భగవద్గీత చెప్పిన అసలైన మైండ్ సైకాలజీ! | Anger management explained in Bhagavadgita
Author Name:svpr-telugu-talks
Youtube Channel Url:https://www.youtube.com/@svpr-telugu-talks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=1G6EM9Zmsbo
Transcript:
(00:00) మిత్రమా ఒక్క నిమిషం కోపంతో మీ బంధాలను కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారా? ఈ కోపాన్ని అడ్డుకోవడానికి 5వేల ఏళ్ల క్రితమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు [సంగీతం] చెప్పిన ఆ ఒక్క సింపుల్ మైండ్ ట్రిక్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. భగవద్గీత సాంఖ్య యోగంలో శ్రీకృష్ణుడు [సంగీతం] పరమాద్భుతమైన సైకలాజికల్ శ్లోకాలు చెప్పారు.
(00:30) ధ్యాయతో విషయాన్ పుంసః [సంగీతం] సంగస్తే శూపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే దీని అర్థం ఏంటో తెలుసా మనకు కోపం అనేది [సంగీతం] డైరెక్ట్ గా రాదు దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. మొదటి స్టెప్ ఒక వస్తువు గురించో ఒక మనిషి గురించో లేదా ఒక పొజిషన్ గురించో మనం నిరంతరం ఆలోచించడం మొదలు పెడతాం. ధ్యాయతో విషయాన్ రెండో స్టెప్పు ఆ ఆలోచన కాస్త ఆ వస్తువుపై విపరీతమైన అటాచ్మెంట్ లేదా బంధంగా మారుతుంది.
(01:06) [సంగీతం] సంఘస్తేపజాయతే మూడో స్టెప్పు ఆ బంధం నుండి బలమైన కోరిక పుడుతుంది. ఇది నాకే దక్కాలి నా మాటే నెగ్గాలి అనే ఈగో లేదా కామం పుడుతుంది. కామాత్ క్రోధోభిజాయతే ఇప్పుడు అసలైన ట్విస్ట్ వస్తుంది. ఎప్పుడైతే మనం అనుకున్న ఆ కోరికకు మన మాటకు అవతలి [సంగీతం] వ్యక్తి నుండి లేదా మన పరిస్థితి నుండి ఒక అడ్డంకి వస్తుందో అక్కడ పుడుతుంది క్రోధం అంటే కోపం అంటే [సంగీతం] మీ కోపానికి కారణం అవతలి వ్యక్తి కాదు మీ లోపల ఉన్న విపరీతమైన కోరిక [సంగీతం] మరియు ఈగో మాత్రమే కోపం వచ్చిన తర్వాత మనిషి ఎలా నాశనం అవుతాడో శ్రీకృష్ణుడు తరువాతి శ్లోకంలో [సంగీతం] చెప్పారు. క్రోధాత్భవతి సమ్మోహః సమ్మోహాత్
(01:51) స్మృతి విభ్రమః స్మృతిభ్రంషాత్ బుద్ధినాషో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఇది ఒక [సంగీతం] సైకలాజికల్ చైన్ రియాక్షన్ కోపం రాగానే మనిషికి మొదట వచ్చేది సమ్మోహం అంటే మైండ్ బ్లాక్ అయిపోవడం ఏది తప్పు ఏది రైట్ అనే విచక్షణ కోల్పోవడం ఆ విచక్షణ కోల్పోవడం వల్ల స్మృతి విభ్రమం జరుగుతుంది. అంటే అవతలి వ్యక్తి మనకు గతంలో చేసిన మంచి ఏంటి? మన పెంపకం ఏంటి? మన [సంగీతం] సంస్కారం ఏంటి? అనే పాత విషయాలన్నీ మర్చిపోతాం.
(02:26) ఎప్పుడైతే ఆ స్మృతి పోతుందో వెంటనే బుద్ధినాశనం జరుగుతుంది. బుద్ధి అంటే డెసిషన్ మేకింగ్ పవర్ అది పూర్తిగా నాశనం అయిపోతుంది. బుద్ధినాశనమైన మనిషి నోరు పారేసుకుంటాడు. [సంగీతం] తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. చివరికి ప్రణశ్యతి అంటే సమాజంలో తన గౌరవాన్ని [సంగీతం] తన కెరియర్ ని ప్రశాంతతను కోల్పోయి సర్వనాశనం అయపోతాడు. ఒక్కసారి ఆలోచించండి ఆఫీస్ లో బాస్ ఏదో అన్నాడని కోపంతో రిజైన్ చేయడం లేదా భార్యా భర్తల మధ్య చిన్న [సంగీతం] గొడవకు కోపంతో విడాకుల వరకు వెళ్ళడం ఇవన్నీ ఈ బుద్ధినాశం వల్లి జరుగుతున్నాయి.
(03:03) మరి దీనికి శ్రీకృష్ణుడు చెప్పిన సింపుల్ సొల్యూషన్ ఏంటి? సాక్షిగా [సంగీతం] నీ బాధ్యత నువ్వు చెయ్ అంటారు. ఈ సాక్షి అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను వినండి. మీరు [సంగీతం] క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు అక్కడుండే అంపైర్ ని గమనించారా? మ్యాచ్ లో [సంగీతం] ఏ టీం గెలిచినా ఏ ప్లేయర్ అవుట్ అయినా అంపైర్ కి ఎలాంటి నష్టం లేదు.
(03:27) అతను ఏ టీం వైపో నిలబడి ఎమోషనల్ అవ్వడు. [సంగీతం] అతని పని ఏంటి? కేవలం బాల్ ని వికెట్ ని ఒక సాక్షిలా గమనించడం [సంగీతం] ఏది కరెక్టో ఆ డెసిషన్ ఇవ్వడం అంతే మన జీవితంలో కూడా మనం ఇలాగే ఒక అంపైర్ లా మారాలి. ఇప్పుడు ఆఫీస్ లో మీ బాస్ మిమ్మల్ని పిలిచి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు అనుకుందాం. మీ బాధ్యత ఏంటి? ఆ ప్రాజెక్ట్ ని 100% [సంగీతం] పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేయడం. కానీ మనమేం చేస్తాం.
(03:57) ఈ ప్రాజెక్ట్ అయిపోయాక బాస్ నన్ను మెచ్చుకోవాలి. [సంగీతం] అందరిలో నాకే గ్రేట్ పేరు రావాలి అని ఒక విపరీతమైన కోరికను [సంగీతం] ఆ పనికి ముడిపెట్టేస్తాం. తీరా ప్రాజెక్ట్ అయ్యాక బాస్ మెచ్చుకోకపోగా [సంగీతం] ఇంకేదో తప్పు పడితే వెంటనే మనకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. [సంగీతం] ఎందుకంటే అక్కడ మన కోరిక మన ఈగో దెబ్బ తిన్నాయి.
(04:17) అదే మీరు అంపైర్లా [సంగీతం] ఆలోచిస్తే నా బాధ్యత పని చేయడం నేను చేశాను. బాస్ మూడ్ బాలేక తిట్టాడా అది అతని సమస్య నా తప్పు కాదు అని కూల్ గా వదిలేస్తారు. మిత్రమా భార్యా భర్తల [సంగీతం] మధ్య గాని ఫ్రెండ్స్ మధ్య గాని అవతలి వాళ్ళు ఏదైనా అన్నప్పుడు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోయి మీ బుద్ధిని నాశనం చేసుకోకండి. ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండి ఒక థర్డ్ పర్సన్ లా ఒక అంపైర్ లా మీ జీవితాన్ని దూరం నుండి గమనించండి.
(04:47) ఎప్పుడైతే [సంగీతం] నా మాటే నెగ్గాలి అనే పట్టుదలను వదిలేస్తారో అప్పుడు మీ మైండ్ లో కోపం [సంగీతం] అనే విత్తనమే పడదు. ఇదే మీ మైండ్ కి అసలైన స్ట్రాటజిక్ ఆర్మర్ ఈ గీత ఉపదేశం మీ మనసుకు ప్రశాంతతను ఇస్తే [సంగీతం] ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మైండ్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోండి.
No comments:
Post a Comment