Sunday, July 12, 2026



PRATIKULA VEDAM
9 hours ago
⁉️ఒక సామాన్య పౌరుడిగా, ఈ రాష్ట్ర యంత్రాంగం మీద గౌరవంతో, నాకున్న కొన్ని fundamental doubts ని ప్రభుత్వానికి 3 ప్రశ్నలుగా అడుగుతున్నాను. ఇది విమర్శ కాదు, మన democracy ఎటువైపు వెళ్తుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న dissection.

🟡Question 1: 
రాజకీయాల్లో Power అనేది ఒక పెండ్యులం లాంటిది. ఈరోజు మీ వైపు ఉంది, రేపు ఇంకోవైపు వెళ్తుంది. వ్యక్తిగత దూషణలు, డిజిటల్ ట్రోలింగ్ లాంటి వాటికి, ఏకంగా టెర్రరిస్టుల మీద వాడే UAPA చట్టాన్ని వాడటం ద్వారా.. రేపు రాబోయే ప్రభుత్వాలకు మీరే ఒక "లీగల్ బ్లూప్రింట్" ని గిఫ్ట్ గా ఇస్తున్నారు కదా? రేపు పవర్ మారినప్పుడు, ఇదే ఆయుధం మీ కార్యకర్తల మెడకు చుట్టుకోదా?

🟡Question 2:
ఒకవేళ అతని మీద వస్తున్న బ్లాక్ మెయిల్, అశ్లీల వీడియోల ఆరోపణలు నిజమే అయితే.. దానికి సంబంధించిన కఠినమైన క్రిమినల్ చట్టాలు మన దగ్గర చాలా ఉన్నాయి. కానీ, కోర్టులో ఫోరెన్సిక్ రిపోర్ట్ తో ఆ నేరం రుజువు కాకముందే, ఆ లీక్స్ ని మీడియాకి వదిలి ఒక Character Assassination గేమ్ ఆడటం దేనికి సంకేతం? సిస్టం ఎప్పుడూ 'న్యాయం' చేయాలి కానీ, పగబట్టిన వ్యక్తిలాగా 'కక్ష సాధింపు' కి దిగకూడదు కదా?

🟡Question 3:
ఈ మొత్తం ఎపిసోడ్ లో నన్ను ఆశ్చర్యపరిచిన విషయం.. మన Police వ్యవస్థ చూపించిన అద్భుతమైన efficiency. ఒక చిన్న YouTuber ని పట్టుకోవడానికి వివిధ జిల్లాల పోలీసులు చూపించిన సమన్వయం, వేగం నిజంగా అమోఘం. మరి నా ప్రశ్న ఏంటంటే.. ఒక వ్యక్తి అహంకారాన్ని దెబ్బతీసిన వాడి మీద చూపించిన ఈ efficiency, రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద, డ్రగ్స్ మాఫియా మీద, నిజమైన క్రైమ్స్ మీద ఎందుకు చూపించలేకపోతున్నాం? ఇదే స్పీడ్ తో మన సిస్టం పనిచేస్తే, ఆంధ్రప్రదేశ్ ఈపాటికి, క్రైమ్-ఫ్రీ స్టేట్ అయిపోవాలి కదా! వాట్ ఈజ్ ద మిస్సింగ్ లాజిక్ హియర్?

ప్రశ్న రావణ్ Supporters కి కూడా నా 3  ప్రశ్నలు:

🔴Question 1:
"అన్నా నువ్వు తోపు అన్నా, ఎవ్వడికీ భయపడకు, మేమున్నాం" అని రెచ్చగొట్టి, అతన్ని ఒక డిజిటల్ గ్లాడియేటర్ ని చేసి రింగ్ లోకి తోశారు. అతను ఎమోషన్ తో కంట్రోల్ తప్పి బూతులు మాట్లాడుతుంటే, మీలో ఉన్నSadistic pleasure కి ఫుడ్ దొరికిందని చప్పట్లు కొట్టారు. ఇప్పుడు అతను జైల్లో ఉంటే, మీలో ఏ ఒక్కడైనా వెళ్లి బెయిల్ కట్టాడా? అతని ఫ్యామిలీకి అండగా నిలబడ్డాడా? అతని కెరీర్ నాశనం అయిపోతే.. మీకు అది కేవలం ఒకరోజు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కదా?

🔴Question 2:
సిస్టం ని ప్రశ్నించడం, తప్పులని ఎత్తిచూపడం హక్కు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ  లాజికల్ గా, ఫిలాసఫికల్ గా సిస్టం ని లాక్ చేయడం ఒక పద్ధతి. దానికి భిన్నంగా, వ్యూస్ కోసం, అటెన్షన్ కోసం ఒక వీధి రౌడీ లాగా పర్సనల్ అబ్యూజ్ కి దిగడాన్ని మీరు Intellectual Revolution అని ఎలా భ్రమ పడుతున్నారు? ప్రశ్నించే వాడికి పదునైన మెదడు ఉండాలి కానీ, అదుపు తప్పిన నాలుక కాదు.

🔴Question 3:
ఒకవేళ రేపు పొద్దున యూట్యూబ్ అల్గారిథం మారిపోయి, ఇంకొకడు ఇంతకంటే దారుణంగా సిస్టం ని తిడుతూ వీడియోలు పెడితే.. మీలో 90% మంది సైలెంట్ గా వాడి ఛానెల్ కి షిఫ్ట్ అయిపోతారు. అవునా కాదా? నిజంగా మీకు సమాజం మారాలనే కోరిక ఉందా? లేక, మీకు నచ్చని వాళ్ళని ఎవరో ఒకరు పబ్లిక్ గా బూతులు తిడుతుంటే చూసి ఎంజాయ్ చేసే చీప్ డోపమైన్ కి బానిసలు అయ్యారా?

Final Thought:
ఎమోషన్ ని ఆయుధంగా వాడితే, చివరికి నువ్వే ఆ ఆయుధానికి బలవుతావు. సిస్టం తో ఫైట్ చేయాలి అనుకున్నప్పుడు నీకు కావాల్సింది పిచ్చి ఆవేశం కాదు.. పర్ఫెక్ట్ స్ట్రాటజీ.
16

No comments:

Post a Comment