Why Do I Always Blame Others? Krishna's Answer In Mahabharatam | LifeOrama Audio Podcast EP04
Author Name:LifeOrama
Youtube Channel Url:https://www.youtube.com/@LifeOramaOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=X9Ca0vo0MNY
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ లో మీరు లాంగ్ ఫామ్ కాంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు కామెంట్స్ చూశాక తెలిసింది. అయితే వీలైనంత త్వరగా ఆ లాంగ్ ఫామ్ కాంటెంట్ ని కూడా అప్లోడ్ చేస్తాను. అప్పటివరకు మీకు కాస్త నాలెడ్జ్ ఇస్తూ మీరు ఫేస్ చేసే డైలీ ఇష్యూస్ లో మన కంటెంట్ హెల్ప్ అయ్యేలాగా ఈ కొన్ని ఆడియో పాడ్కాస్ట్ ని అప్లోడ్ చేస్తున్నాను.
(00:22) సో అందులో భాగమే ఈ ఎపిసోడ్ నెంబర్ ఫోర్ అండ్ మిగతా ఎపిసోడ్స్ ఎక్కడ ఉంటాయి అని అడిగే వాళ్ళకు డిస్క్రిప్షన్ లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. అది కాకుండా మీరు ఒకవేళ చెక్ చేయాలంటే మన ఛానల్ పేజ్ లో ప్లేలిస్ట్ సెక్షన్ లో ఒకసారి చెక్ చేయండి లైఫోరామా ఆడియో పాడ్కాస్ట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అది క్లిక్ చేస్తే ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన ఎపిసోడ్స్ అన్నీ ఒక్కొక్కటిగా మీరు వినొచ్చు.
(00:43) ఇక ఇవాల్టి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. నీ కరియర్ నీ రిలేషన్షిప్స్ లేదా పూర్తి లైఫ్ ముక్కలైపోతుంటే నువ్వు మాత్రం నేను ఏ తప్పు చేయలేదు. నా వైపు అంతా కరెక్ట్ గానే ఉంది అని గట్టిగా నమ్మిన సిచువేషన్ నీకు ఎప్పుడైనా ఎదురైందా? ఇది నిజంగా చాలా ఫ్రస్ట్రేటింగ్ ఎక్స్పీరియన్స్ మన పబ్లిక్ ఇమేజ్ అండ్ మన ఈగోని కాపాడుకోవడానికి మన మైండ్ ఎన్నో బ్యూటిఫుల్ బట్ డిఫెక్టివ్ ఆర్గ్యుమెంట్స్ ని క్రియేట్ చేస్తుంది.
(01:08) దాంతో మనసులో క్రియేట్ అయ్యి లైఫ్ ని నాశనం చేసే తప్పుడు ఛాయిసెస్ ని మనం అస్సలు గమనించలేం. లైఫ్ లో ఎన్నో ఆస్పెక్ట్స్ వర్స్ట్ సిచువేషన్స్ కి వెళ్ళినప్పుడు బయట విషయాలను బ్లేమ్ చేయడం చాలా ఈజీ. మార్కెట్ బాలేదు మేనేజర్ తిక్కలోడు పార్ట్నర్ టాక్సిక్ గా ఉన్నారు లేదా ఇదంతా కేవలం బ్యాడ్ లక్ అని సరిపెట్టుకుంటాం.
(01:29) మన యాక్షన్స్ వెనుకున్న చేదు నిజాన్ని ఫేస్ చేయడం కంటే రాత్రేళ్ళు ప్రశాంతంగా నిద్రపోవడానికి వీలుగా ఉండే కొన్ని కంఫర్టబుల్ స్టోరీస్ ని మనకు మనమే అల్లుకుంటాం. మనల్ని మనమే మోసం చేసుకునే ఈ డేంజరస్ ట్రాప్ ఈ రోజుల్లో ఏదో కొత్తగా పుట్టింది కాదు వేల సంవత్సరాల క్రితమే మహాభారతం ఉద్యోగ పర్వంలో ఈ హ్యూమన్ కండిషన్ ని క్లియర్ గా మ్యాప్ చేశారు. మహాభారతం పూర్తిగా చదవని వారైతే దుర్యోధనుడు ఒక హెల్ప్లెస్ విక్టిమ్ అని అతనికి ఏది రైటో ఏది రాంగో అన్ని తెలిసినా కూడా తన ఇంపల్స్ ని మార్చుకోలేక అలా చేశాడు అని చెప్పే ఒక పాపులర్ మిత్ ని నిజం అనుకుంటారు. కానీ ఒరిజినల్ టెక్స్ట్
(02:04) అయిన వ్యాస మహాభారతం స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండే ఒక రియాలిటీని చూపిస్తుంది. దుర్యోధనుడు తన లైఫ్ లో ఎప్పుడూ తాను తీసుకున్న నిర్ణయాల గురించి గిల్టీగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అతని మైండ్ ఒక పర్ఫెక్ట్ ట్విస్టెడ్ లాజిక్ తో ఒక షీల్డ్ ని క్రియేట్ చేసుకుంది. తాను చేసిన పనులన్నిటిని చూసి తాను చాలా ఇన్నోసెంట్ అని మనస్ఫూర్తిగా నమ్మాడు.
(02:25) ఈ మైండ్సెట్ ఎలా మొదలవుతుందో అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద క్రైసిస్ రాబోయే ముందు మనం ఎలా బిహేవ్ చేస్తామో చూడాలి. శ్రీకృష్ణుడు శాంతిదూతగా హస్తినాపురానికి వెళ్ళకముందే అక్కడ అట్మాస్ఫియర్ మొత్తం చాలా హెవీ టెన్షన్ తో నిండిపోయింది. పాండవుల అరణ్యవాసం అండ్ అజ్ఞాతవాసం పూర్తయింది. వాళ్ళు తమ రాజ్యభాగం కోసం డిమాండ్ చేస్తున్నారు.
(02:46) ధృతరాష్ట్రుడు పాండవుల ఆలోచనలు ఏంటో తెలుసుకోవడానికి ఎంతో నమ్మకస్తుడైన మెసెంజర్ సంజయుడిని పంపుతాడు. సంజయుడు తిరిగివచ్చినప్పుడు ఒక భయంకరమైన రియాలిటీని వెంటబెట్టుకొస్తాడు. అతను నిజాన్ని దాచకుండా డైరెక్ట్ గా చెప్పేస్తాడు. కురువంశస్తుల దురాసే దీనంతటికీ కారణమని వాళ్ళ క్రూరత్వాన్ని ఆ రాజు ముందే ఓపెన్ గా నిందిస్తాడు. న్యాయం జరగకపోతే సర్వనాశనం ఖాయం.
(03:09) ఎందుకంటే పాండవుల వెనుక అపారమైన బలం ఉందని వార్నింగ్ ఇస్తాడు. అయితే సంజయుడు ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ ని అందరి ముందు వెంటనే చెప్పకుండా మరుసటి రోజు ఉదయం సభలో చెప్తానని అంటాడు. ఇది ధృతరాష్ట్రుడి మైండ్ లో విపరీతమైన టార్చర్ ని క్రియేట్ చేస్తుంది. ఆ రాత్రి జరిగే ఘట్టాన్ని మొత్తం మహాభారతంలో ప్రజాగర పర్వం అంటారు. అంటే లిట్రలీ నిద్ర లేని రాత్రి అని అర్థం.
(03:34) రాజు విపరీతమైన యంజైటీతో పూర్తిగా పారలైజ్ అయిపోతాడు. అతను కళ్ళు మూసుకోలేడు. ఎందుకంటే అతను ఏ నిజం నుంచి అయితే పారిపోవాలని చూస్తున్నాడో అది కళ్ళ ముందే కనిపిస్తుంది. ఆ కంగారులో కొంచెం కంఫర్ట్ కోసం అర్ధరాత్రి తన తమ్ముడైన విదురుడిని పిలుస్తాడు. ఆ తర్వాత విధురుడితో మాట్లాడుతూ సంజయుడు పాండవుల దగ్గర నుంచి వచ్చాడు. నన్ను నిందించి వెళ్ళిపోయాడు.
(03:54) రేపు సభలో తన మాటలు చెప్తాడు. నా శరీరం మొత్తం మండిపోతుంది. నాకు అసలు నిద్ర పట్టడం లేదు. ఏది కరెక్టో నాకు చెప్పు నా మైండ్ చాలా డిస్టర్బ్డ్ గా ఉంది అని అంటాడు. దీని తర్వాత వచ్చేదే ద ఫేమస్ విదురనీతి ఎథిక్స్ విస్డమ్ లీడర్షిప్. వీటి గురించి వివరించే ఒక బ్రిలియంట్ డిస్కోర్స్. విధురుడు రాజు వైపు నేరుగా చూసి అతనికి ఎందుకు నిద్ర పట్టట్లేదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా అంటాడు.
(04:19) నాలుగు రకాల వ్యక్తులకు నిద్ర పట్టదు బలవంతుడు చేతిలో దెబ్బతిన్న బలహీనుడు ఆస్తి మొత్తాన్ని కోల్పోయినవాడు కామంతో రగిలిపోయేవాడు అండ్ ఇతరుల సొమ్ముని దొంగలించడానికి ప్లాన్ చేసేవాడు. ఈ విధంగా విదురుడు ఒక మెటఫోరికల్ అద్దాన్ని చూపించి రాజు అనుభవిస్తున్న ఈ యంజైటీ కొడుకు దురాసకు అతను సైలెంట్ గా సపోర్ట్ చేయడం వల్లే వచ్చిందని జెంటిల్ గా పాయింట్ అవుట్ చేస్తాడు.
(04:42) ఇది మనకొక పవర్ఫుల్ కాన్సెప్ట్ ని పరిచయం చేస్తుంది. దాన్నే మనం పాసివ్ అబ్సర్వర్ మైండ్సెట్ అంటాం. అంటే కళ్ళ ముందే అన్ని కనిపిస్తున్న యక్షన్ తీసుకునే అధికారం చేతుల్లో ఉన్న ఏమీ చేయకుండా అలాగే చూస్తూ ఉండే వ్యక్తి. ధృతరాష్ట్రుడు ఇక్కడ ఒక క్లాసిక్ బై స్టాండర్డ్ అంటే ఇంటలెక్చువల్ గా ధృతరాష్ట్రుడికి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అక్కడ జరిగే విషయాల బట్టి ఒక అంచన ఉంది.
(05:04) తన కొడుకులు చెడు మార్గంలో ఉన్నారని ఆ యుద్ధం వల్ల తన వంశం మొత్తం తుడిచి పెట్టుకుపోతుందని అతనికి తెలుసు. దాని గురించి ఆలోచించి నిద్ర కోల్పోతాడు. యంజైటీ ఫీల్ అవుతాడు. రాబోయే డిజాస్టర్ గురించి ఏడుస్తాడు. కానీ యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా ఫ్రీజ్ అయిపోతాడు. అయినా ఇలా ఎందుకు అవుతుంది అని అడిగితే తన కంఫర్ట్ జోన్ ని వదులుకోలేకపోవడం కొడుకు మీద ఉన్న ఆ టాక్సిక్ బ్లైండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ అతన్ని బాధ్యత తీసుకోకుండా ఆపేస్తాయి.
(05:29) ఈ రకమైన బిహేవియర్ ని మన డైలీ లైఫ్ లో కూడా తరచూ చూస్తూ ఉంటాం. ఒక మోడర్న్ ప్రొఫెషనల్ ని ఊహించుకోండి. తన కరెంట్ కంపెనీ లేదా బిజినెస్ మోడల్ క్లోజ్ అయిపోయేలా ఉందని అతనికి తెలుసు. నంబర్స్ పడిపోవడం చూస్తున్నాడు. తోటి ఉద్యోగుల వార్నింగ్స్ వింటున్నాడు. రాత్రులు నిద్ర లేకుండా యంజైటీతో సీలింగ్ వైపు చూస్తూ గడుపుతున్నాడు.
(05:49) అతని దగ్గర డేటా అంతా ఉంది. అయినా కూడా అతను ఇందాక చెప్పిన పాసివ్ అబ్జర్వర్ గానే ఉండిపోవాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈరోజు ఒక పెయిన్ ఫుల్ అండ్ అన్ కంఫర్టబుల్ ఛాయిస్ తీసుకుంటేనే రేపటి డిజాస్టర్ ని ఆపగలడు. కానీ ఆ యాక్షన్ తీసుకోలేక ఫ్రీజ్ అయిపోతాడు. ధృతరాష్ట్రుడు లాగే వీళ్ళు కూడా ఏమి చేయకుండా ఉండే ఆ టెంపరరీ కంఫర్ట్ ని సెలెక్ట్ చేసుకుంటారు.
(06:10) ఏదో ఒక మ్యాజిక్ జరిగి ఆ డిజాస్టర్ వాళ్ళను తాకకుండా పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు పడే యంజైటీనే నేను చేసే పనిలో చాలా కష్టపడుతున్నాను అని చెప్పుకొని ఒక ఇల్యూజన్ లో బతికేస్తుంటారు. కానీ నిజాన్ని ఫేస్ చేసే ధైర్యం లేనప్పుడు ఆ నిజం తెలుసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. శ్రీకృష్ణుడు రాయబారిగా హస్తినాపురానికి అడుగు పెట్టినప్పుడు అక్కడున్న టెన్షన్ పీక్స్ కి చేరుకుంది.
(06:33) మహాభారతంలో ఈ ఉపపర్వాన్ని భగవత్ ధ్యాన పర్వం అంటారు. అంటే భగవంతుడే చేసిన ప్రయాణం అని అర్థం. కృష్ణుడికి ఫ్యూచర్ ని మార్చేసే పవర్ ఉందని అక్కడ అందరికీ తెలుసు. దుర్యోధనుడికి కూడా పబ్లిక్ గా తన ఇమేజ్ ఎంత ఇంపార్టెంటో బాగా తెలుసు. అందుకే ఆ సిచువేషన్ ని భక్తితో కాకుండా ఒక స్ట్రాటజీతో హ్యాండిల్ చేయాలనుకుంటాడు. తనేదో మొండి పట్టుదల గల విలన్లా కాకుండా లోపల కపటాన్ని దాచుకొని బయటకు మాత్రం చాలా పద్ధతిగా గొప్ప సంస్కారం ఉన్నవాడిలా ఒక ముసుగు వేసుకోవాలని డిసైడ్ అవుతాడు.
(07:04) కృష్ణుడు రాజభవనంలోకి ఎంటర్ అవ్వగానే దుర్యోధనుడు అతనికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తాడు. తాను ఉండటానికి తన సొంత మహల్ని ఆఫర్ చేస్తాడు. ఎంతో కాస్ట్లీ గిఫ్ట్స్, విలువైన ఆభరణాలు, సంపదను కానుకగా ఇస్తాడు. వీటన్నిటికంటే మించి రాజ్యంలోనే ది బెస్ట్ వంటకాలతో ఒక గ్రాండ్ అండ్ లావిష్ విందుని ఏర్పాటు చేస్తాడు.
