Saturday, April 12, 2025

 *🔔జై హనుమాన్🔔*

ఇది ఈ రోజు హనుమ విజయోత్సవ సభ జరుపుకున్న రోజు..

అరణ్య వాసంలో వున్నప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించటం, రాముడు వానరుల సహాయంతో లంక వెళ్ళి యుద్ధం చేసి సీతని తీసుకుని రావటం జరిగింది.  అయితే అసలు సీత ఎక్కడ ఉంది.. ఎలా ఉంది వగైరా సమాచారం తెలిపింది హనుమ.  అంచేత ఆ పట్టాభిషేకం అయిన తరువాత సీతాదేవి హనుమను ప్రస్తుతిస్తూ ఎన్నో విషయాలు చెప్పింది.  పైగా రాముల వారు అందరినీ సత్కరించి మంచి మంచి బహుమానాలు ఇచ్చాడు.  అలా విభీషణుడికి ఇచ్చిన తమ ఇక్ష్వాక వంశీయుల  కులదైవం శ్రీరంగనాధుని విగ్రహం ఆలయం శ్రీరంగం తమిళనాడులో వుంది.

అయితే హనుమకి ఏమీ బహుమానం ఇవ్వలేదు రాముడు.  సీతాదేవి చాలా బాధ పడింది.  హనుమ తనకి ఆపత్కాలంలో ఎంతో సాయం చేశాడు.  పుత్ర సమానుడు అంటూ తన మెడలో ఉన్న నవరత్నమాల హనుమ మెడలో అలలకరించింది.  

వెంటనే హనుమ ఆ మాలను తీసి ఒక్కో రత్నాన్ని కొరికి ముక్కలు చేసాడు.  కోపం వచ్చింది సీతాదేవికి.. ఏమిటి ఈ పని నీకు బహుమానం ఇవ్వలేదు రాముడు అనుకుని ఎంతో ప్రేమతో నేను మంచి బహుమానం ఇస్తే ఇలా నన్ను అవమానిస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేస్తే హనుమ సీతకి నమస్కరించి తల్లీ నాకు అంతా రామమయం.. ఇంత గొప్ప రత్నాలలో నా రాముడు కనిపిస్తాడని వెతికాను అన్నాడట.  
ఏమి భక్తి.. ఆశ్చర్యపోయింది సీత.  అప్పుడు రాముడు సీతాదేవికి హనుమ గురించి హనుమ వ్యక్తిత్వం అవతార మహిమ గురించి చెప్పాడు.  అలాగే హనుమను తమ ఏకాంత మందిరంలోకి తీసుకుని వెళ్ళి వేదాంత రహస్యాలు బోధించాడు.  

అలా రాముడు హామునకి చెప్పిన వేదాంత రహస్యాలు అన్నీ

 *మహావాక్య రత్నప్రభావళి*

అనే పేరుతో వున్నాయి.. వేదాంత స్వరూపుడు రాముడు స్వయంగా హనుమకి బోధించిన వేదాంత సారమది.. 

ఈ రోజున వేదాంత సారం తెలుసుకోవటం.. లేదా సుందర కాండ పారాయణం చేయడం చాలా మంచిది.

అలా అని వేదాంత గ్రంథానికి, సుందరకాండ పుస్తకానికి కొబ్బరి కాయ కొట్టి పూజలు చేయడం లాంటి పనులు చేయటం వృధా.  

కావాలంటే హనుమ పేరుమీద కొబ్బరి కాయ కొట్టి పచ్చడి చేసుకుని తినవచ్చు.. అది వేరు.  

కనీసం సంక్షిప్త సుందరకాండ.. సంక్షిప్త వేదాంత సారం చదువుకున్న తలచుకున్నా చాలా మంచిది.  

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment