The Real Problem Isn't Your Anger — It's This | Mahabharatam Audio Podcast EP02
Author Name:LifeOrama
Youtube Channel Url:https://www.youtube.com/@LifeOramaOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fcsk6NP04t8
Transcript:
(00:00) నీ సమస్య యాంగర్ మేనేజ్మెంట్ కాదు నీ సమస్య నువ్వు ఇచ్చే రియాక్షన్ ఎన్నో ఏళ్ల నమ్మకాన్ని కూడా ఒక్క సెకండ్లో పాతాళానికి తొక్కేయగలదు నీ ఆవేశం అది ఒక మెసేజ్ కావచ్చు నువ్వు మాట్లాడే టోన్ కావచ్చు లేదంటే ఒక చిన్న కామెంట్ కూడా కావచ్చు. అసలు ఏం జరుగుతుందని నీ మైండ్ అర్థం చేసుకునే లోపే నీ బాడీ రియాక్ట్ అయిపోతుంది.
(00:23) ఇక్కడ ఒక భయంకరమైన విషయం ఏంటంటే ఇదేదో అనుకోకుండా జరిగేది కాదు. దీని వెనక ఒక పాటర్న్ ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహాభారతంలో విదురుడు ఈ అలవాటు గురించి హెచ్చరించాడు. ఒక తెలివైనవాడు తనని తాను నాశనం చేసుకునేవాడు. వీళ్ళద్దరి మధ్య ఉండే తేడా ఆ ఒక్క మెంటల్ షిఫ్ట్ మాత్రమే అదేంటో క్లియర్ గా చెప్పాడు. అసలు మనం ఎందుకని ముందు రియాక్ట్ అయ్యి ఆ తర్వాత ఆలోచిస్తాం.
(00:47) ఆ ఒక్క క్షణం పాజ్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే లైఫ్ అసలు ఎలా మారుతుంది? లాస్ట్ టైం నువ్వు ఎప్పుడైనా బాగా ఓవర్ రియాక్ట్ అయిన ఆ ఒక్క క్షణాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో నువ్వేమి ప్లాన్ చేసుకొని అలా చేయలేదు కదా అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఎదుటి మనిషి మాట్లాడే టోన్ మారడం ఒక మెసేజ్ రావడం లేదా ఎవరైనా ఏదో ఒక చిన్న మాట అనడం అంతే ఆ కొన్ని సెకండ్స్ లోనే నీ బాడీ ఒక నిర్ణయానికి వచ్చేసింది.
(01:09) అదే పెద్ద ట్రాప్ మన లైఫ్ లో జరిగే ఎమోషనల్ డ్ామేజ్ అంతా ఏదో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ వల్ల జరగదు. చాలా వరకు చిన్న విషయాలకి మనం ఇచ్చే ఫాస్ట్ రియాక్షన్స్ వల్లే జరుగుతుంది. ఇక్కడ అసలు ప్రాబ్లం కోపం కాదు నీ స్పీడ్ నీ రెస్పాన్స్ గనుక ఒకత్ర సెకండ్స్ లోపే వచ్చేస్తే అక్కడ ఆలోచించడానికి అసలు టైం ఉండదు. ఎటువంటి ఫిల్టర్ కూడా ఉండదు.
(01:32) కేవలం నీ ఇంపల్స్ నిన్ను నడిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఇంపల్స్ నీకు ఒక అలవాటుగా మారుతుందో అది మెల్లగా నీ పర్సనాలిటీని మార్చేస్తుంది. నీ బ్రెయిన్ నీ సర్వైవల్ కోసం డిజైన్ చేయబడింది. 10 మందితో మంచిగా ఉండటం కోసం కాదు అందుకే అది ఎప్పుడూ చుట్టూర ఏదైనా ప్రమాదం ఉందా అని వెతుకుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళ కనుబొమ్మలు ముడవటం రిప్లై లేట్ అవ్వడం లేదా పిలిచే విధానంలో తేడా రావటం నీ సిస్టం వీటన్నిటిని ఒక రిస్క్ లాగా చూస్తుంది.
(02:00) నీ లాజిక్ అసలు ఏం జరుగుతుందో ఆలోచించే లోపే నీ బాడీ యక్టివేట్ అయిపోతుంది. హార్ట్ రేట్ పెరగడం, కండరాలు బిగుసుకుపోవడం, ఊపిరి వేగంగా మారటం ఇవన్నీ నీకు తెలియకుండానే జరిగిపోతాయి. అప్పుడు నీ మైండ్ రంగంలోకి దిగి ఆ రియాక్షన్ కరెక్ట్ అని నిన్ను నమ్మేస్తుంది. దాని చుట్టూరా ఒక కథ అల్లుతుంది. ఆ టైంలో ఆ రియాక్షన్ ఇవ్వడం చాలా అవసరంని నీకు అనిపిస్తుంది.
(02:23) అందుకే ఆ క్షణంలో నువ్వు చేసేది కరెక్ట్ అని ఫీల్ అవుతావు. కానీ ఎప్పుడైతే నీ బాడీ కామ్ అవుతుందో అప్పుడు నీకు అసలు విషయం అర్థమవుతుంది. కానీ అప్పటికే అవ్వాల్సిన డామేజ్ అంతా జరిగిపోవచ్చు. దీన్నే ఎమోషనల్ హైజాక్ అంటారు. అంటే నీ బ్రెయిన్ లో ఉన్న ఎమోషనల్ పార్ట్ నీ మీద కంట్రోల్ తీసుకున్నప్పుడు నీ థింకింగ్ మైండ్ ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోతుంది.
(02:44) ఈ మార్పుని నువ్వు గమనించే ఛాన్స్ ఉంది. నీ వాయిస్ గట్టిగా మారుతుంది. నీ మాటల్లో వేగం పెరుగుతుంది. నువ్వు వినడం ఆపేసి కేవలం నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తావ్. ఆ స్టేట్ లో ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలీదు. కేవలం ఆ మోమెంట్ లో నువ్వు గెలవాలని మాత్రమే చూస్తావు. అలా గెలవడం వల్ల నీకేదో తెలియని పవర్ వచ్చినట్టు అంతా నీ కంట్రోల్ లో ఉన్నట్టు అనిపిస్తుంది.
(03:06) కానీ ఆ కంట్రోల్ చాలా టెంపరరీ. ఎప్పుడైతే ఆ ఎమోషన్ తగ్గుతుందో అప్పుడు నువ్వు దాని వల్ల జరిగిన నష్టాన్ని చూస్తావు. ఒక రిలేషన్ దెబ్బ తినడం, నమ్మకం తగ్గిపోవడం లేదా నీ మీద ఉన్న గౌరవం కాస్త లేకుండా పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అయినా సరే ఈ సైకిల్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నీ బ్రెయిన్ ఆ క్షణంలో వచ్చే రిలీఫ్ ని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది కానీ దాని వల్ల వచ్చే లాంగ్ టర్మ్ లాస్ ని పట్టించుకోదు.
(03:31) అందరూ ఇగ్నోర్ చేసే విషయం ఏంటంటే ఎప్పుడూ నీ బాడీనే ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. నువ్వు నోరు విప్పకుండానే నీ నర్వస్ సిస్టం యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. గొడవ పడటానికో వాదించడానికో లేక అక్కడి నుంచి తప్పించుకోవడానికో నిన్ను సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత నీ మైండ్ దాన్ని కవర్ చేస్తూ నువ్వు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావని నిన్ను ఒక ఇల్యూజన్ లోకి తీసుకువెళ్తుంది.
(03:55) ఈ ఇల్యూజన్ వల్లే మనం మారడం కష్టమవుతుంది. అంతా నేనే ఆలోచించి చేస్తున్నాను అని నువ్వు అనుకుంటావు. కానీ నిజానికి నువ్వు కేవలం రియాక్ట్ అవుతున్నావ్. నీ బాడీకి ట్రైనింగ్ ఇవ్వకపోతే అది ఇలాగే ఆటోమేటిక్ గా రెస్పాండ్ అవుతూనే ఉంటుంది. నీ బాడీని స్లో చేయడం నేర్చుకోలేకపోతే నీ మైండ్ ఎప్పటికీ లీడ్ తీసుకునే ఛాన్స్ రాదు. దీనికి తోడు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అంతా స్పీడ్ కే ఇంపార్టెన్స్ ఇస్తుంది.
(04:19) వెంట వెంటనే రిప్లైస్ ఇవ్వడం ఏదో ఒక ఒపీనియన్ చెప్పేయడం ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వడం ఇవే ఇప్పుడు అందరూ చేస్తున్నారు. సోషల్ మీడియా కూడా నిన్ను అలాగే ట్రైన్ చేస్తుంది. ఆలోచించేలోపే రియాక్ట్ అవ్వమని చెప్తుంది. ఎవరైతే వేగంగా రియాక్ట్ అవుతారో వాళ్ళకే అటెన్షన్ మొత్తం దొరుకుతుంది. మెల్లగా నీ నర్వస్ సిస్టం కూడా అదే నిజమని నమ్మేస్తుంది.
(04:41) ఒక్క నిమిషం ఆగడం అంటే అది ఒక వీక్నెస్ అని ఫీల్ అవుతుంది. ఆ వేగాన్ని డిజిటల్ స్పేస్ లోనే కాదు నీ రియల్ లైఫ్ లోకి కూడా తెచ్చేస్తున్నావ్. ప్రతి చోట తొందరగా సమాధానం చెప్పడం, ఫాస్ట్ గా డిఫెండ్ చేసుకోవడం ఇవన్నీ మొదలు పెడుతున్నావ్. మెల్లగా ఆ రియాక్ట్ అవ్వడమే నీ డీఫాల్ట్ సెట్టింగ్ అయిపోతుంది. ఒక విషయం జరిగినప్పుడు దానికి రియాక్ట్ అవుతున్నప్పుడు వీటి మధ్యలో ఉండాల్సిన ఆ గ్యాప్ మెల్లగా మాయమైపోతుంది.
(05:05) చాలా వరకు ఈ ఓవర్ రియాక్షన్ వెనుక అసలు కారణం ఇగో సెన్సిటివిటీ. ఇక్కడ ఇగో అంటే మన గురించి మనం క్రియేట్ చేసుకున్న ఒక సెల్ఫ్ ఇమేజ్ అందరూ నన్ను గౌరవించాలి అంతా నా కంట్రోల్ లో ఉండాలి అని అనుకునే ఆ తపన ఆ ఇమేజ్ కి ఏ చిన్న దెబ్బ తగిలిన రియాక్షన్ చాలా త్వరగా బయటక వస్తుంది. ఎవరైనా నిన్ను మధ్యలో ఆపినా నీ తప్పు సరిదిద్దినా లేక తప్పుడు టైంలో నవ్వినా అది నీలో దాగున్న ఒక నరాన్ని మీటుతుంది.
(05:32) అప్పుడు నీ మైండ్ ఇదొక చిన్న విషయం అని చెప్పదు నన్ను తక్కువ చేస్తున్నారు అని ఫీల్ అవుతుంది. అందుకే మళ్ళీ నీ వాల్యూని పెంచుకోవడం కోసం ఇంకాస్త గట్టిగా అరవడం, ఇంకాస్త కోపం చూపించడం లేదా సడన్ గా మాట్లాడటం ఆపేయడం ఇలాంటివన్నీ చేస్తావు. నీ రియాక్షన్ ఆ మూమెంట్ గురించి కాదు నీ ఐడెంటిటీని కాపాడుకోవడం కోసం నువ్వు చేసే ప్రయత్నం. ఇదొక విచిత్రమైన విషయం.
(05:54) మనకి బాగా ఇష్టమైన వాళ్లే మనల్ని చాలా ఈజీగా ట్రిగర్ చేయగలరు. ఎందుకంటే క్లోజ్నెస్ ఉన్న చోటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి మనకు ప్రయారిటీ ఇవ్వాలి అని కోరుకుంటాం. అందుకే మనకు దగ్గరైన వాళ్ళు కాస్త పట్టించుకోకపోయినా అది కేవలం ఒక చిన్న ఇబ్బందిలా అనిపించదు. ఒక బిట్రయల్లా చూస్తాం.
(06:14) నీ బ్రెయిన్ దాన్ని పర్సనల్ గా తీసుకుంటుంది. పైగా వాళ్ళు వదిలి వెళ్ళరు అన్న నమ్మకం ఉండటం వల్ల మనలోని అసలు రూపాన్ని వాళ్ళ దగ్గర చాలా ఈజీగా బయట పెట్టేస్తాం. ఆ సేఫ్టీ మెల్లగా మన అశ్రద్ధగా మారుతుంది. అందుకే వాళ్ళ మీద ఇంకాస్త గట్టిగా రియాక్ట్ అవుతావ్. చివరిగా రిగ్రెట్ అవుతావ్. ఇక్కడ అసలు మేటర్ ఏంటంటే క్లోజ్నెస్ ఏ చిన్న విషయాన్నైనా సరే చాలా పెద్దదిగా చేసి చూపిస్తుంది.
(06:38) ఆవేశం తగ్గిపోయిన తర్వాత మెల్లగా సిగ్గుపడతావు అంటే షేమ్ నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు జరిగిన సీన్ అంతా గుర్తు తెచ్చుకుంటూ నేను అలా ఎందుకు మాట్లాడాను అని లోపలే కుమిలిపోతావు. గిల్ట్ కి షేమ్ కి చాలా తేడా ఉంది. గిల్ట్ అంటే నేను చేసిన పని తప్పని అనుకోవడం కానీ షేమ్ అంటే నాలోనే ఏదో లోపం ఉంది అని ఫీల్ అవ్వడం.
(06:59) ఈ షేమ్ చాలా భయంకరం ఎందుకంటే అది నిన్ను ఇంప్రూవ్ చేయదు నిన్ను ఒక బెటర్ పర్సన్ కానివ్వదు నిన్ను దాక్కునేలా చేస్తుంది. ఆ మనిషిని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడతావ్. ఆ టాపిక్ ఎత్తడానికి భయపడతావ్ లేదా ఏమి జరగనట్టు నటిస్తావ్. లోపల ఉన్న ఈ ప్రెజర్ నిన్ను ఇంకాస్త ఇరిటేషన్ కి గురి చేస్తుంది. దానివల్ల నెక్స్ట్ టైం నువ్వు ఇంకా గట్టిగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది.
(07:19) చాలా మంది ఇక్కడే ఇరుక్కుపోతారు. రియాక్ట్, రిగ్రెట్, అపాలజైస్ అండ్ రిపీట్ అంటే రియాక్ట్ అవ్వడం, బాధపడటం, సారీ చెప్పడం మళ్ళీ అదే చేయడం. ఇక్కడ అపాలజీ అనేది కేవలం ఒక రీసెట్ బటన్ లా మారిపోయింది. సారీ చెప్పగానే నీ మనసు తేలిక పడుతుంది. ఎదుటి వాళ్ళు కూల్ అవుతారు. లైఫ్ మళ్ళీ మామూలుగా సాగిపోతుంది. కానీ ఆ రియాక్ట్ అయ్యే అలవాటు మాత్రం మారదు.
(07:43) టైం గడిచే కొద్దీ ఆ సారీకు ఉన్న పవర్ తగ్గిపోతుంది. లేదా పూర్తిగా ఎగిరిపోతుంది. నువ్వు సారీ చెప్తుంటే అవతలి వాళ్ళకు అదిఒక రొటీన్ లా అనిపిస్తుంది తప్ప నువ్వు మారావన్న నమ్మకం కలగదు. ఇంకా దారుణం ఏంటంటే సారీ చెప్పే ఛాన్స్ ఉంది కదా అని నువ్వు రియాక్ట్ అవ్వడానికి పర్మిషన్ తీసుకున్నట్టు ఫీల్ అవుతావు.
(08:03) ఇది ఎలా అంటే నా దగ్గర మెకానిక్ ఉన్నాడు కదా అని కాన్ఫిడెంట్ గా కార్ ని యాక్సిడెంట్ చేయడం లాంటి పని నిజమైన మార్పు అంటే సారీ చెప్పే స్పీడ్ పెంచుకోవడం కాదు అసలు ఆ యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకోవడం. మనమందరం ఏమనుకుంటాం అంటే కంట్రోల్ అనేది మనం తీసుకునే ఒక డెసిషన్. నెక్స్ట్ టైం నేను కామ్ గా ఉంటాను అని మనకు మనం ప్రామిస్ చేసుకుంటాం. కానీ ఆ మోమెంట్ లో నీ బాడీ నీ ప్లాన్ ఏంటని అడగదు.
(08:28) అది కేవలం నీ కండిషనింగ్ ని ఫాలో అవుతుంది. నీ నర్వస్ సిస్టం కి రియాక్ట్ అవ్వడమే అలవాటయితే నువ్వు నీరసంగా ఉన్నప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు లేదా స్ట్రెస్ లో ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా రియాక్ట్ అయిపోతుంది. అందుకే ఆ ప్రామిసెస్ ఫెయిల్ అవుతాయి. ఇదేమి నీ బలహీనత వల్ల అవ్వట్లేదు. నువ్వు ఒక రిఫ్లెక్స్ తో యుద్ధం చేస్తున్నావు కాబట్టే జరుగుతుంది.
(08:48) ఈ రిఫ్లెక్సెస్ అనేవి నీ లెక్చర్స్ వినవు. అవి కేవలం నీకున్న ట్రైనింగ్ కి మాత్రమే లొంగుతాయి. దీనికి సొల్యూషన్ అంటే నీతో నువ్వు మాట్లాడుకోవడం కాదు నువ్వు ఎంత ట్రిగర్ అయినా సరే నీ అంతట నువ్వు ఆగేలా ఒక బలమైన పాజ్ ని క్రియేట్ చేసుకోవడం చాలామంది ఒప్పుకోరు కానీ ఒక రియాక్షన్ అనేది మనకు వెంటనే ఒక రిలీఫ్ ని ఇస్తుంది. నువ్వు ఎవరి మీదైనా అరిచినప్పుడు నీలో ఉన్న ప్రెజర్ రిలీజ్ అవుతుంది.
(09:12) కోపంగా ఉన్నప్పుడు పంపించే ఒక టెక్స్ట్ నీ మనసును తేలిక పరుస్తుంది. ఎదుటివాడిని ఒక మాటతో కట్ చేసినప్పుడు పోగొట్టుకున్న పవర్ మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది. నీ నెర్వస్ సిస్టం కి ఆ రిలీజ్ అంటే చాలా ఇష్టం. అది మెల్లగా ఇది వర్కవుట్ అవుతుంది అనే విషయాన్ని నేర్చుకుంటుంది. దానివల్ల తర్వాత ఎన్ని నష్టాలు వచ్చినా సరే ఆ మోమెంట్ కి మాత్రం అది నీకు హెల్ప్ చేసినట్టే లెక్క.
(09:33) అందుకే ఈ ఓవర్ రియాక్షన్ అనేది ఒక అడిక్షన్ లా మారిపోతుంది. అది కూడా చాలా సైలెంట్ గా అయిపోతుంది. నీలో కొంచెం టెన్షన్ పెరిగినా సరే నీ బాడీ ఆ క్విక్ రిలీఫ్ కోసం ఎదురుచూస్తుంది. ఒక్కసారి నీ బాడీకి ఆ రిలీఫ్ అలవాటయితే అది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ గురించి అస్సలు పట్టించుకోదు. కోపం అనేది ఒక శక్తిలా ఒక వెపన్ లా అనిపిస్తుంది.
(09:57) ఎందుకంటే అది మన లోపల ఉన్న సాఫ్ట్ ఎమోషన్స్ ని కవర్ చేస్తుంది. సాధారణంగా కోపం వెనుక ఏదో ఒక బాధ, అవమానం, భయం లేదా మనల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఎమోషన్స్ వల్ల మనం చాలా వీక్ గా అనిపిస్తాం. కానీ కోపం వచ్చినప్పుడు అదిఒక కవచంలా పనిచేస్తుంది. సో ఈ కోపం ఏం చేస్తుందంటే నీ వాయిస్ ని పెంచుతుంది.
(10:18) నీ పోస్చర్ ని స్ట్రెయిట్ గా ఉంచుతుంది. నువ్వు తక్కువైపోతున్నావ్ అనిపించిన చోట నీకు ఒక కంట్రోల్ ఇస్తుంది. అందుకే కోపం అంత ఫాస్ట్ గా వస్తుంది. అది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు అదిఒక షీల్డ్. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే ఆ షీల్డ్ ఎదుటి వాళ్ళతో ఉన్న కనెక్షన్స్ ని కూడా బ్లాక్ చేస్తుంది. నీ రెస్పెక్ట్ ని కాపాడే అదే కోపం నీ క్లోజనెస్ అండ్ అవతలి వాళ్ళ అండర్స్టాండింగ్ ని కూడా దూరం చేస్తుంది.
(10:43) ఆ ఒక్క నిమిషం నువ్వు పవర్ఫుల్ గా అనిపించొచ్చు. కానీ ఆ తర్వాత చాలాసేపు ఒంటరిగా మిగిలిపోతావ్. కాస్త ఆలోచిస్తే ఇది ఒప్పుకోవాలనిపిస్తుంది కదా ఒక ఓవర్ రియాక్షన్ వల్ల జరిగే అతి పెద్ద నష్టం ఆ గొడవ కాదు. దాని తర్వాత ఏం జరుగుతుంది అన్నదే ముఖ్యం. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండటం మొదలు పెడతారు. ఏ మాట అంటే ఏమవుతుందో అని భయపడతారు.
(11:06) నీ దగ్గర విషయాలు దాచడం నిజం చెప్పడం తగ్గించేయడం ఇలాంటివన్నీ చేస్తారు. వాళ్ళు ఏదో కావాలని చేయరు. కేవలం వాళ్ళకి ప్రశాంతత కావాలి కాబట్టి అలా చేస్తుంటారు. ఎప్పుడైతే మనుషులు నీతో నిజాయితీగా ఉండటం ఆపేస్తారో అప్పుడే నీ రిలేషన్స్ లో పట్టు తగ్గిపోతుంది. వర్క్ ప్లేస్ లో నీకు వచ్చే ఆపర్చునిటీస్ తగ్గుతాయి. ఫ్యామిలీలో నీకు తెలియకుండానే దూరం పెరిగిపోతుంది.
(11:28) ఫ్రెండ్షిప్స్ లో ఒక రకమైన సైలెన్స్ వస్తుంది. టైం గడిచే కొద్దీ మనుషులు ఎందుకు దూరం అవుతున్నారో నీకు ఏమాత్రం అర్థం కాదు. కానీ దానికి కారణం చాలా సింపుల్ నీ రియాక్షన్స్ వాళ్ళను దూరంగా ఉండమని ట్రైన్ చేశయి. నీ రెపుటేషన్ అనేది ఒక పెద్ద ఇన్సిడెంట్ తో ఒక్కసారిగా కూలిపోదు. అది ఎదుటి వాళ్ళ మైండ్ లో చిన్న చిన్న మార్పుల ద్వారా మారుతూ ఉంటుంది.
(11:49) నువ్వు కంట్రోల్ తప్పినప్పుడు ఒకరు చూస్తారు. నువ్వు టఫ్ గా మాట్లాడినప్పుడు ఒకరు వింటారు. నువ్వు ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎక్స్ప్లోడ్ అవ్వడం ఇంకొకరు గమనిస్తారు. వాళ్ళు నీతో గొడవ పడకపోవచ్చు. కానీ అవన్నీ వాళ్ళ మైండ్ లో స్టోర్ చేసుకుంటారు. ఆ తర్వాత నిన్ను ఎంత నమ్మాలి నీతో ఎంతవరకు ఉండాలి అని వాళ్ళు డిసైడ్ అవుతారు.
(12:08) అందుకే ఎమోషనల్ కంట్రోల్ అనేది కేవలం నీ పర్సనల్ స్కిల్ మాత్రమే కాదు అది సొసైటీలో నీకు ఉండే రెపుటేషన్ కి పనికొచ్చే కాన్సెప్ట్ ప్రశాంతంగా ఉండే వాళ్ళ దగ్గర మనుషులు సేఫ్ గా ఫీల్ అవుతారు. వాళ్ళకే గౌరవం ఇన్ఫర్మేషన్ అన్నీ దొరుకుతాయి. నీకు తెలియకుండానే నీ రియాక్టివ్ నేచర్ నీ ముందున్న డోర్స్ అన్నిటిని క్లోజ్ చేస్తుంది.
(12:30) ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ పాటర్న్ ఏమాత్రం కొత్త కాదు. మనకి ట్రిగర్స్ ఎక్కువ ఉండటం వల్ల ఇది మోడర్న్ గా అనిపించొచ్చు కానీ మన హ్యూమన్ మెకానిజం చాలా పాతది. మహాభారతంలో విదురుడు ఈ బలహీనత గురించి ధృతరాష్ట్రుడికి చాలా క్లియర్ గా చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఎప్పుడూ తనను తాను తన ఎమోషన్స్ లో కోల్పోయేవాడు. అలాంటి సిచువేషన్స్ లో విదురుడు ఏదో మోటివేషనల్ కోట్స్ చెప్పలేదు.
(12:54) ఆయన ఒక సర్వైవల్ అడ్వైస్ ఇచ్చాడు. ఆవేశం అండ్ ఇంపల్స్ అనేవి మొదట నీ జడ్జ్మెంట్ ని ఆ తర్వాత నీ రిలేషన్స్ ని ఆ పైన నీ రిజల్ట్స్ ని ఎలా నాశనం చేస్తాయో వివరించాడు. ఆయన చాలాసార్లు డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా చెప్పిన ఒకే ఒక్క స్కిల్ ఏదైనా చేసే ముందు ఆ ఒక్క క్షణం పాజ్ ఇవ్వడం. ఇక్కడి నుంచి మనం విధుర నీతిలోకి వెళ్లి నువ్వు నిజంగా వాడుకోగలిగే ఒక ప్రాక్టికల్ మెథడ్ ని తెలుసుకుందాం.
