Wednesday, July 22, 2026

కుండలినీ యోగసాధన - మణిపూర చక్రము

Quoshi
23 hours ago
కుండలినీ యోగసాధన - మణిపూర చక్రము
*********************************

మణి అంటే ప్రకాశించే రత్నం. పురము అంటే నగరము. రత్న ప్రకాశంతో ప్రకాశించే నగరం అని అర్థం

నాడీ కేంద్రం నుండే మానవుడిలో శక్తి ఉద్భవిస్తుంది. 
ప్రాణ శక్తిని అన్ని అవయవాలకు సరఫరా చేసే మొదటి శక్తి కేంద్రం మణిపూరకం.
విశ్వం నుండి ప్రాణ శక్తిని గ్రహించి సాధకుడికి పంపుతుంది

మణిపూరకం అగ్ని తత్వానికి చెందినది..
 ఈ చక్ర స్థానంలో 10 దళాలతో ఉన్న చిక్కటి పసుపురంగుతో ఉన్న , ప్రకాశవంతమైన పసుపురంగు పద్మం ఉంటుంది.
బీజ మంత్రం : ఈ చక్రం యొక్క మూల బీజ మంత్రం "రం".

పది దళాలు అనగా జ్ఞానేంద్రియాలు - తన్మాత్రలు - కర్మేంద్రియాలు :
 ఉదా:
******
జ్ఞానేంద్రియమైన కంటితోనూ, తన్మాత్ర అయిన కంటి చూపుతోనూ సంబంధం కలిగి ఉంటుంది
ఈ చక్రానికి... 

👉🏻 పంచ కోశాలలో ప్రాణమయ కోశంతో సంబంధం ఉంటుంది.
మణి పూరక చక్రం...లలితా సహస్రంలో...లాకిని శక్తిగా అభివర్ణించబడింది.
ఈ చక్రంలో రుద్రుడు, రుద్రుని శక్తి లాకిని ఉంటారు.
ఈ చక్రమునకు "లాకిని" దేవత. సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగాన్ని స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు

👉🏻 మణి పూరక చక్ర సాధనలో ఈ చక్రం లోపలికి వెళ్ళాలంటే... స్వాధిష్ఠాన చక్రము పై ఉన్న బ్రహ్మ గ్రంథిలోకి ప్రవేశించి...ఈ గ్రంథిని జాగృతం చేసుకుని...తరువాతనే మణి పూరక చక్ర సాధన చెయ్యాలని సిద్ధులైన కొంత మంది యోగుల అవగాహన

👉🏻 షట్చక్ర సాధనలో ...చక్ర జాగృతి, చక్ర శుద్ధి, చక్ర ఆధీనము, చక్ర విభేదనము ఉంటాయని గ్రహించవలెను.

👉🏻 ఈ మణి పూరక చక్ర సాధనలో ...సాధకుని ఇష్ట దైవము సజీవ మూర్తిగా కూడా దర్శనము ఇవ్వవచ్చును.
ఒక సాధకుడి సాధన...నిరాకార సాధన అయితే ఆ సాధకునకు ఆ చక్రానుభవాలు, అనుభూతులే వస్తాయి. సాకార సాధకుడైతే, చక్రానుభవాలతో పాటు చక్ర దైవీక వస్తువులు లభ్యం కావచ్చును. లేదా ఆయా దైవీక వస్తువులున్న క్షేత్ర దర్శనాలయినా కలుగవచ్చును

కీర్తికండూతి, పెత్తనం చెలాయించాలనే అహం, అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూరత్వం, కటుత్వం, స్వలాభత్వం, స్వార్ధపరత్వం మొదలగు దుర్లక్షణాలు ఈ చక్రం నిద్రాణంగా ఉన్నపుడు కలుగుతాయి..
ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది.. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే..

పుట్టుట, జీవించుట, మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. ఈ త్రికోణమే భౌతిక సృష్టికి ఆధారం

తదుపరి post లో అనాహత చక్రం విశ్లేషణ ఉంటుంది..
మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియచేయండి 
సాధకులకు కుండలినీ యోగసాధన ఎలా చేయాలో post ద్వారా తెలిపాను.. గమనించగలరు
                              స్వస్తి 🙏🏻
  
  
Sekarana - https://www.youtube.com/@VoiceOfMaheedhar/community   

No comments:

Post a Comment