పొద్దస్తమానం ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుంది
వెంగళరావుకి !
మెల్లిగా అపార్ట్మెంట్ బాల్కనీ లోకి వచ్చి నిలబడి ఓ పారి చుట్టూ చూసాడు ! ఆశ్చర్యం !! తన కళ్ళను తనే నమ్మలేక పోయాడు !
*ఎదురు అపార్ట్మెంట్ కిటికీ దగ్గర నిలబడి ఓ అందమైన *అమ్మాయి* తనవంక చూసి హయ్ ! అన్నట్లుగా చేతులు ఊపింది !
వెంగళరావుకి పట్టరాని ఆనందం వేసింది !
ఎదురు అపార్ట్మెంట్ లో ఇంత అందమైన అమ్మాయిని
ఇంతకాలం ఎలా మిస్సయ్యాను !
బహుశా **వర్క్ ఫ్రమ్ హోమ్ *లో పడి మర్చిపోయుంటా ! వెంగళరావు కూడా నవ్వుతూ ఆ అమ్మాయి వంక చూసి చేతులు ఊపాడు.. ఊపాడు...ఊపుతూనే ఉన్నాడు !**
అప్పుడు వినిపించింది వెనకనుంచి పెద్ద *కేక* ఆకాశం చిల్లులు పడేలా !
"ఎదవ సంబరాలు చాలు గానీ ముందు ఆ చేతులు వూపటం ఆపండి !
ఆ అమ్మాయి మిమ్మల్ని చూసి చేతులు వూపట్లా !
కిటికీ అద్దాలు తుడుస్తుంది !
పైగా అది వాళ్ళ పనమ్మాయి !
అందుకే ఆ కళ్ళజోడు పెట్టుకోమంటే విని చావరాయే !
సరేగానీ కిచెన్ లో బోలెడు అంట్లు తయారుగా ఉన్నాయి !
లోపలికి వచ్చి తగలడండి !!"
**ఛీ దీనమ్మ జీవితం !! **
ఉక్రోషంగా అనుకున్నాడు వెంగళ్రావు !
🤦🏻♂️😣
వింజమూరి
No comments:
Post a Comment