Thursday, September 3, 2026

INVITATION TO LOVE BY MAHAVTAR BABAJI // ALLABAKSHU.

INVITATION TO LOVE BY MAHAVTAR BABAJI // ALLABAKSHU.

Author Name:BLUE PYRAMID MEDITATION CHANNEL

Youtube Channel Url:https://www.youtube.com/@bluepyramidtv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JdSKH0I6riU



Transcript:
(00:00) వసంత మేడం గారు మనకి ఈరోజు చిన్న వర్క్ ఉంది మేడం గారికి అందుకని ఈరోజు సెషన్ నేను కొనసాగిస్తాను. ఓకే లైవ్ మేడం అందరినీ ఆఫ్ చేసేయండి రాజు మేడం కోహోస్ట్ ఇస్తున్నాను కోహోస్ట్ ఓకే రైట్ సో వెల్కమ్ సార్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి అందరినీ మ్యూట్ చేశాను మీరు అన్మ్యూట్ చేసుకోండి ఓకే రైట్ ఓకే సార్ థాంక్యూ సార్ ఓకే రైట్ మేమ బ్లూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సగర్వంగా సమర్పిస్తున్నటువంటి స్వాధ్యాయ కార్యక్రమంలోనికి మనందరికీ స్వాగతం సో మనం గత ఏడు ఎపిసోడ్స్ గా మనం ప్రేమకు ఆహ్వానం అనే
(00:48) బాబాజీ గారి దివ్య సందేశాల గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాము. సో వసంత మేడం గారు ఎంతో చక్కగా మనకి వివరించారు స్వాధ్యాయం చేశారు. సో ఈరోజు వారికి వర్క్ ఉండడం వల్ల ఈరోజు సెషన్ నేను తీసుకుంటున్నాను. ఆ మనకి 55వ సందేశం నుంచి మనం ప్రారంభించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ పుస్తకం అనేది ఇట్స్ నాట్ ఏ బుక్ అది మీరు అర్థం చేసుకోవాలి ఇంకొకటి రేపు మనకి నిన్న మన జూమ్ లో మాట్లాడారు కదా దేవిక మేడం గారు రేపు దేవిక మేడం గారు కూడా ఈ పుస్తకానికి స ఇది పుస్తకం మాత్రమే కాదు ఇదొక శక్తి అండి ఇదొక ఎనర్జీ ప్యాకెట్ అన్నమాట ఇది ఒక చైతన్య శక్తి తరంగము ఇది
(01:31) ఇదొక పుస్తకం పుస్తకం కాదు సో ఈ చైతన్య శక్తులతో తనకున్నటువంటి అనుబంధాన్ని రేపు మనకి దేవిక మేడం గారు కూడా స్పెషల్ సెషన్ సేమ్ ఇదే టైం కి దేవిక మేడం గారిది ఉంటుంది దేవిక మేడం గారు దీన్ని వివరిస్తారు తర్వాత ఎల్లుండి నుంచి మళ్ళీ వసంత మేడం గారు దీన్ని కొనసాగిస్తారు. ఒక ఎనర్జీ ఇన్పుట్స్ అండి ఇవన్నీ కూడా ప్రేమకు ఆహ్వానం బాబాజీ యొక్క సందేశాలు ఇవన్నీ ఒక ఎనర్జీ ఇన్పుట్స్ దీన్ని ఒక నార్మల్ ఒక సందేశాలా గానో లేదా ఆ టెలిపీ గానో లేకపోతే మనం సాధారణ ఆ క్లియర్ వాయిన్స్ గానో లేదా ఒక ఆటోమేటిక్ రైటింగ్ గానే మనం చూడకూడదు ఆటోమేటిక్ రైటింగ్స్
(02:13) అనే మనకి బాగా తెలుసు సేత్ కూడా మనకి ఇలాగే వచ్చారు కదా సేత్ విజ్ఞానం కూడా ఎలా వచ్చింది జీన్ రాబర్ట్స్ గారిద్వారా ద్వారా ఆటోమేటిక్ రైటింగ్ ద్వారానే ఆ సే విజ్ఞానం అది మనకు అందుబాటులోకి వచ్చింది. దానికి దీనికి ఉన్నటువంటి మౌలికమైనటువంటి విభిన్నత ఏంటి అంటే ఇది అసలు డైరెక్ట్ గా ప్రతి పదంలోనూ అక్కడ సేతం చేశారో అంతా వివరించుకుంటూ వస్తారు ఆయన ఇక్కడ బాబాజీ గారు ప్రతి పదంలో కూడా అండి ప్రతి పదంలో కూడా శక్తిని చైతన్యాన్ని జ్ఞానాన్ని ప్రజ్ఞని కూర్చి ప్రేమతో మనకు అందిస్తారు అందుకే దీని పేరే ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు అంటే ఇక్కడ
(02:56) ఉన్నవారందరం కూడా జ్ఞానోదయం పొందిన వారమే ఈ పుస్తక స్వాధ్యాయం మనం ఎవరమైతే చేస్తున్నామో అందరం కూడా జ్ఞానోదయం పొందిన వారమే దీని స్వాధ్యాయం మనం చేయగలం మనందరికీ బాబాజీ గారు అందించినటువంటి జ్ఞాపికలు 108 జ్ఞాపికలు సందేశాలు ఇవి ఒక ఎనర్జీ ఇన్పుట్స్ మాత్రం ఒక కాన్షియస్నెస్ తో ఎనర్జీతో కూడుకున్నటువంటి ఇన్పుట్స్ ప్రతి పదంలో కూడా ఒక స్పెషల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది.
(03:27) నేను ఈ పుస్తకాన్ని రమా మేడం వా పుష్ప మేడం గారు మనం వివరించి ఉంటారు రమా మేడం గారి ఇంట్లో నేను చూసేటప్పుడు నేను చదివింది టూ పేజెస్ అండ్ త్రీ పేజెస్ కానీ ప్రతి పదంలో నాకు ఒక ఎనర్జీ కనిపించింది. ఏంటి ఇంత ఎనర్జీ ఇన్పుట్స్ ఉన్నటువంటిది అని చెప్పి దీని మీద మనం వర్క్వుట్ చేయడం జరిగింది. సో అలా ఎనర్జీ వన్ వర్క్ ఇన్పుట్స్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దివ్య గ్రంథం మన దేవిక మేడం గారి దగ్గర కూడా ఈ బుక్స్ అందుబాటులో ఉన్నాయి రీసెంట్ గా థర్డ్ ప్రింట్ వేయించారు.
(03:55) అందుబాటులో ఉన్నాయి సో బుక్స్ అందరి దగ్గర ఉంచుకోండి మాస్టర్స్ ఈ బుక్స్ మాత్రం రైట్ సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే 55వ సందేశాన్ని మనం ఇక్కడ దాన్ని మనం ఆలకిస్తున్నాము దాన్ని మనం పటిస్తున్నాము అంటే అంటే బాబాజీ గారికి ఇవాన్నే మేడం గారికి మధ్య జరిగినటువంటి ఒకానొక ఆత్మ చైతన్య పూరితమైనటువంటి ప్రేమ సందేశాలను ఒక థాట్ పర్సన్ గా మనం ఇక్కడ ఆలకిస్తున్నాం కానీ థర్డ్ పర్సన్ గా కాదు డైరెక్ట్ గానే ఆలకిస్తక్క ఇది ఈ పుస్తకం యొక్క గొప్పతనం అన్నమాట డైరెక్ట్ గానే బాబాజీ గారు ఎవరైతే వక్తగా ఉంటారో వారి ద్వారా అందిస్తూ ఉంటారు.
