Monday, July 13, 2026

RISE OF C-SECTION 😱 | మహిళల ప్రాణాలతో చెలగాటం |By Naresh Bukya

RISE OF C-SECTION 😱 | మహిళల ప్రాణాలతో చెలగాటం |By Naresh Bukya

Author Name:NB Show Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LqcmJwkB6LM



Transcript:
(00:05) అమ్మ ఈ వర్డ్ ఎంతో పవర్ఫుల్ అండ్ పవిత్రమైంది. అమ్మ అనే పదం వినగానే మనలో ఒక రకమైన కంఫర్ట్ క్రియేట్ అవుతుంది. పైగా మన భారతీయ అమ్మలు ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ మన భారతీయ మహిళలకు పిల్లలతో ఉండే ఆ ప్రేమ ఎఫెక్షన్ మీకు బయట దేశాల్లో కనిపించదు. మీలో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అగ్రీ చేస్తారు. కానీ ప్రెజెంట్ మన దేశంలో ఎవరికీ తెలియకుండా ఒక అతి పెద్ద ఎపిడమిక్ స్ప్రెడ్ అవుతుంది.
(00:33) అది మన అమ్మల ప్రాణాలు తీసుకుంటుంది. షాకింగ్ విషయం ఏమిటంటే దీని గురించి బయట ఎవరు డిస్కస్ చేయట్లేదు. అండ్ ఈ ఎపిడమిక్ దేశంలో రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా ఆపాలి. దీనిపైన ప్రజల్లో అవేర్నెస్ రావాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. బై ద వే ఆ ఎపిడమిక్ పేరు చెప్పలేదు కదు సి సెక్షన్ డెలివరీ అమ్మ గర్భం నుంచి బేబీ పుట్టుక అనేది రెండు విధాలుగా జరుగుతుంది.
(00:58) ఒకటి నాచురల్ డెలివరీ రెండు సిజేరియన్ డెలివరీ దాన్ని సి సెక్షన్ డెలివరీ అంటారు. నాచురల్ డెలివరీ అంటే బేబీ యోని నుంచి బయటకు వస్తుంది. అదే సిజేరియన్ డెలివరీలో మహిళల అబ్డామిన్ ని కట్ చేసి బేబీని బయటకు తీస్తారు. ఈ రెండిట్లో నాచురల్ డెలివరీ ప్రపంచవ్యాప్తంగా ప్రిఫర్ చేయబడిన ది బెస్ట్ మెథడ్. ఎందుకంటే అది తల్లి అండ్ బేబీ ఇద్దరికీ సేఫ్ ఈ నాచురల్ డెలివరీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే తల్లికి ప్రమాదం అని తెలిస్తే అప్పుడు సి సెక్షన్ డెలివరీకి ప్రిఫర్ చేస్తారు.
(01:30) మళ్ళీ చెప్తున్నాను నాచురల్ డెలివరీ పాసిబుల్ కాదు ఆ తల్లికి లేదా బిడ్డకి ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు మాత్రమే డాక్టర్లు సి సెక్షన్ డెలివరీ ప్రిఫర్ చేయాలి. కానీ సర్ప్రైజింగ్లీ మన ఇండియాలో అలా జరగట్లేదు. దానికి రివర్స్ జరుగుతుంది.డబల్యూహె్ఓ రిపోర్ట్ ప్రకారం ఒక దేశంలో సి సెక్షన్ పర్సంటేజ్ అనేది 10 టు 15% మాత్రమే ఉండాలి.
(01:52) అంటే దేశవ్యాప్తంగా పుట్టే పిల్లల్లో 10 టు 15% పిల్లలు మాత్రమే సి సెక్షన్ ద్వారా పుట్టాలి. ఆ నెంబర్ అంతకన్నా ఎక్కువ ఉంటే అది మంచిది కాదు. ఆ దేశంలో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. మరి మన దేశంలో ఈ పర్సెంటేజ్ ఎంత ఉంది అంటే 23.29% 29%డబల్యూహె్ఓ రికమెండ్ చేసిన దానికంటే చాలా ఎక్కువ రీసెంట్ ఇయర్స్ లో ఈ సంఖ్య విపరీతంగా పెరిగింది.
(02:18) 2008 నుంచి 2018 డేటా చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సి సెక్షన్ డెలివరీ 300% పెరిగింది. అదే ప్రైవేట్ హాస్పిటల్స్ లో 400% పెరిగింది. ఇలా సి సెక్షన్ డెలివరీ నంబర్స్ కేవలం మన దేశంలోనే కాదు అమెరికాలో కూడా పెరుగుతుంది. కానీ అక్కడి డాక్టర్లు ఈ విషయంలో చాలా సెన్సిటివ్ గా ఉన్నారు. వాళ్ళు ఈ నెంబర్ ని ఎలాగైనా తగ్గించాలి అని గవర్నమెంట్ తో కలిసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
(02:43) కానీ మన దేశంలో అలా జరగట్లేదు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే మన దేశంలో సి సెక్షన్ డెలివరీస్ ఇంతగా ఎందుకు పెరుగుతున్నాయి? సి సెక్షన్ డెలివరీ అనేది కొన్నిసార్లు మదర్ కి లైఫ్ త్రెట్నింగ్ గా మారుతుంది. అయినా కూడా ఎక్కువగా ఇవి ఎందుకు జరుగుతున్నాయి ఈ విషయాన్నే మనం ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. గాయస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే విషయాలు చాలా ఇంపార్టెంట్.
(03:05) ఈ విషయాలు మీ ఇంట్లో ఉండే ప్రతి మహిళకు తప్పకుండా తెలియాలి. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. ప్రజల్లో సి సెక్షన్ పట్లో ఒక అవేర్నెస్ రావాలి. అలాగే ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్ లో ప్రతిరోజు వస్తుంటాయి. వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది.
(03:32) సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. మొదటిసారి ఈ సి సెక్షన్ డెలివరీ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది డిబేటబుల్ అంటే దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ అనేది లేదు. ఎందుకంటే మన ఏన్షియంట్ హిందూ ఈజిప్షియన్ గ్రీస్ రోమన్ చైనీస్ ఈవెన్ యూరోపియన్ రికార్డ్స్ లో కూడా సి సెక్షన్ డెలివరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన ఇండియన్ రికార్డ్స్ ప్రకారం మన దేశంలో మొదటిసారిగా సి సెక్షన్ డెలివరీ 300 బిసి లో జరిగింది.
(03:59) కొన్ని రిపోర్ట్స్ ప్రకారం సెకండ్ మౌర్యన్ ఎంపరర్ బిందుసార తల్లి విషం వల్ల చనిపోయింది. ఆ సమయంలో చాణక్య సీ సెక్షన్ డెలివరీ చేసి ఆమె కడుపులో ఉన్న బేబీని బయటకు తీశారు. ఆ బేబీ ఎవరో కాదు ఈ బిందుసార ఆ టైంలో సి సెక్షన్ అంటే మహిళ చనిపోయిన తర్వాత ఆమె కడుపును కోసి బిడ్డను బయటకు తీయడం అంతేకానీ ఇప్పటిలాగా ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వడం కాదు.
(04:23) ఇంకో స్టోరీ ప్రకారం 46 బిసి లో రోమన్ రాజు అయిన జూలియస్ సీజర్ తన రాజ్యంలో ఒక ఆర్డర్ ని పాస్ చేశాడు. అది ఏమిటంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ చనిపోతే ఆమె కడుపును కోసి బేబీని బయటకు తీయొచ్చు అని. ఇలా చేసి తల్లి చనిపోయినా కూడా బేబీని కాపాడుకోవచ్చు. అందుకే అప్పటి నుంచి ఇలా కడుపును కట్ చేసి బేబీని బయటకు తీసే ప్రొసీజర్ ని సిజేరియన్ ఆర్ సి సెక్షన్ అంటారు అని కొంతమంది చరిత్రకారులు సజెస్ట్ చేస్తున్నారు.
(04:53) ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే పూర్వకాలంలో కూడా సి సెక్షన్ అనేది గర్భంతో ఉన్న మహిళ చనిపోయిన తర్వాత లేదా ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు మాత్రమే పర్ఫామ్ చేసేవారు. కానీ ఎప్పుడైతే మోడర్న్ మెడిసిన్స్ యాంటీసెప్టిక్ అనెస్ డెవలప్ అయ్యాయో అంటే 19 సెంచురీ తర్వాత మెల్లమెల్లగా సి సెక్షన్ సర్జరీల సంఖ్య విపరీతంగా పెరిగింది.
