Saturday, April 12, 2025

 *ఆమె*

*ఆమెకి కావలసినంత*
*టైము తీస్కోనివ్వండి..*
*ఆమె తాగే కప్పు కాఫీ అయినా*
*హాయిగా తాగనివ్వండి ...*
*ఎన్ని ఉదయాలు తనవాళ్ల కోసం ఎన్ని చల్లని కాఫీలు తాగలేదు...*
*తను కప్ కాఫీ తాగే ముందు అందరికీి అన్నీ రెడీచేసి కూర్చున్న ఆమెను, కాసేపు అలాగే ఉండనివ్వండి..*

*బయట హోటల్ కి వెళ్లినపుడు ఆమెకి నచ్చినవి ఆర్డర్ చెయ్యనివ్వండి..*
*రోజూ ఇంట్లో అందరికి ఇష్టమైనవి ఆమె వండినపుడు ఒక్క రోజైన తనకు నచ్చింది వండుకుందామని ఆమె ఆలోచించదు కదా...*

*బయటకి వెళ్లేటప్పుడు  తయారవ్వడానికి ఆమెకి కావలసినంత సమయం తీస్కొనివ్వండి...*
*తన  భర్త, పిల్లలు, అందరి ముందు బాగా కనిపించాలని బట్టలు బాగా ఇస్త్రీ చేసి,వాటి స్థానంలో ఉన్నాయా లేదా అని పదే పదే మనకి అన్నీ ఆమె సమయానికి సమకూర్చ లేదా?*

*టీవీ చూసే పది నిమిషాలు అయినా ఆమెకి నచ్చినది చూడనివ్వండి...*
*ఎంతసేపు ఆమె చూస్తుందని?*
*చూసినా పరధ్యానంగానే కదా!*

*అయ్యో అతనికి, పిల్లలకు డిన్నర్ టైమయిందేమో...*
*అత్తగారికి మందుల టైమేమో ఇదే ధ్యాస కదా ఆమెది..*

*బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం చేస్తే చెయ్యనివ్వండి ...*
*ఎంత లేట్ గా చేసినా...*
*మనకి మాత్రం రుచిగా ఉన్నవి,*
*బాగున్నవి కదా వడ్డిస్తుంది..*
*తాను మాత్రం మాడిన అట్లు,*
*మన చేత తిట్లు తింటుంది..*
*( భర్త/పిల్లలు చేత )*

*సాయంత్రం వేళ...*
*టీ తాగాక..*
*కాసేపు అన్నీ మరిచి హాయిగా*
*కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ తనని తాను*
*మరిచి పోనివ్వండి!*
*ఎన్ని సాయంత్రాలు తన వారికోసం కేటాయించలేదు ఆమె*

*ఎన్ని పగళ్లు,*
*ఎన్నెన్ని రాత్రులు*
*తన వారికోసం నిద్ర,*
*తిండి మాని సేవ చెయ్యలేదు..*
*తన కోసం జీవితంలో* 
*ఆ మాత్రం సమయం ఇవ్వడం సబబే కదా...*
*అవునంటారా ? కాదంటారా?*

*ఆమె ఒక తల్లి...*
  *ఒక ఇల్లాలు..*
  *ఒక కోడలు...*

No comments:

Post a Comment