Saturday, April 12, 2025

విశ్వ* *సూక్తి* *దర్శనం* *అక్షరాలు* Dt: 10-04-2025 *షేక్స్* *పియర్*

 *విశ్వ* *సూక్తి* *దర్శనం* *అక్షరాలు* Dt: 10-04-2025

   *షేక్స్* *పియర్* 

1. వివేకగుణం వీరత్వంలోని విడదీయరాని భాగమే.

* మనిషి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం - ప్రతి మనిషీ తనపట్ల తాను నిజాయితీతో వ్యవహరించగలగడం.

* మనిషి కొంతకాలంపాటు కాలాన్ని వృధా చేస్తే, ఆ తర్వాత అంతవరకూ వృధా అయిన కాలమే ఆ మనిషి జీవితాన్ని అన్నివిధాలా నష్టపరుస్తుంది.

* ఓ మనిషిని గురించి మనకి ముందుగా చెప్పేది- ఆ మనిషో, యితరులో కాదు... అతని వేషధారణే.

* తనలో సంగీత మధురిమలు లేని మనిషి, మధుర మంజుల సంగీత సుస్వరాలకి స్పందించని మనిషి, సృష్టిలోని సున్నితమైన అద్భుతాలని అందుకోలేడు. అటువంటి మనిషి అర్హతల్లా... దారుణ మారణ హింసలూ, కల్లోలపరచే కల్లాకపటాలూ, విధ్వంసకర వినాశకాండలూ చూడడమే.

* అందరూ అనుకునేవిధంగా ప్రపంచంలో మంచివారనీ, చెడువారనీ వుండరు. మన ఆలోచనలవల్లే మనకి అలా అనిపిస్తుంటుంది.

* అంతఃకరణం మన అందరినీ పిరికివారిగా తయారుచేస్తుంది.

* అజ్ఞానమే గాఢమైన అంధకారం.

* ప్రపంచంలో పరిపాలించడం చేతకానివారు, వినయంగా ఆజ్ఞలని పాటించడమైనా నేర్చుకోగలగాలి.

* మనుషులలోని చెడుగుణాలు దీర్ఘ రోగాల్లాగా ఎంతోకాలం పీడిస్తూ వుంటాయి. కాని మంచితనాలు మాత్రం అల్పాయుష్షుతో బాధపడుతుంటాయి.

* జ్ఞానం మనకి ప్రసాదించే రెక్కలతో, మనం సమస్త భూమండలాన్నే కాదు, స్వర్గాన్ని సైతం అందుకోవచ్చు.

* మనం ఎవరితోనూ అనవసరంగా తగవులు పెట్టుకోకూడదు. ఒకవేళ అలాటి తగువులు తప్పనిసరి అయినప్పుడు మనం మన విరోధులకి మన శక్తినీ, బలాన్నీ, పౌరుషాన్నీ రుజువు చేయగలగాలి.

* మనిషికి సందేహాలే అసలైన అభివృద్ధి నిరోధకాలు. అవి మనిషి తాను అనుకున్నది సాధించడానికి చేసే ప్రయత్నాలకి అడ్డుపడి అతనిలోని శక్తిని క్షీణింపచేస్తాయి.

* ప్రపంచంలో గొప్పదనం ఎన్నోరకాలుగా వుంటుంది. కొందరు గొప్పవారి లాగానే పుడతారు. కొందరు తమ కృషితో గొప్పదనాన్ని సంపాదించు కుంటారు. అయితే కొందరికి మాత్రం గొప్పదనాన్ని కట్టబెడుతుంది. ప్రపంచం.

• ఓ మనిషి మనలని బాధపెట్టినప్పుడు, అందుకు ప్రతీకారం తీర్చుకోవడంలో సాహసం లేదు, దానిని సహించడమే నిజమైన సాహసం.

* మనిషి తన జీవితం తనకీ, ప్రపంచానికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవా లనుకుంటే, అందుకు మూడుపనులు అవసరం అందరినీ ప్రేమించడం, ఎంచుకున్న కొందరిపైనే నమ్మకం వుంచుకోవడం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికీ కీడు తలపెట్టకుండా వుండటం.

* ప్రపంచంలో మనుషులు రెండురకాలు మంచివారు, చెడ్డవారు. మంచివారు ప్రేమగా వుంటూ మంచిగా నడుచుకోవటం మామూలే. అప్పుడు వారు పంచే ప్రేమని చూసి మనము సంతోషించవచ్చు. అయితే చెడ్డవారు, లేని ప్రేమని నటించారంటే మాత్రం మనం భయపడే సమయం వచ్చిందని గుర్తించాలి.

• పిరికివాళ్ళు చావుకి ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతుంటారు. కాని ధైర్యసాహసాలు గలవాళ్ళు జీవితంలో ఒకే ఒక్కసారి చస్తారు.

• మనిషి జీవితంలో అనుమానాలు అనేవి చాలా విచిత్రమైనవి. ఎందుకంటే అనుమానాలు మనిషి మనసులో పుట్టకుండానే వుండాలిగానీ, ఒకసారి పుట్టాక, అవి మనిషికి నమ్మకద్రోహం చేసేదాకా వదిలిపెట్టవు. ఎంతో తెలివిగా ఎన్నో శక్తియుక్తులని సంతరించుకుని జీవితవికాసానికి పాటుపడగలిగే మనిషికి, యీ అనుమానాలు అడుగడుగునా అవరోధాలుగా నిలచి, మనుగడ పంచే మంచి మంచి విషయాలని వంచనతో ముంచెత్తుతాయి.

* ఓ మనిషి పూర్తిగా సంతృప్తిని పొందగలిగితే, అతనికి కావలసినవన్నీ లభించినట్లే!

* మనిషిలోని మంచి గుణాలే సుఖాలకి సోపానాలు యీ ప్రపంచంలో.

* అబద్ధపు జగడాలలో నిజమైన వీరత్వం వుండదు.

• అస్తమించే సూర్యుణ్ణి చూసి జనం తలుపులు మూసేసుకుంటారు.

* జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి మనం అందరినీ ప్రేమించాలి. కొందరినైనా మనస్ఫూర్తిగా నమ్మగలగాలి. ఎటువంటి వారికైనా అన్యాయం తలపెట్టకుండా వుంటుండాలి.

* బలహీనతకి మారురూపమే స్త్రీ!

• మనిషికి ఒక్క అనుభవమే నేర్పుతుంది- దృఢనిశ్చయమే అవసానకాలంలో అన్ని విధాలా ఆదుకునే అసలైన నేస్తం అని.

• హత్యకి నాలుక వుండదుగానీ నాలుక లేకుండానే అది ఎన్నో విషయాలు చెబుతుంటుంది.

• జీవితంలో లాభనష్టాలు ఎవరికైనా తప్పనిసరి. అయితే అవివేకుల్లా కాకుండా, తెలివైన మనుషులు తమకి వాటిల్లిన నష్టాలని గురించి ఆలోచిస్తూ సతమతమయిపోకుండా తరగని ఉల్లాసంతో, చెరగని చిరునవ్వులతో, ఆ వాటిల్లిన నష్టాలని ఎలా పూడ్చుకోవాలో ఆలోచించు కుని, అందుకు అవసరమైన ప్రణాళికలని తయారు చేసేసుకుంటారు.

• మంచి మనసు బంగారం కంటే విలువైనది.

* మనిషికి ఎంతో గొప్పతనాన్ని, ఆనందాన్ని యిస్తుంది కిరీటం. అయితే దానిని ధరించే శిరస్సు మాత్రం ఎప్పుడూ ఎన్నో అసౌకర్యాలకి గురవుతుంటుంది.

• మనిషి జీవితంలో ముందుకుపోవడానికి ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. అతను ముందుకి పోకుండా అడ్డుపడుతుంటాయి. అలాంటి ఆటంకాలలో అన్నిటికన్నా ఘోరమైన ఆటంకాలు ఆ మనిషి మనసులోనే పుట్టి పెరిగే అనుమానాలు. ఎందుకంటే అనుమానాలు మనిషికి నమ్మక ద్రోహం తలపెడుతుంటాయి. దానివల్ల ఆ మనిషిలో సహజంగా వుండే మంచి మంచి గుణాలకీ, ప్రవృత్తులకీ గ్రహణం పడుతుంది. దాంతో ఎంతో కష్టపడి తనని తాను చక్కగా మలచుకోవడానికి మనిషి చేసే ప్రయత్నాలెన్నో నిష్ఫలమయిపోతుంటాయి.

• మనిషి తన జీవితం తనకీ, ప్రపంచానికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవా లనుకుంటే, అందుకు మూడుపనులు అవసరం... అందరినీ ప్రేమించడం, ఎంచుకున్న కొందరిపైనే నమ్మకం వుంచుకోవడం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికీ కీడు తలపెట్టకుండా వుండటం.

• ప్రపంచంలో మనుషులు రెండురకాలు మంచివారు, చెడ్డవారు. మంచివారు ప్రేమగా వుంటూ మంచిగా నడుచుకోవటం మామూలే.

అప్పుడు వారు పంచే ప్రేమని చూసి మనము సంతోషించవచ్చు. అయితే చెడ్డవారు, లేని ప్రేమని నటించారంటే మాత్రం మనం భయపడే సమయం వచ్చిందని గుర్తించాలి.

* ప్రపంచంలో మంచిమాటలు ఎంతో కొరతతో కూడినవి. అందుచే వాటిని వ్యర్థంగా పాడుచెయ్యకూడదు.

No comments:

Post a Comment