Saturday, July 18, 2026

Hedonic Adaptation: The Psychological Disease Killing Your Joy | Nagna Satyam Telugu Podcast

Hedonic Adaptation: The Psychological Disease Killing Your Joy | Nagna Satyam Telugu Podcast

Author Name:Nagna Satyam

Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bsodubuj4EI



Transcript:
(00:04) నువ్వు పడే ఆరాటం చేసే పోరాటం సంపాదించే డబ్బు ఆశించే సక్సెస్ ఇవన్నీ దేనికోసం సంతోషం కోసమే కదా మరి ఆ సంతోషం నీకు దొరికిందా దొరకదు ఎందుకంటే నీ మైండ్ నిన్ను నిరంతరం దారుణంగా మోసం చేస్తూనే ఉంది. ఒక కోరిక తీరగానే ఇంకో కోరికను పుట్టిస్తూ నిన్ను ఒక గానుగెద్దులా తిప్పుతూనే ఉంది. ఈ భ్రమనే సైకాలజీలో హెడోనిక్ ట్రెడ్మిల్ అంటారు.
(00:33) నువ్వు దేన్నైతే నీ జీవిత గమ్యం అనుకుంటున్నావో అది కేవలం ఒక మాయాజాలం. నువ్వు పరిగెడుతున్నావు ఎందుకంటే నీ పక్కవాడు పరిగెడుతున్నాడు కాబట్టి వాడు సంపాదిస్తున్నాడని నువ్వు సంపాదిస్తున్నావు. వాడు ఒక పెద్ద మేడ కడితే నువ్వు అంతకంటే పెద్ద మేడ కట్టాలని రక్తాన్ని నీరు చేసుకుంటున్నావు. కానీ ఆ మేడలోకి వెళ్లిన తర్వాత నీకు దొరికేది ఏంటి? అదే పాత ఎమోషన్ అదే పాత అసంతృప్తి నువ్వు ఒక వస్తువునైనా ఒక పదవినైనా సాధించడానికి ముందు నీ మైండ్ లో ఒక పెద్ద ఊహల సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటావు.
(01:09) ఆ క్షణం వస్తే నీ జీవితం ధన్యమైపోతుందని నీ లోపల ఉన్న బాధలన్నీ మాయమైపోతాయని నమ్ముతావు. తీరా ఆ మైల్స్టోన్ రీచ్ అయ్యాక ఆ మెడలో విజయనగారా పడ్డాక నీకు లభించేది కేవలం ఒక టెంపరరీ కెమికల్ రియాక్షన్ మాత్రమే. నీ బ్రెయిన్ లో కొన్ని క్షణాల పాటు కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి అంతే ఆ తర్వాత ఆ వస్తువు లేదా ఆ హోదా నీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది.
(01:36) నిన్నటి వరకు నిన్ను ఊరించిన ఆ అద్భుతం ఈరోజు నీకు అత్యంత సాధారణమైన విషయంగా మారిపోతుంది. దీన్నే అలవాటు పడటం అనే రోగం అంటారు. ఒక మనిషి ఎంతటి మహాద్భుతాన్నైనా సరే చాలా త్వరగా అలవాటు చేసుకోగలడు. ఆ అలవాటే నీ సంతోషాన్ని చంపేస్తుంది. నువ్వు మళ్ళీ పాత స్థితికే వచ్చేస్తావు. ఇప్పుడు నీ మైండ్ నిన్ను చూసి నవ్వుతూ చూశవా ఇందులో ఏం లేదు ఆ పక్కనున్న దానిలో ఉంది అసలైన సంతోషం దానికోసం పరిగెత్తు అని మళ్ళీ నీకుొక కొత్త ఆశను చూపిస్తుంది.
(02:10) నువ్వు మళ్ళీ పరుగులు పెడతావు. ఈ సైకిల్ అనేది నీ చావు వరకు సాగుతూనే ఉంటుంది. ఒకసారి ఆలోచించు నువ్వు ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నావు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు ఒకప్పుడు నీకు లేనివి ఈరోజు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? మరి ఆనాడు నువ్వు అనుకున్న సంతోషం ఈరోజు నీలో ఉందా అంటే సమాధానం లేదు. ఎందుకంటే నీ లోపల ఒక పెద్ద అగాధం ఉంది.
(02:36) ఆ అగాధాన్ని బాహ్య ప్రపంచంలోని వస్తువులతోనో డబ్బుతోనో పూడ్చాలని చూస్తున్నావు. అది ఎప్పటికీ సాధ్యం కాదు ఒక ఖాళీ పాత్రను సముద్రపు నీటితో నింపొచ్చు కానీ ఒక అంతులేని లోయను కొన్ని రాళ్లతో పూడ్చలేవు నీ ఆశలు ఆ లోయ లాంటివి డబ్బు అనేది కేవలం నీ అవసరాలను తీర్చడానికి నీ బతుకును కాస్త సౌకర్యవంతంగా మార్చుకోవడానికి పనికవచ్చేది మాత్రమే కానీ నువ్వు దానిని సాఫల్యంగా భావించి భ్రమపడుతున్నావు.
(03:05) డబ్బు ఎక్కువైతే భద్రత పెరుగుతుందేమో కానీ ప్రశాంతత పెరగదు. సక్సెస్ వస్తే సమాజంలో నీ గుర్తింపు పెరుగుతుందేమో కానీ నీ అంతరాత్మకు తృప్తి దొరకదు. నువ్వు సమాజం వైపు చూస్తూ బతుకుతున్నావు. సమాజం నిన్ను మెచ్చుకోవాలని నిన్ను చూసి నలుగురు ఈర్ష పడాలని కోరుకుంటున్నావు. అంటే నీ సంతోషపు తాళం చెవిని తీసుకెళ్లి ఎవడో అపరిచితుడు చేతిలో పెట్టావు.
(03:29) వాడు నిన్ను పొగిడితే పొంగుతావు. వాడు నిన్ను విమర్శిస్తే కృంగిపోతావు. ఇంతకంటే బానిస బతుకు ఇంకొకటి ఉంటుందా? నువ్వు సంపాదించే సామ్రాజ్యాలు నువ్వు పొందే కీర్తి ప్రతిష్టలు ఏవి నీ వెంట రావు కదా అవి ఉన్నంతసేపు కూడా నీకు నిజమైన శాంతిని ఇవ్వలేవు. నువ్వు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలంటే నీకు కావాల్సింది పట్టుపరుపు కాదు ప్రశాంతమైన మైండ్.
(03:55) ఆ మైండ్ ఎప్పుడు వస్తుంది అంటే నీకు బయట ఉన్న వస్తువులపై వ్యామోహం తగ్గినప్పుడు మాత్రమే వస్తుంది. నువ్వు ఎంత సంపాదించినా నీ కడుపు నిండడానికి కావాల్సింది కొద్దిగా అన్నం మాత్రమే. నువ్వు ఎంత పెద్ద భవనంలో ఉన్నా నీ శరీరం విశ్రాంతి తీసుకోవడానికి కావాల్సింది కొన్ని అడుగుల స్థలం మాత్రమే. కానీ నువ్వు ఈ విశ్వాన్ని అంతా మింగేయాలని చూస్తున్నావు.
(04:17) ఈ ఆశ నిన్ను సర్వనాశనం చేస్తుంది. [సంగీతం] నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడు అందరూ ఒక అదృశ్యమైన పోటీలో ఉన్నారు. ఒకరిని నలిపేసి ఇంకొకడు పైకి వెళ్ళాలని చూస్తున్నారు. పైకి వెళ్ళినవాడు కూడా సంతోషంగా లేడు వాడు కింద పడిపోతానేమో అనే భయంతో బతుకుతున్నాడు. కింద ఉన్నవాడు పైకి వెళ్ళలేకపోతున్నానే అనే అసూయతో రగిలిపోతున్నాడు. మొత్తానికి ఇద్దరూ బ్రతికి ఉండగానే నరకాన్ని అనుభవిస్తున్నారు.
(04:43) ఈ నరకానికి మూలం నీ ఆలోచనా విధానంలోనే ఉంది. నువ్వు భవిష్యత్తుని గురించిన భ్రమల్లో బతుకుతున్నావు లేదా గతాన్ని గురించిన విచారంలో మునిగిపోతున్నావు. ప్రస్తుత క్షణంలో బతకడం నీకు చేత కావడం లేదు. ఈ క్షణంలో నీ చేతిలో ఏముందో నీ చుట్టూ ఏముందో దాన్ని పూర్తిగా అనుభవించకుండా రేపు రాబోయే దాని కోసం ఈ రోజును త్యాగం చేస్తున్నావు.
(05:06) అలా త్యాగం చేస్తూ చేస్తూ నీ జీవితాన్నే ముగించేస్తున్నావు. చిట్టచివరి క్షణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు మిగిలేది ఏంటి? కేవలం పరుగుల జ్ఞాపకాలు తప్ప జీవించిన అనుభూతి ఒక్కటి ఉండదు. ఒక భ్రమ నుంచి ఇంకొక భ్రమకు మారడాన్నే నువ్వు ఎదుగుదల అనుకుంటున్నావు. కానీ అది ఎదుగుదల కాదు అదొక మానసిక రుగ్మత. ఒక పిచ్చోడు తన గదిలోనే గుండ్రంగా తిరుగుతూ నేను ప్రపంచాన్ని చుట్టేస్తున్నాను అనుకుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో నువ్వు కూడా ఈ సక్సెస్ డబ్బు అనే చక్రంలో తిరుగుతూ నేను జీవితాన్ని గెలిచేస్తున్నాను అనుకోవడం అంతకంటే పెద్ద హాస్యాస్పదం.
(05:43) కళ్ళు తెరిచే సత్తా ఉంటే చూడు నిజమైన ఆనందం అనేది ఎక్కడో లేదు అది నీ లోపలే ఉంది. నీ దగ్గర ఉన్న దానితో నువ్వు సంతోషంగా ఉండలేకపోతే రేపు నీకు ఈ ప్రపంచాన్ని రాసిచ్చినా నువ్వు ఏడుస్తూనే ఉంటావు. ఎందుకంటే [సంగీతం] ఏడవడం అనేది నీ మైండ్ కి అలవాటు అయిపోయింది. అసంతృప్తి అనేది నీ రక్తంలో జీర్ణించుకుపోయింది.

No comments:

Post a Comment