*ఆత్మ సాక్షాత్కారం*
దైవాన్ని గూర్చి పరిపూర్ణ జ్ఞానం లేని ఆరోజుల్లో, మన ప్రాచీనులు అనేక ఆరాధనలు సల్పి, దైవ మంటే ఎవరో నిర్ణయించుకోలేక, ప్రకృతిని ఆరాధిస్తూ వచ్చారు.
కాలం గడిచే కొద్దీ ప్రకృతి ఆరాధన సన్నగిల్లి, మూర్తి ( విగ్రహం) ఆరాధన చోటు చేసుకుంది.
అయితే జన్మించిన ప్రతీ ప్రాణీ కూడా మూర్తి స్వరూపమే! ఈ మూర్తులు గుణాలతో కూడి ఉంటారు, దీనిని కాదనలేము.
శిలా విగ్రహం కేవలం జడ స్వరూపమే, అందువలన విగ్రహారాధనను చాలామంది వ్యతిరేకించారు.
దూరంగా ఉన్న వస్తువుని గుర్తించడానికి, వ్రేలు పెట్టి చూపిస్తాము, వస్తువుని గుర్తించిన తరువాత, వ్రేలు అవసరం ఇంక ఉండదు...
అదే విధంగా విగ్రహాలు దైవాన్ని చూపిస్తాయి, దైవసాక్షాత్కారం కలిగిన తర్వాత సర్వము దైవమే అనేది మనకు అనుభమవుతుంది.
కాబట్టి అప్పటివరకు విగ్రహారాధనను మాన కూడదు.
వేదము యొక్క దృష్టి లో అనగా చైతన్య మే! అణువు నుండి ఘనము వరకూ చైతన్య మే!
ఆ చైతన్యం ఎందుకు కనపడదు? అనుకుంటారు.
పాలను పెరుగు చేసి చిలికితేనే కదా, వెన్న వచ్చేది.
అదే రీతిగా ఆత్మ సాక్షాత్కారం కావాలంటే దానికి తగిన సాధన చేయాలి.
విశ్వాసం, ప్రేమ భావం పెంచుకోవాలి.
దైవాన్ని సన్నిహితంగా భావించుకోవాలి, అప్పుడు నిజం మనకే తెలుస్తుంది.
*_🌷శుభమస్తు🌷_*
No comments:
Post a Comment