కుండలినీ శక్తి - తత్వ విచారణ
*************************
ఒక్కొక్క చక్రం అంటే ఒక్కొక్క స్థాయి అని అర్థం
నిజంగా మన స్థూల దేహం లోపల వెన్నెముక చివర పద్మాలు ఉండవు చక్రాలు ఉండవు..
ఒక్కో ఆత్మిక స్థాయిని పద్మము సూచిస్తుంది..
పద్మం లో రేకులు అనగా ఆ ఆత్మిక స్థాయిలో జీవుడి లక్షణాలు ..
ఇప్పటివరకు భౌతిక సృష్టికి మూలం అయిన 3 చక్రాలను గురించి కొంత స్థూలంగా తెలుసుకున్నాం కదా.. ఇపుడు తాత్వికంగా ఆ 3 ఆత్మిక స్థాయిలు అంటే ఏమిటి ?? ఆ స్థాయి దాటిన జీవుడు పొందే అనుభవాలు , అతనిని ఆశ్రయించే శక్తులు ఏమిటనేది చూద్దాం..
మూలాధార చక్రం
****************
సప్త ఊర్ధ్వ లోకాలలో మొదటిదైన భూలోకానికి చెందినది..
పంచ ప్రాణాలలో అపాన వాయువుకు సూచన..
సృష్టికి మూలమైన శిశు జననానికి అపాన వాయువు ముఖ్యమని మనకి తెలుసు కదా..
పంచ భూతాల వలన ఏర్పడిన స్థూల దేహం.. మన కంటికి కనపడే భౌతిక కాయం..
అక్షర మాలలో ల, వ, శ , ష , స అక్షర దేవతలతో కలిసి డాకిని శక్తి అధిష్టాన దేవతగా ఉంటుంది..
👉🏻 బీజాక్షరం: లం
గణపతి, కార్తికేయుడు, బ్రహ్మ, భూదేవి, కుబేరుడు మొదలగు దేవతలు మూలాధార స్థాయిలో తగిన జ్ఞానాన్ని అందిస్తూ జీవుడికి కావాల్సిన అంశాలను భౌతిక జీవనాన్ని కొనసాగించే క్రమంలో తోడ్పడుతారు..
ఇష్ట దేవతా సాధన చేస్తూ
ఈ దేహం తాను కాదని ఎరుక వచ్చిన జీవుడు బ్రహ్మ గ్రంథి లోకి ప్రవేశిస్తాడు.. బ్రహ్మ సృష్టి లోని పాంచ భౌతిక శరీరం తాను కాదు అని గ్రహిస్తాడు..
జీవాత్మిక స్థాయి ఉన్నత ప్రయాణం చేసి స్వాధిష్ఠాన చక్రము చేరుతుంది..
మూలాధార పరిధి దాటడం అంటే భేదనమ్ జరిగాక, దేహ భ్రాంతి వదిలిపోతుంది..
ఇష్ట దేవతా సాక్షాత్కారం లభిస్తుంది
అలాంటి సాధకుడికి తెలియకుండానే కొన్ని శక్తులు ఆశ్రయించుకుంటాయి..
సాధకుడు స్పర్శ ద్వారా ఇతరుల శారీరక బాధలు రుగ్మతలు రోగాలు ఉపసమింప చేస్తాడు..
తన చేత్తో ఇచ్చిన విభూతి , ప్రసాదం, తీర్థం లేదా మన్ను అయినా సరే.. ఇతరుల శరీర కష్టాలను నిర్మూలిస్తుంది..
ఉదాహరణకి మనకి తెలిసి ఉన్న అనేకమంది సద్గురువులు అవధూతలు సత్పురుషులు ఇలాంటి మహిమలు లీలలు విభూతులు ప్రదర్శించారు.. వారిలో భగవాన్
👉🏻 శ్రీ రమణులు వారు తన చేత్తో ఇచ్చిన విభూతి వలన ఒక అన్య మతస్థుడి కుష్ఠు వ్యాధి తగ్గింది అని అతనే స్వయంగా చెప్పాడు
భౌతిక దేహ స్థాయి భ్రాంతిని దాటిన ఆత్మికులు ఎలా ఉంటారు అంటే.. ఆహార విహారాదుల మీద దృష్టి ఉండదు.. మంచి దుస్తులు, రుచికరమైన వంటకాలు, ధన వ్యామోహం, దర్పం, అహంకారం కామాసక్తీ, భోగ లాలస మొదలైన ఇహలోక సుఖాలకు అతీతంగా ఉంటారు
దేహానికి వచ్చిన క్యాన్సర్ పుండు తనని బాధించలేదని శ్రీ రమణులు వారు చెప్పారు.. మూలాధారం దాటిన జీవుడు స్థాయి ఇలా ఉంటుంది
తదుపరి post లో స్వాధిష్ఠాన చక్రము తాత్విక వివేచన తెలుసుకుందాము.. నా ఈ వివరణ మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను.. ఏమైనా ప్రశ్నలు సందేహాలను కామెంట్ ద్వారా తెలియచేయండి
స్వస్తి 🙏🏻
Sekarana - https://www.youtube.com/@VoiceOfMaheedhar/community
No comments:
Post a Comment