*పంచపాపాల దోషనివృత్తికి పంచ యజ్ఞాలు (మార్గాలు) తెలపండి?*_
శరీరం, మనస్సు, ఆత్మల కలయికయే మానవత్వం. వేదాంత పరి భాషలో చేయుట, తలచుట, ఉండుట అంటారు. సేవచేసేది దేహం, తలం చేది మనస్సు, ఎల్లప్పుడు ఉండేదిఆత్మ, శరీరం నిరంతరం కర్మలను ఆచరిస్తూ ఉంటుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాసలు శరీరం ప్రధానకర్మలు. కర్మలను ఆధారం చేసుకునేది దేహం. మనం ఎంతమంచిగా ప్రవర్తించినా మనకు తెలియకుండానే ఐదుదోషాలు కలుగుతాయి.
1. దైవయజ్ఞం
2. పితృయజ్ఞం
3. వేదపఠనము (స్వాధ్యా యము)
4. భూతయజ్ఞం
5. అతిథి యజ్ఞం.
1. దైవయజ్ఞం అనగా భగవత్ చింతన, ప్రార్ధన, పూజ, శ్రవణం, కీర్తనంమొదలగునవి.
2. పితృయజ్ఞం అనగా దేహమునిచ్చి పెంచిన తల్లి దండ్రులను, వారు జీవించి ఉన్నంతవరకు, వారికి ఏ బాధ రానీయకుండా సేవలు చేయుట, మరణించిన తర్వాత పితృదేవతా కార్యాలు నిర్వహించడం.
3. వేదపఠనము అనగా వేదములలోగల మంత్రాలలో ముఖ్యమైనది గాయత్రీ మహా మంత్రము మరియు మహామృత్యుంజయమంత్ర జపము లేక పురుష సూక్తము, సద్గ్రంధ పఠనం.
4. భూత యజ్ఞం అనగా కాకులకు, పిచ్చుకలకు, ఆవులకు, కుక్కలకు నీవు తినేముందు ఆహారము పెట్టడం.
5. అతిథి యజ్ఞం అనగా ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు, భిక్షకులకు అన్నం పెట్టడం.
No comments:
Post a Comment