కుండలినీ శక్తి - మూలాధార చక్రం 1
**************************
పంచ భూతాలలో భూమికి సంబంధించినది..
ముదురు ఎరుపు రంగు లో 4 రేకుల పద్మం వలె ఉంటుంది అంటారు..
నిజంగా మన వెన్నెముక చివర పద్మాలు ఉంటాయా అంటే .. 4 రేకుల పద్మం అనగా..
నీరు
అగ్ని
వాయువు
ఆకాశ తత్వాలను పట్టి ఉంచే పంచభూత తత్వ జడ పదార్థం గా చూడాలి
పంచ కోశాలలో మొదటిది అన్నమయ కోశం ఈ మూలాధార చక్రం సూచిస్తుంది..
గణపతి అధిష్టాన దేవత
మనం తీసుకునే ఆహారం, మనకి వచ్చే శారీరక బాధలు, శరీరం తో అనుభవించే సుఖాలు అన్నీ కలిపి ఈ స్థూలశరీరము గా భావిస్తూ ఉండే అతి ప్రాథమిక స్థాయి లో ఉండే ప్రతి జీవుడు మూలాధార చక్రము కూడా దాటలేని స్థితిలో ఉన్నాడు అని అర్థము..
ప్రాపంచిక విషయాల యందు ఆసక్తి
ధన భోగ లాలస
నిర్దుష్ట లక్ష్యం లేకపోవడం
అభద్రతాభావం
ఆందోళన అమిత భయం
మానసిక ఒత్తిడి
ఒంటరితనం
మొదలగు విషయాలు మనలో ఉన్నంత వరకు మూలాధార చక్రము పరిధిని దాటి జీవుడు ఎదగలేడు అని గుర్తు..
బద్ధకం
అజీర్ణ సమస్యలు
కటి ప్రదేశంలో నొప్పులు రుగ్మతలు
ఆందోళన రుగ్మతలు
సంతాన ప్రత్యుత్పత్తి సమస్యలు
నిద్రలేమి లేదా అతి నిద్ర
మొదలగునవి మనలో మూలాధార చక్రము నిద్రావస్థ లో ఉండగా శారీరకంగా కనిపించే లక్షణాలు
పైన చెప్పిన లక్షణాలు మనలో ఎంతమందికి ఉన్నాయి ??
ఈ దేహము నేను కాదు అనే స్పృహ మనకి వచ్చిందా ??
ఆహారం తిన్నా తినకపోయినా,
నిద్ర పోయినా పోకపోయినా,
సంపాదన ఆస్తులు ఉన్నా లేకపోయినా,
కష్టసుఖాలు ఉన్నా లేకపోయినా
అన్ని అవస్థలలో మనం ఒకేలా స్థిత ప్రజ్ఞత చూపగలుగుతున్నామా ??
మూలాధారము దాటిన జీవుడు భూమి యందు ఉన్న సుఖాలను కోరుకోడు.. జిహ్వ చాపల్యం ఉండదు, కీర్తి కాంక్ష ఉండదు, సిరిసంపదలను ఆశించడు, పదవీ కాంక్ష ఉండదు, అసలు శారీరక భ్రాంతి ఉండదు.. ఈ భౌతిక దేహము తాను కాదని ఎరుకలో ఉంటాడు
ఈ రోజుల్లో చాలా మంది తెలిసో తెలియకో ఈ షట్చక్రాలు యాక్టివేట్ చేసుకోవడానికి అనేక పద్ధతులను పాటించడం లేదా డబ్బులు తీసుకుని యాక్టివేట్ చేయిస్తామని చెప్పే కేంద్రాలను ఆశ్రయించడం జరుగుతోంది..
యోగాసనాలు ముద్రలు వేయడం వలన శారీరక అంశాలు మెరుగవుతాయి.. కానీ పూర్తిగా మూలాధార భేదనమ్ జరిగినట్లు కాదు..
దేహ భ్రాంతి వదలడానికి సిద్ధపడ్డార అనేది ముందుగా మీకు మీరు ఆలోచన చేసుకోండి..
మీ జీవన విధానం ఏమిటి, మీ పై ఆధారపడి ఉన్న వారికి మీరు ఎంచుకున్న మార్గంలో న్యాయం జరుగుతుందా లేదా, ఇలా కుటుంబ సామాజిక కోణాలు బాధ్యతలు అన్నీ ఆలోచించుకుని ఈ దారిలోకి రావాల లేదా అని నిర్ణయించుకోండి..
కొంత సాధన తర్వాత మీకు భ్రమలు తొలగిపోయి బంధాలకు దూరంగా వెళ్లాలని అనిపిస్తే, మీ వలన ఎవరికీ ఇబ్బంది లేదు అనేది చూసుకోండి..
లలితా సహస్రనామ స్తోత్రము లో కొన్ని పంక్తులు ఈ షట్ చక్రాల జాగృతి కోసం నిర్దేశింపబడ్డాయి.. అందుకే బాహ్య విషయాలకు కామ్య సిద్ధికి లలితా సహస్రనామ పారాయణ చేయరాదు అని నియమం..
దశ మహా విద్యలు మొదలు మోక్ష ప్రాప్తినీ ఇచ్చే జ్ఞాన విద్యలు ఎన్నో నిగూఢంగా ఉన్నాయి
కుండలినీ యోగసాధన సాధారణ విషయం కాదు .. నాకు మూలాధారం open అయింది అంటూ fancy గా పది మందికి చెప్పుకు తిరిగే విషయం అంతకన్నా కాదు ..
మీ సందేహాలు కామెంట్ ద్వారా తెలియచేయండి..
తదుపరి post లో స్వాధిష్ఠాన చక్రము విశేషాలు తెలుసుకుందాము
స్వస్తి 🙏🏻
Sekarana - https://www.youtube.com/@VoiceOfMaheedhar/community
No comments:
Post a Comment