(04:36) సో చూడండి ఆత్మ ఆసనాలు ఇక్కడ ఆత్మ ఆసనాలు అనేటువంటి టాపిక్ నుంచి మనం మనం ప్రారంభిస్తాము. నిజంగా నిన్న వసంత మేడం గారు అభ్యాసం టు సాధన. మనకి ఇక్కడ ఎన్ని అభ్యాసాలు ఉన్నాయి? అభ్యాసం వన్ సమాయత్తం అవ్వండి అభ్యాసం రెండు సాధన అభ్యాసం మూడు ఇది ఆత్మ ఆసనాలు తర్వాత మనకి అభ్యాసం నాలుగు ఉంటుంది శక్తిని విశ్రామాన్ని పూర్ణం చేయాలి అనేది అభ్యాసం నాలుగు సో నాలుగు అభ్యాసాలతో కూడుకొని ఉన్నటువంటి దివ్య చైతన్య గ్రంథం ఇది దాంట్లో రెండు అభ్యాసాలు పూర్తి చేసుకున్నాం మూడవ అభ్యాసమైనటువంటి ఆత్మ ఆసనాలు నేను మొదలు పెడతాను వసంత మేమ గారు దీన్ని పూర్తి
(05:19) చేస్తారు రైట్ చూడండి ఆత్మాసనాల్లో సందేశం అందరిని నిస్వార్థ విధానంలో సేవించండి నా బిడ్డగా ఈ ప్రియతమ ప్రపంచానికి ఇప్పుడు మీ అందరి నుంచి ఇది అవసరం ఏ రూపంలోనైనా మరియు ఏ మార్గంలోనైనా ఇతరులకు సాధ్యమైనటువంటి అన్ని విధాలుగాను సహకరించండి ఆనందాన్ని ఎంచుకోవడానికి అంతరంగంలోని జ్ఞానోదయాన్ని జాగృత పరచడానికి కి దివ్య జీవితాన్ని ఎంచుకోవడానికి బ్రహ్మానందంగా ఉండడానికి ఆచరించండి మరి ప్రతిరోజు ఆ కరుణ యొక్క యాదృచ్చికమైన చర్యగా పరిణమించండి
(06:02) గురువు యొక్క వాస్తవ స్వభావం ఇదే శ్రీ బాబాజీ బాబాజీ గారి యొక్క ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే సేవ సేవ గురించి వారు ఇక్కడ మనకి బోధిస్తున్నారు అందరిని నిస్వార్ధ విధానంలో సేవించమంటున్నారు అన్కండిషన్ షనల్గా వారికి సేవ చేస్తే నాకేం వస్తుంది వారికి సేవ చేస్తే నాకేదో వస్తుందేమో ఈవెన్ సేవ చేస్తున్నప్పుడు మాస్టర్ సేవ చేస్తే పుణ్యం వస్తుంది అని కూడా అనుకోకు అది కూడా స్వార్థమే అవుతుంది సేవ చేస్తే స్వర్గానికి వెళ్తానేమో సేవ చేస్తే కర్మ తీరిపోతుందేమో సేవ చేస్తే ఇంకేదైనా పుణ్యం దక్కుతుంది వద్దు నిస్వార్థంగా ఏది రావాలో అది వస్తుంది ఏది పోవాలో అది పోతుంది అది
(06:46) ప్రకృతి విశ్వం దానంతర అదిగా చూసుకుంటుంది. మనం చేయవలసిందల్లా నిస్వార్థ విధానంలో సేవించడం అందుకే నా బిడ్డ ఈ ప్రియతమ ప్రపంచానికి మీ అందరి నుంచి ఇది అవసరం మీ అందరి ఇప్పుడు ఎవరెవరైతే జ్ఞానోదయం పొందిన వారు ఉన్నారో ఇక్కడ బాబాజీ గారు చెప్పేది జ్ఞానోదయం పొందిన వారికి ఇక్కడ ఎవరైతే జ్ఞానోదయం పొందిన వారు ఉన్నారో ఈ జ్ఞానోదయం పొందిన వారి నుంచి ప్రపంచానికి అందవలసినటువంటి ముఖ్యమైన సందేశం ఏంటంటే నిస్వార్ధ సేవ మీ అందరి నుంచి ఇది అవసరం జ్ఞానోదయం పొందినటువంటి మీ అందరి నుంచి నిస్వార్థ సేవ ఈ ప్రపంచానికి అవసరం అది ఏ రూపంలో అయినా కావచ్చు ఏ మార్గంలో అయినా కావచ్చు
(07:33) మీరు మానవాళకి నిస్వార్థపరమైన సేవను ఏ రూపంలో అయినా అందించండి ఏ మార్గంలో అయినా అందించండి ఇతరులకు సాధ్యమైన అన్ని విధాలుగా సహకరించండి. వారికి ఎన్ని విధాలుగా మీరు సహాయం చేయగలరో వారికి ఎన్ని విధాలుగా మీరు సేవ చేయగలరో అన్ని విధాలుగా సేవ చేయండి అది కూడా ఏమీ ఆశించకుండా నిస్వార్థమైనటువంటి సేవ చేయండి. ఒకానొక ఆనందాన్ని పంచుకోండి ఆనందాన్ని పంచుకోవడానికి సేవ చేసినప్పుడల్లా మీలో ఎంత ఆనందం అయితే ఉంటుందో ఇతరులతో అంటే ఇక్కడ ఇతరులో ఇక్కడ రెండో వారు అంటే ఎవరు లేరు ఉన్నదంతా వేరే అని ఉద్దేశం ఇక్కడ సో ఇతరులతో మీ ఆనందాన్ని పంచుకోవడానికి
(08:18) మీ అంతరంగంలోని జ్ఞానోదయం జరిగింది కదా ఆ జ్ఞానోదయాన్ని జాగృత పరుచుకోవడానికి ఆనందాన్ని పంచుకోవడానికి అంతరంగంలోని జ్ఞానోదయాన్ని జాగృత పరుచుకోవడానికి మీకు కలిగినటువంటి జ్ఞానోదయాన్ని మీ తత్వమసి అని ఏదైతే అనుకుంటున్నారో అందరితో పంచుకోవడానికి వారిలో కూడా జాగృత పరచడానికి దివ్యమైన జీవితం ఎంచుకోవడానికి బ్రహ్మాండంగా ఉండడానికి మీరు ఒక నిస్వార్ధ సేవలో కనుక మీరు ఉంటే వీటన్నింటి మీరు ఉంటారు ఆనందంతో ఉంటారు ఆనందాన్ని ఎంచుకుంటారు మీ అంతరంగంలోని జ్ఞానోదయాన్ని జాగృత పరుచుకుంటారు ఒక దివ్యమైనటువంటి జీవితాన్ని ఎంచుకుంటారు మీరు ఒక
(09:04) బ్రహ్మానందంగా ఉంటారు ఆచరించండి నిస్వార్థ సేవని ఆచరించండి మీరందరూ కూడా ఇది ఎలా ఉండాలంటే అది కరుణతో కూడుకొని ఉండాలి. ప్రేమ కరుణల యొక్క మిశ్రమంగా ఉండాలి అది ఒక సహజమైన యాదృచ్చిక చర్యలా ఉండాలి అది ఏదో చేయాలి అని కాదు అది జరిగిపోవాలి మీ కరుణతో కూడినటువంటి నిస్వార్థ సేవ జరిగిపోవాలి నిజం చెప్పాలంటే గురువు యొక్క వాస్తవకమైన స్వభావం అదే గురువు యొక్క స్వభావమే నిస్వార్ధపరమైనటువంటి సేవ కరుణతో కూడింది సో ఇప్పుడు మనం 55వ సందేశంలోకి వెళ్తున్నాం అర్హులు యోగ్యులైన వారు ఎవరు యోగ్యులైన వారు ఎవరు అర్హులు సెప్టెంబర్ 20వ తారీకు
(09:51) 2004వ సంవత్సరంలో ఉదయం 4గ:4 నిమిషాలు 4లుగుగంట 44 నిమిషాలు చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి ఫోర్ ఇది ప్రేమకు సింబల్ అనాహత చక్రానికి సింబల్ ఒక డివైన్ లవ్ యొక్క మెసేజెస్ మనక ఎప్పుడు 444 ఆ సమయంలో అందుతూ ఉంటాయి అది యాదృచ్చికం కాదు కాదు అది విశ్వం చేసేటువంటి ఒకానొక మ్యాజిక్ సో 55వ సందేశం అనైక్యమైన మనసు ఇక్కడ స్వామి వివేకానంద గారి యొక్క ఆ కొటేషన్ ఎప్పుడైతే ఇవా డెల్లాఫ్లోర్ అక్కడ రాస్తుంది తను రాసినటువంటి సందేశాన్నే మళ్ళీ చదువుతున్నారు ఇక్కడ బాబాజీ గారు అక్కడ స్వామి వివేకానంద గారి దివ్య సందేశం
(10:38) ఏంటంటే ఆమె తను రాసుకున్నది ఏమిటి అంటే అక్కడ అనైక్యమైన మనసు మనసు వివేకము నుంచి ఎంతో దూరంలో ఉంది అది ధ్యానం ఎలా చేయగలదు అది శాంతంగా ఎలా ఉండగలదు మీకు శాంతి గురించి తెలియనప్పుడు మీరు ఆనందాన్ని ఎలా తెలుసుకోగలరు మీరు మీ మనసుని ఇంద్రియాల పిలుపుని అనుసరించడానికి అనుమతిస్తే పడవను సముద్రంపై దాని నిర్దేశిత మార్గం నుంచి తుఫాను దూరంగా తీసుకుని పోయినట్లు అవి మీ మెరుగైన వివేకాన్ని దూరంగా తీసుకుపోతాయి ఇది స్వామి వివేకానంద గారి కొటేషన్ అంటే ఏంటంటే నీ మనసు చపలచిత్తంగా ఉంది.
(11:19) మనసులో ఆలోచనలు చాలా ఉన్నాయి నీ మనసు ఆత్మతో ఐక్యం కాలేకపోతుంది. నీ మనసు వివేకంతో ఐక్యం కాలేకపోతుంది ఆత్మని మనం వివేకంగా ఆత్మ లక్షణాలలో వివేకం ఒక లక్షణం మాస్టర్స్ సో మీ మనసు వివేకంతో ఐక్యం కాలేకపోతుంది. అనైక్యంగా ఉంది ఎంతో దూరంలో ఉంది అలాంటి సందర్భంలో ధ్యానం ఎలా చేయగలదు మీ మనసు మనసు ధ్యానం చేయాలంటే వివేకానికి దగ్గరగా ఉండాలి.
