Why People Think They Are Always Right? | Ramayana's Answer | LifeOrama Audio Podcast EP06
Author Name:LifeOrama
Youtube Channel Url:https://www.youtube.com/@LifeOramaOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lE-fZAtZqK0
Transcript:
(00:00) తన జీవితంలో ఎప్పుడూ సారీ చెప్పని ఒక వ్యక్తిని ఒకసారి గమనిద్దాం. వాళ్ళు అద్దంలో చూసుకున్నప్పుడు వాళ్ళక ఒక విలన్ కనిపించరు. ఒక హై స్టాండర్డ్ ని కాపాడే ఒక మంచి లీడర్ మాత్రమే ఆ వ్యక్తి చూసుకుంటారు. ఇక్కడే ఒక మెంటల్ ట్రాప్ మొదలవుతుంది. దానికి రామాయణంలో కిష్ కిందను పరిపాలించిన వాలిని ఉద్దేశించి వాలీ సిండ్రోమ్ అనే పేరు పెట్టొచ్చు.
(00:22) ఇందులో నీ స్వార్థం వచ్చేసి నీకు మంచి చెడులు చెప్పే విచక్షణను పూర్తిగా నాశనం చేస్తుంది. నీ దగ్గర ఎప్పుడైతే అవసరమైనంత డబ్బు, సక్సెస్ లేదా అధికారం ఉంటాయో నీ మైండ్ చాలా సైలెంట్ గా ప్రమాదకరంగా మారుతుంది. నువ్వు చేసే పని కరెక్టా కాదా అని నువ్వు అస్సలు ఆలోచించవు. దానికి బదులు ఈ డెసిషన్ తీసుకుంది నేనే కాబట్టి అది ఖచ్చితంగా కరెక్ట్ అని నమ్ముతావు.
(00:46) సక్సెస్ అనేది ఒక నార్మల్ మనిషిని అనుకువుగా ఉంచే ఆ పరిస్థితులకు పూర్తిగా దూరం చేస్తుంది. ఇబ్బందులు అనేవే లేకపోవడంతో నీ ఇగో నేను ఏం చేసినా తప్పులేదు అన్నట్టు ఫీల్ అవ్వడం మొదలు పెడుతుంది. నీ పర్సనల్ కంఫర్ట్ ఒక్కటే ముఖ్యం అని నువ్వు నమ్ముతావు. ఇదేదో కేవలం రామాయణం నుంచి తెలుసుకునే విషయం మాత్రమే కాదు ఇవాళ వాళ్ళకు ఎదురు చెప్పేవారు లేరనుకున్న ప్రతి ఒక్కరికీ కరెక్ట్ గా ఇదే జరుగుతుంది.
(01:13) ఎప్పుడైతే నువ్వు నీ ఊహ కందనంత బలవంతుడు అయిపోతావో నిజం వినబడనంతగా నీ చెవులు మూసుకుపోతాయి. కిష్కింద రాజ్యంలో వాలికున్న ఎదురులేని ఆ ఫిజికల్ పవర్ ని ఒక్కసారి గుర్తు చేసుకో అతను ఎంత బలవంతుడు అంటే నాలుగు దిక్కుల్లో ఉన్న సముద్రాలను అవ్వలీలగా లంగించగలడు. భారి రాక్షసుల శరీరాలను కొండల పై నుంచి విసిరేయగలడు. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన ముందరున్న ఏ ప్రత్యర్థినైనా ఈజీగా తొక్కేయగలడో అతని ఇన్నర్ వరల్డ్ అంటే మనసులో ఏర్పరచుకునే ప్రపంచం మారిపోతుంది.
(01:41) ఆ వ్యక్తి చుట్టూరా ఉన్న మనుషులు జాగ్రత్తగా బతకడం నేర్పిస్తూ ఏదైనా నార్మల్ ఫీడ్బ్యాక్ ఇస్తే అది వాళ్ళు అస్సలు ఎదుర్కోరు. నీ బలాన్ని ఛాలెంజ్ చేసేవాడు లేనప్పుడు నీ డిల్యూజన్ ని బ్రేక్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. ఇవాళ మన ప్రపంచంలో ఈ భారీ శక్తి బ్యాంక్ అకౌంట్ లో ఉండే నంబర్స్ తోనూ ఒక జాబ్ టైటిల్ రూపంలోనో లేదా ఒక ఇంటిని పూర్తిగా కంట్రోల్ చేసే అధికారంలోనో ఉండొచ్చు.
(02:05) వాలికి మల్లే గుడ్డివాడిలా మారడానికి నీ తల మీద ఒక బంగారు కిరీటం ఉండాల్సిన అవసరం లేదు. నీ వాయిస్ ఎప్పుడూ గట్టిగా ఉండి నీ డెసిషన్స్ కి నో చెప్పని ఒక లైఫ్ ఉంటే చాలు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు ఎదురు చెప్పడం ఆపేసిన మరుక్షణమే నీ తప్పులు నువ్వు కరెక్ట్ చేసుకునే ఎబిలిటీ పూర్తిగా పోతుంది.
(02:26) డిల్యూజన్ అనేది నీ మైండ్ లోకి ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వదు. అది కాన్స్టెంట్ కంఫర్ట్ వల్ల చాలా సైలెంట్ గా వచ్చి సెటిల్ అయిపోతుంది. నువ్వు చేసే పనులకు ఎలాంటి చెడు రిజల్ట్స్ రానప్పుడు నీ బ్రెయిన్ లైఫ్ కు ఉండే రూల్స్ ని తనకు నచ్చినట్టు తిరగరాస్తుంది. నువ్వు సాధించే అచీవ్మెంట్స్ ని ఒక లక్ లా కాకుండా నేను మిగతా వాళ్ళ కంటే బెటర్ పర్సన్ అనడానికి అదిఒక ప్రూఫ్ లా చూడటం మొదలు పెడతావు.
(02:49) ఆ లాజిక్ ఒక ట్రాప్ లా మారుతుంది. నేను గెలుస్తున్నాను కాబట్టి నేనే కరెక్ట్ అండ్ నేను కరెక్ట్ కాబట్టే నేను గెలుస్తున్నాను. ఇలా అనిపిస్తుంది. ఈ మెంటల్ లూప్ నువ్వు చేసే ప్రతి పని చుట్టూరా ఒక పెద్ద గోడను కట్టేస్తుంది. నీ స్వార్థాన్ని ఒక పవిత్రమైన మిషన్ లా మార్చేస్తుంది. వాలి తన తమ్ముడిని రాజ్యం నుంచి బహిష్కరించినప్పుడు సుగ్రీవుడు ఆ కోపానికి బలయ్యాడని అతను అస్సలు చూడలేదు.
(03:13) వేటాడాల్సిన ఒక ద్రోహిలా చూశాడు. అతని మైండ్ తన బలాన్ని వాడుకొని నేనే అసలైన విక్టిమ్ ని అనే ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేసుకుంది. దాంతో తను చేస్తున్న క్రూరత్వాన్ని తానే చూడలేకపోయాడు. ఒక హై స్టేజ్ ఆఫ్ ఈగో మన నుండి రియాలిటీని ఎలా దూరం చేస్తుందని తెలియడానికి ఇదే కరెక్ట్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చేయగలిగే అతి పెద్ద ప్రమాదకరమైన పని ఏంటంటే ఒక చెడ్డ అలవాటుకి ఒక మంచి పేరు పెట్టడం పెద్ద పెద్ద ఆఫీసుల్లో లేదా చాలా మంది ఇళ్లల్లో ప్రతిరోజు ఈ పదాలతో ఆడే ఆట మనం చూస్తూనే ఉంటాం.
(03:48) ఒక టాక్సిక్ మేనేజర్ తన టీం కు ఉన్న కాన్ఫిడెన్స్ ని పూర్తిగా నాశనం చేసి వాళ్ళను టార్చర్ పెడుతూ దాన్ని హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం అని అంటాడు. అతిగా కంట్రోల్ చేసే ఒక పేరెంట్ పిల్లల ప్రతి చిన్న నిర్ణయాన్ని లాక్ చేసి వాళ్ళ ఎదుగుదలను తొక్కేస్తూ ఆ టైట్ గ్రిప్ ని మంచి పెంపకం అని పిలుస్తారు. వాళ్ళు ప్రపంచానికి అబద్ధం చెప్పడమే కాదు ఆ అబద్ధాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్ముతారు.
(04:12) ఎగ్జాక్ట్ గా కిష్కిందాధిపతి వాలిలాగే వాళ్ళు తమ స్వార్థాన్ని అండ్ న్యాయాన్ని కలిపి కన్ఫ్యూజ్ అయిపోతారు. నువ్వు ఎప్పుడైతే ఈ రెండిటిని మిక్స్ చేస్తావో నీ మనస్సాక్షి పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. నువ్వు చుట్టూ ఉన్న వాళ్ళకు ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ పెయిన్ ఇస్తూ కూడా రాత్రుళ్లు హ్యాపీగా నిద్రపోగలవు. ఎందుకంటే నువ్వు చేస్తున్నది కరెక్ట్ అనే భ్రమలో నువ్వు ఉన్నావు కాబట్టి చెడ్డవాళ్ళు కావాలనే ఇతరులను హర్ట్ చేస్తారు అనే ఆ ఊరడించే నమ్మకాన్ని ముందు ముక్కలు చేద్దాం.