(07:26) బయట నుంచి చూసే వాళ్ళకు ఇది అద్భుతమైన హాస్పిటాలిటీలా కనిపిస్తుంది. తను ఎంత మంచివాడినో ఎంత రీజనబుల్ గా బిహేవ్ చేస్తానో సభలో అందరూ చూడాలని దుర్యోధనుడి ప్లాన్. కానీ కృష్ణుడు ఈ షో ఆఫ్ ని ఈజీగా కనిపెట్టేస్తాడు. అక్కడున్న భార్య విందు భోజనాన్ని చూసి దుర్యోధనుడి వైపు తిరిగి ఆ ఆహారాన్ని కనీసం టచ్ చేయడానికి కూడా ఒప్పుకోడు.
(07:48) ఆ రాజభవనం ఆ సంపద ఆ విందు ఇవన్నీ రిజెక్ట్ చేస్తాడు. దీంతో దుర్యోధనుడు షాక్ అయ్యి అవమానంగా ఫీల్ అవుతాడు. సభలో కృష్ణుడిని తన ట్విస్టెడ్ లాజిక్ తో కార్నర్ చేయడానికి ట్రై చేస్తాడు. మన మధ్య ఇంకా యుద్ధం కానీ బహిరంగంగా శత్రుత్వం కానీ మొదలవ్వనప్పుడు నేను ఇచ్చే ఆతిథ్యాన్ని కాదనడం చాలా పెద్ద అవమానం అంటూ వాదిస్తాడు. కృష్ణుడు చాలా కామ్గా కోపంలో ఉన్న దుర్యోధనుడి మొఖాన్ని చూస్తూ ఒక డైరెక్ట్ రియాలిటీ చెక్ ఇస్తాడు.
(08:15) ఆయన ఏమంటాడంటే ఓ రాజా ఒక రాయబారి తన మిషన్ సక్సెస్ అయిన తర్వాతే భోజనం చేస్తాడు. నువ్వు నన్ను గౌరవించాలనుకుంటే ముందు నా రాయభారాన్ని సక్సెస్ చెయ్. పైగా ఒక మనిషి ఇంకొకరి ఇంట్లో అన్నం తినడానికి రెండే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి అవతలి వ్యక్తి మీద ఉన్న అమితమైన ప్రేమ వల్ల. రెండు ఆకలితో నకనకలాడిపోతూ వేరే ఆప్షన్ లేనప్పుడు.
(08:35) ఓ దుర్యోధన నీకు నా మీద ఎలాంటి నిజమైన ప్రేమ లేదు. నేను ఆకలితో అలమటించడం లేదు. నువ్వు పాండవులను ద్వేషిస్తున్నావు. ఎవరైతే వాళ్ళను ద్వేషిస్తారో వాళ్ళు నన్ను ద్వేషించినట్టే నీ మనసులో ఉన్న ఈ శత్రుత్వం వల్ల నువ్వు పెట్టే ఆహారం అపవిత్రమైనది. కృష్ణుడు ఆ బంగారు రాజభవనంలో ఉండటానికి ఇష్టపడకుండా ఆ ప్రదేశం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఊరి చివరున్న విదురుడి సాధారణ ఇంటికి చేరుకొని అక్కడున్న అసలైన ప్రేమ నిజాయితీ మధ్య చాలా సింపుల్ భోజనాన్ని తిని అక్కడే కాసేపు ఉంటాడు.
(09:04) ఈ ఘట్టం మన డైలీ లైఫ్ లో చూసే ఒక పవర్ఫుల్ రియాలిటీ వైపు తీసుకువెళ్తుంది. దాన్నే మనం కంప్లయన్స్ థియేటర్ లేదా ఫేక్ గుడ్నెస్ అని పిలవచ్చు. ఇలాంటి బిహేవియర్ పాటర్న్ ని మనం మోడర్న్ వరల్డ్ లో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఎగ్జాంపుల్ కి ఒక టాక్సిక్ కార్పొరేట్ బాస్ ని ఊహించుకోండి. అతను తన ఎంప్లాయీస్ కి చాలా తక్కువ శాలరీ ఇస్తూ ఆఫీస్ కల్చర్ ని అబ్యూసివ్ గా మారుస్తాడు.
(09:24) అసలు ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేసి వాళ్ళకు సరైన శాలరీ అండ్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోయి ఒక కాస్ట్లీ యన్యువల్ ఆఫీస్ పార్టీ ఇస్తాడు. బ్రేక్ రూమ్లో ఫ్రీ స్నాక్స్ పెడతాడు ఏవో కొన్ని అవార్డ్స్ ఇస్తాడు. తను చేసే తప్పులను కవర్ చేయడానికి ఇలాంటి గిఫ్ట్స్ అండ్ చిన్న చిన్న ఫేవర్స్ ని ఒక ఆప్టికల్ షీల్డ్ లా వాడుకుంటాడు.
(09:42) దీనివల్ల ఆ వ్యక్తి తనతో తాను అండ్ ప్రపంచంతో కూడా చూడండి నేను ఎంత మంచివాడిగా ఉన్నాను వాళ్ళకు గ్రాండ్ పార్టీ ఇచ్చాను అని చెప్పుకోవడానికి చూస్తాడు. ఫెయిల్ అయ్యే రిలేషన్షిప్స్ లో కూడా మనం ఇదే చూస్తాం. ఒక పార్ట్నర్ అవతల వ్యక్తి పట్ల చాలా అన్యాయంగా మనిపులేటివ్ గా లేదా ఎమోషనల్ గా దూరంగా ఉంటానని తెలిసినప్పుడు వాళ్ళు ఆ అసలు ప్రాబ్లం గురించి మాట్లాడడానికి ఇష్టపడరు.
(10:06) దానికి బదులు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కొనడం, ఫ్యాన్సీ డిన్నర్ డేట్ ప్లాన్ చేయడం లేదా సడన్ గా సర్ఫేస్ లెవెల్ లో చాలా పద్ధతిగా బిహేవ్ చేయడం ఇలాంటి పనులన్నీ చేస్తారు. తమ బ్యాడ్ ఇంటెన్షన్స్ ని దాచడానికి అండ్ నిజమైన బాధ్యత నుండి తప్పించుకోవడానికి ఈ గ్రాండ్ జెస్చర్స్ ని వాడుకుంటారు. దుర్యోధనుడి లాగే వీళ్ళ మైండ్ కూడా బయటికి ఇలా మంచిగా యాక్ట్ చేస్తే చాలు లోపల ఉన్న పెద్ద తప్పులన్నీ తుడిచి పెట్టుకుపోతాయి అనే ఒక ఇల్యూజన్ ని క్రియేట్ చేసుకుంటారు.
(10:31) కానీ కృష్ణుడు ఆ గ్రాండ్ విందుని ఎలాగైతే రిజెక్ట్ చేశాడో రియాలిటీని కూడా ఇలాంటి పై పైన చేసే పనులతో కొనలేం. నిజమైన న్యాయం అనేది మనం నలుగురిలో మంచిగా కనిపించడానికి ఇచ్చే గిఫ్ట్స్ లో లేదు. నాలుగు గోడల మధ్య ఎవరు చూడనప్పుడు కూడా నువ్వు ఎంత కరెక్ట్ గా ఉన్నావు అనే దానిపైనే అది డిపెండ్ అయి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కురుసభా మండపం మొత్తం జనాలతో నిండిపోయింది.
(10:53) ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు అండ్ మిగతా రాజులందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ తో కూర్చొని ఉండగా శ్రీకృష్ణుడు సెంటర్ స్టేజ్ తీసుకున్నాడు. చాలా నైపుణ్యంతో కామ్గా ఒక విషయాన్ని చెప్పాడు. గురు వంశానికి ఉన్న గొప్ప ఘనతను గుర్తు చేస్తూ ఈ యుద్ధం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు అనవసరంగా పోతాయని వార్నింగ్ ఇచ్చాడు.
(11:13) ఆయన ధృతరాష్ట్రుడి వైపు నేరుగా చూస్తూ శాంతి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉందంటూ నీ కొడుకులను కంట్రోల్ చెయ్ పాండవులు కూడా ఒక అడుగు వెనక్కి తగ్గేలా నేను చేస్తాను. ఇరువైపుల ఒక ఫెయర్ కాంప్రమైజ్ రానివ్వు అని చెప్తాడు. ఈ కండిషన్స్ ని ఒప్పుకోవడం చాలా ఈజీ చేయడానికి పాండవులు తమ డిమాండ్స్ ని పూర్తిగా తగ్గించుకుంటారు. తమకు ఆ పెద్ద రాజ్యం కూడా వద్దు.
(11:35) కేవలం పరిపాలించడానికి ఐదు చిన్న ఊర్లు ఇస్తే చాలు అన్ని కండిషన్స్ ని వదిలేసి యుద్ధాన్ని ఆపేస్తామని చెప్తాడు. అది వినగానే సభ మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది. పెద్దవాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకొని ఇంతకంటే మంచి ఆఫర్ ఉండదని దీన్ని యాక్సెప్ట్ చేయమని దుర్యోధనుడిని బ్రతిమాలుతారు. కానీ దుర్యోధనుడు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. ఆ క్షణం అతని ముఖం మొత్తం కోపంతో ఊగిపోయింది.
(11:57) తను తప్పు చేశానని అతను అస్సలు ఒప్పుకోడు నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అని కూడా అనడు. దానికి బదులుగా సభ చుట్టూరా చూస్తూ తన కోర్ డిఫెన్స్ స్టేట్మెంట్ ని గట్టిగా అరిచి చెప్తాడు. నేను ఏ తప్పు చేసినట్టు నాకైతే అనిపించడం లేదు. కానీ ఇక్కడున్న రాజులతో సహా మీరందరూ నన్ను ఒక్కడినే నిందిస్తున్నారు. తను కాంప్రమైజ్ అవ్వకపోవడాన్ని జస్టిఫై చేసుకోవడానికి దుర్యోధనుడి మైండ్ మూడు బలమైన ట్విస్టెడ్ లాజిక్ పిల్లర్స్ ని క్రియేట్ చేసుకుంటుంది.
(12:26) ద లీగలిస్టిక్ ఎక్స్క్యూస్ చట్టపరమైన సాకు ఆ రోజు జరిగిన జూదం పూర్తి రూల్స్ ప్రకారమే జరిగిందని వాదిస్తాడు. పాండవులు కావాలనుకునే పందెం కాశారు. వాళ్లే తమ రాజ్యాన్ని వడ్డి ఓడిపోయారు. శకుని ధర్మబద్ధంగానే గెలిచాడు. సో టెక్నికల్లీ చట్టం ప్రకారం తను ఏ క్రైమ్ చేయలేదు. వాళ్ళకు తను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నెంబర్ టూ రీఫ్రేమింగ్ ప్రైడ్ యస్ డ్యూటీ అహాన్ని బాధ్యతగా మార్చడం తన మొండితనాన్ని సమర్థించుకోవడానికి క్షత్రియ ధర్మాన్ని వాడుకుంటాడు.
(12:54) మతంగ మహర్షి చెప్పిన మాటల్ని సందర్భం లేకుండా వాడుతూ ఒక నిజమైన మగాడు ఎప్పుడూ తనని తాను నిలబెట్టుకోవాలి కానీ ఎవ్వరి ముందు తలవంచకూడదు. భయంతో తలవంచడం పాపం అని చెప్తాడు. ధైర్యానికి సంబంధించిన ఒక నోబుల్ కోడ్ ని తన టాక్సిక్ ప్రైడ్ ని ఒక పవిత్రమైన డ్యూటీలా చూపించడానికి ట్విస్ట్ చేస్తాడు. ద అబ్సల్యూట్ అల్టిమేటం ఖచ్చితమైన హెచ్చరిక ఆర్గ్యుమెంట్ ని పూర్తి చేస్తూ ఒక గట్టి గీత గీస్తాడు.
(13:19) అంటే నేను బ్రతికున్నంతవరకు ఒక సూది మొన మీద పట్టేంత భూమిని కూడా పాండవులకు ఇవ్వను అని అంటాడు. ఈ ఘట్టం మనుషులు ఒక కార్నర్ లో స్టక్ అయినప్పుడు ఎలాంటి ఎక్స్టర్నలైజ్డ్ బ్లేమ్ మేట్రిక్స్ అంటే తన యక్షన్స్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మిగతా వాటిని నిందించడం అనే సిచువేషన్ లోకి జారిపోతారో క్లియర్ గా చూపిస్తుంది. మన ఛాయిసెస్ వల్ల మన లైఫ్ నాశనం అవుతున్నప్పుడు మన సొంత తప్పుల వల్లే ఈ పతనం జరుగుతుందనే నిజాన్ని మన ఈగో అస్సలు తట్టుకోలేదు.
(13:48) ఆ గిల్ట్ నుండి తప్పించుకోవడానికి మన బ్రెయిన్ వెంటనే ఒక కరప్ట్ లాయర్ లా మారిపోతుంది. మన వైపు ఎలాంటి తప్పు లేదని ప్రూవ్ చేసుకోవడానికి చిన్న చిన్న లూప్ హోల్స్ ని మనకు నచ్చిన కొన్ని ఫాక్ట్స్ ని వెతికి చూపిస్తుంది. మోడర్న్ కార్పొరేట్ స్కాండల్స్ లో కూడా ఇది ఎలా జరుగుతుందో ఆలోచించండి. ఒక పెద్ద కంపెనీ ఏదైనా లూప్ హోల్ ని వాడుకొని వేలాది మంది కస్టమర్స్ జీవితాలను నాశనం చేసినప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్స్ వచ్చి క్షమాపణలు చెప్పరు.
(14:12) వాళ్ళు పబ్లిక్ రిలేషన్స్ టీమ్స్ ని రప్పించి పోడియం వెనక నిలబడి దుర్యోధనుడు లాంటి లీగలిస్టిక్ ఎక్స్క్యూసెస్ నే చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే టెక్నికల్లీ మేము ఎలాంటి చట్టాలు బ్రేక్ చేయలేదు. కస్టమర్స్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని చదివి సైన్ చేశారు. ఇట్స్ జస్ట్ బిజినెస్ ఇలాంటి ప్రింట్స్ అండ్ పాలసీస్ ని వాడుకొని అవతల వాళ్ళను తొక్కేస్తూ తమ మనస్సాక్షి మాత్రం చాలా క్లీన్ గా ఉందని నమ్ముతారు.
(14:34) మన పర్సనల్ లైఫ్ లో కూడా ఈ ట్విస్టెడ్ లాజిక్ ని చూస్తాం. తమ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని చాలా క్రూరంగా ఎమోషనలీ హర్ట్ చేసే ఒక వ్యక్తిని తీసుకోండి వాళ్ళను నిలదీసినప్పుడు వాళ్ళు తాము తప్పు చేశమని అస్సలు ఒప్పుకోరు. దానికి బదులుగా ఏవో కొటేషన్స్ లేదా సైకలాజికల్ వర్డ్స్ ని సందర్భం లేకుండా ట్విస్ట్ చేసి వాడుకుంటారు.
(14:55) నేను కేవలం నా బౌండరీ సెట్ చేసుకుంటున్నాను అని అంటారు. లేదా నేను చాలా నిక్కచ్చిగా ఓపెన్ గా మాట్లాడుతున్నాను. నువ్వు అంత సెన్సిటివ్ గా ఉంటే అది నా తప్పు కాదు అని అంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ లాంటి ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకొని వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా మారకుండా ఉండటానికి ఒక డిఫెన్స్ లా వాడుకుంటారు. దుర్యోధనుడు తను అమాయకుడిన అనే ఆ నర్రేటివ్ ని మనస్ఫూర్తిగా నమ్మాడు.
