Tuesday, July 21, 2026

 *_🦚 శ్రీరమణమహర్షి బోధ 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_(ఆత్మ విచారము ~ అభ్యాసము)_*
*_🦚 ఆత్మవిచారాన్ని కొత్తగా ప్రారంభించిన వారికి శ్రీరమణులు ఒక సలహానిస్తూండేవారు.._*
*_▪️లోపలకల "నేను" అనుభూతిపై సావధానమై, సాధ్యమైనంత వరకూ విడవకుండా పట్టుకోమని. ఏకాగ్రత ఇతర భావాల వల్ల చెల్లా చెదరయితే, అట్లా చెదురుతున్నట్లు తెలియగానే “నేను” అనే భావం వైపు ఎరుకని మళ్లించుకోవాలనే వారు._*
*_▪️ఈ పద్ధతి నవలంభించటానికి వారనేక మార్గాలు సూచించేవారు. “నేనెవరిని” అని గాని, "ఈ నేను ఎక్కడనుంచి ఉద్భవి స్తోంది" అని గాని తనని తాను ప్రశ్నించుకోమనేవారు._* 
*_▪️శరీరమూ, మనస్సూ చేసే వ్యాపకాల కన్నింటికీ తానే మూల కారణమని భావించే "నేను”ని ఎల్లవేళలా గమనించటమే అంతిమలక్ష్యం._*
*_ప్రారంభ దశలో “నేను” అనే అనుభూతిపై ఏకాగ్రత నిలపటం కేవలం మనస్సుకి సంబంధించిన వ్యాసంగం. అది ఒక భావంగా, ఒక ఎరుకగా మాత్రమే ఉంటుంది._* 
*_▪️అభ్యసించిన కొద్దీ 'నేను' అనే భావం తొలగి, 'నేను' అనే అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతి ఇతర భావాలతో, విషయాలతో సంబంధాన్ని త్రుంచేసుకుంటే పూర్తిగా మాయమైపోతుంది._* 
*_మిగిలేదల్లా సంస్థితమయినట్టు అనుభవం, తాను వ్యక్తిననే భావం తాత్కాలికంగా తొలగుతుంది. మొదట్లో ఈ అనుభవం అప్పుడప్పుడే కలిగినా, క్రమేపీ అభ్యాసం వల్ల దానిని అందుకోవటమూ, నిలుపుకోవటమూ కూడా తేలిక అవుతాయి._* 
*_▪️ఆత్మవిచారం ఈ స్థాయికి చేరితే ఏ ప్రయాసా లేకుండా సంస్థితమయినట్టు ఎరుకే ఉంటుంది. వ్యక్తిగతమైన ప్రయత్నముండదు. దీనికి కారణం, ప్రయత్నించే “నేను” అనేది తాత్కాలికంగా మాయ మవటం, అప్పుడప్పుడు అహంవృత్తి తల ఎత్తుతూంటుంది. కాబట్టి అది ఆత్మసాక్షాత్కారమైన స్థితి కాదు. కాని అభ్యాసానికి పరాకాష్ఠ అదే, ఈ స్థితిని మళ్ళీమళ్ళీ అనుభవిస్తూంటే అహంవృత్తిని రేకెత్తించే వాసనలు నాశనమవుతాయి._* 
*_▪️వాటి పట్టు సన్నగిల్లిన కొద్దీ ఆత్మశక్తీ ఇంకా మిగిలియున్న కొద్ది వాసనలనీ ధ్వంసం చేస్తుంది. దానితో, అహంవృత్తి ఇంక తల ఎత్తదు. ఇక తిరుగులేని, అంతిమమైన సాక్షాత్కార స్థితి యిది !!_*
*_🦚 గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. సద్గురు వేంకటరమణా.. శరణం శరణం శరణం. 🙏_* 
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️

No comments:

Post a Comment