Sunday, July 12, 2026

The Modern Bhishma Who Always Suffers - Mahabharat In Telugu - LifeOrama Podcast EP07

The Modern Bhishma Who Always Suffers - Mahabharat In Telugu - LifeOrama Podcast EP07

Author Name:LifeOrama

Youtube Channel Url:https://www.youtube.com/@LifeOramaOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=l38lZ9-nGEY



Transcript:
(00:00) ఇవాల్టి ఎపిసోడ్ లో చాలా మంది కొన్ని విషయాలకు రిలేట్ అవుతారు. మరి కొంతమంది అయితే నిజాలను ఒప్పుకోలేకపోతారు. ఇంకొంతమంది అయితే చివరిలో మహాభారతం ఇచ్చే సొల్యూషన్ ని కనీసం ఒక్కసారైనా ట్రై చేయాలనుకుంటారు. అయితే స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు అలవాటులో మగవాళ్ళ కష్టాలను అడ్రెస్ చేసినట్టు ఉంటుంది. కానీ మీరు సరిగ్గా గమనిస్తే ఇది ఆడా మగ అనే తేడా లేకుండా ఒక కామన్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ గురించి అండ్ వాళ్ళ యాక్షన్స్ ని ఉద్దేశించినట్టు ఉంటుంది.
(00:28) సో ఈ చిన్న విషయాన్ని మీరు జెండర్ బయాస్ లేకుండా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నువ్వు ప్రతిరోజు పొద్దున్నే నిద్ర లేవగానే ఆ హడావిడిలో ఆఫీస్ కో లేదా పనికో బయలుదేరుతావు. కార్ స్టీరింగ్ వీల్ పట్టుకొని లేదా ఒక హెవీ ట్రాఫిక్ జామ్ లో బైక్ మీద కూర్చొని చుట్టూ ఉన్న గందరగోళాన్ని చూస్తూ ఉంటావు. నీ పక్క సీట్లో నీ పార్ట్నర్ కూర్చొని ఉండొచ్చు.
(00:49) లేదా నీ వెనక సీట్లో నీ పిల్లలు స్కూల్ బ్యాగ్స్ వేసుకొని అల్లరి చేస్తూండొచ్చు. బయట ప్రపంచానికి అదిఒక చాలా నార్మల్ హ్యాపీ ఫ్యామిలీ పిక్చర్. కానీ కరెక్ట్ గా ఆ సిగ్నల్ దగ్గర బండి ఆగినప్పుడు సడన్ గా నీ చాతిలో ఒకలాంటి సఫకేటింగ్ పానిక్ వేవ్ నిన్ను గట్టిగా పిండేస్తుంది. నీ కళ్ళ ముందు అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఫిజికల్ కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి.
(01:09) కానీ మనసు లోపల మాత్రం ఒక అదృశ్యమైన సంకెళ్ళతో ఎవరో నిన్ను గట్టిగా కట్టేసినట్టు ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా ఎప్పుడో ఏళ్ల క్రితం చాలా యంగ్ గా ఉన్నప్పుడు కేవలం ఒకరి సంతోషం కోసమో లేదా ఒక బాధ్యత కోసమో నువ్వు ఒక మాట ఇచ్చావు. ఒక కమిట్మెంట్ తీసుకున్నావు. కాలం గడిచే కొద్దీ ఆ మాట నీ చుట్టూ ఉన్న వాళ్ళకు ఒక నమ్మకంలా మారిపోయింది.
(01:31) కానీ నీకు మాత్రం ఒక ఇనుప పంజరంలా మారింది. అందరి కళ్ళల్లో నువ్వు ఒక పర్ఫెక్ట్ ప్రొవైడర్ వి ఒక గ్రేట్ హ్యూమన్ బీయింగ్ వి కానీ నువ్వు గౌరవిస్తున్న ఆ ఫేక్ గౌరవమే నిన్ను లోపల నుంచి నిలువున చంపేస్తుంది. ఇదొక సైలెంట్ ఇన్విజబుల్ క్రైసిస్. నీకు దక్కిన ఆ స్థానమే నిన్ను బంధించే జైల్ గా మారిపోయింది. ఈ కంటిన్యూస్ ఆటో పైలట్ ప్రయాణంలో నీ మైండ్ ఒక విచిత్రమైన మెంటల్ అకౌంటింగ్ రన్ చేస్తుంది.
(01:54) నువ్వు వచ్చే నెల ఈఎంఐస్ గురించో లేక ఆఫీస్ లో వచ్చే మార్పుల గురించో ఆలోచించట్లేదు. నువ్వు నీ సొంత రెస్పెక్ట్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ వేస్తున్నావు. నేను ఎప్పుడూ ఒక మంచి కొడుకులా లేదా మంచి కూతురుగా ఉండాలి. నేను ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ గా నిలబడాలి. నేను ఆఫీస్ నమ్మకాన్ని ఎప్పటికీ బ్రేక్ చేయకూడదు.
(02:12) ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నీ భుజాల మీద మోస్తూ మోస్తూ నీ సొంత ఇష్టాలు ఏంటో నువ్వు పూర్తిగా మర్చిపోయావు. ఒక కమిట్మెంట్ ని నిలబెట్టుకోవడం కోసం నీ డైలీ హ్యాపీనెస్ ని నువ్వు ప్రతిరోజు బలిస్తున్నావు. నీ లోపల ఉన్న నిజమైన వాయిస్ ఏమో గట్టిగా అరవాలనుకుంటుంది. కానీ నీ ఇగో మాత్రం నువ్వు ఇచ్చిన మాటను ఎలా బ్రేక్ చేస్తావు అంటూ నిన్ను భయపెడుతుంది. అందరి కళ్ళల్లో నువ్వు ఒక గొప్ప త్యాగధనుడిలా ఒక ఆదర్శ ప్రాయుడిలా కనిపిస్తావు.
(02:36) కానీ అద్దంలో చూస్తున్నప్పుడు ఒక అలసిపోయిన ప్రాణం లేని యాక్టర్ మాత్రమే నీకు కనిపిస్తాడు. ఈ కమిట్మెంట్ నిన్ను రక్షించట్లేదు. అది నిన్ను లోపల నుంచి తినస్తుంది. దీన్నే మనం మోడర్న్ సైకాలజీలో వర్చూ పెరాలసిస్ అంటాం. అంటే మన మంచి గుణాలే మనకుఒక పెద్ద ఉచ్చులా మారడం. సమాజంలో చెడ్డవాళ్ళు తమ స్వార్థం వల్ల నాశనం అయపోతారు.
(02:56) ఇది మనకు బాగా తెలుసు. కానీ చాలా మంది మంచివాళ్ళు ఎందుకు నాశనం అయపోతారో తెలుసా తమ మంచితనాన్ని కాపాడుకునే ఆ తాపత్రయం వల్లే ఒక డెడ్ మ్యారేజ్ నుంచి బయటకు రాలేకపోవడం ఒక స్టాగ్నెంట్ జాబ్ ని వదలలేకపోవడం లేదా ఒక టాక్సిక్ ఫ్యామిలీ ప్రామిస్ ని జీవితాంతం మోస్తూ బతకడం ఇవన్నీ మనం గౌరవం అనే ముసుగు వేసుకొని చేసే సెల్ఫ్ డిస్ట్రక్షన్ పనులే నువ్వు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటావు కానీ నీ మంచితనమే నిన్ను పారలైజ్ చేస్తుంది.
(03:22) నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు ఏమైపోతారు నేను గతంలో ఇచ్చిన మాట తప్పితే నన్ను ఒక విలన్ లా చూస్తారేమో అనే భయం నిన్ను కదలలేని ఇసక తిన్నలా మార్చేస్తుంది. ఈ ట్రాప్ ఎంత భయంకరమైనది అంటే నువ్వు ఒక పంజరంలో ఉన్నావని నీకు తెలుసు. కానీ ఆ పంజరం తలుపులకు ధర్మం అనే తాళం వేసి ఉండటం వల్ల నువ్వు దాన్ని బ్రేక్ చేయడానికి కూడా భయపడతావు.
(03:43) ఈ మెంటల్ ట్రాప్ ని మనం ఇవాళ నిన్నో మొన్నో వచ్చిన కార్పొరేట్ స్ట్రక్చర్స్ లో చూడట్లేదు. దీనికి హ్యూమన్ హిస్టరీ లోనే ఒక అతి పెద్ద మోస్ట్ ఫేమస్ కేస్ స్టడీ ఉంది. అదే వ్యాస మహాభారతంలోని భీష్ముడి కథ. మహాభారతం గురించి ఆలోచించగానే మనకు రథాలు ఆయుధాలు గుర్తొస్తాయి. కానీ ఆ విజువల్స్ కాసేపు పక్కన పెట్టి హస్తినాపురం కోటని ఒక్కసారి గమనించు.
(04:04) అది కేవలం ఒక రాజ్య వైభవం ఉన్న కోట కాదు. ఒక మనిషి తన సొంత చేతులతో నిర్మించుకున్న ఒక గోల్డెన్ జైల్. అక్కడ భీష్ముడు అనే ఒక మహాయోధుడు ఎవ్వరికీ లొంగని శక్తి ఉన్న ఒక పితామహుడు తన సొంత శపదం అనే బంగారు సంకెళ్లతో కట్టబడి కూర్చున్నాడు. ఆయన చేసిన ఆ త్యాగం ఆయన పలికిన ఆ మాట విశ్వమంతా గుర్తించింది. కానీ అదే మాట హస్తినాపుర వినాశనానికి ఎలా ఒక బ్లూప్రింట్ లా మారిందో వ్యాస మహాభారతం మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది.
(04:30) భీష్ముడి కథ ఒక రాజు కథ కాదు. అది మనలాంటి ప్రతి గృహస్తుడు అంటే ఫ్యామిలీ మ్యాన్ ప్రతి ప్రొఫెషనల్ ఎదుర్కొనే ఇంటర్నల్ కురుక్షేత్రం. కథలోకి వెళ్తే మొదట భీష్ముడి పేరు అసలు భీష్ముడే కాదు. అతను కేవలం గంగా పుత్రుడైన దేవవ్రతుడు. తన తండ్రి సంతన మహారాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అతను ఒక సాదా సీదా రాకుమారుడు కాదు మానవ సామర్థ్యానికి అత్యున్నత శిఖరం అబ్సల్యూట్ పీక్ ఆఫ్ హ్యూమన్ కాంపిటెన్స్ బృహస్పతి దగ్గర రాజనీతి చదివాడు.
(04:59) శుక్రాచార్యుడి దగ్గర శాస్త్రాలు నేర్చుకున్నాడు. పరశురాముడి దగ్గరే ధనుర్విద్యను అభ్యసించి సాక్షాత్ క్షత్రియులకే ఒక భయంకరమైన సవాలుగా నిలబడ్డాడు. రూపాన్నే కాదు విజ్ఞానాన్ని పరాక్రమాన్ని అపారంగా కలిగి ఉన్న ఒక పర్ఫెక్ట్ లీడర్ సంతనుడు తన కొడుకును చూసి గర్వంతో ఒప్పొంగిపోయాడు. హస్తినాపుర భవిష్యత్తు చాలా సురక్షితమైన చేతుల్లో ఉందని అందరూ నమ్మారు.
(05:21) దేవవ్రతుడి ముందర ఒక అద్భుతమైన కరియర్ ఒక గొప్ప సామ్రాజ్యం అంతులేని అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను ఒక నూతన సకాన్ని సృష్టించగల సామర్థ్యం ఉన్నవాడు కానీ సరిగ్గా అంతా పర్ఫెక్ట్ గా ఉందనుకున్న టైంలోనే అతని ముందర ఒక విచిత్రమైన గజిబిజిగా ఉండే ప్రైవేట్ క్రైసిస్ ని తీసుకొచ్చి పడేసింది. ఆ క్రైసిస్ ఎక్కడి నుంచో రాలేదు.
(05:41) దేవవ్రతుడి తండ్రి అయిన సెంతన మహారాజు నుంచే వచ్చింది. సెంతనుడు ఒకరోజు యమునా నది తీరాన తిరుగుతూ దాసరాజు కూతురైన సత్యవతిని చూసి మోహన్లో పడిపోయాడు. ఒక ముసలి రాజు పెరిగి పెద్దైన ఒక మహా సామర్థ్యం ఉన్న కొడుకున్న తండ్రి తన లోపల ఉన్న ఒక పర్సనల్ కోరికను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సత్యవతిని పెళ్లి చేసుకోవాలనే ఆ అబ్సెషన్ అతని కళ్ళను పూర్తిగా కప్పేసింది.
(06:03) దాసరాజు పెట్టిన కండిషన్స్ కి భయపడి తన బాధను ఎవ్వరికీ చెప్పుకోలేక లోలోపలే కొళ్లిపోతూ అనారోగ్యం పాలయ్యాడు. దేవవ్రతుడు తన తండ్రి ముఖంలో ఉన్న ఆ మార్పును ఆ సైలెంట్ డిప్రెషన్ ని గమనించాడు. ఒక బాధ్యత గల కొడుకుగా తండ్రికి వచ్చిన కష్టం ఏంటో తెలుసుకోవడం అతని డ్యూటీ కానీ ఆ డ్యూటీ వెనక ఒక భయంకరమైన పేరెంట్స్ ఇన్సెక్యూరిటీ దాగుందనే నిజాన్ని ఆ యంగ్ మైండ్ పసిగట్టలేకపోయింది.
(06:27) తండ్రి సంతోషం కోసం కొడుకు తన సర్వస్వాన్ని త్యాగం చేయాల్సిన ఒక అన్ఫెర్ సిచువేషన్ అక్కడ క్రియేట్ అయ్యింది. దేవవ్రతుడు తన తండ్రి రథసారధి ద్వారా అసలు విషయం తెలుసుకొని నేరుగా దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎలాంటి రాజీ లేదు. కేవలం ఒక పక్కా బిజినెస్ డీల్ లాంటి అల్టిమేటం మాత్రమే ఉంది. దాసరాజు చాలా క్లియర్ గా చెప్పాడు. మహారాజుకు నా కూతురిని ఇవ్వాలంటే ఆమెకు పుట్టే కొడుకే హస్తినాపురానికి తర్వాతి రాజు అవ్వాలి.
(06:51) నీలాంటి సర్వసామర్థుడైన యువరాజు పక్కన ఉండగా నా కూతురి పిల్లలకు న్యాయం జరుగుతుందని నేను నమ్మలేను. ఈ మాటలు ఒక యంగ్ ప్రొఫెషనల్ లేదా ఒక కొడుకు లేదా కూతురు వీళ్ళకు ఎదురయ్యే ఒక క్లాసిక్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఒకవైపు తండ్రి ప్రాణాలు ఇంకోవైపు తన సొంత లీగల్ రైట్స్ దేవవ్రతుడు అక్కడ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.
(07:14) అతని మనసులో కేవలం ఒకే ఒక్క ఆలోచన ఉంది. నా తండ్రి సంతోషమే నాకు ముఖ్యం. అతను దాసరాజు ముందర నిలబడి తన లైఫ్ లోనే ఫస్ట్ లేయర్ ఆఫ్ సాక్రిఫైస్ ని ప్రకటించాడు. నేను నా రాజ్య అధికారాలన్నిటిని వదులుకుంటున్నాను. సత్యవతి కొడుకే హస్తినాపురానికి రాజవుతాడు అని అంటూ ఒక శపదం చేశాడు. దేవవ్రతుడు చేసిన ఈ త్యాగం ఆ రోజుకి అతనికి ఎంతో చిన్నదిగా అనిపించింది.
(07:37) ఎందుకంటే అతను జన్మనిచ్చిన తండ్రి కోసం ఒక ఫిజికల్ వస్తువుని అంటే ఆ కిరీటాన్ని దానితో వచ్చే పదవిని మాత్రమే వదులుకుంటున్నాడు. ఇవాళ కూడా చాలా మందికి లైఫ్ లో ఇలానే జరుగుతుంది. ఫ్యామిలీ లేదా లైఫ్ పార్ట్నర్ కోసం తమకు నచ్చిన ఒక పెద్ద జాబ్ ప్రొఫైల్ లేదా ఒక కరియర్ గ్రోత్ ని వదులుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకు ఒక గొప్ప త్యాగం చేశమనే ఒక హై ఫీలింగ్ ఉంటుంది.
(07:59) దేవవ్రతుడు కూడా ఆ సింహాసనాన్ని వదులుకున్నప్పుడు ఒక నాయకుడిలానే ఆలోచించాడు. రాజ్యం పోయినా నా పరాక్రమం నా దగ్గరే ఉంది. నేను ఎక్కడైనా బతకగలను అని అనుకున్నాడు. కానీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళ స్వార్థం ఎప్పుడూ కూడా ఒక్క అడుగుతో ఆగదు. దాసరాజు దేవవ్రతుడి మంచితనాన్ని అతని బలహీనతను గమనించాడు. మరింత లోతుగా ప్రమాదకరంగా ఉండే నెక్స్ట్ కండిషన్ ఏంటో చెప్పాడు.
(08:22) ఎందుకంటే స్వార్థానికి హద్దులు ఉండవు. నువ్వు ఎంత వంగితే నిన్ను అంత లొంగ తీసుకోవడానికి ఈ లోకం ట్రై చేస్తూనే ఉంటుంది. దాసరాజు దేవవ్రతుడి వైపు చూసి నవ్వుతూ ఇలా అన్నాడు. నువ్వు ధర్మాత్ముడివి నీ మాటలు నువ్వు నిలబెట్టుకుంటావు. అది నేను నమ్ముతాను. కానీ రేపు నీకు పెళ్లయ్యి నీకు పుట్టబోయే పిల్లలు కూడా నీలాగే మహా వీరులైతే వాళ్ళు నా కూతురి పిల్లలను బతకనిస్తారా నీ రక్తం ఊరుకుంటుందా నీ వంశానికి నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా అని అడిగాడు.
(08:51) ఈ ప్రశ్న దేవవ్రతుడి మైండ్ ని ఒక సడన్ షాక్ కి గురి చేసింది. అది కేవలం ప్రెజెంట్ సిచువేషన్ ఒక్కటే కాదు తన ఫ్యూచర్ ని తన ఐడెంటిటీని తొక్కేయాలని చూస్తుంది. ఒక మనిషి గ్యారెంటీ ఇవ్వలేని ఒక ఫ్యూచర్ అవుట్కమ్ ని దాసరాజు డిమాండ్ చేస్తున్నాడు. దేవవ్రతుడు ఒక తీవ్రమైన ఎమోషనల్ ప్రెజర్ లోకి వెళ్ళిపోయాడు. ఒకవైపు తండ్రి కామం వల్ల వచ్చే అనారోగ్యం ఇంకోవైపు తనను పూర్తిగా తుడి చేయాలనుకునే ఒక బలమైన ప్లాన్ ఆ తీవ్రమైన ప్రెజర్ లో ఆ యంగ్ బ్లడ్ ఒక లాజికల్ థింకింగ్ ని పక్కన పెట్టేసింది.
(09:21) తనను తాను ఒక పర్మనెంట్ కేజ్ లో లాక్ చేసుకునే ఆ బిగ్గెస్ట్ డెసిషన్ వైపు అడుగులు వేసింది. ఇక దేవవ్రతుడు ఉన్నచోటే దృఢంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ తన ప్రాణాలను సైతం గడగడలాడించే ఆ భయంకరమైన శపదం చేశాడు. నేను నా జీవితాంతం పెళ్లి చేసుకోను బ్రహ్మచర్యం పాటిస్తాను నాకు సంతానమే ఉండదు. ఈ ప్రతిజ్ఞ వినగానే సాక్షాత్తు దేవతలే ఆకాశం నుంచి పూలవాణ కురిపిస్తూ భీష్మ భీష్మ అని అరిచారు.
(09:46) అంటే భయంకరమైన వ్రతాన్ని పట్టినవాడు అని అర్థం. ఆ క్షణం దేవవ్రతుడి పాత్ర పూర్తయింది. కానీ భీష్ముడు పుట్టాడు. అందరూ ఆ త్యాగాన్ని చూసి జయ జయ ధ్వనాలు చేశారు. సెంతనుడి కోరిక తీరింది సత్యవతి హస్తినాపురానికి వచ్చింది. కానీ ఆ ప్రతిజ్ఞతో భీష్ముడు తన ప్రమేయం లేకుండానే తన పూర్తి జీవితాన్ని ఒకే ఒక్క సింగిల్ ట్రాక్ లో లాక్ చేసుకున్నాడు.
(10:08) ఆయన తన భవిష్యత్తుని తన హ్యూమన్ రైట్స్ ని ఆ ఒక్క క్షణం ఆవేశంలో ఆ శపదం అనే ఇనుప పంజరంలో పడేసి తాళం వేశడు. ఆ పంజరం తలుపులు ఇక ఎప్పటికీ తెరుచుకోవనే చేదు నిజం ఆ యువకుడికి ఆ క్షణం అస్సలు అర్థం కాలేదు. కొన్నాళ్ళ తర్వాత శకుని ఆడిన తప్పుడు జూదం అనే ఘట్టం ఉంది కదా ఆ నిండు ద్విత సభలో ద్రౌపది ఏడుస్తూ అడుగుతున్న భీష్మ పితామహుడు కదలలేకపోయాడు.
(10:33) ఎందుకంటే ఆయన గతంలో చేసిన ప్రతిజ్ఞ అనే పొజిషన్ ని అక్కడున్న తన మోరల్ అథారిటీని కోల్పోవడానికి సిద్ధంగా లేడు. మన పర్సనల్ లైఫ్ లో కూడా ఇదే జరుగుతుంది. ఆటో పైలట్ మోడ్ లో బాధ్యతలు మోస్తూ ఇంట్లో అందరి ముందర ఆదర్శవంతుడు అనే ఇమేజ్ ని కాపాడుకోవడం కోసం కళ్ళ ముందే ఒక అన్యాయం జరుగుతున్న పెద్దవాళ్ళు పూర్తిగా సైలెంట్ అయిపోతారు.
(10:54) భీష్ముడు తన ప్రతిజ్ఞ వెనక దాక్కున్నాడు. ఆయనకు నిజం తెలుసు కానీ ఆ నిజం మాట్లాడితే తను గతంలో చేసిన ప్రామిస్ బ్రేక్ అవుతుంది. తన ఇమేజ్ పోతుంది అని భయపడ్డాడు. ఈ సీనియర్ సైలెన్స్ అనేది ఒక ఫ్యామిలీలో జరిగే మోస్ట్ డేంజరస్ గ్యాస్ లైటింగ్. నువ్వు గౌరవిస్తున్న ఆ ఫేక్ పెద్దరికమే ఆ గదిలో ఉన్న అబ్యూసివ్ మనుషులకు ఒక అల్టిమేట్ లైసెన్స్ లా మారుతుంది.
(11:17) అక్కడ ఒక పక్క ద్రౌపది చీరను దుశ్యాసనుడు ఊడదీయాలని చూస్తుంటే భీష్ముడు మాత్రం చాలా మెల్లగా లీడర్షిప్ అండ్ టెక్నికల్ లూప్ హోల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. ధర్మరాజు తనను తాను పందెంలో పెట్టుకొని ముందే ఓడిపోయాడు కాబట్టి తన భార్యను పందెంగా కాయడం అనే విషయంలో ధర్మం అనేది చాలా సూక్ష్మమైనది. అందులో నిర్ణయం చెప్పడం చాలా కష్టం అంటూ ఒక భయంకరమైన డొమెస్టిక్ గ్యాస్ లైటింగ్ జరగడానికి అనుమతించాడు.
(11:42) టాక్సిక్ ఫ్యామిలీస్ లో ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. కళ్ళ ముందు ఒక మనిషి ఎమోషనల్ గా చచ్చిపోతుంటే ఆ బాధను పట్టించుకోవడం మానేసి మన ఫ్యామిలీ రూల్స్ ఏంటి మన పద్ధతులు ఏంటి అని పాత చింతకాయ పచ్చడి మాటలు చెప్తారు. వాళ్ళకు కావాల్సింది జస్టిస్ కాదు. కేవలం ఒక తప్పుని రూల్స్ వెనక దాచి సమర్థించుకోవడం మాత్రమే కావాలి. ఈ వింత వాదనలు వింటుంటే ఆ ఇంట్లో ఉండే అమాయకుల ఆత్మకు జరిగే గాయం ఇంకా లోతుగా జరుగుతుంది.
(12:07) సభ మొత్తం సెవన్ లా పడి ఉన్న ఆ క్షణంలో ఒక సడన్ మిరకల్లా వికర్ణుడు లేచి నిలబడ్డాడు. ఇతను దుర్యోధనుడికి తమ్ముడే ఆ సభలో ఉన్న తన తాత భీష్ముడిని తండ్రి ధృతరాష్ట్రుడిని చూసి పెద్దలారా మీ మౌనం అధర్మం ద్రౌపది అడిగిన ప్రశ్న సరైనది. ఒక జూదగాడు తనను తాను ఓడిపోయాక తన భార్యను పణంగా పెట్టే హక్కుని పూర్తిగా కోల్పోతాడు.
(12:28) ఈ ఇంట్లో జరుగుతున్న అన్యాయాన్ని నేను ఒప్పుకోను అంటూ నిలదీశడు. వాట్ ఏ పవర్ఫుల్ మోమెంట్ ఒక టాక్సిక్ ఇంట్లో సైలెన్స్ అనేది ఎప్పుడూ ఒక అవసరం కాదు. అదిఒక పక్కా కాన్షియస్ ఛాయిస్ అని వికర్ణుడు నిరూపించాడు. సిస్టం ఎంత కరప్ట్ అయినా ఒక మనిషి అనుకుంటే తన వాయిస్ రైస్ చేయొచ్చు. అతను తన కుటుంబం కంటే బేసిక్ హ్యూమన్ మొరాలిటీ పెద్దది అని నమ్మాడు.
(12:51) వికర్ణుడు మాట్లాడటం పూర్తి కాకముందే కర్ణుడు సీన్ లోకి ఎంటర్ అయ్యి వికర్ణ నోరు మూసుకో నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి నీకు ఈ ఇంటి నియమాలు పరంపరలు గురించి ఏమీ తెలీదు. నీకంటే పెద్దవాడు పితామహుడైన భీష్ముడు ఇక్కడ మౌనంగా కూర్చున్నప్పుడు నువ్వు అన్నలను ఎదిరించి మాట్లాడతావా? నువ్వు ఒక ద్రోహివి అని అతని మీద చాలా క్రూరంగా మాటలతో అటాక్ చేశాడు. టాక్సిక్ ఫ్యామిలీస్ లో ఎవరైనా నిజాన్ని క్వశ్చన్ చేస్తే ఆ వాయిస్ ని తొక్కేయడానికి వాడే క్లాసిక్ స్ట్రాటజీ ఇదే నిలదీసిన మనిషి క్యారెక్టర్ ని వయసుని నిందిస్తారు.
(13:24) నీకు పెద్దవాళ్ళను గౌరవించడం రాదు. నువ్వు కుటుంబ పరువును తీస్తున్నావ్ అని వాళ్ళ నోరు నొక్కేయడానికి ప్రయత్నిస్తారు. కర్ణుడి మాటలతో వచ్చిన ఆ ఒకే ఒక్క వాయిస్ కూడా అక్కడే సప్రెస్ అయిపోయింది. అన్యాయం మళ్ళీ యధావిధిగా మారిపోయింది. ఈ పూర్తి ద్యుత సభ సీక్వెన్స్ ని ఈరోజు మన చుట్టూ ఉండే మోడర్న్ ఫ్యామిలీ డైనమిక్స్ తో కనెక్ట్ చేసి చూడండి.
(13:44) ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక కోడల్ని లేదా ఒక డిపెండెంట్ మెంబర్ ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తుంటే మిగతా అత్తలు మామలు లేదా పేరెంట్స్ పూర్తిగా సైలెంట్ గా ఉంటారు. ఎవరైనా వయసులో చిన్నవాళ్ళు లేచి ఇది తప్పు కదా అని అడిగితే వెంటనే నువ్వు నోరు మూసుకో పెద్దవాళ్ళ విషయంలో నువ్వు తలదూర్చకూడదు అని చెప్తూ అదేదో ఫ్యామిలీ ట్రెడిషన్ అన్నట్టు గ్యాస్ లైట్ చేస్తారు.
(14:05) ఇంట్లో గొడవలు వద్దు సర్దుకు పోవడమే ఆడదాని లక్షణం అని అందమైన పదాలతో ఆ అబ్యూస్ ని జస్టిఫై చేస్తారు. వాళ్ళు ట్రెడిషన్ ని కాపాడట్లేదు. కేవలం తమ పిరికితనాన్ని తప్పుడు రూల్ బుక్స్ వెనక దాస్తున్నారు. ఈ డొమెస్టిక్ సైలెన్స్ ఒక మనిషిని లోపల నుంచి ఎలా ముక్కలు చేస్తుందో ఒకసారి గమనించండి. వికర్ణుడి వాయిస్ కూడా చచ్చిపోయాక దుర్యోధనుడికి అసలు భయమే లేకుండా పోయింది.
(14:30) ఆ సభలోని భీష్ముడి లాంటి పెద్దల సైలెన్స్ అతనికి ఒక పెద్ద శక్తిని ఇచ్చింది. ఇక దుశాసనుడి వైపు చూసి ఊహకు అంతుపట్టని ఒక అతి క్రూరమైన ఆదేశం ఇచ్చాడు. ఈ పాండవులు ఆ ద్రౌపది వేసుకున్న వస్త్రాలు నిండు సభలో వలిచేసాయి. వీళ్ళను పూర్తిగా అవమానపరచు అని అన్నాడు. ఒక ఇల్లు ఎంత దారుణంగా దిగజారిపోవచ్చో చెప్పడానికి ఇదే అల్టిమేట్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ తమ కళ్ళ ముందు జరిగే చిన్న తప్పులు అడ్డుకోవడం మానేస్తారో ఆ టాక్సిసిటీ మెల్లగా ఒక ఘోరమైన క్రైమ్ లా మారిపోతుంది.
(15:00) దుశాసనుడు ద్రౌపది వస్త్రాన్ని గట్టిగా పట్టుకొని లాగడం మొదలు పెట్టాడు. ఆ ఇంట్లో ఉన్న బేసిక్ హ్యూమన్ డిగ్నిటీ మొత్తం అక్కడికక్కడే కుప్పకూలింది. ఆ భయంకరమైన క్షణంలో ద్రౌపది తన ఐదుగురు భర్తల వైపు ఆ ఇంటి రక్షకుడైన భీష్ముడి వైపు చూసింది. వాళ్ళు మామూలు మనుషులు కారు. ప్రపంచంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ వారియర్స్ కానీ ఆ క్షణంలో వాళ్ళు ఆ జూదం రూల్స్ కి లీగల్ కాంట్రాక్ట్ కి అండ్ గతంలో చేసిన శపదాలకు గుడ్డిగా బానిసలైపోయి కదలలేకపోయారు.
(15:27) ఆ ప్రొటెక్టివ్ నెట్వర్క్ పూర్తిగా ఫెయిల్ అయింది. మన పర్సనల్ లైఫ్ లో కూడా అదే బిగ్గెస్ట్ రియాలిటీ షాక్. నువ్వు ట్రాఫిక్ లో ఆటో పైలట్ లా బండి నడుపుతూ ఎవరినైతే బలంగా నమ్మావో అది నీ పార్ట్నర్ లేదా నీ పేరెంట్స్ ఒక టాక్సిక్ ఫ్యామిలీ సిస్టం లో ఉన్న ప్రెజర్ కి భయపడి కళ్ళ ముందే నీకు అన్యాయం జరుగుతున్న నిన్ను కాపాడలేకపోవచ్చు.
(15:47) బంధాలు ఎంత బలంగా ఉన్నా సరే సిస్టం కరప్ట్ అయితే అవి నిన్ను కాపాడలేవు. ఈ కాంటెక్స్ట్ లో సిస్టం అంటే ఇంటి వ్యవహారాలు. దుశ్యాసనుడు బలాన్ని ఉపయోగించి ద్రౌపది వస్త్రాన్ని లాగుతున్నాడు. ద్రౌపది తన రెండు చేతులతో ఆ బట్టను పట్టుకొని ఏడుస్తూ తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె సభలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచింది.
(16:08) భీష్మ పితామహుడి కాళ్ళ మీద పడింది. నన్ను రక్షించండి నన్ను రక్షించండి అంటూ బ్రతిమాలింది. కానీ అక్కడ ఒక్క చేతిలో కూడా కదలిక లేదు ఒక్క నోరు కూడా మెదలలేదు. ఆ క్షణంలో ద్రౌపది తన లైఫ్ లో అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని ఒంటరితనాన్ని అనుభవించింది. ఎవ్వరూ రారు ఏ భర్త కాపాడడు ఏ తాత న్యాయం చేయడు ఏ కుటుంబ సాంప్రదాయం తనను రక్షించదు అనే పచ్చి నిజం ఆవిడకు అర్థమయింది.
(16:32) ఒక మనిషి తన ఇంట్లోనే పూర్తి ఒంటరిగా మారిపోయిన ఒక రాక్ బాటం మూమెంట్ అది. ఎమోషనల్ గా తాను అనుభవించే ఆ ఒంటరితనం ఎలాంటి ఫిజికల్ పెయిన్ కంటే కూడా చాలా భయంకరమైనది. కానీ కరెక్ట్ గా అదే రాక్ బాటం సిచువేషన్ లోనే ద్రౌపదిలో ఒక అద్భుతమైన సైకలాజికల్ షిఫ్ట్ జరిగింది. ఆమె బంధువులు భర్తలు ముఖ్యంగా మనుషుల మీద అండ్ ఆ రూల్స్ మాట్లాడే భీష్ముడి మీద ఉన్న ఆశను పూర్తిగా వదులుకుంది.
(16:55) ఏ చేతులతోనైతే తన బట్టను పట్టుకొని తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించిందో ఆ చేతులనే పూర్తిగా వదులుకొని రెండు చేతులు పైకెత్తి ఆ డివైన్ కాస్మిక్ పవర్ కి సరెండర్ అయిపోయింది. ఆమె మనుషుల నుండి సాయం అడగడం ఆపేసింది. ఎప్పుడైతే నువ్వు నీ చుట్టూ ఉన్న టాక్సిక్ రిలేటివ్స్ ని యాచించడం ఆపేసి నీ ఇంటర్నల్ స్ట్రెంత్ అండ్ ఆ యూనివర్స్ ని నమ్ముతావో అప్పుడే నీలో ఒక దృఢమైన శక్తి పుడుతుంది.
(17:17) ద్రౌపది తన పట్టుని వదిలేసింది. కానీ ఆవిడ ఆత్మ మాత్రం ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరికంటే శక్తివంతంగా పైకి లేచింది. దుశాసనుడు వస్త్రాన్ని లాగుతూనే ఉన్నాడు. కానీ అక్కడ ఊహించని తీరులో ఒక అద్భుతం జరిగింది. ఆవిడ కట్టుకున్న వస్త్రానికి అంతే లేని విధంగా మారిపోయింది. ఒక్కో రంగు ఒక్కో లేయర్ లో వస్త్రాలు వస్తూనే ఉన్నాయి తప్ప ద్రౌపది శరీరం బయట పడలేదు.
(17:40) దుశాసనుడు లాగి లాగి అలసిపోయి చెమటలు పట్టి ఆ బట్టల కుప్ప మధ్యలోనే కింద పడిపోయాడు. ఆ అంతులేని వస్త్రం అనేది కేవలం ఒక మ్యాజిక్ కాదు. అదిఒక మోస్ట్ పవర్ఫుల్ మెటఫర్. నువ్వు ఎప్పుడైతే ఒక టాక్సిక్ ఫ్యామిలీ నుండి లేదా ఆటో పైలట్ బాధ్యతల నుంచి ప్రొటెక్షన్ ఎక్స్పెక్ట్ చేయడం ఆపేస్తావో నీ లోపల ఉన్న డిగ్నిటీ అండ్ రెజిలియన్స్ కూడా అంతే అనంతంగా మారిపోతాయి.
(18:02) లోకం నిన్ను ఎంత డీగ్రేడ్ చేయాలనుకున్నా నీ ప్యూర్ ఇంటర్నల్ ఫోర్స్ ని టచ్ చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ద్రౌపది ఆ సభలో గెలిచింది. ఆ ఇంటి పెద్దల ముందర ఒక సామ్రాగ్ని అంటే ఎంప్రెస్ లా నిలబడింది. దుశాసనుడు అలసిపోయి కింద పడిపోగానే ఆ సభలో అకస్మాత్తుగా ఒక భయంకరమైన నిశశబ్దం ఏర్పడింది. సరిగ్గా ఆ క్షణంలో ఆ ఇంటి లోపల విచిత్రమైన అరిష్టసూచకమైన శబ్దాలు మొదలయ్యాయి.
(18:28) యజ్ఞశాల నుంచి నక్కల అరుపులు గాడిదల ఒండ్రింపులు వినపడ్డాయి. ఆ కాస్మిక్ అప్సెట్ ని గమనించి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా వణకిపోయాడు. కానీ భీష్మ పితామహుడు మాత్రం ఆ మౌనంలోనే తన ప్రతిజ్ఞ అనే పంజరం ఎంత క్రూరమైనదో మొదటిసారి గుర్తించాడు. పరిస్థితులు చెయిదాటిపోయి కుటుంబం చీలిపోయే పరిస్థితి వచ్చినప్పుడే ఆ పెద్దలు నిజాన్ని తెలుసుకుంటారు.
(18:50) మన పర్సనల్ లైఫ్స్ లో కూడా ఇదే జరుగుతుంది. ఏ బాధ్యతలనైతే కళ్ళు మూసుకొని ఒక ఆటో పైలట్ లా మోస్తూ జరిగే తప్పులను చూసి చూడనట్టు వదిలేస్తామో ఒకరోజు అవే పెద్ద చిక్కులు తెచ్చిపెడతాయి. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయి ఉంటుంది. ధృతరాష్ట్రుడు వెంటనే పానిక్ అయిపోయి సిచువేషన్ ని కవర్ చేయడానికి ట్రై చేశాడు.
(19:10) ద్రౌపది నా కొడుకులు తెలియక తప్పు చేశారు. నువ్వు చాలా ఉత్తమురాలివి నన్ను క్షమించు నీకు ఏం కావాలో నన్ను అడుగు నీకు మూడు వరాలు ఇస్తాను అని చెప్పి ఆ గొడవను సద్దు మణగించడానికి ప్రయత్నించాడు. పక్కనే ఉన్న భీష్ముడు ఆ అబద్ధపు క్షమాపణ గురించి ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇలాంటి విషపూరితమైన కుటుంబాల్లో గొడవలు ఆపడానికి ఇదొక పాత టెక్నిక్ ఒక పెద్ద తప్పు జరిగినప్పుడు నిజంగా బాధపడటం మానేసి జరిగిందఏదో జరిగిపోయిందిలే దాన్ని వదిలేసేయ్ నీకు ఏమన్నా కావాలంటే నాకు చెప్పు నేను ఇస్తాను నీకు ఒక మంచి గిఫ్ట్ కొనిస్తాను లేదా అవసరమైన డబ్బు ఇస్తాను అని తీయటి మాటలు చెప్పి ఆ తప్పును కప్పి
(19:45) పుచ్చుకోవాలని చూస్తారు. వాళ్లకు నీ బాధతో అస్సలు సంబంధం లేదు. ఒకవేళ నువ్వు ఎదురు తిరిగితే సొసైటీలో కుటుంబం పరువు పోతుందేమో అని భయపడి మాత్రమే ఇలాంటి నాటకాలు ఆడతారు. ద్రౌపది అలాంటి ఒక స్ట్రెస్ ఫుల్ సిచువేషన్ లో కూడా తన ఆత్మగౌరవాన్ని అంటే డిగ్నిటీని అస్సలు వదులుకోలేదు. ఆవిడ ధృతరాష్ట్రుడు ఇచ్చిన వరాలను వాడుకొని తనకోసం నగలు లేదా లగ్జరీస్ ని అడగలేదు.
(20:08) మొదటి వరంతో ధర్మరాజుని రెండో వరంతో మిగతా భర్తలను ఆ బానిసత్వం నుంచి విడిపించమని అడిగింది. ధృతరాష్ట్రుడి మూడో వరం వచ్చేసరికి ద్రౌపది చాలా గర్వంగా నాకు నీ వరాలు వద్దు నా భర్తలు స్వేచ్ఛగా ఉంటే అదే చాలు వాళ్ళ పరాక్రమంతో మిగతాదంతా సాధించుకుంటారు అని బలంగా చెప్పింది. ఇది కదా ఒక మహారాణికి ఉండే లక్షణం నువ్వు ఒక ఆటో పైలట్ మోడ్ లో ఎవరి వాాలిడేషన్ కోసమో విక్టిమ్ కార్డ్ ప్లే చేయకుండా నీ డిగ్నిటీతో నిలబడితే ఆ కరప్ట్ ఫ్యామిలీ సిస్టం నీ ముందర మోకరిలక తప్పదు.
(20:39) భీష్ముడి లాంటి మహాయోధులు పాత ప్రమాణాలకు బానిసలై నిలబడితే ద్రౌపది మాత్రం ఆ ప్రెజర్ లో కూడా ఒక సామ్రాగ్నిలా గెలిచింది. కానీ ద్రౌపది ఆ అబద్ధపు రాజీని గుడ్డిగా నమ్మి తిరిగి ఇంతకుముందులా ప్రవర్తించలేదు. ఆ సభ నుండి బయటకు నడిచే ముందు తన రక్తం కారుతున్న విరబోసిన జుట్టును చూపిస్తూ హస్తినాపుర చరిత్రను మార్చే ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేసింది. ఏ దుశ్యాసనుడైతే నా జుట్టు పట్టుకొని లాగాడో వాడి రొమ్ము చీల్చి ఆ రక్తాన్ని తీసుకొచ్చి నా తలకు రాసేంతవరకు నేను నా జుట్టును ముడివేయను అని శపదం చేసింది.
(21:09) ఇది ఎటువంటి కాంప్రమైజ్ లేని ఒక పర్సనల్ బౌండరీ ఒక చెడు ఇంట్లో నిన్ను అవమానించినప్పుడు నువ్వు ఒక యంత్రంలా ఆ బాధను అంత తేలిగ్గా మర్చిపోకూడదు. ఆ విరబోసిన జుట్టు పాడైపోయిన కుటుంబ వ్యవస్థకు జరగబోయే ముగింపుకి ఒక సైలెంట్ కౌంట్ డౌన్. నువ్వు తప్పు చేసిన వాళ్ళను నిలదీయాలి తప్ప అబద్ధపు నవ్వులతో రాజీ పడకూడదు.
(21:30) ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇచ్చే ద వరస్ట్ సలహా ఏంటో తెలుసా పోనీలే వాళ్ళు నీ సొంత చుట్టాలే కదా కుటుంబం కలిసి ఉండటం కోసం ఆ పాత విషయాలను మర్చిపోయి ముందుకు సాగిపోవాలి అని చెప్తారు. భీష్ముడు కూడా కరెక్ట్ గా అదే భ్రమలో బతికాడు. నేను నా మాటను కాపాడుకుంటూ ఈ కుటుంబాన్ని ఎలాగోలాగా నడిపిస్తాను అని అనుకుంటూ చేసిన తప్పుని దాచాడు.
(21:51) కానీ వ్యాస మహాభారతం మనకు నేర్పించే పాఠం ఏంటంటే ఒక పెద్ద అన్యాయం జరిగినప్పుడు తప్పు చేసిన వారిని నిలదీయకుండా నువ్వు ఆ అబద్ధపు ప్రశాంతతను ఒప్పుకుంటే అది నీ ఇంటిని లోపలి నుంచి పూర్తిగా నాశనం చేస్తుంది. నువ్వు ఆ మోసగాళ్ళతో మళ్ళీ కలిసి ఏమీ తెలియనట్టుగా మామూలుగా బతకలేవు. అది నిన్ను నువ్వే చంపుకోవడంతో సమానం. అసలైన రిలీఫ్ అనేది ఒక పూర్తి తిరుగుబాటుతోనే వస్తుంది.
(22:14) ఆ తర్వాత పాండవులు ద్రౌపది 12 ఏళ్ల అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసానికి బయలుదేరారు. ఆ సుదీర్ఘమైన 13 ఏళ్ల కాలంలో ద్రౌపది తన జుట్టును ముడి వేయకుండా అలాగే విరబోసుకొని ఉంచింది. ఆ విరబోసిన జుట్టు గుర్తొచ్చినప్పుడల్లా భీష్ముడి గుండెల్లో ప్రదర్శించిన పిరికితనం చేసిన అవమానం ఒక నిప్పులా కాలుతూనే ఉన్నాయి. ఇది కళ్ళ ముందు కనిపించే ఒక సైలెంట్ వార్నింగ్ ఒక చెడ్డ కుటుంబాన్ని లేదా నచ్చని బాధ్యతల పంజరాన్ని వదిలేసి నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ మౌనం నీ విజయం వాళ్ళకు అతి పెద్ద శిక్షలా మారాలి.
(22:46) ద్రౌపది ఆ బాధను చూసి దిగులు పడుతూ కూర్చోలేదు. దాన్ని ఒక కసిగా మార్చుకొని ఆ పాడైపోయిన వ్యవస్థ అంతం కోసం చాలా ఓపికగా ఎదురుచూసింది. ఈ సుదీర్ఘమైన 13 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ని మన పర్సనల్ లేదా ప్రొఫెషనల్ లైఫ్ తో కంపేర్ చేసి చూడు. ట్రాఫిక్ లో బండి నడుపుతూ నువ్వు అనుభవించే ఆ ఉక్కిరి బిక్కిరి నుండి బయట పడటానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు న్యాయం అనేది రాత్రికి రాత్రే రాదు.
(23:11) దానికి ఏళ్ళు పట్టొచ్చు. చుట్టూ ఉన్నవాళ్ళు నిన్నే నిందిస్తూ ఒక అజ్ఞాతవాసనలో పడేయొచ్చు. ఆ వెయిటింగ్ పీరియడ్ లో నీ మైండ్ చాలా అలసిపోతుంది. నేను గెలుస్తానా లేదా అసలు గెలిచే అవకాశం ఉందా లేదా అనే సెల్ఫ్ డౌట్ మొదలవుతుంది. భీష్ముడు కూడా ఆ పాత వాగ్దానాన్ని మోస్తూ 13 ఏళ్ళు ఎదురుచూసాడు. కానీ అతని ఎదురుచూపులో భయం ఉంది.
(23:32) అదే ద్రౌపది ఎదురుచూపులో ఒక పవర్ఫుల్ పర్పస్ ఉంది. నువ్వు నీ ఫోకస్ ని బలంగా ఉంచుకుంటే ఆ డివైన్ యూనివర్స్ నీ వైపే నిలబడుతుంది. చివరికి కురుక్షేత్ర యుద్ధం డిక్లేర్ అయింది. ఇన్నేళ్లుగా ఆటో పైలట్ మోడ్ లో దాచిన కుళ్ళు ఆ పెద్ద మనుషుల సైలెన్స్ ఇవాళ ఒక పెద్ద సంగ్రాామంలా యుద్ధభూమిలో ప్రవేశించింది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నువ్వు ఒక ఇంట్లో చిన్న తప్పు జరిగినప్పుడు నీ పాత కమిట్మెంట్ అనే ముసుగు వేసుకొని చూస్తూ ఊరుకుంటే ఒకరోజు ఆ తప్పు ఒక పెద్ద తుఫానులా మారి ఆ ఇంటి మొత్తాన్ని కాల్చేస్తుంది.
(24:04) హస్తినాపుర పెద్దలు ఆ రోజు ద్రౌపది ఏడుస్తున్నప్పుడు ఇది కేవలం ఒక పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ అని అనుకున్నారు. కానీ ఇవాళ అదే విషయం వల్ల లక్షలాది మంది సైనికులు రక్తం చిందించాల్సి వస్తుంది. ఆ నిండు సభలో పాటించిన మౌనం ఇవాళ్ళ చెవులు దద్దరిల్లిపోయే యుద్ధ బేరిలా మారిపోయింది. యుద్ధంలో భీముడు దుశాసనుడిని ఎదుర్కొన్నాడు. ఆ రోజు సభలో ద్రౌపదిని అవమానించిన ఆ నీచుడిని భీముడు గదతో కొట్టి కింద పడేసి అతని చాతిని చీల్చి రక్తాన్ని తాగుతూ భయంకరంగా గర్జించాడు.
(24:32) ఆ తర్వాత ఆ రక్తాన్ని తీసుకొచ్చి ద్రౌపది కురుళ్లకు రాసి ఆమె జుట్టును ముడివేశాడు. ఈ రా అండ్ బ్రూటల్ మూమెంట్ ని ఒక్కసారి గమనించాలి. ఇది కేవలం ఒక రివెంజ్ కాదు అదొక అబ్సల్యూట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అకౌంటబిలిటీ. నువ్వు వేరే వాళ్ళకు ఎమోషనల్ లేదా ఫిజికల్ గా బాధ కలిగించినప్పుడు ఈ యూనివర్స్ నీ అకౌంట్ ని చాలా ఖచ్చితంగా సెటిల్ చేస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం.
(24:54) ద్రౌపది చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది. ఏ ఇల్లైతే ఆమెను అవమానించిందో ఏ భీష్ముడైతే మౌనంగా చూశాడో ఆ ఇంటి అహంకారం అక్కడితో పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. ఇక యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. ధర్మరాజు రాజయ్యాడు. కానీ హస్తినాపురం కోట వైపు ఒక్కసారి చూడండి. అక్కడ ఏముంది స్మసాన వైరాగ్యం గతంలో చేసిన వాగ్దానాన్ని కాపాడుకోవాలనే ఆరాటంలో ఏ ఆలోచన లేకుండా మౌనంగా ఉండిపోయిన భీష్ముడు కొడుకుపై గుడ్డిగా ప్రేమ పెంచుకున్న ధృతరాష్ట్రుడు చివరకు తమ పిల్లలను వంశాన్ని రాజ్యాన్ని మొత్తంగా కోల్పోయారు.
(25:28) టాక్సిక్ ఫ్యామిలీస్ లో ఇదే అల్టిమేట్ ట్రాజిడీ నువ్వు ఒక తప్పుని చూస్తూ సైలెంట్ గా ఉంటే నువ్వు దేన్నైతే కాపాడాలనుకున్నావో ఆ కంఫర్ట్ ని ఈ యూనివర్స్ ఇంకా దారుణంగా లాక్కుంటుంది. మౌనంగా ఉన్న ఆ వంశం మొత్తం బూడిదయపోయింది. కానీ ద్రౌపది మర్యాద అండ్ భీష్ముడి అంపశయ్య అంటే బెడ్ ఆఫ్ ఆరోస్ చరిత్రలో ఎప్పటికీ ఒక అన్షేకబుల్ రియాలిటీలా నిలిచిపోయాయి.
(25:51) ఇప్పుడు ఆ హెవీ ట్రాఫిక్ జామ్ లో నువ్వు ఫీల్ అయిన ఆ సఫకేటింగ్ పానిక్ వేవ్ నుండి బయటకు రావడానికి నీకుొక ప్రాక్టికల్ టూల్ కిట్ కావాలి. భీష్ముడిలా అంపశయ్య మీద పడేంతవరకు వెయిట్ చేయొద్దు. ఈ వారం నువ్వు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ నీ కరెంట్ లైఫ్ లో ప్రతి ఒక్కరి బాధ్యతను ప్రామిస్ ని ఒక డిటాచ్మెంట్ తో ఆడిట్ చెయ్ ఒక పేపర్ తీసుకొని నువ్వు మోస్తున్న ఆ కమిట్మెంట్ నీకొక ఇనుప పంజరంగా మారిందా లేదా అని చాలా హానెస్ట్ గా రాయ్ ఒక పాత ప్రామిస్ తప్పలేక లేదా చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఒక ఆదర్శవంతుడు అని అనడం కోసం నువ్వు ఎంతటి పర్సనల్ హ్యాపీనెస్ ని బలిస్తున్నావో లెక్కగట్టు ఆ ప్రతి ఒక్క
(26:26) ప్రతిజ్ఞను గమనించు ఏ బంధం అయితే నీకు ఊపిరి ఆడకుండా చేస్తుందో దాన్ని నీ ఇన్నర్ ప్రొటెక్షన్ లిస్ట్ నుంచి ఇప్పుడే డిలీట్ చెయ్. ఈ డొమెస్టిక్ ఆడిట్ నీకు ఎవరి మీద ఎంత డిపెండెన్సీ ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిచ్చ క్లారిటీ ఇస్తుంది. మనల్ని మనం పారలైజ్ చేసుకునే బిగ్గెస్ట్ మెంటల్ డిల్యూజన్ ఏంటో తెలుసా నేను ఎప్పుడో ఏళ్ల క్రితం ఒక మాట ఇచ్చాను.
(26:48) నేను దాన్ని బ్రేక్ చేస్తే పాపం తగులుతుంది. లోకం నన్ను ఒక విలన్ లా చూస్తుంది అనే ఆ ఫేక్ నమ్మకం ఈ పవిత్రమైన వాగ్దానం అనే మైండ్సెట్ ని ఇప్పుడే ముక్కలు చెయ్. భీష్ముడు తన శపదాన్ని పట్టుకొని కూర్చున్నంతసేపు హస్తినాపురానికి రక్షణ దొరకలేదు సరి కదా అదే సిస్టం నాశనం అవ్వడానికి కారణమయింది. నీ ఫ్యామిలీ కోసం లేదా గతంలో తీసుకున్న బాధ్యత కోసం నువ్వు ఆటో పైలట్ మోడ్లో ఉంటూ అవస్థలు పడుతూ ప్రాణాలు ఇవ్వాల్సిన రూల్ ఎక్కడా లేదు.
(27:14) ఏ మాట అయితే ఒక అమాయకుడిని కాపాడలేదో ఆ మాటను పట్టుకొని వేలాడటం ధర్మం కాదు. అది కేవలం ఒక పిరికితనం మాత్రమే అనే చేదు నిజాన్ని నువ్వు యక్సెప్ట్ చేయాలి. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. భీష్ముడు తన అవస్థలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీని మిస్ అయ్యాడు. అదే ద కోల్డ్ రెఫ్యూజల్ అతను దాసరాజు ముందర నిలబడినప్పుడు చాలా హనెస్ట్ గా నో చెప్పుంటే మహాభారతం కథ వేరేలా ఉండేది.
(27:41) ఒక టాక్సిక్ ఫ్యామిలీ ప్రెజర్ లో నువ్వు ఈ టెక్నిక్ ని ఖచ్చితంగా వాడాలి. ఎవరైనా నిన్ను గ్యాస్లైట్ చేస్తూ నువ్వు పెద్దవాడివి కదా నువ్వే సర్దుకోవాలి అని అన్నప్పుడు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చాలా కోల్డ్ గా నాకు నచ్చని ఈ బాధ్యతను నా మీద రుద్దడం ఏ రకమైన ధర్మం నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకుంటేనే ఈ ఇల్లు నిలబడుతుందా అని వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఒక్కసారి అడిగి చూడు ఆ ఒక్క పదునైన ప్రశ్న ఫ్యామిలీ హిపోక్రట్స్ మైండ్ ని పూర్తిగా స్తంభింపజేస్తుంది.
(28:09) నువ్వు ఆ పాత పంజరం పక్కన పెట్టి సిస్టం ని రెఫ్యూజ్ చేయడం మొదలు పెట్టు. ఇక్కడ మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సైకలాజికల్ షిఫ్ట్ ని అర్థం చేసుకోవాలి. అదే లివింగ్ ధర్మ వర్సెస్ డెడ్ రిచువల్ డెడ్ రిచువల్ అంటే పరిస్థితులు మారిపోయినా చుట్టూ ఉన్న మనుషులు టాక్సిక్ గా మారినా నువ్వు ఎప్పుడో చేసిన పాత ప్రామిస్ ని గుడ్డిగా ఫాలో అవ్వడం.
(28:29) కానీ లివింగ్ ధర్మ అంటే కరెంట్ రియాలిటీకి తగ్గట్టుగా నీ ఇంటర్నల్ మోరల్ కంపస్ ని రీ అలైన్ చేసుకోవడం. భీష్ముడు ఒక డెడ్ రిచువల్ కి బానిస అయ్యాడు. అందుకే ఆ ద్యుత సభలో సైలెంట్ గా ఉండిపోయాడు. నువ్వు నీ ఫ్యామిలీ ఇచ్చే సర్టిఫికేట్ కోసం లేదా వాళ్ళ వాలిడేషన్ కోసం ఈ ఆటో పైలట్ మోడ్ లో బతకడం ఆపేయ్ నీ సెల్ఫ్ వర్త్ అనేది ఏ పాత రూల్ బుక్ ఇచ్చిన రేటింగ్ మీదో డిపెండ్ అయి లేదని గట్టిగా గుర్తించు.
(28:53) కరప్ట్ అయిపోయిన ఒక డొమెస్టిక్ ఎన్విరన్మెంట్ లో ప్రతిరోజు గొడవలు పెట్టుకుంటూ నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం చాలా పెద్ద తప్పు. దానికి బదులు మన స్ట్రాటజిక్ విత్డ్రాల్ అనే టెక్నిక్ ని ఉపయోగించు. సైకాలజీలో దీన్నే గ్రే రాక్ మెథడ్ అంటారు. అంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ నీ పాత కమిట్మెంట్స్ ని వాడుకొని నిన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నప్పుడు నువ్వు ఎటువంటి ఎమోషన్స్ చూపించకుండా ఒక నిర్జీవమైన రాయిలా ప్రవర్తించు.
(29:18) వాళ్ళ ప్రెజర్ కి రియాక్ట్ అవ్వడం మానేసి లో లోపలే నీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం నీ ఓన్ స్పేస్ కోసం ఒక పక్కా ప్లాన్ ని బిల్డ్ చేసుకో నువ్వు ఆ ఆటో పైలట్ ట్రాప్ లో ఫిజికల్ గా ఉన్న మెంటలీ మాత్రం పూర్తిగా లాగౌట్ అయిపో నీ సైలెన్సే వాళ్ళ దాడికి అతి పెద్ద కవచంగా మారాలి. అసలు ఆ పాత రిలేషన్స్ మీద ఇంకా మర్యాద అనే పేరుతో మనల్ని మనం మోసం చేసుకునే ఆ ఇమేజ్ పట్ల నీకుండే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ని ఎప్పుడైతే నువ్వు కట్ చేస్తావో అప్పుడే నీ లైఫ్ మీద నీకు అసలైన కంట్రోల్ వస్తుంది.
(29:49) నీ జీవితానికి నువ్వే రాజుగా ఉండటం అంటే ఇదే ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. నీ లైఫ్ డెసిషన్స్ అన్నీ నీ చేతుల్లోనే ఉంటాయి. అసలు రిలేషన్స్ అంటే కేవలం ఒకే ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన అందరూ నీ వాళ్ళు అయిపోరు. ఎవరైతే నీ లిమిట్స్ అండ్ నీ క్యారెక్టర్ ని గౌరవిస్తారో నీ ప్రశాంతతకి సపోర్ట్ చేస్తారో వాళ్లే నీకు నిజమైన ఆత్మీయులు వాళ్లే నీ రియాలిటీ.
(30:11) ఒకసారి భీష్ముడి పరిస్థితి చూడు ఆ అంపశయ్య మీద పడి ప్రాణం పోయే సమయం వస్తే కానీ ఆయనకు ఈ విషయం అర్థం కాలేదు. ఆ సమయంలోనే ఆయనకు తన మనసు మీద పూర్తి కంట్రోల్ వచ్చింది. నువ్వు కూడా నీ చుట్టూ ఉన్న ఆ టాక్సిక్ వాతావరణాన్ని ఆ గొడవలు పడే వాళ్ళను పూర్తిగా పక్కన పెట్టేయ్ నీకంటూ ఒక గోల్ పెట్టుకో నీ ప్ాషన్ ఏంటో వెతుక్కో నీ మీద నిజమైన ప్రేమ ఉన్న మంచి ఫ్రెండ్స్ తో ఎక్కువగా కలుస్తూ ఉండు.
(30:36) నువ్వు ఇలా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే చాలు. యూనివర్స్ నీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక విషయంలో మాత్రం మనం సాఫ్ట్ గా కానీ క్లారిటీతో వ్యవహరించాలి. అంటే మన బౌండరీస్ ని ఏర్పరచుకోవడం మీ ఇంట్లో వారితో ఇలా చెప్పొచ్చు మన రిలేషన్ హెల్దీగా సంతోషంగా సాగాలని నేను కోరుకుంటున్నాను అందుకే నా పర్సనల్ విషయాల గురించి అలాగే మన మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉండాలో నేను కొన్ని విషయాలు అనుకున్నాను నా ఈ చిన్న నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
(31:03) భీష్ముడి జీవితాన్ని గమనిస్తే ఆయన తనకంటూ ఒక బౌండరీ సెట్ చేసుకోకపోవడం వల్ల ఎంతటి సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందో మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. రిలేషన్స్ లో క్లారిటీ లేనప్పుడు ఆ ఇంట్లో అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి గతంలో చేసిన ప్రామిసెస్ పేరుతో ఎవరైనా మీ పర్సనల్ స్పేస్ లోకి వస్తుంటే దాన్ని చాలా సాఫ్ట్ గా అయినా సరే క్లియర్ గా చెప్పి మీ బౌండరీని కాపాడుకోండి.
(31:27) కొన్నిసార్లు సాఫ్ట్ గా చెప్పినా వర్కవుట్ కాదు అప్పుడు కాస్త స్ట్రిక్ట్ గా చెప్పాల్సి ఉంటుంది. ఈ ఆటో పైలట్ లైఫ్ వల్ల రోజు రోజుకి నీ మనసు లోపల ఒక భయంకరమైన కోపం, బాధ పెరుగుతుంటాయి. చాలామంది ఈ బాధలో కుంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు లేదా తమను తాము దెబ్బ తీసుకుంటారు. కానీ భీష్ముడి జీవితం మనకు నేర్పించే గొప్ప పాఠం ఏంటో తెలుసా ఆ బాధను ఆ కసిని ఒక ఇంధనంలా వాడుకోవడం నీ ఫ్యామిలీ నిన్ను ఒంటరిని చేసిందని బాధపడటం ఆపేసి ఆ కోపాన్ని నీ కరియర్ నీ సంపాదన నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం వీటి మీద పెట్టు నువ్వు ఎంతలా సక్సెస్ అవ్వాలంటే నిన్ను తక్కువ అంచనా వేసి నీ సాక్రిఫైసెస్
(32:03) ని ఈజీగా తీసుకున్న ఆ ఫ్యామిలీ సిస్టం మొత్తం నీ ఎదుగుదల చూసి షాక్ అవ్వాలి. నీ బాధనే నీ శక్తిగా మార్చుకో. ఈ ఫిలాసఫీని డైలీ లైఫ్ లో అమలు చేయాలంటే ఈరోజు రాత్రి నుంచి ఒక చిన్న త్రీ స్టెప్ రొటీన్ ట్రై చెయ్ ద ఆటో పైలట్ చెక్ రాత్రి పడుకునే ముందు ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. ఈరోజు ఆ హడావిడిలో పాత పద్ధతుల వల్ల నువ్వు బలవంతంగా ఏ నిర్ణయాలు తీసుకున్నావో గుర్తు చేసుకో ద పెడస్ట్రల్ కట్ నీకు నువ్వు మనసులో నాకు నా మీద గౌరవం లేని వాళ్ళ నుంచి వచ్చే సర్టిఫికెట్స్ నాకు అవసరమే లేదు.
(32:38) సమాజం పేరుతో నన్ను ఒక పంజరంలో బంధించే ఆ ఫేక్ గౌరవం నాకు అక్కర్లేదు అని గట్టిగా చెప్పుకో ద సావరెన్ గ్రౌండింగ్ ఒక దీర్ఘ శ్వాస తీసుకొని మనసులో నేను ఒంటరిగా ఉన్నా సరే నా హద్దులు నాకున్నాయి. నేను అంచలంచలుగా ఎదుగుతూ బలంగా నిలబడతాను అని అనుకో ఇవి రోజువారిగా చేస్తే నీ మనసులో ఉన్న ఆ పాత ఇనుప సంకెళ్లు రోజుకో ముక్కగా విరిగిపోతాయి.
(33:01) సో ఇక చాలు ఆ ట్రాఫిక్ లో ఆ స్టీరింగ్ పట్టుకొని నీ కుటుంబం గురించి వాళ్ళ సైలెన్స్ గురించి ఆలోచిస్తూ లోలోపలే ఏడవటం ఇక్కడితో ఆపేసేయ్ నిన్ను రక్షించని ఆ పాత ప్రామిస్ ఒక జైల్ అని నీకు ఇప్పటికే అర్థమైంది కదా ఒక పాత కమిట్మెంట్ అనే సాకుతో నిన్ను నువ్వు అంపశయ్య మీద పడేసి ప్రతిరోజు హింసించుకోవడం ఆపేయ్. ఆ ఫేక్ రిలేషన్స్ వేసే సంకెళ్లను వీలైనంత త్వరగా తెంచేయ్ సాకులు చెప్పడం మానేసి గర్వంగా అడుగు ముందుకు వేయి ఇంతసేపు ఇదంతా ఓపిక్గా విన్నందుకు థాంక్స్ అలాట్ అండ్ ఐ విల్ సీ యు అవుట్ ఆన్ ద బాటిల్ ఫీల్డ్ నీ అంపశయ్య నుంచి లేచి నిలబడి నీ లైఫ్ అనే యుద్ధాన్ని
(33:35) ఒక మహారాజులా నువ్వే గెలుచుకో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నేను మీ లైఫోరామ తిరిగి కలుస్తూనే ఉందాం

No comments:

Post a Comment