(15:17) ఎందుకంటే అతని మైండ్ కేవలం తనకు అనుకూలంగా ఉన్న రూల్స్ ని మాత్రమే చూసింది. తను చేసిన మోసాన్ని, క్రూరత్వాన్ని అండ్ దానివల్ల ఇతరులు అనుభవించిన బాధను పూర్తిగా ఇగ్నోర్ చేశాడు. ఇవాళ మనలో చాలా మంది లాగే అతను లాజిక్ ని నిజాన్ని తెలుసుకోవడానికి కాకుండా ఆ నిజం నుండి తన ఇగోని కాపాడుకోవడానికి ఒక వెపన్ లా వాడుకున్నాడు.
(15:37) దుర్యోధనుడు తను చెప్పిన లీగల్ అండ్ ఫిలాసఫికల్ ఎక్స్క్యూసెస్ తో పూర్తిగా సాటిస్ఫై అయ్యి మళ్ళీ కూర్చున్నప్పుడు ఆ సభా మండపంలోని అట్మాస్ఫియర్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. శ్రీకృష్ణుడు అక్కడ సైలెంట్ గా కూర్చొని ఆ ట్విస్టెడ్ హిస్టరీని ఏమాత్రం యక్సెప్ట్ చేయలేదు. ఆయన కళ్ళల్లో తీవ్రమైన కోపం కనిపిస్తుంది. ఆయన లేచి నిలబడగానే ఆయన గొంతు ఆ సభ మొత్తం ప్రతిధ్వనించింది.
(16:01) దుర్యోధనుడి ఫేక్ ఇన్నోసెన్స్ ని ఆయన ముక్కలు ముక్కలు చేశాడు. ఆ యువరాజు కావాలనే దాచేసిన కొన్ని చేదు నిజాలను హార్ట్ డేటా పాయింట్స్ ని కృష్ణుడు సిస్టమాటిక్ గా బయటకు తీస్తాడు. కృష్ణుడు అతని వైపు నేరుగా చూస్తూ ఓ దుర్యోధన నువ్వు ఏ తప్పు చేయలేదా చట్టాలు న్యాయంగా ఆడే ఆటల గురించి నువ్వు మాట్లాడుతున్నావా చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు భీముడికి అన్నంలో విషం కలిపి అతన్ని బంధించి నదిలో విసిరేయడం ఏ చట్టం పరిధిలోకి వస్తుంది వారణావతంలో లాక్షా గృహాన్ని నిర్మించి అర్ధరాత్రి వేళ నీ తమ్ముళ్ళు నిద్రపోతుంటే వాళ్ళను సజీవంగా కాల్చేయాలని చేసిన ప్లాన్ ఏ నీతిశాస్త్రంలో ఉంది నువ్వు గౌరవం గురించి
(16:38) మాట్లాడుతున్నావా నీ మామ శకుని జూద యూధన్లో మోసంతో గెలిచినప్పుడు ద్రౌపదిని జుట్టు పట్టుకొని ఆ సభలోకి ఈడ్చుకొచ్చి ఇంతమంది రాజుల ముందే ఘోరంగా అవమానించడం ఏ క్షత్రియ ధర్మం అంటూ నిలదీశడు. కృష్ణుడి మాటలు మనకొక పవర్ఫుల్ కాన్సెప్ట్ ని చూపిస్తుంది. దాన్నే మనం సబ్జెక్టివ్ నర్రేటివ్ వర్సెస్ ఆబ్జెక్టివ్ రియాలిటీ అని పిలవచ్చు.
(17:00) సబ్జెక్టివ్ నర్రేటివ్ అంటే మన గిల్ట్ నుండి మన ఈగోని కాపాడుకోవడానికి మనకు మనమే చెప్పుకునే ఒక కంఫర్టబుల్ ఎడిటెడ్ స్టోరీ. ఇది కేవలం మన గుడ్ ఇంటెన్షన్స్ ని మాత్రమే హైలైట్ చేస్తుంది. మనకు నచ్చిన రూల్స్ ని మాత్రమే చూపిస్తుంది. అండ్ మనల్ని ఒక విక్టిమ్ లా ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ ఆబ్జెక్టివ్ రియాలిటీ అనేది దానికి కంప్లీట్ ఆపోజిట్. మన రియల్ ఛాయిసెస్ వల్ల బయట ప్రపంచంలో జరిగిన డామేజ్, పెయిన్ అండ్ డిస్ట్రక్షన్ ని అది ఏ మాత్రం ఎడిట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది.
(17:30) మన డైలీ లైఫ్ కి ఇది ఎలా వర్తిస్తుందో ఒక్కసారి గమనించండి. చీట్ చేసిన ఒక పార్ట్నర్ దొరికిపోయారు అనుకుందాం. వాళ్ళను నిలదీసినప్పుడు వాళ్ళ బ్రెయిన్ వెంటనే తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒక సబ్జెక్టివ్ నర్రేటివ్ ని క్రియేట్ చేస్తుంది. వాళ్ళు ఏమంటారంటే టెక్నికల్లీ మన రిలేషన్షిప్ ఎప్పుడో ఎమోషనల్లీ డెడ్ అయిపోయింది. లేదా నువ్వు నా మీద సరిగ్గా అటెన్షన్ పెట్టకపోవడం వల్లే నేను అలా చేయాల్సి వచ్చింది అని అంటారు.
(17:53) తాము ఒక సిచువేషన్ వల్ల నలిగిపోయిన విక్టిమ్ లా కనిపించడానికి స్టోరీని ఎడిట్ చేస్తారు. కానీ ఆబ్జెక్టివ్ రియాలిటీకి వాళ్ళ ఇన్నర్ ఎక్స్క్యూసెస్ తో అస్సలు సంబంధం లేదు. రియాలిటీ ఏంటంటే వాళ్ళు కావాలనే అబద్ధం చెప్పారు. ఒకరి నమ్మకాన్ని వమ్ము చేశారు అండ్ ఒక ప్రామిస్ ని బ్రేక్ చేశారు. మన ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఈ ట్రాప్ ని చూస్తుంటాం.
(18:13) ఒక టీం మేట్ పదే పదే డెడ్ లైన్స్ మిస్ అవ్వడం వల్ల ఒక పెద్ద ప్రాజెక్ట్ క్రాష్ అయిపోయింది అనుకోండి. మేనేజర్ వాళ్ళను పిలిచి అడిగినప్పుడు వాళ్ళ మైండ్ వెంటనే తమను తాము కాపాడుకోవడానికి ఒక బ్యూటిఫుల్ స్టోరీని రెడీ చేస్తుంది. నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా లేవు. లేదా ఆ టైం లైన్ అసలు ప్రాక్టికల్ గానే లేదు అని అంటారు.
(18:31) తమ సెల్ఫ్ ఇమేజ్ పాడవ్వకుండా ఉండటానికి ఇలాంటి మైనర్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తారు. కానీ ఆబ్జెక్టివ్ రియాలిటీ లేదా హార్డ్ డేటాని చూస్తే ఆ టీం్ లో మిగతా వాళ్ళంతా ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసి వర్క్ ని మేనేజ్ చేసినప్పుడు ఈ వ్యక్తి మాత్రం వారాలు తరబడి పనిని వాయిదా వేస్తూ ఎక్స్క్యూసెస్ వెతుకుతున్నాడు అనేదే క్లియర్ గా అర్థమవుతుంది.
(18:50) దుర్యోధనుడు తన సొంత సబ్జెక్టివ్ స్టోరీని నమ్మడంలో ఒక మాస్టర్ తాను అమాయకుడని మనస్ఫూర్తిగా నమ్మాడు. ఎందుకంటే అతని మైండ్ తను చేసిన తప్పులో ఉన్న హిస్టారికల్ ఫాక్ట్స్ ని పూర్తిగా బ్లాక్ చేసింది. కానీ కృష్ణుడు ప్రూవ్ చేసినట్టు నీ ఇన్నర్ స్టోరీ ఎంత బ్యూటిఫుల్ గా ఎంత లాజికల్ గా ఉన్నా సరే అది నువ్వు చేసిన యాక్షన్స్ వల్ల జరిగిన రియల్ వరల్డ్ డామేజ్ ని అస్సలు తుడిచేయలేదు.
(19:13) మన నర్రేటివ్ ని బ్రేక్ చేసుకొని మన హార్ష్ ట్రూత్ ని ఫేస్ చేసే ధైర్యం మనకు ఉన్నప్పుడే రియల్ గ్రోత్ అనేది మొదలవుతుంది. కృష్ణుడి ఎదుట ఎంతో కష్టపడి బిల్డ్ చేసుకున్న లాజిక్ మొత్తం ముక్కలైపోవడం చూసి దుర్యోధనుడి అహంకారం పూర్తిగా తునాతునకలు అయిపోయింది. అతని దగ్గర కృష్ణుడి ఆర్గ్యుమెంట్స్ కి ఎలాంటి సమాధానాలు లేవు. ఎందుకంటే ఆ ఫాక్ట్స్ ని ఎవ్వరూ డినై చేయలేరు.
(19:34) ఆ నిజానికి ఉన్న వెయిట్ తట్టుకోలేక అతను ఆ శాంతిదూతను ఇన్సల్ట్ చేసి పెద్దవాళ్ళకు వెన్ను చూపి తీవ్రమైన కోపంతో ఆ సభ నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఇక బయటికి వచ్చేసాక తన కోర్ సర్కిల్ అయిన కర్ణ శకుని దుశాసనులతో కలుస్తాడు. వాళ్ళ మనసుల్లో విపరీతమైన పానిక్ మొదలవుతుంది. వాళ్ళ మంచితనం అనే ముసుగు తొలగిపోయింది. వాళ్ళు చేసిన అన్యాయం ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది.
(19:58) ఈ డెస్పరేట్ స్టేట్ లో వాళ్ళ మైండ్ ఒక ప్రమాదకరమైన షార్ట్ కట్ ని ఆలోచించింది. డిప్లమసీకి సంబంధించిన చట్టాన్ని ఘోరంగా ఉల్లంఘిస్తూ శ్రీకృష్ణుని బలవంతంగా బంధించి జైల్లో పెట్టాలని ప్లాన్ చేస్తారు. దుర్యోధనుడి లాజిక్ చాలా సింపుల్ కానీ అందులో ఒక ప్యూర్ డిల్యూజన్ ఉంది. దుర్యోధనుడు మిగతా ముగ్గురితో మాట్లాడుతూ మనం కృష్ణుడిని కట్టడి చేస్తే పాండవులు వృష్ణులు వెంటనే తమ మైండ్ అండ్ గైడ్ ని కోల్పోతారు.
(20:22) కృష్ణుడు మన చెరసాలలో ఉంటే వాళ్ళు నా కండిషన్స్ కి లొంగిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్తాడు. వాళ్ళు ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి సభలోకి తిరిగి వచ్చినప్పుడు విధురా ధృతరాష్ట్రులకు ఈ ప్లాన్ తెలిసిపోయి దుర్యోధనుడిని తీవ్రంగా మందలిస్తారు. విధురుడు అయితే దుర్యోధనుడి వైపు జాలిగా చూస్తూ ఒక ఫైనల్ అండ్ కోల్డ్ వార్నింగ్ ఇస్తాడు.
(20:44) ఓ మూర్ఖుడా నువ్వు చందమామ కోసం చేతులు చాచే చిన్న పిల్లవాడివి. కృష్ణుడిని బలవంతంగా బంధించాలనుకోవడం అంటే సుడిగాలిని చేతిలో పట్టుకోవాలని చూడటం లాంటిది లేదా రగులుతున్న నిప్పుని ఒక గుడ్డ ముక్కలో దాచే ప్రయత్నం లాంటిది. నీ చీకటి గదిలో బంధించడానికి అతను ఒక సాధారణ దూత కాదు. ఆయనే సర్వశక్తికి మూలం. నీ చెరసాల గొలుసులు ఆయన్ని ఏమాత్రం బంధించలేవు అని విధురుడు అన్నాక వాళ్ళు చేసిన ఆ డెస్పరేట్ అటెంప్ట్ ని చూసి కృష్ణుడు చిన్నగా నవ్వాడు.
(21:12) అక్కడే సభ మధ్యలో ఆయన తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ రూపం నుండి వచ్చిన దివ్యకాంతి వల్ల అక్కడున్న వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాయి. దుర్యోధనుడి ఫిజికల్ పవర్ ఎంత చిన్నదో అందరికీ అర్థమైపోయింది. ఒక్క క్షణంలో అంతా తమ కంట్రోల్ లో ఉందనుకున్న వాళ్ళ భ్రమ పూర్తిగా ముక్కలైపోయింది. కృష్ణుడు అక్కడి నుండి వెనుతిరిగి పొగను విడిచిపెట్టిన నిప్పుల ఆ రాజభవనం నుండి బయటకు వచ్చేస్తాడు.
(21:34) పాండవుల దగ్గరకు తిరిగి వెళ్తూ ఇక శాంతి చర్చలన్నీ అఫీషియల్లీ డెడ్ అని డిక్లేర్ చేస్తాడు. ఈ ఫైనల్ యాక్ట్ మనక ఒక ప్రమాదకరమైన సైకలాజికల్ ట్రాప్ ని పరిచయం చేస్తుంది. దాన్నే మనం అటాకింగ్ ద ట్రూత్ టెల్లర్ అని చెప్పుకోవచ్చు. మన ఫాల్స్ లాజిక్ ఫెయిల్ అయినప్పుడు మన ఎక్స్క్యూసెస్ బయట పడినప్పుడు అండ్ మన ఇగో ఒక కార్నర్ లోకి వెళ్ళిపోయినప్పుడు మన బ్రెయిన్ ముందు రెండు ఆప్షన్స్ ఉంటాయి.
(21:56) ఒకటి ఆ బాధ కలిగించే నిజాన్ని యక్సెప్ట్ చేసి మనల్ని మనం తగ్గించుకోవడం. ఇక రెండు మన తప్పుల్ని బయట పెట్టడానికి ట్రై చేసే ఆ నోటిని మూయించడానికి ఒక డెస్పరేట్ అండ్ అగ్రెసివ్ షార్ట్ కట్ ని ఎంచుకోవడం. మన మోడర్న్ వర్క్ ప్లేసెస్ లో కూడా ఇలాంటి బిహేవియర్ ని తరచూ చూస్తూ ఉంటాం. డేటాని మనిపులేట్ చేస్తూ దొరికిపోయిన ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ని తీసుకుంటే నిజాన్ని బయట పెట్టే ఒక వ్యక్తి అంటే విజిల్ బ్లోయర్ లేదా ఒక ఆనెస్ట్ హెచ్ఆర్ మేనేజర్ ఆ హార్డ్ డేటా పాయింట్స్ ని బయట పెట్టినప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ లాజిక్ ఫెయిల్ అవుతుంది.
(22:25) అప్పుడు ఆ తప్పుని సరి చేసుకోవడానికి బదులుగా వాళ్ళు ఒక డెస్పరేట్ షార్ట్ కట్ తీసుకుంటారు. ఆ విజిల్ బ్లోర్ మీద స్మియర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం అంటే అంటే అపవాదులు వేయడం చేస్తారు. వాళ్ళను జాబ్ లో నుంచి తీసేయడానికి ట్రై చేయడం లేదా గ్యాస్ లైటింగ్ చేసి వాళ్ళకేదో మైండ్ బాలేదనేలా ప్రొజెక్ట్ చేయడం లాంటివి చేస్తారు.
(22:42) నిజాన్ని చెప్పే వ్యక్తి నోరు నొక్కేస్తే ఆ నిజం కూడా మ్యాజిక్ లా మాయమవుతుందనే భ్రమలో వాళ్ళు ఉంటారు. పర్సనల్ రిలేషన్షిప్స్ లో కూడా ఇదే జరుగుతుంది. ఒక పార్ట్నర్ తన టాక్సిక్ బిహేవియర్ ని క్లియర్ ఎవిడెన్స్ తో సహా నిలదీసినప్పుడు అవతలి వ్యక్తి అసలు ఫాక్ట్స్ గురించి అస్సలు మాట్లాడడు. దానికి బదులుగా టాపిక్ ని ట్విస్ట్ చేసి ఒక అగ్రెసివ్ ఎమోషనల్ అటాక్ స్టార్ట్ చేస్తారు.
(23:05) నా ఫోన్ చెక్ చేయడానికి నీకు ఎంత ధైర్యం నువ్వు ఎప్పుడు నా తప్పులే ట్రాక్ చేస్తూ ఉంటావ ఏంటి అని అరుస్తారు. అసలు రియాలిటీని ఎదురించడం ఇష్టం లేక నిలదీసిన ఆ ప్రాసెస్ ని అటాక్ చేస్తారు. దుర్యోధనుడు తన బలాన్ని ఉపయోగించడానికి కారణం ఏంటంటే అతని లాజిక్ ఇక ఎంతమాత్రం అతని ఆత్మగౌరవాన్ని కాపాడలేకపోయింది. దూతగా వచ్చిన కృష్ణుడిని బంధిస్తే తాను చేసిన పనులకు ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చని నమ్మాడు.
(23:30) కానీ రియాలిటీని ఎవ్వరు దాచలేరు బంధించలేరు. నీ తప్పులను ఫిక్స్ చేసుకోవడానికి బదులు నువ్వు నిజాన్ని అటాక్ చేయాలని చూస్తే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది సేఫ్ గా ఉండదు సరి కదా నీ పూర్తి డిస్ట్రక్షన్ కే నువ్వు గ్యారెంటీ ఇచ్చినట్టు అవుతుంది. దుర్యోధనుడి మైండ్ సెట్ కు ఉన్న ఆర్కిటెక్చర్ ని మీరు క్లోజ్ గా అబ్సర్వ్ చేస్తే ఒక గొప్ప విషయం అర్థమవుతుంది. ఇక్కడ అసలు ట్రాజడీ ఏంటంటే అతనేం అమాయకుడు కాదు అలాగని తెలివి తక్కువైన వాడు కూడా కాదు.
(23:55) అతనికి బలమైన మైండ్ ఉంది ఎక్సలెంట్ పొలిటికల్ ట్రైనింగ్ ఉంది అండ్ ఒక ఆర్గ్యుమెంట్ ని లాజికల్లీ బిల్డ్ చేసే బ్రిలియంట్ ఎబిలిటీ కూడా ఉంది. కానీ అతని బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే తన తెలివి మొత్తాన్ని ఒక అబద్ధాల కోటను క్రియేట్ చేసుకోవడానికి వాడుకున్నాడు. తన సొంత ప్రొటెక్టివ్ నర్రేటివ్ లో తనని తాను లాక్ చేసుకొని ఆ తాళం చెవిని ఎక్కడో పారేసి నిజాన్ని ఒక శత్రువులా చూశాడు.
(24:16) మనతో మనం హానెస్ట్ గా ఉంటే మనఅందరిలోనూ కొంచెమైనా దుర్యోధనుడు దాగుంటాడు. మనం ఎప్పుడు ఏ తప్పు చేసినా మన మైండ్ వెంటనే మన ప్రైడ్ ని కాపాడుకునే ఒక ఎక్స్ప్లనేషన్ కోసం వెతుకుతుంది. మనకు అన్కంఫర్టబుల్ అనిపించే ఫాక్ట్స్ ని ఫిల్టర్ చేసి మనల్ని మనం జస్ట్ ఒక విక్టిమ్ లా ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒక లూప్ హోల్ ని వెతుకుతుంది.
(24:36) కానీ మన కరియర్స్ బిజినెస్ ప్లాన్స్ అండ్ మన రిలేషన్షిప్స్ ఒక పెద్ద గోడను గుద్దుకొని ఆగిపోకూడదంటే ముందు మనం ఈ డిఫెన్సివ్ ఆర్కిటెక్చర్ ని బ్రేక్ చేయడం నేర్చుకోవాలి. ఈ ఆత్మవంచన అంటే సెల్ఫ్ డిసెప్షన్ అనే ట్రాప్ నుండి బయట పడటానికి ఉద్యోగ పర్వంతో పాటు మహాభారతంలో ఉన్న డీపర్ ఫిలాసఫీ మనకు మూడు సింపుల్ యాక్షనబుల్ స్ట్రాటజీస్ ని ఇస్తాయి. నెంబర్ వన్ యు మస్ట్ కండక్ట్ ఆ రాడికల్ డేటా ఆడిట్.
(25:00) నీ మైండ్ లోపల క్రియేట్ అయ్యే అబద్ధపు కథలు వినడం ఆపేసి పాస్ట్ వన్ ఇయర్ లో నీ చుట్టూ ఉన్న రియల్ వరల్డ్ లో నీ డెసిషన్స్ వల్ల కనిపిస్తున్న నిజమైన ప్రూఫ్స్ ని చూడటం మొదలుపెట్టు. నీ మనసు నీ గురించి చాలా గొప్పగా ఒక స్టోరీని చెప్పొచ్చు. కానీ రియాలిటీ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నువ్వు ఒక బిజినెస్ రన్ చేస్తున్నావ అనుకో నీ ప్లాన్ వల్ల ప్రతి నెల మనీ లాస్ అవుతుంటే దాన్ని బ్యాడ్ లక్ అనో లేక మార్కెట్ బాలేదనో సాకులు చెప్పడం ఆపేయ్ రిజల్ట్స్ ని చూడు నీ పర్సనల్ రిలేషన్స్ లో పదే పదే గొడవలు జరిగి బ్రేక్ అవుతుంటే నువ్వు కేవలం తప్పుడు వ్యక్తులనే మీట్ అవుతున్నావు అని నీకు నువ్వు
(25:30) అబద్ధాలు చెప్పుకోవడం ఆపేయ్. ఆ రిపీట్ అవుతున్న మిస్టేక్ ని గమనించు. కృష్ణుడు దుర్యోధనుడితో మాట్లాడినప్పుడు చిన్నతనంలో భీముడికి విషం పెట్టడం, లాక్షాగృహం, ద్రౌపదికి జరిగిన అవమానం ఇలాంటి పాత నిజాన్ని ఎలాగైతే కళ్ళ ముందు పెట్టాడో అలా నిన్ను నువ్వు ఆ చేదు నిజాలను ఫేస్ చేసేలా బలవంత పెట్టుకున్నప్పుడు నేను చాలా మంచి వ్యక్తిని అనే నీ ఇల్యూజన్ ముక్కలైపోతుంది.
(25:53) నెంబర్ టూ యు నీడ్ టు అప్లై ద విధురా టెస్ట్ మనందరి లైఫ్ లోనూ ఒక విధురుడు ఉంటాడు. ఒక నిజాయితీ గల ఫ్రెండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడే కలీగ్ లేదా మనల్ని కేర్ చేసే ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఆ నిజాన్ని ఏమాత్రం మార్చకుండా నీ మొహం మీదే చెప్పేస్తారో వాళ్లే నీ లైఫ్ లో విధురుడు వాళ్ళు స్వీట్ గా మాట్లాడరు. అండ్ నీ చుట్టూ ఉండి పొగిడే బ్యాచ్ లో అస్సలు ఉండరు.
(26:14) నువ్వు ఆ వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తున్నావో ఒక్కసారి చెక్ చేసుకో నీ ఆటిట్యూడ్ లిమిట్స్ దాటుతున్నాయని లేదా ఆఫీస్ లో నువ్వు ఒక పెద్ద తప్పు చేస్తున్నావని వాళ్ళు నీకు చెప్పినప్పుడు నువ్వు వింటున్నావా లేదా ఇగో హర్ట్ అయిపోయి వాళ్ళ ఫోన్ కాల్స్ అవాయిడ్ చేస్తూ నీ ఇగోని సాటిస్ఫై చేసే భజన బ్యాచ్ దగ్గరికి పరిగెడుతున్నావా నీ లైఫ్ లో నిజాన్ని చెప్పే ఒక వాయిస్ ని నువ్వు ఇగ్నోర్ చేయడానికో లేదా మ్యూట్ చేయడానికో ట్రై చేస్తుంటే దుర్యోధనుడు చేసిన తప్పే నువ్వు కూడా చేస్తున్నావ్.
(26:42) ఈ ట్రాప్ ని బ్రేక్ చేయాలంటే ఆ టెంపరరీ కంఫర్ట్ ఇచ్చే భజన బ్యాచ్ ని దూరం పెట్టి ఆ అన్కంఫర్టబుల్ అయిన నిజాన్ని నీ లైఫ్ లోకి ఇన్వైట్ చేయాలి. నెంబర్ త్రీ డ్రాప్ ద షార్ట్ కట్ టు ప్రొటెక్ట్ యువర్ ప్రైడ్ మన అసలు గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మన ఫేక్ ఇమేజ్ ని కోల్పోయే ఆ బాధను మనం యక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే అది అవుతుంది.
(27:02) నీ లాజిక్స్ ఫెయిల్ అయ్యి నీ తప్పులు బయట పడినప్పుడు నీ ఈగో ఒక ఈజీ షార్ట్ కట్ తీసుకోమని గట్టిగా చెప్తుంది. రివర్స్ అటాక్ ఇవ్వమనో ఎదుటి వాళ్ళను బ్లేమ్ చేయమనో లేదా సిస్టం ని మేనేజ్ చేయమనో సజెస్ట్ చేస్తుంది. నువ్వు ఆ టెంప్టేషన్ ని చూసి గట్టిగా నో చెప్పాలి. నువ్వు ఒక రాంగ్ డిెసిషన్ తీసుకున్నావని యక్సెప్ట్ చెయ్ నువ్వు తప్పు చేశవని ఒప్పుకో నిలబడి నేను తప్పు చేశాను దీన్ని నేనే కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పడానికి చాలా ఓపిక వినయం కావాలి.
(27:28) కానీ ఆ ప్యూర్ ఆనెస్ట్ మూమెంట్ లోనే నీ మైండ్ కు ఉన్న కన్ఫ్యూజన్ ఎగిరిపోతుంది. అండ్ నువ్వు పెట్టే రియల్ ఎఫర్ట్ అక్కడే మొదలవుతుంది. శ్రీకృష్ణుడు ఆ కురుసభ నుండి బయటకు నడిచి వచ్చినప్పుడు ఆయన వదిలిపెట్టింది కేవలం ఒక ఫెయిల్ అయిన సంధి సమావేశం మాత్రమే కాదు తన వినాశనాన్ని తానే రాసుకున్న ఒక రాజ్య నిర్ణయాన్ని విడిచిపెట్టాడు.
(27:46) దుర్యోధనుడు తన మైండ్ సెట్ లో కనీసం ఒక్క పాయింట్ కూడా మార్చుకోవడానికి ఒప్పుకోకపోవడం వల్ల తన ఇగోని తగ్గించుకోవడానికి బదులు శాంతిని ఏర్పరచడానికి వచ్చిన శ్రీకృష్ణుడినే బంధించాలనుకోవడం వల్ల సర్వనాశనానికి దారి తీసే యుద్ధం కన్ఫామ్ అయిపోయింది. తన ఇగోని కాపాడుకోవడానికి క్రియేట్ చేసుకున్న ఆ సాకుల కోటే చివరికి తన కుటుంబం మొత్తం అంతమైపోవడానికి కారణమైంది.
(28:09) ఉద్యోగ పర్వం మనకు నేర్పించే మెయిన్ లెసన్ ఏంటంటే బయటికి కనిపించే పరిస్థితులు మనల్ని ఎప్పుడూ పాడు చేయవు. రియాలిటీ మనకు నువ్వు వెళ్తున్న రూట్ తప్పు అని చెప్తున్న కూడా మనల్ని మనం మార్చుకోవడానికి డినై చేసే మన మొండితనమే మన లైఫ్ ని పూర్తిగా నాశనం చేస్తుంది. నీ మనసులో నువ్వు చెప్పుకునే కథలు, సాకులు ఈ రాత్రికి నువ్వు ప్రశాంతంగా నిద్రపోవడానికి హెల్ప్ అవ్వచ్చు.
(28:32) కానీ రేపు నువ్వు ఎదుర్కోబోయే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ నుంచి నిన్ను నువ్వు అస్సలు కాపాడుకోలేవు. నువ్వు నిజంతో బిజినెస్ చేయలేవు. దాన్ని ఒక చీకటి గదిలో దాచలేవు. సో ఈ డీప్ అనాలసిస్ ని ఒక డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్ తో పూర్తి చేద్దాం. ప్రెసెంట్ నీ లైఫ్ లో ఒక పెద్ద ప్రాబ్లం తో ఆగిపోయిన ఆ ఒక్క మేజర్ ఏరియా గురించి ఆలోచించు.
(28:53) అది నీ కెరియర్ గ్రోత్ అవ్వచ్చు. బ్రేక్ అవుతున్న రిలేషన్షిప్ కావచ్చు లేదా ఒక బ్యాడ్ మనీ హ్యాబిట్ కూడా అయి ఉండొచ్చు. దానికి సంబంధించిన నింద నీ మీద పడకుండా ఉండటానికి నీకు నువ్వు చెప్పుకుంటున్న ఆ కంఫర్టబుల్ ఫేక్ స్టోరీ ఏంటి? అలాగే నువ్వు ఏ చేదు నిజం నుంచి అయితే అంతలా పారిపోవాలని చూస్తున్నావో దానికి సంబంధించిన రియాలిటీ ఏంటి నీ నిజాయితీ గల ఆలోచనల్ని నీ ఎక్స్పీరియన్సెస్ ని ఒక్కసారి గుర్తు చేసుకో నీ తప్పుని నీకు నువ్వు ఒప్పుకోవడమే ఆ ఇల్యూజన్ ని పగలగొట్టి మళ్ళీ రియాలిటీలోకి అడుగు పెట్టడానికి నువ్వు వేసే ఫస్ట్ స్టెప్ అవుతుంది.
(29:24) మరి ఆ మొదటి అడుగు నువ్వు వేయడానికి సిద్ధంగా ఉన్నావా కామెంట్స్ లో చెప్పు నేను అందరి కామెంట్స్ చదువుతాను అండ్ అలాగే మీకు ఏ టాపిక్స్ మీద ఇలాంటి ఆడియో పాడ్కాస్ట్ కావాలో చెప్పండి. ఆఖరిగా ఈ ఆడియో పాడ్కాస్ట్ అనే కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్తే వీటిని ఎంత ఫ్రీక్వెంట్ గా అప్లోడ్ చేయాలో నాకు ఒక ఐడియా ఉంటుంది.
(29:46) సో నేను మీ లైఫో రామా తిరిగి కలుస్తూనే ఉందాం.
No comments:
Post a Comment