Wednesday, July 22, 2026

మీరు చెడు కర్మ అనుకునేదే, మీకు మేలు చేయగలదు | What You Think is Bad Karma Can Actually Benefit You

మీరు చెడు కర్మ అనుకునేదే, మీకు మేలు చేయగలదు | What You Think is Bad Karma Can Actually Benefit You

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=K_zRByWkyDU



Transcript:
(00:00) మీకు ఎంతో ఘోరమైన అనుభవం ఎదురైనా అదిఒక మంచి అనుభవమే ఎందుకంటే ఇవి అమూల్యమైనవి జన్మల అనుభవాల విలువను తీసిపారేయలేం అది అవసరం అనుభవాల జ్ఞాపకమే [సంగీతం] మీకు జ్ఞానాన్ని అందించగలదు. [సంగీతం] మీ నిర్బంధాలతో కూడా సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ఎలాగో ఆ నిర్బంధత ఉంది. దాంతో మీరు సంతోషంగా లేకపోతే మీకు రెండు సమస్యలు ఉంటాయి నిర్బంధత ఇంకా సంతోషం లేకపోవడం సమస్య ఒకటే ఉంటే దాన్ని పరిష్కరించడం
(00:47) తేలిక. మీకున్న నిర్బంధతల్ని సంతోషంగా చూడటం నేర్చుకోండి అంటే మీ నిర్బంధతల పట్ల మీరు సంతోషంగా ఉన్నారని కాదు మీరు సంతోషంగా ఉన్నారు అంతే మనం ఎప్పుడూ ఆనందం ప్రేమ ఇంకా అలాంటి విషయాల గురించి మాట్లాడేది ఎందుకంటే మనసును మనోభావాలను ఆహ్లాదంగా ఉంచడానికే ఎందుకంటే మీ మనసు మనోభావాలు ఆహ్లాదంగా ఉన్నప్పుడు మీరు మృదువుగా ఉంటారు. మీతో ఎన్నెన్నో పనులు చేయించగలం.
(01:19) మీ మనసు మీ మనోభావాలు అప్రియంగా ఉన్నప్పుడు మీరు రాయిలా అవుతారు. మీతో ఏమీ చేయలేం. అందుకే ఇప్పటికే మీకు ఒక సమస్య ఉంది రెండో దాన్ని సృష్టించుకోకండి సంతోషం లేకపోవడం అంటే అప్రియం. మీరు సంతోషంగా లేనప్పుడు మిమ్మల్ని ఎవరూ తాకలేరు ఎవరూ సహాయం చేయలేరు ఎవరు ఏమీ చేయలేరు. మీరు ఆహ్లాదకరమైన స్థితిలో ఉంటే మిమ్మల్ని వేరే స్థితిలోకి మలచబడడానికి సిద్ధంగా ఉంటారు అవునా మీరు సంతోషంగా లేనప్పుడు మిమ్మల్ని తాకడానికి ఎవరూ ఇష్టపడరు.
(01:52) కాబట్టి సంతోషంగా లేకపోవడం అనేది నిర్బంధాలు అన్నిటికంటే పెద్ద సమస్య. చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఎవరూ మిమ్మల్ని తాకలేరు, మలచలేరు, మీకు సహాయం చేయలేరు. కాబట్టి మొదటి దాన్ని పరిష్కరించుకోండి మీరు ఎలాంటి వారైనా సరే మొదట ఆనందంగా ప్రేమగా ఉండటం నేర్చుకోండి. ఇప్పుడు మీతో పని చేయడం సులభం మీకు సహాయం చేయడం సులభం మిమ్మల్ని చేరుకోవడం సులభం మీ ఇష్టాలకు అతీతంగా మీతో చేయించడం సులభం.
(02:30) ఎందుకంటే మీ ఇష్టా ఇష్టాలే ప్రాథమిక నిర్బంధతలు వాటి గురించి మీకు సహాయం చేయాలంటే మీరు ఆహ్లాదకరమైన స్థితిలో ఉండాలి. మీరు సంతోషంగా లేకపోతే మీకు నచ్చని పనిని మీతో చేయించలేంు మీకు నచ్చింది మాత్రమే చేస్తారు జనం ఎంత సంతోషం లేకుండా ఉంటే అంతగా వారు నేను ఇదే చేస్తాను నేను ఇంతే అని పట్టుపడతారు. ఆనందంగా ఉండేవారు మృదువుగా ఉంటారు వాళ్ళతో డాన్స్ చేయించొచ్చు ఏడిపించొచ్చు గెంతించొచ్చు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ చేస్తారు. వాళ్ళు మృదువుగా ఉంటారు.
(03:02) మీ మృదుత్వాన్ని కోల్పోకండి అదే అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. దట్స్ రీజన్ ఇన్ ద మార్నింగ్ యోగాస్టార్టింగ్ విత్ యువర్ బాక్ అందుకే ఉదయాన యోగాలో మీ నడుం నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా తలదాకా పని చేసుకోపోతాం. ఎందుకంటే మృదుత్వం కీలకం మీరు కరిగిపోతే అది అద్భుతం. ఘనరూపంలో ఉండటం నుండి మృదువుగా మారడం ఆ తర్వాత ద్రవంగా కరిగిపోవడం ఆ తర్వాత వాయువుగా మారడం ఆపై ఏమీ లేకుండా పోవడం ఇదంతా క్రమమైన పురోగతిలా కనిపిస్తోంది అవునా కాబట్టి మిమ్మల్ని మీరు మృదువుగా ఉంచుకోవడం ముఖ్యం మీ మనసులో గాని మనోభావాల్లో గాని సంతోషం
(03:48) కోల్పోతే సరళత సాధ్యం కాదు అందుకే ఆనందంగా ఉండటం ప్రేమగా గా ఉండటం సంతోషంగా ఉండటం శాంతంగా ఉండటం ఈ కారణాల వల్లే ముఖ్యం. కాబట్టి రెండేసి సమస్యలు సృష్టించుకోకండి మీకున్న నిర్బంధాలు ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఇక సం ముఖ్యోద్దేశం మీరు దాచిన విషయాలన్నింటిని బయటకు తీసుకురావడమే. ఎందుకంటే వాటిని పాతి పెడితే అవి పెరుగుతాయే తప్ప తరగవు.
(04:22) మీరు మీ బంగాళ దుంపల్ని పాతి పెడితే అవి ఇంకా ఇంకా ఇంకా పెరుగుతాయి. కర్మ అంటే బంగాళ దుంపల బస్తా లాంటిది. వాటిని ఎంత లోతుగా పాతి పెడితే అవి అంత ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ఇది వాటిని బయటకు లాగి అవి మళ్ళీ పెరగని విధంగా ఆరబెట్టే ప్రదేశం. మీరు తగినంత తీవ్రమైన సాధన చేస్తే మీరే చూస్తారు.
(04:50) మీరు నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీలోని ఎన్నో చిన్న చిన్న నిర్బంధాలు పోయాయని నేను చెప్తున్నాను మీకు కేవలం వారం క్రితం ఉన్న నిర్బంధతలే ఉండుంటే మీరు అలా కూర్చోలేరు. మీరందరూ ఎంత అద్భుతంగా చేస్తున్నారో నిర్బంధతలు ఉన్నప్పుడు మీరు కూర్చోలేరు. అవును అర్థం పర్థం లేనివి ఏవేవో వస్తూనే ఉన్నాయి మీరు పూర్తి స్వేచ్ఛ పొందారని కాదు కానీ మీలోని ఎన్నో నిర్బంధతలు తొలగిపోయాయి.
(05:19) అందుకే మీరు కూర్చోగలుగుతున్నారు కీళ్లు నొప్పెడుతున్నాయి ఎవరికీ లేదు నొప్పి నాతో సహా అందరికీ నొప్పి నాకు ఒక కాలు మీకు రెండు నాకు మినహాయింపు ఎందుకంటే నేను ఎన్నో సంయమాల్లో కూర్చోవాలి. [నవ్వు] కేవలం ఒక కాలు మీకు రెండు కాళ్ళు నొప్పెడుతున్నాయి అసలు ఉన్నదంతా అదే నొప్పిగా ఉంటే లేవాలనిపిస్తుంది ఆకలి వేస్తే తొందరగా తినాలనిపిస్తుంది ఏదో అయితే ఒంటికి వెళ్ళాలనిపిస్తుంది.
(05:54) మనం దాన్ని దాటేసాం చాలా ఆకలిగా ఉంది పర్వాలేదు చాలా నొప్పిగా ఉంది పర్వాలేదు నొప్పి భయంకరమైన నిర్బంధం జనం రెండు నిమిషాలు కూడా భరించలేరు వాళ్ళు గంతులు వేస్తారు. ఇప్పుడు మీరు కూర్చున్నారు. మీ పక్కన కూర్చున్న వాళ్ళు వారు కూడా బబాబు అంటున్నారు. వారు తమ దుంపలన్నీ బయటకు తీస్తున్నారు.నాట్ జస్ట్ యుర్స్య alల్సోహవ టు బేర్ విత్ ద సరౌండింగ్ పొటాటోస్ మాత్రమే కాదు మీరు చుట్టూ ఉన్న దుంపల్ని కూడా భరించాలి.
