Sunday, July 12, 2026

అన్నీ ఇచ్చి... చివరకు? Given everything... At Last what?

అన్నీ ఇచ్చి... చివరకు? Given everything... At Last what?

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XvgGWkFrL4M



Transcript:
(00:01) ఒక్క వారంలోనే మూడు ఫోన్లు వచ్చాయండి మా తరానికి సంబంధించిన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ మూడు ఫోన్లలో ఒకళ్ళేమో నా మిత్రుడు మిగతా ఇద్దరు కూడాను సబ్స్క్రైబర్స్ అండి నా వీడియోలు రెగ్యులర్ గా చూస్తున్న వాళ్ళే ఈ ముగ్గురి నుంచి వచ్చిన కామన్ ప్రశ్న ఏంటంటే కరణ్ గారు 70 లో పడుతున్నాము బాగా అలసిపోయాము కానీ మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సరే పట్టించుకోకపోతే పట్టించుకోకపోయారు కానీ మన నుంచి ఇంకా ఆశిస్తున్నారండి అదే మాకు అర్థం కావట్లేదు.
(00:38) అసలు మాకు దొరుగుబాటే చాలా కష్టంగా ఉంది. పిల్లలుఏదో చూస్తారులే అనుకుంటే వాళ్ళఏమిటో మొహం చాటిస్తున్నారు అన్న రకరకాల భావాలతో వాళ్ళు నాతో మాట్లాడటం జరిగిందండి. నేను మొదట్లో పట్టించుకోలేదు. తర్వాత ఇవాళ ఒక ఫోన్ వచ్చింది. అప్పుడు కొంచెం సీరియస్ గా ఆలోచించి అదేంటి ఒక అద్భుతమైన తరం కదా నాది ప్రేమించడం తప్ప ఏమి తెలియని తరం కదా బాధ్యతను కూడాను అద్భుతంగా మోసిన తరం కదా ఏమిటి పరిస్థితి నో నో నోనో ఏదో ఒక విధంగా మంచి సందేశం ఇవ్వాలని చెప్పేసి నేను ఇదిగో ఇలా మీ ముందు కూర్చున్నానండి.
(01:18) నాకు ఏమనిపించిందంటే ముందు జాగ్రత్త లేకపోవడమే ప్రధాన కారణం అని అనిపించిందండి ఒక 50 70 దాటిన తర్వాత అన్నమాట ఒక పక్క పిల్లల్ని పెంచుతూనే ఎలా పెంచాలి అన్న ప్రశ్న వేసుకుంటూనే రాబోయే వృద్ధాప్యాన్ని అంటే తప్పించుకోలేని వృద్ధాప్యాన్ని ఎలా రక్షించుకోవాలి అన్న ప్రశ్న కూడాను వేసుకోవాలండి అసలు ఈ ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న అన్నమాట ఇది ప్లాన్ బి కి సంబంధించింది.
(01:51) చెప్పాను కదా మా తరం ఈ రెండో ప్రశ్న నేను అంత గొప్పగా పట్టించుకోలేదండి మంచి తరం నిజంగా చెప్పాలి అంటే అమాయకపు తరం త్యాగం చేసిన తరం అన్నమాట మా తరం అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే పిల్లల్ని ప్రేమించండి కానీ మీ జీవితాన్ని పిల్లల మీద ఆధారపడే స్థాయికి మటుకు పట్టుకురాకండి అంటే అదేంటి కిరణ గారు మీ తరం వాళ్ళు ఇప్పుడు బాధను అనుభవిస్తున్నారు కదా ఇప్పుడు చెప్తారు ఏమిటి అని అంటే ఒకటండి 50 దాటిన వాళ్ళు ఉన్నారు కదా 60 లో పడుతున్న వాళ్ళు ఉన్నారు కదా ఇంకా దాచుకోవాల్సిన అవకాశాలు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళని గురించి కూడాను చేస్తున్న వీడియోని మీరు
(02:35) అనుకోవచ్చండి. జీవితంలో ఒక పెద్ద సత్యం ఏంటంటే అండి చాలా మంది తల్లిదండ్రులు ఆ మాటకి వస్తే ప్రతి తల్లిదండ్రులు కూడా మూడు భ్రమల్లో జీవిస్తూ ఉంటారు. అసలు మొదటి భ్రమ ఏంటంటే మేమ ఎంతో ప్రేమగా పిల్లల్ని పెంచాం కాబట్టి మా పిల్లలు కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటారు చూసుకుంటే మంచిదండి. అది జరగొచ్చు జరగకపోవచ్చు. లేకపోతే రెండో భ్రమ మా కొడుకు చాలా బుద్ధిమంతుడుండి ఎట్టి పరిస్థితిలో కూడా మారడు ఇంతవరకు నేను చెప్పింది జవదాటలేదు ఎప్పటికీ అలాగే ఉంటాడు ఒకేలాగా ఉంటాడు.