(11:52) అది శాంతంగా ఎలా ఉండగలదు మీకు శాంతి గురించే తెలియదు మీరు ఆనందాన్ని ఎలా అందుకోగలరు మీ మనసు ఎంతసేపటికి కూడా మీ ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి ఆ పిలుపునే అనుమతిస్తుంది. అలాంటప్పుడు మీరు ప్రశాంతంగా ధ్యానం చేయలేరు. ఎలాగైతే ఒక పడవ సముద్రంలో ప్రయా చేస్తున్నప్పుడు తుఫాన్ వచ్చి ఏం చేసింది ఆ పడవని దూరంగా తీసుకొని వెళ్ళింది. అందుకని మీ ఇంద్రియాలు మీ మెరుగైనటువంటి వివేకాన్ని దూరంగా తీసుకొని వెళ్తాయి కాబట్టి మీ ఇంద్రియాలు మీ లోపలికి ఎలాంటి సమాచారాన్ని తీసుకొని వెళ్తున్నాయో జాగ్రత్త అని స్వామి వివేకానంద గారు బోధించారు అది ఇక్కడ బాబాజీ గారు
(12:32) చెప్తున్నారు చూడండి అమెనాయ అని అలా పిలుస్తారు కదా ఎంపిక చేసిన ఈ వాక్యాలు నేను ఇష్టపడుతున్నాను. ఇది ఇవాన్న డెలాఫ్లో రాసినటువంటి వాక్యాలు దాన్ని చూసి ఆయన చాలా ఇష్టపడ్డారు ఆ బాబాజీ గారు అని చెప్తున్నారు. అమెనాయ్ నువ్వు ఎంపిక చేసినటువంటి వాక్యాలను నేను ఇష్టపడుతున్నాను. వివేకానందుడు ఒక గొప్ప దార్శనికుడు వివేకానందుడు గొప్ప దార్శనికుడు తనకి సత్య దర్శనం తనకి జరిగింది తనకి ఆత్మ దర్శనం జరిగింది తనకి జ్ఞాన దర్శనం జరిగింది వివేకానందుడు గొప్ప దార్శనికుడు అతను ప్రస్తుత క్షణంలో జీవించాడు తను ఎప్పుడు గతం వైపు వెళ్ళలేదు తాను ఎప్పుడు
(13:19) ఇంద్రియాలతో మమేకమై ఉండలేడు తాను ఎప్పుడు తను ప్రస్తుత క్షణంలో జీవించాడు మరియు తన సద్గురువైనటువంటి రామకృష్ణుడి పట్ల అతను ఘనమైన ప్రేమను కలిగి ఉండేవారు. మాస్టర్స్ అందరం కూడా హాయిగా కళ్ళు మూసుకుందాం పుస్తకాలు ఉన్నవారు బుక్ ఓపెన్ చేయండి బుక్కు లేని వారు హాయిగా ధ్యానంలో కూర్చొని బాబాజీ గారి ద్వారా అందించబడుతున్నటువంటి దివ్య సందేశాలను దివ్య జ్ఞాపికలను చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో ఒక ఫోకస్ లాగా మీ లోపలికి అనుమతించండి కానీ కళ్ళు మూసుకోండి కళ్ళు తెరిచి తెరిచి ఉంచితే కళ్ళు అనబడేటువంటి ఇంద్రియాలు మరొక ఆలోచన వైపు మిమ్మల్ని తీసుకొని వెళ్ ఉంటాయి సో కళ్ళు
(14:01) మూసివేయండి చేతి వేళ్ళలో చేతి వేళ్లు పెట్టుకోండి కాళ్ళు రెండు క్రాస్ చేయండి దృష్టంతా మీ ఆత్మ మీద ఉంచండి మహావతార్ బాబాజీ గారు అందిస్తున్నటువంటి సందేశాలను ఆ ప్రేమపూర్వక మాధుర్యాన్ని అనుభూతి చెందండి. శుభోదయం బిడ్డ కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నావా ఆలకించండి సరిపోతుంది. నువ్వు ప్రేరితమై ఉండడాన్ని నేను చూస్తున్నాను. నీ కుమారుడి కథను రాయడానికి మరియు దాని ద్వారా స్వస్థతను కలిగించే శక్తిని ప్రకంపించడానికి ఇది ఒక అత్యంత మంచి సమయం అది ఎందరో ఎందరో ప్రజలకు సహాయపడుతుంది.
(14:47) వారి తల్లిదండ్రులు నువ్వు ఆ సందేశాన్ని అందించడానికై పిల్లలు నిరీక్షిస్తున్నారు. నువ్వు సృష్టిస్తున్న చిన్న ద్వారాన్ని మరి ప్రపంచాన్ని పంచుకోవడానికి నువ్వు ఎంపిక చేయబడినటువంటి ఈ దివ్య సామ్రాజ్యాన్ని నేను వ్యక్తిగతంగా ఆశీర్వదిస్తున్నాను. నా ఆశీర్వచనాలు మరి శ్వేత సహోదర వర్గం యొక్క ఆశీర్వచనాలు స్వీకరించు ఇప్పుడు మనం కొనసాగిద్దాం.
(15:17) అర్హులు యోగ్యులైన వారు జ్ఞానోదయం పొందినవారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారు ప్రేమకు యోగ్యత గలవారే అని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ప్రతివారు అంతర్గత దైవాన్ని అనుభవించడానికి సహనము మరియు పునీత సమయాల యోగ్యత కలవారే నిరంతర వికాసం యొక్క జాగురుకతయే ఆధ్యాత్మికత యొక్క అత్యున్నత స్థాయి మరి వినమ్రత దానితో పెంపొందుతుంది అని మీరు ఎప్పటికీ విస్మరించకూడదు ఏదైతే ఇవా డెలాఫ్ లో ఇప్పుడు రాయబోతున్నటువంటి సందేశం అనేది ఒకానొక స్వస్థతకు సంబంధించింది. తన కుమారుడి కోసం
(16:03) తాను అది అందుకుంది అది రాస్తుంది కానీ ఎంతో మంది చిన్న పిల్లలు ఆ దివ్య సామ్రాజ్యపు వారసులు ఈ సందేశం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ సందేశాన్ని బాబాజీ గారు కూడా ఇక్కడ వ్యక్తిగతంగా ఆశీర్వదిస్తున్నారు. బాబాజీ గారు మాత్రమే కాదండి శ్వేత సహోదర వర్గం ఏదైతే మనం వైట్ బ్రదర్హుడ్ గా చెప్పుకున్నామో ఆ శ్వేత సహోదర వర్గం వైట్ బ్రదర్హుడ్ పరమ గురు మండలి వారు కూడా దీన్ని ఆ దివ్య సామ్రాజ్యాన్ని ఇస్తు ఆ దివ్య సామ్రాజ్యాన్ని ఆశీర్వచనాలు ఇస్తున్నారు ఆశీర్వచనాలు స్వీకరించు అని చెప్పి ఇవాన్నే మమ్ గారికి బాబాజీ గారు అందిస్తున్నారు ఇప్పుడు మనం కొనసాగిద్దాం
(16:44) అని చెప్పి అర్హులు యోగ్యులైనవారు జ్ఞానోదయం పొందినవారు అర్హులు ఎవరు అంటే యోగ్యులైన వారే అర్హులు యోగ్యులైన వారు ఎవరు అంటే జ్ఞానోదయం పొందినవారు జ్ఞానోదయం పొందడం అంటే తాము ఆత్మ స్వరూపాలమే అని అర్థం చేసుకున్నవారు తాము ఆత్మలమే అన్నటువంటి వివేకంతో ఉండేవారు వారు ప్రతి ఒక్కరు ప్రేమకు అర్హులే ప్రేమకు యోగ్యత గలవారే అందుకని అందరూ కూడా ప్రతి ఒక్కరు తమలో ఉన్నటువంటి అంతర్గత దైవాన్ని అనుభవించడానికి అర్హత కలిగి ఉన్నవారే ఇక్కడ అర్హత లేనివారు అంటూ ఎవరూ లేరు అందరూ అరునవారే అందుకే ఆధ్యాత్మిక యొక్క అత్యున్నత స్థాయి ఏందంటే నిరంతర వికాసం ఎప్పటికప్పుడు మనం
(17:33) వికాసం చెందుతూనే ఉండాలి ఎప్పటికప్పుడు మనం జాగృతం అవుతూనే ఉండాలి. అది కేవలం వినయము వినమ్రతతోనే కొనసాగుతుంది ఇది మీరు విస్మరించకూడదు అని 55వ సందేశంలో బాబాజీ అందిస్తారు. చాలా పెద్దగా ఉంటుందండి 55వ సందేశం ఇది నాకు అందించబడడం కూడా ఓకే విత్ బ్లెస్సింగ్స్ తోనే అందించబడి ఉంటుంది ఈరోజు బాగుంటుంది చూడండి అవును బిడ్డలారా మీరు ఎంత ఎక్కువ ఎరుకతో ఉంటే బోధన ద్వారా అంత నేను ఒకసారి మొత్తం నేను చదువుతాను మాస్టర్ చదివిన తర్వాత మళ్ళీ నేను దీన్ని వివరిస్తాను కూడా సో హాయిగా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని ప్రశాంతమైన
(18:18) ైనటువంటి స్థితిలో బాబాజీ గారి యొక్క బాబాజీ గారి యొక్క ఆ రూపురేఖలని బాబాజీ గారి యొక్క సాకార రూపాన్ని లేదా బాబాజీ గారి యొక్క నిరాకార రూపాన్ని స్మరించుకోండి వారి శక్తి చైతన్యాలతో మనం ఇక్కడ లీనమైపోయి ఉన్నాము ఒక్కటే అనుకోండి మాస్టర్స్ దివ్య సంకల్పము దివ్య ఆలోచన నేను మహా అవతార్ బాబాజీ గారి యొక్క శక్తి చైతన్యాలతో ప్రేమతో అనుసంధించబడ్డాం ప్రేమతో అనుసంధానించబడ్డాం తథాస్తు తధాస్తు తధాస్తు జస్ట్ ఆలకించు అవును బిడ్డలారా మీరు ఎంత ఎక్కువ ఎరుకతో
(19:04) ఉంటే బోధన ద్వారా అంత ఎక్కువ వినమ్రత ప్రకాశిస్తుంది బోధన నుంచి గుర్తింపు సంభవిస్తుంది. మరి బోధకుడి యొక్క పాత్ర ద్వారా ప్రవహించేది మరియు బహిరంగమయ్యేది అంతా పరిశుద్ధమైనటువంటి ప్రాణ మరియు ప్రేమ పరిశుద్ధమైనటువంటి జీవశక్తి మరియు దైవిక ప్రేమ ఇక బోధకత యొక్క ప్రయాణంలో లేదా స్వయాన్ని తెలుసుకునే ప్రయాణంలో ఉన్న అందరూ దిగువ ఉన్నటువంటి లక్షణాలను వారి మనసు శరీరము మరియు ఆత్మల లోపల అభ్యసించాలి మరియు పూర్ణం చేయాలి ఒకటి అహంకార లేని రెండు అహింస
(19:49) మూడు ఓర్పు నాలుగు సరళత ఐదు నిష్కలంకమైనటువంటి ఆధ్యాత్మికత ఆరు పరిశుభ్రత ఏడు నిశ్చలత ఎనిమిది ఆత్మ నిగ్రహం తొమ్మిది ఇంద్రియాలకు యాజమాన్యం 10 ఆధ్యాత్మిక అహం రాహిత్యంప 11 అందరిలోనూ మంచి గుణాన్ని చూడడం 12 మృత్యువు జీవితం మరియు అనారోగ్యం గురించిన గ్రహణను మార్చుకోవడం 13 సమభావం 14 ఏకాంతాన్ని ఆస్వాదించండి 15 కోరిక నుంచి నిస్సంగం 16 ఆత్మ సిద్ధికై ఆత్మ సిద్ధిపై కేంద్రీకరించండి
(20:35) 17 సంపూర్ణ సత్యాన్ని అభ్యసించండి 18 దైవం కోసం నిర్మలభక్తి ఈ 18 ఈ 18 లక్షణాలను ప్రతి ఒక్కరు కూడా అభ్యసించాలి ఈ 18 లక్షణాలను వారి లోపల పూర్ణం చేయాలి కేవలం శరీరం లోపల మాత్రమే కాదు ఆత్మ శరీరం లోపల మనసు లోపల ఆత్మ లోపల ఈ మూడింటిలో కూడా అభ్యసించాలి మరి పూర్ణం చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క లక్షణం గురించి మనం విడివిడిగా మనం తెలుసుకుందాం మిత్రులారా అహంకార లేని ఒకటి అహంకార లేని అహంకారం నిరుపయోగమైనది అని మీకు తెలుసు
(21:21) మనకు అహంకారం అవసరం లేదు ఈ గ్రహానికి నా బిడ్డ అహంకారం అవసరం లేదు మరింత ప్రేమ అవసరం అంతే అహంకారం లేదు రెండు అహింస నేను దాన్ని ఎన్నో సార్లు చెప్పాను హింస అనేది వద్దే వద్దు సాధుత్వం తప్పనిసరి మానవ జీవితము అంతటిని మరియు అన్ని జీవించి ఉన్న జీవులను గౌరవించండి అన్నింటిని గౌరవించి మూడవది ఓర్పు సందేశాన్ని అవగాహన చేసుకోలేదని కుటుంబ సభ్యులు లేదా మీడియా లేదా శిష్యుల పట్ల నా బిడ్డలు నిరాశ పడడాన్ని నేను చూస్తున్నాను.
(22:03) దయచేసి బిడ్డలారా నేను బాబాజీ ఈ గ్రహంపై మీకన్నా ఎక్కువ కాలం జీవిస్తూ ఉన్నాను అని ఊహించుకోండి ఓర్పు నా లక్షణాలలో ఒకటి కాకపోయి ఉంటే బాబాజీ గారు ఏమయ్యేవారు నాలుగు సరళత ఇప్పుడు చక్కనిది ఉంది ఇక్కడ మీరందరూ సరళమైనటువంటి విధానాల గురించి మాట్లాడుతారు మరియు అన్వేషకుడికి అన్ని కఠినమైనవే సృష్టిస్తారు మీరు మీ ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముతారు ఒక కార్పొరేట్ లీడర్ గా మీ ఇమేజ్ని సృష్టించుకుంటారు.
(22:40) మీరు బోధనను మనసు వద్దకు మల్లిస్తారు దానిని సరళంగా ఉంచండి పంచుకోండి మరియు సందేశమై ఉండండి నీతిగా పరమానందంగా జీవించండి మరి ప్రేమే సమస్తం అనే సరళమైన సత్యాన్ని ఎంచుకోండి ఐ నిష్కలంకమైన ఆధ్యాత్మికత పిల్లలుగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికతని వృద్ధి చేయండి మరి పోషణను ఇవ్వండి గ్రంథాలు మరి జ్ఞానాన్ని ప్రోగు చేసుకోవడం ద్వారా కాదు కానీ ప్రశాంతమైన వివేకం గల జీవితం జీవించండి మరియు అందరికీ సేవ చేయడం
(23:26) ద్వారా మంచి పేరు కలిగి ఉండండి ఇతర బోధకులతో సంబ సంబంధంతో ఉండండి నిష్కలమైన ఆధ్యాత్మిక బోధకుడిగా సేవించండి ఆ పరిశుద్ధత ఇవన్నీ కూడా మీ శరీరము మనసు ఆత్మలో మీరు అభ్యసించాల్సినటువంటి పూర్ణం చేసుకోవాల్సినటువంటి లక్షణాలు కారు పరిశుభ్రత భౌతిక ఆధ్యాత్మిక మరియు మానసిక స్థాయిలలో వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమైనది శరీరం మీరు కాదు అనేటువంటి ఆధ్యాత్మిక విశ్వాసాల వలన ఎన్నడూ మీ రూపాన్ని అలక్ష్యం చేయమాకండి ఈ శరీరం ఒక ఆలయం
(24:13) దాని పట్ల శ్రద్ధ వహించండి ఈ మనసు ఉపయోగకరమైనది దానిని నెగిటివ్ ఆలోచన నుంచి శుభ్రం చేయండి మరియు దానిని ఆనందమైన వాటితో వర్షించండి. శుద్ధి చేయబడినప్పుడు భావోద్వేగాలు ఎంతో సమతుల్యత పొందుతాయి మరియు హార్మోన్లు సమతులనమయ్యేందుకు అవి సహకరిస్తాయి. ఏడవ లక్షణం నిశ్చలత మీలో దానిని బోధించేవారు దానిని జీవించండి మీరు దానిని వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చండి మీరు దానిని చెప్పినట్లయితే దానిని చేయండి మీరు చేస్తే చేయడంలో నిశ్చలమై ఉండండి మరియు మీరు ప్రత్యక్షం చేసుకోవడానికి
(24:59) ఎంచుకున్న జ్ఞానోదయంతో అవిధంగా ఉండండి అతి సరళమైనది చలక ఎనిమిది ఆత్మ నిగ్రహం ఆత్మ నిగ్రహం మనసుపై స్వారి చేసేవారిగా ఉండడం గుర్తుంచుకోండి అవును మీరు జ్ఞానం పొందిన వారైనా కూడా మీరు సాక్షి అని మీ వాస్తవం యొక్క సృష్టికర్త అని అన్ని వేళలా ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండండి భావోద్వేగాలు ఆలోచనలు మరియు హార్మోన్ల ద్వారా విషదమైన మీ అంతర్గత వాతావరణాన్ని నిగ్రహించండి తొమ్మిదవ లక్షణం ఇంద్రియాలకు యజమాని అవ్వండి
(25:43) ఇది స్పష్టంగా ఉంది. అంతరంగంలోని దివ్యత్వాన్ని మహత్తరమైన గౌరవంతో నిరంతరంగా ఆకర్షించడానికి ఇంద్రియాలని వినియోగించండి. అన్ని ఇంద్రియాలకు యజమాని అవ్వాలి మరియు ఎన్నడూ పరిమితం కాకూడదు. జాగరూకులై ఉండండి వాటికి యజమానులు అవ్వండి 10వ లక్షణం ఆధ్యాత్మిక అహం రాహిత్యం మీ ఆధ్యాత్మిక విజయాల గురించి చెప్పడం మరియు మాట్లాడడం అనేకులను మీరు ఎలా స్వస్థత పరిచారు అందరికీ ఎలా జ్ఞానోదయం కలిగించారు
(26:28) పూర్వీకుల గుప్త రహస్యాలను ఎలా పంచుకున్నారు అవి అవసరమై అవసరమైనదే కాదు పరిమితం చేసేది కూడా నా బిడ్డలారా సరళంగా ఉండండి నియంత్రణ అనేటువంటి భ్రమని అధిగమించండి దానిని అలా ఉండనివ్వండి కేవలం దానిని అలా ఉండనివ్వండి కేవలం దానిని అలాగే ఉండనివ్వండి 11వ లక్షణం అందరిలోనూ మంచి గుణాన్ని చూడడం ఎన్నడూ ఎప్పుడూ దీనిని విస్మరించకండి అంత నెగిటివ్ వ్యక్తి సైతం మీలాగే అదే దివ్యకాంతిలో జన్మించాడు.
(27:13) దీనిని గుర్తుంచుకోండి మరియు తీర్పుల నుంచి స్వతంత్రులు అవ్వండి అందరిలో ఉన్న గుణము దైవ గుణమే మంచి గుణమే ఎంపికలు వేరవుతాయి మరియు గౌరవించబడతాయి కానీ అర్థం మీరు అందరిలోని మంచి గుణాన్ని మరిచిపోవాలని కాదు 12వ లక్షణం మృత్యువు జీవితం మరియు అనారోగ్యం గురించినటువంటి గ్రహణను మార్చుకోవడం జీవితం యొక్క ఈ మూల పదార్థాలను గురించిన వారి గ్రహణను మార్చుకోవడానికి మీరు ప్రతి ఒక్కరికీ సహకరించడం కొనసాగించాలి.
(27:55) మృత్యువు భయపెట్టేది ఏది కాదు లేదా బెదిరిపోవలసినది ఏది కాదు ఎవరైనా జన్మించినప్పుడు జీవితం అనేది ఒక బాధాకరమైన ఘటన కాదు మరియు అనారోగ్యాన్ని స్వస్థత పరచవచ్చు మృత్యువు జీవితం మరియు అనారోగ్యం గురించినటువంటి పరిమితమైన శిక్షణ ఇవ్వబడిన కలుషితమైనటువంటి గ్రహణలను మార్చవలసిన మరియు పోగొట్టవలసినటువంటి బాధ్యత మీకు ఉంది. 13 వ లక్షణం సమభావం ఏమి జరిగినా సరే మంచి సంఘటనలైనా లేదా చెడువైన నిశ్చలంగా కేంద్రీకృతంగా మరియు కరుణ పూర్వకంగా ఉండండి విపరీతాలకు ఊగిసలాడమాకండి
(28:41) సమతుల్యతతో ఉండండి మరియు అనుష్టానాన్ని అభ్యసించండి ఒక విపరీతం నుంచి మరొకదాని వద్దకు నాట్యం చేసే భావోద్వేగ గాలకు అతుక్కొని ఉండకండి మీ పని కొనసాగించండి అందరిని ప్రేమించండి మరియు అందరిని సేవించండి అందరిని ప్రేమించండి మరియు అందరిని సేవించండి 14వ లక్షణం ఏకాంతాన్ని ఆస్వాదించండి. నిశశబ్దమైన ప్రశాంత సమయాల కోసం మీకు మీరు సమయాన్ని ఇచ్చుకోండి.
(29:19) దైవత్వం యొక్క సహచర్యం పై కేంద్రీకరించండి మీకు మీరు ఏకాంత సమయాన్ని అనుమతించుకోండి మీరు ఇప్పటికే అందరిలోనూ దైవాన్ని చూస్తున్నా కూడా మీ సొంత రూపంతో ఉండడానికి ఒక విరామాన్ని కల్పించుకోండి ఈ కల్పించుకోవడం పవిత్రమైనది అది మీలోని దైవం నుంచి మీకు ముఖముఖి పంపకం 15వ లక్షణం కోరిక ఇక నుంచి నిస్సంగం జాగురూకులై ఉండండి కోరుకోవడం మరియు కోరుకోకపోవడం నుంచి వేరుగా ఉండకండి పుష్కలత్వం తనంతట తానే వస్తుంది.
(30:03) దాన్ని నిరాకరించకూడదు లేదా పట్టుకొని వేలాడకూడదు కేవలం స్వీకరించండి. మీరు పని చేస్తూ ఉండండి మీకు అవసరమైన ప్రతిది మీవ సునాయసంగా వస్తుంది ఆ గాలి లాగా 16వ లక్షణం ఆత్మ సిద్ధికై కేంద్రీకరించండి మీరు ఎంత జ్ఞానోదయం పొందిన వారిగా లేదా అధిగమించిన వారిగా అనుభూతి చెందిన గాని మీరు ఇంకా పని చేస్తున్నారు అంతర్గతమైన పని ఎప్పుడు ఆగిపోకూడదు మీరు మీరు వికసించడం ఎన్నడూ ఆగిపోదు ఆత్మ సిద్ధిపై దృష్టి కేంద్రీకరించండి సంపూర్ణమైనటువంటి
(30:48) సత్యాన్ని అభ్యసించండి దీనికి నిశశబ్దం మనసు యొక్క నిశ్చలత్వం మరియు మేలుకొని ఉన్నప్పుడు నిదురిస్తున్నప్పుడు భుజిస్తున్నప్పుడు వస్త్రధారణ చేస్తున్నప్పుడు లేదా ప్రార్థిస్తున్నప్పుడు నిరంతర ధ్యాన అభ్యాసం అవసరం అన్ని సమయాలలోనూ మీరే సత్యమని మరియు సంపూర్ణ దైవిక సత్య పదాలు లేనిదని స్పష్టంగా కనిపిస్తున్నదని మరియు అది ప్రేమ అని ఎరుకతో ఉండండి 18 వ లక్షణం దైవం కోసం నిర్మల భక్తి భక్తే మార్గం సృష్టిని ప్రేమిస్తూ ఉండండి మరియు ప్రియుల నుంచి ప్రేమను పొందడానికి
(31:32) మిమ్మల్ని మీరు అనుమతించుకోండి నమ్మకాలు మరియు సామాజిక భావనలతో ఈ ప్రవాహాన్ని పరిమితం చేయకండి అధిగమించండి మరియు రాధాకృష్ణుల అనుభవంలా అవ్వండి ప్రేమ పట్ల భక్తితో అవ్వండి అదే అంత బాబాజీ బాబాజీ బాబాజీ సో చిన్నగా మీ అరచేతిని కళ్ళ మించి తీయండి మాస్టర్స్ హ్యాపీగా బాబాజీ గారి యొక్క దివ్య సందేశాన్ని వారి యొక్క మాటల్లోనే మనందరం కూడా మనం విందాం.
(32:08) దానికి సంబంధించినటువంటి మనం కొద్ది వివరణ అనేది మనం ఇచ్చుకుందాము ఎందుకంటే చాలా చాలా ఎక్స్ట్రార్డినరీ విషయాలు చెప్పారు. యాక్చువల్ గా ఈ 18 లక్షణాల మీద నా వీడియో కూడా ఉందండి లైట్ వర్కర్స్ లో ఉండొచ్చు అది నేను ఒకసారి చెప్పాను మళ్ళీ ఇదే అవకాశం మళ్ళీ నాకు బాబాజీ గారు కల్పించారు ఈరోజు స్వయాన్ని తెలుసుకునే క్రమంలో మనం ఏ లక్షణాలతో అలంకరించబడాలి సో అందరూ కళ్ళు ఓపెన్ చేయండి ఒక నోట్ బుక్ ఉంటే నోట్ బుక్ దగ్గర పెట్టుకోండి మాస్టర్స్ ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ మీరు నోట్ చేయ మీ నోట్ బుక్ లో మీరు మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్
(32:48) అన్నమాట ఒక నోట్ బుక్ దగ్గర పెట్టుకోండి రైట్ దేని కొరకు ఇది స్వయాన్ని తెలుసుకునే క్రమంలో స్వయాన్ని తెలుసుకునే క్రమంలో మీ మనసుని మీ శరీరాన్ని మీ మనసుని మీ ఆత్మని ఏ లక్షణాలతో నింపుకోవాలో ఏ లక్షణాలతో అలంకరించుకోవాలో ఇక్కడ బాబాజీ గారు ఎంతో చక్కగా అద్భుతంగా మనకు వివరించారు మొదటిది అహంకార లేమి అంటున్నారు ఆయన అహంకార లేనిమి నోట్ చేసుకోండి మాస్టర్స్ ఎప్పుడైతే మీరు రాసుకుంటారో అప్పుడు ఇది మీ మస్తిష్కంలో ప్రింట్ అవుట్ లాగా అయిపోతుంది మీ స్వయంలోకి అలంకరించబడుతుంది అహంకారం లేదు బాబాజీ గారు ఏమంటున్నారంటే ఇక్కడ అసలు అహంకారం అవసరం లేదు అది నిరుపయోగమైనది
(33:35) నీ యొక్క హోదాని చూసి నీ యొక్క సమృద్ధిని చూసి నీ యొక్క విద్యని చూసి నీ యొక్క వ్యాపారాన్ని చూసి లేదా నీకున్న జ్ఞానాన్ని చూసి అయినా సరే నువ్వు అహంకారంలోకి వెళ్ళిపోయావా నువ్వు ఎప్పుడూ కూడా నీ స్వయాన్ని సంపూర్ణంగా తెలుసుకోలేవు కాబట్టి ఇది అహంకారం నిరుపయోగమైనది జ్ఞాన అహంకారం కూడా నిరుపయోగమైనది అందుకనే మనకి అహంకారం అవసరం లేదు బాబాజీ గారు డైరెక్ట్ చెప్తున్నారు అహంకారాన్ని సంపూర్తిగా తీసివేయండి అహంకారం మనకి అవసరం లేదు ఈ భూతలానికి ఈ భూమాతకి ఏది అవసరం అంటే ప్రేమ అవసరం ఈ గ్రహానికి నా బిడ్డ మరింత ప్రేమ అవసరం ఈ భూగృహం మీద అహంకారానికి చోటు లేదు
(34:19) అహంకారాన్ని తొలగించుకోండి ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో జ్ఞానోదయం పొందిన వారికి కూడా మరి సూచనలు ఇస్తున్నారు జ్ఞానంతో కూడా అహంకారం వస్తుంది అలాంటి అహంకారాన్ని తొలగించుకోండి ఈ గ్రహానికి కావాల్సింది మరింత మరింత ప్రేమ మాత్రమే ఆ తర్వాత అహింస నోట్ చేసుకోండి రెండవది అహింస బాబాజీ గారి యొక్క మరొక దివ్య లక్షణం ఏం చెప్తున్నారుఅంటే మనకు అహింసతో ఉండమంటున్నారు హింస వద్దే వద్దు అది ఏ రూపంలో అయినా సరే అది శారీరకమైన హింస అయినా కానీ మానసికమైనటువంటి హింస అయినా కానీ ఆత్మపరమైన ఎలాంటి హింస వద్దు సాధుత్వము తప్పనిసరి మానవుడు అన్నవాడు ఒక సాధు జీవిలాగా జీవించాలి సాధుత్వంతో
(35:05) ఉండాలి కరుణతో ఉండాలి మానవ జీవితం అంతటినీ సాటి మానవుల్ని కూడా గౌరవించాలి సాటి మానవుడి పట్ల కూడా హింస కి తావు లేదు సాతి మానవుడి పట్ల మనం అహింసతో ఉండాలి మరియు జీవించి ఉన్న అన్ని జీవులను గౌరవించండి అంటున్నారు ఇక్కడ జీవులని గౌరవించండి అవి కూడా మీలాగే ఈ భూతల మీద జీవనానికి అర్హత ఉండి జీవిస్తున్నాయి అన్నింటిని గౌరవించండి అన్నింటిని గౌరవించండి అహింసని మీ లక్షణంగా అలంకరించుకోండి ఆ తర్వాత బాబాజీ గారు మనకు అందిస్తున్నటువంటి మరిొక లక్షణం ఓర్పు ఓర్పు చూడండి చాలామందికి ఓర్పు ఉండదు జ్ఞానం అందుకోవడానికి ఉండదు ధ్యానం చేయడానికి కూడా ఓర్పు ఉండదు అని ఇక్కడ
(35:52) బాబాజీ గారు ఏమంటున్నారు అంటే మరి నాకు ఎంత ఓర్పు ఉండాలి 2000 సంవత్సరాల నుంచి నేను ఈ గ్రహం మీద ఈ భూతల మీద ఉన్నాను ఓర్పు అనేదే లేకపోతే బాబాజీ గారు ఈ రోజు నేను మీకు సందేశాన్ని అందించేవాడిని కాదు కదా అంటున్నారు ఎంత ఓర్పు ఉందండి బాబాజీ గారికి 2000 సంవత్సరాల నుంచి మన కోసం ఆయన 2000 దాటిపోయిన కూడా 2000 పై చిలుకు సంవత్సరాల నుంచి కూడా ఆయన మనకోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ మన జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు కదా వచ్చి ఒక్కరికి ఓర్పుతో సందేశాలు అందిస్తూనే ఉన్నారు ఎంత ఓర్పు ఉండాలి ఆయనకి అందుకే ఏమంటున్నారు బాబాజీ గారు చూడండి చమత్కారంగా అంటున్నారు
(36:30) ఓర్పు నా లక్షణాలలో ఒకటి కాకపోయినట్లయితే ఈ బాబాజీని మీరు చూసేవారా అంటున్నారు ఈ బాబాజీ గురించి మీకు తెలిసేదా ఈ బాబాజీ గారి సందేశాలు మీరు వినగలిగేవారా అంటున్నారు సో ఓర్పు అనేది ఖచ్చితంగా మీ యొక్క లక్షణాలలో ఒకానొక లక్షణంగా ఉండాలి. నాలుగవది సరళత ఇది ఎంత ఇప్పుడు చక్కనిది ఉంది అంటున్నారు సరళత ఇది సరళ చాలా చక్కనిది ఇది మీరు విధానాలంతా సరళంగా మాట్లాడుతూ ఉంటారు కానీ సృష్టించేవంతా కాంప్లికేటెడ్ గా మీరు సింప్లిసిటీ గురించి మాట్లాడతారు కానీ మీ సృష్టి అంతా ఈ భూగృహం మీద మానవుడి సృష్టి అంతా కాంప్లికేటెడ్ గానే ఉంది.
(37:12) మీరు సృష్టించిన ఉత్పత్తులు కానీ మీ ధరలు కానీ అన్ని కాంప్లికేటెడ్ గానే ఉన్నాయి మీరు మీకు మీ గురించి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారు చూసారా నేను ఒక కార్పొరేట్ లీడర్ ని నేను ఒక స్పిరిచువల్ మాస్టర్ ని ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైనవి ఇవి మీ సరళతను దెబ్బతీస్తాయి అని చెప్పి అంటున్నారు అందుకని అప్పుడు ఏమవుతుంది అంటే మీరు బోధించేదాన్ని మీ మనసు వైపుగా తీసుకొని వెళ్తారు.
(37:38) మీకు మీరు ఎప్పుడైతే సింప్లిసిటీగా ఉండకుండా సరళంగా ఉండకుండా కాంప్లెక్స్ గా కొన్ని బిరుదులు తగిలించుకుని మ్ ఆ బిరుదులతో మమేకమైపోతే మీరు బోధించేది మీ మన ద్వారా బోధిస్తారు మీ ఆత్మ ద్వారా మీరు బోధించలేరు అందుకే సరళంగా ఉండండి సరళతతో జీవించండి సరళంగా ఉంచండి అందుకే మీ మనసుని చేయాలి మీరు సరళంగా ఉంచండి సింపుల్ బి సింపుల్ సరళంగానే పంచుకోండి మరి సందేశమై ఉండండి నీతిగా ఉండండి పరమానందంగా జీవించండి ప్రేమే సమస్తం ఒక సరళమైన సత్యం ఏం చెప్తున్నారు అంటే బాబీ గారు ప్రేమే సమస్తం ప్రేమే సమస్తమైన సరళమైనటువంటి సత్యంతో జీవించండి మీరు కఠినమైనటువంటి ఇమేజ్లో మీరు
(38:26) కూరుకోపోవద్దు అని చెప్తున్నారు బి సింపుల్ అంటున్నారు ఇక్కడ నెక్స్ట్ ఐదవది చూడు నిష్కలంకమైన ఆధ్యాత్మికత నిష్కలంకమైన ైన ఆధ్యాత్మిక అంటే ఒక పసిపిల్లవాడు కానే మీరు ఉండండి పిల్లలు పిల్లలకి ఆధ్యాత్మికత బోధించండి పిల్లలుగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికతను వృద్ధి చెందనివ్వండి ఎందుకంటే అప్పుడు వారు ఒక నిష్కలంకంగా ఉంటారు ఎలాంటి కళంకమ కుండా మనసులోకి ఎలాంటి బాహ్యమైనటువంటి కళంకాలు లేకుండా ఉంటారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నిష్కలంకమైన ఆజ్ఞత అంటంటే పెద్ద గ్రంధాలు చదవడం కాదు లక్ష గ్రంథాలు కోటి గ్రంథాలు చదవడం కాదు ప్రశాంతమైనటువంటి పైగా ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో
(39:10) జ్ఞానాన్ని పోగు చేసుకోవడం కాదు ఆ జ్ఞానంతో మీ జీవితాన్ని తీర్చి దిద్దుకోండి లక్ష గ్రంథాలు చదివారు ఒక్క గ్రంథం యొక్క జ్ఞానాన్ని కూడా మీ జీవితంలో మీరు తీసుకోలేదు మీది సరిైన ఆధ్యాత్మికత కాదు ప్రశాంతమైన వివేకం గల జీవితం జీవించండి వివేకం అంటే ఏంటి ప్రజ్ఞ వివేకం రెండు పర్యాయ పదాలు మాస్టర్ దాదాపుగా జ్ఞా జ్ఞానాన్ని నాలెడ్జ్ ని జ్ఞానాన్ని వినియోగంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అది వివేక భరితంగా మారి ప్రజ్ఞగా నిక్షిప్తం అవుతుంది.
(39:45) నాలెడ్జ్ అప్లికేషన్ లోకి వచ్చినప్పుడు అది విస్డమ గా మారుతుంది. ఎస్ అందుకని వివేకం ప్రశాంతమైన వివేకవంతమైన జీవితాన్ని జీవించండి మీరు లక్ష కోట్ల గ్రంథాలు చదివి ఒక పండితుడిగా ఉండకూడదు పాండిత్యం వద్దు మీకు పాండిత్యం అవసరం లేదు ఆ వివేకవంతమైన జీవితం కావాలి ప్రశాంతమైన వివేకవంతమైన జీవితం జీవించండి అందరికీ సేవ చేయండి మంచి పేరు కలిగి ఉండండి మంచి పేరు అంటే ఇక్కడ కూడా ఇమేజ్లో భర్తీ కావడం కాదు మీరు జీవించిన జీవితాన్ని చూసి చూసి మీలో ఉన్న జ్ఞానాన్ని మీరు చెప్పకుండానే అవతల వ్యక్తి అర్థం చేసుకోవాలి.
