Saturday, April 12, 2025

ఇది మీ కోసమే పిల్లల భవిష్యత్తు గురించి నిజంగా ఆలోచించే ప్రతి పేరెంట్ కోసం.*

 


*ఇది మీ కోసమే పిల్లల భవిష్యత్తు గురించి నిజంగా ఆలోచించే ప్రతి పేరెంట్ కోసం.*

*పిల్లల మనసు తెల్ల కాగితంలా ఉంటుంది. మీరు రాసే ప్రతి పదం వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని, ప్రపంచాన్ని, భవిష్యత్తును నిర్మిస్తుంది. మీ మాటలే వాళ్ల మానసిక ప్రపంచాన్ని నిర్మిస్తాయి. మీ మాటలే వాళ్ల అంతరాత్మగా మారతాయి.* 

*“వద్దు” అనే ఒక మాట… వాళ్లలో భయాన్ని నాటుతుంది. “ఇలా చెయ్” అనే మాట… వాళ్లలో నమ్మకాన్ని నాటుతుంది.*

*ఇలా మాట్లాడుతున్నారా?*
*"నా మాట విను... అక్కడకు వెళ్లవద్దు. చీకటిగా ఉంది!" -> పిల్లలో భయం నాటుతుంది. చీకటి అంటే భయపడాలి అన్న భావన ఏర్పడుతుంది.*

*"ఆ దారిలో ముళ్లు ఉన్నాయి. వెళ్లవద్దు!" -> అన్వేషణ సాగిపోతుంది. ప్రమాదాల నుంచి తప్పించుకునే మార్గాలు పిల్లలే కనిపెట్టే అవకాశం దూరమవుతుంది.*

*"కుక్క కరుస్తుంది. పరుగెత్తుకుని పో!" -> ధైర్యానికి బదులు భయంతో స్పందించమనే పాఠం ఇస్తాం.*

*"ఈ కుర్చీ మీద కూర్చోవడం అలాకాదు!" -> నమ్మకం కోల్పోతాడు. "నేను చెయ్యలేను" అనే భావన బలపడుతుంది.*

*"కత్తిని పట్టుకోవద్దు, చేతులు కోసుకుంటావు!" -> అనుభవం పొందే అవకాశాన్ని తీసేస్తాం. కత్తి అంటే భయం ఏర్పడుతుంది.*

*"దానిపై చెయ్యి వెయ్యకు, పడేస్తావు!" -> ప్రతి వస్తువుని తాకొద్దు అంటే పిల్ల ఎదుగుదలకి చెక్ పడుతుంది.*

*అలాకాకుండా ఇలా మాట్లాడండి...*
*"అక్కడ చీకటిగా ఉంది కదా, దీపం తీసుకెళ్దాం." -> భయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుతుంది. సమస్యలకి పరిష్కారాల మార్గం చూపుతుంది.*

*"చూడు, కింద ముళ్లు ఉన్నాయి. జాగ్రత్తగా నడవాలి." -> సమస్యను గుర్తించగల బుద్ధిని పెంచుతుంది. జాగ్రత్తగా ఎలా ఉండాలో నేర్పుతుంది.*

*"కుక్క ఉన్నప్పుడు, రాయి చేతిలో పెట్టుకుని నిల్చోవచ్చు." -> పరిస్థితులకు స్పందించే ధైర్యాన్ని నేర్పుతుంది. పరుగు కాకుండా పరిష్కారం చూపుతుంది.*

*"ఇక్కడ కూర్చోవచ్చు, కానీ ఇలా కూర్చోవాలి." -> పిల్లలను అర్హతతో నింపుతుంది. నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది.*

*"ఈ కత్తిని ఇలా ఉపయోగించాలి. పండు కోయాలి అనుకుంటే ఇలా చేయాలి." -> చేతిపని, సమర్థత, జవాబుదారీతనం పెరుగుతుంది.*

*"ఇటురా, నేను దగ్గరే ఉన్నాను. నీకు సహాయం చేస్తా." -> మద్దతు అనే భావన పెరుగుతుంది. భయంకన్నా భరోసా గొప్పదని తెలుస్తుంది.*

No comments:

Post a Comment