*🙏🌹గురువు- గొప్పతనం 🌹🙏*
*అక్షరాలు దిద్దిస్తున్నపుడు తెలియలేదు.. నాజీవితాన్ని మలుపు తిప్పుతున్నారని.కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యతను పెంచుతున్నారని చేతి మీద కొట్టినపుడు తెలియలేదు.. నా చేతికి పదును పెడుతున్నారని... ప్రశ్నలడిగినప్పుడు తెలియలేదు..ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని.. పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు.. నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని..మార్కులిస్తున్నపుడు తెలియలేదు... నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని..*
*ఈ క్షణం తెలుస్తుంది.. నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించారని... నన్ను ఒక మహాశక్తిగా మలిచారని కాలం వెనక్కి వెళ్తే, మీతో మళ్ళీ దెబ్బలు తింటాం,మీ అనురాగానికి పాత్రులమవుతాం గురువర్యా...!.*
*ఒకప్పుడు గురువులకు సేవ చేస్తూ విద్యను అభ్యసించే వాళ్ళం కాబట్టే అప్పుడు ప్రతీ విద్యార్థి మంచి వ్యక్తిత్వంతో వర్ధిల్లేవాడు... కానీ ఇప్పుడు గురువులను ఎదిరిస్తూ బ్రతుకుతున్నాం అందుకే వ్యక్తిత్వాన్ని చంపుకుని బతకాల్సి వస్తుంది..*
*ఈ రోజుల్లో కొంతమంది తల్లిదండ్రులు గురువులు తమ పిల్లల్ని దండించేసరికి గురువులను నోటికొచ్చినట్టు దూషించే స్థితిలో ఉన్నారు..అలాంటి తల్లితండ్రులు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రుల చేతిలో, గురువుల చేతిలో దెబ్బలు తినని పిల్లలు సమాజానికి ఆటంకంగా మారి భవిష్యత్ లో పోలీసుల చేతుల్లో తన్నులు తినే స్థాయికి దిగజారుతారు.*
*ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.. మరి మీ పిల్లలు గురువుల చేతుల్లో దండించబడి, సమాజం చేత కీర్తింపడాలో, గురువుల చేతుల్లో దెబ్బలు తినకుండా, సమాజం చేతిలో దెబ్బలు తినాలో, సంఘం ముందు దోషులుగా నిలబడాలో మీరే ఆలోచించుకోండి..*
*గురువుల్ని దేవుళ్ళా* *పూజించకపోయినా, కనీసం సాటి మనుషులుగా నైనా గుర్తించండి ప్లీజ్ 🙏*
No comments:
Post a Comment