ఈ ప్రపంచం నీ మైండ్‌తో ఆడుకుంటోంది! | Beware Cognitive Trap | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Eg581h0Np8U
Transcript:
(00:01) [సంగీతం] ఉదయం లేవగానే మొదటి 60 సెకండ్లలో మీరు చేసే పనిఏంటో తెలుసా కళ్ళు తెరవకముందే చెయ్యి ఫోన్ వైపు వెళ్తుంది. స్క్రీన్ వెలుగుతుంది. వందల నోటిఫికేషన్లు ఎవడో తిట్టుకున్న గొడవలు ఎవడో విడాకుల డ్రామా ఇంకెవరిదో ఫేక్ లగ్జరీ లైఫ్ ఇన్ని ఒక్కసారిగా మీ మైండ్ లోకి డంప్ అవుతాయి. మనం తినే ప్లేట్లో చిన్న పురుగు కనిపిస్తేనే అసహించుకొని ఆ ఫుడ్ పారేస్తాం కదా మరి రోజు ఉదయాన్నే మన మెదడులోకి ఇంత చెత్తని ఇంత విషాన్ని ఎలా ఎక్కించుకుంటున్నారు శరీరానికి ఇచ్చే చెత్త ఫుడ్ ని గుర్తించే మీరు మెదడుకి ఇస్తున్న ఈ సైలెంట్ పాయిజన్ ని ఎందుకు పట్టించుకోవట్లేదు నిజం ఏంటంటే ఆధునిక
(00:42) ప్రపంచంలో మనుషులు ఆకలితో చావట్లేదు. మెంటల్ మాల్ న్యూట్రిషన్ తో లోపల కుళ్లిపోతున్నారు. మీకు రోజు నిద్ర సరిపోదు ఎప్పుడు ఏదో తెలియని ఆందోళన ఎవరితో మాట్లాడినా చిరాకు చేతిలో ఎంత డబ్బు ఉన్నా ఎంత కంఫర్ట్ ఉన్నా లోపల ఏదో తెలియని భయం ఎందుకో తెలుసా మీరు ఒక ఇన్ఫర్మేషన్ జంకీ అయిపోయారు. బయట జరుగుతున్న ప్రతి చెత్త మీ మైండ్ లోకి చేరి మీలోని ప్రశాంతతని చంపేస్తుంది.
(01:08) గొప్ప యోగి లాహరి మహసేయులు వారు సంసార జీవితంలో ఉంటూనే ఒక లోతైన నిజాన్ని పదే పదే గుర్తు చేశారు. బయట ప్రపంచపు శబ్దాలని మీ లోపలికి రాణిస్తే మీ ఆత్మ తన అసలైన రాగాన్ని కోల్పోతుంది. ఆయన చెప్పిన ఈ చిన్న మాట వెనుక ఎంత భయంకరమైన సత్యం దాగుందో ఎప్పుడైనా ఆలోచించారా లాహిరి మహాశయులు వారు ప్రపంచానికి నేర్పిన అతి పెద్ద పాఠం ఏంటంటే మనం చూసేది వినేది కేవలం మన కళ్ళ ముందు మాత్రమే ఆగదు.
(01:37) అది మన ప్రాణాన్ని మన శ్వాసని మన ఆలోచన తీరుని శాసిస్తుంది. కానీ ఈ రోజుల్లో సమాజం మనల్ని ఒక ట్రాప్ లో పడేసింది. మీ ఆలోచనలు నిజంగా మీవే అనుకుంటున్నారా కాదు మీరు దేనిని చూస్తున్నారో దేనిని వింటున్నారో మీ చుట్టూ ఉన్న ఆల్గోరిథమ్స్ మీ మైండ్ లోకి దేనిని నెడుతున్నాయో దాని ప్రతిరూపమే మీ ప్రస్తుత ఆలోచనలు. ఈ విషయాన్ని గుర్తించకపోతే మీరు బ్రతుకుతున్న జీవితం మీది కాదు.
(02:06) సమాజం రాసిన ఒక స్క్రిప్ట్ మాత్రమే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? మీరు ఎప్పుడైనా గమనించారా రోడ్డు మీద ఏదైనా యక్సిడెంట్ జరిగితే జనం సహాయం చేయడానికి కాకపోయినా ఎగబడి చూడటానికి మాత్రం క్షణాల్లో గుమ్ముకొడతారు. ఎందుకు ఎందుకంటే మనిషి మెదడు ఎప్పుడూ నెగిటివిటీని ప్రమాదాలని అశాంతిని వెతుక్కుంటూ ఉంటుంది. మన మెదడులోని బలహీనతనే ఈరోజు సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు.
(02:29) అవన్నీ కలిసి మీ బలహీనతని వ్యాపారంగా మార్చేసుకుంటున్నాయి. మీ భయాన్ని మీ అసూయని అమ్ముకుంటూ వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు. కానీ పోయేది మాత్రం మీ మానసిక ఆరోగ్యం. లహరి మహసేలు వారు ఒక అద్భుతమైన నిజాన్ని చెప్పారు. మనిషి ఎప్పుడైతే బాహ్య విషయాల వేటలో పడతాడో అప్పుడు అతని శ్వాస వేగవంతమై తన మనసు మాత్రం స్థిరత్వాన్ని కోల్పోతుంది అని.
(02:53) ఆయన చెప్పినట్లుగానే మనం నిరంతరం ఫోన్ స్క్రోల్ చేస్తూ ఎదుటివాడి లైఫ్ తో మనల్ని పోల్చుకుంటూ ఉన్నప్పుడు మన నాడీ వ్యవస్థ మొత్తం ఒక నిరంతర యుద్ధంలోకి వెళ్ళిపోతుంది. మీ శరీరంలో అడ్రినలిన్ కార్టిసాల్ రసాయనాలు నిండిపోతున్నాయి. ఫలితం ఏ పని మీద శ్రద్ధ ఉండదు. పక్కనున్న మనుషులంటే ప్రేమ ఉండదు. చివరికి మీరంటేనే గౌరవం లేకుండా పోతుంది. ఈ సమస్య ఎందుకు ఇంతగా ముదిరిపోతుందో తెలుసా? మనం రోజు స్నానం చేస్తాం.
(03:20) ఒంటి మీద మురికిపోవడానికి మంచి బట్టలు వేసుకుంటాం అందంగా కనిపించడానికి కానీ మెదడు లోపల పేరుకుపోతున్న చెత్తని కడగడానికి మాత్రం ఎలాంటి పద్ధతిని ఫాలో అవ్వం. లాహరి మహాశయుల వారు గృహస్తులుగానే ఉంటూనే ఉద్యోగం చేస్తూనే పరమ ప్రశాంతతని ఎలా పొందారో తెలుసా? ఆయన ఎప్పుడూ మనసని ఇంటి తలుపులను ప్రతి పిచ్చి ఆలోచనలకు ప్రతి పనికిమాలిన శబ్దానికి తెరవలేదు.
(03:43) కానీ మనం ఏం చేస్తున్నాం ప్రతి పని పాట లేని వాడు వేసే కామెంట్స్ కి మనసు తాకట్టు పెడుతున్నాం. ఈరోజు సమాజం నిండా కనిపిస్తున్న డిప్రెషన్ అవ్వచ్చు, యంజైటీలు అవ్వచ్చు వీటన్నిటికీ అసలు కారణం ఇదే. లోపల వివేకం కంటే బయట శబ్దాలకే మనం ఎక్కువగా బానిసలమైపోతున్నాం. సరే ఇదంతా బాగానే ఉంది. మరి ఈ సమస్యని ఎలా అధిగమించాలి అంటే మనం చాలాసార్లు అనుకుంటాం.
(04:07) నేను ఎక్కడో హిమాలయాలకో అడవులకో పారిపోతే తప్ప నాకు మనశశాంతి దొరకదు అని. కానీ లహరి మహసేలు వారు వారి జీవితాన్ని చూస్తే ఆ ఆలోచన ఎంత అమాయకమైందో మనకు అర్థంవుతుంది. ఆయన ఎక్కడికి పారిపోలేదు కుటుంబాన్ని వదిలేయలేదు. మిలిటరీ అకౌంట్స్ ఆఫీస్ లో రోజు క్లర్క్ గా వేల ఫైల్ రాస్తూనే సాధారణ జీతం తీసుకుంటూనే లోపల ఒక ప్రశాంతవంతమైన నిశశబ్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు.
(04:31) ఆయన ఎప్పుడూ చెప్పేవారు సంసారంలో ఉండడం తప్పు కాదు సంసారం నీ మనసులో ఉండటమే అసలైన బంధనం. అంటే సమస్య ప్రపంచంలో లేదు. ప్రపంచాన్ని మీ లోపలికి ఎలా రాణిస్తున్నారు అనే దానిపైనే మీ జీవితం ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని ప్రాక్టికల్ గా అధిగమించాలంటే మీరు వెంటనే మూడు విషయాలు చేయాలి. మొదటిది ఇన్ఫర్మేషన్ ఉపవాసం. రోజు శరీరానికి ఎలాగైతే విశ్రాంతిని ఇస్తారో మెదడుకి కూడా డిజిటల్ ఫాస్టింగ్ ఇవ్వాలి.
(04:59) ఉదయం లేచిన మొదటి గంట రాత్రి పడుకునే ముందు అరగంట మీ చేతిలో ఫోన్ ఉండకూడదు. ఆ సమయంలో మీ మైండ్ లోకి బయట వ్యక్తుల ఆలోచనలు రాకూడదు. రెండవది శ్వాస పై అవగాహన లాహిర మహాసేయులు వారి తాత్విక బోధనల ప్రకారం మన ఆలోచనలకు మన శ్వాస తీరుకు విడదీరాని సంబంధం ఉంది. మీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు మీ శ్వాస వేగంగా అస్థిరంగా మారుతుంది.
(05:25) ఆ క్షణంలో కాసేపు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ నిశశబ్దంగా ఉండడం నేర్చుకోండి. మూడవది రియాక్షన్ ఆడిట్ ఎవరైనా మిమ్మల్ని తిట్టగానే లేదా ఒక ఊహించని సమస్య రాగానే తక్షణ కోపంతోనో భయంతోనో రియాక్ట్ అవ్వకండి. ఒక చిన్న పాజి ఇవ్వ అండి లహరి మహసేయులు వారు శిష్యులకు నిత్యం గుర్తు చేసే ఒక అద్భుతమైన సూత్రం ఉంది. కర్తవ్యాన్ని నిష్కామంగా చేయండి.
(05:50) కానీ దాని ఫలితానికి లేదా ఇతరుల స్పందనకి బానిసలు కాకండి. ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే ఎదుటివాడి కోపం మీ ప్రశాంతతను నాశనం చేయలేదు. అందులోనూ మీ ప్రశాంతత మీ కంట్రోల్ లో మీ చేతుల్లోనే ఉంటుంది. సరే ఇదంతా బానే ఉంది. మరి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అంటే మాత్రం మనం చాలా మందిమి జీవితంలో ఏదో సాధించాలని చెప్పేసి పరిగెడుతూ ఉంటాం.
(06:14) మరింత డబ్బు మరింత పేరు సమాజంలో మరింత గుర్తింపు కానీ ఇవన్నీ దక్కినా కూడా రాత్రి పడుకునేటప్పుడు కంట్లో కన్నీళ్లు గుండెలో ఏదో తెలియని భారం ఎందుకు ఉంటుందో తెలుసా ఎందుకంటే మనం బయట ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించాం కానీ మన లోపల ఉన్న మనసుని గెలవలేదు. లహరి మాజీలు వారు ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని అందించారు. లోపల నిశశబ్దం లేని మనిషికి ప్రపంచంలోని ఏ ఐశ్వర్యము శాంతిని ఇవ్వలేదు అని లోపల స్థిరత్వం ఉన్నవాడికి ఈ ప్రపంచంలో ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే అతన్ని కదిలించలేవు.
(06:48) జీవితాన్ని నిజంగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు ఒక పవిత్రమైన నియమాన్ని పాటించాలి. రోజు కనీసం 15 నిమిషాలు ఏ శబ్దాలు ఏ మనుషులు లేని ఏకాంతంలో కూర్చోండి. మీ మనసులోకి వచ్చే ఆలోచనలను ఒక సాక్షిలా గమనించండి. లహరీ మహసేలు వారి మార్గంలో అత్యంత ముఖ్యమైన సూత్రం ఆత్మ విచారణ. నేను ఎవరిని నేను రోజు చేస్తున్న ఈ పనులు నా అంతరాత్మ కోసం చేస్తున్నానా? లేక పక్కవాడికి చూపించుకోవడానికి చేస్తున్నానా? ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్.
(07:19) ఎందుకంటే మనుషులందరూ అవతల వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి అవతల వాళ్ళ కన్నా ఎక్కువ సంపాదించడానికి అవతల వాళ్ళ కన్నా ఎక్కువగా ఆనందంగా ఉన్నాను అని చెప్పి నిరూపించుకోవడానికి తాపత్రయ పడతారు కానీ అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్లకు తెలియదు వాళ్ళకి ఎందులో ఆనందం దొరుకుతుందో కూడా తెలియదు. బట్ అలాంటి స్టేజ్ కి మాత్రం ఎవ్వరూ వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళితే మాత్రం కచ్చితంగా ఆ స్టేజ్ నుంచి బయటక వచ్చేయాలి.
(07:43) ఎందుకంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా ఉంటుంది. ఉదాహరణకి ప్రతి ఒక్క మనిషి చేతి వేలు ముద్రలు ఎంత యూనిక్ గా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ప్రతి మనిషికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఎలా ఉంటుందో అలాగే ప్రతి ఒక్క మనిషి యొక్క లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మనం అవతలి వాళ్ళలా ఉండటానికి ప్రయత్నించినంత కాలం మన జీవితాన్ని మనం నరకంగా మార్చుకున్నట్లే కాబట్టి నేను ఎవరిని నేను రోజూ చేస్తున్న ఈ పనులు నా అంతరాత్మ కోసం చేస్తున్నానా లేక పక్క వాడికి చూపించుకోవడానికి చేస్తున్నానా అని మిమ్మల్ని మీరు నిర్భయంగా ప్రశ్నించుకోండి. ఆ నిజాయితీ గల ప్రశ్న
(08:20) మిమ్మల్ని సమాజం సృష్టించిన భ్రమల నుంచి క్షణాల్లో బయటకు లాగుతుంది. గుర్తుంచుకోండి మీ ఇంటి తలుపులు ఎలాగైతే ఎవరికి పడితే వారికి తెరవరో మీ మెదడు తలుపులు కూడా ప్రతి పనికి మాలిన సమాచారానికి తెరవకండి. దేనికి స్పందించాలో దేనిని పూర్తిగా విడిచిపెట్టాలో తెలిసిన రోజే మీకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మీ అంతరంగంలో స్థిరంగా ఉండటమే నిజమైన విజయం.
(08:46) ఈరోజే ఆ నిర్ణయం తీసుకోండి. మీ జీవితాన్ని నడిపించేది బయట ప్రపంచపు అశాంతి కాదు మీ అంతరంగపు వివేకం కాబట్టి మీ అంతరంగం చెప్పిన మాట వినండి. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్. [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment