Sweet dangers for diabetes | Functions & Festivals | Dr Aswani patchala | Diabetologist
Author Name:Green hospital Guntur
Youtube Channel Url:https://www.youtube.com/@greenhospitalguntur3217
Youtube Video URL:https://www.youtube.com/watch?v=q7gQBiYKNC0
Transcript:
(00:00) షుగర్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని డేంజర్ జోన్స్ గా మనకు అనిపిస్తా ఉంటాయండి అవేంటి మనల్ని పిలిసే ఫంక్షన్స్ కానీ లేకపోతే మనక వచ్చే పండుగలు కానీ ఇలాంటి టైంలో చాలా మంది ఏంటి కంగారుపడిపోతా ఉంటారు అనవసరంగా నా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఇప్పుడు ఇప్పుడు నేను అటెండ్ చేయాలి తినకుండా ఉండలేను అని కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫంక్షన్స్ అయినా ఫెస్టివల్స్ అయినా మనందరం సంతోషంగా ఆనందంగా ఉండటానికే తప్ప మన స్ట్రెస్ లెవెల్స్ పెంచడానికి ఏమాత్రం కాదు చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసి షుగర్ కంట్రోల్ పెట్టుకుంటూ వీటిని ఎంజాయ్ చేయొచ్చు అదిలా
(00:30) ఎలానో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా ఏ ఫంక్షన్ కైనా అటెండ్ అయ్యేటప్పుడు మన రొటీన్ అనేది మనం ఫాలో చేయాలి అంటే ఏది కూడా స్కిప్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ కానీ మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ చక్కగా తీసుకొని ఫంక్షన్ కి అటెండ్ అవ్వడానికి చూడండి. వెళ్ళిన వెంటనే మిమ్మల్ని వెల్కమ్ చేసేది ఆ షుగరీ డ్రింక్ మాక్సిమం దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి లేదా ఒక చిన్న సిప్ తీసుకొని దాన్ని పక్కన పెట్టేడానికి చూడండి.
(00:52) ఎందుకంటే వేస్టేజ్ గురించి కాదండి మన హెల్త్ అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. తర్వాత స్కౌట్ టెక్నిక్ ఫాలో చేయండి. అంటే ముందుగా బుఫేలో ఏమేమ ఉన్నాయో ఐటమ్స్ అన్ని ఒకసారి వెళ్లి చూసి రండి సో దట్ మనం మైండ్ ప్రిపేర్ చేసుకుంటాం మనం ఏం తినాలి ఏం తినకూడదు వేటి జోలు అస్సలు పోకూడదు అని కాబట్టి ప్లేట్ తీసుకొని చక్కగా ఇక్కడున్న కూరగాయ ముక్కలు కానివ్వండి లేకపోతే శెనగలు లాంటివి ముందుగా అవన్నీ పెట్టుకొని కర్రీస్ లో పన్నీర్ కానీ మష్రూమ్ కానీ లేకపోతే స్పెషల్ కూర ఏదో ఒకటి ఉంటుంది కదా అది కానీ లేదా ములక్కాయలు కానీ ఇట్లాంటివన్నీ కవర్ చేసుకొని ఆకుకూరలు
(01:24) తరువాత రైస్ జోలికి వెళ్ళండి నాన్ వెజ్ అయితే గనుక చక్కగా చికెన్ ఫిష్ వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేసి రైస్ క్వాంటిటీ బాగా తక్కువగా తీసుకోండి. సో రైస్ క్వాంటిటీ దగ్గరే మనకు ప్రాబ్లం వస్తది. ఇక్కడ పోర్షన్ కంట్రోల్ మైండ్లో పెట్టుకొని ఎంత తినాలో ముందే డిసైడ్ అయి పెట్టించుకోండి. ఆఖర్లో మీ సాంబార్లో ముక్కలు ఎక్కువగా వేసుకోండి అండ్ ఉలవ చారుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.
(01:46) ఇప్పుడు ఆ ప్లేట్ తీసుకొని స్వీట్ సెక్షన్ కి వచ్చి మీకు నచ్చిన స్వీట్ ని లిమిటెడ్ పోర్షన్ లో ఎంజాయ్ చేసి మిగిలింది పారేసేయండి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోకుండా మీ సోషల్ లైఫ్ ఇక్కడ మొదలు పెట్టండి. అందరి ఫ్రెండ్స్ ని కలవండి చక్కగా వాళ్ళతో చిన్న వాక్ చేసుకుంటా ముచ్చటించండి లేదా వాళ్ళకు వడ్డిచ్చి వాళ్ళు తినే వరకి కూడా నుంచొని వెయిట్ చేయండి సో దట్ మన కండరాలు అనేవి మన గ్లూకోస్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తాయి ఇన్సులిన్ అవసరం లేకుండా ఇలా చేసినట్లయితే మీ సోషల్ గ్యాదరింగ్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఎటువంటి షుగర్ లెవెల్స్
(02:17) పెరగకుండా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థాంక్యూ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment