*జ్ఞానము అనగానేమి?*
జ్ఞానానికి చాలా అర్ధాలు ఉంటాయి.
*జ్ఞానం భగవంతుడు యొక్క ప్రతిరూపం.*
*భగవంతుడు యొక్క లక్షణాల్లో జ్ఞానం కూడా ఒకటి.*
కానీ మనుషులలో ఇతర జీవరాసులలో జ్ఞానం భిన్నంగా ఉంది.
అది ఎలాగో తెలుసుకొందాం.
*ఒక జ్ఞానేంద్రియం కలిగిన చెట్లు నుండి ఐదు జ్ఞానేంద్రియాలు కలిగిన జీవరాశులన్నింటి లోపల జ్ఞానం ఉన్నది కాని అది పరిమితంగానే పనిచేస్తుంది.... వాటిలో భగవంతుడు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని వికసింప చేశాడో అంతవరకు మాత్రమే వాటి లోని జ్ఞానం పనిచేస్తుంది.*
*అనగా వాటిలోని జ్ఞానం నేను ఎవరిని??*
*నేను భగవంతుడినా లేక జీవినా అనే వివేకం వాటికి ఉండదు.*
కానీ మానవుడిలోని జ్ఞానం పరిస్థితి వేరు..
మానవుడిలో భగవంతుడి జ్ఞానం రెండు విధాలుగా పనిచేస్తూ ఉంటుంది...
*1) శరీరంలో జరిగే జీవక్రియలు వీటికి భగవంతుడి జ్ఞానం పని చేస్తుంది.*
*2)మనసు రూపంలో వ్యక్తిగత జ్ఞానం పనిచేస్తుంది.*
*మానవ జీవితం లో నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి.*
*బ్రహ్మచర్య (విద్యార్థి), గృహస్థ (గృహస్థుడు), వానప్రస్థ (రిటైర్డ్) మరియు సన్యాస (త్యజించడం).*
*బ్రహ్మచర్యము: ఊహ తెలిసినప్పటి నుండి వివాహం వరకు బాల్యము, యవ్వనము అని అంటారు. ఈ దశలో మనిషి యొక్క జ్ఞానం ఆటపాటలు యందు విద్యను అభ్యసించడం పట్ల యవ్వనపు కోరికలతో జీవితం గడిచిపోతుంది ఇక్కడ మనుషుల్లో భగవంతుని తెలుసుకునేందుకు జ్ఞానం ఏమాత్రం వికసించదు.*
*గృహస్థ (గృహస్థుడు):*
*వివాహమైనప్పుడు నుండి ఏర్పడే జీవితాన్ని గృహస్తులు అంటారు మనిషి ఆలోచన కోరికలు నెరవేర్చుకోవడంలోనూ పిల్లలు బాధ్యతలు వీటితో గడిచిపోతుంది. ఇక్కడ మనుషుల్లో భగవంతుని తెలుసుకునేందుకు జ్ఞానం ఏమాత్రం వికసించదు.*
*వానప్రస్థ (రిటైర్డ్):*
*పిల్లల వివాహం అయిన తర్వాత సుమారు 60 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితాన్ని వానప్రస్థ అంటారు కనీసం ఇక్కడైనా మనిషి సాధన పట్ల మనసును మళ్ళించవలసిన సమయం. ఈ వయసులో కూడా పిల్లలేమవుతారు వాళ్ల జీవితాన్ని నెగ్గుకు రాగలరో లేదో అని భయపడుతూ వాళ్ల కోసమే జీవిస్తూ ఉంటారు.*
*ఇక్కడ మనుషుల్లో భగవంతుని తెలుసుకునేందుకు జ్ఞానం ఏమాత్రం వికసించదు.*
*సన్యాసం (త్యజించడం):*
*సుమారు 70 సంవత్సరాలు దాటిన వారందరూ గమనించవలసిన అంశాలు..*
*కుటుంబంలో ఉంటూనే సన్యసించవచ్చు వానప్రస్థల్లో చేసే సాధన పరిణితికి వచ్చి భగవంతుడితో మమేకమయి జీవించాలి శరీరము, కుటుంబము, ఆస్తులు, వ్యవహారములు వీటితో ఉన్న అనుబంధం తొలగి భగవంతుడు పట్ల భగవస్థితి పట్ల అనుభూతి పెరగాలి, ప్రతిక్షణం ప్రతి మాట వెనుక భగవంతుడు యొక్క ఉనికిని గమనించాలి.* *భగవంతుడిగా మారాలి....ఆ విధంగా గమనించని జీవితం నిరర్థకం.*
*వయసు పెరుగుతున్నప్పటికీ,*
*మృత్యు ఘడియలు దగ్గరకు వస్తున్నప్పటికి ఇంకా ..*
*నా వాళ్ళకు అది అమర్చలేదు,*
*నా వాళ్లకు ఇది అమర్చి లేదు అని ఆలోచిస్తు కాలాన్ని వృధా చేసుకుంటే నష్టపోయేది ఎవరు??*
*మన లక్ష్యాన్ని మన సాధనని మరచి అనుక్షణం వారి కోసమే జీవిస్తూ ఉంటే*
*ఇక భగవంతుని తెలుసుకునేందుకు జ్ఞానం ఏమాత్రం వికసించదు...*
*ఆ జీవితం వృధా..*
*ఆ జన్మ వృధా...*
*కావున పెద్దలు*
*జ్ఞానం అభివృద్ధి చేసుకోవడానికి దయచేసి సాధన చేయండి.*
🕉 ** 🕉
శుభమస్తు
No comments:
Post a Comment