(05:16) రీసెంట్ ఇయర్స్ లో మన దేశంలో వీటి సంఖ్య 300 నుంచి 400% వరకు పెరిగింది. ఇది చాలా ప్రమాదం. అందుకే దీన్ని చాలా మంది ఎపిడమిక్ గా కన్సిడర్ చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సి సెక్షన్ డెలివరీ చేసి బేబీని తల్లిని కాపాడవచ్చు అందులో డౌటే లేదు. కానీ సి సెక్షన్ వల్ల తల్లి హెల్త్ కి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఏర్పడతాయి. ఇన్ఫెక్షన్ పెరుగుతుంది.
(05:40) సి సెక్షన్ తర్వాత రికవరీ పీరియడ్ నార్మల్ డెలివరీ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. రికవరీ అవ్వడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది. అండ్ ఇది చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇక ఫైనాన్షియల్ పోస్పెక్ట్ లో చూసినా కూడా సి సెక్షన్ మన జేబును ఖాళీ చేస్తుంది. అలాగే నార్మల్ డెలివరీతో కంపేర్ చేస్తే సి సెక్షన్ జరిగిన మహిళలు హాస్పిటల్లో ఎక్కువ సమయం ఉండాలి.
(06:03) అంటే ఈ హాస్పిటల్ వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు దోచుకుంటారు. ఈ సి సెక్షన్ డెలివరీ కాస్ట్ ఒక్కో సిటీలో ఒక్కో రకంగా ఉంటుంది. హాస్పిటల్ వైస్ కూడా మారుతూ ఉంటుంది. కానీ గవర్నమెంట్ డేటా ప్రకారం నార్మల్ డెలివరీకి యవరేజ్ గా 10వ000 రూపాయల వరకు ఖర్చుఅవుతుంది. అదే సి సెక్షన్ కి 23,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ గవర్నమెంట్ డేటా చాలా తక్కువ నెంబర్ ని చెబుతుంది.
(06:26) నిజం చెప్పాలంటే ప్రెజెంట్ సి సెక్షన్ 60,000 నుంచి,50,000 వరకు ఖర్చుఅవుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఈ నెంబర్ సిటీ బట్టి హాస్పిటల్ బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఓవరాల్ గా సి సెక్షన్ డెలివరీ అనేది నార్మల్ డెలివరీ కంటే రెండు నుంచి మూడు రేట్లు ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సి సెక్షన్ ద్వారా ఒక సైకలాజికల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అదే పోస్ట్పాటం డిప్రెషన్ సింటమ్.
(06:51) ఇది ఎక్కువగా చైల్డ్ బర్త్ తర్వాత మదర్స్ లో కనిపించే సైకలాజికల్ ఇష్యూ. ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా సి సెక్షన్ చేసుకున్న మహిళల్లోనే ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు బ్రదర్ ఏ రకంగా చూసినా సి సెక్షన్ అంత బెటర్ ఆప్షన్ కాదు అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు దేశంలో వీటి సంఖ్య ఎందుకు పెరుగుతుంది అని అయితే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ రీజన్ గురించి తెలుసుకుందాం.
(07:16) అదే నెంబర్ వన్ కార్పొరేట్ గ్రేడ్. గత కొన్ని సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. సి సెక్షన్ డెలివరీలు పెరగడానికి ఇది ఒక మేజర్ కారణం. 2021 డేటా ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరిగే డెలివరీస్ లో 47.4% సర్జరీ ద్వారా జరిగేవి. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కి నార్మల్ డెలివరీ కంటే సి సెక్షన్ డెలివరీలో ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది.
(07:42) అందుకే మీరు గమనించండి ప్రైవేట్ హాస్పిటల్స్ లో మాక్సిమం డాక్టర్లు మహిళల్ని సి సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కన్విన్స్ చేస్తారు. అలాగే ఈ సి సెక్షన్ డెలివరీ అనేది నార్మల్ డెలివరీ కంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇక్కడ మీరు గమనించండి సి సెక్షన్ డెలివరీ నార్మల్ డెలివరీ కంటే చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఈ సి సెక్షన్ డెలివరీ నార్మల్ డెలివరీ కంటే వేగంగా అయిపోతుంది.
