను మీరు మెసేజ్లో పెట్టండి బాగుందంటే బాగుందని పెట్టండి. సో మీరు పెట్టిన మెసేజ్ ద్వారా నేను నేర్చుకుంటూనే ఉన్నానండి కొన్ని మెసేజ్లు ఎలా పెట్టారంటే నా మీద అభిమానంతో ఆ మెసేజ్లు చూసి నేను మళ్ళీ కొంత వివరిస్తూ ఒకటి రెండు వీడియోలు చేయాల్సి వచ్చిందండి చేశాను కూడా సో ఇదండీ వీడియో సంగతి నమస్కారం
No comments:
Post a Comment