(04:41) నిజమైన విలన్స్ చాలా రేర్ గా ఉంటారు. కానీ భ్రమ అంటే డిల్యూజన్ అనేది ప్రతి చోట ఉంటుంది. హ్యూమన్ మైండ్ సాకులు వెతకడంలో ఒక ఎక్స్పర్ట్ తానే ఒక విలన్ అనే ఆ బాధాకరమైన ఆలోచనను అది అస్సలు తట్టుకోలేదు. సో ఒక పవర్ఫుల్ పర్సన్ వేరే వాళ్ళకు సంబంధించిన ఒక వస్తువును కోరుకున్నప్పుడు బ్రెయిన్ వెంటనే ఆ కోరికకు తగ్గట్టుగా మోరల్ రూల్స్ ని మార్చేస్తుంది.
(05:03) ఆ దొంగతనాన్ని సమర్ధించుకోవడానికి ఒక పర్ఫెక్ట్ సాకు రాసుకుంటుంది. ఎగ్జాంపుల్ కి నీకు ఒక రాజ్యం కావాలనుకుంటే ఇప్పుడున్న లీడర్ చాలా వీక్ అండ్ అతనికి పరిపాలించడం రావట్లేదు. ఇలా నీకు నువ్వు కథలు చెప్పుకుంటావు. ఇది మనం చాలా మంది పొలిటీషియన్స్ లో చూస్తూనే ఉంటాం. మరొకరి భార్య కావాలనుకునే వ్యక్తి ఆ భర్త ఆమెను ఏమాత్రం పట్టించుకోడు లేదా ఆవిడకు అతను ఏమాత్రం కరెక్ట్ కాదు అని తన మైండ్ లో తనకు తాను చెప్పుకుంటాడు.
(05:30) సరిగ్గా ఆ భార్య ఈ వ్యక్తికి దక్కే టైం కి ఆ క్రైమ్ ఒక న్యాయమైన పని అంటే ఒక మోరల్ యాక్షన్ లాగానే అనిపిస్తుంది. వాలి చేసిన దుర్మార్గాలు ఏదో విలన్ అవ్వాలనే ఉద్దేశంతో చేయలేదు. తన లోపలన్న భారీ ఎమోషనల్ హంగర్ దాటి అతను ఆ నిజాన్ని చూడలేకపోవడం వల్లే ఆ పనులన్నీ చేశాడు. మనం వాలి మైండ్సెట్ ని అమితంగా ప్రేమించే ఒక ప్రపంచంలో బతుకుతున్నాం.
(05:54) మోడర్న్ కల్చర్ నీ గోల్స్ కోసం పుష్ చేయమని నీ స్పేస్ ని తీసుకోమని అండ్ ఎలాంటి ఎక్స్క్యూసెస్ చెప్పకుండా నీకు నచ్చింది సొంతం చేసుకోమని చెప్తుంది. ఆ అగ్రెసివ్ పుష్ ని మనం మెచ్చుకుంటాం. అండ్ చేస్తున్న పనుల్లో తప్పొప్పులు చూసుకుంటూ అనలైజ్ చేసుకునే ఆ కామ్ మైండ్ ఉన్నవాళ్ళను చూసి నవ్వుకుంటాం. కానీ ఈ బలమైన పాటర్న్ నీ క్యారెక్టర్ ని చెక్ చేసుకోవడానికి కావాల్సిన విషయాలు అన్నిటిని నీ నుండి దూరం చేస్తుంది.
(06:19) నీ లైఫ్ అంతా కేవలం బయట గెలవడం గురించే ఉన్నప్పుడు మనసు లోపల క్లియర్ గా నిజాయితీగా నిన్ను నువ్వు చూసుకునే ఎబిలిటీని కోల్పోతావు. కంటికి కనిపించే పనులను మేనేజ్ చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు కానీ నీ సొంత మనసులో ఉన్న కుళ్ళును నువ్వు అస్సలు చూడలేవు. వాలి ప్రపంచంలోని నాలుగు దిక్కులను ఎంతో ఈజీగా జయించగలిగాడు.
(06:41) కానీ తనలో ఉన్న ఆ కోపాన్ని అస్సలు కంట్రోల్ చేయలేకపోయాడు. తన ఎక్స్టర్నల్ అచీవ్మెంట్స్ే అతని ఇన్నర్ జైల్ ని నిర్మించే ఇటుకలుగా మారాయి. నువ్వు బయట ఎంత స్ట్రాంగ్ గా ఎదుగుతావో లోపల నీ క్యారెక్టర్ అంత బలహీనంగా మారిపోతుంది. నన్ను ఎవ్వరు టచ్ చేయలేరు అని నువ్వు అనుకున్నప్పుడు ఎవరైనా ఇచ్చే హనెస్ట్ అడ్వైస్ కూడా ఒక ద్రోహంలా అనిపిస్తుంది.
(07:03) అబ్సల్యూట్ పవర్ సృష్టించే అసలైన ఉచ్చు ఇదే. వాలి రాజ్యసభలో ఇండిపెండెంట్ గా మాట్లాడగలిగే ఒక న్యాయాధికారి లేడు. మనసులో ఉన్న విషయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగే గొంతు లేదు. అండ్ అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా సమాధానాలు చెప్పమని డిమాండ్ చేసే ఒక ఈక్వల్ పర్సన్ కూడా లేడు. అతని మాటే రాజశాసనం అయింది. నీ పనిని ఎవ్వరు ఛాలెంజ్ చేయలేని చోట నువ్వు నీ లైఫ్ ని బిల్డ్ చేసుకున్నప్పుడు నీ చెవులు పొగడ్తలకు ఎడిక్ట్ అయిపోతాయి.
(07:30) అండ్ తప్పులు తెలుసుకోవడం అనే పనికి విపరీతమైన అలర్జీని పెంచుకుంటావు. నువ్వు ఎంత గొప్ప అని చెప్పని ప్రతి గొంతుని నీ మైండ్ వెంటనే ఒక శత్రువు చేసిన దాడిలా చూస్తుంది. నువ్వు విమర్శను అంటే క్రిటిసిజం ని నీ బిహేవియర్ చెక్ చేసుకునే అపర్చునిటీలా చూడవు. దాన్ని తొక్కేయాల్సిన ఒక ఫైట్ లా చూస్తావు. మోడర్న్ మేనేజర్స్, పేరెంట్స్ అండ్ కొంతమంది పాపులర్ కంటెంట్ క్రియేటర్స్ కూడా కరెక్ట్ గా ఇదే ఓబిలో పడిపోతున్నారు.
(07:55) వాళ్ళ చుట్టూరా ఎప్పుడూ తలుపే వాళ్ళనే ఉంచుకుంటూ రియాలిటీకి దూరంగా తమని తాము లాక్ చేసుకుంటున్నారు. మనుషులు మంచి పనులు చేసి ఆ తర్వాత వాటిని చెడ్డ పనులు చేయడానికి ఒక లైసెన్స్ లా ఎలా వాడుకుంటారో ఒకసారి ఆలోచించండి. ఇది ఒక మంచి పని చేయడం వల్ల ఎవరినైనా చెడ్డగా ట్రీట్ చేసే రైట్ నాకు దక్కింది అని ఫీల్ అయినప్పుడు జరుగుతుంది.
(08:18) వాలి తన రాజ్యాన్ని భయంకరమైన రాక్షసుల నుంచి కాపాడాడు. ఒక వారియర్ గా ఒక రూలర్ గా తన డ్యూటీని సాటి లేని ధైర్యంతో చేశాడు. ఆ సక్సెస్ అతనికి కవచంలా మారింది. తను గతంలో చేసిన సేవ వల్ల తన తమ్ముడికి ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అతను బలంగా నమ్మాడు. ఇదే చెడ్డ పాటర్న్ ని మనం ఈరోజు ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం. ఒక వ్యక్తి బాగా కష్టపడతాడు ఇంటికి డబ్బు సంపాదించి పెడతాడు అండ్ ఆ సాక్రిఫైస్ ని వాడుకొని నాలుగు గోడల మధ్య ఎమోషనల్ అబ్యూస్ ని జస్టిఫై చేసుకుంటాడు.
(08:49) నేను నీకోసం ఇదంతా చేశాను కాబట్టి నాకు నీ మీద అరిచే హక్కు ఉంది అని అంటూ దాన్ని లాజిక్ లా డిఫైన్ చేస్తాడు. ఇక్కడ పాత గెలుపులు ప్రెసెంట్ లో చేసే తప్పులను దాచడానికి కవచాల్లా వాడుకుంటారు. ఛాలెంజెస్ లేని లైఫ్ వల్ల వచ్చే వర్స్ట్ పార్ట్ ఏంటంటే అది వేరే వాళ్ళతో ఒక నిజమైన హ్యూమన్ కనెక్షన్ బిల్డ్ చేసుకోకుండా నిన్ను ఆపేస్తుంది. ఇంకొక మనిషితో కనెక్ట్ అవ్వాలంటే నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకునే విల్ పవర్ నీకు ఉండాలి.
(09:15) నీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చిన్నదిగా లోపాలతో నిండి అండ్ హర్ట్ చేసేలా ఉండొచ్చు అనే నిజాన్ని నువ్వు యక్సెప్ట్ చేయాలి. కానీ వాలి సిండ్రోమ్ లో ఇరుక్కుపోయిన ఒక వ్యక్తికి తప్పు ఒప్పుకోవడం అనేది ఏదో చావులా అనిపిస్తుంది. అది వాళ్ళకు ఒక మెంటల్ ఇంపాసిబిలిటీ వాళ్ళు ప్రతి ఒక్క కాన్వర్సేషన్ ని ఒక పవర్ గేమ్ లా చూస్తారు.
(09:35) అక్కడ వెనక్కి తగ్గడం అంటే సర్వస్వాన్ని కోల్పోవడమే అని అనుకుంటారు. తాము క్రియేట్ చేసుకున్న ఆ ఫేక్ మంచితనం లోపల తమని తాము లాక్ చేసుకొని ఇతరులకు తాము ఇస్తున్న బాధని పూర్తిగా ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళు ఒక ఖాళీగా లోన్లీగా ఉన్న ఐలాండ్ కి రాజుల్లా రాణుల్లా బతుకుతారు. వాలి తన పవర్ పీక్స్ లో ఉన్నప్పుడు పూర్తి ఒంటరిగా నిలబడ్డాడు.
(09:57) శత్రువులు అతనికి భయపడ్డారు. అండ్ ఫ్యామిలీ అతన్ని చూసి వణకిపోయింది. అతను ప్రతిదాన్ని జయించాడు. కానీ నేను ఒక తప్పు చేశాను అని మనసులో చెప్పుకునే ఆ సింపుల్ ఎబిలిటీని మాత్రం జయించలేకపోయాడు. ఈ పూర్తి ట్రాజడీ అంతా ఒక చీకటి గుహ లోపల వచ్చిన ఒక చిన్న పానిక్ మూమెంట్ లో మొదలయింది మాయావి అనే ఒక భయంకరమైన రాక్షసుడు అర్ధరాత్రి వేళ వాలిని ఛాలెంజ్ చేయడానికి కిష్ కిందకు వచ్చాడు వాలి యుద్ధం చేయడానికి బయటకు పరిగెడితే అతని తమ్ముడు సుగ్రీవుడు అతని వెంట వెళ్ళాడు.
(10:28) ఆ రాక్షసుడు ఒక డీప్ అండర్ గ్రౌండ్ గుహ లోపలికి పరిగెత్తాడు. వాలి కూడా అతని వెనకే లోపలికి వెళ్తూ సుగ్రీవుడిని ఆ గుహ గుమ్మం దగ్గరే ఎదురు చూడమన్నాడు. ఒక సంవత్సరం పాటు అక్కడ కాపలాగా నిలబడ్డారు. సడన్ గా ఒక రోజు ఆ గుహ నుండి వేడి రక్తం బయటకు రావడం మొదలయింది. దాంతోపాటు రాక్షసుడి గర్జనలు వినపడ్డాయి. సుగ్రీవుడు పానిక్ అయ్యి శక్తివంతమైన తన అన్న ఆ యుద్ధంలో చనిపోయాడని భావించాడు.
(10:53) లోపలికి వెళ్ళిన మాయావి బయటకు వచ్చి రాజ్యాన్ని నాశనం చేయకుండా ఆపడానికి సుగ్రీవుడు ఒక బండరాయితో ఆ గుహను బ్లాక్ చేసి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే సుగ్రీవుడు ఏదో స్వార్థంతో ఆ పని చేయలేదు. ఎక్కడ ఆ రాక్షసులు బయటక వచ్చి కిష్కిందను నాశనం చేస్తారని తన మనసు పూర్తి భయంతో వనికి పోవడం వల్ల అండ్ తన వాళ్ళను కాపాడుకోవాలనే కోరికతోనే ఆ పని చేశాడు.
(11:17) సుగ్రీవుడు ఒంటరిగా తిరిగి వచ్చినప్పుడు రాజ్యం నాయకుడు లేకుండా ఉండకూడదని అక్కడ మంత్రులు పట్టుబట్టారు. వాళ్ళు సుగ్రీవుడి తలపై ఆ కిరీటాన్ని బలవంతంగా పెట్టారు. కానీ ఆ గుహ లోపల వాలి నిజానికి ఆ యుద్ధంలో గెలిచాడు. అతను బయటక వచ్చి ఆ గుహ ద్వారం ఒక బండరాయితో బ్లాక్ చేయబడి ఉండటం చూడగానే అతని మనసు తీసుకోలేకపోయింది. అయినా వాలి కాసేపు ఓపికతో నిలబడి ఆలోచించలేదు.
(11:42) అలాగని ఒక రీజనబుల్ ఎక్స్ప్లనేషన్ కోసం వెతకలేదు. వెంటనే రాజభవనానికి తిరిగివచ్చి తన తమ్ముడు సింహాసనం మీద కూర్చోవడం చూడగానే అతని అహంకారం తారాస్థాయికి చేరుకొని పట్టలేని కోపంతో ఊగిపోయాడు. సుగ్రీవుడు వెంటనే వాలి కాళ్ళ మీద పడి కిరీటాన్ని అతని కాళ్ళ దగ్గర పెట్టి క్షమించమని బతిమాలుతూ చేసిన తప్పుని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాడు.
(12:04) కానీ వాలి మైండ్ ఆల్రెడీ లాక్ అయిపోయింది. కాబట్టి అతను వినడానికి సిద్ధంగా లేడు. తను రాజు కాబట్టి ఆ పవర్ ని దొంగలించడానికి సుగ్రీవుడు కావాలనే నన్ను మోసం చేశాడు అని ఫిక్స్ అయ్యాడు. తన కళ్ళ ముందున్న క్లియర్ ఫాక్ట్స్ ని చూడటానికి అతను అస్సలు ఇష్టపడలేదు. వాలి కోపం చాలా త్వరగా ఒక ఘోరమైన క్రైమ్ లా మారింది. అది మంచితనానికి ఉన్న పవిత్రమైన రూల్స్ ని బ్రేక్ చేసింది.
(12:29) అతను కేవలం తన కిరీటాన్ని మాత్రమే వెనక్కి తీసుకోలేదు. తన తమ్ముడి దగ్గర ఉన్న సర్వస్వాన్ని లాక్కోవడానికి నిర్ణయించుకున్నాడు. వాలి సుగ్రీవుడి భార్య రూమను తన కోసం బలవంతంగా తీసుకున్నాడని వాల్మీకి రామాయణంలో చాలా క్లియర్ గా రాసింది. ఇది చాలా పెద్ద పాపం ఎందుకంటే తమ్ముడి భార్య కూతురితో సమానం. కానీ వాలి ఆ మోరల్ రూల్స్ ని అస్సలు కేర్ చేయలేదు.
(12:52) అతని మైండ్ తనకు అనుకూలమైన ఒక సాకును వెతుక్కుంది. సుగ్రీవుడు ఒక ద్రోహి కాబట్టి అతనికి ఎలాంటి రైట్స్ లేవు అండ్ అతని భార్యను తీసుకోవడం ఒక ఫెర్ పనిష్మెంట్ అని సరిపెట్టుకున్నాడు. పవర్ మైండ్ ని ఎలా పాడు చేస్తుందో కరెక్ట్ గా ఈ సంఘటనే దానికి ఎగ్జాంపుల్. వాలి తన బలాన్ని వాడుకొని తన కామాన్ని అండ్ పగను సాటిస్ఫై చేసుకున్నాడు. అదే టైం కి సభలో అందరికీ తనేదో న్యాయ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు గట్టిగా చెప్పుకున్నాడు.
(13:19) ఒక ఫ్యామిలీ వాల్యూస్ ని ఘోరంగా ఉల్లంఘించే పనిని ఒక రాజశాసనంలా మార్చేశాడు. తన తమ్ముడి భార్యను దొంగలించడంతో తృప్తి పొందకుండా వాలి సుగ్రీవుడ్ని ఒక జంతువును వేటాడినట్టుగా రాజ్యం నుండి తరిమేశాడు. అతన్ని దారుణంగా కొట్టి తనకు చెందినవన్నీ జప్తు చేసుకున్నాడు. సుగ్రీవుడు తన బ్రతుకు కోసం ఆ రాజ్యం అంతటా తిరుగుతూ భయంతో వణకుతూ ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నాడు.
(13:45) చివరికి మతంగ మహర్షి ఇచ్చిన శాపం వల్ల ఋష్యముఖ పర్వతం మీద వాలి అడుగు పెట్టలేడని తెలిసి తన వెంట వచ్చిన వాళ్ళతో కలిసి ఆ కొండ గుహల్లో తలదాచుకున్నాడు. తన తమ్ముడి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసినందుకు వాలి మనసులో ఎలాంటి గిల్ట్ లేదు. అతని మైండ్ లో ఒక ద్రోహిని మట్టుబెట్టిన ఒక ధర్మాత్ముడైన రాజు అతని ఎదురులేని బలం వల్ల నేనే అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ ద ట్రూత్ అని ఫీల్ అయ్యాడు.
(14:11) నువ్వు ఆ ప్రదేశంలోనే అందరికంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ అయినప్పుడు ఎవ్వరితోనూ మాట్లాడాల్సిన పని లేదు. ఎక్స్ప్లనేషన్స్ వినాల్సిన అవసరం లేదు. నువ్వు ఏకంగా అవతలి వ్యక్తిని తొక్కేస్తావు. అండ్ వాళ్ళకు తగిన శాస్తి జరిగిందని నీకు నువ్వు చెప్పుకుంటావు. అసలు ఆ రాజభవనంలో ఎవ్వరు కూడా ఆ పిచ్చితనాన్ని ఎందుకు ఆపలేదు ఎందుకంటే వాలి సభ పూర్తిగా నిశ్శబ్దంతో నిండిపోయింది.
(14:33) అక్కడున్న మంత్రులు సలహాదారులు అండ్ పురోహితులు రాజు పూర్తి కోపంతో ప్రవర్తిస్తూ బేసిక్ మోరల్ రూల్స్ ని బ్రేక్ చేయడం చూశారు. వాళ్ళకు సుగ్రీవుడు అమాయకుడని తెలుసు. అండ్ రూమను తీసుకోవడం తప్పని కూడా తెలుసు. కానీ వాలి తనకు ఎదురు తిరిగిన ఎవరినైనా ఒక్క దెబ్బతో ముక్కలు చేయగలడన్న విషయం కూడా వాళ్ళకు బాగా తెలుసు.
(14:54) భయం ఆ పూర్తి ప్రభుత్వాన్ని సైలెంట్ సపోర్టర్స్ లా మార్చేసింది. వాళ్ళు సైలెంట్ గా ఉంటూ తలుపుతూ ఆ రాజు కోపాన్ని వాలిడేట్ చేశారు. ఆ సైలెన్స్ వాళ్ళకున్న ఆ నమ్మకాన్ని ఇంకా పెంచింది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు నిజం చెప్పడానికి భయపడుతున్నప్పుడు నువ్వు నీ వర్స్ట్ బిహేవియర్ తో చాలా పర్ఫెక్ట్ గా నార్మల్ గా కనిపించే ఒక ఫేక్ వరల్డ్ లో బతుకుతావు.
(15:16) వాలి మంత్రులు అతని కోపం ఎలాంటిదో అతనికే చెప్పడానికి ప్రయత్నించకుండా అతని క్యారెక్టర్ కి పెద్ద ద్రోహం చేశారు. ఇక అసురుల రాజైన రావణుడితో కలిసిన సంఘటన తర్వాత రా ఫిజికల్ పవర్ మీద ఉన్న వాలి నమ్మకం అసలు ఏమాత్రం బ్రేక్ చేయలేనంత బలంగా మారింది. రావణుడు అతన్ని ఛాలెంజ్ చేయడానికి వచ్చినప్పుడు వాలి అతన్ని అమాంతంగా పట్టుకొని ఒక పనికి రాని బొమ్మల తన చంకలో గట్టిగా లాక్ చేసుకున్నాడు.
(15:42) ఆ తర్వాత ప్రపంచంలోని నాలుగు సముద్రాల మీదగా తన సంధ్యావందనం పూర్తి చేయడానికి ఎగురుతూ వెళ్ళాడు. లోకంలోనే అందరూ భయపడే ఆ రావణున్ని ఏమాత్రం కష్టం లేకుండా తన చంకలో మోస్తూ లంగించాడు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు రావణుడు వాలి బలాన్ని చూసి ఎంత ఆశ్చర్య పోయాడ అంటే తనతో సంధి చేసుకొని ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండాలని అడిగాడు.
(16:04) వాళ్ళు ఒక పవిత్రమైన నిప్పును వెలిగించి తమ సంపదను సైన్యాన్ని పెంచుకోవడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఆ మూమెంట్ ఇచ్చిన సైకలాజికల్ ఇంపాక్ట్ మీద ఫోకస్ చేద్దాం. భూమిపై అత్యంత దుర్బుద్ధి కలిగిన క్రూరుడైన వ్యక్తి నీ బలానికి తల వంచి నీకు స్నేహితుడైనప్పుడు నీ మనసులో ఉన్న ఏ చిన్న డౌట్ అయినా సరే పూర్తిగా ఎగిరిపోతుంది. బలం మరొక బలాన్ని గుర్తిస్తుంది.
(16:26) అండ్ ఎథిక్స్ చెత్త బుట్టలోకి వెళ్ళిపోతాయి. వాలి చదువు లేని మొరటోడు కాదు వాల్మీకి రామాయణం ప్రకారం అతను శాస్త్రాలు రాజనీతి తెలిసిన ఒక హైలీ ఇంటెలిజెంట్ రూలర్ కానీ ఈ విద్యనే అతని భ్రమను ఇంకా వర్స్ట్ గా మార్చింది. అతను తన తమ్ముడిని శిక్షించాలనుకున్నప్పుడు గుడ్డిగా తనకు తోచింది చేయలేదు. గ్రంథాలు ఇచ్చే జ్ఞానంలో ఉన్న లూప్ హోల్స్ ని ట్విస్ట్ చేసి తన వ్యక్తిగత ద్వేషాన్ని జస్టిఫై చేసుకోవడానికి తన బుద్ధిని వాడుకున్నాడు.
(16:53) తన క్రూరత్వాన్ని చట్టపరమైన నీతిలా చూపించడానికి ఆ చట్టాలను సంబంధం లేకుండా ప్రస్తావించాడు. ఈ రోజుల్లో కూడా హైలీ స్మార్ట్ పీపుల్ దగ్గర మనం ఇది ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఎడ్యుకేషన్ నిన్ను ఆటోమేటిక్ గా ఒక మంచి వ్యక్తిగా మార్చదు. కొన్నిసార్లు అది నీ వర్స్ట్ మిస్టేక్స్ ని డిఫెండ్ చేసుకోవడానికి మరింత బెటర్ వొకాబులరీని ఇస్తుంది.
(17:15) అంతే వాలి తన తమ్ముడి మీద ఒక బుల్లెట్ ప్రూఫ్ కేస్ ని బిల్డ్ చేయడానికి తన డీప్ నాలెడ్జ్ ని వాడుకున్నాడు. తన అసూయను స్వార్థాన్ని ఫ్యాన్సీ లీగల్ టాక్ వెనుక పూర్తిగా దాచేశడు. వాలి ఎప్పుడూ తన ఫిజికల్ పవర్ ని భారీగా ప్రదర్శిస్తూ బిజీగా ఉండేవాడు. ఒక్కసారి లంగిస్తే కొండల శిఖరాలను తన్నుతూ దుందుబి అనే రాక్షసుడి కలేబరాన్ని గాలిలోకి విసిరి తన బలాన్ని ప్రదర్శించాడు.
(17:39) ఇదొక క్లాసిక్ ఎమోషనల్ డిఫ్లెక్షన్ స్ట్రాటజీ. అలా నీ సొంత ఫ్యామిలీలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్స్ ని ఏమాత్రం చూడకుండా తప్పించుకోవడానికి నువ్వు చేసే పనులు ఎలా ఉంటాయో ఒకసారి వాలి జీవితంతో మెటఫోరికల్ కంపారిజన్ చేసి గమనిద్దాం. నీ పర్సనల్ లైఫ్ చిందరవందరగా ఉన్నప్పుడు అండ్ నువ్వు నీ ఫ్యామిలీని చాలా చెడ్డగా ట్రీట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడైతే బెస్ట్ గా ఉన్నావో ఆ పనుల మీద ఫోకస్ చేయడం నీకు మంచి ఫీలింగ్ ఇస్తుంది.
(18:06) చూడు నేను మనకోసం ఎంత అచీవ్ చేస్తున్నానో మనం గొప్పగా బతకాలని చాలా ప్రయత్నిస్తున్నాను. ఇలా నీతో నువ్వు చెప్పుకునే సిచువేషన్ ఉంటుంది. వాలి పబ్లిక్ లో సాధించే విజయాలను వాడుకొని తన మనస్సాక్షి చెప్పే ఆ కామ్ వాయిస్ ని పూర్తిగా నొక్కేసాడు. అతను తన ఎనర్జీ మొత్తాన్ని కంటికి కనిపించే ఆ ఎక్స్టర్నల్ విక్టరీస్ మీదే పెట్టాడు. ఎందుకంటే అద్దంలో చూసుకుంటే తన సొంత ఇంట్లోనే తనొక విలన్ లా మారాననే నిజాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి.
(18:33) కిష్కింద అడవుల్లో వాలి తీసుకున్న ఆ ఏన్షియంట్ డెసిషన్స్ మన మోడర్న్ హ్యూమన్ వినాశనానికి ఎగజాక్ట్ బ్లూప్రింట్స్ అవుతాయి. వాలి తనకు నచ్చింది తీసుకొని దానికి న్యాయం అని పేరు పెట్టాడు. తనను విమర్శించే వాళ్ళ నోరు నొక్కేసాడు. అండ్ తన పాత అచీవ్మెంట్స్ ని వాడుకొని ప్రెజెంట్ లో చేసే పాపాలను దాచాడు. కొంచెం పవర్ రాగానే మోరల్ హై గ్రౌండ్ నాదే అని అస్ూమ్ చేసుకునే ప్రతి ఒక్క మనిషికి అతనే సింబల్.
(18:57) సక్సెస్ వల్ల వచ్చే అసలైన డేంజర్ నువ్వు లేజీగా మారడం కాదు. నువ్వు ఒక ఇగోయిస్ట్ గా మారడమని అతను మనకు చూపిస్తున్నాడు. నీ బలం నిన్ను సరైన దారిలోనే ఉంచుతుందని నువ్వు గుడ్డిగా నమ్మడం వల్ల నువ్వు వెళ్తున్న రూట్ ని చెక్ చేసుకోవడం ఆపేస్తావు. వాలి పూర్తి నమ్మకంతో ముందుకు నడిచాడు. తన సొంత ఫ్యామిలీ మాట వినడానికి తను నిరాకరించడమే తన విధిని ముందే సీల్ చేసిందనే నిజాన్ని అతను పూర్తిగా పట్టించుకోలేదు.
(19:22) దాంతో రియాలిటీ తనకు ఎదురుపడి పూర్తి జీవితం నాశనం అవ్వడానికి తానే కొన్ని సిచువేషన్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. కిష్ కింద అడవుల్లో గడిచిన వాలి జీవితం నుండి బయటకవచ్చి ద సో కాల్డ్ మోడర్న్ వరల్డ్ లోకి అడుగు పెడదాం. వాలీ సిండ్రోమ్ గురించి చెప్పాలంటే ఆఫీస్ లో ఎంప్లాయిస్ ని పిప్పి చేసే ఆ క్రూయల్ మేనేజర్ పిల్లల ప్రతి ఊపిరిని కంట్రోల్ చేసే టోటల్ డామినేటింగ్ పేరెంట్ పార్ట్నర్ కాన్ఫిడెన్స్ ని పూర్తిగా నలిపేసే టాక్సిక్ లవర్ బయట సమాజ సేవ అంటూ ఇంట్లో వాళ్ళను టార్చర్ పెట్టే యాక్టివిస్ట్ వీళ్ళంతా వేరు వేరు మనుషులు కాదు అందరిలోనూ ఉన్నది ఒకటే మెంటాలిటీ
(19:57) రామాయణంలో వాలి ఎలాగైతే నా అంత తోపు మరొకరు లేరు నా బలం ముందు ఎవరైనా లొంగాల్సిందే అని అనుకుంటూ తనే కరెక్ట్ అని ఎలా నమ్మాడో ఈ రోజుల్లో కూడా మన చుట్టూ ఉన్న కొందరు మనుషులు అదే గుడ్డితనంతో బతుకుతున్నారు. వీళ్ళ మైండ్ గేమ్స్ ఎలా ఉంటాయంటే పవర్ వస్తే పొగరు ఫ్రీ చేతిలో కాస్త డబ్బు సోషల్ మీడియాలో కాస్త ఫాలోయింగ్ లేదా అపార్ట్మెంట్ కమిటీలో ఒక చిన్న పదవి రాగానే చాలు.
(20:22) వాళ్ళ ఇగో ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాళ్ళు చేసిన పనుల వల్ల ఎదుటివాడు ఎంత నరకం అనుభవిస్తున్నాడు అనేది వాళ్ళకు అస్సలు కనిపించదు. ట్విస్టెడ్ లాజిక్ అండ్ ముసుగులు వీళ్ళు చేసే అరాచకాలు అన్నిటికీ ఒక రకమైన కలరింగ్ ఇచ్చుకుంటారు. ఆఫీస్ లో వేదింపులని హై స్టాండర్డ్స్ అంటారు. ఇంట్లో పూర్తిగా కంట్రోల్ చేస్తూ ప్యూర్ పేరెంటల్ లవ్ అని చెప్పుకుంటారు.
(20:43) సోషల్ మీడియాలో చేసే ట్రోలింగ్ ని సమాజాన్ని ఉద్ధరించడం అని చెప్పుకుంటారు. ఏదైనా అడిగితే తిరిగి మనదే తప్పు అన్నట్టుగా రివర్స్ బ్లేమ్ చేస్తారు. జీరో ఎంపతీ తాము అనుకున్నదే కరెక్ట్ తమకు ఎదురు చెప్పే వాళ్ళంతా మూర్ఖులు లేదా విలన్స్ అని ఫిక్స్ అయిపోతారు. ఎవరైనా నిజం చెప్తే వినడం పక్కన పెట్టి వాళ్ళ గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తారు.
(21:04) సో బాటం లైన్ ఏంటంటే వీళ్ళు బయట ప్రపంచంలో పెద్ద సక్సెస్ కావచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ బీవత్సంగా ఉండొచ్చు. కానీ క్యారెక్టర్ పరంగా చూస్తే వీళ్ళకంటే భికారులు మరొకరు ఉండరు. ఈ మాట కాస్త హార్ష్ గానే ఉండొచ్చు. కానీ ఇదే నిజం. తమ సొంత అహంకారం అనే గుడ్డితనంలో వాళ్ళకు తోచినట్టుగా బతికేస్తూ వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారో కనీసం గమనించుకోలేని ఒక దయనీయమైన స్థితిలో వీళ్ళు ఉంటారు.
(21:31) వాలి తన తమ్ముడితో లాస్ట్ టైం యుద్ధం చేయడానికి బయటకు నడిచే ముందు అతని భార్య తార అడ్డుగా నిలబడింది. ఆమె గట్టిగా అరవలేదు లేదా కేకలు వేయలేదు. సాలిడ్ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ లాజికల్ వార్నింగ్ ఇచ్చింది. సుగ్రీవుడు అపారమైన మోరల్ వాల్యూస్ అండ్ మార్షియల్ స్కిల్స్ ఉన్న రాముడితో ఒక పవర్ఫుల్ అలయన్స్ ని ఏర్పరచుకున్నాడని అంగదుడి గూడచార్లు ఇచ్చిన రిపోర్ట్ చెప్పింది.
(21:55) సుగ్రీవుడి కాన్ఫిడెన్స్ లో వచ్చిన ఆ సడన్ చేంజ్ ని ఒక్కసారి గమనించమని తార వాలిని బ్రతిమాలింది. ఆ కోపాన్ని వదిలేసి తమ్ముడిని వెనక్కి పిలిచి అతన్ని యువరాజుగా చేయమని అడ్వైస్ ఇచ్చింది. ఇక్కడ తారలో ఉన్నది డీప్ లవ్ స్ట్రాటజిక్ బ్రిలియన్స్ అండ్ కామన్ సెన్స్ వీటితో కూడిన ఒక అభ్యర్థన ఆవిడ వాలిని రియాలిటీలోకి రప్పించడానికి ఒక సేఫ్ దారి చూపించింది.
(22:19) కానీ ఆ మాటలు వినాలంటే వాలి తాను ఇన్నేళ్లుగా తమ్ముడి విషయంలో తప్పు చేశాననే నిజాన్ని ఒప్పుకోవాలి. అతను తన గర్వానికి ఒక పాజ్ ఇవ్వాలి. అండ్ ఇది తన ఇగోకి అసలు భరించలేని విషయం. నువ్వు ఎప్పుడైతే గర్వంతో నిండి ఉంటావో ఆ చేదు నిజాన్ని వినడం నీ బ్రెయిన్ లో ఒక రియల్ ఫిజికల్ పెయిన్ ని క్రియేట్ చేస్తుంది. దీన్నే మోడర్న్ సైకాలజీలో కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు.
(22:44) నీ యాక్షన్స్ తప్పని ఎవరైనా అబ్సల్యూట్ ప్రూఫ్ చూపించినప్పుడు నువ్వు నీ మంచితనం గురించి బిల్డ్ చేసుకున్న ఆ ఫేక్ స్టోరీకి అది ఒక పెద్ద థ్రెట్ లా మారుతుంది. వాలిలాంటి ఒక పవర్ఫుల్ పర్సన్ కి ఒక తప్పుని ఒప్పుకోవడం అనేది యుద్ధభూమిలో ఉన్న శత్రువులను ఫేస్ చేయడం కంటే కూడా చాలా ప్రమాదంగా అనిపిస్తుంది. అది వాళ్ళ ఐడెంటిటీని పూర్తిగా నాశనం చేసినట్టు అవుతుంది.
(23:05) ఈ ఇంటర్నల్ పెయిన్ నుండి తమని తాము కాపాడుకోవడానికి వాళ్ళ మైండ్ ఆనెస్ట్ అడ్వైస్ ని ఒక శత్రువు చేసిన దాడిలా చూస్తారు. నర్వస్ సిస్టం ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆ వార్నింగ్ లో ఉన్న లాజిక్ ని ప్రాసెస్ చేయరు. ఆ నిజాన్ని చెప్తున్న వ్యక్తిని ఎలా నాశనం చేయాలి అని మాత్రమే చూస్తారు. దాంతో తమ సేఫ్టీకి ఉన్న దారిని వాళ్ళకు వాళ్లే పూర్తిగా మూసేస్తారు.
(23:30) సో తార ఇచ్చిన ఆ బ్రిలియంట్ అడ్వైస్ ని ఒక క్లాసిక్ అండ్ చీప్ టాక్టిక్ ని వాడుకొని వాలి దాన్ని ఇండైరెక్ట్ గా పట్టించుకోలేదు. అంటే ఆమె తెలివిని హేలన చేశాడు. వాల్మీకి రామాయణంలో అతను తారతో నువ్వు కేవలం ఒక భావోద్వేగ మహిళ అంటే ఎమోషనల్ గా ఆలోచించే స్త్రీ అని అవసరం లేకుండా భయపడుతున్నావని చెప్తాడు. ఒక సాధారణ మానవ యువరాజు గురించి వచ్చే కొన్ని రూమర్స్ ని చూసి ఒక అసలైన వీరుడైన రాజు ఎప్పుడూ కూడా సవాల్ నుండి వెనక్కి తగ్గడు అని అంటాడు.
(24:01) తారకున్న డీప్ విస్డమ్ ని కేవలం ఫీమేల్ యంజైటీ అండ్ పిరికితనం అనే పేరు పెట్టడం ద్వారా తనేమి వెర్రివాడు కాదనేలా ఆమె వార్నింగ్ ని అతను చాలా ఈజీగా ఇగ్నోర్ చేయగలిగాడు. తనలో ఉన్న ఆ మొండి గర్వాన్ని ఒక గొప్ప యోధుడి ధైర్యంలా రీఫ్రేమ్ చేసుకున్నాడు. భ్రమల్లో బతికే వాళ్ళు ఒక చేదు నిజాన్ని ఫేస్ చేసినప్పుడు కరెక్ట్ గా ఇలాగే ప్రవర్తిస్తారు.