(08:03) అండ్ సి సెక్షన్ తర్వాత తల్లి బిడ్డ ఇద్దరు హాస్పిటల్లో ఎక్కువ సమయం ఉండాలి. దీని ద్వారా డాక్టర్ కి ఆ హాస్పిటల్ కి బెనిఫిట్ ఎక్కువ డబ్బులు ఎక్కువగా ఛార్జ్ చేయవచ్చు. అలాగే ప్రెసెంట్ మోస్ట్ అర్బన్ ఏరియాస్ లో ప్రజల దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ులు ఉంటాయి. అందులో చాలా వాటిలో డెలివరీలు కవర్ అవుతాయి. అందుకే హాస్పిటల్ వాళ్ళు సి సెక్షన్ డెలివరీ చేసి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవచ్చు అనుకుంటారు.
(08:30) అండ్ ఇండియన్ మదర్స్ యొక్క ప్రిఫరెన్స్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఎక్కువమంది మహిళలు నార్మల్ డెలివరీలో చాలా పెయిన్ ఉంటుంది. దాన్ని మేము తట్టుకోలేము అని భయపడి సి సెక్షన్ ని చూస్ చేసుకుంటున్నారు. ఇంకో విషయం ఏమిటంటే చాలా ఫ్యామిలీలు సెంటిమెంట్ ని ఫాలో అవుతాయి. ముహూర్తాల్ని నమ్ముతారు. అందుకే డబ్బు ఉన్నవాళ్ళు మాకు ఫలానా రోజు ఫలానా టైం కి బేబీ కావాలి అని చెప్పి సర్జరీలు చేయించుకొని బేబీస్ ని కంటున్నారు.
(08:57) కానీ మీరు ఎప్పుడైనా డాక్టర్ ని మీరు సి సెక్షన్ ఎందుకు చేశారు అని అడిగితే వాళ్ళు పేషెంట్ సి సెక్షన్ అడిగారు ఇది త్వరగా అయిపోతుంది. ఫ్యామిలీ వాళ్ళు ముహూర్తం చూశారు అని సమాధానం ఇవ్వరు. లీగల్ గా ఇవ్వకూడదు. నిజానికి డాక్టర్లు మహిళని వాళ్ళ ఫ్యామిలీని సి సెక్షన్ తీసుకోకండి. నార్మల్ డెలివరీ మీకు మంచిది దాని వల్ల బెనిఫిట్స్ ఉంటాయని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్ చేయాలి.
(09:21) కానీ పాపం డాక్టర్లు ఒక రకంగా హాస్పిటల్లో పనిచేసే ఎంప్లాయీస్ పైగా ఈ కాలంలో డాక్టర్లకు నెలకు ఎన్ని సర్జరీలు చేయాలి అనే టార్గెట్ కూడా ఇస్తారు. అందుకే కొన్నిసార్లు డాక్టర్లు మహిళలకు కావాలని నాచురల్ డెలివరీ పెయిన్ ఫుల్ గా స్కేరీగా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళను సి సెక్షన్ తీసుకునేలా సైకలాజికల్లీ ప్రిపేర్ చేస్తారు.
(09:41) ఇలా చేయడం ఇల్లీగలా అంటే ఎస్ కానీ మనం దాన్ని ప్రూవ్ చేయలేము. ఇక రీజన్ నెంబర్ టూ చేంజ్ ఇన్ మోడర్న్ లైఫ్ స్టైల్. గత కొన్ని సంవత్సరాల నుంచి మన దేశంలో ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ కన్సంప్షన్ భారీగా పెరిగింది. దాంతో మదర్ కి అందాల్సిన సరైన పోషకాలు అందట్లేదు. అలాంటి సమయంలో సి సెక్షన్ తీసుకోవడమే ఆప్షన్ అవుతుంది.
(10:04) ప్రెజెంట్ మనం తినే ప్రతి ఫుడ్ లో షుగర్ ఫ్యాట్ ఎక్కువ మోతాదులో ఉంటున్నాయి. దాంతో మహిళలు ఓవర్ వెయిట్ కూడా అవుతున్నారు. కాస్త ఓవర్ వెయిట్ ఉన్నా కూడా నార్మల్ డెలివరీ పాసిబుల్ అవ్వదు. రీజన్ నెంబర్ త్రీ ఇంక్రీసింగ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి విషయంలో అంత ఇంట్రెస్ట్ గా లేరు. చాలా మంది ముందు కరియర్ ని బిల్డ్ చేసుకోవాలి లైఫ్ లో ఎంతో అంత సెటిల్ అవ్వాలి ఆ తర్వాతే పెళ్లి పిల్లలు అని ప్లాన్ చేస్తున్నారు.
(10:30) ఒక రకంగా ఆలోచిస్తే అది మంచి విషయమే. కానీ లైఫ్ లో సెటిల్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. దానికి చాలా సమయం పడుతుంది. సో అలా ప్రెజెంట్ జనరేషన్ లో యువకులు పెళ్లి టైం కల్ల 30 35 దాటేస్తున్నారు ఈవెన్ మహిళలు కూడా అయితే ఆ ఏజ్ లో ప్రెగ్నెంట్ అయిన మహిళలకి నార్మల్ డెలివరీ చేయడం చాలా కష్టం అండ్ రిస్కీ కూడా అందుకే వాళ్ళు ఎక్కువగా సి సెక్షన్ వైపు మొగ్గు చూపుతారు.
(10:54) సి సెక్షన్ డెలివరీ పెరగడానికి ఇంకో మంచి రీజన్ ఏమిటంటే మన దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా డెవలప్ అవ్వడం. మీరు గమనించండి మన చిన్నప్పుడు బేబీ డెలివరీలు ఇళ్లలో జరిగేవి ఊర్లో ఉండే పెద్ద వయసున్న మహిళలు డెలివరీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా జరుగుతుందా మాక్సిమం నో 20089 డేటా ప్రకారం ఇండియాలో 70.
(11:18) 6% బేబీ డెలివరీస్ హాస్పిటల్ లో జరిగేవి. ఈ నెంబర్ 2021 22 కల్ల 95.5% 5% కి పెరిగింది. తమిళనాడు, తెలంగాణ, పుదుచేరి లాంటి రాష్ట్రాల్లో అయితే 100% బేబీ డెలివరీ హాస్పిటల్స్ లోనే జరుగుతున్నాయి. ఇది చాలా మంచి విషయం. ఓవరాల్ గా హాస్పిటల్స్ లో బేబీల డెలివరీ పెరిగినప్పుడు సి సెక్షన్ డెలివరీస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రమాదకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో పెరిగిన సి సెక్షన్ డెలివరీ పర్సెంటేజ్డబల్యూహె్ఓ రికమెండ్ చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఉంది.
(11:51) అలాంటప్పుడు మరి వీటిని తగ్గించాలి. సి సెక్షన్ డెలివరీస్ ని మహిళలు ఎక్కువగా ప్రిఫర్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే దీనికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఎక్కువ సి సెక్షన్లు ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ పబ్లిక్ హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచాలి. ఎందుకంటే మీరు ప్రెసెంట్ డేటాను చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జరిగే మాక్సిమం డెలివరీస్ నార్మల్ డెలివరీ ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పెద్దగా డబ్బులు ఛార్జ్ చేయరు.
(12:18) వాళ్ళకు డబ్బు పైన ఆశ ఉండదు. సో వాళ్ళు తల్లి బిడ్డకు ఏదైతే బెటరో దాన్నే సజెస్ట్ చేస్తారు. కాబట్టి ప్రజలు ప్రైవేట్ వైపు వెళ్ళకుండా పబ్లిక్ హాస్పిటల్స్ వైపు రావాలి అంటే ఆ దేశంలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ యొక్క క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయాలి. నెంబర్ టూ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తమ దగ్గర జరిగే సి సెక్షన్ డెలివరీ సంఖ్యను బయటకు చెప్పాలి.
(12:41) అంటే ఆ హాస్పిటల్లో మొత్తం ఎన్ని డెలివరీలు జరిగాయి. అందులో సి సెక్షన్ డెలివరీలు ఎన్ని జరిగాయో బయటకు చెప్పాలి. దీని ద్వారా ఆ హాస్పిటల్ డబ్బు కోసమే సి సెక్షన్ చేస్తుంద అనే విషయం క్లియర్ గా అర్థంవుతుంది. ప్రజలు రియలైజ్ అవుతారు. ఉదాహరణకి ఒక హాస్పిటల్ లో లాస్ట్ ఇయర్ 90% డెలివరీస్ సి సెక్షన్ అయి ఉంటే ఆ హాస్పిటల్ ఖచ్చితంగా ప్రజల్ని దోచుకుంటుంది అని అర్థం.
(13:04) సో అలా వాళ్ళు సి సెక్షన్ డెలివరీ నెంబర్స్ ని పర్సంటేజ్ ని బయట పబ్లిక్ గా రివీల్ చేయాలి. ఆ హాస్పిటల్ ప్రొఫైల్ లో డిస్ప్లే చేయాలి. దాంతో ప్రజలకు ఏ హాస్పిటల్ కి వెళ్తే బెటర్ అనేది క్లియర్ గా అర్థంవుతుంది. నెంబర్ త్రీ సి సెక్షన్ డెలివరీ అండ్ నాచురల్ డెలివరీ ఈ రెండిటి ఫీస్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సి సెక్షన్ కి నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు మూడు నుంచి ఐదు రేట్లు ఎక్కువ చార్జ్ చేస్తారు.
(13:26) సో గవర్నమెంట్ ఈ రెండిటి ప్రైస్ ని ఆల్మోస్ట్ సేమ్ చేసేయాలి. ఎప్పుడైతే ఈ రెండిటి ఫీ సమానంగా ఉంటుందో అప్పుడు హాస్పిటల్స్ ఆర్ డాక్టర్స్ కృతి పడి సి సెక్షన్ చేయాలి అనుకోరు. నెంబర్ఫోర్ మన దేశంలో సి సెక్షన్ ఎప్పుడు చేయాలి అని చెప్పే ప్రాపర్ రూల్స్ గైడ్లైన్స్ లేవు. కాబట్టి ప్రభుత్వం అలాంటి గైడ్లైన్స్ ని తీసుకువచ్చి వాటిని డాక్టర్లు స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేలా చేయాలి.
(13:52) నెంబర్ ఫైవ్ మహిళలకి నార్మల్ డెలివరీ సి సెక్షన్ డెలివరీ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ని క్లియర్ గా తెలియజేయాలి. నార్మల్ డెలివరీ వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పాలి. సి సెక్షన్ డెలివరీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే నార్మల్ డెలివరీ ఈజీగా జరిగేలా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి ఎక్సర్సైజులు చేయాలి అనే విషయాన్ని ప్రతి ప్రెగ్నెంట్ మహిళకు తెలిసేలా చేయాలి.
(14:15) బై ద వే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ సి సెక్షన్ డెలివరీ కంప్లీట్ గా చెడ్డది అని చెప్పట్లేదు. నాచురల్ డెలివరీ పాసిబుల్ కానప్పుడు తల్లి బిడ్డకు అది ప్రమాదంగా మారినప్పుడు సి సెక్షన్ తప్పకుండా చేయాలి. కానీ అవసరం లేని సమయంలో కూడా సి సెక్షన్ డెలివరీ చేయడం అంత మంచిది కాదు. దానివల్ల హెల్త్ కి సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి.
(14:37) అండ్ బాడీ కూడా అంత త్వరగా రికవర్ అవ్వదు. ఒకసారి సి సెక్షన్ జరిగిందా రెండవ బేబీకి కూడా మళ్ళీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మహిళల బాడీ మరింత డామేజ్ అవుతుంది. అలాగే నాచురల్ డెలివరీ ద్వారా బేబీని కంటే ఆ బేబీలో ఇమ్యూన్ సిస్టం కూడా వేగంగా డెవలప్ అవుతుంది. అండ్ నాచురల్ డెలివరీ అనేది బేబీ అండ్ మదర్ యొక్క బాండ్ ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది.
(15:00) వాళ్ళను ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. సో మొత్తంగా ఇవి ఈ వీడియోలో నేను మీకు చెప్పాలి అనుకున్న విషయాలు. ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు ప్రతి మహిళకి మీ ఇంట్లో ఉన్న మీ అక్క చెల్లి వదిన అమ్మ అందరికీ ఈ విషయాలు తెలియాలి కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరితో మీకు తెలిసిన ప్రతి మహిళతో షేర్ చేయండి అండ్ మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై
(15:33) భారత్ భారత్ మాతా కి జై హాయ్

No comments:

Post a Comment