Tuesday, July 21, 2026

 


ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🏻

           ఒక భక్తుడు :
   భగవాన్! దైవ జపము, గురు అనుగ్రహము, ఆత్మ విచారణ వంటి పద్ధతుల్లో అత్యుత్తమైనది ఏది?

మహర్షి :
    వానిలో ఒక్కొక్కటి మరోదాని ఫలితం. అందులో ఏ ఒక్కటైనా ఆ తరువాతి దశకు చేరుస్తుంది. అవి పరస్పర ఆలంబనాలు. వానిలో వానికి వ్యతిరేక భావాలు లేవు. 

   దైవము, గురువు, ఆత్మ - అవి వేర్వేరు కావు. అన్నీ ఒకటే. కాబట్టి మార్గాలలో బేధాలు ఎన్నవలసిన పని లేదు.

No comments:

Post a Comment