Sunday, July 12, 2026

👹నిన్ను చంపేది ప్రభుత్వం కాదు. నీ అజ్ఞానానికి చప్పట్లు కొట్టే ప్రేక్షకులు | PRASHNA RAVAN

👹నిన్ను చంపేది ప్రభుత్వం కాదు. నీ అజ్ఞానానికి చప్పట్లు కొట్టే ప్రేక్షకులు | PRASHNA RAVAN

Author Name:PRATIKULA VEDAM

Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_3W3Mpv3c5w



Transcript:
(00:00) సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్ లో ప్రస్తుతం ఒకటే హడావడి ప్రశ్న రావణ్ అరెస్ట్ బెయలు బయటికి రాకముందే మళ్ళీ అరెస్ట్ మళ్ళీ బెయలు ఇలా ఐదు సార్లు జరిగిన ఈ హై డ్రామా చివరికి యుఏపిఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే బ్రహ్మాస్త్రంతో నెల్లూరు సెంట్రల్ జైలుకి చేరింది. ఒక సాధారణ యూట్యూబర్ ని చూసి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇంతలా ఎందుకు రియాక్ట్ అయింది అసలు తప్పు ఎవరిది ముందుగా ప్రశ్న రావణ్ గురించి మాట్లాడుకుందాం.
(00:29) సమాజాన్ని నాయకుల్ని లాజికల్ గా ప్రశ్నించిన సోక్రటీస్ లాంటి వాళ్ళని ఈ ప్రపంచం ఒక ఫిలాసఫర్ గా గుర్తుపెట్టుకుంది. కానీ లాజికల్ గా అడిగే ప్రశ్నకి అహంకారంతో కూడిన దోషణనికి మధ్య ఒక సన్నని గీత ఉంటది. ఈ యూట్యూబ్ లాంటి ప్లాట్ఫార్మ్స్ మనుషుల్లో ఒక గాడ్ కాంప్లెక్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఒక వీడియో వైరల్ అవ్వగానే కామెంట్స్ లో అన్నా నువ్వు తోపు అన్నా సూపర్ అన్నా ఎవడికీ భయపడకన్నా అని అనగానే ఆ అటెన్షన్ ని ఇంకాస్త పెంచుకోవడం కోసం వ్యూస్ కోసం మెల్లగా లాజిక్ ని వదిలేసి ఎమోషన్ కి బూతులకి షిఫ్ట్ అవుతున్నారు.
(01:03) తత్వవేత్త ఫ్రెడ్రిక్ నీచే ఒక మాట అంటాడు రాక్షసులతో పోరాడేవాడు తాను రాక్షసుడిగా మారిపోకుండా జాగ్రత్త పడాలి అని ఒక సిస్టం ని విమర్శించేటప్పుడు నీ మాటల్లో పదును ఉండాలి గానీ పర్సనల్ అబ్యూస్ ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు ఎమోషనల్ అయిపోయి దోషణలకు దిగావో నిన్ను నాశనం చేయడానికి కావలసిన ఆయుధాన్ని వాళ్ళ చేతికి నీకు నువ్వే స్వయంగా ఇచ్చినట్టు ఇక ప్రభుత్వం వైపు చూద్దాం.
(01:27) ఒక యూట్యూబర్ ఏదో వాగాడు పోలీసులు కేసు పెట్టారు కోర్టులో హాజరపరిచారు బెయిల్ వచ్చింది. అక్కడితో ఆ చట్టపరమైన ప్రాసెస్ ని వదిలేయచ్చు కదా కానీ జరిగిందఏంటి ఒక కేసులో బెయలు రాగానే మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ అది కూడా కాకినాడ ఏలూరు పిఠాపురం ఇలా వరుసగా వివిధ జిల్లాల్లో నటుడు ప్రకాష్ రాజు గారు ప్రశ్నించినట్టు ఇది న్యాయస్థానాలని అపహస్యం చేయడం కాదా వాడు బెయలు మీద ఎలా బయటిక వస్తాడో మేము చూస్తాం అనే ఒక విండడిక్టివ్ పాలిటిక్స్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
(01:56) అధికారం చేతిలో ఉన్నప్పుడు ఒక బేసిక్ లాజిక్ మిస్ అవుతుంటారు. ఒక దోమను చంపడానికి ఏకంగా బుల్డోజర్ ని వాడకూడదు ఒక చిన్న యూట్యూబర్ ని పట్టుకొని రాష్ట్ర పోలీసు యంత్రాంగం మొత్తం అతని చుట్టూ తిరుగుతుంటే అది ఆ యూట్యూబర్ కి లేనిపోని హీరో ఇమైజ్ ని తీసుకురావడమే తప్ప ప్రభుత్వానికి వచ్చే మైలేజ్ శూన్యం. సిస్టం పవర్ఫుల్ గా ఉన్నప్పుడు విమర్శలను కూడా స్వీకరించే ధైర్యం ఉండాలి.
(02:20) అంతేగానీ ఎవడరా నువ్వు మమ్మల్నే అంటావా అని ఈగోకుపోయి ఒక వ్యక్తి మీద కక్ష సాధింపుకు దిగితే అది సిస్టం యొక్క ఇన్సెక్యూరిటీని బయట పెడుతుంది. ఇక మళ్ళీ ఈ రావని విషయానికి వద్దాం. ఇతనికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఎంత తెలుసో మనకు తెలీదు. నాకు నచ్చింది నేను మాట్లాడతా అది నా రాజ్యాంగ హక్కు అని అనుకున్నాడో ఏంటో గానీ ఇక్కడ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్లో ఒక పచ్చి నిజం ఉంది.
(02:45) ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం మన దేశంలో వాక్ స్వేచ్ఛ అనేది అబ్సల్యూట్ కాదు దానికి కొన్ని పరిమితులు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నేషనల్ సెక్యూరిటీ పబ్లిక్ ఆర్డర్ డీఫమేషన్ లాంటి గ్రౌండ్స్ మీద మన గొంతు నొక్కే అధికారం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక కఠోర సత్యం ఏంటంటే చట్టం అనేది ఎప్పుడూ న్యూట్రల్ గా కళ్ళకి గంతలు కట్టుకొని ఉండదు.
(03:11) సిస్టం ని క్వశ్చన్ చేయాలి అనుకున్నవాడు సాక్రటీస్ లాగా లాజికల్ గా చేయాలి. అవతలి వాళ్ళు నీ మాటల్లో తప్పు పట్టలేకపోవాలి. అంతేగాని గీత దాటి మాట్లాడి కేసుల్లో ఇరుక్కొని చివరికి నాకు వాక్స్ వేచ లేదా అని ఏడిస్తే ఇక్కడ ఎవ్వడు సింపతీ చూపించరు. ఇక అతని ఫోన్లో పదుల సంఖ్యల్లో యువతుల అశ్లీడి వీడియోలు ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేశాడని వార్తలు వస్తున్నాయి.
(03:36) ఈ వార్తల వెనకున్న లాజిక్ ఏంటి నిజంగా ఉన్నాయా లేదా ప్లాన్ చేశారా? పోలీసులు అఫీషియల్ గా కోర్టుకి ఫారెన్సిక్ రిపోర్ట్ సమర్పించే వరకు ఏది నిజం కాదు కానీ ఈ వార్తలు ఖచ్చితంగా ఈ టైంలోనే మీడియాకి ఎందుకు లీక్ అయ్యాయి అన్నదానికి ఒక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ లాజిక్ ఉంది. ఒక వ్యక్తిని ప్రభుత్వం కక్షగట్టి యూఏపిఏ లాంటి చట్టాలతో లోపల వేసినప్పుడు జనాల్లో అతనిపై తెలియకుండానే ఒక సానుభూతి వస్తది.
(04:02) పాపం ప్రశ్నించాడు కాబట్టే ఇలా టార్గెట్ చేశారు అని జనాలు అనుకుంటారు. అప్పుడు ఏమయ్యే అవకాశం ఉంది అతను ఒక అమరవీరుడులాగా మారే ప్రమాదం ఉంది. చరిత్రలో పాలకులకు అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే ప్రజలు ఒక విమర్శకుడిని హీరోగా చూడటం అండ్ ఆ హీరో ఇమేజ్ ని ఒకే ఒక దెబ్బతో చంపేయాలి. కానీ ఎలా నైతిక ఆధిపత్యాన్ని నాశనం చేయడం ద్వారా వీడు సమాజాన్ని ఉద్ధరించేవాడు కాదు వీడు ఉన్మాది ఫోన్లో అమ్మాయిల అశ్లీల్ వీడియోలు పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే పచ్చి క్రిమినలు అని ఎప్పుడైతే ఈ లీక్ ని మీడియాలోకి వదిలారో గేమ్ మొత్తం మారిపోయింది.
(04:39) ఇప్పుడు పబ్లిక్ కే వాడికి ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి గాని రాజ్యం గురించి గాని ఉపా చట్టం వాడటం కరెక్టా కాదా అనే దాని గురించి గాని ఆలోచించే ఇంట్రెస్ట్ పోతుంది. జనాలు ఆటోమేటిక్ గా వామ్మో వీడు ఇంత కామాంధుడా వీడికి జైలే కరెక్ట అని డిసైడ్ అయిపోతారు. ఇది పొలిటికల్ స్ట్రాటజీలో మోస్ట్ క్లాసిక్ మూవ్ ఒకరిని సైద్ధాంతికంగా చంపలేనప్పుడు నైతికంగా చంపేయాలి.
(05:04) అప్పట్లో సాక్రటీస్ ని చంపే ముందు కూడా ప్రభుత్వం మోపిన నేరం ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని కాదు యువతను నైతికంగా పాడు చేస్తున్నాడు అని టెక్నాలజీ మారింది కానీ ప్రభుత్వాలు వాడే సైకాలజీ మాత్రం వేల ఏళ్లుుగా ఒకటే ఒకవేళ రేపు పొద్దున్న ఫారెన్సిక్ రిపోర్ట్ లో అలాంటి వీడియోలు ఏమీ లేవు అని తేలినా ఎవ్వడికీ అనవసరం ఎందుకంటే జరగాల్సిన డ్ామేజ్ జరిగిపోయింది పబ్లిక్ మైండ్ లో ముద్ర పడిపోయింది.
(05:30) [సంగీతం] డిజిటల్ యుగంలో మీ గతం ఎప్పటికీ చెరిగిపోదు. నువ్వు ఈరోజు ఒక పవర్ఫుల్ సిస్టం తో పెట్టుకున్నప్పుడు వాళ్ళు నిన్ను దెబ్బ తీయడానికి నీ పాత తప్పులనే వెతుకుతారు. యుఏపిఏ లో ఇరుక్కుంటే బెయిల్ రావడం దాదాపు అసాధ్యం. చూసారా కేవలం ఒక వ్యక్తిగత దోషణల స్థాయి నుంచి జాతీయ భద్రతకే భంగం కలిగించే వ్యక్తి అని ఈ కేస్ ఎలా టర్న్ అయిందోదిస్ ఇస్ హౌ ద సిస్టం రూత్లెస్లీ అట్స్మార్ట్స్ ఇఫ్ యు డోంట్ నో ద రూల్స్ ఆఫ్ ద గేమ అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవ్వరు పెద్దగా పట్టించుకొని ఒక సైలెంట్ విలన్ ఉన్నాడు.
(06:03) వాడే ప్రేక్షకుడు. సోషల్ మీడియా అనేది ఒక రోమన్ కొలోజియం లాంటిది. కిందన గ్లాడియేటర్ లో ఒకరినొకరు నరుక్కుంటూ రక్తం చిందిస్తూ ఉంటే పైన కూర్చున్న ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తారు. ఈ కొట్లాటలో ఎవరైనా చనిపోతే వాళ్ళకది జస్ట్ ఒక రోజుకు సరిపోయే ఎంటర్టైన్మెంట్ మాత్రమే చీకటి పడగానే ఎవరి ఇల్లక వాళ్ళు వెళ్ళిపోయి ప్రశాంతంగా నిద్రపోతారు.
(06:24) చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఈ ఆడియన్స్ అప్రూవల్ అనే ట్రాప్ లో పడిపోయి జనాలకి ఏది ఇస్తే కిక్ వస్తుందో అదే చేద్దామని రెచ్చిపోతున్నారు. కానీ తీరా ఇలాంటి కేసులు ఫేస్ చేసి జైలు పాలైనప్పుడు ఆ రోజు చప్పట్లు కొట్టిన ఆడియన్స్ లో ఏ ఒక్కడు కూడా నీతో పాటు జైలుకి రాడు నీ కోర్టు ఫీస్ కట్టడు చివరికి నాశనమయ్యేది నీ కెరియర్ నీ ఫ్యామిలీ లైఫ్ మాత్రమే సో ఈ మొత్తం ఇన్సిడెంట్ మనకి నేర్పుతున్న గుణపాఠం ఏంటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఒకరి మీద కోపం ఉండొచ్చు ఒక రాజకీయ విధానం మీద ద్వేషం ఉండొచ్చు కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మీ బ్రెయిన్ ని లాజిక్ ని
(06:56) మాత్రమే నమ్ముకోండి ఎమోషన్ ని కాదు పాయింట్ నెంబర్ టూ సిస్టం దగ్గర ఎప్పుడు ఎప్పుడు అపరిమితమైన పవర్ ఉంటుంది. నువ్వు గాని ఒక చిన్న రాయి విసిరితే వాళ్ళు ఏకంగా బుల్డోజర్ తో వస్తారు. కాబట్టి ఫైట్ చేసేటప్పుడు నీ పరిమితులు ఏంటో నీకు పక్కగా తెలియాలి. చివరిగా పాయింట్ నెంబర్ త్రీ నువ్వు నిజంగా సమాజంలో ఒక మార్పు తేవాలి అనుకుంటే బయట ఉండి నీ తెలివితో ప్రజల ఆలోచనలు మార్చాలి గానీ జైల్లో కూర్చొని కాదు.
(07:24) ఏదో సాధించేద్దాం అని పిచ్చి ఆవేశంతో అమలుడిగా అవ్వడం కన్నా బతికి ఉండి సిస్టం ని లోపల నుంచి అటాక్ చేసే స్ట్రాటజిస్ట్ గా ఉండటం ఎంతో ముఖ్యం ప్రశ్నించడం తప్పు కాదు కానీ ఎలా ప్రశ్నించాలో ఏ లిమిట్స్ లో ఉండాలో తెలియకపోవడం అతి పెద్ద మూర్ఖత్వం. అలాగే అధికారాన్ని ఉపయోగించుకొని తప్పు చేసిన వాడిని చట్టపరంగా శిక్షించడం తప్పు కాదు. కానీ కేవలం మీ ఈగో దెబ్బతిందని ప్రతీకారంతో బ్రహ్మాస్త్రాలు వాడటం కూడా కచ్చితంగా అధికార దుర్వినియోగమే.
(07:51) ఈ కేసు రాబోయే రోజుల్లో ప్రతి పౌరుడికి తనకి వాక్ స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడే ప్రతి కంటెంట్ క్రియేటర్ కి ఒక చెంప పెట్టు లాంటి కేస్ స్టడీ అందుకే ఒక మాట మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించాలి అంటారు. ఎందుకంటే మాట్లాడటం ఫ్రీనే కావచ్చు కానీ దాని వల్ల వచ్చే పరిణామాలు మాత్రం చాలా చాలా ఖరీదైనవి. కోపాన్ని ఒక ఆయుధంగా వాడాలి కానీ ఆ కోపమే నిన్ను ఆయుధంగా వాడే పరిస్థితి రాకూడదు అవునా కాదా

No comments:

Post a Comment