(03:16) ఇది రెండో బ్రహ్మ అండి కానీ ఒకటి మరకు మనం గుర్తుంచుకోవాలి. ఆ పిల్లవాడికి వివాహం అయిన తర్వాత భార్య వస్తుంది అత్తమామలు వస్తారు ఉద్యోగం వస్తుంది మిత్రులు కొత్తగా తయారవుతారు అసలు అప్పటికి సమాజమే మారిపోతుంది. దానికి తగ్గట్టు ఆర్థిక వత్తి కూడాను ఉంటుంది. కదా దాంతో పాటు పిల్లలు పెరుగుతున్న కొద్ది అంటే జీవితంలో ముందుకు వెళ్తున్న కొద్ది మనకు కూడాను కొన్ని ఆశలు ఉంటాయి కదా అంటే వాళ్ళకి కూడాను కొన్ని ఆశలు ఉంటాయి కాబట్టి వీటి ప్రభావం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడాను మీ గురించి ఆ తక్కువగా ఆలోచించే అవకాశమే ఉంటుందండి.
(03:53) మిమ్మల్నే జీవితంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించరు చెప్పాను కదా వాళ్ళ జీవితం అంటే వాళ్ళకి ఉంటుందన్నమాట ఇంకొకటి పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని ముందుకు వెళ్తున్న కొద్ది ఎవరైతే మీ జీవితంలో ప్రవేశించారో భార్య గాని లేకపోతే భార్య తల్లిదండ్రులు గాని ఎవరైతే ప్రవేశించారో వాళ్ళ అభిరుచులు వాళ్ళ స్వార్థాలు వాళ్ళ ఆలోచనలు మీకు తెలియవు కదా ఎట్లా తెలుస్తాయి చెప్పండి కాబట్టి ఇది రెండో భ్రమ మూడో భ్రమ ఏంటంటే నా త్యాగాలకు ప్రతిఫలం తప్పకుండా వస్తుంది.
(04:31) [నవ్వు] ఇంతకంటే పెద్ద భ్రమ లేదండి అంటే జీవితం అంత సింపుల్ మ్యాథమెటిక్స్ కాదు 2+2 = 4 కాదండి ఇక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడాను ఖలీల్ దిరాన్ని మళ్ళీ స్మరించుకోవాల్సిందే సూఫీ కవియ ఏమంటాడంటే తల్లిదండ్రులుగా మనం కేవలం విల్లు లాంటి వాళ్ళమే అంటే బౌ లాంటి వాళ్ళమే పిల్లలు సంధించడానికి సిద్ధంగా ఉన్న బాణాలు ఎలా వదలబడతారు అసలు ఆ బాణం ఎటు వెళుతుంది అన్నది మటుకు ఆ సృష్టికర్త లీల మాత్రమే మన చేతిలో ఏమీ లేదు కేవలం పిల్లల్ని కన్నామ అంతే అని ఇంకా చాలా ఉత్కృష్టంగా చాలా వివరణగా చెప్తాడు అనుకోండి
(05:17) అంటే ఇక్కడ తల్లిదండ్రులని చిన్న చూపు చూడటం కాదండి వాస్తవాన్ని తెలుసుకని కొంత అహంకారాన్ని తగ్గించుకోండి అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నమే అంతకంటే ఏం లేదండి చెప్పాను కదా తల్లిదండ్రులు కేవలం జన్మనిపోగలరు పెంచగలరు మంచి చూడు యొక్క విలువలని చెప్పగలరు మాత్రమే పిల్లలు వింటారా లేదా అన్నది మళ్ళీనో అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం ఒకటండి ప్రతి జీవి కూడా ఈ భూమి మీదకి కర్మ అనుభవించడానికి వస్తుంది కదా ప్రయోజనం పక్కన పెట్టండి.
(05:51) మరి అట్లాగే మీ పిల్లలు కూడాను వాళ్ళ కర్మని అనుభవించడానికి భూమి మీదకి వస్తారు కదా అంతేగనీ వాళ్ళ కర్మని మీరు జీవించలేరుగా మరి అటువంటప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులు ఏం చేయాలి ఒక్కటండి ప్రేమని ఇవ్వండి కానీ ఐ యమ ది మాస్టర్ అన్న ఫీలింగ్ మటబట్టు పెట్టుకోవద్దు. అలాగే విలువలు కూడా నేర్పే ప్రయత్నం చేయండి కానీ విలువలు నేర్పు పిల్లలని మటుకు కంట్రోల్ చేయొద్దండి.
(06:20) అవసరమైనప్పుడు సహాయం చేయండి చేయాలి కూడాను కానీ సహాయం చేశం కదా అని చెప్పేసి పిల్లల నుంచి ఆశించద్దండి. గవిధంగా చెప్పాలి అంటే పిల్లల జీవితాన్ని మీరు మోయొద్దు. కలక నమస్కారం పెట్టినప్పుడు ఆశించండి ఆశీర్వదించండి. నన్న బాగుపడరా అని చెప్పేసి అంతే తప్ప నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఆశించద్దండి అంటే ఇక్కడ మళ్ళీ చివరికి భగవద్గీతే పెద్దానికి కూడాను నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు ఫలితం మీద నీకు ఎట్టి పరిస్థితిలో కూడాను హక్కు లేదు ఇంకొకటి ఏంటంటే గబగబా ముందఏంటో అవ్యాజమైన ప్రేమతో ఆస్తులు ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంకా వయసు
(07:04) ఉండంగానే సో ఇటువంటి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే వృద్ధాప్యం వరకు ప్రేమను పంచండి దయచేసి ఆస్తులు మటుకు పంచొద్దు. ఇప్పుడు పిల్లలు ఇతర దేశాలకి వెళ్ళిపోవడం పరిపాట అయిపోయింది కదా ప్రతిరోజు కొడుకు ఫోన్ చేస్తాడని మటుకు ఎదురు చూపులతో జీవించద్దండి. అంతకు మించిన ప్రమాదకరమైన విషయం ఇంకొకటి లేదు.
(07:30) ఎందుకంటే కొద్ది రోజుల తర్వాత కొడుకు ఎదుగుతున్న క్రమంలో అనేక వ్యక్తుల యొక్క ప్రభావాలు అతని మీద పడుతున్న తరుణంలో కొడుకు ఫోన్ చేస్తే భయపడే పరిస్థితి కూడాను రావచ్చు అట్లా భయపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి అంటే పిల్లల పెంపకంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి చివరికి పిల్లలు చూసుకుంటారు అని అనుకోవడం మటకు అమాయకత్వం అజ్ఞానం అండి ఇట్లా ఆరోగ్యం క్షీణించిపోయి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులని నేను చూసాను మీరు కూడా చూస్తున్నారండి ఎందుకంటే చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంటారు.
(08:06) ఏదో సంపాదిస్తుంటారు అది పిల్లలకే సరిపోతూ ఉంటుంది కనీసం ఒక స్థలం ఇల్లు కూడా కొనుక్కోలేరు ఒకవేళ కొనుక్కున్న బాధ్యతలు అయిపోయే నాటికి ఒకటి ఏమ ఇంకా కడుతూ ఉండాల్సి వస్తుందండి. అప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు ప్రశ్నార్థకంగా మారుతాయి. కార్పొరేట్ హాస్పిటల్ లోకి చేరారనుకోండి లక్షలు లక్షలు ఖర్చు అవుతాయి. మరి ఉన్న నమ్ముకొని ఆ బాధ్య తీర్చాలా అట్లా తీరుస్తున్న వాళ్ళు కూడా నువ్వు ఉన్నారండి అతే ఒక వయసు వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక స్వాతంత్రం కూడాను ఉండాలండి ఎందుకంటే దేవుడు అనేవాడు వృద్ధాప్యంలో వచ్చే వ్యక్తి కాదండోయ్ యవ్వనం నుంచే మనం ఆధ్యాత్మికతని
(08:46) అలవరుచుకోవాలి. చాలామంది చెప్తూ ఉంటారు కదా మనం వింటూనే ఉంటాం ధ్యానం చేస్తూ ఉండాలి దానం చేస్తూ ఉండాలి ముఖ్యంగా అనేక పుస్తకాలు చదువుతూ ఉండాలండి ఒక ఆత్మస్థయం మనకు తెలియకుండా వస్తుంది. ఎక్కడ ఏ పుస్తకంలో ఏ వ్యక్తి ఏం చెబుతాడో తెలియదు మనం దేనికి కనెక్ట్ అయితామో తెలియదు దాన్నే స్వాధ్యాయం అంటారు అనుకోండి అంతకంటే ముఖ్యంగా ఒకటి చెప్తాను సత్సంగం అండి ఎక్కడనా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు హాయిగా వెళ్లి కూర్చోండి వాళ్ళు కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్పొచ్చు కొన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ చెప్పొచ్చు దానినుంచి మీరు కొంత నేర్చుకోవచ్చు కూడా
(09:22) అంటే ఇక్కడ కొడుకు మాత్రమే ప్రపంచం కాకూడదండి కూతురు మాత్రమే జీవితం కాకూడదు అన్నిటికంటే అంటే ముఖ్యంగా అందరినీ బతికించిన సమాజం అంటూ ఒకటి ఉంది కదా ఆ సమాజానికి దగ్గర అయతూ ఉండాలండి మనం మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశను కదా సాఫ్ట్వేర్ పిల్లలు మీ తల్లి కూడాను ఇలాగే బాధపడుతున్నదా అని చేశాను అసలు దానికి అసలు విపరీతంగా చూస్తున్నారు జనాలు ఆ ప్రస్తావనని ఇంకో కోణంలో పట్టుకొస్తారు ఒక విధవరాలైన తల్లి కొడుకు కోసం తన జీవి జీవితమంతా త్యాగం చేసింది.
(10:03) స్నేహితులని కూడాను వదిలేసుకుంది అభిరుచులనే వదిలేసుకుంది. చివరికి ఆరోగ్యాన్ని కూడాను పట్టించుకోలేదండి రాత్రి వాళ్ళలో పని చేసింది. చెప్పాను కదా విధవరాలైన తల్లి కానీ వృద్ధాప్యం గురించి ప్లానింగ్ చేయలేదండి చివరికి జరిగింది ఏంటంటే కొడుకు విదేశాలకి వెళ్ళిపోయాడు. ఒకానొక రోజు వాస్తవం తెలుసుకునేటప్పటికంటే వృద్ధాప్యం మీద పడే కొద్ది ఏడుస్తూ ఒక మాట చెప్పిందట నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే నా గురించి గాని నా భవిష్యత్తు గురించి గాని నేను ఎప్పుడు ఆలోచించుకోలేదు అది ఇక్కడ చూడండి నిజానికి సమస్య కొడుకు కాదు గమనించండి సమస్య కొడుకు కాదు తన
(10:45) జీవితాన్ని తను నిర్మించుకోపోవడమే ఒక పెద్ద సమస్య అంతే అందుకే నేను మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను త్యాగం చేయండి కానీ ఆశించవద్దు దయచేసి ప్రేమించండి అనుబంధంలో పీకల దాకా కూరుకుపోవద్దు. బాధ్యతను చేపట్టండి అది మీ బాధ్యత కూడాను చివరి వృద్ధాప్యం మీరు బానిసలుగా మారద్దండి. ఇక మళ్ళీ నేను ఒక అల్టిమేట్ ఫిలాసఫీ దగ్గరికి వస్తాను అదేంటంటే ఎవరు శాశ్వతం చెప్పండి భార్య శాశ్వతం కాదు భర్త శాశ్వతం కాదు పిల్లలు శాశ్వతం కాదు చివరికి శరీరం కూడా శాశ్వతం కాదు మరి నాది నా వాళ్ళు అనేది ఎలా శాశ్వతం అవుతుంది చెప్పండి అ మిమ్మల్ని జీవితాంతం కడవరకు తుదిశ్వాస
(11:31) వరకు చూస్తారని గ్యారెంటీ ఏంటండి చెప్పండి నేను ఏమంటానఅంటే ప్రతిఫలం ఆశించడం తప్పు అంతకంటే పెద్ద తప్పు ఏంటంటే ఆ ప్రతిఫలాన్ని పిల్లలతో ఒప్పందంగా మార్చుకోవడం లేదు అలా మార్చుకోవాలని ప్రయత్నించడం. చాలా పెద్ద తప్పుండి అది అప్పుడు గుర్తుపెట్టుకోండి మీ జీవితంంతా మీరు పిల్లల చుట్టూ తిరిగారు అనుకోండి ఒక స్టేజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి పెళ్ళళ్లయి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కొంచెం పక్కక తిప్పుకొని వాళ్ళ పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటారుగా అప్పుడు మీరు ఒంటరి వాళ్ళ అయతారుగా అందుకనే ఆ ఒంటరితనం రాకూడదని మనం ముందు
(12:17) జాగ్రత్తలు తీసుకోవాలండి అంటే ఏంటంటే ఆట ఆడుతూనే ఆటని ఎప్పుడు ఆపాలి ఎలా ఆపాలి అన్న విషయం మీద మనం కొంచెం ధ్యాస పెట్టాలండి. అదే ప్లాన్ బి అంటే అంతకంటే ఏముంది చెప్పండి చివరికి వధాప్యం వచ్చేసింది ఆట ఆపేశము అన్న పరిస్థితిలో మన జీవితం ఒక బలమైన ట్రైపాడ్ స్టాండ్ మీద ఒక కెమెరాలాగా ఉండాలండి ఆర్థిక ఆరోగ్య ఆధ్యాత్మికత అనే ట్రైపాడ్ స్టాండ్ మీద మన జీవితం బలంగా నిలబడాలి.
(12:53) అప్పుడు మీ పిల్లలు మీతో ఉండకపోయినా మీ గురించి ఆలోచించకపోయినా కూడాను అదంత పెద్ద విషాదం కాదు అది విషాదం కాదు అసలైన విషాదం ఏంటంటే మనం బతికి ఉన్నప్పుడే మనలో ఉన్నది మరణించటంట అంటే ఆత్మస్థయం మరణించటంట ఒకవేళ బై ఛాన్స్ అంటే బై ఫార్చూన్ పిల్లలు మన దగ్గర ఉండగలిగితే మన గురించి ఆలోచించగలిగితే ఆలోచించ గలిగితే నాన్న నీకు ఏం కావాలో చెప్పు ఇదిగో నా క్రెడిట్ కార్డు ఒకటి నీ దగ్గర పెడుతున్నాను దాంట్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయి నువ్వు ఎప్పుడు కాంటే అప్పుడు డ్రా చేసుకో అన్న ఒక అవకాశం మనకి వచ్చిందనుక అది కేవలం బోనస్ేనండి అది కేవలం బోనస్ే
(13:42) ఇప్పుడు యవ్వనంలో డబ్బు వెనక పరిగెత్తాలండి తప్పదు కానీ ఏమి దాచుకోకుండా వర్ధాప్యంలో చివరికి ఆకాశంలోకి చూస్తూ భగవంతుడా డా నీవే దిక్కు అని అనుకోవడం వరకు అజ్ఞానం అండి అజ్ఞానం అంటే ఆధ్యాత్మికత అంటే జీవితంలో చివర్లో పట్టుకునే ఒక ఊత కర్ర కాదండి ఆధ్యాత్మికత అంటే జీవితమంతా మనల్ని నడిపించే గొప్ప వెలుగు అంతేనండి ఇప్పుడు మనం ప్రకృతిని ఒకసారి గమనిద్దాంండి ఎందుకంటే పక్షణ ఒక ఆదర్శం గద్ద జీవితం అని ఇదే టైటిల్ గద్ద జీవితం అని ఒక వీడియో చేశను చూడండి ఆ వీడియోలో
(14:26) మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి అందుకనే పక్షిరాజు అని ఊరినే అనలేదండి దాన్ని సో పక్షి దగ్గరికి వద్దాం తల్లి పక్షి పిల్లలకు ఎగరటం నేర్పిందండి మొదటి రోజు పిల్లలు పడిపోయాయి రెండో రోజు పిల్లలు కొంచెం ప్రయత్నించాయి మూడో రోజు ఎగిరిపోయాయి. ఆ తర్వాత ఒక్క పిల్ల కూడా బూటికి తిరిగి రాలేదు. ఈ తల్లి పక్షి కూడాను ఆశించలేదు. ఎగిరేయి చాల్లే అని అనుకున్నాయి అంతేనండి మరి ఇన్ని విద్యలు ఇచ్చిన ప్రకృతి ఏమన్నా ఏడిచిందా బాధపడిందా బాధపడలేదు కదండీ ఎందుకంటే గూడు శాశ్వతం కాదు ఎప్పుడు కూడాను ఆ గూడు అనేది అంటే మన కుటుంబం అనేది ఎవరడం నేర్పే అద్భుతమైన
(15:11) పాఠశాల మాత్రమే సో మన జీవితం కూడాను అంత అద్భుతమైన పాఠశాల కావాలండి అది నేర్పేదే తప్ప ఆశించేదిగా ఉండకూడదు అంతేనండి ఇది మాట్లాడుతుంటే ఒక ఉదాహరణ గుర్తుకొస్తున్నది అది ఎంత సభో నాకు తెలియదు కానీ మీరు ఒకసారి అన్వయించడానికి ప్రయత్నించండి. అగ్ని శర్మ అని అన్న ఉన్నాడు రత్నాకరణ అంటాం కదా దారిదో ప్రియవాడు అత్రి మహర్షి శిష్యులతో వెళ్తుంటే వాళ్ళని అటగాయించాడు వాళ్ళ దగ్గర ఏమ ఉంటాయిని కానీ అన్నాడు ఇన్ని పాపాలు ఒరిగడుతున్నావయ్యా ఒకసారి వెళ్లి భార్య దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్లి అడుగు నువ్వు పాపాన్ని మూడకట్టుకున్నావు కదా మరి నువ్వు తెచ్చిన వాటితోనే వాళ్ళు
(15:53) భోజనం చేస్తున్నారు కదా బతుకుతున్నారు కదా పాపంలో వాళ్ళు ఏమనా పంచుకుంటారా అని వాడఏదో కనెక్ట్ అయితాడండి వెళ్లి అడిగితే మాకేంటయ్యా బాబు బాధ్యత నీది సంపాదించవలసిన బాధ్యత ఈ పాపం మటుకు మాకు వద్దని చెప్పేటప్పటికి అతను అద్భుతంగా వాల్మీకిగా మారిపోతాడు అనుకోండి మరి ఆయన జీవితంతో పోలిస్తే మరి మన పిల్లల నుంచి కూడా మనం ఎందుకు ఆశించాలండి చెప్పండి సో ఈ విషయం గురించి మాట్లాడుతూ పోతూ ఉంటే ఇంకా కొత్త ఉదాహరణలు కూడా ఉన్నాయి అనుకోండి నేను నోట్స్ కూడా రాసుకున్నాను.
(16:25) ఇప్పటికే దాదాపు 16 15 నిమిషాలు వస్తుంది కాబట్టి ఆపేస్తానండి. సో ఇదండి వీడియోలో ఉన్న సంగతి విన్నందుకు కృతజ్ఞతలు మీకు నచ్చితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనది ఎక్కువ మందికి షేర్ చేయండి. నాతో మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడండి నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ YouTube లోకి వెళ్లి ఎంఏ ఆర్ యు టహ్ ఐ స్పేస్ కేఐఆర్ఏ అని టైప్ చేస్తే పిఓఆర్ యుఆర్ఐ అని మా ఇంటి పేరు వస్తుంది. అదే నా YouTube ఛానల్ అండి.
(16:52) బెల్ ఐకాన్ లైక్ బటన్ మీరు ఎటు నొక్కుతారు కదా ఎందుకంటే దాదాపు 840 పైన వీడియోలు మీరు కూడా చూశారు కదా కాబట్టి మీరు ఎటు వాటిని నొక్కుతారో నాకు తెలుసు కాకపోతే అభ్యర్థన ఏంటంటే కామెంట్ బాక్స్ లో మంచి మెసేజ్ పెట్టండి అదే నాకు బలం అండి ముందు నేను YouTube ఓపెన్ చేయంగానే కామెంట్లు ఏం పెట్టారా నేను నేర్చుకునేది ఏమైనా ఉందా అని చూస్తానండి కాబట్టి మంచి మెసేజ్ పెట్టండి.
(17:14) నమస్కారం

No comments:

Post a Comment