Thursday, September 3, 2026

👉"నిజమైన శాంతి ఎక్కడ ఉంది? | Astavakra Geeta Part 2 | SSR on Truth | అష్టావక్ర గీత"

👉"నిజమైన శాంతి ఎక్కడ ఉంది? | Astavakra Geeta Part 2 | SSR on Truth | అష్టావక్ర గీత"

Author Name:ssr on truth

Youtube Channel Url:https://www.youtube.com/@ssrontruth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CybkMCqMVd0



Transcript:
(00:02) అష్టావక్రగీత పార్ట్ట శాంతి విరక్తి పీస్ అండ్ డిటాచ్మెంట్ గత భాగంలో అష్టావక్ర మహర్షి జనక మహారాజుకి నిజమైనటువంటి జ్ఞానం అంటే నేను శరీరం కాదు నేను సాక్షిని అని చెప్పారు. ఇప్పుడు జనకుడు ఆ జ్ఞానం విని శాంతిని పొందాడు. కానీ శాంతి ఎలా నిలబడాలి విరక్తి అంటే ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి అంశం అష్టావక్రగీత రెండవ బోధ శాంతి మరియు విరక్తి జనక మహారాజు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు గురుదేవా నేను ఆత్మజ్ఞానాన్ని గ్రహించాను కానీ నా మనసు లోక విషయాల్లోకి మళ్ళీ తిరిగి వెళుతుంది ఈ
(00:48) చంచల మనసుకు శాంతి ఎలా కలుగుతుంది అని అడిగాడు. అప్పుడు అస్తవక్ర మహర్షి చిరునవ్వు చిందిస్తూ ఈ విధంగా అంటున్నాడు. ఓ రాజా శాంతి అంటే మనసును ఆపడం కాదు మనసు లోపల ఉన్న మాయని గుర్తించడం అని చెప్పాడు. మళ్ళీ అస్తవక్రుడు ఈ విధంగా చెప్తాడు. నువ్వు ఏదైనా వస్తువులో వ్యక్తిలో పరిస్థితిలో ఆనందం వెతుకుతూ ఉంటే నువ్వు బంధంలో ఉన్నావని అర్థం చేసుకో అంటున్నాడు.
(01:14) ఆనందం ఎక్కడో లేదు నీ స్వరూపంలోనే ఉంది అంటున్నాడు. అంటే నీ స్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకుంటే చాలు అందులోనే నిజమైనటువంటి ఆనందం ఉంది. బయట విషయాల్లో వెతికితే నువ్వు ఎప్పటికీ నిజమైనటువంటి ఆనందాన్ని పొందలేవు. ఎందుకనింటే నిజమైన స్థితి నీ ఆనంద స్వరూపం నీ చైతన్య స్వరూపం నీ సాక్షి భావనతోనే జాగృతం అవుతుంది. విరక్తి డిటాచ్మెంట్ అంటే లోకం వదిలి పెట్టడం కాదు లోకంలో ఉన్న అనుబంధం లేకుండా ఉండడం అని చెప్తున్నాం.
(01:48) అంటే ఏ వస్తువు పట్ల వ్యామోహం లేకుండా నిష్కామ కర్మ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్లో భోజనం చేస్తున్నారు అనుకోండి ఆ హోటల్ లో భోన్ చేసేటప్పుడు ఒకరోజు అనిపిస్తుంది ఇదేంది ఇక్కడ వరస్ట్ గా ఉంది ఫుడ్ ఇంకో దగ్గర చేసేటప్పుడు ఇక్కడ అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే మీరు అద్భుతంగా ఉంది అని చెప్తున్నారో అప్పుడు వెంటనే మీ మైండ్ రిజిస్టర్ చేసింది.
(02:11) మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళాలి బోన్ చేయాలంటే అది 10 కిలోమీటర్ల దూరం ఉన్నా 100 కిలోమీటర్ల దూరం ఉన్నా మీరు అక్కడికి వెళ్లి తినాల్సి వస్తది. రిజిస్టర్ చేయలేదు మీరు చెప్పలేదు మీ మైండ్ కి సాక్షి భావంతో జస్ట్ ఫుడ్ తిన్నట్టే తిన్నారు ఆస్వాదించారు అంతే వచ్చేశారు. ఇప్పుడు మీరు ఫ్రీ అయిపోయారు. మీరు ఎక్కడనా బోన్ చేయొచ్చు. అలా కాకుండా రిజిస్టర్ చేస్తే మీరు 30 km దాటి ఆ హోటల్ లో తింటేనే తృప్తి మీకు.
(02:34) ఇంకెక్కడ మీరు తినలేరు. సో మనల్ని మనం బంధించడం, లిబరేట్ చేయడం రెండు విషయాలు ఉన్నాయి. సో మీ మనసుని మీరు మీ ఆలోచనలతో బంధిస్తున్నారా లిబరేట్ చేస్తున్నారా అది మీ చేతిలో ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ గా ఈ విధంగా చెప్తున్నాడు పద్మ పుష్పం నీటిలో పుడుతుంది కానీ నీరు దానికి తడవదు అంటే బురదలో ఉన్నటువంటి లోటస్ ఫ్లవర్ బురదని అంటి పెట్టుకోకుండా ఎలాగైతే ఉంటుందో బురద ఉన్నప్పటికీ అంటే బురద అంటే ఇక్కడ ఆలోచనలు కావచ్చు ప్రాపంచిక విషయాలు కావచ్చు ఉంటుంది అది కానీ నీ యొక్క స్థితి మార్చకుండా చూసుకోవాలి తప్ప ఆలోచనలని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకూడదు అలాగే
(03:09) జ్ఞాని లోకంలో ఉంటాడు కానీ లోకం అతనిలో ఉండదు ఎంత అద్భుతమైనటువంటి వాక్యం చూడండి జ్ఞాని లోకంలో ఉంటాడు కానీ లోకం అతనిలో ఉండదు. అంటే ప్రాపంచిక విషయాల్ని నువ్వు రిజిస్టర్ చేసుకొని వాటిని తీసుకొచ్చి లోపల పెట్టుకొని దాన్ని ఆలోచిస్తూ ఇది నాకు కావాలి ఇది నాకు వద్దు ఇది నాకు మంచి ఇది నాకు చెడు వీళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇటువంటి రిజిస్టర్ చేసేటువంటి భావనలు నిన్ను నువ్వు బంధించుకునేటువంటి ఆలోచనలు ఉన్నాయి నువ్వు చేసేటువంటి వాటిల్లో నిన్ను నువ్వు లిబరేట్ చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయి.
(03:43) నువ్వు నిజంగా లిబరేట్ చేస్తున్నావా బంధిస్తున్నావా అనేటువంటిది ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నీ సాక్షి భావన ఉండడం వల్ల జస్ట్ నువ్వు తింటావు బయటిక వస్తావ్ నీ సాక్షి భావన లేకపోతే వాటిలో ఇరుక్కుంటావు విముక్తుడు సుఖం దుఃఖం రెండిటిని సమానంగా చూస్తాడు అని అర్థం అంటే జ్ఞాని యొక్క దృష్టి స్థితి అలా ఉంటుంది.
(04:07) మనకు విరక్తి అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు. లోకం వదిలిపోవడం కాదు విరక్తి అంటే మనసులో ఇది నాది అనే భావన పోయిన స్థితి మనసు ఏమనుకుంటుందో చూడు. అది కూడా నీలో ఉత్పన్నం అవుతుంది. నువ్వు దానికి సాక్షివి అంతే ఎవరైనా నిన్ను నిందించినా ప్రశంసించినా నీ ఆత్మ స్థితి మారదు అది తెలుసుకున్నప్పుడు నిజమైనటువంటి శాంతి వస్తుంది. అని చెప్తున్నాడు.
(04:33) అప్పుడు జనకుడు ఈ విధంగా చెప్తాడు గురుదేవా నేను రాజ్యం మధ్య ఉన్నా ఇప్పుడు లోపల ఎటువంటి అలజడి లేదు నా మనసు సముద్రం లాంటిది అలలు వస్తున్నాయి కానీ లోపల ప్రశాంతంగా ఉంది అంటే ఆ స్థితిని అర్థం చేసుకున్నాడు. ఇక్కడ చూడండి సముద్రం అంటే నువ్వు ఏంటో అర్థం చేసుకోవడం అక్కడ నిశ్చలమైనటువంటి స్థితి అది ఇక్కడ ఆలోచనలు అంటే అలలు అంటే ఇప్పుడు తనకి జ్ఞానోదయం అయిన తర్వాత కూడా అలలు ఉన్నాయి కానీ దాని మీద ప్రభావం చూపించట్లేదు అని అర్థం ఓ రాజా ఇదే నిజమైనటువంటి రాజ్యం నిన్ను జయించుకున్నటువంటి రాజు కంటే గొప్పవాడు లేడు ఇది నీలోని సత్యాన్ని గుర్తించడం
(05:15) అన్నమాట అదే అష్టావక్ర గీత యొక్క రెండవ బోధ శాంతి అనేటువంటిది బయట కాదు విరక్తి అనేటువంటిది పారిపోవడం కాదు. ఈ ప్రపంచంలో ఉన్నా మనసులో స్థిరంగా ఉండడం అదే మోక్షం వైపు మొదటి అడుగు. ఇదే అష్టావక్ర గీత యొక్క రెండవ భాగం శాంతి మరియు విరక్తి గురించి. తర్వాత భాగంలో అష్టావక్రుడు జనక మహారాజుకు జ్ఞాని లక్షణాల గురించి అద్భుతంగా బోధ చేస్తారు.
(05:42) మిస్ అవ్వకుండా ఎస్.ఎస్.ఆర్ ఆన్ ట్రూత్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఓం

No comments:

Post a Comment