Quoshi
3 days ago
కుండలినీ యోగసాధన
*******************
కుండలినీ శక్తి జాగృతం చేయడానికి మార్గం ఏమిటి అని అడుగుతున్నారు
సాధనా మార్గాలు చెప్పమని అంటున్నారు
అందరికీ ఒకటే మందు పని చేయనట్టె..
అందరూ ఒకే దారిలో సాధన పొందలేరు..
సాధనా మార్గాలు పలు రకాలు ఉంటాయి
ఒకరు స్తోత్రం పఠించి తరిస్తె వేరొకరు ధ్యానం లో తరించవచ్చు
కర్మ
భక్తి
జ్ఞాన మార్గాలు
యోగాసనాలు
ముద్రలు
క్రియలు ద్వారా కొంత సాధనలో ముందుకు వెళ్ళవచ్చు
మంత్ర జపం స్తోత్ర పారాయణ భగవన్నామ స్మరణ వంటివి చేస్తే ఇంకొంత ముందుకు తోడ్పడుతుంది
తపస్సు ధ్యానము జ్ఞాన వివేచన ద్వారా సహస్రారం స్థాయికి చేరి అమృతానంద స్థితిని జీవుడు చేరగలడు
ఒక్కొక్క చక్రం తత్వం గురించి వివరిస్తూ వస్తున్నాను..
వాటి బీజాక్షరాలు మనకు మనమే చదవడం సరైన పద్ధతి కాదు ..
ముందుగా షట్చక్రాల అధిష్టాన దేవతల ఆరాధనతో మొదలుపెట్టండి
సద్గురువులు వద్ద మూల మంత్రాలు తీసుకుని సాధన చేయండి
మంత్ర సిద్ధి పొందాక తదుపరి మంత్రం గురువు ఇస్తాడు
*** (మంత్ర సిద్ధి అనగా మంత్ర దేవతా సాక్షాత్కారం) ***
స్తోత్రాలు పారాయణ చేయండి ఇవి కొద్దిపాటి నియమాలతో అందరూ చేసుకోవచ్చు
లలితా సహస్రనామ స్తోత్రము లో
"" విశుద్ధి చక్ర నిలయా...
శృతి స్మృతిరనుత్తమా""
వరకు కుండలినీ యోగసాధన మంత్ర రాజమ్ చేసుకోండి
లేదా స్తోత్రమ్ మొత్తం పారాయణ చేయండి
ముందుమాట గా చెప్పడం ఏమంటే సరదాగా లేదా అందరూ చేస్తున్నారు అని trending అనో లేదా అతీంద్రియ శక్తులు వస్తాయని అపోహలతో ఇందులోకి రాకండి
ఇది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ.. జన్మ రాహిత్యం కోరుకుంటున్నారు అంటేనే ఇటు చూడండి.. తేలికగా మాత్రం తీసుకోకండి
లేదా విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది
సాధకుల అనుభవాలు అన్నీ ఒకేలా ఉండవు.. ఒక్కొక్కరికి ఒక్కోలా సిద్ధి కలగవచ్చు..
నా అనుభవాలు వేరు మీవి వేరు గా ఉండవచ్చు
ఇది సామూహికంగా చేసుకునే పూజ వ్రతం వంటిది కాదు.. ఎవరి ప్రయాణం వారిదే.. ఎవరి ప్రయాస వారిదే.. ఎవరూ సహాయం చేయలేరు.. కేవలం సూచనలు మాత్రమే ఇవ్వగలరు.. గమనించగలరు
మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియచేయండి
స్వస్తి 🙏🏻
Sekarana - https://www.youtube.com/@VoiceOfMaheedhar/community
No comments:
Post a Comment