(40:24) అది మంచి పేరు అని ఇతర బోధకులతో సంబంధంతో ఉండండి ఈ ప్రపంచం మీద టీచర్స్ చాలామంది ఉన్నారు కదా టీచర్స్ అందరితో రిలేషన్షిప్ లో ఉండండి సంబంధంతో ఉండండి జ్ఞానాన్ని ప్రజ్ఞని విస్డం ని ఎక్స్చేంజ్ గా చేసుకోండి టీచింగ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండండి అందుకే నిష్కలంకమైన ఆధ్యాత్మిక బోధకుడిగా సేవించండి అంటే కొనసాగండి మీరు ఎప్పుడూ కూడా ఒక నిష్కళంకమై ఎట్లాంటి కళంకం అందకుండా ఒక ఆధ్యాత్మిక బోధకుడిగా ఉండండి వివేకం కలిగి ఉండండి ఇక్కడ ఆ తర్వాత మనకి బోధిస్తున్నటువంటి మరియొక్కది పరిభ్రత పరిశుభ్రత గురించి ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని బాబాజీ గారు మనందరికీ
(41:03) చెప్తున్నారు ఏమంటున్నారు అంటే పరిశుభ్రత అంటే అందరమ మానసిక పరిశుభ్రత ఆధ్యాత్మిక పరిశుభ్రత ఇవన్నీ తర్వాత చూద్దుగా నాయన ముందు భౌతిక పరమైనటువంటి పరిశుభ్రత చూసుకో అంటున్నారు ఆయన వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమైనది అంటున్నారు. ఎందుకంటే చాలా సరే కొన్ని కొన్ని సాధనా పద్ధతులు అవలంబించే సాధకులు ఏం చేస్తారంటే నేను శరీరాన్ని కాదు కాబట్టి నేను శరీరాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి కొన్ని విశ్వాసాలలో ఉండి నిర్లక్ష్యం చేస్తారు వారి శరీరాన్ని వారి రూపాన్ని కానీ శరీరం కాకుండా ఇక్కడ ఎవరూ లేరు ప్రతి ఒక్కరు శరీరాలే కానీ వారు
(41:44) శరీరానికి మాత్రమే పరిమితమై లేరు అంటే నేను శరీరం కాదు కాదు అనుకోవడం కాదు సత్యం అంటే నేను శరీరాన్ని మాత్రమే కాదు మనం మార్నింగ్ అదే చేస్తున్నాం కదా మెడిటేషన్ నేను శరీరాన్ని కాదు అనుకుంటే అది అసత్యము అజ్ఞానము అవిద్య నేను శరీరాన్ని మాత్రమే కాదు అనుకున్నప్పుడు అది సరైనటువంటి జ్ఞానం చాలామంది నేను శరీరాన్ని కాదు అనుకొని శరీరం పట్ల అశ్రద్ధతో నిర్లక్ష్యంతో శరీరానికి కావలసిన పోషణ కూడా ఇవ్వకుండా శరీరాన్ని ఎండబెట్టేసి అది చేసి ఇది సరిైన పోషణ అందించండి అవసరమైనప్పుడు ఉపవాసంతో ఉండండి కానీ అసలు శరీరానికి ఏమి ఇవ్వకుండా దాన్ని పూర్తిగా చేయడం అనేది
(42:28) సరిైన పద్ధతి కాదు అంటున్నారు మహా అవతార్ బాబాజీ గారు తన శరీరాన్నే కాంతిగా మార్చుకున్న గొప్ప వ్యక్తి ఒక చిరంజీవి మనకు చెప్తున్నారు శరీరం పట్ల ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి శరీరం ఒక ఆలయం శరీరం అట్లా ఆలయం కంటే కూడా గొప్పగా ఉంటుంది దాని పట్ల శ్రద్ధ వహించండి శరీరం పట్ల శ్రద్ధ వహించండి శరీరానికి సరిైన పదార్థాలనే ఇవ్వండి సరిగ్గా చూసుకోండి సరిైన పోషణ వ్యక్తిగత పరిశుభ్రతో ఉండండి మరియు మనసుని కూడా ఉపయోగకరమైనది మనసు కూడా నేను మనసుని కాదు అని చెప్పి మనసు నిర్లక్ష్యం చేయడం మనసు చెడ్డది అనుకోవడం సరికాదు మనసు ద్వారా కూడా ఎంతో ఎంతో
(43:09) ఉపయోగకరమైనవి చాలా ఉన్నాయి కానీ ఆ మనసులోకి సరికాని ఆలోచనలు మనం నెగిటివ్ అని పిలుచుకుంటాము దాన్ని మనం సరికాని ఆలోచన అంటాం సరికాని ఆలోచన శుభ్రం చేయండి మీ మనసుని దానిని సరిైనటువంటి ఆలోచనలతో అలంకరించండి అద్భుతమైన పదం కదా మరియు దానిని అందమైన ఆనందమైన వాటితో వర్షించండి మీ మనసులో ఒక వర్షం కురవాలంట ఎలాంటి వర్షం కురవాలి ఆనందకరమైనటువంటి ఆలోచన వర్షం కురవాలి మీ మనసులో అలా మీ మనసులో నుంచి సరికాని ఆలోచనలు తొలగించేసి సరిైన ఆనందకరమైన జ్ఞానపూర్వకమైన ప్రేమపూర్వకమైన ఆలోచన వర్షాన్ని మీ మనసులో కురిపించండి. అప్పుడే మీరు శుద్ధి
(43:53) పొందుతారు సరిైనటువంటి శుద్ధత అప్పుడు వస్తుంది. అలా శుద్ధి చేయబడ్డప్పుడు మీలో ఉంటాయి కొన్ని భావోద్వేగాలు ప్రేమ కరుణ సేవ ఇవన్నీ భావోద్వేగాలు అప్పుడు వచ్చిన కోపం కూడా అందంగానే ఉంటుంది. సో ఆ శుద్ధి చేయబడ్డప్పుడు మీ శరీరము మీ మనసు శుద్ధి చేయబడ్డప్పుడు మీ భావోద్వేగాలు ఎంతో సమతుల్యతతో ఉంటాయి. అప్పుడు మీలో ప్రవహించే మీ జీవ రసాయనాలు అయినటువంటి హార్మోన్స్ కూడా సమతులన చెందుతాయి హార్మోన్స్ బ్యాలెన్సింగ్ గురించి కూడా బాబాజీ గారు చెప్తున్నారు ఇక్కడ హార్మోన్స్ బ్యాలెన్సింగ్ ఎప్పుడు అవుతాయి యాక్చువల్ గా మన శరీరాన్ని మనం ఏమనుకుంటామ అంటే మన అవయవాలు రన్
(44:33) చేస్తున్నాయి అనుకుంటాం కాదు మన శరీరాన్ని నియంత్రించేది మన హార్మోన్స్ మన డైరెక్ట్ గా రక్తంలో కలిసేటువంటి జీవ రసాయనాలు అయినటువంటి మన హార్మోన్స్ హార్మోన్స్ స్రవించేటువంటి హార్మోన్స్ మన ఏడు చక్రాలలో ఏడు గ్రంధులు ఉంటాయి వినాల గ్రంధులు అంటాము ఆ వినాల గ్రంధుల ద్వారా స్రవించేటువంటి జీవ రసాయనాలనే మనం హార్మోన్స్ అంటాము అవి నడిపిస్తాయి మన శరీరాన్ని మరి హార్మోన్స్ ని శాసించేది ఎవరు శరీరాన్ని శాసించేది హార్మోన్స్ అయితే హార్మోన్స్ ని శాసించేది ఎవరు అంటే మీ యొక్క ఉద్వేగాలు శాసిస్తాయి మీ ఎమోషన్స్ శాసిస్తాయి మీ హార్మోన్స్ ని మీ
(45:13) ఎమోషన్స్ అన్బాలెన్సింగ్ అయినప్పుడు మీ హార్మోన్స్ లో అన్బాలెన్సింగ్ వస్తుంది. మరి మీ ఎమోషన్స్ ని ఎవరు శాసిషిస్తారు మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు శాసిస్తాయి. సో ఎప్పుడైతే మీ మనసులో ఆనందకరమైన ఆలోచనలు ఉద్భవిస్తాయో మీ భావోద్వేగాలు సమతుల్యం చెందుతాయి మీ హార్మోన్స్ సమతుల్యం చెందుతాయి అద్భుతమైనటువంటి శారీరక మానసిక ఆరోగ్యం మీకు తోడ్పడుతుంది.
(45:39) రైట్ అది పరిశుభ్రత అంటే తర్వాత నిశ్చలత నిశ్చలత మీలో దాన్ని బోధించేవాడు దాన్ని జీవించండి దాన్ని చెప్పినట్టయితే దాన్ని చేయండి మీరు చేస్తే చేయడంలో నిశ్చలమై ఉండండి మీరు ప్రత్యక్షం చేసుకోవడానికి ఎంచుకున్న జ్ఞానోదయంతో అభివృద్ధంగా ఉండండి ఎస్ నిశ్చలంగా ఉండండి ఫోకస్డ్ స్టేట్ గురించి ఆయన చెప్తున్నారండి ఇక్కడ మీరు ఏదైతే ఒకటి చేయాలి ఒక ధ్యానం చేయాలి ఎస్ నిశ్చలంగా దాని మీదే ఫోకస్ పెట్టి చేయండి ఒక సంకల్పం చేయాలనుకున్నారు ఒక అమరత్వం గురించి సంకల్పం చేయాలనుకున్నారు నిశ్చలంగా దాని మీదే ధ్యాస పెట్టి చేయండి నిశ్చలత అంటే ఫోకస్ కాంటెంప్లేషన్ ఇది సరళమైంది శ్రవణము
(46:26) మననము మూడవది నిధిదధ్యాస ఏదైతే ఉందో ఆ నిధిదధ్యాస గనుక మీరు చేయగలిగితే మీరు నిశ్చలతతో ఉండగలిగిన వారు అవుతారు ఒక వాగ్దానం చేస్తే దాని మీద కూడా నిశ్చలంగా ఉండండి అంటే అటు ఇటు జరగొద్దు ఒక ఆలోచన వచ్చినా ఒక మాట బయటికి వచ్చినా ఒక వర్క్ చేసిన అంటే మీ ఆలోచన కానీ మీ మాట కానీ మీ పని కానీ ఒక నిశ్చలతతో ఉండాలి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక తపస్సు చేసినట్టుగా నిశ్చలంగా ఉండాలి ఆ తరువాత మనకి ఆత్మ నిగ్రహం గురించి బాబాజీ గారు చెప్తున్నారు ఆత్మ నిగ్రహం చాలా అవసరం మనసుతో స్వారీ చేయబడేవారుగా మీరు ఉండవద్దు మీరు మనసు అనేటువంటి గుర్రంపై స్వారీ
(47:10) చేసేవారుగా ఉండండి. ఎస్ మీరు జ్ఞానోదయం పొందిన వారైనా సరే యాక్చువల్ గా ఇదంతా చెప్పింది మనం జ్ఞానోదయం పొందిన వారికి ఆయన చెప్తున్నారు జ్ఞానోదయం పొందడం కోసం కాదు మనందరం జ్ఞానోదయం పొందినవారం అయినా సరే అయినా సరే అంటున్నాడు చూడండి అయినా సరే మీ మనసు జాగ్రత్త మీ మనసుతో మీ మనసుపై స్వారి చేయండి మీరు జ్ఞానోదయం పొందినవారైనా సరే మీరు ఎప్పుడు ఏం గుర్తుపెట్టు మీరు ఒక సాక్షి అని గుర్తుపెట్టుకోండి విట్నెసింగ్ ఆఫ్ మైండ్ తో ఉండండి ఎప్పుడు మీరు ఒక సాక్షిభూతం జరుగుతున్నటువంటి జరిగినటువంటి జరగబోతున్నటువంటి ప్రతి సంఘటనను సాక్షిగా గమనించేటువంటి ఒక
(47:49) అబ్జర్వర్ మీరు అనేది గమనించండి మాస్టర్ ఇప్పుడు క్వాంటం ఫిజిక్స్ మొత్తం అదే చెప్తుంది అబ్సర్వర్ స్టేట్ ఒక అబ్సర్వర్ అని మీరు గమనించండి ఒక సాక్షి అని మీరు గమనించండి అలాగే మీ వాస్తవం యొక్క సృష్టికర్త మీరే అని ఎల్లవేలలా గుర్తుంచుకోండి యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ మీరొక అబ్సర్వర్ మీరొక క్రియేటర్ ఈ రెండు భావాలతో ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు కొనసాగుతూనే ఉండండి అందుకనే మీ అంతర్గతంలో ఏం జరుగుతుందో చూసుకోండి ఒకసారి మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి మీ థాట్స్ ఎలా ఉన్నాయి మీ హార్మోన్స్ ఎలా ప్రవర్తిస్తున్నాయి మీ అంతర్గత శరీర
(48:27) వాతావరణాన్ని గమనించి దాన్ని నిగ్రహించండి దాన్ని నిగ్రహిస్తారు సాక్షిగా ఉండడం ద్వారా నిగ్రహిస్తారు మరియు రెండవది ఏంటి సృష్టించడం ద్వారా నిగ్రహిస్తారు రైట్ అలా ఉండండి ఆత ఆ తర్వాత తొమ్మిదవది ముఖ్యమైనది ఇంద్రియాలకు యజమాని అవ్వండి ఇది స్పష్టంగా చెప్పారు కదా ఇక్కడ ఇంద్రియాలకు యజమాని అవ్వండి మీ ఇంద్రియాలను మీరు ఉపయోగించుకోండి ఇంద్రియాలకు కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఇంద్రియాలు మన మీద యాజమాన్యత్వం వహిస్తున్నాయి యాక్చువల్ గా మన కర్మేంద్రియాలు కొంతవరకు మన మాట వింటాయి కదా నీ చెయ్యి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళుతుంది నీ చెయ్యి ఎలా
(49:09) కావాలంటే అలా ఉంటుంది ంది కదా కానీ నీ కన్ను నీ ముక్కు నీ నోరు నీ చెవి నీ అదుపాజ్ఞల్లో ఉన్నాయా నీ జ్ఞానేంద్రియాలు నీ అదుపాజ్ఞల్లో ఉన్నాయా నీ కన్ను చూడాలి అనుకున్న దాన్నే చూడాలి నీ చెవి వినాలి అనుకున్న దాన్నే వినాలి నీ ముక్కు దేన్ని వాసన చూడాలి అనుకున్న దాన్నే చూడాలి ప్లస్ నీ నోరు ఏది మాట్లాడాలి అనుకుంటే అదే మాట్లాడాలి అలా జరిగినప్పుడే నువ్వు ఇంద్రియాలపై నిగ్రహాన్ని సంపాదించుకున్నవాడివి అవుతావు అందుకే అలా చేసినప్పుడు ఏమ ఏమవుతుందంటే అప్పుడు అంతరంగంలోకి రోజుకి 60,000 ఆలోచనలు ఎందుకు వస్తాయి రోజుకి 100 ఆలోచనలు వస్తే చాలు ఎందుకు
(49:47) వస్తాయి అవన్నీ అంటే నువ్వు చూడకూడనివి చూస్తున్నావు వినకూడనివి వింటున్నావు మాట్లాడకూడనివి మాట్లాడుతున్నావు కాబట్టే ఆలోచించకూడని ఆలోచనలు మీకు వస్తున్నాయి వాటిని నిగ్రహించుకోండి మీ అంతరంగంలో దివ్యత్వాన్ని ఒక మహత్తరమైన గౌరవంతో నిరంతరంగా ఆకర్షించండి దానికి ఉపయోగించండి మీ ఇంద్రియాల్ని జ్ఞానేంద్రియాలు అన్న పేరు పేరులోనే జ్ఞానం ఉంది కదా జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి బాహ్యంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీ అంతరంగంలోకి తీసుకొని రావడం కోసం మీరు సృష్టించుకున్నటువంటి మీ శరీరంలో మీరు నిర్మించుకున్నటువంటి మీ అవయవాలే జ్ఞానేంద్రియాలు కానీ ఆ జ్ఞానేంద్రియాలు
(50:27) అజ్ఞానేంద్రియాలుగా మారిపోతుంది జ్ఞానేంద్రియాలు సరిగ్గా ఉపయోగించుకోండి అంతరంలోకి దివ్యత్వాన్ని తోడుకొని రండి అంతరంగంలోకి ఒక గౌరవంగా దివ్యత్వాన్ని తోడు మీరు అన్ని ఇంద్రియాలకు మీరు యజమాని అవ్వాలి మీరు పరిమితంలో ఉండకూడదు జాగరూకులై ఉండండి జాగృతమై ఉండండి ఇంద్రియాలకు మీరు యజమానిగా ఉండండి రైట్ మాస్టర్స్ ఈ తొమ్మిది మనం ఇప్పుడు తెలుసుకున్నాము మిగతా తొమ్మిది మనం తర్వాత సెషన్ మళ్ళీ దీన్ని మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నేను తీసుకొని నేను వివరిస్తాను సో 55వ సందేశాన్ని మోస్ట్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సందేశంగా మీ అంతరంగంలో భద్రపరుచుకోండి సో మనకి ఇంత
(51:12) అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందుబాటులోకి తీసుకొని వచ్చినటువంటి ముందుగా మహావతర్ బాబాజీ గారికి తర్వాత ఇవాన్ చేయడం ఆత్మపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మనం తెలియజేసుకుంటాం మాస్టర్ సో థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ సో ప్రేమకు ఆహ్వానం రేపు దీవిక మేడం గారి సెషన్ ఉంటుంది ఈ పుస్తకంతో వారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనుబంధము ఈ పుస్తకంలో వారి యొక్క ప్రయాణాన్ని వాళ్ళు రేపు వివరిస్తారు మనకి మళ్ళీ ఇప్పుడుఎఓ క్లాక్ కి మనకి సెషన్ ఉంటుంది లలితా సహస్ర నామాలని మనకి అన్నపూర్ణ మేడం గారు సిద్ధంగా ఉన్నారు వారు 8 ఓ క్లాక్ కి వారు వివరిస్తారు సో థాంక్యూ వెరీ మచ్
(51:52) మాస్టర్స్ మనం మళ్ళీ రేపు కలుద్దాము ను రైట్

No comments:

Post a Comment