అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా పెళ్లి వద్దు అంటున్నారు, కారణాలు ఇస్తున్నాను చూడండి
Author Name:Chinna Maata
Youtube Channel Url:https://www.youtube.com/@chinnamaataa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=wIKVqZVLGio
Transcript:
(00:00) అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు పాతికేళ్ళ వచ్చినా 30 ఏళ్ళ వచ్చినా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు లేదండి బానే చేసుకుంటున్నారు కదా అని మీలో కొంతమంది అన్నా చాలామంది ఒప్పుకుంటారు 30 ఏళ్ళ వచ్చినా గాని పెళ్లి చేసుకోవట్లేదండి ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం కంటే ఆల్జీబ్రా అర్థం చేసుకోవడం ఈజీ అని అరబిక్ అర్థం చేసుకోవడం ఈజీ అని ఇలాంటి డైలాగులు పేలుతూ ఉంటాయి కదండీ కానీ మొన్న మధ్య ఒక వీడియో చేశాను అబ్బాయిలు పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఎందుకు ఆలోచిస్తున్నారు ఏం భయపడుతున్నారు అని ఇప్పటికీ మీలో చాలా
(00:33) మంది చూస్తున్నారండి. అమ్మాయిలు ఎందుకు చేసుకోవట్లేదు కూడా అర్థంఅయితే అప్పుడు పెళ్లిళ్లు ఎందుకు అవ్వట్లేదు అనేది ఓవరాల్ గా తెలుస్తది అంటే సమాజం పోకడ ఎలా ఉంది సమాజం ఎటు వెళ్తుంది చాలా పరిస్థితులు వస్తూ ఉంటాయి కదండీ సామాజిక ఆర్థిక పరిస్థితులు కారణం చూపిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఒకప్పుడంటే 100 ఏళ్లకి 50 ఏళ్లకి పరిస్థితులు మారుతూ ఉండేయి ఇప్పుడు వెంటనే ఐదు 10 ఏళ్లకే మార్పు వచ్చేస్తుందండి.
(01:01) అమెరికాలో అయితే ఫేమస్ స్టడీస్ే అమెరికాలో అయితే ఆల్మోస్ట్ ఆల్ 50% మంది పెళ్లి చేసుకుంటే బెటరా ఒంటరిగా ఉంటే బెటరా ఏం బెటర్ అనుకుంటున్నారు మీరు అంటే 50% మంది ఉమెన్సే ఎందుకంటే బాబు పెళ్లి హాయిగా ఒంటరిగా ఉండటం బెటర్ అంటున్నారండి మనకి ఆ రేంజ్లో కాదు గానీ మనళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు 25% అండి రీసెంట్ గా హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక సర్వే చేస్తే 25% చేసుకోవడానికి ఇష్టపడట్లేదు మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితికి కారణాలు ఏంటి అనేది ఆలోచిస్తే మనకి పిల్లలు ఎందుకు దొరకట్లేదు మగపిల్లాకి అంటే మగపిల్లలకి ఆడపిల్లలు ఎందుకు దొరకట్లేదు కూడా అర్థం
(01:39) చేసుకోవచ్చండి అంటే మరి వాళ్ళు పెళ్లి చేసుకోను అంటే బలవంతంగా ఏం చేసుకోలేము కదా సరే కారణాలు ఏంటి అనేది చూద్దాం. మీ ఒపీనియన్ చాలా చాలా అవసరం అండి ఇక్కడ ఎందుకు మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా అవసరం మీ కామెంట్స్ కూడా చాలా మంది చదువుతున్నారు నేను కూడా చదువుతాను కాబట్టి ఇక్కడ నెంబర్ వన్ వచ్చి అంటే నాకు అనిపించింది సర్వే చెప్తుంది కూడా ఆర్థిక స్వాతంత్రం అండి.
(02:02) మంచిదే అనిపించింది నాకు కూడా ఎంతసేపు ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించేసి ప రూపాయలకి పాతిక రూపాయలకి కూడా చెయి చాచుకోవడం కరెక్ట్ కాదు పిల్లని తన కాళ్ళ మీద తను నిలబడేలాగా చేయాలి అని మనం ఆలోచిస్తున్నాం కదా సో దానికోసం వెయిట్ చేస్తున్నారు పారలల్ గా బాగా చదువుకుంటున్నారు ఇంతకుముందుతో పోల్చుకుంటే డిగ్రీలతో ఆపేయట్లేదు పీజీ దాకా చదువుకుంటున్నారు.
