Wednesday, July 22, 2026

కుండలినీ శక్తి - స్వాధిష్ఠాన చక్రము 2

Quoshi
3 days ago
కుండలినీ శక్తి - స్వాధిష్ఠాన చక్రము 2 
***************************

స్థూల దేహం లోపల ఉండే భావాలకు నిలయంగా ఉంటుంది.. మనస్సు ప్రధానం
స్వ అనగా తాను
అధిష్టాన అనగా నిలబడునది 
నేను అని జీవుడు యొక్క భావన గా ఏదైతే నిలబడి ఉందో అదే దీనికి మూలం
తాత్వికంగా చెప్పాలంటే ఈ దేహం లోని పంచ కర్మేంద్రియాలు చేసే పనులను పంచ జ్ఞానేంద్రియాల తో అనుభవానికి తీసుకుంటున్న ఆ " నేను " అను స్థితి.. 
ఉదా :
******
నేను మామిడి పండును ఆస్వాదిస్తున్నాను అంటే,
చేతులు నాలుక వంటి ఇంద్రియాలతో తిన్న పండు కడుపులోకి వెళ్తే, నాకు పండు తిన్న తృప్తి కలిగింది .. ఆ నేను ఎవరు?? పండు తినడం అనే భావన రుచిని ఆస్వాదించడం అనే జ్ఞానం మొదలగునవి ఉండేది ఈ స్థాయిలోనే..

స్వాధిష్ఠాన చక్రం మన అభివృద్ధిలో రెండవ స్థాయిని సూచిస్తుంది.. ఇది ఉపచేతన మనస్సుకు నిలయం, ఇక్కడ గర్భంలో మన ఉనికి ప్రారంభమైనప్పటి నుండి అన్ని జీవిత అనుభవాలు మరియు ముద్రలు నిల్వ చేయబడతాయి. మూలాధార చక్రం మన కర్మల భాండాగారం, అయితే ఇవి స్వాధిష్ఠాన చక్రంలో క్రియాశీలమవుతాయి.

స్వాధిష్ఠాన చక్రానికి ప్రాతినిధ్యం వహించే జంతువు మొసలి. ఇది సోమరితనం, సున్నితత్వం లేకపోవడం ఈ చక్రంలో నిద్రాణంగా ఉన్న ప్రమాదానికి ప్రతీక. 
స్వాధిష్ఠాన మూలకం జలం అనగా నీరు అని కాదు ఇక్కడ.. మనలో చెలరేగే భావాలు అని తీసుకోవాలి.. మంచి అయినా చెడు అయినా..
స్వాధిష్ఠాన చక్రం విషయంలో ప్రతికూల భావోద్వేగాలు ఉపచేతన నుండి చేతన స్థితికి వచ్చినప్పుడు, మనం పూర్తిగా సమతుల్యత కోల్పోయి బాధలు అనుభవంలోకి తెచ్చుకుంటాం 

మనలో కలిగే అరిషడ్వర్గాలు మనం అధిగమించవలసిన మన ప్రతికూల గుణాలకు ప్రతీకలు - కోపం, ద్వేషం, అసూయ, క్రూరత్వం, కోరిక మరియు అహంకారం. మన అభివృద్ధికి ఆటంకం కలిగించే ఇతర నీచ గుణాలు బద్ధకం, భయం, సందేహం, ప్రతీకారం, ఈర్ష్య మరియు దురాశ.

కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు
6 రేకులుగా కలిగిన పద్మం అయిన స్వాధిష్ఠాన చక్ర భేదనమ్ అయితే
 మన మనస్సు బుద్ధి అహంకారం చిత్తము లతో కూడిన ప్రతీ భావావేశమునకు లోను అవుతున్న ఈ సూక్ష్మ శరీరమే తాను కాదు అని జీవుడు ఎరుకలోకి వస్తాడు 
స్వాధిష్ఠాన భేదనమ్ జరిగిన జీవుడికి అరిషడ్వర్గాలు అంటవు 

ఈ చక్రానికి అధిదేవత సృష్టికర్త అయిన బ్రహ్మ మరియు శక్తి, జ్ఞానం కళలకు అధిదేవత అయిన సరస్వతి..

మూలాధారము దాటితే ఈ పంచ భూత దేహం నేను కాదు అనే స్థితి 
స్వాధిష్ఠానము దాటితే నాలోని భావాలు ఏవీ నేను కాదు అనే స్థితి కి జీవుడు చేరినట్టు

బీజాక్షరాలు బాహాటంగా ప్రకటించకూడదు కాబట్టి అధిదేవత సాధనలు చేసుకోగలరు..
తదుపరి post లో మణిపూరక చక్రం విశ్లేషణ 
మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియచేయండి 
                          స్వస్తి 🙏🏻
  
  
  
  
Sekarana - https://www.youtube.com/@VoiceOfMaheedhar/community   

No comments:

Post a Comment