(24:22) వాళ్ళు రియాలిటీ చూపించే ఆ మెసెంజర్ కి ఉన్న మోటివ్ ని అటాక్ చేస్తారు. వాళ్ళ కంగారు చూసి నవ్వుతారు. అండ్ ముఖంలో నవ్వు మెయింటైన్ చేస్తూ ఆ గది నుండి బయటకు వెళ్ళిపోతారు. విమర్శించే వాళ్ళు తమ గ్రాండ్ విజన్ ని అర్థం చేసుకోలేనంత వీక్ అని వాళ్ళకు వాళ్ళు ఒక గట్టి ఇమాజినరీ బిలీఫ్ ని నమ్ముతారు. మనుషులు వాళ్ళ వినాశనానికి దారి తీస్తుందని తెలిసినా కూడా ఒక కంఫర్టబుల్ అబద్ధంలోనే బతకడానికి ఎందుకు ఎంచుకుంటారు ఎందుకంటే మనకు మన ఇమేజ్ ని కోల్పోవడం అంటే విపరీతమైన భయం ఒక తప్పుని ఒప్పుకోవడం అంటే నీ కలీగ్స్ నీ ఎంప్లాయిస్ లేదా నీ ఫ్యామిలీ ముందర నువ్వు
(24:57) ఇన్నేళ్లుగా వేసుకున్న ఆ పర్ఫెక్షన్ మాస్క్ ని కింద పడేయడమే అవుతుంది. అది నిలబడి ఓపెన్ గా నేను స్వార్థంతో ప్రవర్తించాను. నేను గుడ్డిగా నడుచుకున్నాను. అండ్ నేను అందరికీ బాధ కలిగించాను అని చెప్పడమే. ఆ లెవెల్ ఆఫ్ హానెస్టీ కి ఒక భారీ ఇంటర్నల్ స్ట్రెంత్ కావాలి. వాళ్ళ లాంటి ఒక ఫేక్ జాయింట్ కి తాను అజయుడు అంటే ఇన్విన్సిబుల్ అనే ఆ అపియరెన్స్ ని మెయింటైన్ చేయడం అనేది తన నిజమైన సర్వైవల్ కంటే కూడా చాలా ముఖ్యం.
(25:24) అతను ఒక చిన్నపాటి వినయాన్ని చూపిస్తూ తన జీవితాన్ని కాపాడుకోవడం కంటే చాలా టఫ్ గా కనిపిస్తూ ఒక ప్రాణాంతక ఉచ్చులోకి నడిచి వెళ్ళడానికే ఎంచుకుంటాడు. ఛాలెంజ్ లేని ఇగో ఇచ్చే అల్టిమేట్ ట్రాజిడీ ఇదే. ఇది నిన్ను ఒక జైల్ లోపల లాక్ చేస్తుంది. అక్కడ నిన్ను సెల్ఫ్ కరెక్ట్ చేసుకోవడం కంటే వినాశనాన్నే మనస్ఫూర్తిగా ఎంచుకుంటావు.
(25:48) మనం మోడర్న్ డే తారని ప్రతి ఆఫీస్ మ్యారేజ్ అండ్ ఫ్రెండ్షిప్ లో చూస్తూనే ఉంటాం. అదొక లాయల్ కో ఫౌండర్ అవ్వచ్చు. ఎవరైతే ఆ ఫౌండర్ ని సైలెంట్ గా పక్కకు పిలిచి నీ కొత్త బిజినెస్ ప్లాన్ ఒక ఫైనాన్షియల్ డిజాస్టర్ అని వార్న్ చేస్తారో ఆ వ్యక్తి అదొక హనెస్ట్ స్పౌస్ అంటే భార్య లేదా భర్త అవ్వచ్చు. ఎవరైతే తమ పార్ట్నర్ తో నీ సక్సెస్ నిన్ను ఇగోయిస్టిక్ గా మార్చింది అండ్ నువ్వు పాత ఫ్రెండ్స్ పట్ల రూడ్ గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్తారో ఆ వ్యక్తి ఈ నిజం చెప్పే వాళ్ళు కేవలం ఒక లోతైన ప్రేమతో ఆ వ్యక్తిని ఒక పెద్ద డిజాస్టర్ నుంచి రక్షించాలనే ఉద్దేశంతో మాట్లాడతారు.
(26:24) కానీ వాళ్ళ వార్నింగ్స్ ఆ ఇగో రాసుకున్న పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ని ఛాలెంజ్ చేస్తాయి కాబట్టి వాళ్ళు నిరంతరం దూరం ఉండాల్సి వస్తుంది. ఆ పవర్ఫుల్ పర్సన్ ఈ లాయల్ ఫ్రెండ్ ని అసూయ పడేవాడని సపోర్టివ్ గా లేడని లేదా వాళ్లకు నిజమైన అంబిషన్ లేదని వివిధ రకాలుగా పిలుస్తారు. వాళ్ళు మోడర్న్ తారని తమ ఇన్నర్ సర్కిల్ నుండి బయటకు నెట్టేసి వాళ్ళ ప్లేస్ లో ఎప్పుడు నవ్వుతూ, తలుపుతూ వాళ్లకు ఏం కావాలో అదే చెప్పే వాళ్ళను అక్కడ నిలబెడతారు.
(26:53) మనిషికి చేదు నిజం కంటే తనకు నచ్చని తీపి అబద్ధమే ఇష్టం. ఆ అబద్ధాన్ని నమ్ముతూ బతకడానికి మనం ఎంతటి మూల్యమైనా చెల్లించడానికి సిద్ధపడతాం. అందుకే విలన్స్ అండ్ టాక్సిక్ మేనేజర్స్ పొగడ్తలను అమితంగా ప్రేమిస్తారు. వాళ్ళ చుట్టూ ఎప్పుడూ ఎస్ సర్ అని తలాడించే వాళ్ళనే ఉంచుకుంటారు. ఎవరైతే వాళ్ళు తీసుకునే ప్రతి చెడ్డ నిర్ణయాన్ని ప్రశంసిస్తారో అండ్ వాళ్ళ వర్స్ట్ జోక్స్ కి కూడా గట్టిగా నవ్వుతారో వాళ్లే అక్కడ ఉంటారు.
(27:21) నీ చుట్టూ నిన్ను పొగిడే వాళ్ళు ఉంటే నువ్వు ఒక ఇల్యూజనరీ వరల్డ్ లో బతికేస్తావు. అక్కడ నిన్ను ఎవరు విమర్శించరు కాబట్టి నువ్వు చేసే తప్పులు నీకు అస్సలు కనిపించవు. ఆ ఫాల్స్ కంఫర్ట్ కి అలవాటు పడిపోతే నీలో ఉన్న లోపాలను నువ్వు ఎప్పటికీ గుర్తించలేవు. వాటిని సరిదిద్దుకునే ఛాన్సే ఉండదు. వాలి చుట్టూ కూడా అతని బలాన్ని పొగిడే మంత్రులు ఉన్నారు.
(27:43) దాంతో తార మాటలు అతనికి ఒక ద్రోహం లాంటి విమర్శల్లా వినపడ్డాయి. నువ్వు నీ లైఫ్ నుండి హనెస్ట్ ఫీడ్బ్యాక్ ని పూర్తిగా ఎలిమినేట్ చేసినప్పుడు నువ్వు గెలవట్లేదు. జస్ట్ నీ ఎర్లీ వార్నింగ్ సిస్టం ని డిసేబుల్ చేసుకుంటున్నావ్. దాంతో నీకు జరగబోయే ఆ వినాశనం ఖాయమైపోతుంది. ప్రతి మనిషి కూడా తన లైఫ్ లో ఇల్యూషన్స్ వెనుక పరిగెడుతూ ఇక వెనక్కి తిరిగి రాలేని సిచువేషన్ ని దాటేసే ఒక డేంజరస్ సైకలాజికల్ మూమెంట్ వస్తుంది.
(28:07) ఆ టైంలో వచ్చే లాస్ట్ వార్నింగ్ ని కూడా లైట్ తీసుకొని మొండిగా ముందుకు వెళ్తే ఇక నేరుగా వినాశనానికే. రామాయణంలో వాళ్ళకి సరిగ్గా ఇదే జరిగింది. తార ఎంత చెప్పినా కూడా ఆయన వినకుండా భార్య మాటలు పక్కన పెట్టి తన మెడలో ఉన్న బంగారు గొలుసు బలాన్ని నమ్ముకొని కోపంతో ఊగిపోతూ తమ్ముడితో యుద్ధం చేయడానికి ఎప్పుడైతే రాజభవన ద్వారం దాటి బయటక వచ్చాడో అదే అతని పతనానికి స్టార్టింగ్ పాయింట్.
(28:32) తను గెలవబోయే మరొక చిన్న యుద్ధానికి వెళ్తున్నాను అని అనుకున్నాడు. కానీ ఇన్నేళ్లుగా తను చేసిన అరాచకాల వల్ల మనసులో ఉన్న సిస్టం మొత్తం ఎంత డామేజ్ అయిందో అతని ఇగో చూడనివ్వలేదు. మన చుట్టూ ఉన్న మంచివాళ్ళు లేదా మనకు వివేకం చెప్పే లాస్ట్ వార్నింగ్ ని ఎప్పుడైతే మనం వినడం ఆపేస్తామో అప్పుడు మన మొండితనమే మనకు యముడిగా మారుతుంది.
(28:54) మనం ఒక రేంజ్ సక్సెస్ వైపు వెళ్తున్నామని గట్టిగా నమ్ముతూనే మన చేతులతో మనల్ని మనం నేరుగా పతనం వైపు లాక్క వెళ్తాం. లైఫ్ అనే యుద్ధంలోకి ఎలాంటి ఛాలెంజ్ లేదనే ఈగోతో ప్రయాణిస్తూ వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా లెడ్ మెటల్ తో చేసిన బరువైన కవచం వేసుకోవడం లాంటిది. బయట నుంచి చూసే వాళ్ళకు నువ్వు భలే సేఫ్ గా బుల్లెట్ ప్రూఫ్ గా ఉన్నట్టు కనిపిస్తావు కానీ నిజానికి అది నిన్ను కదలనివ్వదు.
(29:16) చివరికి నీ పతనానికి గ్యారెంటీ ఇస్తుంది. రియాలిటీ గట్టిగా ఒక్కటి గుద్దినప్పుడు నీ పొగరు నిన్ను కిందకు దిగనివ్వదు. చుట్టుపక్కల ఉన్న ప్రమాదాలను కూడా చూడనివ్వదు. వాలి కిష్కిందలో అడుగు పెట్టినప్పుడు తనకున్న వరాలు శారీరక బలాన్ని చూసుకొని ఈ విశ్వంలోనే నన్ను ఎవ్వరూ టచ్ చేయలేరు అని అనుకున్నాడు. కానీ ధర్మం దాటి ఒక అధర్మాత్ముడి మైండ్ సెట్ లోకి ప్రవేశించినప్పుడు ఆ విశ్వం తనను తాను బాలెన్స్ చేసుకోవడానికి ఒక నాచురల్ వే వెతుక్కుంటుంది అనే నిజాన్ని మర్చిపోయాడు.
(29:46) తమ్ముడిని అంతం చేయడానికి ముందే తనలో ఉన్న అహంకారమే తనను అంతం చేయడానికి ఒక ప్రణాళిక వేసింది. వాలి సుగ్రీవుడితో పూర్తి బలాన్ని ఉపయోగించి ఫైట్ చేస్తున్న సమయంలో ఒక సడన్ ప్రాణాంతక షాక్ అతని ప్రపంచాన్ని ముక్కలు చేసింది. అదే రామ బాణం అది నేరుగా వచ్చి అతని గుండెల్లోకి దిగింది. అది కూడా చెట్ల మధ్య నుంచి. భ్రమల్లో బతికే మనిషికి లైఫ్ ఎలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందో చెప్పడానికి ఇది ఒక అల్టిమేట్ మెటఫర్.
(30:12) నువ్వు నీ పవర్ ని షో ఆఫ్ చేయడంలో బిజీగా ఉన్నప్పుడు అస్సలు గమనించలేకపోయిన ఆ కాస్మిక్ కాన్సక్వెన్సెస్ కి ఈ రామబాణమే ఒక సింబల్ ఆట మొత్తం నాదే అనుకున్న టైంలో గేమ్ రూల్స్ లో వచ్చిన ఒక సడన్ చేంజ్ అది వాలి లైఫ్ అంతా ఓపెన్ ఫైట్స్ ని కేవలం రా ఫిజికల్ పవర్ తోనే గెలిచాడు. అందుకే ఒక హిడెన్ యాంగిల్ నుంచి దాడి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
(30:34) నువ్వు బేసిక్ హ్యూమన్ వాల్యూస్ దాటినప్పుడు రియాలిటీ నిన్ను నేరుగా యుద్ధానికి రమ్మని ఛాలెంజ్ చేయదు. నువ్వు అస్సలు ప్రిపేర్ అవ్వని టైంలో చీకటి నుంచి దెబ్బ తీస్తుంది. ఒక జైగాంటిక్ ఫిగర్ కింద పడిపోవడం అనేది చూడటానికే చాలా భయంకరంగా ఉంటుంది. వానరుల మధ్య నేనే గొప్పవాడిని అని అనుకున్న వాలి ఒక భారీ శబ్దంతో ఒక్కసారిగా నేలకొరిగాడు.
(30:55) తన గెలుపుకి గ్యారెంటీగా ఇంద్రుడు ఇచ్చిన ఆ బంగారు గొలుసు కూడా ధర్మం చేసే దాడి నుంచి వాలిని కాపాడలేకపోయింది. జస్ట్ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మట్టిలో రక్తం కారుతూ పడిపోయిన వాలి పూర్తి ప్రపంచం తలకిందులు అయిపోయింది. మన పవర్ అంతా మాయమైపోయి మనల్ని పూర్తి నిస్సహాయంగా వదిలేసే మోమెంట్ ఇదే. ఒక గర్వం ఉన్న వ్యక్తి అట్టడుక్కి పడిపోయినప్పుడు వాళ్ళు డబ్బు, స్టేటస్ లేదా అధికారంతో కట్టుకున్న ఆ కోటలన్నీ ఆ క్షణమే మాయమైపోతాయి.
(31:23) అప్పుడు నువ్వు ఒక శక్తివంతమైన రాజువి కాదు ధనవంతుడైన యువరాజువి కూడా కాదు కేవలం ఆకాశం వైపు చూస్తున్న ఒక బలహీనమైన నిస్సహాయుడైన మనిషివి మాత్రమే నేల మీద రక్తం కారుతూ చనిపోతున్న సమయంలో కూడా వాలి ఇగో ఏ ఫైట్ లేకుండా సరెండర్ అవ్వడానికి ఒప్పుకోలేదు. రాముడి మీద కోపంతో కూడిన ఒక లీగల్ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాడు. ఇక్షవాకు వంశానికి చెందిన ఒక గొప్ప రాకుమారుడు ఇంత పిరికిపందల చాటు నుంచి ఎందుకు నన్ను కొట్టాడు అని నిలదీశాడు.
(31:51) యుద్ధ నియమాలను రాజనీతిని కోట్ చేస్తూ నాకు అయోధ్యతో వ్యక్తిగత శత్రుత్వం లేదు కదా రాముడు న్యాయానికి ఉన్న నియమాలను ఉల్లంఘించాడు. అంటే ఒక ఫెయిర్ ప్లే కున్న రూల్స్ అన్ని బ్రేక్ చేశాడు అంటూ నిందించాడు. చనిపోయే టైంలో అతను చేసిన ఈ క్వశ్చనింగ్ చూస్తే నేనే కరెక్ట్ అనే భ్రమ మనిషిలో ఎంత లోతుగా ఉంటుందో అర్థమవుతుంది. రియాలిటీ నిన్ను పూర్తిగా తొక్కేసినా సరే భ్రమల్లో బతికే మనిషి తన చివరి శ్వాసని కూడా సిస్టం రూల్స్ లేదా ఎదుటి వాళ్ళను బ్లేమ్ చేయడానికే వాడతారు తప్ప తన సొంత తప్పుని మాత్రం గమనించరు.
(32:26) వాలి ఆ బాణం వెనుకున్న ఎథిక్స్ గురించి మాట్లాడాలనుకున్నాడు. ఎందుకంటే తన లైఫ్ వెనుకున్న బ్యాడ్ ఎథిక్స్ గురించి మాట్లాడటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. రాముడు అక్కడ పడి ఉన్న వాలి దగ్గర నిలబడి అతని ట్విస్టెడ్ డిఫెన్స్ ని అబ్సల్యూట్ అన్ కాంప్రమైజ్డ్ లాజిక్ తో ముక్కలు ముక్కలు చేశాడు. ధర్మం అనేది జంతు బలం లేదా పర్సనల్ కంఫర్ట్ వీటి వల్ల డిసైడ్ అవ్వదు అని క్లియర్ గా చెప్పాడు.
(32:49) వాలి పూర్తి స్వార్థం అండ్ పగతో సుగ్రీవుడ్డిని అడవికి వెళ్ళగొట్టి బ్రతికున్న తమ్ముడి భార్యను బలవంతంగా తీసుకోవడం ద్వారా సొసైటీకి ఉన్న ఫండమెంటల్ లాస్ ని బ్రేక్ చేశాడని పాయింట్ అవుట్ చేశాడు. వాలి తన కుటుంబాన్ని జంతువుల్లా చూశాడు కాబట్టి యుద్ధభూమిలో ఒక గొప్ప రాజుక ఇచ్చే ట్రీట్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. రాముడి మాటలు ఒక విషయాన్ని నిరూపించాయి.
(33:10) నీ డైలీ బిహేవియర్ క్రూరంగా అన్యాయంగా ఉన్నప్పుడు నీ గతంలో నువ్వు చేసిన మంచి పనులు నీ పెద్ద పెద్ద టైటిల్స్ అన్నీ మీనింగ్లెస్ అండ్ యూస్లెస్ బేసిక్ హ్యూమన్ రెస్పెక్ట్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి నువ్వు గ్రంథాల్లో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకోలేవు. బతుక్కి సంబంధించిన లా అనేది చాలా సింపుల్. నువ్వు ఒక క్రూర మృగంలా బతికితే రియాలిటీ నిన్ను ఒక వేటగాడిలా వేటాడి తీరుతుంది.
(33:35) ఇక ఇప్పుడే ఆ కథలోని ద మోస్ట్ పెయిన్ఫుల్ మోమెంట్ వస్తుంది. అంటే అంటే వాలి ముసుగు పూర్తిగా తొలగిపోయిన క్షణం రాముడు మాట్లాడటం పూర్తి కాగానే వాలి మైండ్ లో ఉన్న ఆ దట్టమైన ఇల్యూజన్స్ అనే మేఘం ఒక్కసారిగా కరిగిపోయింది. తన లైఫ్ లో ఫస్ట్ టైం తాను చేసిన పనులను ఎలాంటి సాకులు లేదా కలరింగ్స్ లేకుండా క్లీన్ గా చూసుకున్నాడు. తన పాత నిర్ణయాలు చూసినప్పుడు అతనికి అక్కడ ఒక ధర్మబద్ధమైన రాజు కనిపించలేదు.
(34:01) కేవలం తన వ్యక్తిగత ఆనందం కోసం తన ఫ్యామిలీని నాశనం చేసిన ఒక సెల్ఫిష్ అండ్ జెలస్ బ్రదర్ మాత్రమే కనిపించాడు. తార చెప్పింది పూర్తిగా కరెక్ట్ అని సుగ్రీవుడు ఏ తప్పు చేయలేదని కిష్కిందకు అసలైన విలన్ తానే అని రియలైజ్ అయ్యాడు. ఈగో కి జరిగిన ఈ టోటల్ కొలాప్స్ ఎటువంటి ఫిజికల్ బాణం కంటే కూడా చాలా ఎక్కువ బాధనిస్తుంది. ఇక్కడితో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఉపయోగించిన అబద్ధాలన్నీ తొలగిపోయి నువ్వు క్రియేట్ చేసిన డామేజ్ ని నువ్వే ఫేస్ చేయాల్సి వచ్చిన భయంకరమైన మూమెంట్ వస్తుంది.
(34:31) వాళ్ళ జీవితంలో అబ్సల్యూట్ ట్రాజడీ ఏంటంటే అతనికి క్లారిటీ వచ్చేసరికి చేసిన అధర్మాన్ని కరెక్ట్ చేసుకోవడానికి టైం లేదు. ఆ తప్పులు అర్థం చేసుకున్నాడు కానీ శరీరం అప్పటికే చనిపోతుంది. ఇప్పుడు వెనక్కి వెళ్లి తమ్ముడిని దగ్గర తీసుకోలేడు. రూమను గౌరవంతో వెనక్కి ఇవ్వలేడు. తాను బ్రేక్ చేసిన నమ్మకాన్ని మళ్ళీ బిల్డ్ చేయలేడు.
(34:51) మిగిలిన ఆ చివరి క్షణాల్లో కేవలం రాముణని బ్రతిమాలుతూ నా కొడుకు అంగదుడిని రక్షించు సుగ్రీవుడికి అండగా ఉండు అని అడుగుతూ సుగ్రీవుని చూసి క్షమాపణ కోరుకున్నాడు. ఈరోజు బ్రతికున్న మనందరికీ ఇదే అల్టిమేట్ వార్నింగ్. ఒక మంచి మనిషిలా ఎలా బతకాలో తెలుసుకునేసరికే దాన్ని అప్లై చేయడానికి నీ దగ్గర టైం లేకపోవడం అనేది అన్నిటికంటే వర్స్ట్ సిచువేషన్ చాలా మంది లైఫ్ అంతా ఇదే ఈగో బ్లైండ్నెస్ లో గడుపుతారు.
(35:17) చివరికి రియాలిటీ ఒక ఫైనల్ మార్చలేని స్టాప్ సైన్ తో గట్టిగా కొట్టే వరకు నిజాన్ని చూసి పరుగులు తీస్తూనే ఉంటారు. ఈ రోజుల్లో ఈ క్రాష్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏ రామబాణము అవసరం లేదు. రియాలిటీ ఒక సీక్రెట్ వెపన్ ని మన మోడర్న్ లైఫ్స్ లోకి ప్రతిరోజు ఒక సడన్ షాకింగ్ వేకప్ కాల్ లా విసురుతూనే ఉంది. అది నీ కిచెన్ టేబుల్ మీదకు వచ్చే సడన్ డివోర్స్ పేపర్స్ కావచ్చు నువ్వు అతిగా కంట్రోల్ చేసే ప్రవర్తన భరించలేక నీ స్పౌస్ వదిలేసి వెళ్ళిపోవచ్చు లేదా ఆరోగ్యాన్ని ఇగ్నోర్ చేసి ఎన్నో ఏళ్లగా వర్క్ లోనే మునిగిపోయిన ఒక ఎగ్జిక్యూటివ్ కి వచ్చే సడన్ హార్ట్
(35:52) ఎటాక్ కూడా కావచ్చు. అంతెందుకు తన లోపాలను దాచేసి విమర్శించే వాళ్ళ గొంతు నొక్కిన ఒక కంపెనీకి లీగల్ గా వచ్చే బ్యాంక్రప్ట్ నోటీస్ కూడా కావచ్చు. నువ్వు చేసిన తప్పులు చివరికి నీ ఇగోని పట్టుకున్నప్పుడు ఈ మోడర్న్ ఎటాక్స్ జరుగుతాయి. నేనంతా మాస్టర్ చేస్తున్నాను అనుకున్న సిస్టం సడన్ గా బ్రేక్ అవుతుంది. నువ్వు రాత్రికి రాత్రే నేల కొరుగుతావు.
(36:14) ఈ ట్రాజిక్ ఎండ్ నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం లైఫ్ నీకు ఒక పెద్ద ట్రౌమా ద్వారా నిజాన్ని ఫోర్స్ చేయడానికి ముందే నిన్ను నువ్వు ఇంటర్నల్ గా కరెక్ట్ చేసుకోవడం నువ్వు ప్రతిరోజు నీ ఇగో మీద ఒక ప్రివెంటివ్ సెల్ఫ్ స్ట్రైక్ రన్ చేయాలి. అంటే నీ లైఫ్ లో మొహమాటం లేకుండా నిజం చెప్పే వాళ్ళను వెతికి నీకు దగ్గరగా ఉంచుకోవడం నీకు విపరీతమైన కోపం లేదా స్వార్థం వచ్చినప్పుడు కాసేపు ఆగి నిన్ను నువ్వు ఈ ప్రశ్న అడగాలి.
(36:42) నేను ఈ పని కరెక్ట్ అని చేస్తున్నానా లేక నా దగ్గర పవర్ ఉంది కాబట్టి తర్వాత ఎలాగైనా ఎస్కేప్ అవ్వగలను అనే నమ్మకంతో చేస్తున్నానా రియాలిటీ వచ్చి నీ నడ్డి విరగగొట్టక ముందే నీ ఇల్యూజన్స్ ని నువ్వే బ్రేక్ చేసుకోవాలి. ట్రూ స్ట్రెంత్ అంటే నిన్ను ఎవ్వరూ టచ్ చేయలేకపోవడం కాదు అద్దంలో చూసుకున్నప్పుడు ఏమాత్రం గిల్ట్ ఫీలింగ్ లేకుండా ధైర్యంగా నిలబడటం నీ లోపల ఉన్న కుళ్ళును గుర్తించడం ఆ బాణం నిన్ను వెతకడానికి ముందే నీ గర్వాన్ని నువ్వే కింద పడేయడం.
(37:10) రైట్ నౌ నీ లైఫ్ ఒక్కసారి చూడు నువ్వు ఎక్కడ వాళ్ళకి మల్లే బిహేవ్ చేస్తున్నావ్ నీ ప్రపంచంలోని ఆ స్పెసిఫిక్ కార్నర్ ని ఐడెంటిఫై చెయ్ అక్కడ నువ్వు నీ డబ్బు, ఏజ్, జాబ్ టైటిల్ లేదా ఎమోషనల్ లెవరేజ్ వీటిని వాడుకొని నీ చుట్టుపక్కల వాళ్ళను తొక్కేస్తున్నావేమో ఒక్కసారి గమనించు ఆ స్పెసిఫిక్ అబద్ధాన్ని వెతుకు అక్కడ నువ్వు చేస్తున్న కంట్రోల్ ని ప్రేమని లేదా నీ క్రూరత్వాన్ని హై స్టాండర్డ్స్ అని పేర్లు మార్చి కలరింగ్ ఇస్తున్నావేమో ఒక్కసారి గమనించుకో నిన్ను నిద్రలేప పడానికి ఒక పెద్ద లైఫ్ క్రైసిస్ వచ్చేంతవరకు వెయిట్ చేయడం ఆపేయ్ నువ్వు ఎవరినైతే హర్ట్ చేశవో వాళ్ళ దగ్గరికి
(37:45) వెళ్ళు నీ సాకుల కవచాన్ని కిందకు పడేయ్ వాళ్ళ కళ్ళల్లోకి చూసి నువ్వు తప్పు చేశవని ఒప్పుకో దీన్ని ఈరోజే ఇంకా నీకు ఊపిరి ఉండగానే జీవితంలో టైం ఉన్నప్పుడే వీలైనంత త్వరగా ఈ పని చెయ్ రియాలిటీ ఆ వింటినారిని వెనక్కి లాగకముందే నీ బ్లైండ్ స్పాట్ ని నువ్వే ఫిక్స్ చేసుకో సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అండ్ నెక్స్ట్ ఎలాంటి టాపిక్స్ మీద మీరు వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.
(38:14) నేను మీ లైఫోరామ తిరిగి కలుస్తూనే ఉందాం. ప
No comments:
Post a Comment