*దైవీసంపదకు అర్హుడై పుట్టినవాని స్వభావములు (గీ 16.1,2,3)*
1. భయములేకుండుట,
2. స్వభావశుధ్ధి = త్రికరణ శుధ్ధి,
3. జ్ఞానసాధనయందు నిష్ఠ-స్థిరత్వము,
4. ధన-శ్రమ-(అధ్యాత్మ)విద్యాదానములు,
5. బాహ్యేంద్రియనిగ్రహము,
6. జ్ఞానయజ్ఞము,
7. తత్వశాస్త్రముల అధ్యయనము, అర్థమననం
8. విషయములందు ఆశాసంకల్పబీజమును తపింపచేయుట,
9. బ్రహ్మతత్వమునందు విక్షేపములేని భావము,
10. నిత్యమూ అనుభవించు ఆత్మభావమును జీవభావము చేత హింసించకుండుట,
11. సత్ తత్వమును అనుసరించి ప్రవర్తించుట,
12. లౌకికకారణముల వలన కోపగించకుండుట,
13. దేహాత్మభావాది అహంకార త్యాగము,
14. కామసంకల్పవర్జితమైన మనశ్శాంతి,
15. లౌకికకారణములను చూపి తత్వసాధనను తప్పించుకొనకుండుట,
16. భూతములయందు పారమార్థికమును గుఱించిన దయ,
17. విషయములందు చలించకుండుట,
18. త్రికరణములలో మృదుస్వభావము,
19. లౌకికవ్యహారములందు చరించుటకు సిగ్గు,
20. ఆత్మజ్ఞానమునందూ-సాధన కర్మాచరణయందూ చంచల స్వాభావం లేకుండుట
21. జ్ఞానతేజస్సూ,
22. ద్వంద్వములందు సహనమూ,
23. ఇంద్రియములను నిగ్రహించు ధైర్యమూ,
24. బాహ్యాభ్యంతర శౌచములూ,
25. ఇతరులకు అనాత్మవిషయముల ధ్యాసను కల్పించి ద్రోహము చేయకుండుట,
2 6. పూజింపదగినవాడనను అభిమానము లేకుండుట. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment