Saturday, April 12, 2025

*బర్రెలక్కని ఫేమస్ చేశారు.*
*అడ్రస్ లేకుండా పోయింది.*

*పూసలమ్మే మోనాలిసాని చేశారు.*
*మూవీ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ జైల్లో ఉన్నాడు.*

*అఘోరీ అని ఒకణ్ణి చేశారు.*
*వాడేమో ప్రేమ అంటే వెధవని చేశారు.*

*ఆలేఖ్య పచ్చళ్ళమ్మే వాళ్ళని చేశారు.*
*మొత్తం దుకాణమే సర్ధేసేలా చేశారు.*

*కుమారీ ఆంటీని ఫేమస్ చేశారు*
*బిజినెస్ లేకుండా పోయింది.*

*కూలి చేసుకొనే ముసలావిడని సింగర్ అని ఫేమస్ చేశారు.*
*ఇప్పుడు కూలి పని కూడా దొరక్కుండా పోయింది.*

*ఇలా ఎంతో మందిని సోషల్ మీడియా*
*గోడలెక్కించి ఫేమస్ చేశారు.*

*కొందరు ఎదిగారు... కొందరు నేలకి ఒరిగారు.*

*ఏదేమైనా పరిగెత్తుతూ పాలు తాగడం కన్నా...*
*నిలబడి నీళ్ళు తాగడం మంచిది.*

*వీళ్ళందరిని చూస్తే.*
*తొందరగా వచ్చే సెలబ్రిటీ స్టేటస్ ఏదైనా...ఎక్కువకాలం నిలువదు.*
*అని బాగా అర్ధమైంది.*

*కష్టపడితే వచ్చేదే నిలుస్తుంది.*
*అందుకే శ్రమించాలి... సంతోషంగా ఉండాలి....*
*ముఖ్యంగా నోరు అదుపులో పెట్టుకోవాలి....*
*ఫేమస్ అయిన తర్వాతే చాలా జాగ్రత్త గా ఉండాలి... 🤣*

No comments:

Post a Comment