(02:23) పీజీ చేసినోళ్ళంతా పెళ్లి మానేస్తున్నారని కాదు కానీ లేట్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఇంకా కెరీర్ లో మంచిగా ఎదుగుదాం చూద్దాం అని ఒకటి ఆలోచిస్తున్నారండి రెండోది ఇంట్లో బాధ్యతలండి ఒక పక్క నుంచి పని రెండు వాళ్ళే చేయాల్సి వస్తుంది సగటన మగాడితో పోల్చుకుంటే ఆడవాళ్ళు నాలుగైదు రెట్లు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది ఏది ఇంట్లో ఆఫీస్ లోనూ చేస్తున్నాడు మళ్ళీ ఇంట్లోనూ చేస్తున్నారు మగాడు మాత్రం హాయిగా ఉంటున్నాడు ఎందుకు వచ్చిన కర్మ ఎందుకు చేయాలి మనం వాడికి వీడికి ఎందుకు చేసి పెట్టాలి అనుకుంటున్నట్టున్నారు అంటే హాయిగా ఉంది కదా ఫ్రీగా ఉంటున్నాం కదా ఐ మీన్ మీకు తెలుసు కదా కాలేజీల దగ్గర నుంచి
(03:01) అక్కడ పీజీల్లో బాగా అలవాటు పడిపోయి ఉంటారు. అంటే తప్పేమీ లేదు ఇందులో వాళ్ళు ఆ లైఫ్ ఆ స్వేచ్ఛను అనుభవించుకున్నారు కాబట్టి ఆ స్వాతంత్రం వదులుకోవడం అవసరమా అనిపించి లేట్ చేస్తున్నారు. పెళ్లి మానేస్తున్నారు అని కాదు లేట్ చేస్తున్నారు ఇవి పేరెంట్స్ కి కూడా ఉపయోగపడతాయండి ఇవన్నీ ఆలోచిస్తే తర్వాత వచ్చి ఇక సామాజికంగా చాలా మార్పులు వస్తున్నాయండి ఒకప్పుడు రాజీ పడిపోయేవాళ్ళు ఉమెన్స్ రాజీ పడిపోయాడు అమ్మ మాటో అమ్మమ్మ మాటో విని సద్దుకు పోవడానికి ఇష్టపడేవాళ్ళు ఎప్పుడు సద్దుకు పోవడానికి ఇష్టపడట్లేదు తన మాట కూడా నగ్గాలి తన మాటే నగ్గాలి అనేవాళ్ళు
(03:35) కొంతమంది తనది కూడా నగ్గాలి అనేవాళ్ళు కొంతమంది ఇలాగ సో ఇంతకుముందు పెళ్లి అంటే కచ్చితంగా ఉండాల్సిందే పెళ్లి పెళ్లి అంటే మ్యాండేటరీ ఇప్పుడు పెళ్లి జస్ట్ ఒక ఆప్షన్ అండి ఆప్షన్ అంటే ఒకప్పుడు పెళ్లి కాకపోవడం అనేది పెద్ద సమస్యగా ఉండేది ఇప్పుడు పెళ్లి ఆప్షన్ పెళ్లితో పోల్చుకుంటే మామూలు లైఫ్ సుఖంగా సంతోషంగా ఉందనుకోండి ఉంటే వదిలేస్తున్నారు అంతే పెళ్లి చేసుకోవడం ఆగిపోతున్నారు అలాగని ఎవరో ఒకళని తీసుకొచ్చి చేసేస్తాం అంటే ఒప్పుకోవట్లేదు.
(04:07) లేట్ అయినా పర్లేదు అంటున్నారండి సంపాదిస్తున్నారు కదా కాస్తో కోస్తోం సో ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేదు. ఇక ఇంటి పనుల విషయంలో చాలా భయం ఉంది రేపటి రోజు తల్లి అయితే ఆ టార్చర్ మామూలుగా ఉండదు సో మరి ఇన్ని కోల్పోతాం కదా మనం ఇన్ని కోల్పోవడం అవసరమా అని చెప్పి చాలామంది చాలామంది ఒప్పుకోవట్లేదండి ఇక్కడ ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక సర్వే జరిగింది రీసెంట్ గా మీరు కూడా ఏఐఎస్హచ్ఈ సర్వే అని కొట్టొచ్చండి మీకు కూడా అది దొరుకుతోందన్నమాట సో రీసెంట్ గా ఇక్కడ ఏం జరుగుతోంది అంటే బాగా చదువుకునే వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్న వాళ్ళు బాగా
(04:44) పెరిగారండి. పెరగటంతో పాటు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఏది ఎడ్యుకేషన్ టైం లోనే ఇష్టపడుతున్నారు తర్వాత తర్వాత చిన్న చితకో ఉద్యోగం వస్తుంది కదా అక్కడ కూడా అంటే ఆర్థిక భద్రత ఎప్పుడైతే వచ్చిందో అక్కడ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి అంటూ చేసుకుంటే మళ్ళీ వచ్చేవాడు ఎలా ఉంటాడో అడ్జస్ట్ అవ్వగలమా లేమా అనేది ఒకటి ఉన్న ఉద్యోగం మానేయాలేమో ఊరు మారిపోవాలేమో ఆర్థిక పరిస్థితి తలకిందులు అయిపోతుందేమో మళ్ళీ వాడి మీద ఆధారపడాలేమో ఇలాగని సరే పోనీ భార్యా భర్తలు ఇద్దరు ఉద్యోగాలు అనుకుందాం ఉద్యోగస్తులు అయితే ఇక్కడ ఇంకో పెద్ద సమస్య వస్తుంది ఎవరు ఎక్కువ పని
(05:20) చేయాలి ఆల్మోస్ట్ ఆల్ ఆడవాళ్ళే ఎక్కువ పని చేస్తున్నారు మీకు తెలుసు సగటన సగటన భారతీయ మహిళ ఆల్మోస్ట్ ఆల్ 300 నిమిషాలు ండి అంటేఐదు గంటలు ఇంటి పని కోసం కేటాయిస్తుంటే మగాడు 100 నిమిషాలుండి మీకు అర్థమైంది కదా 100 నిమిషాలు ఆల్మోస్ట్ ఆల్ గంటన్నర ఇంటి పనికి కేటాయిస్తున్నాడండి అంతే మరి ఇది అందరం ఒప్పుకోవాల్సిందే తెలిసిపోతుంది అంటే ఇక ఇల్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి వంట చేయడం దగ్గర నుంచి కొంతమంది అయితే ఇంకా చాలా పనులు చేస్తారు పాపం ఆడవాళ్ళు మగ మహారాజులు అసలు మంచం దిగని వాళ్ళు చాలా మంది ఉన్నారు.
(05:57) ఇక పిల్లలు అన్నాక ఇంకొక టార్చర్ పిల్లలని చూసుకోవడం దగ్గరగా అత్తమామలు ఉంటే ఇంకో టార్చర్ కింద ఫీల్ అవుతున్నారండి సో మరి ఎన్ని టార్చర్లు ఎవడు పడతాడు ఎంత ఎవడు పోగొట్టుకుంటాడు ఎన్ని త్యాగాలు చేస్తాం అని చెప్పి చాలామంది చేసుకోవట్లేదంట అంటే ఈ సర్వే చెప్తుంది. మరి రాజీ పడాల్సిందేనా అంటే చాలామంది రాజీ పడడానికి ఇష్టపడటం లేదండి అంటే చూద్దాం ఇంకాస్త చూద్దాం తర్వాత మనకు తగ్గవాడు దొరకపోతాడా ఇలాగ ఎక్కువమంది వెయిట్ చేస్తున్నారండి అంటే ఇంతకుముందు 90 ట 80% రాజీ పడిపోయేవాళ్ళు అండి ఇప్పుడు 64% అంటే ఇదే ఇదే సర్వే చెప్తోంది ఏ విషయంలో గాని అంటే పిల్లల విషయంలో గాని
(06:38) ఆర్థిక విషయంలో గాని సామాజిక సంబంధాలు గాని అసమానతల విషయంలో గాని ఎక్కడ ఎక్కడ కూడా రాజీ పడడానికి ఇష్టపడట్లే ఒసే అదేంటే మరి ఎలాగే రేపటి రోజు నువ్వు ఎలా బతుకుతావే భవిష్యత్తులో నిన్ను ఎవరు చూసుకుంటారు అంటే నాకు ఉద్యోగం ఉందిగా హెల్త్ ఇన్షూరెన్స్ ఉంటుందిగా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇలాగ ఇలాగ ఎవరికో వాళ్ళు అంటే భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి భవిష్యత్తులో భర్త పిల్లలు అండగా ఉంటే సరిపోతుందా అంటే వాళ్ళు చూసుకుంటారా ఉన్నా గాని ఏం కాదు కాస్త పొదుపు చేసుకుంటే ఆస్తుపాస్తులు ఉంటే హెల్త హెల్త్ ఇన్షూరెన్స్ ఉంటే ఇంకా స్నేహితులు ఎలాగో
(07:15) ఉంటారు కదా ఇలాగా ఇష్టపడుతున్నారండి కొంతమంది అయితే పెళ్లి వద్దు గానీ లాంగ్ టర్మ్ రిలేషన్స్ బెస్ట్ అని కొంతమంది కొంతమంది అయితే షార్ట్ టర్మ్ అయినా గాని ఉన్నంత కాలం కాస్త హ్యాపీగా ఉండిపోదాం అని కొంతమంది అండి సో మరి పెళ్లి చేసుకోవడానికి పేరెంట్స్ ని అంటే పేరెంట్స్ అనిపించుకోవడానికి ఇన్ని పోగొట్టుకోవాలా ఇన్ని ఇన్ని త్యాగాలు చేయాలా అని వాళ్ళలో వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేస్తున్నారండి.
(07:44) అంటే ఈ వీడియో చూస్తున్న లేడీస్ కూడా మరి కామెంట్ లో దయచేసి చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి అంటే పెళ్లి కాని వాళ్లే కాదు అయిన వాళ్ళు కూడా ఆడపిల్లలు తల్లిదండ్రులు కూడా చెప్పొచ్చండి. ఇక్కడ అమెరికాలో మళ్ళీ చెప్పాను కదా అమెరికాతో పోల్చలేం కానీ అమెరికాలో జరిగిన సర్వే మోర్గాన్ స్టాన్లీ చాలా ఫేమస్ సంస్థ కదండీ వీళ్ళు సర్వే చేస్తే ఇది 44 25 వేళ్ళ మధ్య వాళ్ళు ఆల్మోస్ట్ సగానికి సగం మంది ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారండి మరి మనకి కాస్త సంస్కృతి సంప్రదాయాలు ఆచారం వ్యవహారాలు ఇలాంటివి చాలా చెప్పుకుంటాం కానీ మనలో ఆల్మోస్ట్ ఆల్ ఇందులో సగం మంది అంటే
(08:21) పాతికి శాతం మంది ఇలా ఆలోచిస్తున్నారండి సో మరి ఎక్కువ మంది ఎక్కువమంది జీవితంలో సుఖంగా ఉండాలంటే జీవితం కాస్త స్టెబిల్ గా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే పెళ్లి ఉండాలా అనే క్వశ్చన్ వేస్తే చాలామంది అవసరం లేదు అని అంటున్నారటండి ఈరోజు ఈరోజు ఆడపిల్లలు అలా అంటున్నారంట మరి నష్టం అయితే అంటే ఐ మీన్ లేట్ అయితే నష్టం కదా చాలా నష్టం కదా అంటే ఏం పర్వాలేదు లేట్ అయినా గాని ఏం పర్వాలేదు అసలు పెళ్లిచ చేసుకోకపోయినా గాని నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు.
(08:57) సో పెళ్లి అనేది పెద్ద సమస్య ఏమి కాదు జస్ట్ ఆప్షన్ మాత్రమే అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో మరి అంటే ఫేమస్ సర్వేలు సామాజికంగా వస్తున్నటువంటి మార్పులు ఎప్పటికప్పుడు నేను మీకు షేర్ చేస్తూ ఉంటా ఎందుకు సోషల్ సైన్సెస్ నాకు చాలా ఇష్టం కాబట్టి అంటే మీన్ సామాజిక శాస్త్రం. సమాజాన్ని దగ్గరగా చూడడం విశ్లేషించడం మీతో షేర్ చేసుకోవడం నాకు బాగుంటుంది కాబట్టి సో ఇక్కడ మీ ఒపీనియన్ చాలా చాలా అవసరం దయచేసి మీ ఒపీనియన్ ని షేర్ చేయండి.
(09:26) మరి ఆడపిల్లలు తల్లిదండ్రులు ఉంటారు కదా ఆడపిల్లలు ఏంటి మగపిల్లల తల్లిదండ్రుల కూడా షేర్ చేయండి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు థాంక్యూ
No comments:
Post a Comment