(13:20) ఏదైనా జరిగిన వెంటనే రియాక్ట్ అవ్వడం చాలా కామన్. దీని గురించి విదురుడు కొన్ని వేల ఏళ్ల క్రితమే ఆవేశంతో ఊగిపోయే మనిషికి విచక్షణతో ఆలోచించే మనిషికి మధ్య ఉండే తేడాని ఇలా వివరించాడు. దాన్నే వివేకం అంటారు. అంటే ఏది ఇప్పుడు అర్జెంట్ గా అనిపిస్తుందో ఏది నిజంగా కరెక్టో ఈ రెండిటి మధ్య తేడాని గమనించే తెలివి తేటలు. వివేకం అంటే నెమ్మదిగా ఆలోచించడం కాదు క్లారిటీతో ఆలోచించడం.
(13:44) ఇది నీ ఎమోషన్స్ కి నీ యక్షన్స్ కి మధ్య ఒక గ్యాప్ ని క్రియేట్ చేస్తుంది. ఆ గ్యాప్ లేకపోతే నువ్వు ఆవేశంలో కొట్టుకుపోతావు. అదే ఆ గ్యాప్ ఉంటే నువ్వు ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో నువ్వే డిసైడ్ చేసుకుంటావు. నీ లైఫ్ లో జరిగే చేంజ్ అంతా ఆ చిన్న గ్యాప్ లోనే ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది అసలు గ్యాప్ లేకుండానే బతికేస్తున్నారు.
(14:06) మెసేజ్ రావడం, రిప్లై ఇవ్వడం, కామెంట్ చూడటం, రియాక్ట్ అయిపోవడం అవతల వాళ్ళ వాయిస్ మారడం వెంటనే డిఫెండ్ చేసుకోవడం. ఎండిపోయిన గడ్డికి నిప్పంటుకున్నంత ఫాస్ట్ గా ట్రైనింగ్ లేని మైండ్ రియాక్ట్ అయిపోతుందని విధురుడు హెచ్చరించాడు. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే మన ఫైవ్ సెన్సెస్ మన చేత అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయిస్తాయి.
(14:27) మన మైండ్ వెంటనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి పరిగెడుతుంది. వివేకం ఆ పరుగుని ఆపుతుంది. ఆ ఎనర్జీని ఒక్క క్షణం హోల్డ్ చేస్తుంది. హోల్డ్ చేయడం అంటే అణచి పెట్టడం కాదు అసలు ఏం జరుగుతుందో గమనించడం. ఆ కొన్ని క్షణాలు నువ్వు పాజ్ ఇవ్వడం నేర్చుకోగలిగితే నీ ప్రతి పని ఆవేశం నుండి కాకుండా క్లారిటీ నుంచి వస్తుంది. విధుర నీతిలో కోపం గురించి ఒక మాట ఉంది.
(14:50) కోపం అనేది మొదట నీ జడ్జ్మెంట్ ని నాశనం చేస్తుంది. ఇది మనమందరం గమనించే విషయమే. మనం కోపంగా ఉన్నప్పుడు మనం ఆలోచించే లిమిట్స్ చాలా తగ్గుతాయి. ఎదుటి వ్యక్తి అన్న మాట మీద తప్ప వేరే దేని మీద దృష్టి ఉండదు. కోపం నీ పుణ్యాన్ని దహించేస్తుందని విధురుడు అంటాడు. ఇక్కడ పుణ్యం అంటే రోజు పెద్దల దగ్గర వినే స్పిరిచువల్ కాన్సెప్ట్ అనుకుంటారేమో అలా కాదు పుణ్యం అంటే నువ్వు ఎంతో కష్టపడి బిల్డ్ చేసుకున్న మంచి రిజల్ట్ దాన్ని ఈ కోపం నాశనం చేస్తుంది.
(15:17) సింపుల్ గా చెప్పాలంటే ఒక్క సెకండ్ లో ఆవేశంతో తీసుకున్న నిర్ణయం నీ ఏళ్ల కష్టాన్ని బూడిద చేయగలదు. అందుకే ఋషులు మహర్షులు బయట శత్రువుల కంటే తమ కోపానికే ఎక్కువ భయపడతారు. అసలైన డేంజర్ అంటే నీ ముందున్న మనిషి కాదు ఆ క్షణంలో నీ విచక్షణ కోల్పోవడమే అసలైన డేంజర్. విదురుడు కంట్రోల్ లేని మైండ్ ని అడవి గుర్రంతో పోల్చాడు.
(15:42) మన మాటల్లో చెప్పాలంటే నీ మైండ్ ఒక స్ట్రాంగ్ అనిమల్ లాంటిది చాలా పవర్ఫుల్ గా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. దానికి గనుక సరైన డైరెక్షన్ లేకపోతే అది నిన్ను ఎక్కడెక్కడికో లాకెళ్లి గొడవల్లో పడేస్తుంది. మన తెలివితేటలు అనేవి ఆ గుర్రానికి కళ్ళెంలా ఉండాలి. ఆ కళ్ళెమే ఈ వివేకం. అది నీ ఎమోషన్స్ ని చంపేయదు. కానీ వాటిని ఏ దారిలో తీసుకువెళ్ళాలో చూపిస్తుంది.
(16:06) ఆ కళ్ళెం వదిలేస్తే నీ మైండ్ కేవలం అవమానం, గర్వం అప్పటికప్పుడు వచ్చే ఇన్స్టంట్ సాటిస్ఫాక్షన్ వీటన్నిటి వెనుక పడుతుంది. అదే కళ్ళెం గట్టిగా ఉంటే ఆ ఎనర్జీ నీకుొక గొప్ప శక్తిగా మారుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనసనే గుర్రాన్ని నువ్వు నడుపుతున్నావా లేక ఆ గుర్రం నిన్ను లాకెళ్తుందా? మాటల విషయంలో విదురుడు చాలా గట్టిగా హెచ్చరించాడు.
(16:28) మోడర్న్ లైఫ్ లో మాటకి అసలు విలువే లేకుండా పోతుంది. మెసేజెస్, కామెంట్స్, క్విక్ రిప్లైస్ ఆలోచన కంటే ముందే మాట బయటక వచ్చేస్తుంది. కంట్రోల్ లేని మాటలు కంట్రోల్ లేని మైండ్ ని చూపిస్తాయని విధురుడు చెప్పాడు. ఒకసారి మాట నీ నోటి నుండి బయటక వస్తే అది మళ్ళీ తిరిగి రాదు. అది అవతల వాళ్ళ మెమరీలో ఉండిపోతుంది. మనం మాట్లాడకముందే వివేకం ఎంట్రీ ఇవ్వాలి.
(16:53) నీ మాట వల్ల ఉపయోగం ఉందా లేక డ్ామేజ్ జరుగుతుందా అని నిన్ను నువ్వు అడగాలి. ఈ చిన్న చెక్ నీ లైఫ్ లో చాలా గొడవలను ఆపేస్తుంది. ఎన్నో గొడవలు ఒక చెడు ఉద్దేశంతో మొదలవ్వవు. కేవలం ఫిల్టర్ లేని మాటల వల్లే మొదలవుతాయి. మాట్లాడే ముందు కొన్ని క్షణాలు ఆగడం నేర్చుకోవడమే నీ మెచూరిటీకి అసలైన గుర్తు. మనం జనరల్ గా అబ్సర్వ్ చేస్తే రూమ్లో అందరికంటే ప్రశాంతంగా ఉన్న మనిషి చేతిలోనే ఆ రూమ్ కంట్రోల్ అంతా ఉంటుంది.
(17:18) విధురుడు చెప్పిన పాయింట్ చాలా సింపుల్ నువ్వు ఎప్పుడైతే విరుచుకు పడే ఛాన్స్ ఉంటుందో సరిగ్గా అదే క్షణంలో నిన్ను నువ్వు ఆపుకోవడమే అసలైన విస్డం ఆయన దృష్టిలో నిగ్రహం రిస్ట్రియంట్ అంటే ఏదో మర్యాద కోసం చేసేది కాదు అదిఒక శక్తి పవర్ వివేకం ఏం చేస్తుందంటే ఒక చిన్న డిలే ని క్రియేట్ చేస్తుంది. ఆ గ్యాప్ లో నువ్వు నీ ఎమోషన్ గా మారిపోకుండా ఆ ఎమోషన్ ని ఒక సాక్షిలా గమనిస్తుంది.
(17:44) నీ కోపం ఏం చేయాలని చూస్తుందో నీకు అర్థమవుతుంది. అది నీ ఈగోని ప్రొటెక్ట్ చేయాలని చూస్తుందా? ఎవరినైనా పనిష్ చేయాలనుకుంటుందా? లేక నీ డిస్కంఫర్ట్ నుండి తప్పించుకోవాలని చూస్తుందా? ఒక తెలివైన వ్యక్తి తన ఎమోషన్ ఇచ్చే మొదటి ఆర్డర్స్ ని ఎప్పుడూ ఫాలో కాడు. ఒక బెటర్ డెసిషన్ తీసుకునే వరకు వెయిట్ చేస్తారు. ఇక్కడ చిన్న ఇన్సల్ట్ కే మనం చాలా పెద్దగా రియాక్ట్ అవుతుంటాం.
(18:07) విధురుడు ఏమంటాడంటే నీ ఇగో నిన్ను ఇతరులకు బానిసగా చేస్తుంది. ఎవరైనా ఒక చిన్న మాట అని నిన్ను కంట్రోల్ తప్పేలా చేయగలుగుతున్నారంటే నీ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే మన ఇగో దెబ్బ తిన్నప్పుడు మనకి కళ్ళు మూసుకుపోతాయి. అసలు పరిస్థితి ఏంటో మనం చూడలేం. దీనికి వివేకమే మందు అది జరిగిన విషయాన్ని దానికి నువ్వు ఇస్తున్న మీనింగ్ ని విడదీసి చూపిస్తుంది.
(18:32) జరిగిన విషయం కేవలం కొన్ని మాటలు లేదా ఒక ప్రవర్తన మాత్రమే కానీ దానికి నన్ను తక్కువ చేశారు అనే మీనింగ్ ఇచ్చేది నీ మైండ్. ఎప్పుడైతే నువ్వు ఈ మీనింగ్స్ ని తగ్గిస్తావో నీ రియాక్షన్స్ కి అందాల్సిన ఫ్యూయల్ ఆగిపోతుంది. ప్రతి చిన్న విషయాన్ని నీ మీద పర్సనల్ అటాక్ గా తీసుకోవడం ఆపిన రోజే నీకు అసలైన ఫ్రీడమ దొరుకుతుంది. చాలా మందికి సైలెంట్ గా ఉండటం అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది.
(18:55) ముఖ్యంగా గొడవలు జరుగుతున్నప్పుడు. కానీ విదురుడు మౌనానికి చాలా వాల్యూ ఇచ్చాడు. ఎందుకంటే అది ఫ్యూచర్ లో నువ్వు రిగ్రెట్ అవ్వకుండా కాపాడుతుంది. విదుర నీతిలో సైలెన్స్ అంటే బలహీనత కాదు. అది నీ ఫ్యూచర్ చుట్టూరా నువ్వు గీసుకున్న ఒక ప్రొటెక్టివ్ బౌండరీ వివేకం వాడే మొదటి ఆయుధం ఇదే నీ ఎమోషన్ వెంటనే ఏదో ఒకటి మాట్లాడాలి అని ఫోర్స్ చేసినప్పుడు ఆ ఎనర్జీని నీ లోపలే హోల్డ్ చేసి క్లారిటీ వచ్చే వరకు ఆపుతుంది.
(19:24) పైగా ఇది పవర్ డైనమిక్స్ ని మార్చేస్తుంది. నువ్వు వెంటనే సమాధానం ఇవ్వకుండా ఆగినప్పుడు అవతలి మనిషి ఇంకాస్త జాగ్రత్త పడతాడు. సైలెన్స్ నీకు టైం ఇస్తుంది. టైం నీకు ఆప్షన్స్ ఇస్తుంది. చాలా గొడవలు వాటికి అందాల్సిన ఇన్స్టంట్ ఫ్యూల్ అందకపోతే వాటంతటా అవే చల్లారిపోతాయి. చాలా మంది తమ రియాక్షన్స్ వల్ల ఇతరులకు ఎంత డామేజ్ జరుగుతుందో అది జరిగేంతవరకు చూడలేరు.
(19:48) మహాభారతంలో ధృతరాష్ట్రుడు కేవలం కళ్ళకే కాదు మనసులో కూడా దృష్టి లేనివాడే. ఇది ఒక స్ట్రాంగ్ సింబల్. విధురుడు ఒక పవర్ లో ఉన్న మనిషితో మాట్లాడుతున్నాడు. కానీ ఆ మనిషికి ఇన్నర్ సైట్ లేదు. ఇన్నర్ సైట్ అంటే నీ ఎమోషన్ ఒక యక్షన్ గా మారకముందే దాన్ని నువ్వు గమనించగలగడం అదే వివేకం అది లేకపోతే నన్ను నేను డిఫెండ్ చేసుకుంటున్నాను అని అనుకుంటూనే నీ లైఫ్ ని నువ్వు నాశనం చేసుకుంటావు.
(20:15) ఇక్కడ ట్రాజిడీ ఏంటంటే మనసు లోపల ఉన్న ఆ బ్లైండ్నెస్ మనకు తెలీదు. ఆ క్షణంలో మనం చేస్తున్నదే కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు ఒక విషయం గురించి ఎంత ఎక్కువ ఆశపడితే నీ రియాక్షన్ అంత దారుణంగా ఉంటుంది. నీకు గౌరవం కావాలి. అందరూ ఒప్పుకోవాలి. అందరూ నిన్ను ప్రేమించాలి. ఇలాంటి అటాచ్మెంట్స్ ఉన్నప్పుడు నీ మైండ్ స్థిరంగా ఉండదు. విధురుడు చెప్పినట్టు ఆశ నీ మైండ్ ని ఇన్స్టేబుల్ గా మారుస్తుంది.
(20:40) ఎప్పుడైతే ఆ రిజల్ట్ దక్కదని నీకు అనిపిస్తుందో వెంటనే ఎమోషన్ రైజ్ అయ్యి రియాక్ట్ అవ్వమని డిమాండ్ చేస్తుంది. ఇక్కడ వివేకం ఉంటే నీ కష్టాన్ని నీ కోరికను వేరు చేసి చూపిస్తుంది. నువ్వు పని చేస్తావ్ నువ్వు మాట్లాడతావు. కానీ నీ వాల్యూ కేవలం ఆ రిజల్ట్ పై మాత్రమే ఆధారపడి ఉందన్నట్టు నువ్వు ఏమాత్రం ప్రవర్తించవు. ఎప్పుడైతే నీ అటాచ్మెంట్ తగ్గుతుందో నీ రియాక్టివిటీ కూడా తగ్గిపోతుంది.
(21:05) ఎవరు నిన్ను అంత ఈజీగా రెచ్చగొట్టలేరు. ఎందుకంటే నువ్వు ఒక బలహీనమైన రిజల్ట్ ని కాపాడటానికి ప్రయత్నించావు కాబట్టి మనుషులు మనం మాట్లాడిన ప్రతి మాటని గుర్తుపెట్టుకోలేకపోవచ్చు. కానీ వాళ్ళను గాయపరిచిన ఆ ఒక్క సెంటెన్స్ ని మాత్రం అస్సలు మర్చిపోలేరు. అందుకే విధురుడు మాటల్ని ఆయుధాలతో పోల్చాడు. ఎందుకంటే వాటిని వెనక్కి తీసుకోలేం. విదురనీతిలో హార్ష్ వర్డ్స్ అంటే కఠినమైన మాటల్ని విషంతో పోల్చాడు.
(21:31) అది మొదట మాట్లాడే మనిషి విచక్షణని ఆ తర్వాత వినే మనిషి నమ్మకాన్ని కాల్చేస్తుంది. నువ్వు మాట్లాడకముందే వివేకం నిన్ను ఒకటే ప్రశ్న అడగాలి. నేను చెప్పేది నిజమేనా అండ్ ఇది చెప్పడానికి సరైన టైమేనా? ఈ చిన్న చెక్ జరిగే డ్ామేజ్ ని ఆపేస్తుంది. కంట్రోల్ లేని మాటలు కేవలం మన లోపల ఉన్న ఎమోషన్ ని బయటకు పంపడానికే వస్తాయి.
(21:52) ఆ రిలీజ్ కొన్ని క్షణాలు మాత్రమే బాగుంటుంది. కానీ ఆ విషం మాత్రం నెలలు తరబడి ఉండిపోతుంది. మనం కోపంగా ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ కి మనమే ఒక లాయర్ లా మారిపోతాం. మనకి సపోర్ట్ చేసే సాక్ష్యాలను వెతుకుతాం. మనకి అపోజ చేసే విషయాలను అస్సలు పట్టించుకోం. విధురుడు ఏమని హెచ్చరిస్తాడంటే కోపం నీ విచక్షణను తీసేస్తుంది. అది ఆ కోపంలో ఉండే ఇంటెన్సిటీనే నిజమని నిన్ను నమ్మిస్తుంది.
(22:16) వివేకం నీ మైండ్ ని స్లో చేసి మొత్తం పిక్చర్ ని నీకు చూపిస్తుంది. అది కోపాన్ని కాదనదు. కానీ దాన్ని స్టడీ చేస్తుంది. ఆ కోపం దేన్ని కాపాడుతుంది దేన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది వీటన్నిటిని గమనిస్తుంది. ఎప్పుడైతే నువ్వు కోపాన్ని నీ లోపల జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ లా చూడగలవో అప్పుడు నీ జడ్జ్మెంట్ మళ్ళీ పని చేయడం స్టార్ట్ చేస్తుంది.
(22:40) ఒక్కసారి విచక్షణ తిరిగి వస్తే అదే సిచువేషన్ ఇంతకు ముందు కంటే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. టెన్షన్ ఉన్న టైంలో ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వాళ్లే గెలుస్తారు. అంటే ఎవరో ఒకరిని ఓడించడం అని కాదు తమని తాము కోల్పోకుండా ఉండటం అందరూ ఊగిపోతున్నప్పుడు ఎవరైతే నిలకడగా ఉంటారో మిధురుడు వాళ్ళను మెచ్చుకున్నాడు. దీని వెనుకున్న ఐడియా ఏంటంటే వేగం అనేది ఇంపల్స్ కి సంబంధించింది.
(23:03) నిలకడ అనేది విస్డమ్ కి సంబంధించింది. వివేకం ఏం చేస్తుందంటే నీ అటెన్షన్ ని ఒక్క క్షణం నీ బాడీ మీద నీ ఊపిరి మీద ఉంచేలా చేసి నిన్ను నిలకడగా మార్చేస్తుంది. ఆ ఒక్క క్షణం నీకు ఒక లెవరేజ్ ని ఇస్తుంది. ఆ ఎమోషనల్ వేవ్ నిన్ను మాటల్లోకో లేక ఒక యాక్షన్ లోకో నెట్టేయకుండా ఆపుతుంది. స్లో మైండ్ అంటే ముద్దుబారిపోయిన మైండ్ కాదు అది ఏది కావాలో అది ఎంచుకోగలిగే మైండ్.
(23:29) గొడవల్లో అసలైన పవర్ అంటే నీకు నచ్చినట్టు ప్రవర్తించే ఛాయిస్ నీ దగ్గర ఉండటమే. కంట్రోల్డ్ గా ఉండటం అంటే ఎదుటి వ్యక్తికి గెలిచే ఛాన్స్ ఇవ్వడం అని చాలా మంది అనుకుంటారు. కానీ విధురుడు ఈ ఐడియాని రివర్స్ చేశాడు. ద మోస్ట్ డేంజరస్ ఎనిమీ అంటే నీ ఇంపల్సివ్ మైండ్. దాన్ని గెలవడమే అసలైన విజయం అని ఆయన చెప్పాడు. విధుర నీతిలో నిగ్రహం అనేది డిగ్నిటీని కాపాడుతుంది.
(23:54) వివేకం ఆ నిగ్రహాన్ని ఒక తెలివైన పనిగా మారుస్తుంది. నువ్వు అక్కడ భయపడి ఆగిపోవట్లేదు. నీ లిమిట్స్ నువ్వు కాపాడుకుంటున్నావు. ఒక చిన్న మోమెంట్ కోసం ఒక పెద్ద కాంపెన్సేషన్ ఇవ్వక్కర్లేదని నువ్వు డిసైడ్ అవుతున్నావు. ఈ నిగ్రహం నిన్నంత ఈజీగా కన్ఫ్యూజన్ లోకి లాగలేరు అని ఎదుటి వాళ్ళకు ఒక సిగ్నల్ ని పంపిస్తుంది. మనుషులు తాము ఎవరినైతే మనిపులేట్ చేయలేరో వాళ్ళనే గౌరవిస్తారు.
(24:15) నువ్వు బయటికి ఎక్స్ప్లోర్డ్ అయ్యే లోపే నీ లోపల ఆ చేంజ్ మొదలవుతుంది. నువ్వు గమనించడం నేర్చుకుంటే దాన్ని క్లియర్ గా ఫీల్ అవ్వచ్చు. గుండె బరువు అవ్వడం, ఫేస్ వేడెక్కడం, ఊపిరి వేగంగా రావడం ఇవన్నీ నీ ఎర్లీ వార్నింగ్ సిస్టం. ఆ ఫైర్ పెద్దది అవ్వకముందే ఆ చిన్న నిప్పు కణాన్ని పట్టుకోవడమే విధురుడి టీచింగ్. నీ బాడీలో వచ్చే ఈ చేంజెస్ ని నువ్వు గమనించిన క్షణమే నీ రియాక్షన్ నుంచి నువ్వు విడిపోతావు.
(24:42) ఒక్క క్షణం ఆగడానికి ఒక ఊపిరి తీసుకోవడానికి లేదా మౌనంగా ఉండటానికి ఆ గ్యాప్ చాలు. చాలామంది ఈ స్టేజెస్ ని మిస్ అయిపోయి డ్ామేజ్ అంతా అయిపోయాక అప్పుడు మేల్కొంటారు. కానీ తెలివైన వ్యక్తి ఆ నిప్పు కణాన్ని చూసినప్పుడే మేల్కొంటాడు. మనం గమనిస్తే ఒక క్రూషియల్ సిచువేషన్ లో ఎవరైనా చాలా ప్రశాంతంగా ఉంటే ఆ రూమ్లో ఉన్న వాతావరణమే మారిపోతుంది.
(25:04) అందరూ వాళ్ళ మాటల్ని చాలా జాగ్రత్తగా వింటారు. విధురుడు ఈ కంపోజర్ ని ఒక మెంటల్ వెల్త్ అని వర్ణించాడు. నీ మైండ్ అంత ఈజీగా షేక్ అవ్వదు అని అది నిరూపిస్తుంది. ప్రతి సిచువేషన్ లో నీ పూర్తి ఎమోషనల్ ఎనర్జీని ఇవ్వాల్సిన అవసరం లేదు అని నీకు గుర్తు చేయడంతో వివేకం నీ స్టిల్నెస్ ని కాపాడుతుంది. నువ్వు ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయిపోతుంటే నీ వాల్యూ పడిపోతుంది.
(25:29) ఎక్కడ రియాక్ట్ అవ్వాలో నువ్వు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీ ఐడెంటిటీ సాలిడ్ గా ఉంటుంది. ఆ స్టెబిలిటీ నీకుొక సైలెంట్ అథారిటీని ఇస్తుంది. అది అరుస్తూ చేసే హడావిడి కంటే చాలా ఎక్కువ కాలం నిలుస్తుంది. ఓవర్ రియాక్షన్ అనేది కేవలం ఆ ఒక్క క్షణం కోసమే పని చేస్తుంది. నిన్ను ఆ క్షణంలో అది గెలిపిస్తుంది. నీ ఇగోని శాంతింపజేస్తుంది.
(25:51) విధురుడు ఎప్పుడూ ఆ ప్రెసెంట్ ఎమోషన్ ని దాటి ఆలోచించమని చెప్పేవాడు. ఆయన దృష్టికి రిజల్ట్స్ మీద ఉండేది తప్ప ఆవేశం మీద కాదు. వివేకం నీ విజన్ ని ఫ్యూచర్ వైపు మళ్ళస్తుంది. ఈరోజు నువ్వు ఏదైనా చేసే ముందు రేపటి గురించి ఆలోచించమని అడుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇలా ఫ్యూచర్ ని చూడటం ప్రాక్టీస్ చేస్తావో నీ రియాక్షన్స్ ఆటోమేటిక్ గా తగ్గుతాయి.
(26:12) నీ మాటల వల్ల ఫ్యూచర్ లో వచ్చే నష్టాన్ని నువ్వు అంచనా వేయడం మొదలు పెడతావు. లాంగ్ టర్మ్ థింకర్ రిలేషన్స్, రెస్పెక్ట్ అండ్ స్టెబిలిటీని కాపాడుకుంటాడు. అదే షార్ట్ టర్మ్ రియాక్టర్ అయితే కేవలం తన గర్వాన్ని కాపాడుకుంటాడు. ఒకరు లైఫ్ ని బిల్డ్ చేసుకుంటే ఇంకొకరు ఎప్పుడు డామేజ్ ని రిపేర్ చేసుకుంటూనే ఉంటారు. ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వడం వల్ల మనకు తెలియకుండానే మన మెంటల్ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది.
(26:37) కంట్రోల్ లేని ఎమోషన్స్ మనిషిని లోపల నుంచి బలహీన పరుస్తాయని విధురుడు హెచ్చరించాడు. ఇక్కడ శక్తి అంటే క్లారిటీ అండ్ స్టెబిలిటీ. వివేకం అవసరమైన యుద్ధాలను ఆపడం ద్వారా నీ ఎమోషనల్ ఎనర్జీని కాపాడుతుంది. ప్రతి గొడవలోనూ నీ పూర్తి బలాన్ని వాడాల్సిన పని లేదు. ప్రతి కామెంట్ కి నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు చిన్న చిన్న ట్రిగర్స్ కి రియాక్ట్ అవ్వడం ఆపేస్తావో అప్పుడు ఆ ఎనర్జీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మిగులుతుంది.
(27:06) ఈ ఎనర్జీ సేవింగ్ నిన్ను స్టెడీగా మారుస్తుంది. ఈ స్టెడీనెస్ నీ లైఫ్ లో ఉన్న ప్రతి ఏరియాలో నీ ఎఫెక్టివ్నెస్ ని పెంచుతుంది. ఎవరైతే పానిక్ అవ్వకుండా ఎక్స్ప్లోడ్ అవ్వకుండా ఉంటారో మనుషులు వాళ్ళ దగ్గరే చాలా సేఫ్ గా ఫీల్ అవుతారు. మహాభారతంలో విధురుడు ఎప్పుడూ సెల్ఫ్ కంట్రోల్ ఉన్న లీడర్షిప్ గురించే సలహాలు ఇచ్చేవాడు.
(27:26) ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యే లీడర్ తన చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా ఇన్స్టెబిలిటీని నింపుతాడు. లీడర్షిప్ లో వివేకం అంటే మొత్తం పరిస్థితిని అర్థం చేసుకున్న తర్వాతే రెస్పాండ్ అవ్వడం. ఇది ఆవేశంలో లేదా బాధలో తీసుకునే తొందరపాటు నిర్ణయాలను ఆపుతుంది. మన డే టు డే లైఫ్ లో అంటే ఫ్యామిలీ, వర్క్ ప్లేస్ లేదా ఫ్రెండ్స్ మధ్య మనం కూడా ఒక విధంగా లీడర్స్ అనే చెప్పాలి.
(27:48) నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా రెస్పాండ్ అవుతావో నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నిన్ను చూసి కంట్రోల్ అవ్వడం నేర్చుకుంటారు. ఆ ప్రశాంతత అందరికీ స్ప్రెడ్ అవుతుంది. నీ ఇన్ఫ్లయెన్స్ నీ వాయిస్ బట్టి కాకుండా నీ స్టెబిలిటీ బట్టి పెరుగుతుంది. చాలా మంది ఇంటెలిజెన్స్ అండ్ విస్డమ్ రెండు ఒకటే అనుకొని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంటెలిజెన్స్ బాగా వాదించగలదు.
(28:10) కానీ విస్డమ్ కి ఎప్పుడు వాదించకూడదో తెలుసు. ఏదైనా చేసే ముందు దాని కాన్సిక్వెన్సెస్ ని అర్థం చేసుకునేవాడే ఒక జ్ఞాని అని విధురుడు డిఫైన్ చేశాడు. అదే వివేకం అది నీ కోరికని డ్యూటీ నుంచి ఎమోషన్ ని యాక్షన్ నుంచి ఆవేశాన్ని విచక్షణ నుంచి విడదీస్తుంది. జ్ఞానం అంటే ఎప్పుడూ సైలెంట్ గా ఉండటం కాదు సరైన సమయంలో సరైన పని చేయడం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే నీకు ఆ తేడా క్లియర్ గా తెలుస్తుంది.
(28:36) ఒక విషయం జరిగినప్పుడు దానికి రియాక్ట్ అవుతున్నప్పుడు వీటి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ మెల్లగా పెరగడం నువ్వు గమనిస్తావు. ఆ గ్యాప్ లోనే నీ అసలైన శక్తి పెరగడం మొదలవుతుంది. మనం అబ్సర్వ్ చేస్తే చాలా మందికి ఆ పాజ్ అనే విషయం ఎప్పుడు గుర్తొస్తుందో అప్పటికే వాళ్ళు ట్రిగర్ అయిపోయి సగం మాటలు బయటక వచ్చాక ఆ పాజ్ అనే విషయం గుర్తొస్తుంది.
(28:58) అప్పటికే నీ వాయిస్ మారిపోతుంది. నీ టోన్ హార్ష్ అయిపోతుంది. నీ బాడీ వేడెక్కిపోతుంది. విదురుడు ఇక్కడ ఇచ్చే వార్నింగ్ చూడండి. సెల్ఫ్ కంట్రోల్ అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు బిల్డ్ చేసుకోలేం. అది ప్రశాంతంగా ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేయాలి. వివేకం అనేది సడన్ గా వాడటానికి ఏదో ఎమర్జెన్సీ బ్రేక్ లాంటిది కాదు అది నీ లైఫ్ లో ఏ గొడవలు లేనప్పుడే అలవాటు చేసుకోవాల్సిన ఒక హ్యాబిట్ ప్రశాంతంగా ఉన్నప్పుడే నీ మీద నీకు అవగాహన లేకపోతే కోపంలో ఉన్నప్పుడు అది అసలే రాదు.
(29:27) అందుకే చాలా మంది ఋషులు మహర్షులు కూడా నిగ్రహం దగ్గరికి వచ్చేసరికి ఫెయిల్ అవుతారు. సరైన ట్రైనింగ్ లేని నాలెడ్జ్ ప్రెజర్ లో ఉన్నప్పుడు పని చేయదు. ఒకసారి నీ ఎమోషన్స్ ని నువ్వు క్లియర్ గా గమనించడం మొదలు పెడితే దాని పట్టు బలహీనమవుతుంది. నాకు కోపం వస్తుంది అనే ఫీలింగ్ నుంచి నా లోపల కోపం పెరుగుతుంది అని గమనించే స్టేజ్ కి నువ్వు మారాలి.
(29:47) విదురుడు ఎప్పుడూ లోపల జరిగే విషయాల మీద అవగాహన పెంచుకోమ్మని చెప్పేవాడు. దీనినే ఒక అబ్సర్వింగ్ మైండ్ ని డెవలప్ చేసుకోవడం అంటారు. నీ లోపల ఏం జరుగుతుందో దానికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా కేవలం గమనించడం ప్రాక్టీస్ చేసినప్పుడే వివేకం పెరుగుతుంది. నీ గుండెలో బరువుగా అనిపించడం ఊపిరి వేగంగా అవ్వడం మాట్లాడాలనే ఆ తపన వీటన్నిటిని నువ్వు గమనించాలి.
(30:12) ఈ అబ్జర్వేషన్ే నీకు నీ ఎమోషన్ కి మధ్య ఒక దూరాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ దూరంలోనే నీ ఛాయిస్ కనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు నీ ఎమోషనల్ వేవ్ లో మునిగిపోకుండా దాన్ని చూడటం నేర్చుకుంటావో అప్పుడు ఆ పాజ్ తీసుకోవడం చాలా నాచురల్ గా జరిగిపోతుంది. చాలా మంది సెల్ఫ్ కంట్రోల్ అంటే ఉన్న ఫీలింగ్స్ అన్ని అణచేసుకోవడం అనుకుంటారు.
(30:32) కానీ విధురుడు దాన్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సెల్ఫ్ కంట్రోల్ అంటే నిన్ను నువ్వు నాశనం చేసుకోకుండా కాపాడుకునే ఒక ఆర్మర్ కవచం టెంపరరీ ఎమోషన్స్ నీ పర్మనెంట్ రిజల్ట్స్ ని డిసైడ్ చేయకుండా వివేకం నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఆవేశంగా రియాక్ట్ అయినప్పుడు ఎదుటి వాళ్ళకు నీ బలహీనతలు ఏంటో తెలిసిపోతాయి. నిన్ను ఎలా ట్రిగర్ చేయాలో ఎమోషనల్ గా ఎలా ఆడుకోవాలో వాళ్ళకు అర్థమవుతుంది.
(30:56) కానీ నువ్వు గనుక నిలకడగా ఉంటే నిన్ను రెచ్చగొట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు. నిన్ను మనిపులేట్ చేయడం కష్టమవుతుంది. ఈ స్టెబిలిటీ నీ మీద నమ్మకాన్ని పెంచుతుంది. ఆ నమ్మకమే నీ ఇన్ఫ్లయెన్స్ ని పెంచుతుంది. సెల్ఫ్ కంట్రోల్ అంటే కేవలం ప్రశాంతంగా కనిపించడం కాదు నీ లైఫ్ లో నీ పొజిషన్ ని సేఫ్ గా ఉంచుకోవడం. మన లైఫ్ కి వచ్చే అతి పెద్ద మార్పులు చాలా సైలెంట్ గా ఉంటాయి.
(31:17) అక్కడ ఎవ్వరూ చప్పట్లు కొట్టరు. ఎవ్వరు నిన్ను మెచ్చుకోరు. కేవలం నువ్వు అండ్ నీ రియాక్షన్ మాత్రమే ఉంటాయి. విధురుడు ఇలాంటి సైలెంట్ విక్టరీస్ కే ఎక్కువ వాల్యూ ఇచ్చేవాడు. ఎందుకంటే డామేజ్ జరగకముందే ఇవి దాన్ని ఆపేస్తాయి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపి నీ పాయింట్ చెప్పాలనిపించినప్పుడు నువ్వు పాజ ఇస్తే అదిఒక విక్టరీ నీలో కోపం పెరిగినప్పుడు నువ్వు ఒక ఊపిరి తీసుకుంటే అదొక విక్టరీ ఒక అగ్రెసివ్ మెసేజ్ టైప్ చేసి దాన్ని డిలీట్ చేస్తే అది కూడా ఒక విక్టరీ బయట నుంచి చూసేవాళ్ళకి అక్కడఏం జరగలేదు అనిపించొచ్చు.
(31:52) కానీ నీ లోపల ఒక పాటర్న్ మారింది. నీ పాత రిఫ్లెక్స్ బలహీనపడి నీ కొత్త ఐడెంటిటీ బలపడింది. ఇలాంటి చిన్న చిన్న గెలుపులే మెల్లగా నిన్ను ఒక కొత్త మనిషిగా మారుస్తాయి. కేవలం ఒక విషయాన్ని అర్థం చేసుకున్నంత మాత్రాన నీ ప్రవర్తన మారిపోదు. ఆ ఒక్క క్షణం ఆ పాజ్ చాలా గొప్పదని నువ్వు ఒప్పుకోవచ్చు. కానీ మళ్ళీ రేపు పొద్దున్నే ఓవర్ రియాక్ట్ అవ్వచ్చు.
(32:14) విదురనీతిని ఇలా ఐడియాస్ లో తీసుకుంటే సరిపోదు. అవి నీ అలవాట్లుగా మారాలి. వివేకం అనేది కేవలం ఫిలాసఫీ కాదు అది నీ ఫిజికల్ యాక్షన్ లో కనిపించాలి. నీ ఊపిరిలో నీ టోన్ లో నీ టైమింగ్ లో అది తెలియాలి. అంటే మనం ఇప్పుడు ప్రిన్సిపల్స్ నుంచి ప్రాక్టీస్ లోకి వెళ్ళాలి. నీకు ఏదైనా జరిగినప్పుడు దానికి రియాక్ట్ అవుతున్నప్పుడు వీటి మధ్యలో ఆటోమేటిక్ గా గ్యాప్ వచ్చేలా కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
(32:41) ఎప్పుడైతే ఆ పాజ్ నీ నర్వస్ సిస్టం లో భాగమైపోతుందో అప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. అది నీకు చాలా నాచురల్ గా వచ్చేస్తుంది. మనం అబ్సర్వ్ చేస్తే చాలా వరకు ఓవర్ రియాక్షన్స్ ఒక విషయం జరిగినప్పుడు దానికి రియాక్ట్ అయినప్పుడు వీటి మధ్యలో అసలు ఏమాత్రం గ్యాప్ ఉండదు. ఇక్కడ మనం ఏదో ఋషులు మహర్షుల్లా మారిపోవాలని ట్రై చేయట్లేదు.
(33:00) మనం కోరుకుంటున్నది కేవలం ఆ ఐదు సెకండ్ల గ్యాప్ మాత్రమే. విదురుడు చెప్పిన వివేకం అంటే ఇదే. ఏదైనా చేసే ముందు విచక్షణతో ఆలోచించడం. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు మాట్లాడే ముందు లేదా ఏదైనా పని చేసే ముందు నీ లోపల ఏం జరుగుతుందో ఒక్కసారి చెక్ చేసుకునే ఆ చిన్న గ్యాప్ ఉండాలి.ఫైవ్ సెకండ్స్ అనేది చాలా చిన్నదిగా అనిపించొచ్చు.
(33:23) కానీ ఆవేశానికి ఆలోచనకి మధ్య ఉన్న తేడా అదే. ఆ కొన్ని సెకండ్స్ లో నీ ఎమోషన్స్ నీ తరపున నిర్ణయాలు తీసుకోకుండా నువ్వు ఆపగలవు. ఇది గొడవల్లో గెలవడం గురించి కాదు. నీ లైఫ్, నీ కంట్రోల్ తప్పకుండా చూసుకునే ప్రయత్నం. ఎమోషన్స్ కి మనం పేరు పెట్టేంతవరకు అవి పెరుగుతూనే ఉంటాయి. ఆ మోమెంట్ లో అవే నీ ఐడెంటిటీలా అనిపిస్తాయి. విదురుడి ఉద్దేశం ఏంటంటే ముందు క్లారిటీ ఉండాలి ఆ తర్వాత యక్షన్ ఉండాలి.
(33:48) వివేకం అనేది నీ ఎమోషన్ ని గుర్తించడంతో మొదలవుతుంది. నీలో ఏం జరుగుతుందో దానికి సైలెంట్ గా ఒక పేరు పెట్టు కోపం, బాధ, భయం, అవమానం ఇలా పేర్లు పెట్టగానే నీ కన్ఫ్యూజన్ తగ్గుతుంది. నువ్వు తుఫాన్ల మధ్య చిక్కుకుపోకుండా అదే తుఫాన్ ని దూరం నుంచి గమనిస్తున్నట్టు అవుతుంది. ఇదేదో స్పిరిచువల్ గా ఉండటానికి చేసే ప్రయత్నం కాదు. నీ ఎమోషన్స్ అండ్ నువ్వు రెండు ఒకటే అయిపోయే ఫీలింగ్ ని ఆపడం కోసం చేయాలి.
(34:12) ఒక్కసారి ఈ ఎమోషన్స్ కి పేరు పెట్టావంటే వాటిని నువ్వు హ్యాండిల్ చేయగలవు. లేదంటే అదే నిన్ను హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమోషన్ ఏంటి అనే ఒక క్లారిటీ నీకు వస్తుంది కాబట్టి దాన్ని అలాగే మెయింటైన్ చేయాలా వద్దా అని నీకు తెలుస్తుంది. నీ నోటి నుండి మాటలు వచ్చే ముందే నీ ఊపిరిలో మార్పు వస్తుంది. అది చిన్నగా వేగంగా మారుతుంది.
(34:32) విధురుడి జ్ఞానం నీ బాడీకి టచ్ అయినప్పుడే బాగా పనిచేస్తుంది. వివేకం ఇక్కడ ఊపిరిని ఒక ఆయుధంలా వాడుకుంటుంది. ఎందుకంటే నీ నెర్వస్ సిస్టం ని వెంటనే కామ్ చేయడానికి ఇదే ఫాస్ట్ మార్గం. ఒకసారి ఇది ట్రై చేసి చూడు నెమ్మదిగా బ్రీత్ ఇన్ చేసి మరింత ఎక్కువ సేపు బ్రీత్ అవుట్ చెయ్ ఇలా రెండు సార్లు చెయ్ అంతే నువ్వు మెల్లగా బ్రీత్ అవుట్ చేసినప్పుడు నీ బాడీకి మనం సేఫ్ గా ఉన్నాం అని ఒక సిగ్నల్ వెళ్తుంది.
(34:57) అది నీ లోపల ఉన్న వేడిని తగ్గిస్తుంది. నీ థింకింగ్ మైండ్ కి మళ్ళీ క్లారిటీ వచ్చే టైం ఇస్తుంది. ఇదొక ఎమర్జెన్సీ క్లారిటీ నెలల తరబడి బాధపడకుండా ఉండటానికి నువ్వు కొనుక్కుంటున్న కొన్ని సెకండ్ల టైం ఇదే. గొడవల్లో మనం మాట్లాడే మొదటి మాటలే మొత్తం గొడవ ఏ దారిలో వెళ్ళాలో డిసైడ్ చేస్తాయి. ఆ మొదటి మాటలు గనుక షార్ప్ గా ఉంటే ఆ తర్వాత అంతా యుద్ధమే ఆలోచించకుండా మాట్లాడే మాటల గురించి విధురుడు చాలా గట్టిగా హెచ్చరించాడు.
(35:24) దీనికి ఒక ప్రాక్టికల్ రూల్ ఉంది. నీ మైండ్ లోకి వచ్చే మొదటి మాటల్ని అస్సలు మాట్లాడకు. వాటిని కొంచెం డిలే చెయ్. ఎందుకంటే ఆ మొదటి సెంటెన్స్ ఎప్పుడూ ఇగో నుంచి లేదా ఆవేశం నుంచి వస్తుంది. దీనికి బదులుగా ఒక న్యూట్రల్ లైన్ తో కాస్త టైం తెచ్చుకొని గొడవను వాయిదా వేయ్ ఒక్క నిమిషం ఆగు లేదా నన్ను ఆలోచించనివ్వు ఇలాంటి సింపుల్ మాటలు ఉపయోగించు ఆ చిన్న డిలే నిన్ను రిగ్రెట్ నుంచి కాపాడుతుంది.
(35:49) అది నీతో పాటు ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరి ఎనర్జీని మార్చేస్తుంది. ఎమోషన్ పెరిగినప్పుడు నీ బాడీ ఏదో ఒక మూమెంట్ కావాలని కోరుకుంటుంది. అటు ఇటు తిరగడం, చేతులు ఊపడం, గట్టిగా కొట్టడం లేదా వెంటనే మెసేజ్ పంపించడం ఇలా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. విధురనీతి డిసిప్లిన్ ని ఎక్స్ప్రెషన్ ని కంట్రోల్ చేయడంతో మొదలవుతుంది. ఒక ఫిజికల్ పాజ్ యాడ్ చేస్తే వివేకం కాన్సెప్ట్ ఇంకా ఈజీ అవుతుంది.
(36:16) నీ పాదాలని నేల మీద ఫ్లాట్ గా ఉంచు. భుజాల్ని రిలాక్స్ చెయ్ నీ దవడల్ని బిగబట్టకుండా ఉంచు. ఒక్క క్షణం నీ చేతిని నీ చాతి మీద ఉంచుకున్నా సరే అది హెల్ప్ అవుతుంది. ఇదంతా చేసి నువ్వు నీ నర్వస్ సిస్టం కి మనం ప్రమాదంలో లేము అని చెప్తున్నావు. ఇది వినడానికి చాలా వియర్డ్ గా ఉండొచ్చు. కానీ ఓవర్ రియాక్షన్ అనేది మొదట బాడీలో మొదలయ్యే ఒక పాటర్న్.
(36:37) నీ బాడీ సెటిల్ అయితే నీ మైండ్ యుద్ధం చేయడం ఆపేస్తుంది. ఒక్కసారి నీ బాడీ ఈ పాజ్ ని నేర్చుకుంటే నీ రియాక్షన్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. మనం ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే కొన్ని రియాక్షన్స్ చాలా అర్జెంట్ గా అనిపిస్తాయి. ఒక బ్రేకప్ టెక్స్ట్ ఆవేశంతో వచ్చిన ఈమెయిల్ లేదా ఫ్యామిలీలో వచ్చే గొడవ ఆ మోమెంట్ లో నువ్వు ఇప్పుడే రియాక్ట్ అవ్వాలి అని నీకు అనిపిస్తుంది.
(37:01) విధురుడు ఏమంటాడంటే ముందు కాన్సక్వెన్సెస్ చూడు ఆ తర్వాత ఎమోషన్స్ కి చోటఇవ్వు. ఒకవేళ విషయం చాలా సీరియస్ అయి ఉండి నువ్వు ఎమోషనల్ గా ఊగిపోతుంటే ఆ ఫైనల్ రెస్పాన్స్ ని కాస్త లేట్ చెయ్ కనీసం ఒక రాత్రి గడవనివ్వు అది ప్రాబ్లం నుండి తప్పించుకోవడానికి అన్నట్టు కాకుండా నీ డెసిషన్స్ లో ఉన్న వేడిని తగ్గించుకోవడానికి అవుతుంది. రియాక్షన్ లేట్ చేస్తే ఎక్కడ ఓడిపోతామో అని చాలా మంది భయపడతారు.
(37:25) కానీ నిజానికి ఆ లేట్ చేయడం వల్ల నీకు ఒక పర్స్పెక్టివ్ దొరుకుతుంది. అదే పర్స్పెక్టివ్ ఒక టెంపరరీ ఎమోషన్ కోసం నువ్వు ఒక పర్మనెంట్ తప్పు చేయకుండా కాపాడుతుంది. టెక్నాలజీ వల్ల ఓవర్ రియాక్షన్ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే అవతల వ్యక్తిని మనం చూడలేం. నీ మైండ్ ఖాళీగా ఉన్న చోట నెగిటివ్ విషయాలను నింపుతుంది. ఎదుటి వ్యక్తి షార్ట్ గా రిప్లై ఇస్తే అది పొగరులా అనిపిస్తుంది.
(37:47) రిప్లై ఇవ్వకపోతే ఇన్సల్ట్ లా అనిపిస్తుంది. క్లారిటీ లేని మాటలకు స్వరం ఉండదని అప్పట్లో విదురుడు అన్న మాటకు ఇప్పటి టెక్స్ట్ మెసేజెస్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనొచ్చు. వివేకం అంటే ఇక్కడ నీ ఎక్స్పెక్టేషన్స్ ని నిజాలని నమ్మకపోవడం. రిప్లై ఇచ్చే ముందు ఆ మెసేజ్ ని ఒకసారి చదువు ఆ తర్వాత 10 సార్లు ఊపిరి తీసుకో అప్పటికీ నీలో ఆవేశం తగ్గకపోతే నీ సమాధానాన్ని చాట్ బాక్స్ లో కాకుండా ఒక నోట్స్ యప్ లో రాయ్ ఆ చిన్న గ్యాప్ నీ ఆవేశాన్ని ఆపుతుంది.
(38:18) చాలా వరకు డిఎంస్ లో ఉండే గొడవలు ఏవి కూడా ఆ మెసేజ్ గురించి కావు దాన్ని నువ్వు అర్థం చేసుకున్న విధానం గురించే అవుతాయి. నువ్వు అర్థం చేసుకునే స్పీడ్ తగ్గిస్తే అనవసరమైన యుద్ధాలు ఆగిపోతాయి. ఎవరైనా రెస్పెక్ట్ లేకుండా ప్రవర్తిస్తే మన ఈగో దెబ్బ తింటుంది కాబట్టి వెంటనే రియాక్ట్ అవుతాం. ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినా నిన్ను ఇగ్నోర్ చేసినా లేదా లిమిట్స్ దాటిన విదురుడు ఏమంటాడో తెలుసా ఆ అవమానాన్ని భరించు అని చెప్పాడు.
(38:43) అంటే చేతకాని వాడిలా ఉండిపోమని కాదు. ఆ సిచువేషన్ ని డీల్ చేసే అప్పుడు నీ విచక్షణని వదులుకోకు అనేదే అసలు అర్థం. వివేకం అంటే ఆవేశంతో కాకుండా క్లారిటీతో రెస్పాండ్ అవ్వడం. నీ వాయిస్ ని స్టడీగా ఉంచుకొని నీ మాటల్లో స్పష్టత ఉండాలి. ఎదుటి వ్యక్తిని కాదు వాళ్ళ బిహేవియర్ లో తప్పు చూడు అలాగే సరైన టైం కోసం వెయిట్ చెయ్.
(39:04) ఒక్కసారిగా గట్టిగా రెస్పాండ్ అయ్యావ అంటే అది వెంటనే గొడవ పెట్టుకోవడం కాదు తర్వాత ఎప్పుడైనా నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ లిమిట్స్ ఏంటో క్లియర్ గా చెప్పడం. ఇలా చేయడం వల్ల నువ్వు కంట్రోల్ తప్పకుండా నీ బలాన్ని చూపిస్తావు. నీ గౌరవాన్ని కాపాడుకుంటూనే నీ స్టడీనెస్ ని మెయింటైన్ చేస్తావు. క్రిటిసిజం అనేది ఒక్కోసారి రిజెక్షన్ లా అనిపిస్తుంది.
(39:24) అప్పుడు బాడీ బిగుసుకుపోతుంది. మైండ్ వెంటనే డిఫెన్స్ లోకి వెళ్ళిపోతుంది. విదురుడు ఈ క్రిటిసిజం అండ్ తప్పుల్ని సరిదిద్దుకోవడాన్ని గౌరవించేవాడు. ఎందుకంటే అది మళ్ళీ తప్పులు చేయకుండా కాపాడుతుంది. వివేకం క్రిటిసిజం ని ఒక డేటాలా మార్చేస్తుంది. మనక వచ్చే ప్రతి విమర్శ నిజం కాకపోవచ్చు. కానీ అందులో ఉన్న ప్రతి పాయింట్ నీకు ఏదో ఒకటి చెప్తుంది.
(39:45) నీ ప్రాక్టీస్ సింపుల్ గా ఉండాలి. వెంటనే సమాధానం ఇవ్వకు అర్థం చేసుకోవడానికి నీకు ఇందులో ఏ పార్ట్ సరిగ్గా అనిపించలేదు అని ఒక ప్రశ్న అడుగు ఆ ఒక్క ప్రశ్న నిన్ను డిఫెన్స్ నుంచి అండర్స్టాండింగ్ కి మళ్ళస్తుంది. అది నీ మెచూరిటీని కూడా చూపిస్తుంది. వచ్చిన క్రిటిసిజం ఏదైనా నిజమైతే నువ్వు ఇంప్రూవ్ అవుతావు. ఒకవేళ అది తప్పైతే నీ ప్రశాంతమైన రెస్పాన్స్ దాన్ని గొడవ లేకుండా ఎక్స్పోజ చేస్తుంది.
(40:10) మన ఫ్యామిలీ మెంబర్స్ కి మనల్ని ఎలా ట్రిగర్ చేయాలో బాగా తెలుసు. మనల్ని ఓగిపోయేలా చేయడానికి పేరెంట్స్ లేదా సిబ్లింగ్స్ వీళ్ళఅనే ఒక్క మాట చాలు మన పాత అలవాట్లు ఎలా విచక్షణని దెబ్బతీస్తాయో విదురుడికి తెలుసు. ఫ్యామిలీ గొడవల్లో వివేకాన్ని వాడటం అంటే నీ లోపల నడుస్తున్న ఆ పాత స్క్రిప్ట్ ని నువ్వు గుర్తించడం నువ్వు కేవలం ఈరోజు అన్న మాటలకే రియాక్ట్ అవ్వట్లేదు.
(40:35) ఏళ్ల తరబడి నీలో దాగి ఉన్న ఎమోషన్స్ కి రియాక్ట్ అవుతున్నావ్. అందుకే ఇక్కడ పాజ్ మరింత లోతుగా ఉండాలి. ఊపిరి తీసుకో నీ వాయిస్ ని తగ్గించుకో మాట్లాడినప్పుడు చిన్న చిన్న సెంటెన్సెస్ ఉపయోగించు పాత గొడవల్ని ఈరోజు గొడవల్లోకి తీసుకురాకు నువ్వు ఎప్పుడైతే ప్రెసెంట్ లో ఉంటావో అప్పుడు గొడవ చాలా చిన్నదిగా మారుతుంది. గొడవ చిన్నదయితేనే దాన్ని సరిదిద్దుకోవడం సాధ్యమవుతుంది.
(40:56) మనం అబ్సర్వ్ చేస్తే ఆఫీస్ లో నువ్వు ఇచ్చే బెస్ట్ పర్ఫార్మెన్స్ కంటే ఒక్కసారి నువ్వు కంట్రోల్ తప్పి చేసే హడావిడే నీ రెపుటేషన్ ని ఎక్కువ కాలం వెంబడిస్తుంది. పనిలో ఉండే స్ట్రెస్ డెడ్లైన్స్ అండ్ పాలిటిక్స్ లేదా మీటింగ్స్ లో ఉండే అవమానాలు ఇవన్నీ నిన్ను ట్రిగర్ చేస్తాయి. విధురుడు ఎప్పుడూ నిలకడగా ఉండమని సలహా ఇచ్చేవాడు.
(41:17) ఎందుకంటే లీడర్ లో ఉండే అలజడి తన టీం మొత్తానికి భయాన్ని పంచుతుంది. వర్క్ ప్లేస్ లో వివేకం అంటే నీ ఎమోషన్ అండ్ నీ పని రెండిటిని విడదీయడం. నీకు చిరాగ్గా అనిపించినా సరే ఒక ప్రొఫెషనల్ రెస్పాన్స్ ఇచ్చే ఛాయిస్ నీ దగ్గర ఉంటుంది. మీటింగ్స్ లో ఎవరైనా నిన్ను రెచ్చగొడితే వెంటనే మాట్లాడకు మొదట నీ ఊపిరిని స్లో చేసి పాయింట్స్ నోట్ చేసుకోవడం మొదలు పెట్టు.
(41:38) అలా నోట్స్ రాయడం వల్ల నీ ఎమోషన్స్ కి ఒక పని దొరుకుతుంది. ఆ తర్వాత నీ ఆవేదన అంతా బయట పెట్టకుండా కేవలం ఒక క్లియర్ పాయింట్ మాత్రం చెప్పు. ఇది నీ క్రెడిబిలిటీని కాపాడుతుంది. సాధారణంగా డామేజ్ జరిగాక నేను సారీ చెప్పాలి అని అందరూ అనుకుంటారు. కానీ విధురుడు చెప్పే లోతైన పాయింట్ ఏంటంటే అసలు రిపేర్ చేయాల్సిన అవసరం రాకుండా చూసుకోవడమే నిజమైన జ్ఞానం.
(42:01) వివేకం అంటే ఇక్కడ నీ సక్సెస్ ని ఎన్నిసార్లు సారీ చెప్పావు అనే పాయింట్ తో కాకుండా ఎన్నిసార్లు సారీ చెప్పాల్సిన అవసరం రాలేదు అనే పాయింట్ తో కొలవడం. దీనివల్ల నీ ఫోకస్ మారుతుంది. తర్వాత సరి చేసుకుందాంలే అని కాకుండా ఇప్పుడే దీన్ని కాపాడుకుందాం అని నువ్వు ఆలోచిస్తావు. నీకు రియాక్ట్ అవ్వాలి అని అనిపించినప్పుడల్లా దాన్ని ఒక వార్నింగ్ లాగా చూడు ముందు పాజ్ ఇవ్వు మెల్లగా మాట్లాడు అది కూడా తక్కువ మాటలు ఉపయోగించు.
(42:28) ఎప్పుడైతే నువ్వు మనుషుల్ని గాయపరచడం తగ్గిస్తావో నీ రిలేషన్స్ ని పదే పదే ప్యాచ్ అప్ చేయాల్సిన అవసరం ఉండదు. రికవరీ అవ్వడం కంటే ప్రశాంతంగా ఉండటమే నీ డీఫాల్ట్ మోడ్ అయిపోతుంది. మన ఐడెంటిటీ మారినప్పుడే మన అలవాట్లు చాలా ఫాస్ట్ గా మారుతాయి. ఇక్కడ ఐడెంటిటీ అంటే నిన్ను నువ్వు ప్రతిదానికి కోప్పడే వ్యక్తిగా చూసుకుంటే నువ్వు అలాగే ప్రవర్తిస్తావు.
(42:47) విధురుడి మాటలు నీ మూడ్ గురించి కాకుండా నీ క్యారెక్టర్ గురించి చెప్తాయి. నేను ఏదైనా చేసే ముందు ఒక్క క్షణం ఆగుతాను అని నీకు నువ్వు చెప్పుకోవడం మొదలు పెడితే వివేకం స్థిరపడుతుంది. ఇది నీ మీద నీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ ఐడెంటిటీ నీకు ఒక కొత్త డీఫాల్ట్ సెట్టింగ్ ఇస్తుంది. ఎవరైనా నిన్ను ట్రిగర్ చేసినప్పుడు నీ మైండ్ రియాక్ట్ అవ్వాలా అని అడగదు.
(43:10) నేను ఎలా ఆగాలి అని అడుగుతుంది. ఆ మార్పు చాలా పెద్దది. ఇది నీ మీద ఉన్న కంట్రోల్ ని నీ కోపం నుంచి నీ సెల్ఫ్ ఇమేజ్ కి మళ్ళేస్తుంది. ఎమోషన్ కంటే సెల్ఫ్ ఇమేజ్ చాలా లోతైనది అని నువ్వు గుర్తిస్తావు. చాలా మంది మొదటి 10 సెకండ్లు ప్రశాంతంగా ఉండగలరు. కానీ ఆ తర్వాత ఎమోషన్ బయటక వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉండడానికి కూడా ఓపిక అవసరం.
(43:33) స్ట్రెస్ లో ఉన్నప్పుడు కూడా స్టెడీగా ఉండటాన్ని విధురుడు మంచిదని చెప్పాడు. చిన్న చిన్న ప్రాక్టీసెస్ ద్వారా మనం ఈ స్టామినాని బిల్డ్ చేసుకోవచ్చు. ఆ ఇబ్బందికరమైన ఫీలింగ్ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా కాసేపు దానితో ఉండటం నేర్చుకోవాలి. రిప్లై ఇవ్వాలనే ఆ తపన మధ్యలో ఆపాలనే ఆ కోరిక నీ పాయింట్ ప్రూవ్ చేసుకోవాలనే ఆతృత వాటన్నిటిని గమనిస్తూ అలా ఉండనివ్వు ఆ ఎమోషన్స్ కి లొంగిపోకుండా కూడా నువ్వు బ్రతకగలవు అనే ఒక కొత్త నిజాన్ని నీ నర్వస్ సిస్టం కి నేర్పించు మెల్లగా నీ ట్రిగర్స్ చిన్నవ అవుతూ ఉంటాయి. నీ రికవరీ ఫాస్ట్ అవుతుంది.
(44:07) ఎమోషన్స్ అంటే ఏదో పెద్ద ఎమర్జెన్సీ అన్న ఫీలింగ్ నీకు పోతుంది. నీ చుట్టూరా ఎప్పుడు ట్రిగర్స్ ఉంటే నువ్వు ఎంత తెలివైన వాడివైనా సరే ఏదో ఒక టైంలో రియాక్ట్ అయిపోతావు. మన చుట్టూరా ఉండే ఎన్విరన్మెంట్ కు ఉన్న ఇంపార్టెన్స్ విధురుడి కాలం వాళ్ళకు బాగా తెలుసు. అందుకే వాళ్ళు కొన్ని పద్ధతులు, హద్దులు పెట్టుకునేవారు.
(44:28) వివేకం అనే కాన్సెప్ట్ లో నీ డే ని ప్లాన్ చేసుకోవడం కూడా ఒక భాగమే. నీ నెర్వస్ సిస్టం మీద ఎప్పుడూ అటాక్ జరగకుండా చూసుకోవాలి. అవసరమైన గొడవలని తగ్గించుకో ఆకలిగా ఉన్నప్పుడు సీరియస్ విషయాలు మాట్లాడకు నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడే కష్టమైన విషయాల గురించి చర్చించు. ఎప్పుడు అలర్ట్ గా కాకుండా ఫోన్ కి దూరంగా ఉండే టైం పెట్టుకో. ఇది సిచువేషన్ నుంచి పారిపోవడం కాదు నీ మైండ్ ని కాపాడుకోవడం.
(44:53) అప్పుడే నిజంగా అవసరమైన చోట నువ్వు తెలివిగా రెస్పాండ్ అవ్వగలవు. ఒక ప్రశాంతమైన మైండ్ ని కాపాడుకోవడం చాలా ఈజీ. కానీ అది ఒక్కసారి ముక్కలయ్యాక మళ్ళీ బిల్డ్ చేయడం చాలా కష్టం. మనం గమనిస్తే నీ ఫోన్ నీ నెర్వస్ సిస్టం ని ఎప్పుడూ ఒక రకమైన కన్ఫ్యూజన్ లో ఉండేలా ట్రైన్ చేస్తుంది. ఏమి జరగకపోయినా సరే నువ్వు దేనికో దానికి రియాక్ట్ అవ్వడానికి రెడీగా ఉంటున్నావు.
(45:18) మెసేజెస్, రీల్స్, డిబేట్స్, నెగిటివ్ క్లిప్స్ ఇవన్నీ నీ మైండ్ ని వెంటనే రెస్పాండ్ అవ్వమని ఫోర్స్ చేస్తాయి. మన సెన్సెస్ మన మైండ్ ని మాటి మాటికి డిస్ట్రాక్ట్ చేస్తాయని విదురుడు అన్నాడు. ఇక్కడ నీ బాడీలోకి నువ్వు అనుమతించే ట్రిగర్స్ లెక్క తగ్గించుకోవడం ఇంపార్టెంట్. ఒక సింపుల్ ప్రాక్టీస్ ఏంటంటే సోషల్ మీడియా అండ్ డిఎంస్ కోసం రోజులో రెండు స్లాట్స్ మాత్రమే పెట్టుకో మిగతా టైం ఆఫ్లైన్ లో ఉండు.
(45:42) మొదట్లో ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ఇబ్బందే నీ పాత అలవాటు నిన్ను వదిలిపోతుంది అనడానికి ఒక గుర్తు ఎప్పుడైతే ఈ డిజిటల్ కేస్ తగ్గుతుందో నీలో నాచురల్ గా ఉండే ప్రశాంతత తిరిగి వస్తుంది. అప్పుడు రియల్ లైఫ్ సిచువేషన్స్ నీకు రియాక్ట్ అవ్వాల్సిన ఒక ఎమర్జెన్సీస్ లా అనిపించవు. చాలా మంది లైఫ్ టైం అంతటికీ ఒకేసారి మారిపోవాలని ట్రై చేసి ఒక్క వారంలోనే ఫెయిల్ అవుతారు.
(46:06) విధురుడి పద్ధతి ఎప్పుడూ నిలకడగానే ఉంటుంది తప్ప హడావిడిగా ఉండదు. ఒక చిన్న క్లియర్ కమిట్మెంట్ తోనే మనిషిలో వివేకం పెరుగుతుంది. ఇదొక 30 డేస్ ఛాలెంజ్ నువ్వు కేవలం ఒక్క విషయాన్ని మాత్రమే ట్రాక్ చెయ్ నీలో ఆవేశం పెరిగినప్పుడు నువ్వు ఎన్ని సార్లు రెస్పాండ్ అవ్వకుండా ఆగావు. నువ్వు ఎంత మంచిగా ఉన్నావు లేదా ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నావు అనేది ముఖ్యం కాదు.
(46:30) కేవలం ఆ గ్యాప్ ని క్రియేట్ చేశవా లేదా అన్నదే పాయింట్. కావాలంటే ఒక నోట్బుక్ లో ఒక చిన్న డాట్ పెట్టి కాసేపు దాన్నే చూస్తూ ఉండు. ఇది నీ అటెన్షన్ ని ట్రైన్ చేస్తుంది. దేన్నైతే నువ్వు ట్రాక్ చేస్తావో దాంట్లోనే నువ్వు ఇంప్రూవ్ అవుతావు. 10వ రోజుకల్ల నీ ట్రిగర్స్ ని నువ్వు ముందే గమనించడం మొదలు పెడతావు. 20 వ రోజు కల్ల ఆ గ్యాప్ పెరగడం నీకు తెలుస్తుంది.
(46:51) 30 వ రోజు కల్ల నువ్వు కష్టపడకుండానే ఆ పాజ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వడం ఆపేసినప్పుడు నీ లోపల ఒక విచిత్రమైన మార్పు జరుగుతుంది. నీకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఏదో బిగుసుకుపోయినట్టుగా ఉండదు. నిన్ను నువ్వు ఎప్పుడు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు అనిపిస్తుంది. విదురుడు చెప్పిన పాయింట్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ నీలో ఒక స్టెబిలిటీని ఇస్తుంది.
(47:14) ఆ స్టెబిలిటీ నీకు మంచి జడ్జ్మెంట్ ని ఇస్తుంది. వివేకం నీ ఎమోషన్స్ తో నీకున్న రిలేషన్ ని మార్చేస్తుంది. కోపం అనేది నీ ఐడెంటిటీ కాదు. అది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే అని నీకు అర్థంవుతుంది. బాధ అనేది నిన్ను ఎదురుదాడి చేయమని ఫోర్స్ చేయదు. నీ ఫీలింగ్స్ చూసి నువ్వు భయపడటం మానేస్తావ్. ఒక ఎమోషన్ నీలో రావచ్చు.
(47:36) కానీ దానికి యక్షన్ అవసరం లేదని నువ్వు వెంటనే నేర్చుకుంటావు. ఇది ఒక సైలెంట్ ఫ్రీడమ. నీ లైఫ్ ఇక మీదట నీ మూడ్ మీద ఆధారపడి ఉండదు. ఎప్పుడైతే మూడ్స్ నిన్ను కంట్రోల్ చేయడం ఆపేస్తాయో నీ ఛాయిసెస్ చాలా క్లియర్ గా ఉంటాయి. నువ్వు నీ రియాక్షన్స్ ని మార్చుకున్నప్పుడు నీ చుట్టూరా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ బిహేవియర్ ని మార్చుకుంటారు.
(47:57) వాళ్ళు నీతో ఇంకా నిజాయితీగా ఉంటారు. నీ దగ్గర చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతారు. నువ్వు ఎప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతావో అని భయపడటం మానేస్తారు. ఒక నిలకడైన మనిషి తన చుట్టూరా ఒక నిలకడైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడని విదురుడు అన్నాడు. వివేకం నిన్నొక నమ్మకమైన మనిషిలా మారుస్తుంది. నువ్వు ఎక్స్ప్లోడ్ అవ్వవని నువ్వు మాటలు వింటావని వాళ్ళకు అర్థంవుతుంది.
(48:17) ఆ సేఫ్టీనే నమ్మకంగా మారుతుంది. ఆ నమ్మకమే రిలేషన్స్ ని మరింత బలపరుస్తుంది. గొడవలు కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఎందుకంటే నిప్పుల్లో నడుస్తున్నట్టు అనిపించదు. ఆ ఒక్క క్షణం ఆగడం వల్ల వచ్చే రివార్డ్స్ లో ఇదొకటి. నువ్వు కేవలం నీ స్ట్రెస్ ని తగ్గించుకోవడమే కాదు నీ చుట్టూరా ఉన్న ఎమోషనల్ క్లైమేట్ ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నావ్.
(48:38) నువ్వు రియాక్ట్ అవ్వడం ఆపేసినప్పుడు నీకు ఒక కొత్త రకమైన పవర్ తెలుస్తుంది. అగ్రెసివ్ గా ఉండేది కాదు ఇది చాలా క్లీన్ గా ఉంటుంది. తన సొంత మైండ్ మీద కంట్రోల్ ఉండటమే అసలైన బలం అని విదురుడు అన్నాడు. వివేకం నీలో ఒక పవర్ షిఫ్ట్ ని తీసుకొస్తుంది. ఎందుకంటే బయట ప్రపంచం నిన్ను కంట్రోల్ చేయడం ఆగిపోతుంది. ఒక మనిషి నిన్ను అపోజ్ చేయొచ్చు నిన్ను అవమానించొచ్చు లేదా నిన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు.
(49:04) అయినా సరే నువ్వు నిన్ను కోల్పోవు. దాని అర్థం నువ్వు అన్నిటిని భరిస్తావని కాదు నువ్వు నీ రెస్పాన్సెస్ ని టైమింగ్ ని నువ్వు ఎంచుకుంటావని నువ్వు ఇచ్చే బలమైన స్టేట్మెంట్ ఎప్పుడైతే నువ్వు ఇలా ఎంచుకోగలవో అప్పుడు నువ్వు నీ ట్రిగర్స్ చేతిలో ఒక కీరు బొమ్మవి కావు నీ యాక్షన్స్ కి నువ్వే రచయితవు. మనం అబ్సర్వ్ చేస్తే తమని తాము ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడని వాళ్ళ మాటలకే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది.
(49:28) వాళ్ళు తక్కువ మాట్లాడతారు. కానీ ఆ మాటలు చాలా లోతుగా తగులుతాయి. విధురుడు నిగ్రహాన్ని ఒక గౌరవంగా వర్ణించాడు. వివేకం నీలో ఒక సైలెంట్ అథారిటీని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవ్వడం మానేసి నీ ఎనర్జీని కాపాడుకుంటావు. నువ్వు ఆగినప్పుడు ఈ మోమెంట్ నిన్ను కంట్రోల్ చేయలేదు అన్న విషయం ఎదుటి వాళ్ళకు అర్థంవుతుంది.
(49:52) అది నిన్ను ఇతరులు చూసే విధానాన్ని మార్చేస్తుంది. నీ దగ్గర నుండి కేవలం ఆవేశాన్ని కాకుండా క్లారిటీని ఆశిస్తారు. నువ్వు నో అని చెప్పినా సరే అది హార్ష్ గా కాకుండా ఖచ్చితంగా క్లియర్ గా ఉంటుంది. సైలెంట్ అథారిటీ అంటే ఎవరో ఒకరిని భయపెట్టడం కాదు. నువ్వు అంత ఈజీగా కన్ఫ్యూజన్ లో పడవని తెలిసినప్పుడు మనుషులు నిన్ను ఇంకాస్త జాగ్రత్తగా గౌరవంగా చూస్తారు.
(50:14) సాధారణంగా రిగ్రెట్ అనేది తొందరపడి మాట్లాడే మాటల వల్లే వస్తుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు ఆ సీన్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఛమెంట్ ని ఎడిట్ చేయగలిగితే బాగుండు అని అనిపిస్తుంది. విదురుడు మాటల గురించి చేసిన హెచ్చరిక నిజానికి ఇదే రిగ్రెట్ గురించి నీ ఎమోషన్ యాక్షన్ గా మారే స్పీడ్ ని తగ్గించడమే వివేకం. ఆ తర్వాత అది నీ రిగ్రెట్ ని కూడా తగ్గిస్తుంది.
(50:38) నువ్వు పాజ్ ఇచ్చినప్పుడు అసయించుకునే మాటలు నీ నోటి నుంచి రావు. తర్వాత డిలీట్ చేసే మెసేజెస్ నువ్వు పంపించవు. అంతా అయిపోయాక సారీ చెప్పాల్సిన సీన్స్ క్రియేట్ చేయవు. మళ్ళీ నిన్ను నువ్వు నమ్మడం మొదలు పెడతావు. ఈ సెల్ఫ్ ట్రస్ట్ చాలా ముఖ్యం. ఆవేశంలో ఉన్నప్పుడు కూడా నిన్ను నువ్వు మోసం చేసుకోవు అని నీకు తెలిస్తే నీ మైండ్ లో నువ్వు చాలా సేఫ్ గా ఫీల్ అవుతావు.
(50:59) మనమందరం ఎప్పుడూ వెంటనే రియాక్ట్ అవ్వాలని ట్రైన్ అవుతూ వచ్చాం. మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్స్ఏఐ అండ్ స్పీడ్ కల్చర్ వీటన్నిటి వల్ల ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వడమే బలమని మనం నమ్ముతూ వచ్చాం. విధురుడు ఇదే ప్రమాదాన్ని వేరే రూపంలో చూశాడు. మన సెన్సెస్ మన మైండ్ ని అగ్రెసివ్ ఎక్స్ప్రెషన్ వైపు లాగడం ఆ పాత ట్రైనింగ్ ని బ్రేక్ చేసి నీకు ఛాయిస్ ని ఇవ్వడమే ఇక్కడ మనం చేయాల్సిన పని.
(51:23) వీడియో మొదట్లో మనం అనుకున్న పాయింట్ కి అసలైన సమాధానం ఇదే. నీ ప్రాబ్లం యాంగర్ మేనేజ్మెంట్ కాదు. నీ క్యారెక్టర్ లో లోపం లేదు. నీ నర్వస్ సిస్టం కేవలం వేగాన్ని మాత్రమే నేర్చుకుంది. దీనికి సొల్యూషన్ దాన్ని బలవంతంగా ప్రశాంతంగా ఉంచడం కాదు ఆ గ్యాప్ ని మళ్ళీ బిల్డ్ చేసుకోవడం నువ్వు ప్రాక్టీస్ చేసే ప్రతి పాజ్ ఆ పాత అలవాటుని మార్చొచ్చు అనడానికి ఒక ప్రూఫ్ అవుతుంది.
(51:47) నువ్వు నీ రియాక్షన్స్ లో చిక్కుకు పోలేదు. కేవలం సరైన ట్రైనింగ్ తీసుకోలేదు. అంతే చాలా మంది ఎమోషనల్ కంట్రోల్ అంటే ఎమోషన్స్ ని అణచివేయడం అని అనుకుంటారు. అందుకే దానికి దూరంగా ఉంటారు. అది వినడానికి చాలా కోల్డ్ హార్టెడ్ నేచర్ లా అనిపిస్తుంది. కానీ విధురుడు చెప్పిన దాని ప్రకారం అదిఒక సెలెక్షన్ సప్రెషన్ కాదు. నువ్వు అన్నిటిని ఫీల్ అవుతావు.
(52:05) కానీ మొదటి అగ్రెషన్ అనే వేవ్ నీ బిహేవియర్ ని డిసైడ్ చేయకుండా చూసుకుంటావు. ఇక్కడే అసలైన మార్పు వస్తుంది. నీ ఎమోషన్ నిజమై ఉండొచ్చు. కానీ నీ రెస్పాన్స్ మాత్రం జ్ఞానం ఉన్నది అయి ఉండాలి. ఒక్కసారి ఇది నీకు అర్థమైతే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక పనిష్మెంట్ లా అనిపించదు. అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లా కనిపిస్తుంది.
(52:26) నిన్ను నువ్వు ఏదో కోల్పోయేలా చేసుకోవట్లేదు. ఒక టెంపరరీ ఎమోషన్ కోసం పెద్ద కాంపెన్సేషన్ చెల్లించకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు. లోకంలో బలమైన మనుషులు అంటే ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు అవసరమైనప్పుడు క్లారిటీతో ఉండేవాళ్ళు. మిధురుడు నేర్పించిన విషయాలన్నిటిలోనూ మనకి ఒకటే పాయింట్ కామన్ గా కనిపిస్తుంది. జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడూ ఒక పాజ్ ఇస్తాడు.
(52:47) ఆ పాజే ఇక్కడ వివేకం అంతేకాదు అది నీకు నిజంగా విలువైనది ఏంటో గుర్తు చేసుకునే గ్యాప్ నీ రిలేషన్స్ నీ రెస్పెక్ట్ నీ మెంటల్ పీస్ వీటన్నిటిని కాపాడుకునే చోటు అదే. అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆ పాజ్ అనేది ఒక ఎంటీ స్పేస్ కాదు నీ లైఫ్ ని డిసైడ్ చేసే డ్యూరేషన్. నీ ఫ్యూచర్ క్వాలిటీ అనేది మనకు కనిపించని ఆ ఐదు సెకండ్ల మీద ఆధారపడి ఉంటుంది.
(53:13) ఎప్పుడైతే నువ్వు ఆ ఐదు సెకండ్స్ ని గెలుస్తావో నువ్వు కేవలం కోపాన్ని మాత్రమే కాదు నీ లైఫ్ వెళ్లే డైరెక్షన్ ని కూడా కంట్రోల్ చేస్తావు. సో ఆ ఐదు సెకండ్ల గ్యాప్ తీసుకోవడానికి నువ్వు సిద్ధమైనా నువ్వు తీసుకోగలని అనుకుంటున్నావా? ఒకవేళ చేయగలవు అనిపిస్తే ఎస్ అని కామెంట్ చెయ్. అది ఫ్రెండ్స్ ఇవాల్టి ఆడియో పాడ్కాస్ట్. మరొక ఎపిసోడ్ తో మరొక ప్రాబ్లం ని ఎక్స్ప్లోర్ చేసి దానికి సొల్యూషన్స్ కూడా ఇలాగే తెలుసుకుందాం.
No comments:
Post a Comment