(06:32) కుళ్లిన దుంపలు అన్ని వైపులా ఉన్నా కూడా అందుకే సణగొద్దు మీరు బాగా చేస్తున్నారు కానీ బయటకు తీయాల్సిన దుంపలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని ప్రతిరోజు బయటకు తీయాలి. ప్రతిరోజు సంవత్సరానికి ఒకసారి ఏడు రోజుల పాటు చేయడం సరిపోదు ప్రతిరోజు ప్రతిరోజు వాటిని బయటకి తీసి ఆరబెట్టి మీలోనే దాచుకోవాలి. అవి మళ్ళీ మొలకెత్తలేని స్థితికి వాటిని ఆరబెట్టాలి అప్పుడు బంగాళ దుంపలు ఉపయోగపడతాయి.
(07:04) మీ దుంపలను వదిలించుకోకూడదు ఎందుకంటే మీ జీవితానుభవం అంతా పోతుంది. పెరగకుండా ఉండేలా వాటిని ఆరబెట్టండి. ఉన్నది అలాగే ఉంటుంది. అలా కాక ఒక దుంప లక్షలాదిగా పెరిగితే అది పెరిగే బంగాళ దుంప. అవునా కాబట్టి మీరు వాటిని ఆరబెట్టి ఉన్నదాన్ని ఉన్నట్టుగానే ఉంచండి. చూడండి ఇది ఎలాగంటే మీకు ఐదు నిమిషాల తీవ్రమైన అనుభవం ఉంది ఉదాహరణకు బాధ లేదా భయం లేదా ఒక నరకప్రాయమైన అనుభవం లేదా ఏదో మీకు అసహ్యమైంది ఐదు నిమిషాలు ఈ ఐదు నిమిషాల బంగాళ దుంపలు పెరిగి పెరిగి మీ జీవితాన్నే శాసిస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళినా దాని గురించే
(07:51) మాట్లాడతారు మీరు ఎక్కడున్నా దాని గురించే ఆలోచిస్తారు ఏది ది కదిలినా అదే జరుగుతుందని అనుకుంటారు ఎందుకంటే మీ దుంపల్ని మీరే పెంచుతున్నారు వాటిని పాతి పెడుతున్నారు అవి పెరిగిపోతున్నాయి. అవి లక్షల దుంపలుగా మారతాయి అటువంటివి చెడ్డవి ఇప్పుడు ఈ బంగాళ దుంపను ఆరబెట్టి ఉంచుకోండి అది అక్కడే ఉంటుంది. అదొక మంచి అనుభవం మీకు ఎంత చెడ్డ అనుభవం ఎదురైనా అది కూడా ఒక మంచి అనుభవమే ఎందుకంటే అనుభవాలు అమూల్యమైనది మీ జీవితంలోని బాధాకర క్షణాల ద్వారా మీరు నేర్చుకునేది అమూల్యం.
(08:26) ఆ అనుభవాన్ని మీరు మర్చిపోతే మీరు మూర్ఖులు మూర్ఖుడు మాత్రమే మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు తెలివైన వాళ్ళయితే మీరు పొందిన ప్రతి బాధాకర అనుభవాన్ని గుర్తుంచుకోవాలి పగ లేకుండా కోపం లేకుండా బాధ లేకుండా కేవలం మీ బుర్రలో ఎప్పుడూ మళ్ళీ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకుండా ఉండేందుకు మీ అనుభవాన్ని మీరు తగలెడితే మీరు మళ్ళీ అదే పనికి రాని వాటిలోకి వెళ్తారు.
(08:53) మేము దుంపలను బయటకు తీసి అవి మొలకెత్తకుండా ఆరబెట్టాలనుకుంటున్నాం. అలాగే ఆ దుంపల్ని కాపాడుకోవాలనుకుంటున్నాం వాటిని వదిలించుకోవాలనుకోవట్లేదు. లేకపోతే మీరు మళ్ళీ అవే తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేసే తెలివి తక్కువ మూర్ఖులైపోతారు. జీవిత అనుభవం యొక్క విలువను తీసిపారేయలేము జన్మల అనుభవాల విలువను తీసిపారేయలేము అవి అవసరం మీరు వాటిని కాస్త దూరంగా ఉంచి అనుభవంగా ఉపయోగించుకోగలిగితే కానీ అవి మీలో పెరగనిస్తే అప్పుడు అది మీ జీవితాన్నే విషతుల్యం చేస్తుంది.
(09:33) కర్మ కర్మ ఒక్కటే అనుభవాల జ్ఞాపకమే మీకు జ్ఞానాన్ని అందించగలదు మరి అదే మిమ్మల్ని బంధించగలదు మీ జీవితాన్ని ఎంతగానో విషతుల్యం చేయగలదు అది మిమ్మల్ని నాశనం చేయగలదు కాబట్టి [గురకలు] కర్మ సమస్య కాదు దాన్ని మీరు తలపై ఎలా మోస్తున్నారు అన్నదే సమస్య దాన్ని మీరు ఎలా మోస్తున్నారు అన్నదే సమస్య కర్మ సమస్య కాదు [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment